MohanPublications Print Books Online store clik Here Devullu.com

రంగుల కేళి హోలీ_HoliFestival


రంగుల కేళి హోలీ HoliFestival ColoursFestival IndianFestivals FestivalOfColours HolikaDahan Holika HoliPurnima PhalgunaPurnima MonthofPhalguna BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu


హోలీ పండుగ



హోలీ పర్వదినం ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో వస్తుంది. ఇందుకు సంబంధించిన పురాణగాథను తెలుసుకుందాం.రాక్షసరాజైన హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు. నిత్యం విష్ణు నామస్మరణతో వున్న ప్రహ్లాదునిపై ఆగ్రహం పెంచుకున్నాడు హిరణ్యకశిపుడు. తన సోదరి హోలికను పిలిచి ప్రహ్లాదుడిని తీసుకొని అగ్నిప్రవేశం చేయమన్నాడు. ఆమెకు లభించిన వరం ప్రకారం ఆమెను అగ్ని ఏమీ చేయ‌లేదు. అన్న ఆజ్ఞతో బాలుడన్న ఎలాంటి కనికరం లేకుండా హోలిక ప్రహ్లాదుడిని ఎత్తుకొని అగ్నిగుండంలోకి వెళుతుంది. అయితే తన భక్తులను ఎల్లవేళలా కనిపెట్టికునేవుండే ఆ పరమాత్ముడు మౌనంగా వుండగలడా? ఆ చిద్విలాసమూర్తి వెంటనే ప్రహ్లాదుడిని మంటలు తాకకుండా అనుగ్రహించారు. వెంటనే ప్రహ్లాదుడు సురక్షితంగా మంటలనుంచి బయటకువచ్చాడు. హోలిక మంటలకు ఆహుతై ప్రాణాలు విడిచింది. ఇక్కడ మీకో సందేహం రావచ్చు. హోలికకు వరముంది కదా అని. అయితే హోలిక ఒంటరిగా అగ్ని ప్రవేశం చేసినప్పుడు మాత్రమే ఆ వర ప్రభావముంటుంది. బాలకుడైన ప్రహ్లాదుడిని తీసుకొని మంటల్లో ప్రవేశించడంతో ఆ వరం ఫలించకుండా పోయింది. హోలిక చనిపోయిన దినాన్ని పురస్కరించుకొని హోలీ పండుగను నిర్వహిస్తారు. చిన్ని కృష్ణుడు బాల్యంలో బృందావనం, గోకులంలో చేసిన కార్యాలను గుర్తు పెట్టుకునేందుకూ ఈ పర్వదినాన్ని రంగురంగులతో జరుపుకొంటారు. హోలీ సందర్భంగా కామదహనం కూడా నిర్వహిస్తారు. మన్మథుడిని పరమేశ్వరుడు భస్మం చేస్తాడు. అందుక‌నే హోలీ రోజే కామదహనం కూడా నిర్వహించడం సంప్రదాయం.

వరల్డ్ టైలర్స్ డే_WorldTailorsDay


వరల్డ్ టైలర్స్ డే WorldTailorsDay TailorsDay InternationalTailorsDay Tailor FashionDesigning FashionDesigner FashionTailor DesignerTailor Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu


వరల్డ్ టైలర్స్ డే



వస్త్రాలు, దారంతో బట్టలు లేదా దుస్తులు కుట్టే టైలర్ దర్జీ .వేలాది ముస్లిం కుటుంబాలు దర్జీ పనిలో ఉన్నాయి.రెడీమేడ్‌ బట్టలు విరివిగా రావడం యువత దానిమీద మోజుతో ఎక్కువ ఆసక్తి చూపుతూ కొనుగోలు చేయడంతో దర్జీల దగ్గర బట్టలు చేసి కుట్టించుకొనేవారు తక్కువయ్యారు. దీనితో వీరి జీవన భృతికి ఆటంకం ఏర్పడి కుటుంబ పోషణ జరగడం కష్టంగా తయారైంది. రెడీమేడ్‌ వస్త్రాలు తక్కువ ధరకు దొరకడం, తోపుడు బండ్లపైన సైతం టీషర్టులు, జీన్‌‌ప్యాంట్లు విరివిగా దొరుకుతున్నాయి. సంతలో సైతం రెడీమేడ్‌ దుస్తులు విక్రయిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేదలు వాటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

దానికి తోడు కుట్టడానికి అవసరమయ్యే సరంజామా (క్యాన్‌వాస్‌, గుండీలు, హుక్సులు, దారాలు, ఆయిల్‌మిషన్‌) ధరలు పెరగడంతో దర్జీల దగ్గర బట్టలు ఇచ్చి కుట్టించుకొంటే ధర ఎక్కువ అవుతుందని అదే రెడీమేడ్‌ తీసుకొంటే తక్కువ ధరకు దొరుకుతాయి. వాటిమీద ఆదరణ చూపిస్తున్నారు. ఈ వృత్తినే నమ్ముకొని కొందరు ఇతర చోట్లకు వలసలు వెళ్ళారు.గిరాకులు దర్జీల వద్దకు వచ్చి బట్టలు కుటించుకొనే ఓపిక నశించింది. దర్జీల చేతికి ఇస్తే సరైన సమయానికి బట్టలు కుట్టించి ఇవ్వలేరని అప్పటికప్పుడు రెడిమెడ్‌ షాపులలోకి వెళ్ళి తమకు కావాల్సిన దుస్తులను ఎంపిక చేసుకొంటున్నారు. దీని ప్రభావం దర్జీల పై చాలా పడింది. గతంలో మాదిరిగా కాకుండా నేడు మహిళలకు కుట్టుమిషన్లు శిక్షణఇవ్వడంతో మహిళలకు కావాల్సిన దుస్తులను మహిళలే తమ ఇళ్ళవద్ద కుట్టుకొంటు న్నారు. అంగళ్ళు పెట్టుకొని దర్జీ పనిచేస్తున్న వీరికి పీస్‌ వర్క్ మెటీరియల్స్ గిట్టుబాటు కాకపోవడంతో అంగళ్ళు మూసివేసి ఇళ్ళదగ్గర కుట్టుకొంటున్నారు.కొంతమంది పేద దర్జీలు కుట్టుమిషన్లు అమ్ముకొని ప్రతి రోజు 5 రూపాయల అద్దెతో కుట్టుమిషన్లను తెచ్చుకొని జీవనం సాగిస్తున్నారు.రెడీమేడ్‌ దుస్తులు రాని సమయంలో వారికి కావాల్సిన దుస్తులను నెల ముందుగా ఇచ్చే వారు. పండగ సీజన్‌లు వస్తే వారం ముందు మాకు కుట్టేందుకు వీలు కాదు అనేవారము. నేడు ఆ పరిస్థితి లేదు. కుట్టే దుస్తుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి.

పెళ్లికళలో... ఎన్ని కొత్త కళలో_LatestTrendsInWedding


పెళ్లికళలో... ఎన్ని కొత్త కళలో LatestTrendsInWedding WeddingPlanning SouthIndianWedding HinduWedding TraditionalWedding SouthIndianTraditionalWedding Poolajada JeelakarraBellam Pattuchira Baasikam Sannaie BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu


పెళ్లికళలో... ఎన్ని కొత్త కళలో!


పట్టుచీరలు, బాసికాలూ, పూలదండలూ, జీలకర్రాబెల్లం, సన్నికల్లూ, గరికముంతలు... పెళ్లి వేడుకలో ఉపయోగించే వస్తువుల జాబితా చాలానే. వాటిని బజారు నుంచి కొని తెచ్చుకోవడం సులువే. కానీ వాటికీ ఓ ప్రత్యేకత కనిపించాలంటే.. ఆకట్టుకునేలా, అందంగా, వైవిధ్యంగా ఉన్నవి ఎంచుకోవాలి. లేదా తయారు చేసుకోవడం తెలిసుండాలి. ఒక్కమాటలో చెప్పాలంటే వాటికీ డిజైనర్‌లుక్‌ తేవాలి. అదెలాగో వివరిస్తున్నారు పెళ్లిపూల జడ నిర్వాహకురాలు కల్పనా రాజేష్‌.
పెళ్లికళలో... ఎన్ని కొత్త కళలో LatestTrendsInWedding WeddingPlanning SouthIndianWedding HinduWedding TraditionalWedding SouthIndianTraditionalWedding Poolajada JeelakarraBellam Pattuchira Baasikam Sannaie BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu



నిశ్చయతాంబూలాలతో మొదలయ్యే వేడుకలో పెళ్లికూతురుకు తెచ్చే సారెతోనే మొదలవుతోంది ఈ ట్రెండ్‌. ఆడ, మగపెళ్లి వారి వైపునుంచి జరిగే తంతులను చూపించే విధంగా బొమ్మలూ, పండ్లూ, పూలు పెట్టే ట్రేలు ధగధగలాడే వస్త్రాలూ, చమ్కీలూ, కుందన్లతో మెరిసిపోయేలా ఎంచుకోవచ్చు. లేదా తాటాకు బుట్టలతోనూ సంప్రదాయ లుక్‌ని తేవచ్చు. 
పెళ్లికళలో... ఎన్ని కొత్త కళలో LatestTrendsInWedding WeddingPlanning SouthIndianWedding HinduWedding TraditionalWedding SouthIndianTraditionalWedding Poolajada JeelakarraBellam Pattuchira Baasikam Sannaie BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu

* మంగళస్నానాల వేళ ఉపయోగించే నీళ్ల బిందెలూ, జల్లెడలూ ఆ వేడుకకే కొత్తందాన్ని తెచ్చిపెడుతున్నాయి. పసుపు దంచడానికి ఉపయోగించే రాతిరోలూ, రోకలికి కుందన్లూ, పూలూ, బంగారు, వెండి రంగుల్లో నెట్‌ వస్త్రంతో చేసిన అలంకరణలూ వారెవ్వా అనిపిస్తున్నాయి. మెహెందీ, మంగళస్నానం వంటి సందర్భాల్లో వధువు వేసుకునేందుకు పూల నగలూ, జడల డిజైన్లు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇటు సంప్రదాయాన్నీ, అటు పాశ్చాత్య శైలినీ మేళవించి కనువిందుచేసే పూల జడలు వధువుకి కొత్తందం తెచ్చిపెడతాయి. పైగా వీటిని వధూవరుల దుస్తులూ, మండపం అలంకరణకి నప్పేలా తయారు చేస్తున్నారు.

* వధువుతో పాటే చక్కగా ముస్తాబైపోతుంది కొబ్బరిబొండాం. వాటిపైపేర్లూ, రాధాకృష్ణుల బొమ్మలూ, వివాహఘట్టాలను పెయింట్‌ చేయడమే కాదు కుందన్లూ, రాళ్లూ, స్థాయిని బట్టి నవరత్నాలనూ వీటికి అలంకరిస్తున్నారు.

* పెళ్లివేడుక మొదలైందని సూచించేలా నుదిటిన కట్టే బాసికం మాత్రం సాదాసీదాగా ఎందుకుండాలి... అందుకే వాటినీ కుందన్లూ, రాళ్లూ పొదిగి ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు. కాస్త తాహతు ఉన్నవారైతే వాటికి బంగారం, వజ్రాలనూ ఉపయోగిస్తున్నారు. ఎంతైనా పెళ్లి అపురూపఘట్టం కదా!
పెళ్లికళలో... ఎన్ని కొత్త కళలో LatestTrendsInWedding WeddingPlanning SouthIndianWedding HinduWedding TraditionalWedding SouthIndianTraditionalWedding Poolajada JeelakarraBellam Pattuchira Baasikam Sannaie BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu


* వధువు మేనమామలు పెళ్లికూతుర్ని బట్టులో పెట్టి మండపానికి తెస్తారు కదా! ఆ వేడుకకోసం పట్టూ, వెల్వెట్‌, బెనారస్‌, వంటి వస్త్రాలూ, జరీ అంచులూ ఉపయోగించే కలువ పువ్వు లాంటి బుట్ట కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. ఇక వరుడిని కాశీకి పంపే ఘట్టంలోని గొడుగు మల్లెపూలతో అల్లేస్తున్నారు. వీటికి అదనంగా వేలాడే పూల తీగలూ, పూసలూ వావ్‌ అనిపిస్తున్నాయి.
* పెళ్లిలో వధూవరుల దుస్తులకు నప్పేట్లుగా పూల రేకలతో తయారు చేసిన దండల ప్రత్యేకతే వేరు. కేవలం అక్కడే కాదు దేవుడి పటాలకు వేసే దండల తయారీలోనూ గులాబీలూ, మల్లెలూ, లిల్లీలూ, ఆర్కిడ్‌లు వంటివాటితో పాటు విదేశీ పూలనూ వాడేస్తున్నారు. వాటితో పాటు కర్పూర దండలూ, యాలకుల దండలూ కూడా హంగులు అద్దుకుంటున్నాయి.
పెళ్లికళలో... ఎన్ని కొత్త కళలో LatestTrendsInWedding WeddingPlanning SouthIndianWedding HinduWedding TraditionalWedding SouthIndianTraditionalWedding Poolajada JeelakarraBellam Pattuchira Baasikam Sannaie BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu
పెళ్లికళలో... ఎన్ని కొత్త కళలో LatestTrendsInWedding WeddingPlanning SouthIndianWedding HinduWedding TraditionalWedding SouthIndianTraditionalWedding Poolajada JeelakarraBellam Pattuchira Baasikam Sannaie BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu
పెళ్లికళలో... ఎన్ని కొత్త కళలో LatestTrendsInWedding WeddingPlanning SouthIndianWedding HinduWedding TraditionalWedding SouthIndianTraditionalWedding Poolajada JeelakarraBellam Pattuchira Baasikam Sannaie BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu
పెళ్లికళలో... ఎన్ని కొత్త కళలో LatestTrendsInWedding WeddingPlanning SouthIndianWedding HinduWedding TraditionalWedding SouthIndianTraditionalWedding Poolajada JeelakarraBellam Pattuchira Baasikam Sannaie BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu
పెళ్లికళలో... ఎన్ని కొత్త కళలో LatestTrendsInWedding WeddingPlanning SouthIndianWedding HinduWedding TraditionalWedding SouthIndianTraditionalWedding Poolajada JeelakarraBellam Pattuchira Baasikam Sannaie BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu
పెళ్లికళలో... ఎన్ని కొత్త కళలో LatestTrendsInWedding WeddingPlanning SouthIndianWedding HinduWedding TraditionalWedding SouthIndianTraditionalWedding Poolajada JeelakarraBellam Pattuchira Baasikam Sannaie BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu


* కాబోయే నవదంపతుల దోబూచులాటకు అడ్డుతెర అదనపు హంగుని తెచ్చిపెడుతుంది. కొత్తదుప్పటిని వాడే స్థాయి నుంచి పట్టు వస్త్రాలపై వధూవరుల చిత్రాలూ, సీతారాముల పెళ్లి సంబరాలూ, మల్లెపూలూ, ఆర్కిడ్లూ, గులాబీలూ, లిల్లీలతో అల్లేసిన అడ్డుతెరలే ఇప్పుడు ప్రత్యేకం. జీలకర్రా, బెల్లాన్ని మాత్రం అలా వదిలిపెడితే ఏం బాగుంటుంది. వాటిమీద కాస్త చమ్కీలు చల్లి, ముత్యాలు అద్ది అదరగొట్టేస్తున్నారు. అక్షతల్లో ముత్యాలూ నవరత్నాలనూ కలిపేస్తున్నారు.



* కన్యాదానం చేసే వెండి పళ్లెం, నీళ్లుపోసే వెండి చెంబులకూ నూలు దారపుపోగులే కాదు ముత్యాలూ, పచ్చలూ, కుందన్లు వంటివాటితోపాటు రంగు రంగుల పట్టుదారాలనూ వాడేస్తున్నారు.
* పెళ్లిఘట్టంలో చివరి అంకం సన్నికల్లు తొక్కడం... దీన్ని కూడా జరీనెట్‌, పచ్చలూ, ముత్యాలను పోలి ఉండే కుచ్చులతో అందంగా అలంకరిస్తున్నారు. అంతాబాగానే ఉందికానీ ఇవన్నీ మాకెక్కడ దొరుకుతాయి అంటారా? కాస్తదృష్టీ, సమయం పెడితే సొంతంగానే తయారు చేసుకోవచ్చు. అందుకోసం వాటిని నేర్పించేందుకు ప్రత్యేకంగా యూట్యూబ్‌లో ఛానళ్లు కూడా ఉన్నాయి. అలానే బ్రైడ్స్‌ ఎసెన్షియల్‌, పెళ్లిపూలజడా, వెడ్‌సాగా వంటి బ్లాగులూ మీకు మరిన్ని వివరాలు అందిస్తున్నాయి.

* పెళ్లిళ్లలో గరికముంత ప్రత్యేకతే వేరు.... సున్నంతో డిజైను చేయడం పాతమాట. ఇప్పుడు వాటికి కాంతిమంతమైన రంగులేసి కుందన్లూ, అద్దాలు అద్ది అందంగా మార్చేస్తున్నారు.

* తలంబ్రాల వేడుకలో వాడే కొబ్బరిచిప్పలకూ కుందన్లు జతచేస్తున్నారు.



* ఇవనే కాదు.. తలంబ్రాలూ ముత్యాల్లా కనిపించేందుకు నవరత్నాలను పోలిన పూసల్ని వాడటం కూడా ఇప్పుడు నయాశైలి.


      

అయ్యప్ప దర్శనం ఎప్పుడెప్పుడు?_SabarimalaTimings2018-2019

అయ్యప్ప దర్శనం ఎప్పుడెప్పుడు? SabarimalaTimings2018-2019 SabarimalaAalayaTimings SannidhanamTimings SabarimalaDharshanaTimings SabarimalaOpeningDays Sabarimala Ayyappa Ayyappan LordAyyappa AyyappaSwamy Sannidhanam VirtualQue BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu


అయ్యప్ప దర్శనం ఎప్పుడెప్పుడు?
మండల దీక్షలు, మకర సంక్రాంతి సందర్భంగా తెరిచి ఉండే శబరిమల అయ్యప్ప ఆలయం మరికొన్ని ప్రత్యేక సందర్భాలు మినహా మూసి ఉంటుంది. ఈ ఏడాది ఆలయం తెరిచి ఉంచే రోజుల సమాచారం.


అయ్యప్ప దర్శనం ఎప్పుడెప్పుడు? SabarimalaTimings2018-2019 SabarimalaAalayaTimings SannidhanamTimings SabarimalaDharshanaTimings SabarimalaOpeningDays Sabarimala Ayyappa Ayyappan LordAyyappa AyyappaSwamy Sannidhanam VirtualQue BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu


జాతీయ విజ్ఞాన దినోత్సవము_NationalScienceDay



జాతీయ విజ్ఞాన దినోత్సవము NationalScienceDay SirCVRaman ScienceDayofIndia IndianScienceDay ScienceDayCelebration BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu RamanEffect Science Physics


జాతీయ విజ్ఞాన దినోత్సవము



జాతీయ విజ్ఞాన దినోత్సవమును భారతదేశంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 న జరుపుకుంటారు. రామన్‌ ఎఫెక్ట్‌ను కనిపెట్టిన చంద్రశేఖర వేంకట రామన్ 28-02-1928న తన పరిశోధనా ఫలితాన్ని ధృవపరచుకున్నాడు. ఆయన ఈ పరిశోధన ఫలితాన్ని ధృవపరిచిన ఈ రోజును (ఫిబ్రవరి 28) నేషనల్‌ సైన్స్‌ డే గా జరుపుకుంటున్నారు.
జాతీయ విజ్ఞాన దినోత్సవము NationalScienceDay SirCVRaman ScienceDayofIndia IndianScienceDay ScienceDayCelebration BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu RamanEffect Science Physics
సి.వి.రామన్
సి.వి.రామన్‌ (నవంబర్ 7, 1888 - నవంబర్ 21, 1970) భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. రామన్‌ ఎఫెక్ట్‌ను కనిపెట్టాడు.

రామన్‌ ఎఫెక్ట్‌ అనే అంశం పై నేచర్‌ పత్రికలో సి.వి.రామన్ ప్రచురించిన వ్యాసాలను చూసి ప్రపంచం ఆశ్చర్యపడింది. 1930 డిసెంబర్‌లో రామన్‌ కు నోబెల్‌ బహుమతి ప్రకటింపబడింది. వీరికి భారతరత్న (1954) బహుకరింపబడింది. భౌతిక శాస్త్రంలో భారత కీర్తి కిరీటి సి.వి రామన్. ప్రపంచ వైజ్ఞానిక రంగంలో భారతదేశపు కీర్తి బావుటాను ఎగురవేసి, భారతదేశపు వైజ్ఞానిక రంగంలో ఏకైక నోబెల్ బహుమతి విజేతగా, అన్నింటికీ మించి భారతరత్నగా మనందరికి సుపరిచితుడు శ్రీ చంద్రశేఖర్ వెంకటరామన్ (సి.వి.రామన్). 

సిజేరియన్ల సమస్యలు_CesareanProblems


సిజేరియన్ల సమస్యలు CesareanProblems CesareanDeliveryObstacles ObstaclesToReducingCesarean BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu Eenadu EenaduSukhibhava Sukhibhava EenaduEpaper


సిజేరియన్ల మూలంగా ముంచుకొచ్చే సమస్యలు

‘‘నా బంగారు పాపకు జన్మనిచ్చిన తర్వాత నేను దాదాపుగా మృత్యువు ఒడిలోకి వెళ్లిపోయా!’’ సిజేరియన్‌ కాన్పు అనంతరం తలెత్తిన విపరీత ప్రభావానికి గురైన ప్రముఖ టెన్నిస్‌ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ ఇటీవల చేసిన వ్యాఖ్య ఇది. సిజేరియన్‌ ఆపరేషన్లు సహజ కాన్పులంత సహజమైన వ్యవహారంగా మారిపోయిన నేటి రోజుల్లో ఇలాంటి మాట కాస్త ఆశ్చర్యంగానే అనిపించొచ్చు. నొప్పుల భయంతోనో, ముహూర్తాల పేరుతోనో సిజేరియన్‌ను సులభమైన, తేలికైన మార్గంగా భావించేవారికిది విచిత్రంగానూ అనిపించొచ్చు. సిజేరియన్‌ అనేది అత్యవసర సమయంలో తల్లినీ బిడ్డను ఆదుకొనే అద్భుత వరమే తప్ప అనవసరంగా, ఎడాపెడా వాడే విధానం కాదు. ముఖ్యంగా దీంతోనూ పలు దుష్ప్రభావాలు తలెత్తే అవకాశముందనీ తెలుసుకొని ఉండటం అవసరం. అందుకే సిజేరియన్ల మూలంగా ముంచుకొచ్చే సమస్యలపై సమగ్ర కథనం అందిస్తోంది ఈవారం సుఖీభవ.

స్త్రీ జీవితంలో గర్భధారణ మరపురాని ఘట్టం. కాన్పు మరింత మధురమైన జ్ఞాపకం. నవమాసాలు కడుపులో పెరిగిన నలుసు కళ్ల ముందు కదలాడిన క్షణంలో అమ్మ ముఖంలో కనిపించే ఆనందాన్ని వర్ణించటానికి ఎన్ని మాటలైనా సరిపోవు. ఇంతటి అపురూపమైన అనుభవంలో ఎలాంటి అపశ్రుతి దొర్లినా తట్టుకోవటం కష్టం. ముఖ్యంగా కాన్పు కష్టమైతే తల్లి పడే బాధ వర్ణనాతీతం. బిడ్డ తల, శరీరం పెద్దగా ఉండి, తల్లి కటిభాగం నుంచి సురక్షితంగా బయటకు రాలేని పరిస్థితి తలెత్తటం.. బిడ్డ సైజు కంటే తల్లి కటిభాగం చిన్నగా ఉండటం.. తల్లికి గుర్రపువాతం (ప్రి ఎంక్లాప్సియా) ఉన్నప్పుడు బిడ్డ పరిస్థితి ప్రమాదకరంగా మారటం.. ఇద్దరి కన్నా ఎక్కువమంది కవలలు పుట్టే అవకాశం ఉండటం.. వంటి పరిస్థితుల్లో కాన్పు కష్టమవుతుంది. ఇది తల్లికీ బిడ్డకూ ప్రమాదకరంగా పరిణమిస్తుంది. ఇలాంటి అనర్థాల నుంచి బయటపడేయటానికి అందుబాటులోకి వచ్చిందే సిజేరియన్‌ ఆపరేషన్‌. తల్లికి సమస్యలు రాకుండా, బిడ్డకు కష్టం కలగకుండా చూడటం కోసమే ఇవి మొదలయ్యాయి. వీటి రాకతో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గిపోయాయనటంలో ఎలాంటి సందేహమూ లేదు. అయితే కుటుంబసభ్యుల ఒత్తిళ్లో, ముహూర్త సమయాలో.. కారణాలేవైనా గానీ ప్రస్తుతం సిజేరియన్ల సంఖ్య బాగా పెరిగింది. ఆసుపత్రుల లాభాపేక్ష కూడా ఇందుకు దోహదం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తుండటమూ తెలిసిందే. అవసరమైనప్పుడు, తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్‌ చేయటం ఎంత అవసరమో.. అనవసరంగా, ఎడాపెడా చేయకూడదన్నదీ అంతే అవసరం. మొత్తం కాన్పుల్లో సిజేరియన్‌ కాన్పులు 15% కన్నా మించకూడదని ప్రపంచ ఆరోగ్యసంస్థ సిఫారసు చేసింది కూడా.
ఎందుకు పెరుగుతున్నాయి?
ఒకప్పుడు సిజేరియన్‌ చేయటం చాలా తక్కువ. ఒకవేళ చేసినా తల్లి ప్రాణాలను కాపాడటానికే దీన్ని ప్రయత్నించేవారు. బిడ్డ లోపల మరణించినా కూడా ఎలాగోలా సహజ పద్ధతిలోనే బయటకు తీయటానికి ప్రయత్నించేవారు. అయితే అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ పరీక్ష అందుబాటులోకి వచ్చాక పరిస్థితి గణనీయంగా మారిపోయింది. కడుపులో ఉండగానే బిడ్డ ఎలా ఉంది? సరిగా ఎదుగుతోందా? అవయవ లోపాలున్నాయా? అనేవి ముందే తెలుస్తున్నాయి. తల్లికి గుర్రపువాతం వంటి రక్తపోటు సమస్యలుంటే బిడ్డ లోపల ఎలా ఉందనేదీ స్పష్టంగా బయటపడుతోంది. అందువల్ల బిడ్డను కాపాడుకోవటానికి అవసరమైతే కాస్త ముందుగానే కాన్పయ్యేలా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పుట్టిన వెంటనే బిడ్డకు ఏదైనా సమస్య వస్తే కాపాడుకోవటానికి నియోనేటల్‌ సంరక్షణ సదుపాయాలూ బాగా పెరిగాయి. ఇవన్నీ ధైర్యంగా సిజేరియన్‌ ఆపరేషన్లు చేయటానికి ఆస్కారం కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఆలస్యంగా.. 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకునేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. సంతానం కలగనివారికి ఐవీఎఫ్‌ వంటి అధునాతన చికిత్సలూ అందుబాటులోకి వస్తున్నాయి. దీంతో ఎంతోమంది 40 ఏళ్లు దాటిన తర్వాత కూడా తొలి సంతానాన్ని కంటున్నారు. ఇలా ఆలస్యంగా గర్భం ధరించేవారికి అధిక రక్తపోటు, మధుమేహం వంటివి ఉండొచ్చు. శారీరకంగానూ ఎన్నో మార్పులు తలెత్తొచ్చు. సాధారణంగా 21-29 ఏళ్ల మధ్యలో తొలి కాన్పు జరిగితే సమస్యలు తక్కువ. ఆ తర్వాత నుంచీ సమస్యలు పెరుగుతూ వస్తుంటాయి. 40 ఏళ్ల తర్వాత తొలిసారి గర్భం ధరిస్తే కాన్పు సమయంలో చాలా సమస్యలు తలెత్తొచ్చు. అందువల్ల బిడ్డను, తల్లిని కాపాడటానికి సిజేరియన్‌ చేయాల్సిన అవసరం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆపరేషన్‌ అవసరమైతే తప్పకుండా చేయాల్సిందే. కాదనటానికి వీల్లేదు. అయితే ఫలానా సమయంలో బిడ్డ పుడితే భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకాలతో, ముహూర్తాల పేరుతో సిజేరియన్‌ కోసం పట్టుబడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. కాన్పు నొప్పులకు భయపడి సిజేరియన్‌కు పట్టుబట్టటమూ (సిజేరియన్‌ ఆన్‌ డిమాండ్‌) ఎక్కువైంది. ఇలా అడగ్గానే సిజేరియన్‌ చేయాలా? మామూలు కాన్పుకు ప్రయత్నించొద్దా? అన్నది ఇప్పుడు డాక్టర్లకు నైతిక ప్రశ్నగానూ మారిపోయింది. ఇలాంటి సమయాల్లో అడగ్గానే సిజేరియన్‌ చేయటం కన్నా దీంతో తలెత్తే దుష్ప్రభావాల గురించి ముందుగానే గర్భిణికి, బంధువులకు వివరించి చెప్పటం మంచిది.



ముందే చేస్తే ముప్పు

మామూలుగా గర్భస్థ శిశువు 40 వారాల పాటు తల్లి కడుపులో ఉంటుంది. ఒకప్పుడు 37 వారాలు దాటితే నెలలు నిండినట్టుగానే (టర్మ్‌) భావించేవారు. అయితే ఇప్పుడు 39-41 వారాల సమయాన్ని టర్మ్‌గానూ.. 37-39 వారాలను ముందస్తు కాన్పు కాలంగానూ (అర్లీ టర్మ్‌) పరిగణిస్తున్నారు. ఇలా 37-39 వారాల సమయంలో పుట్టినవారిలోనూ నెలలు నిండకముందే పుట్టే పిల్లల్లో మాదిరి లక్షణాలే కనిపిస్తున్నాయి. కాబట్టి సిజేరియన్‌ కోసం ప్రయత్నించేవారు ఈ విషయాన్ని కూడా గుర్తించటం అవసరం.
సిజేరియన్ల సమస్యలు CesareanProblems CesareanDeliveryObstacles ObstaclesToReducingCesarean BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu Eenadu EenaduSukhibhava Sukhibhava EenaduEpaper

బిడ్డకు ప్రమాదాలు

ముహూర్త సమయాలు చాలావరకు రాత్రి పూటో, తెల్లవారుజామునో ఉంటాయి. అప్పుడు డాక్టర్లు, నిపుణులు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇదీ తల్లీ బిడ్డ ప్రాణాలకు ముప్పు తేవొచ్చు. రాత్రిపూట జరుగుతున్న కాన్పుల్లోనే మాతా శిశు మరణాలు ఎక్కువగా ఉంటున్న విషయాన్ని అంతా గుర్తించాలి. ఇదొక్కటే కాదు. ఇతరత్రా సమస్యలూ చాలానే ఉంటున్నాయి.
* శ్వాస సరిగా తీసుకోలేకపోవటం
సహజకాన్పులో గర్భసంచి కదలికలకు అనుగుణంగా బిడ్డ ఊపిరితిత్తులు కూడా సంకోచిస్తూ.. వ్యాకోచిస్తూ ఉంటాయి. దీంతో ఊపిరితిత్తులు బలపడి బాగా పనిచేస్తాయి. అయితే సిజేరియన్‌ కాన్పులో బిడ్డను వెంటనే బయటకు తీయటం వల్ల ఊపిరితిత్తులు అంత సమర్థంగా పనిచేయవు. దీంతో శ్వాస తీసుకోవటం కాస్త కష్టమవుతుంది (రెస్పిరేటరీ డిస్ట్రస్‌ సిండ్రోమ్‌).
* అనుబంధం కొరవడటం
సిజేరియన్‌ అయినా కూడా పుట్టిన వెంటనే వీలైనంత త్వరగా బిడ్డకు తల్లిపాలు పట్టాలి. కొందరు తల్లి బాగా నీరసంగా ఉందనో, మరే కారణాలతోనో రెండు మూడు రోజుల వరకూ పాలు పట్టరు. ఇది తల్లీబిడ్డల మధ్య అనుబంధం కొరవడటానికి దారితీస్తుంది. తల్లికి పాలు కూడా పడవు. దీంతో పోతపాలు పడుతుంటారు. ఫలితంగా ఇన్‌ఫెక్షన్ల వంటివీ ముంచుకొస్తాయి.
* ముందుగానే కాన్పు
గర్భం ధరించిన తర్వాత తొలిసారి చేసే స్కానింగ్‌ చాలా కీలకం. మంచి నిపుణులైన సోనాలజిస్టుతో తొలి 10 వారాల్లో పరీక్ష చేయిస్తే కాన్పయ్యే సమయాన్ని కచ్చితంగా అంచనా వేయొచ్చు. లేకపోతే సిజేరియన్‌ చేయించుకోవాలని అనుకునేవారు కాన్పు సమయానికి ముందుగానే ఆపరేషన్‌కు సిద్ధపడే అవకాశముంది. దీంతో గర్భం ధరించిన 39 వారాల్లోపు సిజేరియన్‌ చేస్తే నెలలు నిండకముందే పుట్టే పిల్లలకు వచ్చే సమస్యలన్నీ తలెత్తొచ్చు.



తొలికాన్పు సిజేరియన్‌ అయినా..

జననాంగ మార్గం నుంచి బిడ్డ బయటకు వచ్చే మార్గం సరిగా లేకపోవటం, బిడ్డ పొజిషన్‌ సరిగా లేకపోవటం, తల్లికి రక్తపోటు లేదా గ్లూకోజు స్థాయులు బాగా పెరిగిపోయి బిడ్డకు ప్రమాదం పొంచి ఉండటం, నెలలు నిండకముందే ఉమ్మనీరు బయటకు వెళ్లిపోవటం.. వంటి పరిస్థితుల్లో (నాన్‌ రికరెంట్‌ ఇండికేషన్‌) తప్పకుండా సిజేరియన్‌ చేయాల్సిందే. అయితే తర్వాతి కాన్పులో ఇలాంటి పరిస్థితులే ఉండాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇతరత్రా సమస్యలేవీ లేకపోతే నిపుణుల సమక్షంలో సహజకాన్పు కోసం ప్రయత్నించొచ్చు. ఒకవేళ కుట్లు చీలటం వంటివి గమనిస్తే 15 నిమిషాల్లోనే సిజేరియన్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో తీవ్రమైన సమస్యల బారినపడకుండా చూసుకోవచ్చు.



అనర్థాలు ఎన్నెన్నో

ప్రస్తుతం సిజేరియన్‌ను చాలామంది తేలికగానే తీసుకుంటున్నారు. ఒకట్రెండు రోజులు కోత నొప్పులు భరిస్తే చాలు.. తర్వాత అంతా కుదురుకుంటుందని భావిస్తున్నారు. నిజమే.. ఇప్పుడు మత్తుమందు ఇవ్వటం, ఆపరేషన్‌ సదుపాయాలు, ఐసీయూ ఏర్పాట్ల వంటివి బాగా మెరుగయ్యాయి. మంచి యాంటీబయోటిక్‌ మందులు వచ్చాయి. కాన్పు తర్వాత బిడ్డను చూసుకోవటానికి నియోనేటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ విభాగాలు బాగా అభివృద్ధి అయ్యాయి. దీంతో చాలావరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండానే ఆపరేషన్‌ పూర్తి చేయటం సాధ్యమవుతోంది. అయితే ఆపరేషన్లు సవ్యంగా జరగానికి, తర్వాత ఏవైనా సమస్యలు తలెత్తితే బయటపడేయటానికే ఇలాంటి సదుపాయాలు ఉన్నాయనే సంగతిని అంతా తెలుసుకోవాలి. వీటిని ఆసరా చేసుకొని సిజేరియన్లతో ఎలాంటి ప్రమాదం ఉండదనే భావనను వదిలిపెట్టాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు అనర్థాలు తప్పవనే విషయాన్ని గుర్తించాలి.
1. మత్తుమందు దుష్ప్రభావాలు
ఆపరేషన్‌ సమయంలో మత్తుమందు ఇవ్వటంలో మంచి పురోగతి సాధించాం. ఏవైనా దుష్ప్రభావాలు తలెత్తినా తప్పించటంలో నైపుణ్యం సాధించాం. అయినా కూడా కొందరిలో మత్తుమందు విపరీత పరిణామాలకు దారితీయొచ్చు. ఇది తల్లి ప్రాణాలకే ముప్పు తేవొచ్చు. వెన్నెముకలోకి మత్తుమందు ఇచ్చినపుడు అది కొందరికి కిందివైపునకు కాకుండా పైభాగాలకూ వెళ్లొచ్చు. దీంతో శ్వాస తీసుకోవటం కష్టం కావొచ్చు. నూటికి 99 మందికి ఇలాంటి సమస్యలేవీ ఉండకపోవచ్చు గానీ కొందరిలో పెద్ద ప్రాణానికే ప్రమాదం తెచ్చిపెట్టొచ్చు.
2. రక్తం ఎక్కువగా పోవటం
మామూలు కాన్పులో 500 ఎం.ఎల్‌. రక్తం పోతే.. సిజేరియన్‌లో కనీసం 1500 ఎం.ఎల్‌. రక్తం పోతుంది. అప్పటికే రక్తహీనత గలవారికిది ప్రమాదకరంగా పరిణమించొచ్చు. వీరికి రక్తం ఎక్కించాల్సిన అవసరముంటుంది. ఇలా రక్తమార్పిడి మూలంగానూ తర్వాత కొన్ని సమస్యలు తలెత్తొచ్చు.
3. రక్తం గూడు కట్టటం
గర్భధారణ సమయంలో సహజంగానే రక్తం గడ్డకట్టటానికి తోడ్పడే ప్రోటీన్లు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. కాన్పు అనంతరం త్వరగా రక్తం గడ్డకట్టటానికివి తోడ్పడతాయి. ఒకరకంగా ఇది రక్తస్రావం మరీ ఎక్కువగా కాకుండా శరీరం ఏర్పరచుకున్న రక్షణ వ్యవస్థ. దీంతో చిక్కేంటంటే- రక్తం గూడు కట్టే ముప్పు పెరగటం. బాలింతల్లో రక్తం గూడు కట్టటానికి తోడ్పడే ప్రోటీన్ల స్థాయులు ఎక్కువగా ఉండటమే కాదు. కాన్పు తర్వాత ఒంట్లో ఎక్కువగా ఉన్న నీరంతా బయటకు వెళ్లిపోతుంది. దీంతో రక్తం చిక్కబడటం మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అంతగా కదలకపోతే కాళ్లలో రక్తం గూడుకట్టే ప్రమాదం పెరుగుతుంది. ముఖ్యంగా ఊబకాయం, అధికబరువు గలవారికి ఈ ముప్పు ఎక్కువ. ఇలా రక్తనాళాల్లో ఏర్పడే రక్తం గడ్డలు అక్కడ్నుంచి ఊపిరితిత్తుల్లోకీ వెళ్లిపోయి (పల్మనరీ ఎంబోలిజమ్‌) తీవ్ర సమస్యకూ దారితీయొచ్చు. ఇలాంటి రక్తం గడ్డలకు రక్తహీనత కూడా దోహదం చేయొచ్చు. అందువల్ల అవసరమైతే రక్తం గూడు కట్టకుండా ఉండటానికి కాన్పయ్యాక ముందుజాగ్రత్తగా ఇంజెక్షన్లు (థ్రాంబోప్రొఫైలాక్సిక్‌) కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ చికిత్స అన్నిచోట్లా అందుబాటులో లేకపోవటం, దీనిపై అవగాహన లేకపోవటం పెద్ద సమస్య.
4. ఇతర భాగాలు దెబ్బతినటం
కోత పెట్టే సమయంలో పొరపాటున మూత్రాశయం, పేగుల వంటివి చీరుకుపోయే ప్రమాదమూ ఉంది. ముఖ్యంగా చివరి నిమిషంలో అత్యవసరంగా ఆపరేషన్‌ చేయాల్సినవారికి ఇలాంటి ముప్పు ఎక్కువ. ఎక్కడో నొప్పులు మొదలై ఆసుపత్రికి వచ్చేసరికి చాలా సమయం పట్టటం వల్ల వీరిలో కాన్పు జరిగే భాగమంతా వాచిపోయి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో సిజేరియన్‌ చేసేటప్పుడు మూత్రాశయం, పేగులకు గాయాలయ్యే అవకాశముంటుంది. దీన్ని వెంటనే గుర్తించి, మరమ్మతు చేయకపోతే రక్తస్రావం మూలంగా లోపల ఇన్‌ఫెక్షన్‌ తలెత్తొచ్చు. కొందరికి గర్భాశయం నుంచి ఇతర భాగాలకు మార్గం (ఫిస్ట్యులా) ఏర్పడొచ్చు. అలాగే సిజేరియన్‌ చేసేటప్పుడు బిడ్డకు కూడా పొరపాటున గాయాలయ్యే అవకాశముంది.
5. ఇన్‌ఫెక్షన్లు
కొందరికి కోత పెట్టిన చోట ఇన్‌ఫెక్షన్‌ తలెత్తొచ్చు. దీంతో జ్వరం, కడుపునొప్పి వంటివి బయలుదేరొచ్చు. చీము పడితే కోతను తిరిగి తెరచి బయటకు తీయాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇన్‌ఫెక్షన్‌ తీవ్రమై ఇతర భాగాలకూ విస్తరించే అవకాశముంది. ఇది ప్రమాదకరంగానూ పరిణమించొచ్చు. కొందరికి గర్భసంచిలో ఇన్‌ఫెక్షన్‌ తలెత్తి రక్తంలో కలిసి ఒళ్లంతా వ్యాపించొచ్చు. దీన్ని సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే ప్రాణాలకూ ముప్పు ముంచుకొస్తుంది.



దీర్ఘకాల సమస్యలు

సిజేరియన్‌ మూలంగా అప్పటికప్పుడు తలెత్తే సమస్యలతో పాటు దీర్ఘకాల సమస్యల ముప్పూ పొంచి ఉంటుంది కూడా.
* మాయ కిందిభాగాన పెరగటం
సాధారణంగా మాయ గర్భసంచి పైభాగంలో పెరుగుతుంటుంది. అయితే సిజేరియన్‌ అనంతరం ఇది కిందిభాగంలో పెరిగే అవకాశం ఎక్కువవుతుంది. అసలు మాయ కిందిభాగంలో ఉండటమే (ప్లసెంటా ప్రీవియా) ఒక సమస్య. ఇక అది కుట్లు వేసిన చోట అతుక్కుపోతే మరింత పెద్ద సమస్యగానూ మారుతుంది. అంతేకాదు.. మాయ లోపలి భాగాలకు చొచ్చుకొని వెళ్లటానికి ప్రయత్నిస్తుంటుంది. ఈ క్రమంలో ఇది గర్భసంచిని దాటుకొని మూత్రాశయం వరకూ విస్తరించొచ్చు (ప్లసెంటా అక్రీటా స్పెక్ట్రమ్‌). గతంలో చాలా అరుదుగా కనిపించే ఈ సమస్య ఇప్పుడు తరచుగానూ కనబడుతోంది. సిజేరియన్ల సంఖ్య పెరుగుతున్నకొద్దీ దీని ముప్పూ పెరుగుతూ వస్తోంది. దీంతో అత్యవసరంగా ఆపరేషన్‌ చేయాల్సిన పరిస్థితీ తలెత్తుతుంది.
* కుట్లు విచ్చుకుపోవటం
కొందరు సర్జన్లు గర్భసంచికి పైభాగాన కోత పెట్టి (క్లాసికల్‌) ఆపరేషన్‌ చేస్తుంటారు. దీంతో కుట్లు సరిగా మానవు. మళ్లీ గర్భం ధరించినపుడు కుట్లు విచ్చుకుపోవచ్చు. ఇది తల్లికీ బిడ్డకూ ప్రమాదకరంగా పరిణమించొచ్చు. అదే గర్భాశయం కిందిభాగంలో కోత పెట్టి (లోయర్‌ సెగ్మెంట్‌) ఆపరేషన్‌ చేస్తే ఇలాంటి సమస్యలకు అవకాశముండదు. ఇలాంటి ఆపరేషన్లను గైనకాలజిస్టులే బాగా చేయగలుగుతారు. మామూలు సర్జన్లకు ఇది అంతగా అలవాటు ఉండదు.



సమస్యల నుంచి బయటపడినా..

కొందరు కాన్పు అనంతరం తీవ్ర దుష్ప్రభావాలతో మరణం అంచుల వరకూ వెళ్లినా అదృష్టం కొద్దీ బయటపడుతుంటారు. దీన్నే సామ్‌ (సివియర్‌ ఆక్యూట్‌ మెటర్నల్‌ మార్బిడిటీ) అంటారు. ఇదీ మున్ముందు సమస్యలు తెచ్చిపెట్టొచ్చు. వీరికి మళ్లీ సంతానం కలగకపోవచ్చు, ఒకవేళ పిల్లలు పుడితే తల్లికి ప్రమాదం తలెత్తొచ్చు, కుట్లు ఊడిపోయి అడ్డదిడ్డంగా చిరిగిపోతే గర్భసంచినే తీసేయాల్సి రావొచ్చు. దీంతో సంతానం కలిగే అవకాశమే ఉండదు.













  

 

దీపారాధన కొండెక్కితే అపశకునమా?_DeeparadhanaKondekkitye



దీపారాధన కొండెక్కితే అపశకునమా? DeeparadhanaKondekkitye Diya Deepam Deepavali Jyothi Bhakthi Pustakalu Bhakti Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu



దీపారాధన కొండెక్కితే అపశకునమా? 


యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు సమిధలతో ఆహుతులు సమర్పిస్తాం. అక్కడ జ్వాల పెరిగితే పాలు కలిపిన నీళ్లు చిలకరించి నియత్రిస్తారు. ఆకాశం నుంచి వాయువు.. వాయువు నుంచి అగ్ని.. అగ్ని నుంచి నీరు.. నీటి నుంచి భూమి..భూమిపైన ఓషధుల సాయంతో అన్నరూపంగా ఉన్న ఈ పంచతత్వాలను స్వీకరించి మనిషి ఏర్పడ్డాడు. అగ్ని పెరగడానికి గాలి సాయపడుతుంది. అగ్ని చిన్నదిగా ఉంటే అదే గాలి దాన్ని ఆర్పివేస్తుంది. మనలోని జ్ఞానాగ్నికి దీపం ప్రతీక. అది నిరంతరం వెలుగుతూనే ఉండాలి. అందుకే దీపం ఆరిపోతే అపశకునం
అంటారు. గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అనుకోకూడదు అని పెద్దవాళ్లు చెబుతుంటారు. దాన్ని రక్షించుకోవడం కూడా మన బాధ్యతే. అయితే అనుకోకుండా జరిగే వాటిని ఎవరూ ఆపలేరు. ఒకవేళ పూజలో దీపారాధన గాలికి కొండెక్కితే.. నూనె, ఒత్తులు మార్చి మళ్లీ వెలిగించుకోవచ్చు. తప్పేం లేదు. అది అపశకునం కూడా కాదు.

జ‌య‌, విజ‌యులు అంటే ఎవ‌రు?_Who is Jaya and Vijay?



జ‌య‌, విజ‌యులు అంటే ఎవ‌రు? Who is Jaya and Vijay? LordVishnu Dwarapalakulu JayaVijayalu LordVishnuDwarapalakas DoorKeepers GateKeepers BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu


జ‌య‌, విజ‌యులు అంటే ఎవ‌రు?


వైకుంఠంలో శ్రీమహావిష్ణువు నివసించే ధామం వద్ద కాపలాగా ఉండే ఇద్దరు ద్వారపాలకుల పేర్లు జయుడు, విజయుడు. ఆ ఇద్దరూ పరమ విష్ణుభక్తులు. నిరంతరం శ్రీమహావిష్ణువు సన్నిధిలో ఉంటూ ఆయనను పూజిస్తూ తరిస్తూ ఉండేవారు. శ్రీమహావిష్ణువు దర్శనం కోసం వచ్చేవారిని ముందుగా ఆ ఇద్దరూ విషయం అడిగి లోపలికి ప్రవేశపెట్టడం అలవాటు. ఒక రోజున సనక, సనందన, తదితర మహామునులు విష్ణు దర్శనం కోసం వైకుంఠానికి చేరుకున్నారు. వారు బ్రహ్మ మానసపుత్రులు. ఎంతో గొప్ప మహిమ గలవారు కూడా. యోగశక్తితో సమస్త లోకాలు సంచరించే మహనీయులు ఆ మునులు. పైగా ఎప్పటికీ ఆ మునులకు అయిదు సంవత్సరాల వయస్సువారిలాగే కనిపించే వరం కూడా ఉంది. శ్రీమహావిష్ణు దర్శనం కోసం ఆరు ద్వారాలు దాటి వైకుంఠంలో ఉన్న ఏడో ద్వారం వద్దకు వచ్చేసరికి అక్కడ ఉన్న జయవిజయులు వారిని లోపలికి పోనీయకుండా అడ్డగించారు. జయవిజయులు ఆ మునుల గొప్పతనాన్ని గ్రహించలేక వారిని పసిపిల్లలుగా భావించి లోపలికి వెళ్లడానికి వీలులేదని తూలనాడారు. శ్రీహరిని దర్శించుకోవడానికి వచ్చిన సనక సనందులకు జయవిజయుల ప్రవర్తన బాగా కోపాన్ని తెప్పించింది. వెంటనే వారు జయవిజయులను పాపాలకు నిలయమైన భూలోకంలో పుట్టమని శపించారు. తమను అడ్డగించినందుకు అదే శిక్ష అని అన్నారు. ఆ మునుల శాప వచనాలు విని జయవిజయులు గడగడలాడారు. తాము చేసిన అపచారాన్ని మన్నించమని, శ్రీమహావిష్ణువును చూడకుండా ఎప్పుడూ ఉండలేమని, శాపవిమోచనం ప్రసాదించమని ప్రార్థించారు. సనక, సనందుల, జయవిజయుల సంభాషణలు లోపల లక్ష్మీదేవితో ఏకాంతంగా ఉన్న శ్రీమహావిష్ణువుకు వినిపించాయి. వెంటనే ఆయన బయటకు వచ్చాడు. శ్రీమహావిష్ణువును మునులు అనేక విధాలుగా స్తుతి చేశారు. విష్ణువు వారిని ఆశీర్వదించి తన సేవకులు చేసినది అపచారమేనని, ఆ అపచారానికి వారు శిక్ష అనుభవించాల్సిందేనని మునులను దేవుడు అనునయించాడు. అప్పుడు ఆ మునులు శ్రీమహావిష్ణువుకు భక్తితో నమస్కరించి వెళ్ళిపోయారు. ఆ తరువాత జయవిజయులు విష్ణువు పాదాలపై పడి తమను మునుల శాపం నుంచి రక్షించమని వేడుకున్నారు. కానీ విష్ణువు వారి శాపాన్ని అనుభవించాల్సిందేనని పలికాడు. ఆ మాటలకు విపరీతమైన దుఃఖం కలిగిన ఆ సేవకులు శ్రీమహావిష్ణువును విడిచి తాము ఉండలేమని, ఏవిధంగానైనా శాపవిమోచనం కలిగించమని మరీ మరీ వేడుకున్నారు. అప్పుడు శ్రీమహావిష్ణువు వారికి అభయాన్నిస్తూ మునుల శాపాన్ని మూడు జన్మల వరకూ అనుభవించమని, ఆ జన్మల్లో తనకు బద్ధవిరోధులైన రాక్షసులుగా వారు జన్మిస్తారని, తన చేతిలో హతమైన తరువాత మళ్ళీ వైకుంఠానికి రావచ్చని, అది ఒక్కటే తనను తొందరగా చేరటానికి మంచి మార్గమని చెప్పాడు. విష్ణువు వచనాలు ముగియగానే జయవిజయులు భూలోకంలో రాక్షసులుగా జన్మించారు. కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు అనే సోదరులుగానూ, త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణులుగానూ, ద్వాపరయుగంలో శిశుపాల, దంతవక్త్రులుగానూ జన్మించి విష్ణువుతో పోరాడారు. వరాహ రూపం ఎత్తి విష్ణువు హిరణ్యాక్షుడిని, నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుడిని, రామావతారం ఎత్తి రావణ, కుంభకర్ణులను, కృష్ణావతారంలో శిశుపాల, దంతవక్త్రులను శ్రీ మహావిష్ణువు సంహరించాడు. అనంతరం జయవిజయులు మళ్ళీ వైకుంఠానికి చేరుకున్నారు.జ‌య‌, విజ‌యుల విగ్రహాల‌ను వైష్ణ‌వ ఆల‌యాల్లో చూడ‌వ‌చ్చు. తిరుమ‌ల శ్రీ‌నివాసుని ఆల‌యంలో గ‌రుడాళ్వ‌ర్ ఎదురుగా వుంటారు.

శివుడు మెడలో సర్పం ఎందుకు_SivuniMedaloSarpamEnduku



శివుడు మెడలో సర్పం ఎందుకు SivuniMedaloSarpamEnduku LordShiva LordSiva LordVasuki Kantabharanam Namakam Chamakam BhakthiPustakalu Bhakthi Pustakalu BhaktiPustakalu Bhakti Pustakalu



శివుడు సర్పాన్ని మెడలో ఎందుకు ధరించాడు?

పరమేశ్వరుని మెడలో నాగాభరణమై వున్న మహాసర్పం వాసుకి. అన్ని వేళలా స్వామి సేవలో ఆ నాగరాజు తరిస్తాడు.కశ్యప ప్రజాపతికి గల 14 పత్నుల్లో వినత, కద్రువలు ఇద్దరు. వినతకు గరుత్మంతుడు, అనూరుడు ఇద్దరు కుమారులు. వీరిలో అనూరుడు సూర్యుని రథసారథిగా బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. కద్రువకు వెయ్యిమంది సర్పాలు సంతానం. వీరిలో పెద్దవాడు ఆదిశేషువు. పాలసముద్రం సమీపంలోని ఉచ్చైశ్రవాన్ని(గుర్రం) దూరం నుంచి చూసిన కద్రువ తన సోదరి వినతతో దాని తోక నల్లగా వుందని చెబుతుంది. అయితే వినత అంగీకరించకుండా తోక కూడా తెల్లగానే వుంటుందని పేర్కొంటుంది. తోక నల్లగా వుంటే అక్క తన దగ్గర వేయి సంవత్సరాలు పరిచారికగా వుండాలని ఒక వేళ తోక తెల్లగానే వుంటే తానే వినత దగ్గర వేయి సంవత్సరాలు బానిసగా వుంటానని కద్రువ పందెం కాస్తుంది. ఇంతలో రాత్రి కావడంతో పొద్దున వచ్చి పరీక్షిస్తామని వెళ్లిపోతారు. గుర్రం తోక తెల్లగానే వుంది ఈ పందెంలో ఎలా నెగ్గాలా అన్న సంశయంలో కద్రువ వుంటుంది. హఠాత్తుగా ఆమెకో ఆలోచన వస్తుంది. తన కుమారులను పిలిచి నల్లగా వున్న వారు వెళ్లి గుర్రం తోకను చుట్టుకోవాలని కోరుతుంది. దీన్ని వారు అంగీకరించరు. ఇది ధర్మసమ్మతం కాదని వాదిస్తారు. వారి వాదనతో ఆగ్రహం చెందిన కద్రువ తల్లి మాటనే పట్టించుకోరు కాబట్టి భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో పడి నశించిపోతారు అని శపిస్తుంది. ఈ శాపంతో భీతిల్లిన కొన్ని సర్పాలు తల్లి మాట ప్రకారం గుర్రం తోకను పట్టుకోవడంతో నిజమేనని భ్రమించిన వినత అన్న మాట ప్రకారం కద్రువ దగ్గర దాసిగా పనిచేస్తుంది. అనంతరం ఆమెకు ఆమె రెండో కుమారుడు గరుత్మంతుడు బానిస బంధనాల నుంచి విముక్తి కలగజేస్తాడు. తల్లి మాట అంగీకరించని ఆదిశేషువు శ్రీమహావిష్ణువు కోసం ఘోరతపస్సు చేస్తాడు. స్వామి ప్రత్యక్షమై ఆదిశేషువును తన శేషతల్పంగా చేసుకుంటాడు. దీంతో ఆదిశేషువుకు ఎలాంటి మృత్యుభయం లేకుండా పోయింది. రెండో వాడైన వాసుకి మహాశివుని కోసం తపస్సు చేస్తాడు. శంభునాథుడు ప్రత్యక్షమై వాసుకికి మృత్యుభయం లేకుండా చూసేందుకు తన మెడలో నాగాభరణంగా చేసుకుంటాడు. శివుడు మృత్యుంజయుడు. దీంతో వాసుకికి కూడా ఎలాంటి మృత్యువు దరిలోకి రాకుండా పోయింది. ఆ నాటి నుంచి వాసుకి మహాశివుని మెడలో దర్శనమిస్తుంటాడు. సర్పాన్ని మెడ యందు ఆభరణంగా ధరించినవాడు కనుకనే ఆ పరమేశ్వరుడిని నాగాభరణుడు, నాగభూషణడు అని కూడా పిలుస్తాము.

శాంతి మంత్రం_ShanthiMantra


శాంతి మంత్రం ShanthiMantra Antaryami Eenadu EenaduEepaper EenaduAntaryami BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu


శాంతి మంత్రం

భారతదేశం శాంతి పరిమళాలు వెదజల్లే పూలతోట వంటిది. ప్రపంచానికి ప్రశాంతతను ప్రబోధించడంలో భారతీయులే ముందుంటారు.
శాంతి సామరస్యాల్ని చాటే వేదమంత్రాలు పూర్వీకుల నుంచి మనకు వారసత్వంగా వచ్చాయి. ప్రాతఃస్మరణీయమైన ఆ వేదఘోష అందరి హృదయాల్లోనూ మారుమోగుతుంటుంది.
కామ క్రోధాల వంటి అరిషడ్వర్గాల నుంచి శమింపజేసేది శాంతం అని ‘అమర కోశం’ చెబుతుంది. సృష్టి మనుగడ కొనసాగాలంటే పంచభూతాల అనుగ్రహం కావాలి. వాటి ఆగ్రహం ప్రాణికోటికి ముప్పు తెస్తుంది. అందువల్ల పంచభూతాలూ శాంతించాలంటాయి యజుర్వేద మంత్రాలు. సూర్యచంద్రులు, ఇంద్రాది దేవతలు శాంతించాలని తైత్తిరీయోపరిషత్తు కోరుతుంది.
విష్ణువు శాంతాకారుడై, ఆదిశేషుడి మీద శయనించి ఉంటాడని వ్యాసమహర్షి వర్ణించాడు. పరమశివుణ్ని శివస్తోత్రం ‘శాంతుడు’ అని సంబోధిస్తుంది.
జీవహింస తగదని ప్రవచించిన బుద్ధ భగవానుడు శాంతిమంత్రం జపించాడు. ఖండాంతరాలవారికీ ఆరాధనీయుడయ్యాడు. బుద్ధుడి బోధనలకు అశోక చక్రవర్తి ఎంతగానో ప్రభావితుడయ్యాడు. రణరంగంలో విజయుడైనప్పటికీ శాంతికాముకుడిగా మారి, బౌద్ధాన్ని ప్రపంచమంతటికీ పరిచయం చేశాడు. భారతీయుల ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయగలిగాడు.
తోటివారిని కష్టపెడితే శాంతి దూరమవుతుంది. అహింస వల్ల అనంత శాంతి సొంతమవుతుందని గాంధీమహాత్ముడు గ్రహించారు. సత్యం, అహింసల్ని ఆయుధాలుగా చేసుకున్నారు. భారత స్వాతంత్య్ర పోరాట కాలంలో వాటిని ప్రయోగాత్మకంగా అమలుపరచారు. జాతిపితగా, శాంతి ప్రచారకులుగా పేరు గడించారు. దక్షిణాఫ్రికా దేశీయులైన నెల్సన్‌ మండేలా ఆయన చూపిన శాంతిమార్గంలో నడిచారు. బానిసత్వం నుంచి తన దేశాన్ని విముక్తం చేశారు. మువ్వన్నెల పతాకంలోని శ్వేతవర్ణం భారత శాంతిప్రియత్వాన్ని చాటుతుంది.
పూర్వం ప్రభువుల యుద్ధకాంక్ష కారణంగా ప్రజల్లో అశాంతి, అలజడి రేగాయి. ప్రతి ఒక్కరూ అభద్రతకు గురయ్యేవారు. యుద్ధానికి ప్రత్యామ్నాయంగా నాటి రుషులు అశ్వమేధ, రాజసూయ యాగాలకు రూపకల్పన చేశారు. యుద్ధాన్ని నిరోధించి, సమాజంలో శాంతిభద్రతల్ని కాపాడటమే వాటి పరమార్థం. సహజంగానే భారతీయులు సున్నిత మనస్కులు. దేవతారాధన కోసం మొక్కల నుంచి పూలు తుంచాలన్నా బాధపడతారు. శతకకర్త బద్దెన చాటినట్లు, అపకారికైనా ఉపకారం చేయడమే మిన్న. అప్పుడే శత్రుత్వం తొలగి, రెండు పక్షాల మధ్యనా మైత్రి కలుగుతుంది. ప్రపంచంలో శాంతిస్థాపనకు సంబంధించి, ఇంతకు మించిన మేలు మార్గం మరొకటి ఉండదు.
మనిషి కోపం శత్రువుల్ని పెంచుతుంది. శాంతం రక్షణనిస్తుందని పెద్దల మాట. కోపం వల్ల విచక్షణాజ్ఞానం లోపిస్తుంది. ఫలితంగా, అయినవారు సైతం శత్రువులుగా కనిపిస్తారంటుంది భృగుమహర్షి చరిత్ర. ఆయన అరికాలిలో మూడో కన్నుతో జన్మించాడంటారు. ఒకరోజు తన రాకను గమనించలేదన్న కోపంతో బ్రహ్మ, మహేశ్వరులను శపిస్తాడు. విష్ణుమూర్తి హృదయంపై కాలితో తంతాడు. ఆ స్వామి శాంతసముద్రుడు. భృగువు పాదాలు నొక్కుతూనే, అరికాలిలోని కంటిని వేలితో పొడుస్తాడు. రుషి క్రోధం పూర్తిగా శమిస్తుంది. ప్రశాంతచిత్తుడై ఆయన, తన తప్పిదానికి క్షమాపణ చెప్పి వెళ్లిపోతాడు.
సత్వగుణ ప్రధానుడైన శ్రీరాముడు శాంతస్వరూపుడుగా వెలుగొందుతాడు. హిరణ్యకశిపుడి వధ కోసం ఉగ్రనరసింహ అవతారమెత్తిన విష్ణుమూర్తి- భక్తప్రహ్లాదుడి స్తోత్ర పఠనంతో తిరిగి శాంతరూపం ధరిస్తాడు.
స్వార్థం శత్రుత్వాన్ని పెంచుతుంది. అంతా తమకే సొంతం కాదని అందరూ గుర్తించాలి. స్వార్థబుద్ధి పూర్తిగా నశిస్తేనే, మనుషుల మధ్య సోదరభావం పెరుగుతుంది. అప్పుడే శాంతి కపోతం విశ్వమంతటా స్వేచ్ఛగా విహరిస్తుంది!
- జి.రామచంద్రరావు

కల్కి_Kalki



కలి-కల్కి 


లోకంలో ధర్మం గాడి తప్పినప్పుడు, తిరిగి దాని ప్రతిష్ఠాపన కోసం భగవానుడు అవతారం ధరిస్తాడు. తాను సృజించినది (సృష్టి) ధర్మనియతితో క్రమపద్ధతిలో సాగేలా చేస్తాడు. ధర్మసంస్థాపనే ధ్యేయంగా గల ఆయన, అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మళ్లీ పరిక్రమ (విహారం) ప్రారంభిస్తాడు.

అనంతమైన కాలప్రవాహాన్ని రుషి ప్రపంచం- కృత, త్రేత, ద్వాపర, కలియుగాలుగా విభజించింది. ఇది కలియుగంలోని ప్రథమపాదం. యుగానికి నాలుగు పాదాలుంటాయి. శ్రీకృష్ణ అవతార పరిసమాప్తి రోజు నుంచి కలియుగం ప్రారంభమైందని చెబుతారు. అందరూ అభిలషించేది సత్యయుగం. ఇందులో మనుషుల మధ్య మధుర బంధాలుంటాయి. శీలసంపదతో భాసించడం, యజ్ఞ యాగాదులతో పాటు పలు ఆధ్యాత్మిక ధార్మిక కార్యాలు నిర్వహించడం- సత్యయుగ లక్షణాలు. ప్రకృతిని పరమాత్మగా పూజిస్తారు. ఈ గుణాలన్నింటినీ పురాణ వాంగ్మయం వర్ణించింది. ఇటువంటి గుణాలు పరిఢవిల్లే కాలమంతా స్వర్ణయుగం. ఈ సద్గుణాలు అన్ని కాలాలకూ వర్తించేవిగా ఉండాలి. వేదోపనిషత్తుల సంగ్రహ సారమూ ఇదే! కాలం మార్పులకు గురవుతుంటుంది. మానవ చిత్తప్రవృత్తులు మారుతుంటాయి. నిలకడ లేని విధివిధానాలు, భ్రమలు, ఆరాటాలు చుట్టుముడుతుంటాయి. తాపత్రయాలతో మనిషి సతమతమవుతుంటాడు. దీనికి కారణం కలి ప్రభావం అంటారు.

మహావిష్ణువు దశావతారాల్లో చివరిది కల్కి. లోకంలో సద్గుణాలు లోపిస్తే, వక్రగతుల జీవన విధానాలు వ్యాపిస్తే, శారీరక మానసిక సామాజిక రుగ్మతలు ఏర్పడితే- అది కలి ప్రభావమేనని గ్రహించాలి. ధర్మ ప్రామాణికాలు మృగ్యమవుతాయి. అలజడులు, ఆరళ్లతో అసలు ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. ఇదంతా ‘కలి రాజ్యం’ కాక మరేమిటి! దీనికి సంబంధించి, జనబాహుళ్యంలో ఒక నానుడి ఉంది. ఎక్కడైనా అన్యాయమో, అఘాయిత్యమో జరిగితే ‘కలికాలం-చెడు బుద్ధులు’ అంటుంటారు.

కలి ప్రవేశం ఎలా జరుగుతుంది? అశుచి, దుష్ట సంస్కృతి పట్ల మనిషి మనసు ఆకర్షితం కావడం, అతడిలో దుర్మార్గపూరిత ఆలోచనలు రేగడమే కలి ప్రవేశంగా భావిస్తారు. నిషధ దేశానికి రాజు నలుడు. అతడు సదాచార సంపన్నుడు. ఒకసారి అశౌచం కారణంగా, అతడిలో కలి ప్రవేశించింది. వెంటనే తన మార్గాన్ని విస్తృతం చేసుకుంది. అంటే- ఒక్క దుర్లక్షణం ఏర్పడితే, వరసగా ఒకదాని వెంట మరొకటి చేరతాయి. అలా నలమహారాజు జూద వ్యసనానికి లోనై, రాజ్యాన్ని పోగొట్టుకొని, ధర్మపత్ని దమయంతితో అరణ్యాల పాలయ్యాడు. ఆ జూద వ్యసనమే మహాభారతంలో కురుపాండవుల మధ్య ఘర్షణ రాజేసింది. కురుక్షేత్ర మహాసంగ్రామానికి దారితీసింది.

పరీక్షిన్మహారాజు ధర్మబద్ధంగా పాలన సాగించి, కలిని తన రాజ్యంలో లేకుండా చేస్తాడు. కలియుగంలో కలి ప్రభావాన్ని అంతమొందించేందుకు శ్రీమహావిష్ణువు కల్కి అవతారం ధరిస్తాడు. ఆయన శంబల గ్రామవాసి విష్ణుయశుడికి తనయుడై జన్మిస్తాడంటుంది దశావతార గాథ! దేవదత్తం అనే గుర్రాన్ని అధిరోహించి, ఖడ్గాన్ని చేత ధరించి, కలి ప్రభావాన్ని రూపుమాపుతాడని చెబుతుంది. అశ్వం వేగానికి చిహ్నం. తెలుపు శాంతికి, స్వచ్ఛతకు, సత్వగుణానికి ప్రతీక. ఖడ్గం- చెడును ఖండించే ఆయుధం.

మానసిక కాలుష్యం మనుషుల మధ్య అగాధాన్ని సృష్టిస్తోంది. మనిషి తనకు తానే సమస్యగా మారుతున్నాడు. కలి ప్రభావం మానవాళిపై పడకుండా, వారిని జాగృతపరచడమే మహాపురుషులు చేసే కృషి. సత్పురుషులు, సత్వగుణ సంపన్నులే నారాయణ స్వరూపులు. తనలోని చెడును, అహాన్ని, అసూయా ద్వేషాల్ని తొలగించుకొని అంతరంగ శుద్ధితో పరిశ్రమించే ప్రతి మనిషీ జ్ఞానసిద్ధుడు. 
మీన రూపుడైన మహావిష్ణువు వేదాల్ని రక్షించడంతో దశావతారాలు మొదలయ్యాయి. ఇందులో మానవ జీవన పరిణతిని గ్రహించవచ్చు. మనిషి తాను సముపార్జించిన జ్ఞానంతో ఎదుగుతూ, చెడును నిర్జించే శక్తిగా వెలుగొందాలి. దశావతారాల్లోని అంతరార్థాన్ని గ్రహించడం ద్వారా అతడు తన జీవితాన్ని సుసంపన్నం చేసుకోవాలి!
- దానం శివప్రసాదరావు

పరమాత్ముని కేళి హోళి_HoliFestival


పరమాత్ముని కేళి హోళి HoliFestival ColoursFestival IndianFestivals FestivalOfColours HolikaDahan Holika HoliPurnima PhalgunaPurnima MonthofPhalguna BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu AndhraJyothi AndhraJyothiEpaper AndhraJyothiSundayMagazine


పరమాత్ముని కేళి హోళి

పరమాత్ముని కేళి హోళి HoliFestival ColoursFestival IndianFestivals FestivalOfColours HolikaDahan Holika HoliPurnima PhalgunaPurnima MonthofPhalguna BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu AndhraJyothi AndhraJyothiEpaper AndhraJyothiSundayMagazine


వద్దంటే.. అప్పు.. కాస్త జాగ్రత్త_BewareOfLoans



వద్దంటే.. అప్పు.. కాస్త జాగ్రత్త BewareOfLoans EMI LoanEMI RateofInterest NewLoan HowtoHandleLoan LoanPremium BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu Eenadu EenaduBusinessPage EenaduSiri EenaduSunday



వద్దంటే.. అప్పు.. కాస్త జాగ్రత్త!

అత్యవసరాల్లో డబ్బు అవసరం వస్తే.. ఆ కష్టం అంతాఇంతా కాదు.. ఇప్పుడు ఏ అవసరం అయినా.. అప్పు సులభంగానే దొరుకుతుంది. అయితే, రుణం ఏదైనా తీసుకునేముందు తగిన నిర్ణయం ఎలా తీసుకోవాలి?
అప్పు తీసుకుంటే అసలుతో పాటు దానికి వడ్డీ కూడా చెల్లించాలి. ఆదాయం సరిపోతుందిలే అని ప్రతి అవసరానికీ అప్పు తీసుకుంటూ వెళ్తే..నెలవారీ వాయిదాల చెల్లింపులకు ఇబ్బంది రావచ్చు... కాబట్టి,
* అవసరం ఏమిటన్నది ముందుగా తెలుసుకోవాలి.. దానికి ఎంత అప్పు కావాలో అంతే తీసుకోండి. బ్యాంకులు ఇస్తున్నాయి కదా అని ఎక్కువ తీసుకుంటే.. తర్వాత నెలవారీ వాయిదాలు భారం కావచ్చు. దీంతోపాటు ఎక్కువ వడ్డీ, అనేక రుసుములూ భరించాలి.
* ఏ బ్యాంకు ఏ తరహా రుణాలు అందిస్తున్నది తెలుసుకునేందుకు ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఎన్నో అవకాశాలు వచ్చాయి. వాటిని ఉపయోగించుకోండి.
* ఉద్యోగం కోల్పోవడంలాంటివి జరిగినప్పుడు వచ్చే ఆదాయ వనరులు ఆగిపోవచ్చు. ఇలాంటప్పుడు ఆదాయం లేకపోగా.. వాయిదాలు చెల్లించాల్సిన భారం ఉంటుంది. అందుకే, ఇలాంటి ఆర్థిక సంక్షోభాలు తలెత్తినప్పుడు ఏం చేయాలన్నది ముందే ఆలోచించుకోవాలి.
* రుణం తీసుకునేప్పుడు దానికి సంబంధించిన అన్ని నియమ నిబంధనలు పూర్తిగా అర్థం చేసుకోండి. చాలామందికి అప్పు తీసుకున్న తర్వాతే రుసుము ఎంత విధించారో అర్థం అవుతుంది.
* హామీ ఉన్న రుణాలకంటే.. హామీ లేని రుణాలపై వడ్డీ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని మర్చిపోకూడదు.
* రుణ వాయిదాలను క్రమం తప్పకుండా చెల్లించాలి. లేకపోతే బ్యాంకులు అపరాధ రుసుములాంటివి వసూలు చేస్తాయి. దీనివల్ల మీ జేబుకు భారమే కాకుండా.. రుణ చరిత్ర, క్రెడిట్‌ స్కోరుపై కూడా ప్రభావం పడుతుంది.
* ముందస్తు చెల్లింపు చేసినప్పుడు ఏదైనా రుసుములు విధిస్తున్నారా.. ఇదీ కీలకమే. ఏదైనా అనుకోని డబ్బులు అందినప్పుడు వెంటనే ఆ అప్పును తీర్చడానికి ప్రయత్నిస్తే.. ఎలాంటి రుసుములు లేకపోతేనే మేలు.
* ఒకవేళ మీరు రున వాయిదాలు చెల్లించలేని పరిస్థితి ఉంటే.. రుణ సంస్థల నుంచి తప్పించుకు తిరగడం మంచిది కాదు. దానికన్నా మీ పరిస్థితిని వివరిస్తూ.. బ్యాంకులను సంప్రదించడం ఉత్తమం. మీరు తిరిగి వాయిదాలు చెల్లించడం ప్రారంభించేదాకా కాస్త సమయం ఇవ్వాలని అడగండి. బ్యాంకే మీకు సరైన మార్గం చూపిస్తుంది.


ఏం చేయాలి..
ఆదాయం తగ్గి, వాయిదాలు చెల్లించలేనప్పుడు.

* వ్యవధి పెంచుకోండి: వీలును బట్టి రుణ వ్యవధిని పెంచుకోవడానికి ప్రయత్నించండి. దీనివల్ల నెలసరి వాయిదాల భారం తగ్గుతుంది.
* వాయిదా వేయండి: స్వల్పకాలిక ఆర్థిక సంక్షోభం తలెత్తినప్పుడు.. రుణ వాయిదాల చెల్లింపును తాత్కాలికంగా వాయిదా వేసుకునే అవకాశం కల్పిస్తాయి బ్యాంకులు. ఆ అవకాశాన్ని ఇవ్వాల్సిందిగా కోరండి. ఆర్థికంగా మెరుగైనప్పుడు వ్యక్తిగత రుణం వాయిదాలు చెల్లించవచ్చు.
* కొత్త రుణం తీసుకోవడం ద్వారా: ఇప్పుడు చాలా బ్యాంకులు రుణాన్ని మార్చుకోవాల్సిందిగా కోరుతూ ఫోన్లు చేస్తూనే ఉన్నాయి. మీ పాత రుణాన్ని మార్చుకొని, కొత్త రుణం తీసుకునేందుకు ఏదైనా వీలుందా చూసుకోండి. కొత్త అప్పు తీసుకున్నప్పుడు కాస్త అధిక మొత్తం కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు ఏదైనా అత్యవసరానికి దాన్ని వాడుకునేందుకు అవకాశం ఉంది.
ఎప్పుడైనా సరే.. రుణం తీసుకోవడానికి అవసరమే ప్రాతిపదిక కావాలి.. అప్పు ఇస్తున్నారు కదా అని అవసరం గుర్తుకు రాకూడదు. ఈ విషయాన్ని గుర్తించుకున్నప్పుడే.. ఆర్థికంగా ఇబ్బందుల్లేకుండా..మన డబ్బుతో మనం హాయిగా ఉండొచ్చు.

నేమానిపంచాంగం_Nemanipanchangam

నేమాని పంచాంగం  Nemani panchangam  2018-19 Eenadu SundayMagazine Sunday Magazine Eenadu Paper Bhakthi Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu Bhakti Pustakalu

నేమాని పంచాంగం
Nemani panchangam
2018-19

నేమాని పంచాంగం  Nemani panchangam  2018-19 నేమాని పంచాంగం  Nemani panchangam  2018-19 Eenadu SundayMagazine Sunday Magazine Eenadu Paper Bhakthi Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu Bhakti Pustakalu
నేమాని పంచాంగం  Nemani panchangam  2018-19 Eenadu SundayMagazine Sunday Magazine Eenadu Paper Bhakthi Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu Bhakti Pustakalu



ఇంటి రుణం.. భారం తగ్గాలంటే_HousingLoan



ఇంటి రుణం.. భారం తగ్గాలంటే HousingLoan HouseLoan RateofInterest CreaditScore OwnHouse LowInterest BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu Eenadu EenaduEpaper EenaduSunday EenaduBusinessPage EenaduSiri Investemnt



ఇంటి రుణం.. భారం తగ్గాలంటే..


గృహరుణం.. ఒక వ్యక్తి జీవితంలో ఇదో అతి పెద్ద అప్పు. సొంతింటి కలను నిజం చేసుకోవాలని భావించేవారు.. ఈ అప్పుతో తమ లక్ష్యాన్ని సులభంగా తీర్చుకోవచ్చు. అయితే, ఈ దీర్ఘకాలిక రుణానికి నెలనెలా వాయిదాలను చెల్లించడం అన్ని వేళలా సులభమేమీ కాదు. అప్పు తీసుకునేప్పుడూ.. ఆ తర్వాత తీర్చే సమయంలోనూ రుణగ్రహీతలు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే.. అవేమిటో చూద్దామా!

క్రెడిట్‌ స్కోరును చూసుకోండి...
మీరు ఇప్పటికే తీసుకున్న అప్పులను ఎలా చెల్లించారో తెలిపేది క్రెడిట్‌ స్కోరు. ఈ స్కోరు 700కన్నా అధికంగా ఉన్నప్పుడు గృహరుణానికి ఏ ఇబ్బందీ ఉండదు. మంచి క్రెడిట్‌ స్కోరు ఉన్నప్పుడు సులభంగానే మీ రుణ మంజూరు ప్రక్రియ వేగంగానే సాగుతుంది. క్రెడిట్‌ స్కోరు రుణం మంజూరీలో కీలకమే కాకుండా.. ఏ బ్యాంకు/ఆర్థిక సంస్థ మీకు రుణం ఇచ్చేందుకు ముందుకు వస్తుందని నిర్ణయించడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. మంచి క్రెడిట్‌ స్కోరు ఉంటే.. బ్యాంకులు/ఆర్థిక సంస్థలు ఆకర్షణీయమైన వడ్డీ రేటుకు రుణాన్నిస్తాయి. అదే సమయంలో మీ ఆస్తి విలువలో 80-90శాతం వరకూ రుణం పొందేందుకు అవకాశం కల్పిస్తాయి. అందుకే, ముందుగా మీ క్రెడిట్‌ స్కోరును పరిశీలించుకోండి. ఏదైనా తప్పులు ఉంటే దిద్దుకోండి. తక్కువ క్రెడిట్‌ స్కోరు ఉన్నవారికి కాస్త అధిక వడ్డీకి రుణం అందుతుంది.
బేరమాడండి..
చాలామందికి తమ క్రెడిట్‌ నివేదికను చూపించి వడ్డీ రేట్ల విషయంలో బేరమాడొచ్చనే సంగతి తెలియదు. మంచి క్రెడిట్‌ స్కోరు ఉన్నప్పుడు బ్యాంకు అధికారులతో మీకు అందిస్తున్న వడ్డీ రేటు విషయంలో బేరమాడేందుకు అవకాశం ఉంటుంది. వడ్డీ రేటును తగ్గించడమో.. లేదా పరిశీలనా రుసుములు రద్దు చేయడమో చేయాల్సిందిగా కోరవచ్చు. దీనివల్ల మీపై అదనపు భారం లేకుండా ఉంటుంది.
తక్కువ వడ్డీకి ఎక్కడ..
ఇప్పటికే మీ పొదుపు ఖాతా ఉన్న బ్యాంకు నుంచే ఇంటి రుణం తీసుకోవాలని అనుకోవద్దు. దీనికన్నా.. ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తక్కువ వడ్డీ రేటుకు రుణాలు అందిస్తున్నాయా చూసుకోవాలి. ముందుగా వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి? మీకు అవసరమైన మొత్తం రుణం లభిస్తుందా లేదా అనే విషయాల కోసం కొంత ముందస్తు సన్నద్ధత తప్పనిసరిగా అవసరం. మీకు ఇప్పటికే ఇంటి రుణం తీసుకొని ఉంటే.. ఏదైనా బ్యాంకు దీనికన్నా తక్కువ వడ్డీకే రుణం ఇస్తుందా పరిశీలించండి. వీలైనంత వరకూ ఎక్కడ తక్కువ వడ్డీకి రుణం దొరుకుతుందో చూసుకోండి. దీనివల్ల మీకు కొంత భారం తగ్గినా.. ఉపయోగమే కదా.. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ముందస్తు చెల్లింపులు చేస్తే.. ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయవు బ్యాంకులు.
అధికంగా చెల్లించండి
రుణం తీసుకున్న తొలినాళ్లలో వీలైనంత వరకూ ఎక్కువ ఈఎంఐని చెల్లించేందుకు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే.. రుణం తీసుకున్న తర్వాత వాయిదాలు చెల్లిస్తున్నప్పుడు తొలినాళ్లలో వాయిదాలోని అధిక మొత్తం వడ్డీకిందకే వెళ్తుంది. దీనివల్ల మీకు అదనపు భారమే.. దీన్ని నివారించాలంటే.. మొదటి నెలల్లో కాస్త అధిక మొత్తంలో వాయిదాలు చెల్లించాలి. ఇక్కడ మరో విషయం.. ఎప్పుడైనా సరే.. బ్యాంకులు రుణ మొత్తంలో రుణగ్రహీతలు 15-20శాతం వరకూ ముందస్తు చెల్లింపు చేయాల్సిందిగా కోరుతుంటాయి. వీలైనంత మొత్తాన్ని మీరు చెల్లించి, మిగతాదే రుణం తీసుకోండి. మీరు ఎక్కువ డౌన్‌ పేమెంట్‌ చెల్లిస్తుంటే.. బ్యాంకులు కూడా మీకు రుణం ఇవ్వడానికి ఎంతో ఆసక్తి చూపిస్తాయి. కొన్నిసార్లు తక్కువ వడ్డీకి రుణం ఇచ్చేందుకు కూడా సిద్ధం కావచ్చు.
వీలైనంత ఎక్కువగా..
రుణ వ్యవధి కొనసాగుతున్నప్పుడు వీలైనప్పుడు కొంత మొత్తాన్ని అసలులో చెల్లించాలి. దీనివల్ల రుణం తొందరగా తీరేందుకు అవకాశం ఉంటుంది. ఏడాదికోసారి వచ్చే బోనస్‌లాంటివి ఇందుకు ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల వడ్డీ భారం గణనీయంగా తగ్గుతుంది. పైగా అసలు మొత్తం తగ్గడంతో రుణం తొందరగా తీరేందుకు అవకాశం ఉంటుంది. మీరు ఎంత మొత్తం ఎక్కువగా కడితే.. అంత భారం తొందరగా తగ్గించుకోవచ్చు. గృహరుణ భారం తగ్గించుకోవాలంటే.. ముందుగా మన రుణ నిర్వహణ, పెట్టుబడుల ప్రణాళిక కచ్చితంగా ఉండాలి. అనుకోకుండా వచ్చిన డబ్బును రుణ చెల్లింపులకు వాడటం వల్ల వడ్డీ భారం తగ్గుతుంది..

బాల్యంలోకి అడుగులేద్దాం_GotoPastChildLife


 బాల్యంలోకి అడుగులేద్దాం GotoPastChildLife GotoPastLife Childhood ChildhoodMemories ChildhoodLife Bhakthi Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu Bhakti Pustakalu Eenadu EenaduEditorialNews EenaduSundayPaper


బాల్యంలోకి అడుగులేద్దాం!

అప్పుడే మనసుకు ఆరోగ్యం, ఆనందం


బాల్యం... ఓ మధుర జ్ఞాపకం. చిరకాలం నిలిచిపోయే శిలాక్షరం. కల్లాకపటం ఎరుగని మనస్తత్వం.. ఉన్నది ఉన్నట్లు బయటికి చెప్పేసే బోళాతనం.. కొత్తకొత్త విషయాల్ని తెలుసుకోవాలనే ఉత్సాహం.. ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసే అమాయకత్వం.. ఆటలతో ఆరోగ్యాన్ని పెంచుకునే చలాకీతనం.. ఇవన్నీ బాల్యానికే సొంతం. ‘మళ్లీ ఆ రోజులొస్తే ఎంత బావుండు’ అని ఆశపడని మనసుండదు. మరి ఆ రోజులు మళ్లీ రావాలంటే పెద్దయ్యాక ఏం చేయాలి? మన జీవన శైలిని కొద్దిగా మార్చుకుంటే.. ఎంచక్కా ఆ ‘పాత మధురాల్ని’ ఆస్వాదించొచ్చు, ఒత్తిడికి దూరం కావొచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చిన్న నాటి అలవాట్లను పునరావృతం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రత్యేక కథనం..

పెద్దల్లో కంటే పిల్లల్లో విశ్వాసం, ధైర్య సాహసాలు ఎక్కువగా ఉండటానికి కారణాలు వారికి ఉండే అలవాట్లే. ఆరోగ్యంగా ఎదగడానికి, పనిలో వేగంగా నైపుణ్యం సాధించడానికీ బాలలకు ఈ అలవాట్లే ఉపకరిస్తున్నాయి. పెద్దయ్యాక ఇదే అలవాట్లను పునరావృతం చేస్తే జీవితంలో ఎన్నో అద్భుతాలు సాధించొచ్చు, మరెన్నో సమస్యలు, సవాళ్లు, ఒత్తిళ్లను అధిగమించొచ్చు.

త్వరగా నిద్రపోండి: రాత్రి 8 గంట కొట్టగానే నిద్రకు ఉపక్రమించి.. పొద్దున లేవగానే ఎంతో శక్తితో, చలాకీగా తిరిగే చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తున్నాయా!! ఆ రోజులు మళ్లీ రావాలంటే... రాత్రిపూట టీవీలు, నెట్‌ చూడటం, పార్టీలకు హాజరుకావడం.. ఇవన్నీ మానేసి త్వరగా నిద్రపోండి.

ఆటలు ఆడండి: చిన్నప్పుడు పాఠశాలలో, ఇంటికొచ్చాక ఒకటే ఆటలు!! ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచే బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, ఈత.. ఇలాంటి రకరకాల ఆటల్ని పెద్దయ్యాకా ఆడండి. మానసిక, శారీరకోల్లాసానికి క్రీడలు ఎంతో అవసరం.

ఫోన్లలో కాదు.. మిత్రుల్ని స్వయంగా కలవండి: బాల్యంలో మిత్రుడికి ఏదైనా విషయం చెప్పాలంటే స్వయంగా కలుసుకునే వాళ్లం. ఇప్పుడు ప్రతిదానికీ సెల్‌ఫోన్‌నే వాడేస్తున్నాం. అలా కాకుండా కొన్ని గంటలు ఫోన్‌ను పక్కనపెట్టి.. మిత్రుణ్ని స్వయంగా కలుసుకుని మనసువిప్పి మాట్లాడుకోండి.

అనుభూతుల్ని పంచుకోండి: పాఠశాలలో ఉపాధ్యాయుడు చెప్పిన విషయాలు, మిత్రుడితో గొడవ.. ఇలా ప్రతి విషయాన్ని ఇంటికొచ్చాక తల్లిదండ్రులతో చెప్పుకునే వాళ్లం. పెద్దవాళ్లయ్యాక.. అది మానేసి.. తలుపులు బిడాయించుకుని సినిమా చూడటమో, సెల్‌ఫోన్‌లో మాట్లాడటమో చేసున్నాం. అలా కాకండా తల్లిదండ్రులతో కూర్చుని కాసేపు ముచ్చట్లాడితే మనసు కుదుటపడుతుంది.

మరిన్ని ప్రశ్నలు అడగండి: కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం చిన్నప్పుడు తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, మిత్రుల్ని పదే పదే ప్రశ్నలతో ముంచెత్తేవాళ్లం.. గుర్తుందా!! నేర్చుకునే దానికి వయసు అడ్డుకాదు కాబట్టి పెద్దయ్యాకా .. ఇదే ధోరణి అనుసరించండి. ఇతరుల నుంచి తెలుసుకోవడానికి ప్రయత్నించండి.

కెఫిన్‌ వదిలేయండి: జ్యూస్‌ చిన్నప్పుడు ఎంతో ఇష్టమైన డ్రింక్‌. పండ్ల రసాల్లాంటి జ్యూస్‌ మన ఒత్తిళ్లను తగ్గించదని, కాఫీ తాగితే మంచిదని పెద్దయ్యాక అనుకుంటాం. ఆ ఆలోచన మానండి. మళ్లీ జ్యూస్‌ వైపు మళ్లండి.

మరిచిపోండి.. మన్నించండి: చిన్నప్పుడు ఎంతోమందితో గొడవపడుతుంటాం. దాన్ని మరిచిపోయి కొద్దిసేపటికే మళ్లీ స్నేహం చేసేస్తుంటాం. పెద్దయ్యాకా అలాంటి అలవాటే ఉంటే.. ఎన్నో సమస్యల నుంచి బయటపడొచ్చు. క్షమాగుణం అలవరచుకోవడం ముఖ్యం.

చదువుతూ నిద్రపోండి: నిద్రపోయే ముందు కాసేపు ఇంటర్నెట్‌ను ఆపేయండి. పుస్తకం చదవడం మొదలుపెట్టండి. కళ్లను ఒత్తిడికి గురిచేసే డిజిటల్‌ స్క్రీన్‌ కన్నా.. పుస్తకం చదవడం వల్ల త్వరగా, హాయిగా నిద్ర వస్తుంది.

ఎక్కువగా పట్టించుకోవద్దు: మన గురించి ఇతరులు ఎదో అనుకుంటున్నారని మరీ అతిగా ఆలోచించొద్దు. చిన్నపిల్లల మనస్తత్వంతో వ్యవహరించి...ఇతరులకు హాని చేయని రీతిలో.. మీకు ఏది మంచిది అనిపిస్తుందో అదే చేయండి.

అమ్మ చేతి వంటనే తినండి: చిన్నప్పుడు అమ్మచేసిన వంట తినడం వల్లే ఆరోగ్యంగా పెరిగాం. కాబట్టి పెద్దయ్యాకా... బయటి తిండిల జోలికి వెళ్లకుండా అమ్మ చేసిన ఆహారాన్నే తినండి.

ఉన్నది ఉన్నట్లు చెప్పండి: నిజమేందో, అబద్ధమేందో విశ్లేషించే సామర్థ్యంలేని బాల్యంలో మనసులో ఏది అనిపిస్తే దాన్ని బయటికి చెప్పేసేవాళ్లం. ఇప్పుడూ అలాంటి అలవాటే చేసుకోండి. అన్ని విషయాల్నీ మనసులో దాచేసుకుని మనశ్శాంతిని కోల్పోవద్దు.

ప్రేమిస్తున్నానని చెప్పండి: మీరు ఎవరినైనా అభిమానిస్తున్నా.. ప్రేమిస్తున్నా ఆ విషయాన్ని మనసులో దాచుకోకుండా వెంటనే చెప్పేయండి. బాల్యంలో అలా చెప్పడం వల్లే ఎందరో స్నేహితులు, అభిమానుల్ని సంపాదించుకోగలిగాం.

కావాల్సింది అడిగేయండి: చిన్నప్పుడు మనకు ఏదైనా కావాల్సి వస్తే నిర్భయంగా మన చుట్టూ ఉన్న వాళ్లను అడిగేసే వాళ్లం. పెద్దయ్యాక ఎందరం అలా అడుగుతున్నాం? అలా అడగకుండా ఎన్నిసార్లు నష్టపోలేదు? కాబట్టి అడగడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సంకోచించొద్దు.

క్షమాపణ తప్పుకాదు: ఏదైనా తప్పుచేసినపుడు క్షమాపణ చెప్పడం తప్పుకాదు. అది మన గౌరవాన్ని పెంచుతుంది. అపోహల్ని తొలగిస్తుంది. ఇతరుల మనసు బాధపడిందని గుర్తించినపుడు చిన్నపిల్లలు క్షమాపణ చెబుతారని గుర్తించడం మరవకండి.

ఓటమికి వెరువద్దు: ఓ పనిలో వైఫల్యం చెందినా.. పిల్లలు పదేపదే ప్రయత్నించి విజయాలు సాధించిన సందర్భాలు అనేకం. అందువల్ల పెద్దయ్యాకా.. ఓడిపోయామని భయపడకుండా మళ్లీ మళ్లీ విజయం కోసం ప్రయత్నించండి.

ఆసక్తిని చంపుకోవద్దు: ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి చిన్నప్పుడు చూపే ఆసక్తి చాలా ఎక్కువ. పెద్దయ్యాకా ఇదే అలవాటును కొనసాగించండి.

ఏడవండి: బాధేసినపడు ఇతరులు చూస్తున్నా సరే చిన్నప్పుడు గట్టిగా ఏడ్చేవాళ్లం. ఇప్పుడు ఒంటరి ప్రదేశంలో ఉన్నా సరే.. బాధను మనసులోనే దిగమింగుకుంటున్నాం. కానీ ఏడవడం వల్ల మనలోని బాధ చాలావరకు తగ్గిపోతుంది. మనసు కుదుటపడుతుంది. ఆరోగ్యానికీ మంచిది.
                 

మాట వినడంలేదా_HyperactiveChildren


మాట వినడంలేదా HyperactiveChildren DrPurnimaNagaraja ChildrenPsychology NowdaysChildren BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu BhaktiPustakalu Eenadu EenaduVasundara


మాట వినడంలేదా... అందుకేనేమో!

చేతిలోని బొమ్మను గట్టిగా నేలకేసి కొట్టి, విసురుగా గదిలోకి వెళ్లిపోయింది ఆరేళ్ల సుధ. లోపలికి వెళ్లి తలను గోడకేసి కొట్టుకోవడం ప్రారంభించింది. ‘మంకు పట్టు, ఫోన్‌ తీసుకుంటేనే ఇంత కోపమా..’ అంటూ తల్లి లోపలికి వెళ్లి, ఆ పాప వీపుపై మరో రెండు దెబ్బలు వేసింది.
ఎనిమిదేళ్ల విజయ్‌... చాలా గట్టిగా మాట్లాడతాడు. అల్లరి. మాట వినడు. చురుకే కానీ నిలకడ లేదు. చదువూ అంతంత మాత్రమే. ఏం చేస్తే మాట వింటాడో తెలియదు అంటుంది వాళ్లమ్మ.



వీళ్లనే కాదు... చిన్నవయసులోనే మంకుపట్టూ, పేచీకోరు తత్వం.. వంటివన్నీ అతిగారం వల్లే అని తల్లిదండ్రులు అనుకుంటే... కాదు అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్‌ కావచ్చని చెబుతారు డాక్టర్లు. ఈతరం చిన్నారుల్లో ఎక్కువశాతం మందిలో ఈ సమస్య సర్వసాధారణం అంటున్నారు.

పైవి సాధారణంగా కనిపించే లక్షణాలు అయితే...
* స్కూలుకెళ్లే పిల్లలు చెప్పిన సమయానికి హోంవర్క్‌ చేయకపోవడం...
* దేనిమీదా ఏకాగ్రత లేకపోవడం, కుదురుగా ఉండకపోవడం...
* ఎదుటివాళ్లు చెప్పేది వినకపోవడం...
* అతి చురుకు... భరించలేని దుడుకుతనం... ఇవన్నీ ఆ లక్షణాలే.
పండగ వస్తోంది. దుస్తులు కొనడానికి గౌతమ్‌తో షాపింగ్‌కు వెళ్లింది వాణి. అక్కడ గౌతమ్‌ అల్లరి హద్దులు దాటిపోయింది. ఏ దుస్తులు చూపించినా ఓ వైపు వద్దని చెబుతూ, మరో వైపు వేరే పిల్లల వద్ద ఉన్న బొమ్మల్లాంటివి తనకూ కావాలంటూ వాడు చేస్తున్న మారాం చూస్తే వాణీకేం చేయాలో తోచలేదు. కాసేపటికి కొంటావా లేదా అంటూ.. కిందపడి ఏడవడం మొదలుపెట్టాడు. తాము కోరుకున్నది వెంటనే దక్కకపోతే పిల్లలు ఈ రకంగా ప్రవర్తించడం కూడా వారిలో ఉన్న హైపర్‌ యాక్టివిటీ ప్రభావమే అంటున్నారు నిపుణులు. మరి కొందరు చిన్నారులయితే తల్లిదండ్రుల మాటకు ఎప్పుడూ వ్యతిరేకంగానే ప్రవర్తిస్తారు. చిన్నారుల్లో కనిపించే ఈ విపరీత ప్రవర్తనను నియంత్రించడం అనుకున్నంత సులువేం కాదు.

చురుకే కానీ...
ఈ చిన్నారులు సాధారణంగా చాలా తెలివైనవారే. అందులో సందేహం లేదు. కానీ ఇతర అంశాల్లో మాత్రమే వీరు చురుగ్గా ఉంటారు. చదువు విషయంలో ముఖ్యంగా తరగతి గదిలో కూర్చుని పాఠాలు వినడానికి మాత్రం ఆసక్తి చూపించరు. ఎందుకంటే వీరు ఆడే వీడియోగేమ్స్‌, ఇతర ఆటలు చాలా వేగంగా ఉంటాయి. దాంతో పోల్చుకుంటే ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు చాలా నెమ్మదిగా అనిపించి, పూర్తిగా అనాసక్తులవుతారు. ఏకాగ్రతను కోల్పోతారు.



తల్లిదండ్రులూ కారణమే...
నెలలు నిండకుండానే పుట్టడం, మెదడు అమరికలో లోపాలూ, జన్యుపరమైన సమస్యలూ, పోషకాహార లోపం వంటివి ఈ సమస్యకు దారితీస్తాయి. కొన్నిసార్లు ఇంటి వాతావరణం కూడా పిల్లల్లో ఈ సమస్యను పెంచుతుంది. తల్లిదండ్రులు ఉద్యోగులు కావడం... పిల్లలతో కలిసి గడిపే సమయం తక్కువైపోవడంతో వారు ఒంటరితనానికి గురి అవుతున్నారు. దాంతో తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నప్పుడు దృష్టంతా తమపైనే ఉండాలనే ఉద్దేశంతోనూ అతిగా ప్రవర్తించే అవకాశాలు ఉన్నాయి. సమస్య ఉన్నా, కారణం ఏదయినా వీరిలో తెలివితేటలు మాత్రం ఎక్కువే. ఏ విషయాన్నైనా క్షణాల్లో పట్టేసేంత చురుగ్గా ఉంటారు. అన్నీ వేగంగానే చేస్తారు. అందుకే చేతిరాత కూడా బాగోదు. అలాగని వీరు అసమర్థులు కారు.
సాధారణంగా ఈ ప్రవర్తన మూడు స్థాయుల్లో ఉంటుంది. మొదటి రెండు దశల్లో తల్లిదండ్రుల చేయూతతోనే వారిలో మార్పు తీసుకురావచ్చు. సమస్య మూడో దశలో ఉంటే గనుక మానసిక వైద్య నిపుణుల దగ్గరకు తీసుకెళ్లడం మంచిది. ముఖ్యంగా బిహేవియరల్‌ థెరపీ ద్వారా మార్పు తెస్తారు.
ప్రణాళిక పెట్టాలి...  
వాళ్ల జీవనవిధానంలోనే కాదు, కుటుంబపరంగానూ కొన్ని మార్పులు చేయడం కూడా అవసరమే.
* చిన్నారులకు సమయాన్ని కేటాయించాలి. వారి అభిప్రాయానికి విలువనివ్వాలి. వారు ఏం చెబుతున్నారో ప్రశాంతంగా వినాలి. వారికోసమే ఉన్నామనే విషయాన్ని చిన్నారులకు తరచూ తెలియజేయాలి. వీరితో కలిసి ఆడటం, కబుర్లు చెప్పడం, అనుక్షణం బిజీగా ఉంచడం వంటివి చేయడం వల్ల నెమ్మదిగా మార్పు కనిపిస్తుంది. 
* కొందరు తల్లిదండ్రులు ‘నీకు నలుగురిలో ఎలా ఉండాలో తెలియదు..’ అంటూ వారిని బయటకు తీసుకెళ్లరు. కానీ అది పొరపాటు. దగ్గర్లోని పార్కులకూ, బంధువుల ఇళ్లకు తీసుకెళ్లాలి. నలుగురిలో ఎక్కువగా కలవనివ్వాలి. దానివల్ల ఎవరితో ఎలా ప్రవర్తించాలనేది వారే నెమ్మదిగా నేర్చుకుంటారు.
* వారిలో ఏకాగ్రత పెరిగేలా చెస్‌, మ్యాపింగ్‌, స్పెల్లింగ్‌ బీ, సుడోకు, పదబంధాలు పూర్తిచేయించడం, వర్డ్‌ గేమ్స్‌... వంటివి ఆడించాలి. వీటితో వారిలో నెమ్మదిగా ఏకాగ్రత పెరుగుతుంది. ఒకసారి ఏకాగ్రత పెరిగిందంటే చాలు, ఈ తరహా  చిన్నారులు చదువులో ముందుంటారు.
* వాళ్ల దినచర్యకు ఓ పక్కా ప్రణాళిక ఉండాలి. నిద్ర లేవడం నుంచీ రాత్రి నిద్రపోయేదాకా అన్నీ ఆ ప్రణాళిక ప్రకారం చేసేలా చూడాలి. అందులో హోంవర్క్‌ కూడా ఒకటి. కొన్నిరోజులు మీరు పక్కన ఉండి చేయిస్తే... క్రమంగా అలవాటు   పడిపోతారు.
* పిల్లల ప్రవర్తనను బట్టి ఓ చార్టు పెట్టి మార్కులు లేదా స్టార్‌ ఇవ్వడం వల్లా వారిలో మార్పు వస్తుంది. అప్పుడప్పుడూ ఓ బహుమతి ఇస్తే... ఇంకా ఎలా మారాలా అని ఆలోచిస్తారు.
* వ్యాయామం కూడా తప్పనిసరే. రోజూ ఓ గంట ఆడనిచ్చేలా చూడటమే కాదు, నడకా, తాడాట వాళ్లకిష్టమైన క్రీడ నేర్పించినా మంచిదే. వారికో వ్యాపకం ఉంటుంది.
ఆహారంలోనూ మార్పులు
ఈ చిన్నారులకు అందించే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. తీపి, కెఫీన్‌ ఉండే పదార్థాలూ, శీతలపానీయాలు వంటివి తగ్గించాలి. జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉంచాలి. పండ్లూ, కూరగాయలూ, ఇంట్లో వండిన పోషక పదార్థాలు ఎక్కువ తినిపించాలి. ఒమెగా త్రీ, సిక్స్‌ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా అందించాలి.




ఫోన్‌కి ఇద్దాం ఓ బ్రేక్‌_StopRelationWithSmartphone


ఫోన్‌కి ఇద్దాం ఓ బ్రేక్‌ StopRelationWithSmartphone Smartphone Phonephobia Nomophobia SmartphoneAddiction AddictionToSmartphone KillingRelationswithSmartphone Bhakthi Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu Bhakti Pustakalu Eenadu EenaduSundayMagazine SundayMagazineCoverstory



ఫోన్‌కి ఇద్దాం ఓ బ్రేక్‌!

స్మార్ట్‌ఫోన్‌... ఈ కాలపు అద్భుత ఆవిష్కరణ. సైకిల్‌ తర్వాత అత్యంత ప్రయోజనకరమైన సాధనం ఇదేనంటూ ప్రపంచమంతా జేజేలు పలుకుతున్న గ్యాడ్జెట్‌. దేశ, ప్రాంత, వర్గ, భాషా భేదాలు లేకుండా అందరి చేతుల్లో వెలిగిపోతున్న ఉపకరణం. వేలి స్పర్శతో వేయిన్నొక్క పనులు చేసి పెడుతోందంటూ సంబరంగా ఈ చిన్ని పరికరానికిగానీ అతుక్కుపోయామా... అంతే సంగతులు!

దంపతులిద్దరూ మంచం మీద చెరోవైపు తిరిగి పడుకుని ఉంటారు. మధ్యలో చార్జింగ్‌కి పెట్టిన రెండు సెల్‌ఫోన్లు. కింద ‘మేమిద్దరం మాకిద్దరు’ అంటూ ఓ వాక్యం.

‘కాసేపు ఆ ఫోను పక్కనపెడితే మూడుముళ్లూ వేయిస్తాను’ పెళ్లి పీటల మీద ఫోన్లతో బిజీగా ఉన్న వధూవరులను బతిమాలుతుంటాడు పురోహితుడు.

‘ఇద్దరు వ్యక్తులు ఎదురెదురుగా నిలబడి మాట్లాడుకుంటున్నారంటే ఏమిటి అర్థం?’‘వాళ్లిద్దరి ఫోన్లూ ఛార్జింగ్‌లో ఉన్నాయని..!’

సామాజిక మాధ్యమాల్లో తలమునకలవుతున్నవారి గురించి ఆ మాధ్యమాల్లోనే ఇలాంటి జోకులు ఎన్నో. సెల్‌ఫోన్‌ ఇప్పుడు చాలా స్మార్ట్‌గా మన జీవితాల్లోకి చొచ్చుకువచ్చేసింది. పుష్కరం క్రితం అసలా పదమే లేదు నిఘంటువులో. ఇప్పుడు ప్రపంచమంతా దాని చుట్టూనే తిరుగుతోంది!

ఇంట్లో కుటుంబసభ్యులకు ఏనాడూ శుభోదయం చెప్పనివారు నేడు సామాజిక మాధ్యమాల్లో ముఖపరిచయమే లేని మిత్రులకు శుభోదయం చెప్పకుండా మంచం దిగడం లేదు. చాలామందికి ఇదో అబ్సెషన్‌ అయిపోయింది. మనదేశంలో మూడింట ఒక వంతు స్మార్ట్‌ఫోన్లలో రోజూ స్టోరేజ్‌ స్పేస్‌ అయిపోతుండడం చూసిన గూగుల్‌ దానిపై అధ్యయనం చేసింది. అందమైన ఫొటోలతో, దేవుళ్ల చిత్రాలతో ప్రజలు చెప్పుకొంటున్న ఈ శుభోదయం సందేశాలే అందుకు కారణమని తేల్చింది. గత ఐదేళ్లలో ఇలాంటి చిత్రాలకోసం గూగుల్‌లో వెదుకుతున్న వారి సంఖ్య పదిరెట్లు పెరిగిందట. ఈ సమస్య తగ్గించడానికే ‘స్టేటస్‌’ అనే ఫీచర్‌ను ప్రవేశపెట్టింది వాట్సాప్‌. అక్కడ ఒక్క ఫొటో పెట్టి, గుడ్‌మార్నింగ్‌ అని క్యాప్షన్‌ ఇస్తే అందరికీ చెప్పినట్లే. కానీ దాన్ని ఉపయోగించేవారు అరుదు. కొత్త సంవత్సరం నాడు ఒక్క మనదేశంలోనే రికార్డు స్థాయిలో రెండు వేల కోట్ల సందేశాలను ఫోన్లు చేరవేశాయి.ప్రపంచంలో మరే దేశంలోనూ ఇన్ని సందేశాలు నమోదవలేదు!

ఇది చాలదూ ఫోనుని మనం ఎంత ఎక్కువగా వినియోగిస్తున్నామో చెప్పడానికి.

ఫోను వాడితే తప్పేముంది?
తప్పేమీలేదు, ఫోను అవసరమే. అయితే ఆ వాడకానికి ఒక పరిమితి అంటూ లేకపోతేనే తిప్పలు. రెండువైపులా పదునున్న కత్తిలాంటిదీ స్మార్ట్‌ఫోను. దాంతో పనులూ చేసుకోవచ్చు. కాలక్షేపమూ చేయొచ్చు.దుర్వినియోగమూ చేయొచ్చు. దేనికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నామన్న దాన్నిబట్టి ఫోను మన నియంత్రణలో ఉందో లేక మనమే దానికి బానిసలమయ్యామో తెలుస్తుంది. ఫోన్‌ ద్వారా బంధుమిత్రుల యోగక్షేమాలు విచారించవచ్చు. ఉద్యోగ, వ్యాపార పనుల గురించి మాట్లాడొచ్చు. సందేశాలూ మెయిల్సూ పంపొచ్చు. ఇంకా ఎన్నో పనులు చేయొచ్చు. వాటికి ఎంతో సేపు పట్టదు. బ్యాంకు లావాదేవీలూ ఇతరత్రా పనులూ రోజూ ఉండేవి కావు. అయినా ఎక్కువ సమయం ఫోనుతో గడుపుతున్నారంటే, ఫోను లేకపోతే చేతులు విరిచేసినట్లుగా ఇబ్బంది పడిపోతున్నారంటే- ఫోనుతో గడపడమనేది వారికి వ్యసనంగా మారిపోయిందనే అర్థం. కొందరు సామాజిక మాధ్యమాలు ఎక్కువగా చూస్తుంటారు. తమ పోస్టుకి లైకులూ కామెంట్లూ ఎన్నొచ్చాయోనని పదినిమిషాలకోసారి చెక్‌ చేస్తుంటారు. కొందరు ట్విటర్‌ని అనుసరిస్తుంటారు. అనుక్షణం అప్‌డేట్స్‌ కావాలి వారికి. ఇంకొందరు అవసరం ఉన్నా లేకపోయినా వారికి తోచిన విషయం గురించి అంతర్జాలంలో శోధిస్తుంటారు. వీరే కాదు, వీడియోలూ, సినిమాలూ చూసేవారూ; గాసిప్స్‌ చదివేవారూ; ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేవారూ; గంటల తరబడి గేమ్స్‌ ఆడేవారూ... ఇలా ఎందరో తమను తాము సెల్‌ఫోన్‌తో కట్టేసుకుంటున్నారు. తింటున్నా, రోడ్డుమీద నడుస్తున్నా, వాహనం నడుపుతున్నా, ఆఖరికి నిద్రపోతున్నా చేతిలో సెల్‌ఫోను వదలడం లేదు ఇలాంటివారు.

దాన్ని వ్యసనమని ఎలా అంటారు?
చాలామందికి ఫోన్‌ అబ్సెషన్‌ అంటున్నారు దీనిపై పరిశోధన చేసిన నిపుణులు. అంటే వారి ‘మనసంతా ఫోనే’ ఆక్రమించేసి ఉంటోందట. ఆ దశ కూడా దాటి కొందరు వ్యసనం స్థాయికి చేరుకుంటున్నారన్నది నిపుణులు చెప్తున్న లెక్క. ఇప్పుడిది ప్రపంచ దేశాలన్నీ ఎదుర్కొంటున్న సమస్య. మన దేశ పరిస్థితి చూస్తే...
* సెమిస్టర్‌ పరీక్షలు పాస్‌ కాకపోవడంతో ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని కళాశాలనుంచి పంపించేశారు... రోజూ 14 గంటలు ఫోనుతో గడుపుతూ చదువు వదిలేసిన ఆ అబ్బాయిని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. పాఠాలు వినకుండా ఫోనుతో ఆడుకుంటున్నాడని 16 ఏళ్ల కుర్రాడి ఫోనును స్కూలు యాజమాన్యం తీసుకుంది... ఆ అబ్బాయి మరో ఫోను కొనుక్కోడానికి తండ్రి జేబులో డబ్బు దొంగిలించాడు. దిల్లీలోని ఎయిమ్స్‌కి ఇలాంటి కేసులు ఎన్నో వస్తున్నాయి. పరిస్థితులు చేతులు దాటితే కానీ అవి ఆస్పత్రిదాకా రావన్నది వాస్తవం. హైదరాబాద్‌లోనూ
ఖరీదైన ఫోన్లు కొనుక్కోవడానికే ఎక్కువ మంది విద్యార్థులు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల పరిశీలనలో తేలింది.
* 13-24 మధ్య వయసువారిలో గత ఏడాదిలోనే ఫోన్‌ ఎడిక్షన్‌ సమస్య 75 నుంచి 100 శాతం వరకూ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటివారికి ఎంఆర్‌ఐ, సీఏటీ స్కాన్‌ పరీక్షలు చేసినప్పుడు వాటి ఫలితాలు హెరాయిన్‌, కొకైన్‌ లాంటి మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డవారి ఫలితాలను పోలి ఉండడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.
* రెండేళ్ల క్రితం జరిగిన ఓ అధ్యయనంలోనే స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నవారిలో 83 శాతం దాన్ని పక్కనే పెట్టుకు పడుకుంటున్నారని తెలిసింది. 57 శాతం ఫోను లేకుండా తాము బతకలేమని చెప్పారట.
* నానాటికీ డేటా చౌకగా లభించడమూ కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌ని ముంచెత్తడం వల్ల ఈ సమస్య భవిష్యత్తులో ఎన్నో రెట్లు పెరుగుతుందని క్రిసిల్‌ రీసెర్చ్‌ ఆందోళన వ్యక్తంచేస్తోంది.
* చాలామంది నవతరం తల్లిదండ్రులు పిల్లల్ని ఆడించడానికి ఫోనుల్ని వాడుకుంటున్నారన్నది నిపుణుల ఫిర్యాదు. ఫోనులో రైమ్సో, కార్టూన్‌ ఫిల్మో పెట్టి పసిపిల్లలు అది చూస్తుంటే తాము పనులు చేసుకుంటున్నారనీ ఈ అలవాటే పిల్లల్ని ఫోనుకు అలవాటు చేస్తోందనీ పెద్దయ్యాకా అది పోవడం లేదనీ నిపుణులంటున్నారు.

ఇది వ్యసనంగా మారిందని ఎలా తెలుస్తుంది?
* ఫోను లేకుండా క్షణం కూడా ఉండలేను... అంటుంటారా?
* ఫోను వాడే విషయంలో కుటుంబ సభ్యులకూ మీకూ మధ్య తరచూ విభేదాలు తలెత్తుతున్నాయా?
* చదువూ, ఇంటి పనులూ, ఆఫీసు పనులను సమయానికి పూర్తిచేయలేకపోతున్నారా?
* మనసు బాగోనప్పుడల్లా ఫోన్‌ ఆన్‌ చేస్తున్నారా?
* చదువు/ఉద్యోగం తప్ప మరో హాబీ లేదా? మిగిలిన సమయం అంతా ఫోనుతోనేనా?
* పనిలో ఉన్నా సోషల్‌ మీడియా పోస్టులూ లైకులూ కామెంట్ల గురించీ ఆలోచిస్తుంటారా?
* కాసేపు ఫోనుకి దూరంగా ఉండాల్సి వస్తే చిరాకుపడిపోతున్నారా?
* స్నేహితులను కలిసి మాట్లాడడంకన్నా ఫోనుతో గడిపే సమయమే ఎక్కువగా ఉంటోందా?
* భోజనం చేసేటప్పుడూ పడుకున్నప్పుడూ ఫోను పక్కనే పెట్టుకుంటున్నారా?
... పై తొమ్మిది ప్రశ్నల్లో కనీసం ఆరింటికి ‘అవును’ అన్నది సమాధానమైతే ఫోను వాడకం వ్యసనంగా మారినట్లే లెక్క.

ఫోను ఉంది వాడుకోడానికేగా, ఎక్కువసేపు వాడితే నష్టమేముంది?
ఫోను అవసరానికి వాడాలి. అనవసరంగా వాడితే నష్టమే. ఎవరికి వారు తమ ఫోన్లకి అతుక్కునిపోవడం వల్ల ముఖ్యంగా మానవసంబంధాలు దెబ్బతింటున్నాయని పరిశోధకులు తేల్చిచెబుతున్నారు. ప్రత్యక్ష స్నేహ సంబంధాల కన్నా వర్చువల్‌ స్నేహాలు ఎక్కువవుతున్నాయనీ, ముఖ పరిచయం లేకుండా దూరంగా ఎక్కడో ఉన్నవారితో చాటింగ్‌ చేసి ఆ స్నేహాలను నమ్మి జీవితాలను పణంగా పెట్టే యువతీయువకులు ఎక్కువవుతున్నారనీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సాంకేతికత వాడకం ఎక్కువైన కొద్దీ మనుషులు యంత్రాల్లా మారిపోతున్నారన్నది వాస్తవం. ఏకాగ్రత తగ్గడమూ, మానసిక ఒత్తిడి పెరగడమూ, నిద్రలేమీ, కుంగుబాటూ, ఒంటరితనమూ ఫోను ఎక్కువగా వాడేవారిలో కన్పించే లక్షణాలు. ఒత్తిడితో బాధపడుతున్నవారికి ఉద్యోగ, కుటుంబ జీవితాలను సమన్వయం చేసుకోమని ఒకప్పుడు నిపుణులు సలహాలిచ్చేవారు. ఆ వర్క్‌ లైఫ్‌ బ్యాలన్స్‌ కాస్తా ఇప్పుడు టెక్‌ లైఫ్‌ బ్యాలన్స్‌గా మారింది. ఫోను వాడకం మానసికాందోళనను పెంచుతున్నట్లు కాలిఫోర్నియా యూనివర్సిటీలో జరిగిన ఒక అధ్యయనం తేల్చింది. ఫోను కనపడకుండా ఉంటే ఏదో కోల్పోయినట్లు అన్పించడమూ ఫోను మోగకపోయినా మోగినట్లు అనుభూతి చెంది పదే పదే తీసి చూడడమూ, పలకరిస్తే చికాకు పడడమూ... ఇలాంటివి ఫోను వ్యసనంగా మారుతోందనడానికి నిదర్శనాలు.   

శిరోజాలకు పూల సొగసు!_TraditionalHairStyle


శిరోజాలకు పూల సొగసు! TraditionalHairStyle Poolajada DesignerPoolajada PuvvulaJada BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustkalau BhaktiPustakalu Eenadu Eenadu SundayMagazine Sunday Magazine


శిరోజాలకు పూల సొగసు!

పెళ్లంటే- పందిళ్లు, సందళ్లు తప్పెట్లు, తాళాలు తలంబ్రాలు... అన్నది పాతకాలం పాట. పెళ్లంటే- పట్టు చీరలూ వర్కు బ్లౌజులూ, లంగాఓణీలూ గాగ్రా చోళీలూ, సరికొత్త నగలూ శిరోజాలంకరణలూ... ఇలా ఎన్నో ఎన్నెన్నో... అన్నది నేటితరం మాట. మొత్తమ్మీద చెప్పొచ్చేదేమంటే పెళ్లంటేనే పెళ్లికూతురి అలంకారం. అందులో మరీ ప్రత్యేకం... పూల కేశాలంకారం. 
పెళ్లి అలంకారంలో శిరోజాలంకరణకే ఈతరం అమ్మాయిలు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే పెళ్లి కుదరగానే ఓ హెయిర్‌స్టైలిస్ట్‌నీ మాట్లాడుకుంటున్నారు. అయితే పెళ్లికూతురు అలంకరణ అనగానే ఎవరికైనా ముఖ్యంగా దక్షిణాదివాళ్లకి ముందుగా గుర్చుకొచ్చేది పూలజడే. ఎందుకంటే కుందనపుబొమ్మలా తీర్చిదిద్దినట్లు పొందికగా చీర కట్టడం, ముఖానికి చెరిగిపోకుండా మేకప్‌ వేయడం, కదలకుండా నగల్ని పెట్టడం... ఇవన్నీ ఒక ఎత్తయితే, చెక్కు చెదరకుండా శిరోజాల్ని జడగా అల్లి, పూల జడ కుట్టడం ఒక్కటీ మరో ఎత్తు. అందుకే కుటుంబసభ్యుల్లో బాగా వచ్చినవాళ్లే ఈ జడ అల్లి, పూలవాళ్లు తెచ్చిన రెడీమేడ్‌ పూలజడను కదలకుండా కుడతారు. అయితే అది ఒకప్పటి సంగతి.

డిజైనర్‌ పూలజడ! 
ఈనాటి అమ్మాయిలకి జడ వేయాలన్నా కూడా హెయిర్‌ స్టైలిస్టులు రావాల్సిందే. లేదంటే జడల అల్లికలో బాగా నైపుణ్యం ఉన్నవాళ్లే వేయాలి. ఎందుకంటే పూలజడకోసమైనా ఏదో సాదా సీదా జడ అల్లేస్తే అస్సలు కుదరదు మరి. ముందుభాగంలో పఫ్‌ మాదిరిగా పైకి లేచినట్లో మెలి తిప్పినట్లో లేదూ పై భాగంలో కూడా ఏదో కిరీటం పెట్టినట్లో పక్కకు దువ్వినట్లో... ఇలా రకరకాలుగా జుట్టుని మడిచి పిన్నులు పెట్టి మరీ జడ అల్లాలి.

అల్లికలో కూడా ఫిష్‌, ఫిష్‌ టెయిల్‌, ఫ్రెంచ్‌, డచ్‌, మల్టీ బ్రెయిడ్‌... ఇలా చాలానే ఉన్నాయి. ఇదంతా పూర్తయ్యాక అలంకరించే పూలజడల్లో కూడా వందల రకాలు. గతంలో మాదిరిగా మల్లెలూ గులాబీలూ కనకాంబరాలూ లిల్లీలూ... వీటితోనే నేరుగా జడ తయారుచేయడం లేదు. 
నారింజ, పసుపు, గులాబీ, పీచ్‌... ఇలా భిన్న రంగుల్లో ఉండే విభిన్న రకాల ఆర్కిడ్లూ గులాబీ రేకులతో కూడా జడల్ని ప్రత్యేకంగా డిజైన్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్కిడ్లతో చేస్తే త్వరగా వాడిపోకుండా ఉంటాయన్న కారణంతో వాటిని ఎక్కువగా వాడుతున్నారు. అలాగే తాజా మల్లెలతోబాటు బంగారురంగు వేసిన ఎండు మల్లెల్నీ ఆకుల్నీ జడ మొదల్లో అందంగా కుడుతున్నారు. కొందరయితే కాగితం, ప్లాస్టిక్‌ పూలతోబాటు ముత్యాలూ రాళ్లూ కూడా మధ్యమధ్యలో చొప్పిస్తున్నారు. అలాగే మొత్తంగా పూలతో కుట్టిన జడలు కొన్నయితే, మల్లె మొగ్గల్ని నెట్‌ మాదిరిగా గుది గుచ్చి జడ చుట్టూ తొడిగినట్లుగా ఉండేవి మరికొన్ని. బంగారు జడ పెట్టి ఆపైన మాత్రమే గుండ్రంగా పూలు పెట్టి వదిలేస్తున్నారు కొందరు. జడబిళ్లల్నీ పూలనీ కలగలిపిన డిజైన్లతో జడను అలంకరించుకునేవాళ్లు ఇంకొందరు. మొత్తమ్మీద పూలజడ అనేది ఓ ప్రత్యేకమైన ముస్తాబుగా మారింది. దాంతో వీటిని తయారుచేసేందుకు పెళ్లి పూలజడడాట్‌కామ్‌ వంటి ప్రత్యేకమైన ఆన్‌లైబ్‌ వెబ్‌సైట్లు మనదగ్గరా పుట్టుకొచ్చాయి. దాంతో చీర డిజైనూ రంగూ దృష్టిలో పెట్టుకుని మరీ జడను రకరకాల పద్ధతుల్లో డిజైన్‌ చేయించుకుంటున్నారు. ఆ చేసే జడలు ఒకదాన్ని ఒకటి పోలి ఉండకుండా ఒక్కో జడనీ ఒక్కో ప్రత్యేక పద్ధతిలో తయారుచేస్తున్నారు. అందుకే నేటి పూలజడలన్నీ డిజైనర్‌ పూల జడలే సుమీ.

సిగలో పూల సోకు: 
పెళ్లయిపోయింది. రిసెప్షన్‌ ఇంకా మిగిలే ఉంది. అప్పుడు కూడా కుప్పెలూ సవరాలూ పెట్టి జడ అల్లితే ఏం బాగుంటుంది... అందుకే పెళ్లికి పూలజడ తప్పనిసరి అయినట్లే, రిసెప్షన్‌కి ప్రత్యేకమైన పూల హెయిర్‌స్టైల్‌ కావాల్సిందే అంటున్నారు కొత్త పెళ్లికూతుళ్లు. అందులో భాగంగా కాస్త వెరైటీగా ఉండేలా సిగల్ని చుట్టడం లేదా పిన్నులు పెట్టి జుట్టును రకరకాల పద్ధతుల్లో మడవడం, రింగులు తిప్పి వదిలేయడం... వంటి ప్రత్యేక హెయిర్‌స్టైల్స్‌ని ఆశ్రయిస్తున్నారు. సిగల్లో నడినెత్తిన పెట్టేవీ, మెడమీదుగా వేసేవీ, పక్కకు వేసేవీ కొన్నయితే; ముడిని సైతం జడ కోసం వేసినట్లే ముందుభాగంలో రకరకాల పద్ధతుల్లో జుట్టును మడిచి, పాయలుగా అల్లి, ఆపై పిన్నులు పెట్టి చుడుతున్నవి కొన్ని. సిగల్లో కూడా ముందు జట్టును కర్ల్స్‌ తిప్పి వేసేవీ ఉన్నాయి. పైగా ఈ ముడుల్లోనూ ఫ్రెంచ్‌ ట్విస్ట్‌, క్రిస్‌ క్రాస్‌, సైడ్‌ పార్టెడ్‌ రింగ్లెట్‌, ఎలిగెంట్‌ ట్విస్టెడ్‌, కర్లీ టెండ్రిల్స్‌, ఇంట్రికేట్‌ ఫ్లోరల్‌, డచ్‌ బ్రెయిడ్‌ బన్‌, రోజీ రింక్లెట్‌, పూల బొకె... ఇలా పలు రకాలు.

ఇక, రింగులు తిప్పి వదిలేసే హెయిర్‌ స్టైల్స్‌ అయితే లెక్కే లేదు. సగం రింగులు తిప్పినవీ, ఉంగరాల మాదిరిగా మొత్తంగా తిప్పినవీ పైన తిప్పకుండా కింద మాత్రమే తిప్పి వదిలేసేవీ... ఇలా ఎన్నో వెరైటీలు.



హెయిర్‌ స్టైల్‌ పూర్తయ్యాక, ఆ స్టైల్‌కి తగ్గట్లుగా వాటిని గిన్నెపూలూ ఆర్కిడ్లూ కార్నేషన్లూ చామంతులూ గులాబీ రేకులూ మల్లెలతోబాటు బంగారుపూత పూసిన లోహపు పూలూ ప్లాస్టిక్‌ పూల కొమ్మలతో రకరకాల పద్ధతుల్లో ఎంతో అందంగా అలంకరిస్తున్నారు. మొత్తమ్మీద హెయిర్‌స్టైల్‌ ఏదయినా రంగుల పూల సోకులతో గుబాళిస్తూ పెళ్లి కొడుకునే కాదు, అతిథుల్నీ ఆకట్టుకుంటోంది నేటి పెళ్లికూతురు!




శిరోజాలకు పూల సొగసు! TraditionalHairStyle Poolajada DesignerPoolajada PuvvulaJada BhakthiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustkalau BhaktiPustakalu Eenadu Eenadu SundayMagazine Sunday Magazine


mohan publications price list