MohanPublications Print Books Online store clik Here Devullu.com

విభీషణుడు_Vibhishana

విభీషణుడు

అద్భుతమైన సృష్టిలో మనిషి జీవితం చాలా విచిత్రమైంది. మనిషి జీవితాన్ని సార్థకం చేసేవి అతను చేసే మంచిపనులే. మంచి ఆలోచనలే మంచి పనులకు ప్రేరణనిస్తాయి. మన జీవితాన్ని మంచి మార్గంలో
నడిపిస్తాయి. మనిషి పుట్టిన వంశం, కులం, జీవన విధానాలు ఎటువంటివైనా ఆశయాలూ, లక్ష్యాలూ, విలువలూ ఉన్నతంగా ఉంటే మనిషి మహనీయుడవుతాడనీ, తాను మానసికంగా ఎంతటి వ్యథను 
అనుభవించినా, తనవారినే నిరోధించాల్సి వచ్చినా ధర్మమార్గమే తన మార్గమని తలంచి చివరిదాకా దానికి కట్టుబడి జీవించిన మనిషే మనిషనీ నిరూపించిన మహానుభావుడు విభీషణుడు. రాక్షసకులంలో 
జన్మించినా రత్నంగా, ధార్మిక జగతిలో శిరోమణిగా, రామాయణ గాథలో కీలకమైన వ్యక్తిగా సమాజానికి పరిచయమైన విభీషణుని మనో విజ్ఞానం అత్యద్భుతం, భావితరాలకు ఆదర్శం.

కైకసీ విశ్రవుల మూడో కొడుకు, రావణుని సోదరుడూ, మంత్రి, శ్రీరామచంద్రునికి అత్యంత ఆప్తుడు విభీషణుడు. శైలూషుడనే గంధర్వరాజు కూతురు సరమ ఈతని భార్య. రాక్షస లంకలో రామనామ జపాన్ని రహస్యంగా ధ్వనిస్తూనే ఆ నామ తరంగాలను రాక్షసత్వాన్ని పావనం చేసేందుకు తపించిన రాక్షసోత్తముడు విభీషణుడు. ఒక వ్యక్తి జీవితాన్నీ, అతనిలోని భావోద్వేగాలనూ సంపూర్ణంగా ఓ అంచనాకు తేవడం అసాధ్యం. మన జీవితాన్నే సరిగ్గా వ్యక్తపరచలేని మనం ఎదుటివారిని అర్థం చేసుకోవడంలో వెనుకడుగు వేయక తప్పదు. విభీషణుని జీవితాన్ని కూడా అర్థం చేసుకోవడం కష్టమే. ఎందుకంటే రాక్షసత్వంలోంచి పరిమళించిన ధార్మికత, నైతికత లోకకళ్యాణం కోసం మరింత నిగ్గుదేలాయనడానికి విభీషణుని వ్యక్తిత్వమే ప్రతీక.

పుట్టుక రాక్షసజాతి నిర్దేశించింది. కానీ విభీషణుని వ్యక్తిత్వం మానవీయ కోణంలో ఎదిగింది. తనజాతి లక్షణాలు స్వతాహాగా మనిషి కోణంలో ఎదిగాయి. తన జాతి లక్షణాలు స్వతహాగా మనిషిలో ప్రభావితమవుతున్నా వాటి జోలికి పోకుండా ఎటువంటి ప్రలోభాలు ప్రేరేపించినా తలొగ్గక, ఎంతటి భోగాలు ఆకర్షించినా ఏమాత్రం సడలక తనదైన వ్యక్తిత్వంతో ధర్మసాధన చేసి విభీషణుడు మహోన్నతుడయ్యాడు. తన కుటుంబం, తన లంకానగరం, తన అన్న రావణుడూ ధర్మం నీడలో బతకాలని కాంక్షించి దానిని కొనసాగించడం కోసం అహర్నిశలూ తపించాడు.

మహావీరుడూ, ధర్మశాస్త్ర, నీతిశాస్త్ర సారమెరిగినవాడూ, సకల కళలలో ప్రావీణ్యం గలవాడూ, లంకను సర్వస్వతంత్ర సామ్రాజ్యంగా నిలబెట్టిన చక్రవర్తి. బంగారు లంకను స్థాపించిన రావణుడంటే విభీషణునికి అభిమానం, ప్రేమ, గౌరవం. రావణుడు తన అన్న అయినందుకు ఒకింత గర్వం. కానీ ఒక స్త్రీ వ్యామోహంతో లంకాపతనానికి పూనుకున్నందుకు రావణున్ని వారించిన తీరు ధర్మజగతిలో ఓ మైలురాయి. 
దండకారణ్యం నుంచి సీతాపహరణం చేసుకొని వచ్చాడన్న వార్త వినగానే ఆగామి రోజుల్లో జరుగబోయే పీడను శంకించిన విభీషణుడు రావణుడు చనిపోయేంత వరకూ తను చేసేది, చేస్తుంది అధర్మమని చెబుతూనే ఉన్నాడు. బతిమాలాడూ, వాదించాడూ, చర్చించాడూ, హెచ్చరించాడు. అయినా రావణుడు పంతం వీడలేదు. 
హనుమంతుడు దూతగా వచ్చినప్పుడు రావణుడు ఒక కోతి వచ్చి నాకు ధర్మబోధ చేస్తుందా! అని పరిహసిస్తూ హనుమను చంపమని ఆదేశిస్తే, విభీషణుడు దూతను చంపడం అత్యంత దుర్మార్గమనీ, కావాలంటే అతను మనకు చేసిన నష్టానికి గానూ ఏదైనా శిక్షను విధించి వదిలేయమని సమాధానపరుస్తాడు. రావణునితో ప్రశాంతంగా ఆలోచించు! నీ శత్రువుకు నీవేంటో తెలియాలంటే దూతను వదిలేయడమే ధర్మమని చెబుతాడు.
రామరావణ యుద్ధాన్ని వారించేందుకు విభీషణుడు పడ్డపాట్లు అన్నీ, ఇన్నీ కావు. రావణునితో విభీషణుడు చెప్పిన మాటలు నాడు త్రేతాయుగాన్నే కాదు, నేటి కలియుగాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అహంకారం నాడే కాదు, నేడు కూడా కుటుంబాలు నాశనమయ్యేందుకు, జీవితాలు పతనమయ్యేందుకు కాచుకొని కూర్చుంటుందనే గుణపాఠం ఆ మాటల అంతరార్థం.

విభీషణుడు రావణునితో.. స్త్రీ వల్లే ధనం, కీర్తి వస్తాయి. స్త్రీ వల్లే సర్వం తుడిచిపెట్టుకుపోతాయి. దేవతలకు కూడా లభించని అమరసుఖాలు మన లంకలో ఉన్నాయి. వాటిని అనుభవించే అదృష్టాన్నీ చేజేతులా పాడుచేసుకోవద్దు. నిన్నే నమ్ముకొని ఉన్న లంకానగరవాసుల్ని ఒక స్త్రీ కారణంగా మృత్యుఒడిలోకి నెట్టొద్దు. నేను నీకు ఆప్తుడనూ, మంత్రినీ. అహాన్ని వదిలి సీతమ్మను సగౌరవంగా శ్రీరామునికి అప్పగిద్దాం. అన్నింటినీ సమూలంగా నాశనం చేసే కోపాన్ని విడిచిపెట్టు. అన్నింటికీ ఆలవాలమైన ధర్మాన్ని పాటించు. కోపాన్నీ అహాన్ని, మైథిలినీ వదిలి రావణుడు కీర్తిని పోందాలనీ, అధర్మాన్ని వీడి ధర్మమార్గంలో నడవాలనీ భావించే ఈ విభీషణుడు నీ మంచే కోరుకుంటాడని ప్రాధేయపడతాడు.
రావణుని మిగతా సోదరులూ, మంత్రులూ, కొడుకులూ రావణుని వైభవాన్ని చాటుతున్నామనుకొని రావణున్ని రెచ్చగొడుతుంటే చూసి సహించలేని విభీషణుడు వారితో రాచధర్మాన్ని నిలబెట్టాలనుకుంటే రాజుకు మంచే చెప్పాలి. అది కఠినంగా ఉన్నా సరే. అధర్మంతో రాక్షస వినాశనానికి పూనుకుంటుంటే సమర్థించడం ఎంత మాత్రం మంచిది కాదని హెచ్చరించాడు. ఇలా ఎన్నో విధాలుగా చెప్పీ, చెప్పీ అలిసిపోయిన విభీషణుడు ధర్మమే నిలబడుతుందనీ, న్యాయమే గెలుస్తుందనీ నమ్మి రాముని శరణుకోరాడు. రావణుని జయించడానికి అనేక ఉపాయాలూ, రహస్యాలూ రామునికి తెలిపి సహకరించాడు. రావణుడు నేలకొరగడం చూసి తట్టుకోలేక విలపించాడు. అనుకున్నదంతా అయ్యిందనీ, ఒక స్త్రీ వ్యామోహంతో రావణుడంతటి వాడూ, అనంతమైన లంక పతనం అయ్యిందనీ బాధపడి రావణునికి అంతిమ సంస్కారం చేసి సద్గతులకై ప్రార్థించాడు విభీషనుడు.

వంటింట ఆరోగ్యాల పంట_fruits_Helthవంటింట ఆరోగ్యాల పంట
   ఆహారమే ఆరోగ్యం... ఆరోగ్యమే జీవన సౌభాగ్యం...ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడి అందరికీ తెలిసిందే. ఆ మహాభాగ్యాన్ని దక్కించుకోవడానికి కావలసినవి అషై్టశ్వర్యాలు కాదు...
పోషక విలువలు గల చక్కని సమతుల ఆహారం, మంచి జీవనశైలి...ఇవి ఉంటే చాలు... నిక్షేపంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.ఇంటింటా... వంటింట ఆరోగ్యాల పంట పండించుకోవచ్చు.నిత్యం మనం వాడుకునే ఆహార పదార్థాలు, వాటి పోషక విలువలను మీ ముందు ఉంచుతున్నాం.వీటిలో తృణధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు మొదలుకొని వంటింటి మూలికల వరకు ఉన్నాయి.స్థలాభావం వల్ల అన్నింటికీ చోటు కల్పించలేకపోతున్నా, రోజువారీ వాడుకలో ఉన్న వీలైనన్ని పదార్థాల గురించిన సమాచారాన్ని ఈ ప్రత్యేక సంచికలో అందిస్తున్నాం.


బియ్యం
ప్రపంచవ్యాప్తంగా విరివిగా వాడే ధాన్యాలలో వరి ప్రధానమైనది. వరి నుంచి వచ్చే బియ్యంతో వండే అన్నం మన భారతీయులు ఎక్కువగా వినియోగిస్తారు. బియ్యంతో తయారు చేసే రకరకాల పదార్థాలను, వంటకాలను చైనా, జపాన్‌ వంటి తూర్పు దేశాల ప్రజలు విరివిగా వినియోగిస్తారు. ఏ రూపంలో వినియోగించినా, పిండి పదార్థాలు పుష్కలంగా ఉండే బియ్యం తక్షణ శక్తి ఇస్తుంది.


పాలిష్‌ చేయని దంపుడు బియ్యం వాడటమే మేలని ఆధునిక వైద్యులు కూడా చెబుతున్నారు. బియ్యంలోని రకాలు, వండే పద్ధతులను బట్టి పోషకాల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నా, తక్షణ శక్తిని ఇచ్చే ఆహారంలో బియ్యం తిరుగులేనిది.పోషకాలు: బియ్యంలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్‌ బి1, బి2, బి3, బి5, బి6, విటమిన్‌ ఇ వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: బియ్యం తక్షణమే శక్తినిస్తుంది. బియ్యంలో కొలెస్ట్రాల్‌ లేనందున దీనివల్ల ఒంట్లో అనవసరమైన కొవ్వులు పేరుకోవు. సోడియం తక్కువగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రిస్తుంది. జీర్ణకోశ సమస్యలను దరికి రానివ్వదు. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


గోధుమలు
గోధుమలను కూడా ప్రపంచవ్యాప్తంగా విరివిగా వాడతారు. పాశ్చాత్య ప్రపంచంలో గోధుమలే ప్రధాన ఆహారం. మన దేశంలోనూ ఉత్తరాదిలో బియ్యం కంటే గోధుమలనే ఎక్కువగా వాడతారు. పిండి పదార్థాలు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉండే గోధుమలు తక్షణ శక్తినిస్తాయి. గోధుమలతో తయారు చేసే రొట్టెలు, బ్రెడ్‌ వంటివి విరివిగా ఉపయోగిస్తారు. గోధుమల్లో ఉండే గ్లూటెన్‌ అనే ప్రొటీన్‌ వల్ల ఈ పదార్థం సరిపడని కొందరిలో జీర్ణకోశ సమస్యలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. శాస్త్రవేత్తలు ఈ సమస్యను గుర్తించిన తర్వాత గ్లూటెన్‌ లేని గోధుమ రకాలను అభివృద్ధి చేశారు. ఇవి ఇప్పుడు బాగానే అందుబాటులోకి వచ్చాయి.


పోషకాలు: గోధుమల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్‌ బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌ ఇ, విటమిన్‌ కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: గోధుమలు జీవక్రియలను మెరుగుపరుస్తాయి. మెగ్నీషియం పుష్కలంగా ఉండటం వల్ల టైప్‌–2 డయాబెటిస్‌ను అదుపు చేస్తాయి. రుమాటిక్‌ నొప్పులను, గాల్‌బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడటాన్ని, గుండె జబ్బులను, చిన్నపిల్లల్లో వచ్చే ఉబ్బసాన్ని నివారిస్తాయి.


జొన్నలు
ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియా ఖండాలలోని పలు దేశాల్లో జొన్నలు విరివిగా పండుతాయి. గ్లూటెన్‌ రహిత చిరు ధాన్యాల్లో జొన్నలు కూడా విరివిగా వాడుకలో ఉన్నాయి. జొన్న రొట్టెలు, జొన్న అంబలి వంటివి మన దేశంలో విరివిగా వాడుకలో ఉన్నాయి. విదేశాల్లో బ్రెడ్, బిస్కట్లు వంటి వాటి తయారీలో జొన్నలను ఎక్కువగా వాడతారు. గ్లూటెన్‌ సరిపడని వారికి జొన్నలు కూడా మంచి ప్రత్యామ్నాయం.


పోషకాలు: జొన్నల్లో పిండి పదార్థాలు, చక్కెరలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్‌ బి1, బి2, బి3, బి5 వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఆరోగ్య లాభాలు: పీచు పదార్థాలు పుష్కలంగా ఉండటంతో జొన్నలు జీర్ణకోశానికి మేలు చేస్తాయి. శరీరంలో చెడుకొవ్వును నియంత్రిస్తాయి. రోగనిరోధక శక్తిని, ఎముకల దారుఢ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీవకణాలకు పునరుత్తేజం కలిగిస్తాయి. జుట్టురాలడాన్ని నియంత్రిస్తాయి.


రాగులు
ఆఫ్రికా దేశాల్లోనూ, భారత్‌ సహా పలు ఆసియా దేశాల్లోనూ విరివిగా వాడే చిరుధాన్యం రాగులు. చౌకగా దొరికే చిరుధాన్యాల్లో ఎక్కువగా వినియోగంలో ఉన్నవి రాగులే. రాగి ముద్ద, రాగిజావ, రాగి రొట్టెలు మన దేశంలోని చాలా ప్రాంతాల్లో నేటికీ వినియోగంలో ఉన్నాయి. నెమ్మదిగా జీర్ణమయ్యే రాగులు త్వరగా నీరసించిపోకుండా చూస్తాయి.


పోషకాలు: రాగుల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, నామమాత్రంగా కొవ్వులతో పాటు విటమిన్‌ బి1, బి2, బి,3 బి5, బి6, బి9 వంటి విటమిన్లు, క్యాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్‌ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: రాగులు స్థూలకాయాన్ని దూరం చేస్తాయి. గోధుమల్లోని గ్లూటెన్‌ సరిపడని వారికి రాగులు సరైన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. ఎముకలకు దారుఢ్యం ఇవ్వడంతో పాటు రక్తహీనతను దూరం చేస్తాయి.


సజ్జలు
భారత ఉపఖండం, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రెజిల్‌ వంటి ప్రాంతాల్లో విరివిగా వాడుకలో ఉండే చిరుధాన్యం సజ్జలు. సజ్జల ఉత్పాదనలో భారత్‌దే అగ్రస్థానం. సజ్జ రొట్టెలు, సజ్జ అంబలి వంటివి మన దేశంలో విరివిగా వాడుకలో ఉండగా, విదేశాల్లో బ్రెడ్, కేకులు, బిస్కట్లు వంటి పదార్థాల తయారీలో సజ్జలను వాడతారు. గ్లూటెన్‌ కారణంగా గోధుమలు సరిపడని వారికి సజ్జలు చక్కటి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి. ప్రొటీన్లు పుష్కలంగా ఉండటంతో కండరాలకు మంచి శక్తినిస్తాయి.


పోషకాలు: సజ్జల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు స్వల్పంగా కొవ్వులు, విటమిన్‌ బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌ ఇ, విటమిన్‌ కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: సజ్జలు రోగనిరోధక శక్తిని, కండర బలాన్ని మెరుగుపరుస్తాయి. రక్తహీనతను అరికడతాయి. ఎముకలను దృఢంగా ఉంచుతాయి. జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. టైప్‌–2 డయాబెటిస్‌ ముప్పును గణనీయంగా నివారిస్తాయి. అంతేకాకుండా, ఆహారంలో సజ్జలను తరచుగా తీసుకుంటున్నట్లయితే గాల్‌స్టోన్స్‌ ఏర్పడకుండా ఉంటాయని తాజా పరిశోధనల్లో తేలింది.


బార్లీ
పశ్చిమాసియా, ఈశాన్య ఆఫ్రికా, సింధులోయ ప్రాంతంలో పురాతన కాలం నుంచి వాడుకలో ఉన్న తృణధాన్యం బార్లీ. బార్లీ గింజలను పిండిగా చేసుకుని రొట్టెలు, బ్రెడ్, కేకులు, బిస్కట్లు, బార్లీ గంజితో పానీయాలను తయారు చేసుకుని ఇప్పటికీ వాడుతుంటారు. హెల్త్‌డ్రింక్‌ పౌడర్లలో పోషకాలు పుష్కలంగా గల బార్లీని విరివిగా ఉపయోగిస్తారు. అయితే, మన దేశంలో మిగిలిన తృణధాన్యాలతో పోలిస్తే బార్లీ వినియోగం కాస్త తక్కువే.


పోషకాలు: బార్లీలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్‌–ఎ, విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌–సి, విటమిన్‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.ఆరోగ్య లాభాలు: బార్లీ రక్తపోటును, రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్‌ను పెరగనివ్వదు. ఫలితంగా గుండెజబ్బుల ముప్పును గణనీయంగా తగ్గిస్తుంది. జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.


కొర్రలు
భారత్, చైనా సహా పలు ఆసియా దేశాల్లో విరివిగా పండించే చిరు ధాన్యాలు కొర్రలు. వీటిని ఉత్తర అమెరికా, యూరోప్‌లనూ పండిస్తారు. దక్షిణ భారత దేశంలో ఉపయోగించే చిరుధాన్యాల్లో కొర్రలు నేటికీ ప్రధానంగానే ఉంటూ వస్తున్నాయి. కొర్రన్నం, కొర్ర అంబలి వంటి వంటకాలు మన దేశ ప్రజలకు అలవాటైనవే. చైనా సహా పలు దేశాల్లో వీటిని పాస్తా, నూడుల్స్‌ వంటి వాటి తయారీలోనూ వాడతారు.


పోషకాలు: కొర్రల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. స్వల్పంగా కొవ్వులు ఉంటాయి. విటమిన్‌ బి1, బి2, బి5, బి6, విటమిన్‌ ఇ వంటి విటమిన్లు, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, జింక్, కాపర్‌; మాంగనీస్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: తక్షణ శక్తినిస్తాయి. రక్తంలో చక్కెర పరిమాణాన్ని, స్థూలకాయాన్ని నియంత్రిస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరంలోని జీవక్రియలను, జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తాయి.


సామలు
భారత ఉపఖండ ప్రాంతంలో సామలు చిరకాలంగా సాగవుతున్నాయి. సామల దిగుబడిలో భారత్‌దే అగ్రస్థానం. తూర్పు, దక్షిణ భారత ప్రాంతాల్లో ప్రజలు ఇప్పటికీ సామలను విరివిగానే వినియోగిస్తున్నారు. సామలను నేరుగా ఉడికించుకుని అన్నంలా వండుకోవడంతో పాటు సామల జావ, సామల పిండితో రొట్టెలు వంటి వంటకాలను కూడా తయారు చేసుకుంటారు. ఇతర చిరుధాన్యాల్లాగానే ఇవి కూడా తక్షణ శక్తినిస్తాయి. తేలికగా అరుగుతాయి.పోషకాలు: సామల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, స్వల్పంగా కొవ్వులు, విటమిన్‌ బి1, బి2, బి3, బి5, బి6 వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: జీర్ణకోశ సమస్యలను నివారిస్తాయి. స్థూలకాయం, టైప్‌–2 డయాబెటిస్‌ రాకుండా చూస్తాయి. రక్తహీనతను దరిచేరనివ్వవు. గుండెజబ్బులు, ఉబ్బసం వంటి వ్యాధుల ముప్పును గణనీయంగా తగ్గిస్తాయి.


అరికెలు
భారతదేశంలో విరివిగా వినియోగించే చిరుధాన్యాల్లో అరికెలు కూడా ముఖ్యమైనవి. పశ్చిమ ఆఫ్రికా దేశాలోనూ, వియత్నాం, ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌ వంటి ఆసియన్‌ దేశాల్లోనూ అరికెలను పండిస్తారు. అరికెలను అన్నంలా వండుకుని తినడంతో పాటు వీటితో రొట్టెలు, జావ వంటివి కూడా తయారు చేసుకుంటారు. మిగిలిన చిరుధాన్యాల మాదిరిగానే అరికెలు కూడా తక్షణ శక్తినిస్తాయి. నెమ్మదిగా జీర్ణం కావడంతో త్వరగా ఆకలి కానివ్వవు.పోషకాలు: అరికెల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్‌ బి1, బి2, బి3, బి5, బి6 వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: తక్షణ శక్తినిస్తాయి. జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్తహీనతను నివారిస్తాయి. మధుమేహం, గుండెజబ్బుల ముప్పును తగ్గిస్తాయి.


బఠాణీలు
వీటిని మొదట్లో ఎండు గింజలుగానే తినేవారు. తర్వాత రోజుల్లో వీటిని పచ్చిగా లేదా ఉడికించి తినడం ప్రజలకు అలవాటైంది. పచ్చి బఠాణీలను చాలామంది బిర్యానీ, కిచిడీలలో వాడతారు. అలాగే వివిధ వంటకాల్లోనూ వీటిని ఉపయోగిస్తారు. ఈ మధ్య బఠాణీ గింజలకు రంగు వేసి విక్రయిస్తున్నారు. కాబట్టి వాటిని శుభ్రం చేసుకొని తినడం మంచిది.


పోషకాలు: బఠాణీలలో ప్రొటీన్లు, పిండి పదార్థాలు, విటమిన్‌–ఎ, విటమిన్‌–బి1, బి2, బి3, బి6, బి9, విటమి¯Œ–సి, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: బఠాణీలు కండరాలకు బలాన్నిస్తాయి. రక్తహీనతను అరికడతాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. గుండెజబ్బులను నివారిస్తాయి. జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.


మినుములు
భారత ఉపఖండంలో మినుములను విరివిగా పండిస్తారు. మినుములను పొట్టుతోనూ, పొట్టు తీసేసిన మినప గుళ్లను, మినప్పప్పును రకరకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. మినప పప్పును పొడిగా తయారు చేసుకుని సున్నుండల వంటి మిఠాయిల తయారీలోనూ ఉపయోగిస్తారు. మినప పప్పును ఎక్కువగా ఇడ్లీ, వడ, దోశ వంటి అల్పాహారాల తయారీకి ఉపయోగిస్తారు.
పోషకాలు: మినుముల్లో ప్రొటీన్లు, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్‌–బి1, బి2, బి3, బి6, విటమిన్‌–సి, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, ఐరన్, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.ఆరోగ్య లాభాలు: మినుములు కండరాలకు బలం ఇస్తాయి. ఎదిగే పిల్లలకు ఇవి చాలా మేలు చేస్తాయి. రక్తహీనత నివారణకు, గుండె ఆరోగ్యం మెరుగుదలకు ఉపయోగపడతాయి. జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మినుములతో తయారైన పదార్థాలకు వాజీకరణ లక్షణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది.


కందులు
కందులను భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ విరివిగా వినియోగిస్తారు. ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, ఆసియన్‌ దేశాల్లో కూడా కందిపప్పును ఉపయోగిస్తారు. పొట్టుతో ఉండే కందిగింజలను, పొట్టు తీసేసిన కందిపప్పును రకరకాల వంటకాల్లో వాడతారు. కందిపప్పులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. మాంసాహారం తినని వారిలో కండరాల ఎదుగుదల లోపాలు లేకుండా ఉండాలంటే కందిపప్పు వంటి పప్పుజాతి గింజలు తినాల్సిందే.


పోషకాలు: కందిపప్పులో ప్రొటీన్లు, అమినో యాసిడ్లు, పిండి పదార్థాలు, స్వల్పంగా కొవ్వులతో పాటు విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, విటమిన్‌–సి, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె, వంటి విటమిన్లు ఉంటాయి. క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, కాపర్, ఐరన్, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: ప్రొటీన్లు పుష్కలంగా ఉండే కందిపప్పు కండరాల పెరుగుదలకు దోహదపడుతుంది. ఇందులోని ఐరన్, విటమిన్‌–సి రక్తహీనతను దూరం చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరానికి తగిన శక్తినిస్తుంది. జీర్ణాశయ సమస్యలను నివారిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.


పెసలు
పెసలను ఎక్కువగా భారత్, చైనా, కొరియా సహా వివిధ ఆగ్నేయ ఆసియా దేశాలలో పండిస్తారు. పెసరపప్పుతో వివిధ రకాల వంటకాలను తయారు చేస్తారు. పొట్టు తీయని పెసలు నానబెట్టి, వాటికి మొలకలొచ్చాక తినే పద్ధతి కూడా చాలాకాలంగా వాడుకలో ఉంది. మొలకెత్తిన పెసలను సలాడ్లలో ఉపయోగించడంతో పాటు పెసరట్టు, గారెలు, పప్పు లాంటి వంటకాలను చేసుకుంటారు.


పోషకాలు: పెసలలో ప్రొటీన్లు, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె, విటమిన్‌–సి, క్యాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.ఆరోగ్య లాభాలు: పెసలలో ప్రొటీన్లు బాగా ఉండటం వల్ల ఇవి కండరాల ఎదుగుదలకు దోహదపడతాయి.. వీటిలోని పీచు పదార్థాలు జీర్ణశక్తిని మెరుగుపరచి, ఒంట్లోని కొవ్వు శాతాన్ని తగ్గిస్తాయి. రక్తహీనతను తగ్గించడంతో పాటు, రక్తపోటును అదుపులో ఉంచుతాయి.


శనగలు
పప్పు దినుసుల్లో శనగలు చిరకాలంగా వాడుకలో ఉన్నాయి. పొట్టుతీయని శనగలను నానబెట్టి, మొలకలు వచ్చాక వాటిని గుగ్గిళ్లుగా తయారు చేసుకుని లేదా పచ్చివాటినీ గానీ తినడం మనదేశంలో చాలాకాలంగా అలవాటుగా ఉంది. శనగపప్పును వివిధ వంటకాల్లో విరివిగా వాడతారు. శనగపిండిని పిండివంటలు, చిరుతిళ్ల తయారీలో ఉపయోగిస్తారు.


పోషకాలు: శనగల్లో ప్రొటీన్లు, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె, విటమిన్‌–సి, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య పోషకాలు: ఇందులో ఉండే పీచు పదార్థాలు జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. శనగలు కండరాల పెరుగుదలకు, రోగనిరోధక శక్తికి దోహదపడతాయి. ఇవి రక్తహీనతను దూరం చేస్తాయి. స్థూలకాయాన్ని, గుండెజబ్బులను అరికడతాయి.


మసూర్‌ పప్పు
భారత్‌ సహా దక్షిణాసియా దేశాలతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, టర్కీ తదితర పశ్చిమాసియా దేశాల్లో మసూర్‌ పప్పు చిరకాలంగా వాడుకలో ఉంది. మిగిలిన పప్పు దినుసులతో పోలిస్తే ఇది త్వరగా ఉడుకుతుంది. తేలికగా జీర్ణమవుతుంది. రకరకాల సంప్రదాయ వంటకాల్లో మసూర్‌ పప్పును ఉపయోగిస్తారు.


పోషకాలు: మసూర్‌ పప్పులో ప్రోటీన్లు, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్‌– బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌–సి వంటి విటమిన్లు, పొటాషియం, ఐరన్, క్యాల్షియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. అలాగే ఫొలేట్‌ శాతం కూడా ఇందులో బాగా ఉంటుంది.ఆరోగ్య లాభాలు: మసూర్‌ పప్పు రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. అలాగే అనవసరమైన కొవ్వును తగ్గిస్తుంది. ఈ పప్పును క్రమంగా తీసుకుంటే... రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు తగ్గుముఖం పడతాయని ఇటీవల పరిశోధనల్లో తేలింది.


బొబ్బర్లు
బొబ్బర్లను ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఉపయోగిస్తారు. కానీ ఎక్కువగా ఉత్పత్తి చేసే ఖండం మాత్రం ఆఫ్రికా. ఆ తర్వాత బ్రెజిల్‌ అని చెప్పుకోవచ్చు. మన దేశంలో ఉత్పత్తి ఎక్కువగా లేకపోయినా... వినియోగం మాత్రం బాగానే ఉంది. బొబ్బర్లను ఉడికించి గుగ్గిళ్లుగా తినడం చాలామందికి అలవాటు. ఇవి వివిధ రంగుల్లో దొరుకుతాయి.


పోషకాలు: వీటిలో ప్రొటీన్లు, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్‌ ఎ, బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్‌–కె, విటమిన్‌–సి, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, సోడియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు


ఆరోగ్య లాభాలు: బొబ్బర్లలో ఫోలిక్‌ యాసిడ్‌ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల గర్భిణులు వీటిని తరచుగా తీసుకుంటే పుట్టబోయే పిల్లలకు నాడీ లోపాలు రావు. చర్మ సమస్యలు దూరమవుతాయి. జుత్తు ఒత్తుగా పెరగడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి.


ఉలవలు
భారత ఉపఖండంతో పాటు దక్షిణాసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఉలవలను వినియోగిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఉలవచారు బాగా ప్రసిద్ధి పొందితే, ఉత్తరాది రాష్ట్రాల్లో ఉలవలతో కిచిడీ కూడా తయారు చేసుకుంటారు. కామెర్ల వంటి మొండి జబ్బులతో బాధపడే రోగులకు సిద్ధ, ఆయుర్వేద వైద్యరీతుల్లో ఉలవలతో సంప్రదాయ వంటకాలను కూడా తయారు చేసి పెడతారు.


పోషకాలు: ఉలవల్లో ప్రొటీన్లు, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, క్యాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్‌ వంటి ఖనిజ లవణాలు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: ఉలవల్లో పీచు పదార్థాలు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల వీటిని పుష్టికరమైన ఆహారంగా పరిగణిస్తారు. ఇవి స్థూలకాయాన్ని అరికడతాయి. నెలసరి సమస్యలు ఉన్న మహిళలకు, కామెర్ల రోగులకు, కిడ్నీలో రాళ్లు ఉన్నవారికి ఉలవలు మేలు చేస్తాయని ఆయుర్వేద, సిద్ధ వైద్యులు చెబుతారు.


రాజ్మా
రాజ్మాను ఎక్కువగా ఉత్తర భారతదేశం, నేపాల్‌లో ఉపయోగిస్తారు. ఇటీవల కాలంలో దక్షిణ భారత్‌లోనూ వాడుతున్నారు. రాజ్మాను కూరల్లోనూ, సూప్స్‌ తయారీలోనూ, ఇతర వంటకాల్లోనూ వాడతారు..


పోషకాలు: రాజ్మాలో ప్రొటీన్లు, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్‌–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె, విటమిన్‌–సి, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, జింక్, సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.ఆరోగ్య లాభాలు: రాజ్మా కండరాల పెరుగుదలకు దోహదపడుతుంది. రక్తహీనతను అరికడుతుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. మలబద్ధకాన్ని నివారించి, జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మైగ్రేన్‌ తలనొప్పిని తగ్గిస్తుంది.


సోయాబీన్స్‌
సోయాబీన్స్‌ను అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, చైనా, భారత్‌ తదితర దేశాలు బాగానే ఉత్పత్తి చేస్తున్నాయి. చైనాలో సోయా సాస్‌ను బాగా ఉపయోగిస్తారు. మన దేశంలో కూడా ఇటీవల కాలంలో సోయాసాస్‌ వాడుక పెరిగింది. కూరల్లో వాడుకునే మీల్‌ మేకర్, తోఫు వంటివి కూడా సోయాబీన్స్‌తో తయారు చేసినవే.


పోషకాలు: ఇందులో ప్రొటీన్లు, పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్‌–ఎ, విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌–సి, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె, క్యాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. సోయాబీన్‌ ఆయిల్‌లో ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: సోయాబీన్స్‌ను తరచుగా తినడం వల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్‌ ముప్పు, పురుషుల్లో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పు తగ్గుతుంది. నిద్రలేమిని, రక్తహీనతను అరికడతాయి. జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.


కరివేపాకు
రుచులను అందించే పోషకాల్లో ముందు వరసలో నిలబడేది కరివేపాకే. ప్రతి కూరలోనూ తాలింపుగా మారే కరివేపాకు గొప్పతనం తెలిసిన వారంతా.. దాన్ని పొడులుగా చేసుకుని, చట్నీలుగా చేసుకుని లాగించేస్తుంటారు. మన దేశంలో కరివేపాకును పోపులో విరివిగా వాడుతుంటారు. పోషకాలు సమృద్ధిగా గల ఆకుకూరల్లో కరివేపాకు మొదటి వరుసలో నిలుస్తుంది.


పోషకాలు: కరివేపాకులో విటమిన్‌–ఎ, విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌–సి, విటమిన్‌–ఇ వంటి విటమిన్లు, పీచుపదార్థాలు, స్వల్పంగా పిండి పదార్థాలు, క్యాల్షియం, ఐరన్, ఫాస్పరస్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: కరివేపాకు రక్తహీనతను అరికడుతుంది. కంటిచూపును, కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. లివర్‌ను కాపాడుతుంది. జుట్టు రాలడాన్ని అరికడుతుంది. స్థూలకాయాన్ని, గుండెజబ్బులను నివారిస్తుంది.


తోటకూర
విరివిగా వాడే ఆకుకూరల్లో తోటకూర ముఖ్యమైనది. తోటకూర పప్పు నుంచి మొదలు పెట్టి.. తోటకూర పులుసు వరకు అన్ని రుచులూ మన తెలుగు వారికి బాగా తెలిసినవే. పోషక విలువల్లో సాటిలేని తోటకూరను మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుచుకుంటారు. తోటకూరను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.


పోషకాలు: తోటకూరలో పుష్కలంగా పీచు పదార్థాలు, విటమిన్‌ –ఎ, బి1, బి2, బి6, విటమిన్‌–సి, విటమిన్‌– కెతో పాటు.. క్యాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: తోటకూర గుండెకు మేలు చేస్తుంది. రక్తహీనతను అరికట్టి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.


గోంగూర 
తెలుగువారి అభిమాన ఆకుకూర గోంగూర. రుచికి కాస్త పులుపుగా ఉండే గోంగూరను పప్పు, పులుసు, కూరలు వంటి వంటకాల్లో ఉపయోగించడంతో పాటు నిల్వపచ్చడి కూడా చేసుకుంటారు. మన దేశంలోని పలు ప్రాంతాల్లో గోంగూర విరివిగా సాగవుతోంది.పోషకాలు: గోంగూరలో విటమిన్‌–ఎ, విటమిన్‌– బి1, బి2, బి6, విటమిన్‌–సి వంటి విటమిన్లు, స్వల్పంగా పిండి పదార్థాలు, ప్రొటీన్లు, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: గోంగూరలో పుష్కలంగా ఉండే పీచుపదార్థాలు జీర్ణకోశాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు స్థూలకాయాన్ని అరికడతాయి. గోంగూర చెడు కొవ్వును అరికట్టి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రక్తహీనతను నివారిస్తుంది.


కొత్తిమీర
కొత్తిమీరను దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తారు. కూరలు, సూప్‌లు తదితర వంటకాలకు గార్నిషింగ్‌గా ఉపయోగించే కొత్తిమీరను నేరుగా పచ్చడి కూడా చేసుకుంటారు. వంటకాలకు అదనపు రుచి కోసం, సువాసన కోసం వాడే కొత్తిమీరలో పోషకాలూ పుష్కలంగా ఉంటాయి.


పోషకాలు: కొత్తిమీరలో పీచు పదార్థాలు, విటమిన్‌–ఎ, విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, బి9, బీటా కెరోటిన్, విటమిన్‌–సి, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.ఆరోగ్య లాభాలు: కొత్తిమీరలోని యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కిడ్నీ సమస్యలను నివారిస్తాయి. రక్తహీనతను అరికడతాయి. కళ్లకు, చర్మానికి మేలు చేస్తాయి.


పుదీనా
ఔషధ గుణాలు గల ఆకు కూరల్లో పుదీనా ముందు వరుసలో ఉంటుంది. ఇది దాదాపు ప్రపంచవ్యాప్తంగా లభిస్తుంది. పుదీనాలో సుమారు పద్దెనిమిది రకాలు ఉన్నాయి. పుదీనాను కూడా కొత్తిమీర మాదిరిగానే వంటకాలకు అదనపు రుచి, సుగంధం కోసం ఉపయోగిస్తారు. దీనిని శీతల పానీయాల తయారీలోనూ, ఔషధాల తయారీలోనూ, సౌందర్య సాధనాల తయారీలోనూ కూడా వినియోగిస్తారు.


పోషకాలు: పుదీనాలో పుష్కలంగా పీచు , విటమిన్‌–ఎ, విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, బి9, బీటా కెరోటిన్, విటమిన్‌–సి, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: పుదీనా రసం గొంతు సమస్యలను దూరం చేస్తుంది. కళ్లకు, చర్మ సౌందర్యానికి మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వికారాన్ని, అరుచిని పోగొడుతుంది. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది.


పొన్నగంటి కూర
పొన్నగంటి కూరను మన దేశంలోని పలు ప్రాంతాల్లో విరివిగా ఉపయోగిస్తారు. అమెరికా, దక్షిణ అమెరికా, దక్షిణాసియా, ఆఫ్రికా దేశాల్లోనూ దీనిని సాగు చేస్తారు. తోటకూర మాదిరిగానే దీంతో రకరకాల వంటకాలు తయారు చేసుకుంటారు. పప్పులోనూ, ఇతర కాయగూరల్లోనూ కలిపి వండుతారు. ఇందులోని పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి.
పోషకాలు: పొన్నగంటి కూరలో విటమిన్‌–ఎ, విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, బి9, బీటా కెరోటిన్, విటమిన్‌–సి, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.ఆరోగ్య లాభాలు: ఇందులోని పోషకాలు కంటికి మేలు చేస్తాయి. రక్తహీనతను అరికడతాయి. రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.


మునగాకు
మునగ కాయలనే కాకుండా, మునగాకును కూడా మనదేశంలో విరివిగా వాడతారు. మునగాకును పప్పులోనూ, ఇతర కూరల్లోనూ కలిపి వండుతారు. దీనిని ఎండబెట్టి, రుచి కోసం ఇతర దినుసులను వేసి పొడి చేసుకుని కూడా వాడతారు. పోషకాలు: మునగాకులో పిండిపదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు విటమిన్‌–ఎ, విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, విటమిన్‌–సి, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.ఆరోగ్య లాభాలు: మునగాకు రసాన్ని బాలింతలకు ఇవ్వడం ఆయుర్వేదంలో అనాదిగా వాడుకలో ఉంది. మునగాకు బాలింతలకు, పాలు తాగే పిల్లలకు మేలు చేస్తుందని చెబుతారు. మునగాకు కంటి చూపును, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, జుట్టు రాలడాన్ని అరికడుతుంది. రక్తహీనతను పోగొడుతుంది.


బచ్చలి కూర 
బచ్చలి కూరను ‘సిలోన్‌ స్పినాచ్‌’, ‘మలబార్‌ స్పినాచ్‌’ అని కూడా అంటారు. భారత దేశమంతటా బచ్చలిని విరివిగా సాగుచేస్తారు. తూర్పు ఆసియా, దక్షిణాసియా దేశాలతో పాటు, దక్షిణ అమెరికాలోనూ బచ్చలిని ఆహారంలో విరివిగా ఉపయోగిస్తారు. పోషకాలు: పీచు పదార్థాలు, విటమిన్‌–ఎ, విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, విటమిన్‌–సి, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.ఆరోగ్య లాభాలు: రెటీనా సంబంధిత సమస్యలు తగ్గడానికి, మానసిక ఒత్తిడి నియంత్రించడానికి బచ్చలి కూర చాలా ఉపయోగపడుతుంది.


అరటి
అరటి పండ్లు ప్రపంచంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో దొరుకుతాయి. భారత్‌లో చౌకగా లభించే వాటిలో అరటి పండ్లు ముందు వరుసలో ఉంటాయి. ధర తక్కువైనా పోషక విలువల్లో మాత్రం అరటి పండుకు తిరుగులేదు. ఏ కాలంలోనైనా, ఎటువంటి పరిస్థితుల్లోనైనా లభించే వీటితో ఎన్నో లాభాలున్నాయి. ముఖ్యంగా తక్షణం శక్తి పొందాలనుకునేవారికి అరటి బాగా ఉపయోగపడుతుంది.
పోషకాలు: అరటిలో పీచు పదార్థాలు ఎక్కువ. విటమిన్‌–బి6, విటమిన్‌–సి వంటి విటమిన్లు, మెగ్నీషియం, క్యాల్షియం‡ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ముఖ్యంగా పొటాషియం అరటిలో పుష్కలంగా ఉంటుంది.ఆరోగ్య లాభాలు: అరటి వెంటనే శక్తినివ్వడంలో బాగా ఉపయోగపడుతుంది. పొటాషియం ఎక్కువగా ఉండడంతో రక్తపోటును బాగా నియంత్రిస్తుంది. జీర్ణక్రియ వేగవంత ప్రక్రియకు కూడాæ బాగా పనికొస్తుంది.


పాల కూర
పాలకూర దాదాపు ప్రపంచవ్యాప్తంగా లభించే ఆకుకూర. మన దేశంలో పాలకూరను నేరుగా వండటంతో పాటు పప్పు, ఇతర కూరగాయలతో కలిపి వండుతారు. పాశ్చాత్య దేశాల్లో పాలకూరను పిజ్జా, బర్గర్లు, పాన్‌కేకులు, సలాడ్లు, సూప్‌లు వంటి వాటి తయారీలోనూ వాడతారు.


పోషకాలు: పీచు పదార్థాలు, పిండి పదార్థాలు, విటమిన్‌–ఎ, బీటా కెరోటిన్, విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, విటమిన్‌–సి, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు:పాలకూరకు క్యాన్సర్‌ నిరోధక లక్షణాలు ఉన్నాయని తాజా పరిశోధనల్లో తేలింది. పాలకూర తేలికగా జీర్ణమవుతుంది. జీర్ణాశయానికి మేలు చేస్తుంది. రక్తహీనతను అరికట్టి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కంటి చూపును, చర్మకాంతిని మెరుగుపరుస్తుంది.


మెంతి కూర
మెంతికూరను దాదాపు ప్రపంచవ్యాప్తంగా విరివిగా వంటకాల్లో వాడతారు. మన దేశంలో పప్పులోనూ, ఇతర కూరగాయలతో కలిపి వండుతారు. పచ్చడిగా కూడా చేసుకుంటారు. మెంతికూర ఆకులను ఎండబెట్టి పొడిగా చేసుకుని కూడా వంటకాల్లో వాడతారు.


పోషకాలు: మెంతికూరలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు విటమిన్‌–ఎ, విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, విటమిన్‌–సి, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: మెంతికూర రక్తంలో ఇన్సులిన్‌ స్థాయిని నియంత్రించి మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. జీర్ణకోశ సమస్యలను నయం చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్‌ను అరికడుతుంది. చర్మానికి, జుట్టుకు మేలు చేస్తుంది. గుండెజబ్బులను నివారిస్తుంది.


కర్బూజా
కర్బూజా దోస జాతికి చెందిన పండు. కర్బూజాపండ్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉండగా, ఇరాన్‌లో ఈ పండ్లు పుట్టాయని పరిశోధనలు చెబుతున్నాయి. భారత్, ఆఫ్ఘనిస్తాన్‌లలో కర్బూజా బాగా సాగవుతోంది.


పోషకాలు: కర్బూజాలో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు ఎక్కువ. ఇందులో విటమిన్‌–సి పుష్కలంగా ఉంటుంది. క్యాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: కర్బూజాలోని పీచు పదార్థాలు మల బద్ధకాన్ని తగ్గిస్తాయి. ఎసిడిటీ, అల్సర్, మూత్రనాళ సమస్యలకు కర్బూజా మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఆకలి మందగిస్తే కర్బూజా తీసుకోవడం వల్ల మంచి ఉపయోగం ఉంది.


పనస
పనస మంచి ఔషధ గుణాలున్న పండు. ఆసియా దేశాల్లోనే ఎక్కువగా కనిపించే ఈ పండు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు పనిచేస్తుంది. ప్రపంచంలో అతిపెద్ద పండును ఇచ్చే చెట్టు పనసదే! పనస పండుతో పాటుగా పనస పొట్టును కూడా కూరల్లో వాడుతూ ఉంటారు. అజీర్ణం, కడుపునొప్పి, క్షయతో బాధపడేవారు పనస పండును తినకూడదు.
పోషకాలు: పనసలో పిండి పదార్థాలు బాగా లభిస్తాయి. ఇందులో విటమిన్‌–సి ఎక్కువగా లభిస్తుంది. పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ లాంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: పనస ఎన్నో రోగాలకు ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే పైటో న్యూట్రియంట్స్‌ క్యాన్సర్‌ నివారణకు ఉపయోగపడతాయి. అదేవిధంగా పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల రక్తపోటును అదుపులో పెడుతుంది. విటమిన్లు, ఖనిజ లవణాలు ఎక్కువ ఉండడం వలన రోగనిరోధక శక్తిని పనస మెరుగుపరుస్తుంది.


ఆపిల్‌
‘రోజుకొక ఆపిల్‌ తింటే అసలు డాక్టర్‌ అవసరమే రాదు’ అని నానుడి. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పండించే ఈ పండ్లలో పోషక విలువలు మెండుగా ఉంటాయి. శీతాకాలంలోనే ఎక్కువగా పండే ఈ పండ్లు దాదాపు అన్ని దేశాల్లోని ప్రజలు తమ డైట్‌లో భాగంగా తీసుకుంటూ ఉంటారు. ఆపిల్‌లో ఏడువేల రకాల పండ్లున్నాయి. ఆయా ప్రాంతాలను, వాతావరణ పరిస్థితులను బట్టి ఇవి పెరుగుతూ ఉంటాయి. పామాలజీ అంటూ ఆపిల్‌ సాగును గురించి తెలిపే శాస్త్రం కూడా ఉంది.


పోషకాలు: ఆపిల్‌లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పిండి పదార్థాలతో పాటు విటమిన్‌–ఎ, విటమిన్‌–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్‌– సి వంటి విటమిన్లు లభిస్తాయి. క్యాల్షియం, పొటాషియం, ఐరన్, ఫాస్ఫరస్‌ లాంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: ఆపిల్‌ ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు ఓ మంచి ఔషధంగా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్, రక్తహీనత, క్యాన్సర్, మలబద్ధకం లాంటి ఎన్నో సమస్యలకు నివారిణిగా ఆపిల్‌ అద్భుతంగా పనిచేస్తుంది. గుండె జబ్బులు, పొడి దగ్గు, రక్తపోటు తదితర ఆరోగ్య సమస్యలకు కూడా ఆపిల్‌ చెక్‌ పెడుతుంది.


నారింజ
నారింజ సిట్రస్‌ జాతికి చెందినది. నారింజ పండ్లనే కమలాలు, సంత్రాలు అని కూడా అంటూ ఉంటారు. వేసవిలో బాగా కనిపించే ఈ పండ్లు, ఉష్ణ మండల ప్రాంతాల్లో విరివిగా పండుతూంటాయి. నారింజను పండు రూపంలో కంటే జ్యూస్‌గానే ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వీటిలో తియ్యటివి, పుల్లటివి వేర్వేరు కాలాల్లో కనిపిస్తూ ఉంటాయి. వేసవిలో తక్షణ శక్తికి, ఎండదెబ్బను తట్టుకునేందుకు నారింజ పండ్లు బాగా ఉపయోగపడతాయి.


పోషకాలు: నారింజలో పిండి, చక్కెర పదార్థాలు బాగా ఉంటాయి. విటమిన్‌–ఎ, విటమిన్‌–బి స్వల్పంగా, విటమిన్‌–సి పుష్కలంగా లభిస్తాయి. క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌ నారింజలో బాగా లభ్యమయ్యే ఖనిజ లవణాలు.


ఆరోగ్య లాభాలు: మలబద్ధకానికి నారింజ అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఉదయం, రాత్రి వేళల్లో నారింజలను ఒక్కోటి చొప్పున తీసుకుంటే మలబద్ధకాన్ని తరిమేయొచ్చు. జీర్ణక్రియను వేగవంతం చేయడంలో కూడా నారింజ ఉపయోగపడుతుంది. దంత సమస్యలకు నారింజతో చెక్‌ పెట్టవచ్చు.


రేగు పండ్లు
రేగు పండ్లు ఉష్ణమండల ప్రాంతాల్లో విస్తారంగా పండుతాయి.. కాస్తంత పుల్లగా, మరి కాస్తంత తియ్యగా ఉండే ఈ పండ్లు తెలుగిళ్లల్లో సంక్రాంతి సమయంలో బాగా కనిపిస్తూ ఉంటాయి. పరిమాణము, రంగు, రుచిని బట్టి రేగు పండ్లు తొంభై రకాల్లో దొరుకుతూ ఉన్నాయి. రేగు పండ్ల గుజ్జుతో టీ కూడా చేస్తారు. వీటితో పచ్చళ్లు, వైన్‌ కూడా తయారు చేస్తూ ఉంటారు.


పోషకాలు: రేగు పండ్లల్లో చక్కెర, పిండి పదార్థాలు ఎక్కువగా లభిస్తాయి. విటమిన్‌–ఎ, విటమిన్‌–బి1, బి2, బి3, బి6, విటమిన్‌–సి వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, మాంగనీస్‌ లాంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: రేగు పండ్లు అజీర్తికి మంచి ఔషధంగా పనిచేస్తాయి. కడుపులో మంట తగ్గడానికి, కండరాల నొప్పి తగ్గడానికి ఉపయోగపడతాయి. జుట్టు పెరుగుదలకు, కాలేయ సమస్యల నివారణకు బాగా దోహదపడతాయి.


బత్తాయి
బత్తాయి నారింజను పోలి ఉండే పండు. ఈ రెండూ సిట్రస్‌ జాతికి చెందినవే! దాదాపుగా అన్ని కాలాల్లో లభ్యమయ్యే ఈ పండ్లు, దక్షిణ భారత దేశంలో ఎక్కువగా పండుతాయి. తక్షణ శక్తినిచ్చే పండ్లలో బత్తాయిని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. పండుగా కన్నా, జ్యూస్‌గా చేసుకొనే బత్తాయిని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. పోషకాలు: బత్తాయిలో పీచు, చక్కెర పదార్థాలు ఎక్కువ. విటమిన్‌–సి బాగా లభిస్తుంది. నారింజలానే ఇందులో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు బాగా లభిస్తాయి.


ఆరోగ్య లాభాలు: జ్వరంతో, నీరసంతో బాధపడేవారికి బత్తాయి రసం అద్భుతంగా పనిచేస్తుంది. తక్షణమే శక్తినివ్వడంతో పాటు, వెంటనే కోలుకునేలా బత్తాయి రసం ఉపయోగపడుతుంది. స్కర్వీ వ్యాధితో బాధపడేవారికి బత్తాయి మంచి ఔషధం. మలబద్ధకానికి కూడా బత్తాయి మంచి ఔషధం.


బొప్పాయి
బొప్పాయి ఉష్ణమండలాల్లో ఎక్కువగా పండుతూ ఉంటుంది. మెక్సికో నుంచి ఇది ప్రపంచమంతటికీ వ్యాప్తి చెందింది. మనదేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో విరివిగా పండిస్తున్నారు. బొప్పాయి కాయగా, పండుగా ఏ రకంగా తీసుకున్నా ఆరోగ్యకరమే. బొప్పాయి కాయతో రకరకాల వంటకాలు చేస్తారు. పండుతో జామ్, జ్యూస్‌ వంటి చేసుకుంటారు. గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉన్నందున, గర్భిణీలు బొప్పాయి కాయను తీసుకోవడం మంచిది కాదని వైద్యులు సలహా ఇస్తూంటారు.


పోషకాలు: బొప్పాయిలో చక్కెరలు, పీచు పదార్థాలు ఎక్కువ. విటమిన్‌–ఎ, విటమిన్‌–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్‌– సి వంటి విటమిన్లు బొప్పాయిలో పుష్కలంగా ఉంటాయి. ఇక క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ లాంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: పెప్సిన్‌ అనే పదార్థం ఉన్నందువల్ల బొప్పాయి జీర్ణక్రియను వేగవంతం చేసేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. స్థూలకాయులు తమ డైట్‌లో బొప్పాయిని చక్కగా చేర్చుకోవచ్చు. ఆస్తమా, కీళ్లనొప్పులతో బాధపడేవారికి కూడా బొప్పాయి మంచి ఔషధం. కడుపునొప్పి, ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌కు కూడా బొప్పాయి బాగా ఉపయోగపడుతుంది.


ద్రాక్ష
ద్రాక్ష అతి ప్రాచీనకాలం నుంచి సాగవుతున్న పండు. ఇందులో దాదాపుగా అరవైకి పైగా రకాలున్నాయి. పండ్లుగానే తినడంతో పాటు పానీయంగా, సలాడ్లుగా కూడా ద్రాక్షను వాడుతూ ఉంటారు. ఆసియా దేశాల్లోనే పుట్టిన ఈ పండ్లు ప్రపంచంలోని అన్ని శీతల ప్రదేశాల్లో పెరుగుతాయి. ద్రాక్షను పండించడం మొదలైన కొత్తలో కేవలం వైన్‌ తయారీకి మాత్రమే వాడేవారు. ఆ తర్వాతే తినడానికి కూడా వాడుతూ వస్తున్నారు. ఇప్పుడైతే ఎండు ద్రాక్ష కూడా బాగా కనిపిస్తూ ఉంది.


పోషకాలు: ద్రాక్షలో పోషక విలువలు చాలానే ఉన్నాయి. పిండి పదార్థాలు, చక్కెర పదార్థాలతో పాటు విటమిన్‌–ఎ, విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌– సి, విటమిన్‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్‌ లాంటి ఖనిజ లవణాలు మెండుగా ఉంటాయి. ఆరోగ్య లాభాలు: ద్రాక్ష వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది. మూత్రపిండ సమస్యలతో బాధపడే వారికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్‌ను అదుపు చేయడం, క్యాన్సర్‌ను ఎదుర్కోవడంలో కూడా ద్రాక్ష ఉపయోగపడుతుంది. మలబద్ధకం, ఆస్తమా, గుండె జబ్బులు, అజీర్ణం, మైగ్రేయిన్‌.. ఇలా చాలా రోగాలకు ద్రాక్ష అద్భుతంగా పనిచేస్తుంది.


జామ
పేదవాడి పండుగా జామను చెబుతూ ఉంటారు. చౌక ధరల్లో దొరికే ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా పనిచేస్తాయి. చక్కెర జబ్బుతో బాధపడేవారు కూడా జామ పండ్లను తినొచ్చు. ఆసియా దేశాలలో బాగా లభ్యమయ్యే ఈ పండ్లు, ఇతర దేశాల్లోనూ కనిపిస్తూనే ఉంటాయి. అమెరికాలో జామ పండ్లతో జామ్, టీ కూడా తయారు చేస్తారు.


పోషకాలు: జామలో పీచు పదార్థాలు చాలా ఎక్కువ. విటమిన్‌ ఎ, బి, సి విటమిన్లతో పాటు పాస్ఫరస్, పొటాషియం, సోడియం, క్యాల్షియం లాంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి.
ఆరోగ్య లాభాలు: జామ రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గేవారి డైట్‌లో జామ బాగా ఉపయోగపడుతుంది. ఇక పీచు పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల షుగర్‌ వ్యాధిగ్రస్తులకు జామ పండ్లు చక్కటి ఔషధం. జామ ఆకులను పంటి నొప్పులు తగ్గడానికి, బాగా ఆకలి వేయడానికి కూడా తింటూ ఉంటారు.


మామిడి
వేసవిలో ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి మామిడి పండ్లు. మామిడిలో సుమారు వందకు పైగా రకాలున్నాయి. పండ్లుగానే కాక జ్యూస్‌గా, మామిడి తాండ్రలుగా, పచ్చళ్లుగా చేసి మామిడిని వాడుతూ ఉంటారు. వేసవిలో ఈ పండ్లు ఎన్నో విధాలుగా ఆరోగ్యానికి పనికొస్తాయి. భారతదేశం మామిడి ఉత్పత్తి చేసే దేశాల్లో మొదటి స్థానంలో ఉంటూ వస్తోంది.
పోషకాలు: మామిడిలో చక్కెర, మాంసకృత్తులు ఎక్కువ మోతాదులో ఉంటాయి. విటమిన్‌–ఎ, బి1,బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌–సి, బీటా కెరోటిన్‌ విటమిన్లు ఉంటాయి. క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: ఎండాకాలంలో తక్షణమే శక్తిని తెచ్చుకోడానికి మామిడి పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. నీరసం వచ్చినా, ఎండదెబ్బ కొట్టినా కూడా మామిడి పండ్లు తిని సాధారణ స్థితికి రావొచ్చు. రొమ్ము క్యాన్సర్‌తో పాటు కొన్ని ఇతర క్యాన్సర్‌ సంబంధిత వ్యాధులకు మామిడి ఔషధంలా పనిచేస్తుంది. రక్తపోటును నియంత్రించేందుకు కూడా మామిడి బాగా పనిచేస్తుంది.


ఉసిరి
ఉసిరి అనగానే దక్షిణ భారతదేశ ప్రజలకు పచ్చడే గుర్తొస్తుంది. పుల్లగా ఉండే ఉసిరి కాయలతో ఎక్కువగా పచ్చడి చేస్తూ ఉంటారు. ఉసిరిని షాంపూల్లో, జుత్తుకు వేసే రంగుల్లో విరివిగా వాడుతున్నారు. ముఖ్యంగా ఉసిరి కాయలను పొడిగా చేసుకొని వాడడం ఎక్కువగా కనిపిస్తోంది. ఆయుర్వేద వైద్యంలో ఉసిరిని చిరకాలంగా వాడుతున్నారు. ఎలాంటి నేలల్లోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉసిరిని సాగు చేయవచ్చు.


పోషకాలు: ఉసిరిలో పిండి, పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. విటమిన్‌–సి అత్యధికంగా లభించే పండు ఉసిరి. ఇందులో విటమిన్‌–ఎ, విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌–ఇ వంటి విటమిన్లు ఉంటాయి. క్యాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్, జింక్‌ లాంటి ఖనిజ లవణాలు ఉసిరి ద్వారా లభిస్తాయి.


ఆరోగ్య లాభాలు: మలబద్ధకానికి ఉసిరి అద్భుతమైన ఔషధం. కంటిచూపు మెరుగుదలకు, చక్కని చర్మకాంతికి, జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది. రక్తహీనతను అరికట్టి, రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. అదనపు కొవ్వును కరిగించి స్థూలకాయాన్ని అరికడుతుంది. గుండెజబ్బులను దూరం చేస్తుంది.


పుచ్చ
వేసవిలో ప్రతి సామాన్యుడూ ఎండ తాకిడిని తట్టుకునేందుకు పుచ్చకాయ వైపే చూస్తూంటాడు. తక్షణమే శక్తిని అందించే పండ్లలో ఒకటైన పుచ్చ, డిసెంబర్‌ నుంచి జూన్‌ వరకూ విరివిగా లభిస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పెరగగల అవకాశాలు ఉండడంతో మిగతా అన్నిరోజుల్లోనూ పుచ్చను సాగు చేస్తూనే ఉంటారు. ఈజిప్టులో ఈ పండుకు బీజం పడిందని చెబుతూంటారు. దాదాపుగా ప్రపంచదేశాలన్నీ ప్రస్తుతం పుచ్చను సాగు చేస్తున్నాయి. పోషకాలు: పుచ్చలో పీచు, చక్కెర పదార్థాలు చాలా ఎక్కువ. విటమిన్‌–ఎ, విటమిన్‌–సి ఇందులో పుష్కలంగా లభిస్తాయి. పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం లాంటి ఖనిజ లవణాలు కూడా ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: పుచ్చ తక్షణమే శక్తినిచ్చేలా పనిచేస్తుంది. ఎండదెబ్బను ఎదుర్కొనేందుకు పుచ్చ బాగా ఉపయోగపడుతుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల వేసవి తాపానికి దీన్నొక బెస్ట్‌ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. రక్తపోటును నియంత్రించడంలో పుచ్చ బాగా పనిచేస్తుంది. అదేవిధంగా మూత్రపిండాలలో ఇబ్బందులు ఉన్నవారికి కూడా పుచ్చ బాగా పనికొస్తుంది.


దానిమ్మ
గాలిలో తేమలేని పొడి ప్రాంతాల్లో దానిమ్మ ఎక్కువగా సాగవుతోంది. మన దేశంలో ఖరీదైన పండ్లల్లో దానిమ్మ ఒకటి. రోజూ దానిమ్మ పండొకటి తినడం, లేదా జ్యూస్‌ చేసుకొని తీసుకోవడం ద్వారా ఎన్నో రకాల రోగాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఎర్రని రంగులో, తియ్యగా గింజల రూపంలో ఉండే దానిమ్మతో సలాడ్స్‌లో రకరకాల ప్రయోగాలు కూడా చేస్తూంటారు.
పోషకాలు: దానిమ్మలో చక్కెర, పిండి పదార్థాలు తగు మోతాదులో ఉంటాయి. విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌– సి, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె వంటి విటమిన్లు లభిస్తాయి.


పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు దానిమ్మలో లభిస్తాయి. ఆరోగ్య లాభాలు: దానిమ్మలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. బ్రెస్ట్, స్కిన్‌ క్యాన్సర్‌లకు దానిమ్మ చక్కటి ఔషధం. రక్తసరఫరా సక్రమంగా జరిగేందుకు, ఒంట్లో రక్తం శాతాన్ని పెంచడానికి కూడా దానిమ్మ అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఫోలిక్‌ యాసిడ్‌ గర్భిణీలకు బాగా ఉపయోగపడు తుంది. రక్తపోటును నియంత్రించే, లైంగిక పటుత్వం పెంచే గుణం కూడా దానిమ్మలో ఉంది.


నేరేడు
నేరేడు పండ్లు భారత్‌ సహా ఆసియా దేశాల్లో బాగా పండుతాయి. వీటిని సంస్కృతంలో జంబూ ఫలాలని అంటారు. నేరేడు విస్తారంగా పండటం వల్లనే మన దేశానికి జంబూద్వీపం అనే పేరు వచ్చింది. ఆసియా నుంచి ఇవి ప్రపంచ దేశాలంతటికీ విస్తరించాయి. వందేళ్లకు పైనే నేరేడు చెట్లు జీవించగలవు. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే తియ్యటి పండ్లైన నేరేడు, చిట్టి నేరేడు, పెద్ద నేరేడు అంటూ రకరకాలుగా లభిస్తూ ఉంటాయి.


పోషకాలు: నేరేడు పండ్లలో పిండి పదార్థాలు ఎక్కువ. మాంసకృత్తులు, కొవ్వు పదార్థాలూ తగు మోతాదులో ఉంటాయి. ఇందులో విటమిన్‌–సి బాగా లభిస్తుంది. క్యాల్షియం, సల్ఫర్, ఐరన్‌ లాంటి ఖనిజ లవణాలు నేరేడులో బాగా లభిస్తాయి. ఆరోగ్య లాభాలు: చక్కెర జబ్బుకు నేరేడు భేషైన ఔషధం. విరేచనాలతో ఇబ్బంది పడేవారికి నేరేడు పండ్లు అందిస్తే తక్షణమే శక్తి అందడంతో పాటు పేగుల కదలికలు నియంత్రణలో ఉంటాయి. కాలేయం పనితీరు బాగుండడానికి నేరేడు ఉపయోగపడుతుంది. గుండె, మెదడు పనితీరుకు కూడా నేరేడు దోహద పడుతుంది.


నిమ్మ
నిమ్మ పండు అనగానే వేసవి కాలంలో ఎండకు తట్టుకోలేక తాగే నిమ్మ రసం మొదటగా గుర్తొస్తూ ఉంటుంది. కాయలుగా ఉన్నప్పుడు ఆకుపచ్చ రంగులో, పండుగా మారాక పసుపు పచ్చటి రంగులోకి మారిపోయే నిమ్మ ఉత్పత్తిలో భారతదేశం రెండో స్థానంలో ఉంది. విటమిన్‌–సి ఇందులో సమృద్ధిగా దొరుకుతుంది. పండుగా నేరుగా నిమ్మను తీసుకోవడం తక్కువే అయినా, రసంగానే ఎక్కువగా దీన్ని వాడడం కనిపిస్తోంది. నిమ్మతో జ్యూస్, పచ్చళ్లు ఎక్కువగా చేస్తూ ఉంటారు. పోషకాలు: నిమ్మలో పిండి పదార్థాలు ఎక్కువ. విటమిన్‌–సి నిమ్మలో పుష్కలంగా లభించే విటమిన్‌. క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్‌ లాంటి ఖనిజ లవణాలు నిమ్మలో లభిస్తాయి.


ఆరోగ్య లాభాలు: నిమ్మలో ఉండే విటమిన్‌–సి రోగనిరోధక శక్తిని పెంచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. జలుబు చేసిన వారికి నిమ్మ రసాన్ని అందిస్తే వెంటనే ఫలితం కనిపిస్తుంది. నిమ్మ రసాన్ని రోజూ కొన్ని చెంచాల్లో తీసుకొని సేవిస్తే జీర్ణక్రియ వేగవంతం అవ్వడమే కాక, కామెర్ల వంటి రోగాలను తరిమికొట్టొచ్చు. ఊబకాయం నుంచి బయటపడడానికి కూడా నిమ్మ మంచి ఔషధంగా పనిచేస్తుంది.


వంటింట ఆరోగ్యాల పంట_fruits_Helth

వంటింట ఆరోగ్యాల పంట_fruits_Helth


వంటింట ఆరోగ్యాల పంట_fruits_Helthఆహారం జీవితానికి ఇంధనం..._food
ఆహారం 
జీవితానికి ఇంధనం... 
మనమందరం కడుపున పుట్టాము. అదీ కడుపు గొప్పతనం. మన జీవితం కడుపులో మొదలైంది.మన జీవితం కడుపులో పడే ఆహారం వల్లే సాగుతుంది. ఆరోగ్యానికి అనారోగ్యానికి తేడా మనం తినే పదార్థాలవల్లే నిర్ణయించబడుతుంది. పౌష్ఠిక ఆహారం, సమతుల ఆహారం మనకి అవసరం. ఈ వ్యాసంలో రాసిన చాలా విషయాలు మీకు తెలిసినవే. కానీ మనకుండే పని ఒత్తిడి వల్ల ఈ విషయాలు తరచూ మరచిపోతుంటాం. ఈ పేజీని మీకు ఒక ‘రెడీ రెకనర్‌’ గా అందించాలన్నదే మా ప్రయత్నం. వంట గది తలుపు మీదో డైనింగ్‌ టేబుల్‌ పక్కనో ఈ పేజీని అతికించుకోండి. రోజూ చూసుకోండి. మీ కుటుంబానికి జీవం ఉట్టిపడేలా ఆరోగ్యకరమైన పోషణ ఇవ్వండి.


ఏ ఎత్తుకు ఎంత బరువు?


ఏ ఏ ఎత్తుకు ఎంత బరువండాలో అది వుహిళా, పురుషుడా అన్న అంశంతో వూరుతుంది. వురి వున బరువెంతో చూసుకునేందుకు వూర్గాలు ఉన్నాయి.


ఎత్తు, బరువ, సూచిక. (హైట్, వెయిట్‌ చార్ట్‌ ఇచ్చాం).


బాడీ, వూస్‌ ఇండెక్స్‌ ∙నడుము, హిప్‌ నిష్పత్తి ∙ శరీరంలో కొవ శాతం


మీరు లావెక్కుతున్నారా?...


మీరు బరువ పెరుగుతూ లావెక్కుతున్నారా? లేదా? అన్న విషయం ఓ చిన్న లెక్కతో తెలుసుకోవచ్చు. ఓ వ్యక్తి శరీరంలోకి కండ పాళ్లు అతడికి తగ్గట్లుగా ఉన్నాయా అన్న విషయాన్ని తెలుసుకునే ఈ సూచికను బాడీ వూస్‌ ఇండెక్స్‌ అంటారు. బాడీ వూస్‌ ఇండెక్స్‌ తెలుసుకోవడం ఎలాగంటే... ఉదాహరణకు మీ ఎత్తు ఐదడుగుల ఎనిమిది అంగుళాలు అనుకుందాం. అంటే 172 సెంటీమీటర్లు అన్నవూట. మీ బరువ# 65 కిలోలు అనుకుందాం. అప్పుడు 65 కిలోలు డివైడెడ్‌ బై 1.72 1.72 కాలిక్యులేట్‌ చేస్తే మీ బీఎంఐ వచ్చేస్తుంది. దీని విలువ 21.97 కిలోలు/మీటర్‌ స్క్వేర్‌. ఆరోగ్య కరమైన బీఎంఐ విలువ 19–23 వుధ్య ఉండాలి. మీరు బరువ పెరుగుతూ పోతే మీ బీఎంఐ విలువ కూడా పెరుగుతుంది.


బీఎంఐ లెక్కేశాక చూసుకోడానికి నిర్దేశిత ప్రవూణాలివి...


ఆరోగ్యకరమైన బాడీ వూస్‌ ఇండెక్స్‌ అంటే అది... 19–23 కిలోలు/మీటర్‌ 2


అవసరమైన దానికంటే బరువెక్కువ అంటే అది... 23–25 కిలోలు/మీటర్‌ 2


మీరు ఖచ్చితంగా బాగా లావే అని తేల్చే పరిమితి అంటే... మీ బీఎంఐ 25 కిలోలు/మీటర్‌2 పైవూటే అన్నవూట.


వురి ఒకవేళ మీ బాడీ వూస్‌ ఇండెక్స్‌ (బీఎంఐ) 30 కంటే ఎక్కువ గానీ ఉంటే... మీరు చాలా చాలా లావెక్కువ అన్నవూట.


30 నుంచి 34.9 బీఎంఐ ఉంటే... గ్రేడ్‌ – 1 ఒబేసిటీ అంటారు.


35 నుంచి 39.9 బీఎంఐ ఉంటే... గ్రేడ్‌ – 2 ఒబేసిటీ అని అంటారు.


40 కంటే ఎక్కువగా ఉంటే అది వూర్బిడ్‌ ఒబేసిటీ అని అంటారు. అంటే ఆ స్థాయిలో జబ్బులు వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ అన్నవూట.


వెయిస్ట్‌ హిప్‌ రేషియో...


నడుము కొలతకూ, దానికి కిందే ఉండే హిప్‌ కొలతకు వుధ్యనున్న నిష్పత్తిని చూడాలి. నడుము కొలతను, హిప్‌ కొలతతో భాగిస్తే వచ్చే విలువ పురుషుల్లో 0.9 నుంచి 0.95 కంటే తక్కువగానూ, వుహిళల్లో అయితే 0.85 నుంచి 0.86 కంటే తక్కువగానూ ఉండాలి. ఆ విలువలు అంతకు మించి ఉన్నాయంటే పొట్టభాగంలో కొవ#్వ చేరి బరువ# పెరుగుతున్నట్లు అర్థం. కొన్ని సందర్భాల్లో ఎత్తుకు తగ్గ బరువ ఉన్నా, వెయిస్ట్, హిప్‌ రేషియో చక్కగానే ఉన్నా కూడా శరీరంలో ఎక్కువ కొవ#్వ ఉండవచ్చు. ఇలాంటి వాళ్లలో కండ పాళ్ల కంటే కొవ#్వ పాళ్లు ఎక్కువన్నవూట. బరువు ఎక్కువగా ఉన్నట్లయితే నిపుణుల సలహాపై బరువ తగ్గే ప్రయత్నం చేయాలి.


లావెక్కితే లాసెక్కువే...


మీరు అవసరమైన దానికంటే ఎక్కువ బరువంటే భవిష్యత్తులో షుగర్, హైబీపీ, గుండె జబ్బుల వంటి సవుస్యలు ఎన్నెన్నో వచ్చేందుకు అవకాశం ఉంది. వాటిని నివారించాలంటే లావ# పెరగకుండా నియంత్రించుకోవాలి. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, ఈత వంటి వ్యాయామాలతో బరువు ను అదుపులో ఉంచుకోవచ్చు. అయితే, బరువు తగ్గడానికి డైటింగ్‌ పేరిట ఆహారం వూనేయడం సరికాదు. మీ అదనపు బరువ# తగ్గడానికి నెలకు 1 నుంచి 2 కిలోలు తగ్గితే అది ఆరోగ్యకరమైన తగ్గుదలే. నెలకు 4 కిలోలు వరకు తగ్గినా పర్లేదు. కానీ ఆ పరిమితి మించితే అది ఆరోగ్యకరం కాదు.


టమాటోటమాటో సాంకేతికంగా పండు అయినప్పటికీ మన దేశంలో కూరగాయగానే వాడటం అలవాటు. అందువల్ల దీనిని కూరగాయగానే పరిగణిస్తారు. టమాటోలు దాదాపు ప్రపంచవ్యాప్తంగా పండుతాయి. వీటిని కూరలు, పచ్చళ్లు, సలాడ్లతో పాటు ఎక్కువకాలం నిల్వ ఉండే సాస్, కెచప్‌ వంటి వాటి తయారీలోనూ వాడతారు. వివిధరకాల వంటకాలకు అలంకరణ కోసం కూడా టమాటో ముక్కలను వాడతారు.


పోషకాలు: టమాటోలలో స్వల్పంగా పిండి పదార్థాలు, చక్కెర, విటిమిన్‌–ఎ, విటమిన్‌–బి1, బి3, బి6, విటమిన్‌–సి, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె, బీటాకెరోటిన్‌ వంటి విటమిన్లు, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.ఆరోగ్య లాభాలు: టమాటోలు గుండెజబ్బులను, చక్కెరజబ్బును, రక్తహీనతను నివారిస్తాయి. జుట్టును, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. స్థూలకాయాన్ని అరికడతాయి.


దోసకాయ


దోసకాయలు ఆసియా, ఆఫ్రికా, అమెరికా ప్రాంతాల్లో విరివిగా పండుతాయి. వీటిలో చాలా రకాలు ఉన్నాయి. ఆకుపచ్చ రంగులో పొడవుగా కనిపించే కీర దోసకాయలను సాధారణంగా పచ్చిగానే తింటారు. వీటిని సలాడ్లు వంటి వాటిలో వాడతారు. పాశ్చాత్య దేశాల్లో వీటిని ఉప్పునీటిలో ఊరవేసి కూడా తింటారు. పసుపుగా గుండ్రంగా ఉండే దోసకాయలను వివిధ రకాల వంటకాల్లో ఉపయోగిస్తారు.


పోషకాలు: దోసకాయల్లో స్వల్పంగా పిండి పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌–సి, విటమిన్‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఆరోగ్య లాభాలు: దోసకాయల్లో నీటి శాతం ఎక్కువ. ఇవి డీహైడ్రేషన్‌ను దూరం చేస్తాయి. మెదడుకు మేలు చేస్తాయి. కడుపు మంట, అల్సర్లు వంటి బాధలను తగ్గిస్తాయి. స్థూలకాయాన్ని అరికడతాయి. రక్తపోటును అదుపు చేస్తాయి. గుండె సమస్యలను నివారిస్తాయి.


బెండకాయ


బెండకాయలను భారత్‌తో పాటు దాదాపు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ సాగు చేస్తారు. భారత్‌లో బెండకాయలతో కూరలు, వేపుళ్లు, పులుసులు వంటి వంటకాలను తయారు చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో బెండకాయలను పచ్చిగాను, ఊరవేసుకుని కూడా తింటారు. పోషకాలు: బెండకాయల్లో స్వల్పంగా పిండి పదార్థాలు, ప్రొటీన్లు ఉంటాయి. విటమిన్‌–ఎ, విటమిన్‌–బి1, బి2, బి3, బి9, విటమిన్‌–సి, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు:బెండకాయలు రక్తహీనతను నివారిస్తాయి. జీర్ణకోశానికి మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. కంటి ఆరోగ్యాన్ని, ఎముకల దారుఢ్యాన్ని మెరుగుపరుస్తాయి.


కాలిఫ్లవర్‌


కాలిఫ్లవర్‌ దాదాపు ప్రపంచవ్యాప్తంగా సాగవుతోంది. ఇందులో ఎక్కువగా లేత పసుపు రంగులోనివే కనిపిస్తాయి. అయితే, ఊదా, నారింజ, ఆకుపచ్చ రంగుల్లో కూడా కాలిఫ్లవర్‌ రకాలు ఉన్నాయి. కాలిఫ్లవర్‌ను రకరకాల వంటకాల్లో ఉపయోగిస్తారు. కొన్నిచోట్ల కాలిఫ్లవర్‌ తురుమును పచ్చిగానే సలాడ్లలో వాడతారు.


పోషకాలు: పిండి పదార్థాలు, చక్కెర, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌–సి, విటమిన్‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, మాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: గుండెకు, మెదడుకు మేలు చేస్తుంది. క్యాన్సర్‌ను నివారిస్తుంది. జీర్ణకోశానికి రక్షణ ఇస్తుంది. అకాల వార్ధక్యాన్ని నివారిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. స్థూలకాయాన్ని అరికడుతుంది.


వంకాయలు∙


వంకాయలను దాదాపు ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తారు. వంకాయల్లో నానా రకాలు ఉన్నా, పోషక విలువలు అన్నింటిలోనూ దాదాపు ఒకేలా ఉంటాయి. వంకాయలతో భారతీయులు రకరకాల కూరలు, పచ్చళ్లు, పులుసులు వంటివి చేసుకుంటారు. నేరుగా వాటిని కాల్చుకుని కూడా తింటారు. ఇతర దేశాల్లోనూ వంకాయలతో రకరకాల వంటకాలు చేసుకుంటారు. వాటిని ఊరబెట్టి కూడా తింటారు.


పోషకాలు: వంకాయల్లో స్వల్పంగా పిండి పదార్థాలు, చక్కెర, పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్‌–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్‌–సి, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: వంకాయలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఫలితంగా స్థూలకాయాన్ని, గుండెజబ్బులు, రక్తపోటు ముప్పును నివారిస్తాయి.


సొరకాయ


సొరకాయ నీటిశాతం ఎక్కువగా ఉండే కూరగాయ. దీనినే ఆనపకాయ అని కూడా అంటారు. ఆసియా, ఆఫ్రికా, యూరోప్, అమెరికా ప్రాంతాల్లో దీనిని విరివిగా పండిస్తారు. మన దేశంలో సొరకాయను నేరుగా కూరగా వండుకోవడమే కాకుండా సాంబారు, పులుసు, పప్పు వంటి వంటకాల్లో విరివిగా వాడతారు. ఉత్తరాదిలో దీనితో మిఠాయిలు కూడా తయారు చేస్తారు. పలుదేశాల్లో సొరకాయ జ్యూస్‌ను సేవిస్తారు.


పోషకాలు: సొరకాయలో స్వల్పంగా పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, నామమాత్రంగా ప్రొటీన్లు ఉంటాయి. వీటిలో విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌–సి వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, మాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: బరువు తగ్గాలనుకునే వారికి సొరకాయ చక్కగా ఉపయోగపడుతుంది. ఇది తేలికగా జీర్ణమవుతుంది. జీర్ణశాయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కిడ్నీ సమస్యలను నివారిస్తుంది.


క్యాబేజీ


క్యాబేజీ దాదాపు ప్రపంచవ్యాప్తంగా లభిస్తుంది. ఆకుపచ్చ, ముదురు ఊదారంగుల్లో దట్టమైన ఆకుల బుట్టలా ఉండే క్యాబేజీలో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. క్యాబేజీతో రకరకాల వంటకాలు తయారు చేసుకోవడమే కాకుండా, క్యాబేజీ తురుమును పచ్చిగానే సలాడ్లు వంటి వాటిలో కలిపి తింటారు. కొన్ని ప్రాంతాల్లో క్యాబేజీని ఊరవేస్తారు.


పోషకాలు: పిండి పదార్థాలు, చక్కెర, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌–సి, విటమిన్‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, మాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: క్యాబేజీ జీర్ణకోశానికి మేలు చేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. స్థూలకాయాన్ని అరికడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకలకు బలాన్నిస్తుంది. చర్మానికి, కంటికి మేలు చేస్తుంది.


గోరు చిక్కుడు


భారత దేశంలోని పశ్చిమ, వాయవ్య ప్రాంతాల్లోనూ, పాకిస్థాన్‌లోనూ గోరుచిక్కుడు విరివిగా పండుతుంది. దీనినే గోకరకాయ అని కూడా అంటారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ దీని సాగు జరుగుతోంది. అమెరికా, మెక్సికో, ఆఫ్రికా, ఆస్ట్రేలియా వంటి ప్రాంతాల్లోను గోరు చిక్కుడు పంట విస్తారంగానే పండుతోంది. కరువు పరిస్థితులను తట్టుకుని మరీ గోరు చిక్కుడు మొక్కలు పెరుగుతాయి. గోరుచిక్కుడును కూరలు తదితర వంటలతో పాటు, గోరుచిక్కుడు జిగురును రకరకాల ఆహార ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు.


పోషకాలు: గోరు చిక్కుడులో ప్రొటీన్లు, స్వల్పంగా పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్‌–ఎ, విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌–సి, విటమిన్‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఎముకలకు, కండరాలకు బలాన్నిస్తాయి. రక్తహీనతను నివారిస్తాయి. జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. స్థూలకాయాన్ని అరికడతాయి.


చిక్కుడుకాయ


చిక్కుడుకాయలను దాదాపు ప్రపంచమంతటా సాగు చేస్తారు. చిక్కుడుకాయలు లేతగా ఉండగానే కోసి, వంటల్లో వాడతారు. ముదిరిన చిక్కుడు కాయల నుంచి గింజలను వేరుచేసి, వాటిని ఎండబెట్టుకుని వంటకాల్లో వాడతారు. ఇక లేలేత చిక్కుడు ఆకులను పాలకూర మాదిరి ఆకుకూరలా ఉపయోగిస్తారు. ప్రొటీన్లు పుష్కలంగా ఉండటంతో కూరగాయల్లో చిక్కుడు కాయలు బలవర్ధకమైనవి.


పోషకాలు: చిక్కుడుకాయల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, స్వల్పంగా కొవ్వులు, పీచుపదార్థాలు, విటమిన్‌– బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్‌–సి, విటమిన్‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, జింక్, మాంగనీస్, పొటాషియం, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: రక్తహీనతను అరికట్టి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. కండరాలకు, ఎముకలకు బలాన్నిస్తాయి. వార్ధక్య లక్షణాలను అరికడతాయి. కంటిచూపును మెరుగుపరుస్తాయి. మెదడుకు మేలు చేస్తాయి. పక్షవాతం, గుండెపోటు వంటి జబ్బుల ముప్పును తగ్గిస్తాయి.


గుమ్మడి


తెలుగువారికి ఇష్టమైన, శుభప్రదమైన కూరగాయ గుమ్మడి. దీనిని ప్రపంచవ్యాప్తంగా సాగుచేస్తారు. గుమ్మడితో భారతీయులు కూరలు, పులుసులు వంటివి తయారు చేసుకుంటారు. గుమ్మడి గింజలను కూడా వేయించుకుని తింటారు. పాశ్చాత్యులు గుమ్మడితో ప్యూరీ, సూప్, సలాడ్స్, కొన్ని రకాల మిఠాయిలు తయారు చేసుకుంటారు. గుమ్మడి గింజల నుంచి తీసిన నూనెను కూడా పాశ్చాత్యులు వినియోగిస్తారు.


పోషకాలు: గుమ్మడిలో పీచు పదార్థాలు, చక్కెర, పిండి పదార్థాలు, స్వల్పంగా ప్రొటీన్లు ఉంటాయి. ఇందులో విటమిన్‌–ఎ, బీటా కెరోటిన్, విటమిన్‌–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్‌–సి, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్యలాభాలు: గుమ్మడి ప్రొస్టేట్‌ వాపును తగ్గిస్తుంది. గుమ్మడి గింజలు మలబద్ధకాన్ని నివారించి, పేగులను శుభ్రపరుస్తాయి. గుండెజబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెర నిల్వలను క్రమబద్ధం చేస్తుంది. ఆయుర్వేదంలోనూ గుమ్మడిని రకరకాల చికిత్సల్లో ఉపయోగిస్తారు.


పొట్లకాయ


పొట్లకాయలు భారత్‌ సహా అన్ని ఆసియా దేశాల్లోనూ, ఆఫ్రికా, ఆస్ట్రేలియాల్లోనూ వాడుకలో ఉన్నాయి. భారత్‌లో పొట్లకాయలతో రకరకాల కూరలు వండుకుంటారు. కొన్ని దేశాల్లో పొట్లకాయలు బాగా పండిన తర్వాత వాటి గుజ్జును టమాటా గుజ్జుకు ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగిస్తారు. ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాల్లో పొట్ల మొలకలను, ఆకులను కూడా తింటారు.


పోషకాలు: పొట్లకాయల్లో పీచు పదార్థాలు, స్వల్పంగా ప్రొటీన్లు, పిండి పదార్థాలు, విటమిన్‌–ఎ, బీటా కెరోటిన్, విటమిన్‌–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్‌–సి వంటి విటమిన్లు, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: పొట్ల కాయలు కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తాయి. వీటిలో పుష్కలంగా ఉండే పీచు పదార్థాలు మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఇవి మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి.


బీరకాయ


భారత్‌ సహా అన్ని ఆసియా దేశాల్లోనూ, కొన్ని ఆఫ్రికా దేశాల్లోనూ బీరకాయలు విరివిగా పండుతాయి. పుష్కలంగా పీచు పదార్థాలు కలిగి, తేలికగా జీర్ణమయ్యే బీరకాయలను పథ్యం వంటల్లోనూ వాడతారు. బీరకాయలతో కూరలు, పచ్చళ్లు చేసుకుంటారు. కొన్నిచోట్ల బీరకాయ పచ్చిముక్కలనే సలాడ్లలో వాడతారు.


పోషకాలు: బీరకాయల్లో పుష్కలంగా పీచు పదార్థాలు, విటమిన్‌–ఎ, బీటా కెరోటిన్, విటమిన్‌–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్‌–సి వంటి విటమిన్లు ఉంటాయి. జింక్, ఐరన్, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: బీరకాయలు స్థూలకాయాన్ని నివారిస్తాయి. ఎసిడిటీ, అల్సర్లు వంటి సమస్యలను నివారించి, జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.


దొండకాయ


దొండకాయ ఆసియా, ఆఫ్రికా దేశాల్లో విరివిగా పండుతుంది. భారత్‌లో దొండకాయలతో కూరలు, వేపుళ్లు వండుకుంటారు. వంటల కోసం సాధారణంగా మన దేశంలో లేత దొండకాయలను ఉపయోగిస్తారు. కొన్ని దేశాల్లో బాగా పండిన దొండకాయలను కూడా వంటల్లో ఉపయోగిస్తారు. ఇండోనేసియా, థాయ్‌లాండ్‌ వంటì దేశాల్లో ఎర్రగా పండిన దొండకాయలతో పాటు, దొండ ఆకులను కూడా తింటారు.


పోషకాలు: దొండకాయల్లో పీచు పదార్థాలు, బీటా కెరోటిన్, విటమిన్‌–బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్‌–సి వంటి విటమిన్లు ఉంటాయి. స్వల్పంగా పిండి పదార్థాలు, పుష్కలంగా పీచు పదార్థాలు ఉంటాయి. క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: దొండకాయలు రక్తహీనతను నివారిస్తాయి. రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. జీర్ణకోశానికి మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని అదుపు చేస్తాయి.


కాకరకాయ


భారత ఉపఖండ ప్రాంతంతో పాటు దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికా ప్రాంతాల్లో కాకరకాయలను విరివిగా పండిస్తారు. కాకరకాయలతో రకరకాల కూరలు, పులుసులు, సూప్స్, సలాడ్స్‌ వంటివి తయారు చేసుకుని తింటారు. చిరకాలంగా వాడుకలో ఉన్న కాకరకాయను ఆయుర్వేద తదితర సంప్రదాయ చికిత్సా పద్ధతుల్లోనూ వివిధ వ్యాధులను నయం చేయడం కోసం వినియోగిస్తారు.


పోషకాలు: కాకరకాయలో విటమిన్‌–ఎ, బీటా కెరోటిన్, విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, బి9, విటమిన్‌–సి, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు, పీచు పదార్థాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: కాకరలోని హైపోగ్లెసీమిక్‌ పదార్థం ఇన్సులిన్‌ స్థాయిని నియంత్రించి, చక్కెర జబ్బును అదుపు చేస్తుంది. సోరియాసిస్‌ సహా పలు చర్మవ్యాధుల నివారణకూ ఉపయోగపడుతుంది. డయేరియా వంటి జీర్ణకోశ వ్యాధుల చికిత్సలోనూ ఆయుర్వేద వైద్యులు కాకరను ఉపయోగిస్తారు.


బాదం


బాదం గింజలను ప్రపంచ వ్యాప్తంగా ఇష్టంగా తింటారు. ఈ గింజలు బలవర్ధకమైన ఆహారం. ఇందులో తియ్యగా, చేదుగా ఉండే రెండు రకాల బాదం గింజలు ఉంటాయి. తినుబండారాల కోసం తియ్యటి బాదంను వాడుతూ ఉంటారు. ఈ బాదం పప్పుతోనే బాదం పాలను కూడా తయారు చేస్తూంటారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి బాదం సాగవుతోంది.


పోషకాలు: బాదంలో పిండి, పీచు, కొవ్వు పదార్థాలు తగు మోతాదుల్లో లభిస్తాయి. మాంసకృత్తులు కూడా బాగా లభిస్తాయి. విటమిన్‌ ఇ బాదంలో సమృద్ధిగా లభిస్తుంది. పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, క్యాల్షియం వంటి ఖనిజ లవణాలు బాదం ద్వారా లభిస్తాయి.


ఆరోగ్య లాభాలు: బాదంతో గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది. తక్షణశక్తిని పొందేందుకు కూడా బాదం బాగా పనికొస్తుంది. రక్తంలో ఇన్సులిన్‌ శాతాన్ని పెంచే గుణం బాదంలో ఉన్నందున, మధుమేహం ఉన్నవారు బాదంను డైట్‌లో చేర్చుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. మెదడు పనితీరు చురుగ్గా ఉండేందుకు బాదం ఉపయోగపడుతుంది.


కొబ్బరి


కొబ్బరి దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. భారతదేశంలో దేవుడికి మొక్కుగా కొబ్బరికాయను కొట్టడం ఎప్పట్నుంచో వస్తోంది. కొబ్బరిని పచ్చిగా ఉన్నప్పుడు, ఎండబెట్టి రెండు రకాలుగానూ వాడుతూ వస్తున్నారు. కొబ్బరి నుంచి నూనెను కూడా తయారు చేస్తున్నారు. ఎండు కొబ్బరి సాధారణంగా ప్రతి వంటకంలో వాడుతూ ఉండటం చూడొచ్చు.


పోషకాలు: కొబ్బరిలో కొవ్వు, పీచు పదార్థాలు ఎక్కువ. విటమిన్‌ సి, ఇ, బి6 విటమిన్లు దొరుకుతాయి. ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు కొబ్బరిలో బాగా లభిస్తాయి.


ఆరోగ్య లాభాలు: మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఎదుర్కొనే వారు కొబ్బరి నీరు తాగినా, తిన్నా ఫలితం కనిపిస్తుంది. వాంతులు, కళ్లు తిరగడం లాంటి సమస్యలతో బాధపడే వారు కొబ్బరిని తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. కలరా వ్యాధికి కూడా కొబ్బరి అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది.


పిస్తా


పిస్తా పప్పు మంచి బలవర్ధకమైన ఆహారం. కొంతే తిన్నా కడుపు నిండినట్లుగా అనిపించి కావాల్సిన శక్తిని అందిస్తుంది. పిస్తా, కాజూ ఒకే జాతికి చెందినవి. ప్రపంచవ్యాప్తంగా సాగవుతోన్న పిస్తా ఖరీదైన డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి.


పోషకాలు: పిస్తాలో కొవ్వు, పీచు‡పదార్థాలు, మాంసకృత్తులు ఎక్కువే. విటమిన్‌ బి6, సి, ఇ పిస్తాలో లభించే విటమిన్లు. పిస్తాలో పొటాషియం చాలా ఎక్కువ. ఫాస్ఫరస్, మెగ్నీషియం, క్యాల్షియం లాంటి ఖనిజ లవణాలు కూడా మెండుగా ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: డ్రై ఫ్రూట్స్‌ అన్నింట్లోకెల్లా పిస్తాలో క్యాలరీలు ఎక్కువ. ఇందులోని విటమిన్‌ బి6 ప్రొటీన్లను జీర్ణం చేసుకోవడంలో బాగా ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ పిస్తా బాగా పనిచేస్తుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వే ఎక్కువగా ఉండటంతో డైట్‌లో దీనిని చక్కగా చేర్చుకోవచ్చు.


జీడిపప్పు


జీడిమామిడి పండు అడుగున ఉండే గింజ నుంచి జీడిపప్పును సేకరిస్తారు. ఉష్ణ మండలాల్లో ఎక్కువగా జీడిని సాగు చేస్తున్నారు. భారతదేశం నుంచి జీడి ఎగుమతి పెద్ద ఎత్తునే జరుగుతోంది. జీడి పండ్లు వేసవిలో బాగా సాగవుతూ ఉంటాయి.


పోషకాలు: జీడిలో కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు ఎక్కువ మోతాదుల్లో లభిస్తాయి. విటమిన్‌ ఇ, కె, బి6 సమృద్ధిగా లభిస్తాయి. క్యాల్షియం, ఐరన్, జింక్, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు కూడా జీడిలో మెండుగా ఉన్నాయి.


ఆరోగ్య లాభాలు: రక్తప్రసరణ సరిగ్గా జరగడానికి, రక్తపోటును నియంత్రించడానికి జీడిపప్పు అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ యాక్సిడెంట్స్‌ రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి. బరువు తగ్గడానికి కూడా జీడిని డైట్‌లో చేర్చుకుంటే ఫలితం కనిపిస్తుంది.


ఎండు ద్రాక్ష


ద్రాక్ష పండును ఎండబెడితే తయారయ్యేదే ఎండు ద్రాక్ష. కిస్మిస్‌ అన్న పేరుతో ఇది మార్కెట్లో కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తయ్యే ద్రాక్షలో 60 శాతం వైన్‌ తయారీకే ఉపయోగిస్తుండగా, 7 శాతం ఎండు ద్రాక్షను తయారు చేస్తున్నారు. మిగిలినవే ద్రాక్ష పండ్లుగా నేరుగా లభిస్తున్నాయి. కొన్ని రోగాల బారినపడిన వారికి కిస్మిస్‌నే ప్రత్యేకంగా డైట్‌లో చేర్చుతూ ఉంటారు.


పోషకాలు: పిండి, పీచు పదార్థాలు ఎక్కువ. విటమిన్‌ సి, బి6 ఎక్కువగా లభిస్తాయి. పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ లాంటివి ఎండు ద్రాక్షలో లభించే ఖనిజ లవణాలు.


ఆరోగ్య లాభాలు: సంతానలేమితో బాధపడేవారికి ఎండు ద్రాక్ష బాగా ఉపయోగపడుతుందని పరిశోధనలు తేల్చాయి. తరచూ జ్వరంతో బాధపడేవారికి ఎండు ద్రాక్ష మంచి ఔషధం. చిన్నపిల్లల్లో జీర్ణశక్తి బాగా పెరిగేందుకు ఎండు ద్రాక్ష ఉపయోగపడుతుంది. రక్తహీనత, తక్కువ బరువు, సెక్స్‌ కోరికలు తగ్గడం లాంటి సమస్యలున్న వారు ఎండు ద్రాక్షను తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది.


ఖర్జూరం


ఖర్జూరం ఎడారి ప్రాంతాల్లో లభ్యమయ్యే పండ్ల చెట్టు. ఇందులో ఆడా, మగా అంటూ వేర్వేరు రకాలు ఉంటాయి. ఆడ చెట్టు నుంచే ఖర్జూరం పండ్లు లభిస్తున్నాయి. ప్రపంచమంతటా ఖర్జూరం∙మార్కెట్‌లో దొరుకుతూ ఉంటుంది. తక్షణమే శక్తినిచ్చేది కావడంతో మార్కెట్‌లో ఖర్జూరంకు మంచి గిరాకీ ఉంది. మనిషికి పరిచయమైన మొదటి ఆహార వృక్షంగా ఖర్జూరంను చెప్పుకుంటూ ఉంటారు. రంజాన్‌ సీజన్‌లో ఖర్జూరం తినడంతోనే ముస్లింలు ఉపవాసాన్ని ముగించడం జరుగుతూ ఉంటుంది. పండ్లలోని తేమను బట్టి మెత్తటివి, కాస్త ఎండినవి, పూర్తిగా ఎండినవి.. ఇలా రకరకాల ఖర్జూరాలు ఉన్నాయి.


పోషకాలు: ఖర్జూరంలో పిండి, చక్కెర పదార్థాలు ఎక్కువ. విటమిన్‌ సి మెండుగా లభిస్తోంది. పాస్ఫరస్, కాల్షియం లాంటి ఖనిజ లవణాలు ఖర్జూరంలో ఎక్కువగా లభిస్తాయి.


ఆరోగ్య లాభాలు: పెద్దపేగులోని సమస్యలకు ఖర్జూరం చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. మలబద్ధకం తగ్గడానికి, ఎముకలు బలంగా తయారవ్వడానికి, ఉదర క్యాన్సర్‌ను తరిమేయడానికి ఖర్జూరం బాగా ఉపయోగపడుతుంది. గర్భిణీలకు ఖర్జూరం తినిపిస్తే మంచిది. డయేరియా, రక్తపోటుతో బాధపడేవారికి కూడా ఖర్జూరం చక్కగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు తమ డైట్‌లో ఖర్జూరంను చేర్చుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.


అంజూర


అంజూర పండ్లకు ఏళ్ల నాటి చరిత్ర ఉంది. ఐదు వేల ఏళ్ల కిందటే అంజూరను సాగు చేయడం మానవుడు మొదలుపెట్టాడు. నేడు ప్రపంచమంతటా అంజూర్‌ సాగు విస్తరించింది. కొంచెం వగరు, కొంచెం తీపి, కొంచెం పులుపు ఉండే ఈ పండ్లు వర్షా కాలంలోనే ఎక్కువగా సాగవుతున్నాయి. ఇక ఈ పండ్లను ఎండబెట్టగా తయారయ్యే అంజూర్‌ డ్రై ఫ్రూట్‌ మాత్రం ఏడాది పొడుగునా మార్కెట్‌లలో లభ్యమవుతూనే ఉంటుంది.


పోషకాలు: అంజూరలో పిండి, చక్కెర పదార్థాలు ఎక్కువ. విటమిన్‌ సి, ఎ, బి6 విటమిన్లు అంజూర ద్వారా లభిస్తున్నాయి. పొటాషియం, క్యాల్షియం ఇందులో ఎక్కువగా లభిస్తున్నాయి. సోడియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ లాంటి ఇతర ఖనిజ లవణాలు కూడా తగు మోతాదుల్లో ఉన్నాయి.


ఆరోగ్య లాభాలు: జీర్ణక్రియను వేగవంతం చేయడంలో అంజూర్‌ బాగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గడానికి, మానసిక ఒత్తిడుల నుంచి బయటపడడానికి, ఎముకలు బలంగా మారడానికి అంజూర్‌ పనికొస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్‌లకు అంజూర మంచి ఔషధం.


వేరుశనగ


భారతదేశమంతటా వంటకాలు చేయడానికి వేరుశనగల నుంచి తీసిన నూనెనే వాడుతూ ఉంటారు. ప్రపంచమంతటా వ్యాపించిన ఈ పంట, ఉష్ణమండల ప్రాంతాల్లో ఎక్కువగా సాగవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పంటల్లో ఒకటిగా వేరుశనగ కనిపిస్తూ ఉంది. వేరుశనగలు బలమైన ఆహారం. పల్లీలనే పేరుతో వేరుశనగలను పిలుస్తూ ఉంటారు. ఈ పల్లీలను వంటకాలలో రుచి కోసం ఎక్కువగా వాడుతూ ఉంటారు.


పోషకాలు: వేరుశనగలో పిండి, పీచు పదార్థాలు ఎక్కువ. మాంసకృత్తులు కూడా పల్లీలలో తగు మోతాదుల్లో లభిస్తాయి. విటమిన్‌ సి, ఎ, బి6 విటమిన్లు బాగా లభ్యమవుతాయి. ఫాస్ఫరస్, మెగ్నీషియం, సోడియం, క్యాల్షియం లాంటి ఖనిజ లవణాలు మెండుగా ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: పచ్చి పల్లీలు తీసుకుంటే గుండె పనితీరు మెరుగ్గా ఉంటుందని పరిశోధనలు తేల్చాయి. పొట్టలో పడే క్యాన్సర్‌ను కూడా ఇవి తప్పించగలవు. ఉడకబెట్టిన పల్లీలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో బాగా ఉపయోగపడతాయి. మెదడుకు రక్తప్రసరణ సక్రమంగా జరిగేందుకు కూడా ఇవి దోహదపడతాయి.


నువ్వులు


ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి ఉష్ణమండల ప్రదేశాల్లో నువ్వులు విరివిగా సాగవుతాయి. ప్రధానంగా నువ్వులు నూనె గింజలే అయినా, నువ్వులను తాలింపుల్లోనూ, మసాలాల్లోనూ, మిఠాయిలు, చిరుతిళ్లకు గార్నిషింగ్‌గానూ ఉపయోగిస్తుంటారు. నువ్వులను బెల్లంతో కలిపి తయారు చేసే నువ్వుండలు, నువ్వుల చెక్కీలు మన దేశంలో పాపులర్‌ చిరుతిళ్లు. నువ్వుల నూనెను ఊరగాయల తయారీలోనూ, వేపుడు వంటల్లోనూ ఉపయోగిస్తుంటారు.


పోషకాలు: నువ్వుల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: రక్తపోటును, మధుమేహాన్ని నియంత్రిస్తాయి. ఎముకలకు, దంతాలకు, కండరాలకు బలాన్నిస్తాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పును గణనీయంగా నివారిస్తాయి. చర్మానికి, జుట్టుకు నిగారింపునిస్తాయి.


జీలకర్ర


చిరకాలంగా వాడుకలో ఉన్న సుగంధద్రవ్యం జీలకర్ర. ఇది దాదాపు ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉంది. జీలకర్రలో తెల్ల జీలకర్ర, నల్ల జీలకర్ర అనే రెండు రకాలు ప్రధానంగా ఉంటాయి. రెండింటిలోనూ పోషక విలువలు దాదాపు ఒకే తీరులో ఉంటాయి. తాలింపులోనూ, మసాలాల్లోనూ జీలకర్రను ఉపయోగిస్తారు. అజీర్ణ సమస్యలకు చిట్కా వైద్యంగా కూడా జీలకర్రను ఉపయోగించడం మన దేశంలో అలవాటే.


పోషకాలు: జీలకర్రలో విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్, ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ వంటి పోషకాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: జీర్ణ సంబంధిత సమస్యలకు, చర్మ సంబంధిత సమస్యలకు, జలుబు దగ్గు వంటి సాధారణ సమస్యలకు జీలకర్ర విరుగుడుగా పనిచేస్తుంది. గర్భాశయ, గుండె సంబంధిత సమస్యలను నివారిస్తుంది. వాంతులు, వికారం వంటి సమస్యలకు కూడా ఆయుర్వేదంలో జీలకర్రను విరివిగా ఉపయోగిస్తారు.


మిరియాలు


చూడటానికి నల్లగా, రుచికి కారంగా ఉండే మిరియాల్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. స్పైసీ వంటకాల్లోనే కాదు, ఆయుర్వేద వైద్యంలోనూ మిరియాలను విరివిగా వాడతారు. భారత్‌ సహా పలు ఆసియా దేశాల్లోనూ, దక్షిణ అమెరికాలోనూ మిరియాలను విరివిగా సాగు చేస్తారు. వంటకాల్లోనే కాకుండా, ఆయుర్వేద ఔషధాల్లోనూ మిరియాలను ఉపయోగిస్తారు.


పోషకాలు: మిరియాల్లో పీచుపదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ వంటి పోషకాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలను నయం చేసే మిరియాలు.. శరీరంలోని కొవ్వును తగ్గించడంలోనూ, కండరాల నొప్పులను దూరం చేయడంలోనూ బాగా తోడ్పడతాయి. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేందుకు దోహదపడతాయి. జీర్ణకోశ సమస్యలకు, చర్మవ్యాధులకు, అలర్జీలకు, వాపులకు మిరియాలు మంచి విరుగుడుగా ఉపయోగపడతాయి.


అల్లం


ప్రాచీన కాలం నుంచే అల్లం వినియోగంలో ఉంది. భారత్‌తో పాటు దక్షిణాసియా దేశాల్లో అల్లం విరివిగా సాగవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అల్లాన్ని వంటల్లోను, సంప్రదాయ ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు.


పోషకాలు: అల్లంలో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: నోటి దుర్వాసన, అల్సర్, కీళ్ల నొప్పులు, అజీర్తి, దగ్గు, జలుబు, కఫం, మధుమేహం వంటి సమస్యలకు అల్లం చక్కని విరుగుడుగా ఉపయోగపడుతుంది. ఆకలిని పెంచుతుంది. అరుచిని పోగొడుతుంది.


దాల్చిన చెక్క


మసాలా దినుసుల్లో దాల్చిన చెక్కదే అగ్రస్థానం. ఆహార పదార్థాలకు చక్కని సుగంధం, నోరూరించే రుచితో పాటు అద్భుతమైన ఆరోగ్యాన్ని కూడా అందించే దాల్చిన చెక్కలో మంచి ఔషధగుణాలు ఉన్నాయి. దాల్చినచెక్కను వివిధ రూపాల్లో ప్రపంచవ్యాప్తంగా వినియోగిస్తారు. సంప్రదాయ వైద్యంలోనూ దాల్చిన చెక్కను వాడతారు.


పోషకాలు: దాల్చిన చెక్కలో పీచుపదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్య లాభాలు: దాల్చిన చెక్కలో క్యాన్సర్‌ కారకాలను తగ్గించే లక్షణాలు ఉన్నాయి. ఇక మధుమేహం, కీళ్లనొప్పులు, రుతుక్రమ సమస్యలు, అజీర్తి సమస్యలకు, అకాల వార్ధక్యానికి దాల్చిన చెక్క చక్కని ఔషధం అని ఆయుర్వేద నిపుణులు చెబుతారు.


ధనియాలు


ధనియాలు భారత దేశమంతటా విస్తారంగా సాగవుతాయి. పశ్చిమాసియా, దక్షిణ యూరోప్, దక్షిణ అమెరికా, ఆఫ్రికా తదితర ప్రాంతాల్లోనూ ధనియాలను సాగు చేస్తారు. మసాలా పొడుల్లో ధనియాలను విరివిగా ఉపయోగిస్తారు. ఇంటి వైద్యంలో భాగంగా ధనియాల కషాయం వాడతారు.


పోషకాలు: ధనియాల్లో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ పుష్కలంగా ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: జీర్ణాశయ సమస్యల నివారణకు ధనియాలు బాగా ఉపయోగపడతాయి. కిడ్నీ సమస్యలను కూడా దూరం చేస్తాయి. ధనియాల్లోని ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ బ్యాక్టీరియాను అరికట్టగలవు.


మెంతులు


రుచికి చేదుగా ఉండే మెంతులను వాడటానికి చాలామంది వెనుకాడతారు గానీ, వీటిలో మంచి ఔషధ విలువలు ఉన్నాయి. భారత్‌లో మెంతులను ఊరగాయల్లోనూ, పోపు దినుసుగానూ వాడతారు. రకరకాల మసాలా పొడుల్లోనూ ఉపయోగిస్తారు.


పోషకాలు: మెంతుల్లో పీచు పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్స్‌ వంటి పోషకాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: మెంతులు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండెజబ్బులను నివారిస్తాయి. చక్కెర వ్యాధిని అదుపు చేస్తాయి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి.


తానికాయ


తానికాయలు భారత్‌తో పాటు దక్షిణాసియాలోని పర్వత ప్రాంతాల్లో విరివిగా దొరుకుతాయి. ఆయుర్వేదంలోని త్రిఫలాల్లో ఇది కూడా ఒకటి. తానికాయను ఆయుర్వేద, టిబెటన్, చైనీస్, అరబిక్‌ సంప్రదాయ వైద్యాల్లో చిరకాలంగా వాడుతూ వస్తున్నారు.


పోషకాలు: పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: తానికాయలను దగ్గు, గొంతునొప్పి, ఉబ్బసం, జీర్ణాశయ సమస్యల చికిత్సలో విరివిగా వాడతారు. తానికాయలు అకాల వార్ధక్యాన్ని అరికడతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తానికాయ గింజల నుంచి తీసిన నూనెను వాపులు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనానికి ఉపయోగిస్తారు. కంటిచూపు మెరుగుదలకు, జుట్టు పెరుగుదలకు కూడా తానికాయ నూనె ఉపయోగపడుతుంది.


కరక్కాయ


కరక్కాయను వంటల్లో వాడకపోయినా, ఇంటింటా చిట్కా వైద్యాల్లో విరివిగా వాడతారు. కరక్కాయల్లో చాలా రకాలు ఉన్నాయి. భారత్, నేపాల్, భూటాన్, శ్రీలంక, చైనా, వియత్నాం, మలేసియా తదితర ఆసియా దేశాల్లోని అటవీ ప్రాంతాల్లో ఇవి విరివిగా లభిస్తాయి. ఆయుర్వేద వైద్యంలోను, వివిధ దేశాల సంప్రదాయ వైద్యంలోనూ కరక్కాయలను ఉపయోగిస్తారు.


పోషకాలు: పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: ఆయుర్వేదంలోను, టిబెటన్‌ సంప్రదాయ వైద్యంలోనూ కరక్కాయను సర్వరోగ నివారిణిగా పరిగణిస్తారు. దగ్గు, ఉబ్బసం వంటి బాధల నుంచి ఉపశమనానికి కరక్కాయను అరగదీసి, తేనెలో కలిపి వాడతారు. ఉసిరికాయ, తానికాయలతో సమపాళ్లలో కరక్కాయలను కలిపి తయారు చేసే త్రిఫల చూర్ణం జీర్ణకోశ సమస్యలకు, మలబద్ధకానికి, మూలవ్యాధికి చక్కని ఔషధంగా పనిచేస్తుంది.


గంధ కచ్చూరాలు


అల్లంజాతికి చెందిన మొక్క నుంచి గంధ కచ్చూరాలు లభిస్తాయి. మొక్క దుంపలను వేరుచేసి, ఎండబెట్టి ఉపయోగిస్తారు. భారత్, చైనా సహా ఈ మొక్కలు దక్షిణాసియా అంతటా కనిపిస్తాయి. వంటింటి మూలికగా పనికొచ్చే గంధ కచ్చూరాలను మన దేశంలో వంటల్లో వాడటం అరుదు. అయితే, ఇండోనేసియా, చైనాలలో వీటిని వంటకాల తయారీలోనూ ఉపయోగిస్తారు.


పోషకాలు: పిండి పదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలకు గంధ కచ్చూరాల కషాయం విరుగుడుగా పనిచేస్తుంది. కచ్చూరాలు చర్మ సౌందర్యాన్ని కాపాడుతాయి. అజీర్తి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆకలి పుట్టిస్తుంది. మూత్రాశయ సమస్యలను అరికడుతుంది.


బావంచాలు


బావంచా మొక్కలు దక్షిణ ఆసియా అంతటా అటవీ ప్రాంతాల్లో కనిపిస్తాయి. బావంచా గింజలను ఆయుర్వేద, సిద్ధ వైద్యాల్లోను, టిబెటన్, చైనీస్‌ సంప్రదాయ వైద్యాల్లోనూ విరివిగా ఉపయోగిస్తారు. మన దేశంలో గృహ వైద్యంలో కూడా బావంచాలను రకరకాల చిట్కా వైద్యాలకు ఉపయోగిస్తారు.


పోషకాలు: బావంచాల్లో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: నొప్పి నివారణ ఔషధంగా బావంచాలు బాగా ఉపయోగపడతాయి. చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. జుట్టు రాలడాన్ని అరికడతాయి. కిడ్నీ సమస్యలను నివారిస్తాయి. చైనీస్‌ వైద్యంలో బొల్లి వంటి మొండి చర్మ వ్యాధులను నయం చేయడానికి బావంచాలను వాడతారు.


పిప్పళ్లు


మిరియాల రంగులో కాస్త పొడవుగా కనిపించే పిప్పళ్లను వంటకాల్లోను, వివిధ దేశాల సంప్రదాయ వైద్యంలోనూ విరివిగా వాడతారు. దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో పిప్పళ్లు విరివిగా లభిస్తాయి. పిప్పళ్లలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి.


పోషకాలు: పిప్పళ్లలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: పిప్పళ్లలో ఉండే ‘పైపర్‌ లాంగుమిన్‌’ (పీఎల్‌) అనే రసాయనం కొన్ని రకాల క్యాన్సర్లను, మెదడులో ఏర్పడే కణితులను సమర్థంగా నిరోధించగలదని ఆధునిక పరిశోధనల్లో తేలింది. సంప్రదాయ వైద్యంలో పిప్పళ్లను ప్రధానంగా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, కండరాల నొప్పుల వంటి సమస్యల నుంచి ఉపశమనం కోసం వాడతారు.


వాము


రుచికి కాస్త ఘాటుగా ఉండే వాము వంటకాల్లోనూ, గృహ వైద్యంలోనూ చిరకాలంగా ఉపయోగంలో ఉంది. భారత్‌ సహా ఉష్ణమండల ప్రాంతాల్లో వామును సాగు చేస్తున్నారు. వాము సాగులో భారతదేశానిదే అగ్రస్థానం. వాము ఆకులను ఆకుకూరగా కూడా ఉపయోగిస్తారు. వాములో మంచి ఔషధ గుణాలు ఉన్నాయి.


పోషకాలు: వాములో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, ఎసెన్షియల్‌ ఆయిల్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: వాము జీర్ణకోశ సమస్యలను నివారిస్తుంది. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, వికారం, నోటి అరుచి వంటి బాధల నుంచి సత్వర ఉపశమనం కలిగిస్తుంది. జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సాధారణ బాధలకు కూడా విరుగుడుగా పనిచేస్తుంది. జుట్టు తెల్లబడటాన్ని అరికడుతుంది.


ఆవాలు


దాదాపు నల్లగా ముదురు రంగులోని ఆవాలను మన దేశంలో ఎక్కువగా వాడతారు. పసుపు, తెలుపు రంగుల్లో కూడా ఇవి లభిస్తాయి. మన దేశంలో పోపు దినుసుగా ఆవాలను విరివిగా ఉపయోగిస్తారు. ఆవకాయ తయారీలోనూ వాడతారు. పాశ్చాత్య దేశాల్లో ఆవాల ముద్దను వంటకాల్లో ఉపయోగిస్తారు. పశ్చిమబెంగాల్‌ ప్రాంతంలో ఆవ ఆకులను ఆకుకూరగా ఉపయోగిస్తారు.


పోషకాలు: ఆవాల్లో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇందులో కొవ్వులు ఎక్కువగా ఉండటంతో ఆవాల నుంచి ఆవనూనెను తీసి వంటకాల్లో ఉపయోగిస్తారు.


ఆరోగ్య లాభాలు: తరచుగా అయ్యే గర్భస్రావాలను అరికట్టడంలో ఆవాలు బాగా ఉపయోగపడతాయి. గర్భిణిలు వీటిని తీసుకోవడం వల్ల.. కడుపులోని శిశువుకి హానిచేసే సూక్ష్మక్రిములు నాశనం అవుతాయి. చర్మవ్యాధులతో బాధపడేవారు ఆవ నూనె రాసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.


లవంగాలు


లవంగాలు ఆసియా, ఆఫ్రికా వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో విస్తారంగా సాగవుతాయి. చిరకాలంగా లవంగాలను వంటకాలతో పాటు సంప్రదాయ ఔషధాల్లోనూ ఉపయోగిస్తున్నారు. రుచికి కారంగా ఉండే లవంగాలలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి.


పోషకాలు: లవంగాల్లో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, ఎసెన్షియల్‌ ఆయిల్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌ వంటి పోషకాలు ఉంటాయి . ఆరోగ్య లాభాలు: లవంగాలు పంటినొప్పులను తగ్గిస్తాయి. వికారాన్ని, నోటి అరుచిని పోగొడతాయి. ఆకలి పుట్టిస్తాయి. జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. కాలేయానికి రక్షణనిస్తాయి. తలనొప్పి, జలుబు, దగ్గు వంటి సాధారణ బాధల నుంచి సత్వర ఉపశమనం కలిగిస్తాయి.


పసుపు


భారతీయ సంస్కృతిలో పసుపుకి విశిష్టమైన స్థానం ఉంది. పసుపును శుభప్రదంగా పరిగణిస్తారు. పూజ పునస్కారాల్లోనే కాదు, వంటకాల్లో కూడా పసుపును విరివిగా ఉపయోగిస్తారు. ఆయుర్వేద, సిద్ధ, యునానీ, చైనీస్‌ సంప్రదాయ ఔషధాల్లోనూ పసుపును వాడతారు.పోషకాలు: పసుపులో పిండి పదార్థాలు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: పసుపును రోజువారీ ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణకోశ సమస్యలు దూరమవుతాయి. జలుబు, దగ్గు వంటి సాధారణ సమస్యలకు, చర్మ వ్యాధులకు పసుపు మంచి విరుగుడుగా పనిచేస్తుంది. పసుపులో క్యాన్సర్‌ నిరోధక లక్షణాలు ఉన్నట్లు ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి.


యాలకులు


మిఠాయిలకు, మసాలా వంటకాలకు రుచిని, సువాసనను అందించే యాలకుల్లో ఎంతో మేలు చేసే పోషకాలు, అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. భారత ఉపఖండంతో పాటు ఇతర ఉష్ణమండల ప్రాంతాల్లోనూ యాలకులను సాగు చేస్తున్నారు.పోషకాలు: యాలకుల్లో టెర్పినైస్, లిమొనెస్, టెర్పినోల్‌ వంటి ఔషధ గుణాలు గల రసాయనాలతో పాటు పిండి పదార్థాలు, ప్రొటీన్స్, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్స్, ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ ఉంటాయి.ఆరోగ్య లాభాలు: యాలకులు నోటి దుసనను పోగొడతాయి. ఒత్తిడిని తగ్గిస్తాయి. రక్తపోటును అదుపు చేస్తాయి. గుండెజబ్బులను నిరోధిస్తాయి. వికారాన్ని, నోటి అరుచిని పోగొడతాయి.


వెల్లుల్లి


వెల్లుల్లి భారత్‌తో పాటు దాదాపు ఆసియా అంతటా, ఈజిప్టు వంటి ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో, దక్షిణ అమెరికాలో సాగవుతోంది. ప్రాచీనకాలం నుంచే వెల్లుల్లిని ఔషధంగా వినియోగించే వారు. వంటకాలకు అదనపు రుచి, వాసన కోసం వెల్లుల్లిని అన్ని ప్రాంతాల్లోనూ వినియోగిస్తారు.


పోషకాలు: వెల్లుల్లిలో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్య లాభాలు: వెల్లుల్లిలోని యాంటీబ్యాక్టీరియల్‌ లక్షణాలు పలు వ్యాధులను అరికడతాయి. క్యాన్సర్‌ కణాల వ్యాప్తిని నిరోధిస్తాయి. జలుబు, దగ్గు వంటి సాధారణ రుగ్మతలను వెల్లుల్లి సమర్థంగా నయం చేస్తుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది.


పాలు


అందరూ పుట్టీపుట్టగానే తమ ఆకలిని అమ్మపాలతోనే తీర్చుకుంటారు. అలాంటి పాలలో పోషకాలు అన్నీ ఇన్నీ కావు. అలాగే ఆవు పాలు, గేదె పాలు మనిషి ఆరోగ్యానికి ఎంత అవసరమో కూడా మనకు తెలుసు. ప్రస్తుతం డాక్టర్లు కూడా ప్రతి ఒక్కరు రోజూ పాలు తాగాలని సూచిస్తున్నారు.


పోషకాలు: పాలలో కార్బోహైడ్రేట్లు, విటమిన్‌ ఎ, బి2, బి12, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఆరోగ్య లాభాలు: పాలలో ఉండే క్యాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. కండరాలకు బలం కలుగుతుంది. రోజూ కనీసం గ్లాసు పాలు తాగడం వల్ల తక్షణ శక్తి లభించడమే కాకుండా, రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.


జున్ను


ఆవు లేదా గేదె దూడను ప్రసవించాక, మొదటి కొన్ని రోజులు ఇచ్చే పాలను జున్నుపాలు అంటారు. జున్నుపాలను మరిగిస్తున్నప్పుడు చక్కెర లేదా బెల్లం వేసి తయారు చేసే జున్నును పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు.


పోషకాలు: జున్ను లో ప్రొటీన్లు, విటమిన్‌–ఎ, విటమిన్‌–డి, విటమిన్‌–ఇ వంటి విటమిన్లు, క్యాల్షియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.ఆరోగ్య లాభాలు: మామూలు పాలలో కంటే జున్ను పాలలో పోషకాలు అధిక మోతాదులో ఉంటాయి. జున్ను రోగనిరోధక శక్తి, జీర్ణశక్తిని పెంచుతుంది. కండరాల పెరుగుదలకు, ఎముకల దారుఢ్యానికి జున్ను చాలా మంచిది.


పనీర్‌


పనీర్‌ను ఎక్కువగా దక్షిణ ఆసియా దేశాలలోనే ఉపయోగిస్తారు. దీన్ని ఎక్కువగా కూరల్లో, చిరుతిళ్లు, మిఠాయిల తయారీలో వాడతారు. ముఖ్యంగా ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లలో బాగా వాడతారు. పెరుగు అలవాటు లేని వారు పనీర్‌ను తమ ఆహారంలో తీసుకోవడం మంచిది.


పోషకాలు: పనీర్‌లో ప్రొటీన్లు, స్వల్పంగా కొవ్వులు, విటమిన్‌ ఎ, విటమిన్‌–డి, విటమిన్‌–ఇ, క్యాల్షియం, సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. ఆరోగ్య లాభాలు: పనీర్‌ ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాలకు, ఎముకలకు బలం ఇస్తుంది. ఉదర క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్‌ ముప్పును తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.


నెయ్యి


వెన్నను మరిగిస్తే నెయ్యి తయారవుతుంది. నెయ్యి శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది. అలాగే దీన్ని వివిధ రకాల వంటకాల్లో లేదా నేరుగానూ వాడతారు. దాదాపు అన్ని రకాల స్వీట్స్‌లో నెయ్యిని ఉపయోగిస్తారు.


పోషకాలు: నెయ్యిలో కూడా కొవ్వులు, ప్రొటీన్లు, విటమిన్‌–ఎ, విటమిన్‌–ఇ వంటి విటమిన్లు, క్యాల్షియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: నెయ్యి తక్షణ శక్తినిస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. అరుచిని పోగొడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. అకాల వార్ధక్యాన్ని నివారిస్తుంది. నెయ్యిలోని ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.


వెన్న


ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాక పాల నుంచి నేరుగా యంత్రాల ద్వారా వెన్నతీస్తున్నారు. ఇదివరకటి కాలంలో మజ్జిగ చిలికి వెన్న తీసేవారు. వెన్నను చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు. వెన్నను మిఠాయిలు, చిరుతిళ్ల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు.


పోషకాలు: కొవ్వులు, ప్రొటీన్లు, విటమిన్‌–ఎ, విటమిన్‌–డి, విటమిన్‌–ఇ వంటి విటమిన్లు, క్యాల్షియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: వెన్నలోని కొవ్వు, విటమిన్లు చిన్నారుల మెదడు పనితీరును, జీర్ణశక్తిని పెంచుతాయి. కంటిచూపును మెరుగుపరుస్తాయి. కండరాలు, ఎముకల ఎదుగుదలకు దోహదపడతాయి. శారీరక శ్రమకు కావలసిన శక్తినిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.


పెరుగు


పాలతో తయారయ్యే ఈ పెరుగును అన్ని దేశాల్లోనూ ఉపయోగిస్తారు. తెలుగు వారికి ఈ పెరుగు మరీ ముఖ్యం. ఎన్ని రకాల కూరలతో తిన్నా, చివరికి పెరుగు లేకపోతే పెద్ద వెలితనే చెప్పాలి. అలాంటి పెరుగుతోనూ ఎన్నో లాభాలున్నాయి. కూరల్లో వేయడానికి టమాటాలు లేనప్పుడు పుల్లటి పెరుగును వేసుకుంటే, వంట రుచిగా ఉంటుంది.


పోషకాలు: పెరుగులో కూడా పాలలో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు జీర్ణకోశానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది.


ఆరోగ్య లాభాలు: పెరుగు తినడం వల్ల ఉదర సంబంధ ుస్యలు తగ్గుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కండరాలకు, ఎముకలకు దారుఢ్యం పెరుగుతుంది. అలసట, నిద్రలేమి వంటి సమస్యలు తొలగుతాయి.


కోడిమాంసం (చికెన్‌)


ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రధాన మాంసాహార పదార్థం. ఇందులో కొవ్వుశాతం చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల డాక్టర్లు కూడా దీన్ని తినడం ఆరోగ్యానికి మంచిదనే సూచిస్తుంటారు. కోడిమాంసం మంచి పౌష్టికాహారం. మాంసాహారం తినే వాళ్లలో చాలామంది కోడిమాంసాన్ని బాగా ఇష్టపడతారు.


పోషకాలు: కోడి మాంసంలో ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్‌–ఎ, బి5 వంటి విటమిన్లు, ఐరన్, సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: కోడిమాంసంలోని ప్రొటీన్లు కండరాల పెరుగుదలకు తోడ్పడతాయి. బరువు తగ్గాలని డైట్‌ పాటించే వారికి చికెన్‌ మంచి ఫలితాలను ఇస్తుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.


వేటమాంసం (మటన్‌)


మేక, గొర్రె మాంసాలను వేటమాంసంగా పరిగణిస్తారు. మేక మాంసాన్ని తక్కువ వేడిలో వండితే ఆరోగ్యానికి మంచిది. మేక, గొర్రెల మెదడు, కాలేయాన్ని కూడా తింటారు. వాటి తల మాంసాన్ని చాలామంది ఇష్టపడతారు.


పోషకాలు: ఇందులో ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్‌– బి6, బి12 వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: వేటమాంసం రక్తహీనతను అరికడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గర్భిణీ మహిళలు వేటమాంసాన్ని తింటే రక్తహీనత బారిన పడకుండా ఉంటారు. వేటమాంసం ఎముకలకు, కండరాలకు బలాన్ని ఇస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది.


పీతలు


పీతలు ప్రపంచవ్యాప్తంగా ప్రధానంగా సముద్రజలాల్లో నివసిస్తాయి. కొన్ని రకాలు మంచినీటిలోనూ ఉంటాయి. వీటిని అన్ని దేశాల్లోనూ తింటారు. పీతలతో రకరకాల వంటకాలు చేసుకుంటారు.


పోషకాలు: పీతల్లో ప్రొటీన్లు, కొవ్వులు, ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్‌–సి, బి6, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: మధుమేహ రోగుల ఆరోగ్యానికి పీతలు మేలు చేస్తాయి. దంతాలు, ఎముకలకు దారుఢ్యాన్నిస్తాయి. నాడీ వ్యవస్థకు, గుండెకు బలాన్నిస్తాయి. కంటిచూపును మెరుగుపరుస్తాయి.


చేపలు


ప్రపంచవ్యాప్తంగా చేపలను విరివిగా తింటారు. వీటితో రకరకాల వంటకాలు తయారు చేసుకుంటారు. మన దేశంలో చేపల పులుసు, చేపల వేపుడు లాంటివి చేస్తుంటారు. చేపల్లో సముద్రపు చేపలు, మంచినీటి చేపలు పలు రకాలు ఉంటాయి. చేపలను ఎండబెట్టి నిల్వ చేసుకుని కూడా వండుకుంటారు.


పోషకాలు: చేపల్లో ప్రొటీన్లు, ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్‌–ఎ, విటమిన్‌–డి, విటమిన్‌–ఇ, విటమిన్‌–కె వంటి విటమిన్లు, ఫాస్ఫరస్, సెలీనియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: చేపల్లో లభించే ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్స్‌ గుండె జబ్బుల నుంచి కాపాడతాయి. చేపలు మెదడుకు మేలు చేస్తాయి. పునరుత్పత్తి అవయవాల ఆరోగ్యానికి కూడా చేపలు ఉపయోగపడతాయి. మధుమేహంతో బాధపడే వారు తరచు చేపలను తినడం ఎంతో మంచిది.


కోడి గుడ్డు


రోజుకో ఉడికించిన గుడ్డును తినాలంటారు డాక్టర్లు. మనకు కావలసిన అన్ని రకాల పోషకాలు ఈ గుడ్డులో ఉండటం విశేషం. ఉడికించిన గుడ్డును తినడం ఇష్టంలేని వారు బ్రెడ్‌ ఆమ్లేట్‌ లేదా గుడ్డుతో చేసే ఏ వంటకాలు తిన్నా, అన్ని పోషకాలు సమంగానే అందుతాయి.


పోషకాలు: గుడ్డులో ప్రొటీన్లు, విటమిన్‌ ఎ, విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, బి9, బి12, విటమిన్‌–డి, విటమిన్‌–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: గుడ్డు కంటి చూపును ఆరోగ్యంగా ఉంచుతుంది. కండరాల పెరుగుదలకు దోహదపడుతుంది. గుండెజబ్బులను దూరంగా ఉంచుతుంది. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. స్థూలకాయం, మధుమేహం వంటి సమస్యలను నివారిస్తుంది.


రొయ్యలు


ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ రకరకాల రొయ్యలను ఆహారంగా తీసుకుంటారు. అన్ని రకాల రొయ్యల్లోనూ దాదాపు అవే పోషకాలు ఉంటాయి. వీటిని వివిధ రకాలుగా వండుతారు. సముద్రంలోని రొయ్యలే కాకుండా... వీటిని ప్రత్యేకమైన చెరువుల్లోనూ పెంచుతారు. పచ్చి రొయ్యలతో పాటు ఎండు రొయ్యలను కూడా తింటారు.


పోషకాలు: రొయ్యల్లో ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు ఉంటాయి. సోడియం, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.


ఆరోగ్య లాభాలు: రొయ్యలు క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. దంతాలకు, ఎముకలకు మేలు చేస్తాయి. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కళ్లకు, చర్మానికి కూడా మేలు చేస్తాయి.


కంద


కంద భూమిలోపల పెరిగే ఒక రకం దుంప. పూర్వం కంద మూలాలను ప్రధాన ఆహారంగా తీసుకునే వారని తేల్చారు. కంద గడ్డ అన్న పేరుతో దీన్ని ఎక్కువగా పిలుస్తూంటారు. భారతదేశమంతటా కంద గడ్డ సాగు విస్తరించి ఉంది. ఇందులో సుమారు 14 జాతులు ఉన్నాయి. వీటిని ఎక్కువగా కూరల కోసం వాడుతున్నారు. అదేవిధంగా చిప్స్‌ కూడా తయారుచేస్తున్నారు.


పోషకాలు: కందలో పిండి, పీచు పదార్థాలు ఎక్కువ. విటమిన్‌ సి, కె ఎక్కువగా లభించే విటమిన్లు. పొటాషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం, మెగ్నీషియం లాంటి ఖనిజ లవణాలు కందలో లభిస్తున్నాయి.


ఆరోగ్య లాభాలు: కందలో విటమిన్‌ సి ఎక్కువ. జ్వరం, ఫ్లూలతో పాటు ఇన్ఫెక్షన్లకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. తక్షణ శక్తిని ఇవ్వడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంపొందించడంలోనూ కంద బాగా ఉపయోగపడుతుంది. జుట్టు బాగా పెరగడానికి ఇది ఉపయోగపడుతుంది.


బంగాళాదుంప


బంగాళాదుంప అనేది దుంప జాతికి చెందిన ఒక రకం కూరగాయ. 17వ శతాబ్దం వరకూ దక్షిణ అమెరికా మినహా ప్రపంచదేశాలంతటికీ బంగాళాదుంప పరిచయం లేదు. భారతదేశానికి బ్రిటిష్‌ వారు బంగాళాదుంపను తీసుకొచ్చారు. ఆలుగడ్డ అని, ఉర్లగడ్డ అని రకరకాల పేర్లతో బంగాళాదుంపను పిలుస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తవుతున్న ఆహార పంటల్లో వరి, గోధుమ, మొక్కజొన్న తరువాత బంగాళాదుంప నాలుగో స్థానంలో ఉంది. బంగాళాదుంపలతో వంటల్లో ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఫ్రై, కూరలు, చిప్స్‌ ఇందులో కొన్ని. డయాబెటిక్‌ పేషెంట్స్‌ బంగాళాదుంపను తక్కువగా తీసుకుంటే మంచిది.


పోషకాలు: బంగాళాదుంపలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు ఎక్కువ. విటమిన్‌ సి, బి6, కె లాంటి విటమిన్లు బంగాళాదుంపలో ఎక్కువగా లభిస్తున్నాయి. పొటాషియం ఇందులో ఎక్కువగా లభించే ఖనిజ లవణం. క్యాల్షియం, ఫాస్ఫరస్‌ లాంటివి కూడా తగు మోతాదుల్లో లభిస్తాయి.


ఆరోగ్య లాభాలు: బంగాళాదుంపలో సమృద్ధిగా లభించే విటమిన్‌ సి, పొటాషియం లాంటి పోషక పదార్థాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో బాగా తోడ్పడతాయి. రక్తపోటును నియంత్రించడలో, గుండె ఆరోగ్యానికి, మెదడు పనితీరు చురుగ్గా ఉండటానికి కూడా బంగాళాదుంప ఉపయోగప డుతుంది. క్రీడాకారులు తక్షణ శక్తి కోసం బంగాళాదుంపను తమ డైట్‌లో చేర్చుకుంటూ ఉంటారు.


బీట్‌రూట్‌


యూరప్‌లో పుట్టిన బీటుదుంప ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉంది. ఆకృతిని బట్టి ఇందులో చాలా రకాలున్నాయి. ఎరుపు రంగులో ఉండే ఈ దుంపను కూరగాయగా, జ్యూస్‌గా ఎక్కువగా వాడుతూ వస్తున్నారు. బీట్‌ దుంపలు కొంచెం తీపి, కొంచెం వగరు రుచిని కలిగి ఉంటాయి.


పోషకాలు: బీట్‌రూట్‌లో పిండి, చక్కెర పదార్థాలు ఎక్కువ. విటమిన్‌ ఎ, సి ఇందులో ఎక్కువగా లభించే విటమిన్లు. పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, క్యాల్షియం లాంటివి బీట్‌రూట్‌లో ఎక్కువగా లభించే ఖనిజ లవణాలు.


ఆరోగ్య లాభాలు: కాలేయం పనితీరు బాగుండటానికి బీట్‌రూట్‌ బాగా ఉపయోగపడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉండటానికి బాగా తోడ్పడుతుంది. ఒంట్లో రక్తం తక్కువ ఉన్నవారు బీట్‌రూట్‌ తీసుకుంటే ఫలితం కనిపిస్తుంది. కొలెస్ట్రాల్‌ను, రక్తపోటును తగ్గించడంలో కూడా బీట్‌రూట్‌ బాగా ఉపయోగపడుతుంది.


కర్రపెండలం


కర్ర పెండలం చేదుగా, తియ్యగా ఉండే రకం దుంపలు. దక్షిణ అమెరికాలో పుట్టిన ఈ దుంపలు ప్రస్తుతం ప్రపంచమంతటా విస్తరించి ఉన్నాయి. ముఖ్యంగా అమెరికాలో ఏటా ఒక పంటగా కర్రపెండలంను సాగు చేస్తూ వస్తున్నారు. కర్రపెండలంతో స్వీట్లు, కూరలు చాలానే చేస్తున్నారు.పోషకాలు: కర్రపెండలంలో పిండి, పీచు పదార్థాలు ఎక్కువ. చక్కెర పదార్థాలు కూడా తగు మోతాదుల్లో లభిస్తాయి.


కర్రపెండలంలో విటమిన్‌ సి ఎక్కువ మోతాదులోనే లభిస్తుంది. పొటాషియం, జింక్, క్యాల్షియం లాంటి ఖనిజ లవణాలు కర్రపెండలంలో లభిస్తున్నాయి. ఆరోగ్య లాభాలు: తక్షణశక్తిని అందించడంలో కర్రపెండలం బాగా ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఎముకలు, దంతాలు బలంగా ఉండటానికి, మలబద్ధకం తగ్గడానికి, బరువు తగ్గడానికి, రక్తపోటును నియంత్రించడానికి కర్రపెండలం బాగా ఉపయోగపడుతుంది.


చామ దుంప


ఆసియా దేశాల్లోనే పుట్టిన చామ దుంప ప్రస్తుతం ప్రపంచమంతటా విస్తరించి ఉంది. భారతదేశంలో పెద్ద ఎత్తునే చామను సాగు చేస్తున్నారు. చామ మొక్కకు కాండం అంటూ ఉండదు. చిత్తడి నేలల్లో, కాలువల వెంట చామ ఎక్కువగా పండుతుంది. గుత్తులు గుత్తులుగా చామ దుంపలు పెరుగుతాయి. చామను నేరుగా తింటే నోరు పాడవుతుంది. ఉడకబెట్టి, కూరలుగా వండి చామను వాడుతూంటారు.


పోషకాలు: చామ దుంపలో పిండి, పీచు పదార్థాలు ఎక్కువ. విటమిన్‌ సి, బి6, ఇ ఎక్కువగా లభించే విటమిన్లు. కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్‌ లాంటి ఖనిజ లవణాలు చామ దుంపల్లో లభిస్తున్నాయి.


ఆరోగ్య లాభాలు: క్రీడాకారులకు తక్షణం శక్తినిచ్చే ఆహారంగా చామదుంపను చెప్పుకోవచ్చు. తక్కువ క్యాలరీ ఆహారం అవ్వడం వల్ల చామ దుంపలను బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్‌లో చేర్చుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అజీర్తి, హైపర్‌ టెన్షన్, కండరాలు బలహీనతకు ఇది మంచి ఔషధంగా పని చేస్తుంది.


క్యారట్‌


కాస్త తియ్యటి రుచి ఉండి నేరుగా తీసుకోగలిగే దుంప క్యారట్‌. క్యారట్‌ను పండ్ల జాబితాలోనే కలిపేయడం ఎక్కువగా చూస్తూంటాం. నారింజ రంగులో ఉండే క్యారట్‌ యూరప్‌ దేశాలలో పుట్టి ప్రస్తుతం ప్రపంచమంతటా విస్తరించింది. క్యారట్‌ను కూరల్లో, స్వీట్స్‌లో, రకరకాల వంటకాల్లో వాడుతూ వస్తున్నారు.


పోషకాలు: క్యారట్‌లో పిండి, పీచు పదార్థాలతో పాటు చక్కెర కూడా ఎక్కువే! ఫోలేట్, నియాసిన్, విటమిన్‌ ఎ, సి ఇందులో ఎక్కువగా లభించే విటమిన్లు. సోడియం, ఫాస్ఫరస్, క్యాల్షియం లాంటివి క్యారట్‌లో లభించే ఖనిజ లవణాలు.


ఆరోగ్య లాభాలు: ఉడకబెట్టి తినే క్యారట్‌తో క్యాన్సర్‌ను నిరోధించవచ్చు. కంటిచూపు మెరుగవ్వడానికి క్యారట్‌ అద్భుతంగా పనిచేస్తుంది. పక్షవాతం, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి కూడా ఇది తోడ్పడుతుంది. మగవారిలో వీర్య కణాల కదలికను వేగవంతం చేయడానికి క్యారట్‌ ఉపయోగపడుతుంది.


చిలకడ దుంప


అన్ని వేళల్లో, చవక ధరల్లో లభించే దుంపల్లో చిలకడ దుంపను చెప్పుకోవచ్చు. తియ్యటి రుచి కలిగి ఉండే ఇవి రకరకాల రంగుల్లో లభ్యమవుతూ ఉంటాయి. అమెరికాలో చిలకడ దుంప మూలాలు ఉన్నాయి. ప్రపంచమంతటా వీటి సాగు విస్తరించి ఉంది. వీటితో చాలారకాల వంటలు చేస్తూ వస్తున్నారు.


పోషకాలు: చిలకడ దుంపలో పిండి, చక్కెర పదార్థాలు ఎక్కువ. విటమిన్‌ ఎ, సి, బి6, డి ఇందులో బాగా లభించే విటమిన్లు. పొటాషియం చిలకడ దుంపల్లో ఎక్కువగా లభించే ఖనిజ లవణం. ఇవి కాక క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ లాంటివి కూడా బాగానే లభిస్తున్నాయి. ఆరోగ్య లాభాలు: అల్సర్‌ను తగ్గించడానికి చిలకడ దుంప బాగా ఉపయోగపడుతుంది. డి విటమిన్‌ లోపం ఉన్నవారు చిలకడ దుంపను డైట్‌లో చేర్చుకోవచ్చు. రోగనిరోధక శక్తిని పెంచడంలో, జలుబుతో సహా కొన్ని ఫ్లూలను నిరోధించడానికి కూడా చిలకడ దుంప పనికొస్తుంది.


ఆహారం... అపోహలు... వాస్తవాలు


అపోహ:


వండిన క్యారట్ల కంటే పచ్చి క్యారట్లు తినడం మంచిది.వాస్తవం: నిజానికి పచ్చి క్యారట్ల కంటే వండిన క్యారట్లు తినడమే మంచిది. క్యారట్లను వండితేనే పోషక విలువలు మరింత పెరుగుతాయి. వండే ప్రక్రియలో క్యారట్ల కణకవచం లోపల ఉన్న బీటా కెరోటిన్‌ అనే కీలకమైన పోషకం బయటపడుతుంది. బీటా కెరోటిన్‌ కంటి ఆరోగ్యానికి, చర్మం, జుట్టు ఆరోగ్యానికి మంచిదనే సంగతి తెలిసిందే.


అపోహ:


పచ్చసొన వల్ల ఒంట్లో కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది వాస్తవం: కోడిగుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్‌ ఉంటుందనే మాట నిజమే అయినా, శరీరంలోని రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతం పెరగడానికి ఇదేమీ కారణం కాదు. గుడ్లు పచ్చసొనతో పాటు తినడానికి, ఒంట్లో కొలెస్ట్రాల్‌ పెరగడానికి ఎలాంటి సంబంధం లేదని ఇటీవలి అధ్యయనాలు తేల్చాయి. పోషకాలు సమృద్ధిగా పొందాలంటే గుడ్డును పచ్చసొనతో పాటే తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.


అపోహ:


బంగాళాదుంపలు ఎక్కువగా తింటే వాతం వస్తుంది.వాస్తవం: బంగాళాదుంపలు అతిగా తింటే వాతం వస్తుందనేందుకు ఇంతవరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు. బంగాళాదుంపల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉండటంతో అతిగా తింటే స్థూలకాయం వచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే, బంగాళాదుంపల్లో ఉత్త పిండి పదార్థాలు మాత్రమే కాకుండా, శరీరానికి అవసరమైన అనేక పోషకాలు ఉంటాయి. బంగాళా దుంపల్లోని ఫైటో కెమికల్స్‌ రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందువల్ల సమతుల ఆహారంలో బంగాళాదుంపలను కూడా భాగం చేసుకోవడమే మేలు.


అపోహ:


నెయ్యి తింటే ఒంట్లో కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది వాస్తవం: ఇది కూడా పచ్చసొన పట్ల ఉన్న అపోహలాంటిదే. నిజానికి పొద్దు తిరుగుడు నూనె, పత్తిగింజల నూనె వంటి వాటితో పోలిస్తే నెయ్యిలోనే మేలు చేసే కొవ్వులు అధికంగా ఉన్నట్లు ఆధునిక పరిశోధనల్లో తేలింది. నెయ్యి వాడటమే శ్రేష్టమని ఆయుర్వేదం చాలాకాలంగా చెబుతూ వస్తున్నా, ఇటీవలి కాలంలో మాత్రం నెయ్యి తింటే ఒంట్లో కొవ్వు పెరిగి, గుండెజబ్బులు వస్తాయనే అపోహ ప్రచారంలోకి వచ్చింది.


అపోహ:


పిండిపదార్థాలు తింటే స్థూలకాయం వస్తుంది వాస్తవం: పిండి పదార్థాల వల్ల స్థూలకాయం వస్తుందనేది ఏమాత్రం వాస్తవం కాదు. సమతుల ఆహారంలో పిండి పదార్థాల పాత్ర తిరుగులేనిది. రోజువారీ చేసుకునే పనులకు తగిన శక్తినిచ్చేవి పిండి పదార్థాలే. అందువల్ల మన రోజువారీ ఆహారంలో సింహభాగం ఉండాల్సినవి పిండి పదార్థాలే. నిజానికి స్థూలకాయానికి కారణం పిండి పదార్థాలు కాదు. తీసుకున్న ఆహారానికి తగినంతగా శారీరక శ్రమ లేకపోవడం వల్లనే ఎవరికైనా స్థూలకాయం వస్తుంది. అరుదుగా కొన్ని సందర్భాల్లో థైరాయిడ్‌ వంటి హార్మోన్‌ సమస్యలు, జన్యు సమస్యలు కూడా స్థూలకాయానికి కారణమవుతాయి.


అపోహ:


తీపి పదార్థాలు తగ్గిస్తే చక్కెర జబ్బు రాదు వాస్తవం: తీపి పదర్థాలకు, చక్కెర జబ్బుకు నేరుగా ఎలాంటి సంబంధం లేదు. పాన్‌క్రియాస్‌ పనితీరు మందగించి ఇన్సులిన్‌ ఉత్పత్తి తగ్గినప్పుడు చక్కెర జబ్బు వస్తుంది. జన్యు కారణాలు, స్థూలకాయం వంటి నానా సమస్యలు చక్కెర జబ్బుకు కారణమవుతాయి. చక్కెర జబ్బు లేనప్పుడు తీపి పదార్థాలను భేషుగ్గా తినొచ్చు. తీపి పదార్థాలను తగ్గించినంత మాత్రాన లేదా పూర్తిగా మానేసినంత మాత్రాన చక్కెర జబ్బు రాకుండా పోదు. అయితే, చక్కెర జబ్బు సోకిన తర్వాత మాత్రం జీవితాంతం వైద్యుల సలహాపై మందులు వాడుతూ ఉండటంతో పాటు తీపి పదార్థాలను ఆచి తూచి తినాల్సి ఉంటుంది.

mohan publications price list