MohanPublications Print Books Online store clik Here Devullu.com

యాదాద్రి బ్రహ్మోత్సవం2017_YadadriBrahmotsavam







యాదాద్రి బ్రహ్మోత్సవం !



యాదాద్రి క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి విశాల శిఖరపు పర్వత గుహలో స్వామి కొలువుదీరడంతో యాదగిరిగా.. మహర్షుల ఆరాధనలకు చిహ్నంగా రుషి ఆరాధనా క్షేత్రం విరాజిల్లుతోంది యాదాద్రి. రుశ్యశృంగుని పుత్రుడు యాదరుషి తపస్సుకు మెచ్చిన స్వామి జ్వాలా నరసింహస్వామిగా.. యోగానందుడిగా.. గండబేరుండగా.. లక్ష్మీ నరసింహుడిగా.. ఉగ్ర నరసింహుడిగా ఐదు రూపాల్లో అవతరించాడు. అందుకే యాదాద్రి పంచ నారసింహ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. ఆపదలో అర్తత్రాణ పరాయణుడిగా కొలిచే వారికి కొంగు బంగారంగా ప్రసిద్ధికెక్కిన యాదాద్రి బ్రహ్మాత్సవాలు ఫిబ్రవరి 27 నుంచి ప్రారంభం కానున్న సందర్భంగా ప్రత్యేక కథనం. --గొట్టిపర్తి భాస్కర్ గౌడ్, (యాదాద్రి భువనగిరిప్రతినిధి)


నారసింహ చరితం: 
 యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ చరిత్ర సమస్తం ఆసక్తికరం. కాకతీయ రాజవంశీయులు కూడా స్వామి వారికి పూజలు జరిపి ఆలయ అభివృద్ధికి బాటలు వేశారు. యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురంలో లభించిన శాసనాల్లో ఈ విషయం వెలుగుచూసింది. 15 వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు శ్రీవారిని దర్శించుకున్నట్లు కొలనుపాకలో లభించిన శాసనం ద్వారా తెలుస్తున్నది. కీసరగుట్ట త్రిభువనమల్లుడు కూడా స్వామి వారిని సేవించిన వాడే. 13వ శతాబ్దంలో కాకతీయ వంశీయులు ఒక ఆయుర్వేద వైద్యుడికి ఈ స్థలాన్ని దానమిచ్చినట్లు చెప్తుంటారు. 600 సంవత్సరాల శాసనాలు లభ్యమయ్యాయి. యాదాద్రి గుట్టపై సింహాకారంలో స్వయంభుగా వెలసిన నరసింహుడు ఐదు అవతారాల్లో నెలకొని ఉన్నాడు. 



భక్తోత్సవాలే బ్రహ్మోత్సవాలు: 1964కు ముందు భక్తులే విరాళాలు సేకరించి ఉత్సవాలు నిర్వహించేవారు. వీటినే భక్తోత్సవాలు అని పిలిచేవాళ్లు. అటు తర్వాత ఆలయ నిర్వహకులే ఉత్సవాలు నిర్వహించడం ప్రారంభమైంది. వీటికి బ్రహ్మోత్సవాలుగా నామకరణం చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా దర్శనమిచ్చే దశావతారాలలో ప్రధానమైన జగన్మోహిని.. తిరువెంకటపతి.. రామావతరం.. శ్రీకృష్ణుడు.. వటపత్రశాయి అలంకారాలలో శ్రీవారు తన ఇష్టమైన గరుఢ.. శేష.. సింహ.. పొన్న వాహన.. అశ్వవాహనాలలో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు. ఉత్సవాలలో భక్తులను ఎక్కువగా అలరించే ఎదుర్కోలు మహోత్సవం.. తిరుకల్యాణ మహోత్సవం.. రథోత్సవం జరిగే రోజుల్లో యాదాద్రి కొండ అపర వైకుంఠంగా దర్శనమిస్తుంది. 



భక్తులకు అభయం : యాదాద్రి నరసింహమూర్తి దివ్యమైన మహిమలతో అభయమిచ్చి రక్షిస్తాడని భక్తుల నమ్మకం. అందుకే ఉత్సవాలు జరిగే పుణ్యదినాల్లో నరసింహస్వామి వారిని దర్శించి ప్రహ్లాద వరదా గోవిందా అని ఎలుగెత్తి వేడుకోవడం ద్వారా ఆపదలు తొలగిపోతాయని నృసింహ పురాణం తెలుపుతున్నది. ఒక చేతిలో శంఖం.. మరో చేతిలో చక్రం.. ఇంకో చేతిలో లక్ష్మీదేవి.. మరో చేతిలో వరదాభయ పద్మచిహ్నాన్ని ధరించిన లక్ష్మీనరసింహుడు ప్రహ్లాద నారద పరాశర పుండరీక.. వ్యాస సనకస నందాదుల హృదయ నివాసుడై భక్తులను కరుణిస్తున్నాడు. బ్రహ్మోత్సవ వేళ స్వామివారి కరుణాకటాక్షాలు మరింత ఎక్కువగా ఉంటాయనీ.. ఈ దర్శనం అనంత ఆనందాలు కలిగిస్తుందని భక్తుల నమ్మకం. 



 విష్ణు పుష్కరిణి: శ్రీమహావిష్ణువు పాదాలను బ్రహ్మదేవుడు కడుగగా ఏర్పడిందే విష్ణుపుష్కరిణి అని.. బ్రహ్మాండ పురాణాలలో చంద్రవంశపు రాజు సహస్ర నాయకుడైన భృగుమహర్షి యాదాద్రిలో నారసింహ మంత్రానుష్ఠన విధానాన్ని.. ఆలయ నిర్మాణం గురించి స్కంధపురాణంలో పేర్కొన్నారు. హిరణ్యకశ్యపుడి వధ తర్వాత దేవతలు.. రుషులు విష్ణువును ఎల్లవేళలా దర్శనం చేసుకోవడానికి అవకాశమివ్వాలని వేడుకుంటారు. యాదాద్రి కొండగుహలో లక్ష్మీ సమేతంగా వెలిసి యోగ.. జ్ఞాననేత్రాలకు దర్శన మివ్వగలనని వారికి ఇచ్చిన హామీ మేరకే ఇక్కడ వెలసినట్లు చెప్తుంటారు. అలా ఆ ఆనందంతో దేవతలు.. రుషులు.. సృష్టికర్త బ్రహ్మ.. శ్రీవారి పాదాలను కడిగిన తరువాత ఏర్పడిందే పుష్కరిణి. 



దివ్యజ్యోతి దర్శనం: నలభై రోజులపాటు నరసింహస్వామికి ప్రదక్షిణలు చేస్తే సకల సమస్యలు పరిష్కారమై మానసిక ప్రశాంతత పొందుతామని భక్తుల నమ్మకం. ఇక్కడ పితృకార్యాలు జరిపితే పితృదేవతలు తరించి వైకుంఠవాసులై సుఖిస్తారని.. వ్రత క్రతువులు చేస్తే అశ్వమేధయాగం చేసిన పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. విష్ణుపుష్కరిణిలో స్నానమాచరిస్తే సమస్త పుణ్యక్షేత్రాల్లోని తీర్థాలలో స్నానం చేసినంత మహాఫలం వస్తుందంటారు. బ్రహ్మోత్సవాలు జరిగే రాత్రులలో ఈ తీర్థానికి మధ్య అఖండ దివ్యమైన దివ్యజ్యోతి ప్రకాశిస్తుంది. ఈ జ్యోతిని సావిత్రి- గాయత్రి- అరుణ దేవతలుగా ఆరాధిస్తారు. ఈ జ్యోతి ప్రకాశం నుంచి సుదర్శన జ్యోతి వెలుగొంది సమస్తమైన దీర్ఘకాలమైన వ్యాధుల నుంచి భక్తులను విముక్తి చేస్తుందని విశ్వాసం. 



కల్యాణ వైభోగమే:శ్రీయాదాద్రీ శుడికల్యాణం... మన లక్ష్మీనరసింహుడి శుభలగ్నం అని ముక్కోటి దేవతలు.. లక్షలాది మంది భక్తులు వీక్షిస్తుండగా యాదాద్రి కొండపై శ్రీలక్ష్మీనరసింహుడి తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా జరుగుతుంది. తెలంగాణ తిరుపతిగా రాష్ట్రమంతటా వాసికెక్కిన శ్రీలక్ష్మీనరసింహుడు శ్రీలక్ష్మీ అమ్మవారితో లోక కల్యాణార్థం జరుపుకునే వివాహ వైభవం భక్తులకు కొంగు బంగారం కానుంది. లోకాలను రక్షించడమే దీక్షగా మాంగళ్యమనే తంతు సాక్షిగా శ్రీవారు.. దేవేరులు ఒక్కటయ్యే వేళలో శ్రీలక్ష్మీనరసింహుడి తిరుకల్యాణ మహోత్సవం వైభవంగా జరగనుంది. జై నారసింహ అంటూ భక్తులు జయజయ ధ్వానాలు చేస్తుండగా అమ్మవారి.. స్వామి వారి సేవలు పశ్చిమ గోపురం నుంచి కదులుతాయి.


రమణీయం.. ఇది కమనీయం: అంగరంగ వైభవంగా జరిగే యాదాద్రీశుడీ దివ్య విమాన రథోత్సవం భక్తులను ఆనంద పరవశులను చేస్తుంది. శ్రీవారి కల్యాణ తంతు జరిగిన మరుసటి రోజున అమ్మవారితో కలిసి శ్రీలక్ష్మీనరసింహుడు రథంపై ఊరేగుతారు. ఈ రథోత్సవాన్ని బరాత్ అని కూడా పిలుస్తారు. ఈ రథసేవ వైభవాన్ని వీక్షించడానికి భక్తులకు రెండు కళ్లూ చాలవు. రంగురంగుల పుష్పాలు.. కనులు మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోతుండగా రథంపై కొలువుదీరిన శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతారు. యాదాద్రి కొండంతా భక్తజనంతో కిక్కిరిసిపోతుంది. శ్రీవారు ఊరేగుతున్న దృశ్యాన్ని కనులారా గాంచితే పునర్జన్మ ఉండదని అర్థం. 



శివకేశవుల నెలవు: యాదాద్రి కొండపైన గల శ్రీపర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి వారి ఆలయం భక్తులకు కొంగుబంగారంగా విరాజిల్లుతున్నది. శివాలయం వేలాది మంది భక్తులతో అలరారుతున్నది. యాదాద్రి కొండ శివకేశవులకు నెలవుగా మారిందనడానికి ఇదే ఉదాహరణ. ఈ శివాలయంలో ప్రతి రోజు ఉదయాన్నే పూజలు ప్రారంభమవుతాయి. ఒకవైపు శ్రీమహావిష్ణువు, మరోవైపు పరమశివుడు యాదాద్రిని పునీతం చేస్తున్నారు. శివాలయంలో నవగ్రహాలు, ఆంజనేయస్వామి, నాగదేవత, గణపతి, కుమారస్వామిలను దర్శించుకోవచ్చు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆరు రోజుల పాటు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. శివపార్వతుల కల్యాణం భక్తులకు కన్నుల పండుగే. 



స్వప్నం సాకారం దిశగా: యాదాద్రిలో జరుగుతున్న పనులపై సీఎం నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. డిజైన్లు పూర్తి కావడానికి రెండేళ్ళు తీసుకున్నారు. 2015 దసరా రోజున పనులకు శంఖుస్థాపన చేయగా, 2017 దసరా నాటికి పనులను పూర్తిచేసే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు దేశంలోని ఎంతోమంది నిష్ణాతులు యాదాద్రి డిజైన్లను పరిశీలించారు. ప్రతీ ఒక్కరు ప్రశంసించడమే గాకుండా సీఎం చేస్తున్న యజ్ఞం సఫలం కావాలని ఆశీస్సులు అందజేశారు. ప్రధాన ఆలయాన్ని రెండున్నర ఎకరాలలో విస్తరిస్తూ కొండపైన మొత్తం పద్నాలుగు ఎకరాలలో చేపట్టిన పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. వెయ్యేళ్ల కాలం వరకు నిలిచి ఉండే అద్భుత నిర్మాణాలకు రంగం సిద్ధమైంది. 



ఘనమైన ప్రాకారాలు: యాదాద్రిలో నిర్మించనున్న ఆలయానికి ఘనమైన ప్రాకారాలు, మండపాలు సిద్ధమవుతున్నాయి. వైటీడీఏ పద్నాలుగు మంది శిల్పులకు పనులను అప్పగించారు. హయత్‌నగర్ వద్దగల కోహెడ, కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ, గుంటూరు జిల్లా నర్సారావుపేట దగ్గరలోని గుర్జేపల్లి, విజయవాడ సమీపంలోని మార్టూరులలో అపురూప శిల్పాలు సిద్ధమవుతున్నాయి. ఇందుకు నల్లని శిలలను (కృష్ణ శిలలును) ఉపయోగిస్తున్నారు. మంత్రముగ్ధమైన రీతిలో ఆధ్యాత్మికత ఉట్టి పడే కమనీయ ఆకృతులలో వాటిని తీర్చిదిద్దుతున్నారు. యాదాద్రి ఆలయంలోని ప్రధాన గర్భాలయం ఎదురుగా మహా మండపం నిర్మించనున్నారు. కృష్ణశిలలలో చక్కని ఆకారాలతో ఆలయ ప్రాకారాలను మలుస్తున్నారు. 



సప్తరాజ గోపురాలు: యాదాద్రిలో కృష్ణశిలతో నిర్మాణం కానున్న ప్రాకారాలు, మండపాలు ప్రపంచంలోనే పేరెన్నికగన్న తంజావురులోని శిల్ప సంపదకు దీటుగా రూపుదాల్చనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మార్టూరు తదితర నాలుగుచోట్ల కృష్ణశిలలతో తయారవుతున్న శిల్పాలను యాదాద్రికి తీసుకువచ్చి రాజగోపురాల నిర్మాణంలో అమరుస్తారు. నిర్మాణాల పర్యవేక్షణ కోసం తమిళనాడులోని తంజావూరు, అనంత మంగళం నుంచి నిపుణులను రప్పించి పనులను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా మూలవిరాట్‌కు మందుండే ముఖమండపంలో ఒక అసాధారణమైన డిజైన్‌కు రూపకల్పన చేశారు. పంచతల రాజగోపురం.. త్రితల రాజగోపురం.. కాకతీయ విజయ తోరణాలు ఆలయ ప్రాంగణంలో కళా రూపాలుగా నిలువనున్నాయి. 



నిపుణుల కమిటీ: ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక దివ్య క్షేత్రంగా నిర్మాణం జరుపుకుంటున్న యాదాద్రి ఆలయ ముఖమండప నిర్మాణంలో పటిష్టత, నాణ్యత ప్రమాణాలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిపుణుల కమిటీని ఏర్పరిచారు. ఆలయ నిర్మాణం, విస్తరణ, ప్రాకారపు మండపాలను పూర్తిగా కృష్ణశిలతో నిర్మించనున్నారు. దీనికోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇక నుంచి ముగ్గురు స్థపతులు వల్లినాయకం, సుందరరాజన్, డాక్టర్ ఆనందచారివేలు, ఆర్కిటెక్ట్ ఆనందసాయి, దేవదాయ శాఖ డీఈ శర్మ సభ్యులుగా ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఆలయ నిర్మాణానికి సంబంధించిన నివేదికలు ప్రభుత్వానికి అందజేస్తున్నారు. 



 టెంపుల్ సిటీ: సుమారు వెయ్యి ఎకరాలలో ప్రతిష్టాత్మక టెంపుల్‌సిటీ నిర్మించేందుకు ప్రణాళిక చేస్తున్నారు. తొలుత పెద్దగుట్టపైన 250 ఎకరాలతో దీనిని నిర్మించాలనుకున్నా యాదాద్రికి ఉన్న ప్రపంచస్థాయి గుర్తింపుతో 1000 ఎకరాలతో నిర్మించేందుకు సిద్ధమయ్యారు. 86 ఎకరాల విస్తీర్ణంలో 200 కాటేజీలు, మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఫుడ్ కోర్టులు, ఏడు ఎకరాల విస్తీర్ణంలో మంచినీరు, మురుగునీటి నిర్వహణ వ్యవస్థ, పన్నెండు ఎకరాలలో గ్రీనరీ, 62 ఎకరాలలో రహదారులు, 26 ఎకరాలలో ల్యాండ్ స్కేపింగ్ చేయడంతోపాటు మరో 42 ఎకరాల ప్రాంతాన్ని ప్రకృతి రమణీయంగా తీర్చిదీద్దనున్నారు. ఇప్పటి వరకు 2200 ఎకరాల భూములను వైటీడీఏ సేకరించింది. 



ఔటర్ కన్నా పెద్దరోడ్లు: హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్‌రోడ్డు కన్నా పెద్దవైన రోడ్లు టెంపుల్ సిటీలో నిర్మాణమవుతున్నాయి. మొత్తం కొండపైన 20 రోడ్లను చేపట్టారు. రూ.202 కోట్ల వ్యయంతో టెంపుల్ సిటీ లేఅవుట్ రూపుదిద్దుకోనున్నది. ఏడు రకాల రోడ్లు నిర్మాణమవుతున్నాయి. 101.5 మీటర్లు, 47.2 మీటర్లు, 44.4 మీటర్లు, 42.3 మీటర్లు, 45.7 మీటర్లు, 21.3 మీటర్లు, 12 మీటర్ల రోడ్లుగా విభజించారు. దీనికి తోడు గిరి ప్రదక్షిణ రోడ్డును 200 మీటర్లలో నిర్మిస్తున్నారు. రాయిగిరి నుంచి రూ.110 కోట్లతో యాదాద్రి వరకు రోడ్డు నిర్మాణం చేస్తున్నారు. యాదాద్రికి నాలుగు దిక్కులకూ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. యాదాద్రి-చేర్యాల, యాదాద్రి-వంగపల్లి, యాదాద్రి-కీసర రోడ్లు నాలుగు వరుసలుగా మారుతున్నాయి. 



రక్షణగోడ ఏర్పాట్లు: యాదాద్రి కొండపైన 2015 దసరా రోజున పనులు మొదలయ్యాయి. దీనికోసం మొదటి టెండరు అదే సంవత్సరంలో రాగా రూ.123.03 కోట్లతో పనులు జరుగుతున్నాయి. టెంపుల్ సిటీ లేఅవుట్ కోసం 02-06-2016 రోజున టెండర్లు ఫైనల్ కాగా ఏడాది కాల పరిమితితో పనులు జరుగుతున్నాయి. కొండపైన రక్షణ గోడ నిర్మాణం చాల కీలకమైంది కావడంతో పనులను నాణ్యతతో జరిపిస్తున్నారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులు పెద్దగుట్ట టెంపుల్ సిటీపైన మొదలయ్యాయి. వర్షపు నీరు వెళ్ళడానికి, మంచినీటి సరఫరా కోసం కూడా వేర్వేరుగా నిర్మాణాలు జరుపుతున్నారు. 



విశాలమైన బస్టాండ్ : యాదాద్రికి ఈశాన్య భాగంలో సేకరించనున్న 150 ఎకరాలలో అత్యాధునిక వసతులతో బస్‌స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతమున్న పరిధి వచ్చే తరాలకు సరిపోయేలా లేకపోవడంతో సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. బస్సుల సంఖ్య పెంచుతారు. యాదాద్రికి నాలుగు దిక్కులా ఉన్న రోడ్లు బస్‌స్టేషన్‌ను కలుపుతూ నిర్మాణం కానున్నాయి. ఈ భూములన్నీ గుట్టకు ఈశాన్యభాగంలోని యాదగిరిపల్లి పరిధిలోకి వస్తాయి. 



దివ్య విమాన గోపురం : యాదాద్రిలో చేపట్టనున్న నిర్మాణాలు పక్కా వాస్తుతో జరగాలని సీఎం ఆదేశించారు. గర్భగుడిపై నిర్మాణం చేయనున్న దివ్యవిమాన గోపురం స్వర్ణమయం చేసేందుకు 45 అడుగులలో అత్యంత పకడ్భందీగా నిర్మించనున్నారు. విష్ణు పుష్కరిణీని విస్తరించి ఎక్కువ భక్తులు స్నానమాచరించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. యాదాద్రి కొండపైకి విచ్చేసే భక్తులను ఆకట్టుకునేలా 108 అడుగుల అంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేయనున్నారు.

ఆశ్రమ ధర్మశాలలు : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ విస్తరణ పనులు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడే విధంగా సర్వాంగ సుందరంగా చేపట్టనున్నారు. మండల దీక్షలు చేసే భక్తుల కోసం మూడెకరాల స్థలంలో ఆశ్రమాల తరహాలో ధర్మశాలలు, తిరుమల తరహాలో మెట్ల దారిని ఆధునీకరించి వసతులు కల్పించాలనుకుంటున్నారు. ప్రస్తుతం వైకుంఠ ద్వారం వద్ద వున్న రాజగోపురాన్ని తొలగించి అత్యంత ఆధునిక పద్ధతులలో రాజగోపురం నిర్మించేందుకు తాజా నిర్ణయం తీసుకున్నారు. హరిత హోటల్ నుంచి ఘాట్‌రోడ్డు వరకు గల మూడెకరాల స్థలంలో ఈ రెండు ధర్మశాలలు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటిలో మండల దీక్షలు నిర్వహించే మహిళా భక్తులకు, పురుషులకు వేర్వేరుగా వసతులను కల్పించనున్నారు.

రాజగోపురం నిర్మాణం : యాదాద్రికి వెళ్లే మెట్లదారిలో గల వైకుంఠ రాజగోపురాన్ని తొలగించనున్నారు. మాస్టర్ ప్లాన్‌లో భాగంగా గిరి ప్రదక్షణ రోడ్డుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి రాజగోపురం తొలగించడం అనివార్యమైంది. ప్రస్తుతం ఉన్న గోపురం యథావిథిగా కొనసాగిస్తే వైకుంఠ ద్వారం వద్ద ఉన్న అనేక ఇళ్లను తొలగించాల్సి వస్తుందని ఎవరికి ఇబ్బందులు కలిగించ వద్దనే ఉద్దేశంతో రాజగోపురం తొలగించి వంద ఫీట్లు లోపలికి జరిపి నిర్మించనున్నారు.

వెయ్యేండ్ల నిర్మాణాలు : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ విస్తరణ కనీవినీ ఎరుగని విధంగా జరుగనుంది. మొదటి ప్రాకార మండపం, రెండవ ప్రాకార మండపం, కళ్యాణ మండపం, యాగశాల, అద్దాల మండపం, రామానుజకూటం, రాగోపురాల నిర్మాణం కోసం వైటీడీఏ రూ. 150 కోట్లు ఖర్చు చేయనుంది. యాదాద్రిలో రెండున్నర ఎకరాల్లో కొండపై శ్రీవారి ఆలయం.. దీనిలో బాలపాద ప్రాకార మండపం.. 32 శ్రీలక్ష్మీనరసింహస్వామి వారికి సంబంధించిన అవతారాలు కొలువు దీరే విధంగా డిజైన్లు రూపొందించారు. ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఎక్కడా 32 శ్రీలక్ష్మీనృసింహస్వామి వారి విగ్రహాలు ఒకే దగ్గర కొలువుదీరి లేవని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు.

అపర వైకుంఠం : శ్రీలక్ష్మీనరసింహుడికి పరమభక్తుడి రూపంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తిరుమలకు దీటుగా యాదాద్రి ఉండాలని సంకల్పించారు. వందల కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి అభివృద్ధిలో తలమునకలయ్యారు. యాదాద్రి చరిత్రలో కేసీఆర్ పాలన సువర్ణాక్షరాలతో లిఖించేదిగా ఉండబోతున్నది. శ్రీకృష్ణదేవరాయల కాలంలో జరిగిన నిర్మాణాలు తిరిగి కేసీఆర్ పాలనలో జరుగుతున్నాయని ఆధ్యాత్మిక వేత్తలు వేనోళ్లా కొనియాడుతున్నారు. జీయర్ స్వామి మాటల్లో చెప్పాలంటే ఆధ్యాత్మిక విప్లవం మొదలైంది.


బ్రహ్మోత్సవ ఘట్టాలు



27న మొదటి రోజు 

స్వస్తివాచనము:

మొదటి రోజు ఉత్సవాల ప్రారంభ సూచకంగా స్వస్తివాచనము నిర్వహిస్తారు. వైష్ణవ సంప్రదాయంలో విశ్వక్సేనుడిని ఆరాధించి ఆదిపూజ చేస్తారు. రాత్రి మృత్సంగ్రహణం, అంకురార్పణం చేస్తారు. పుట్టమన్నులో నవధాన్యాలను ఉంచి అంకురార్పణం చేస్తారు. 11 రోజుల్లో నవధాన్యాల నుంచి ఎంత చక్కగా మొలకలు వస్తే అంత సల్లంగా లోకం ఉంటదని నమ్మకం. 







28న రెండో రోజు 
ధ్వజారోహణము: 
శ్రీవారి వాహనమైన గరుత్మంతునితో 33 కోట్ల దేవతలను శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తరలిరావాలని కోరుతూ ప్రధాన ఆలయం ధ్వజస్తంభంపై గరుత్మంతుని తెల్లని వస్త్రంపై చిత్రించి అవగతం చేస్తారు. గరుత్మంతుడు ఆయా దేవతందరినీ ఆహ్వానించినట్లుగా వారికి ఘనస్వాగతం పలుకుతూ రాత్రి భేరీపూజ, దేవతాహ్వానం నిర్వహిస్తారు.



మార్చి 1న మూడో రోజు మత్స్యావతార అలంకారం: 
వేదరక్షకునిగా శ్రీవారికి మత్స్యావతారం అలంకారం చేసి భక్తులకు దర్శనం కలిగిస్తారు. సోమకాసురుడు అనే రాక్షసుడు వేదాలను అపహరించి సప్తసముద్రాల అడుగున దాగి ఉన్నప్పుడు లోకరక్షణార్థం శ్రీమహావిష్ణువు మత్స్యావతారం దాల్చి వేదపరిరక్షణ చేస్తారు. రాత్రి శేషవాహనసేవలో ఊరేగుతారు. 



మార్చి 2న నాలుగో రోజు 
శ్రీకృష్ణాలంకారము :
శ్రీలక్ష్మీనృసింహునికి నాలుగవ రోజు చిన్ని కృష్ణుని అలంకారం చేస్తారు. రేపల్లెలో చిన్నికృష్ణుడు చేసిన సందడిని యాదాద్రిలో ఆవిష్కరిస్తారు. శ్రీకృష్ణుని లీలావిశేషాలను ప్రధానార్చకులు వివరణ చేస్తారు. రాత్రి వాహనసేవల్లో భాగంగా 10 గంటలకు హంసవాహనంలో శ్రీవారు ఊరేగుతారు. జ్ఞాన సముపార్జనకు చిహ్నమైన హంసనే వాహనంగా చేసుకున్న శ్రీవారి మహిమలను వివ రిస్తారు. 

మార్చి 3న ఐదో రోజు వటపత్రాశాయి అలంకారం: వటపత్రశాయి అలంకారంలో శ్రీనరసింహుడు భక్తులను కరుణిస్తారు. సృష్టికి ముందు లోకాలన్నింటినీ తన పొట్టలోనే ఉంచుకుని ఏమీ తెలియని సాధారణ వ్యక్తి మాదిరిగా వటపత్రంలో శయనించి ఉండే శ్రీమహావిష్ణువు లీలలను ఈ రోజు యాదాద్రిలో సాక్షాత్కారం చేస్తారు. పెద్ద మర్రి ఆకుపై పడుకుని ఉండే శ్రీవారి అలంకార సేవలో వేలాదిగా భక్తులు పాల్గొంటారు రాత్రి 10 గంటలకు పొన్నవాహనసేవ లో శ్రీవారు ఊరేగుతారు.

మార్చి 4న ఆరవ రోజు గోవర్ధనగిరిధారి అలంకారం:
శ్రీవారు గోవర్ధనగిరిధారి అలంకారసేవలో భక్తులకు దర్శనమిస్తారు. రేపల్లెలో గోపకులను రక్షించేందుకు గోవర్ధనపర్వతం చిటికెన వేలుపై ఎత్తి పట్టి ఇంద్రునికి గర్వభంగం చేసిన వైనాన్ని ఆవిష్కరిస్తారు. రాత్రి 10 గంటలకు సింహవాహన సేవలో ఊరేగుతారు. సింహం అన్ని జంతువులకు రాజు. ఆ సింహాన్నే తన వాహనంగా చేసుకోవడం ద్వారా శ్రీవారు ఎంతటి శక్తిసంపన్నుడో తెలియజేయడమే దీని ఉద్దేశం. 



మార్చి 5న ఏడవ రోజు జగన్మోహిణి అలంకారం: 
శ్రీవారు జగన్మోహిణిగా యాదాద్రిలో ఆదివారం కనువిందు చేస్తారు. పాలసముద్రం చిలికినప్పుడు వచ్చిన అమృతాన్ని దేవతలకు పంచేందుకు ఉద్భవించిన అవతారాన్ని ఇక్కడ దర్శించుకునే అవకాశం ఉంటుంది. రాత్రి శ్రీస్వామి వారి ఎదుర్కోలు పర్వం. అశ్వవాహన సేవలో ఊరేగుతారు. కోరికలకు ప్రతిరూపంగా నిలిచే గుర్రాన్ని తన వాహనంగా చేసుకుని శ్రీవారు అమ్మవారితో జరిగే వివాహ నిశ్చయ ఘడియలకు హాజరవుతారు. 



మార్చి 6న ఎనిమిదవ రోజు తిరుకళ్యాణ మహోత్సవం: 
ఉ. 10 గంటలకు హనుమంత వాహనంలో శ్రీరామఅలంకారంలో ఊరేగుతారు. బాలాలయంలో ఉ. 11 గంటలకు జరిగే కళ్యాణంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు శ్రీస్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రారంభమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం పక్షాన దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తదితర అతిరథులు హాజరవుతారు.



మార్చి 7న తొమ్మిదో రోజు దివ్య విమాన రథోత్సవం: శ్రీలక్ష్మీనృసింహుడు వెండిగరుఢసేవలో ఊరేగుతారు. అమ్మవారితో వివాహం జరుపుకున్న శ్రీవారు భక్తులకు రథంపై నుంచి దర్శనం కలిగిస్తారు.

మార్చి 8న పదవ రోజు శ్రీవారికి చక్రస్నానం: ఉదయం పూర్ణాహుతి నిర్వహిస్తారు. అనంతరం శ్రీవారి ఆయుధమైన సుదర్శన చక్రంతో కలిసి శ్రీవారు విష్ణుపుష్కరిణిలో స్నానమాచరిస్తారు. వేలాది మంది భక్తులు శ్రీవారు విష్ణుపుష్కరిణిలో స్నానమాచరించే వేళ పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేస్తారు. అయితే, ఈ దఫా బాలాలయంలోనే శ్రీవారికి చక్రస్నానం ఏర్పాట్లు చేస్తున్నారు.

మార్చి 9న పదకొండో రోజు శతఘటాభిషేకంతో ఉత్సవ పరిసమాప్తి: 11గంటలకు శ్రీస్వామి వారి అష్టోత్తర శతఘటాభిషేకం నిర్వహిస్తారు. 100 కలశాలలో గల మంత్రపూర్వక జలంతో శ్రీవారికి అభిషేకం చేస్తారు. రాత్రి 10 గంటలకు శృంగారడోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.


అద్భుత పుణ్యక్షేత్రంగా : 
ఎన్ని వందల కోట్లయినా ఇస్తాము.. యాదాద్రిని తిరుమలకు దీటుగా అభివృద్ధి చేద్దామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఆచరణ రూపం దాల్చడంతో ఇప్పుడు అందరి దృష్టినీ యాదాద్రి ఆకర్షిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఆధ్యాత్మిక పరంగా యాదాద్రికి అత్యంత ఘనమైన స్థానం దక్కేలా, తెలంగాణకు తలమానికంగా, దేశంలోనే పేరెన్నిక గన్న పుణ్యక్షేత్రంగా విరాజిల్లడానికి అవసరమైన హంగులను సమకూర్చుకుంటున్నది. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి హోదాలో కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 2014 అక్టోబర్ 17 శుక్రవారం రోజు పవిత్ర యాదాద్రి నేలపై కాలు మోపారు. మన యాదాద్రిని అద్భుత పుణ్యక్షేత్రంగా మారుస్తామని అదే రోజు ప్రకటించడంతో ఈ క్షేత్రానికి మంచి రోజులు మొదలయ్యాయి. 



అంతర్జాతీయ స్థాయిలో: 
రెండెళ్ళలో సుమారు వెయ్యి డిజైన్లను పరిశీలించిన తర్వాతే తుది డిజైన్‌ను ఎంపిక చేసిన విధానమే ఆలయ అభివృద్ధి పట్ల కేసీఆర్ శ్రద్ధాసక్తులు, చిత్తశుద్ధిని ప్రస్ఫుటపరుస్తున్నది. ఆ డిజైన్లకు అంతర్జాతీయ స్థాయిలో ప్రాధాన్యం లభించింది. వాటికి వాస్తవ రూపం ఇచ్చేందుకు జరుగుతున్న పనులు భక్తులను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేసేలా ఉన్నాయి. యాదాద్రిలో ఇప్పుడు జరుగుతున్న పనులను ఎవరూ ఊహించలేదు. ఒకనాటి వివక్షకు ఆయన చరమగీతం పాడుతూ కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తున్న అపూర్వ సన్నివేశం అందరినీ అబ్బురపరుస్తోంది. కేసీఆర్ స్వప్నం సాకారం కావడానికి ఇక మరెంతో కాలం పట్టదు.

శ్రీనివాస గార్గేయ కాలయోగం 2021-22 | Sri Srinivasa Gargeya Kalayogam 2021-2022 | Ponnaluri Srinivasa Gargeya




 కాలయోగం 2021-22 
 Kalayogam 2021-2022


ఈ పంచాగము దుక్సంస్కారయుతమై దృక్సిద్ధాంత అయనాంశలతో గణితము చేయబడినది. ఇందలి గ్రహస్థితులు, తిధి నక్షత్ర యోగ కరణ సమయములన్నియు శాస్త్ర ప్రమాణమునకు, ప్రత్యక్ష దర్శనమునకు ఖచ్చితంగా సరిపోవును.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అను రెండు తెలుగు రాష్ట్రములకు మధ్యగల విజయవాడ పట్టణమునకు (16.32 ఉత్తర అక్షాంశము, 80.32 తూర్పు రేఖాంశము) సంస్కరించబడినది. ఇందలి గ్రహస్ఫుటాలను ప్రతిరోజు భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గం. 30 ని. లకు ఇవ్వడమైనది. ఇతర ప్రాంతాల వారు పంచాగము నందలి దేశాంతర సంస్కార పట్టిక ప్రకారం లగ్న సమయాలను సంస్కరించుకొనవచ్చు.



సహస్ర లింగార్చన_Sahasra Lingarchana-MohanPublications



సహస్ర లింగార్చన 


అర్థనారీశ్వర దేవాలయం- విరూపాక్షపురం_ArdanariswaratempleVIRUPAKSHAPURAM_


అర్థనారీశ్వర దేవాలయం-

విరూపాక్షపురం



శ్రీకాళహస్తి తాలూకా తొట్టంబేడు మండలంలో, సువర్ణముఖినదీ తీరాన విరూపాక్షపురమనే గ్రామంలో ప్రాచీనమైన ‘అర్థనారీశ్వర స్వామి దేవాలయం’ వెలసి ఉంది. శివుని అర్థనారీశ్వరునిగా ఆలయ గోడలపైన, విమానం మీద చూపడం కలదుగాని, మూలవిరాట్టు అయిన లింగమే అర్థనారీశ్వరుడి రూపంలో వెలయడం అపూర్వం. పురాణాలలో ఈ ఆలయాన్ని ‘పాపివిచ్చేదక్షేత్రం’ అని పేర్కొన్నారు. శివపురాణంలో ‘శ్రీవిజయసఖ మాంబల’ చరిత్ర ఇది. ఉత్తరదేశంలోని ఆర్యావర్తంలోని అవంతీ నగరంలో అందమైన యువదంపతులు నివసించే వారు. వారు విసయ, సుభగలు, బాల్యం నుంచి విజయునికి పరమేశ్వరునిపై ఎనలేని భక్తి ఉండేది. అతను పిన్నవయస్సులోనే ఇంద్రియ విగ్రహాన్ని కలిగి దైవాన్ని దర్శించాలని నిశ్చయించుకొన్నాడు. ఒకరోజు విజయుడుమార్కండేయ మహర్షిని దర్శిం చి, తనకు మోక్షమార్గాన్ని ప్రబోధించమన్నాడు. మహర్షి విజయునితో పరమేశ్వరుని ప్రసన్నుని చేసుకునే విధానాన్ని తెలుపుతూ దక్షిణకాశిక వాసి కెక్కిన శ్రీకాళహస్తి వెళ్లి, ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తిశ్వరుని పూజించి జన్మను తరింపజేసు కోమన్నాడు. మార్కండేయ మహర్షి చెప్పినట్లుగా శ్రీకాళహస్తికి భార్యాసమేతంగా వచ్చి, విజయుడు చిన్న పర్ణశాలలో నివసిస్తూ రోజు సువర్ణముఖిలో స్నానం చేసి నుదుట విభూది రేఖలు, మెడలో రుద్రాక్షలు ధరించి ఆలయానికి వెళ్లి, దీక్షతో స్వామి ని సేవిస్తూ ఉండేవాడు. ఒకరోజు విజయుడు స్వామి ధాన్యంలో సాయంకాలం వరకు ఆలయ మందే గడిపిఇంటికి వచ్చాడు. అతడి భార్య సుభగ భర్తకు ఇష్టమైన తీయటి వంటలు చేసి, అతడి చేత తినిపించింది. భుక్తాయాసంతో విజయుడు మేను వాల్చగానే, సుభగ పూర్తిగా అలంకరించుకొని భర్త ను చేరింది. భార్య కోరేదేమిటో అతడికి అర్థం కాలేదు. యుక్తవయసులో ఉన్న భార్య చనుకట్టు విజయునికి రెండుబంగారు శివలింగాలుగా కనబడ సాగినాయి. భార్య పడక పక్కనే ఉంచిన పూలు, సుగంధ ద్రవ్యాలు ఆ చనులపై జల్లి, వాటిని శివ లింగాలుగా భ్రమించి రాత్రంతా పూజించసాగాడు సుభగ, భర్త తన కోర్కె తీర్చలేదని బాధపడింది. తెల్లవారగానే విజయుడు లేచి యథావిధిగా ఆల యానికి వెళ్తూ రాత్రి తన ఇంటిలో ఎలా రెండు శివలింగాలు వెలిసినాయి? అది సాధ్యమేనా? అని ఆలోచిస్తూ తన భార్య శారీరక సుఖాన్ని ఆశించి తన్ను మభ్యపెట్టినందువల్లే ఈ విధంగా జరిగి ఉంటుందని, ఇక తాను ఇంట్లోనే ఉంటే తన ధ్యేయం వృథా అయిపోతుందేమో! అయినా చిన్న వయసులో ఉన్న భార్యను ఎలా వదిలిపెట్టి వెళ్లాలి అని ఆలోచిస్తూ ఏమీ నిర్ణయించు కోలేక పోయాడు. యథావిధిగా ఆరోజురాత్రి ఇంటికివచ్చి మౌనంగా నిద్రించాడు. నిద్రలో పరమేశ్వరుడు కనబడి శ్రీకాళహస్తికి ఉత్తరంగా సువర్ణముఖీ నదీ తీరాన యుగాలకు పూర్వం నుంచే దేవతలు, రుషులు మొదలగు వారి చేత పూజలందుకుంటూన్న అర్థ నారీశ్వరుని సేవించి తరించమన్నాడు. మరునాడు విజయుడు వేకువజామునే లేచి భార్యను, ఇంటిని వదిలి ఒంటరిగా స్వామి సెలవిచ్చినట్లు సువర్ణ ముఖీ నది గుట్టు వెంటే నడిచి వెళ్లి అర్థనారీశ్వర స్వామి వెలసి యున్న పాపవిచ్చెద క్షేత్రం చేరి స్వామని నిష్టతోకొలువసాగాడు. పొద్దునలేచి చూస్తే భర్త జాడలేదు. పెనిమిటి కనిపించకపోవడంతో సుభగ తన వల్లనే పరమపవిత్రుడైన తన భర్త ఇల్లు వదిలి వెళ్లాడని, అతడి అడుగుజాడలలోనే నడిచి స్వామిలో లీనమైపోవాలని నిశ్చయించుకొని కొంత మంది యోగుల ద్వారా శివపూజా విధానాన్ని తెలు సుకొని రోజు బంకమట్టితో 108 శివలింగాలు చేసి ఎంతో భక్తితో ఆ స్వామిని పూజించసాగింది.
ఆమె భక్తిని పరీక్షించదలచి ఒకరోజు మహేశ్వరుడు అందమైన బ్రాహ్మణ యువకుని వేషంలో ఆమెను సమీపించి ‘ఎందుకిలా అందమైన కాలాన్ని వృథా చేస్తావ్ఞ? నేను నీకు సలక సౌకర్యాలు కలుగజేస్తాను. నీవు నాతో వస్తే మనం ఆనందంగా జీవించ వచ్చు అని పలుకగా, అతడి మాటలేవీ ఆమె మన స్సుకు సోకలేదు. తుదకా బ్రాహ్మణుడు ఆమెను సమీపించి బలవంతం చేయ బోగా ఆమె కళ్లు మూసుకుని ‘స్వామి! కాళహస్తిశ్వరా నన్ను రక్షించు అనగా ఆమె కళ్ల ఎదుట జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడు ప్రత్యక్షమై బాల! నీ భక్తిని పరీ క్షించడానికే ఈ విధం నాటక మాడినాము. నీకు మ వరం కావాలో కోరుకోమనగా, సుభగ ఆది దంపతులారా! నాకు పునర్జన్మ లేకుండా శాశ్వతంగా మీలో ఐక్యం చేసుకోండి అని కోరింది. పార్వతీ పరమేశ్వరులు ఆమె కోరిక మేరకు ఆమెను తమలో విలీనం చేసుకొన్నారు. పాపవిచ్చేద నిద్రాహారాలు మాని స్వామిధాన్యంలోనే మునిగిపోయాడు. హరు డు అతడిని కూడా పరీక్షింపనెంచి తన గణాలలోనే చంద్రహాసుని విష్ణురూపంలో విజయుని వద్దకు పంపి ఎందుకు ఆ భిక్షగాడిని పూజిస్తావు. ఇల్లు వాకిలి లేదు. శ్మశానంలో వుంటాడు. ఆభరణాలు లేవు. సర్పాలు ధరిస్తాడు. శ్మశానంలో బూడిదను ఒంటికి రాసుకుంటాడు. అతడి వల్ల నీకు కలిగే లాభమేమిటి? నన్ను పూజిస్తే సకల సౌకర్యాలు లభిస్తాయి. స్వర్గప్రాప్తి కలుగుతుంది. నా భార్య లక్ష్మీదేవి కటాక్షం వల్ల సకలభోగాలు అనుభవిస్తావు అని చెప్పగా విజయుడు కోపగించి, హరుడి మహత్మం తెలియదా? బ్రహ్మ తేజో రూపంలో శివుని ఆద్యతాలు గుర్తించక అపహాస్య పాలు కాలేదా? శివుడివల్లే కదా సకల ఐశ్వర్యాలు నీవు కృతజ్ఞతునై మాట్లాడుట తగునా అని పలుకగా, చంద్రహాసుడి రూపంలో ఉన్న హరి ప్రత్యక్షమై ‘భక్తా’! స్వామి వారే నీ భక్తిని పరీక్షించుటకు నన్ను ఈ రూపంలో పంపినాడు. నీ భక్తికి మెచ్చినాను. పార్వతి పర మేశ్వరులు త్వరలో నీకు ప్రత్యక్షమౌతారని సెలవిచ్చి వెళ్లాడు.
ఆలయ సౌందర్యం
అర్థనార్వీర దేవాలయం తూర్పునకు అభిముఖంగా నిర్మించారు. ఇందులో గర్భగృహం, అంతరాళం, ముఖమండపాలున్నాయి. గర్భాలయంలో ‘సుఖ గాంబ సమేత’ శ్రీ విజయేశ్వరస్వామి పేర స్వయం భూలింగం ఉంది.
ఈ లింగం రెండు ముఖాలను కలిగి ఉంది. శివుని భాగంగా భావించబడతూ ఉన్న పక్షం తెల్లగా మంచువలే ఉండగా, దేవి భాగం పసుపు రంగును కలిగి ఉంది. ఈ లింగం రెండు ముఖాలను కలిగి ఉంది. శివుని భాగంగా భావించబడుతూ ఉన్న పక్షం తెల్లగా మంచు వల్లే ఉండగా, దేవి భాగం పసుపు రంగును కలిగి ఉంది. ఈ అర్థనారీశ్వర స్వామిని భక్తులు సూర్యగ్రహణం, చంద్రగ్రహణం లాంటి ప్రత్యేక సందర్భాల్లో, శుక్ర, సోమవారాల్లో, ఏకాదశి, కృత్తిక, శివరాత్రి పర్వదినాల్లో విశేషంగా పూజించి తరిస్తారు.

మానస సరోవరం_Manasasarovaram



దేవతల నిలయం .. మానస సరోవరం

జీవితకాలంలో ప్రతి వ్యక్తీ ముఖ్యంగా హిందువ్ఞలు కనీసం ఒక్కసారైనా దర్శింపదగిన, దర్శింపవలసిన ప్రదేశాలు అత్యం త పావనమైన బ్రహ్మమానస సరోవరము మరియు కైలాస పర్వత దర్శనం.వృత్తిరీత్యా, యాత్రాపరంగా అనేక దేశాలను దర్శించిన మాకు ఎక్కడా అభించని అనుభూతి, ప్రశాంతత ఈ యాత్ర ద్వారా లభిస్తాయి. ఆధ్యాత్మికంగాను, ప్రకృతి రామణీ యతకుగాను ప్రపంచంలో అత్యంత మాన్యత కలిగిన పర్వత రాజమే అతి ఎత్తయిన కైలాసపర్వతం (5,200 మీటర్లు) మరియు బ్రహ్మమానససరోవరము (4,558 మీటర్లు). కైలాస యాత్రలో మొదటి ఘట్టము బ్రహ్మమానస సరోవర దర్శన ము. ఈ ప్రదేశాన్ని దేవతల నిలయంగాను శ్రద్ధాళులు భావి స్తారు. ఇది కైలాస మానససరోవరంగా కూడా పిలువబడు తుంది. స్వచ్ఛమైన నీటితో సుమారు 300 అడుగుల లోతు, 320 చ.కి.మీ. పరిధితో హిమవత్పర్వతాల మధ్య సహజ సిద్ధంగా ఏర్పడిన సరస్సు ఇది. సరోవరంలోని నీరు నీలిరంగు లో ఉండి,
బ్రహ్మకమలములతో మరియు రాజహంసలతో మనసుకు ఆహ్లాదాన్ని అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగి స్తుంది. రాజహంసల దర్శనము పుణ్యప్రదమని అవి అందరికీ కనబడవని చెపుతుంటారు. అయితే పరిక్రమ కాలి నడకన కాకుండా టయోటా వ్యానులో చేసుకోవచ్చు.
నిండుపున్నమి రాత్రి సరస్సు దేదీప్యమానంగా వెలిగిపోతుంది. చందమామ సరస్స నీటిపై బంతిలా తేలియాడే దృశ్యాన్ని మధ్య రాత్రి 2 గంటల సమయంలో వీక్షించవచ్చు. తారలన్నీ ఒక్కొక్కటి సరస్సులో స్నానం చేస్తుంటాయి. దేవతలు తారలరూపంలో రాత్రిపూట స్నానమాచరిస్తారని ప్రతీతి. మర్నాడు ఉదయం యజ్ఞ కార్యక్రమము, లక్ష్మీపూజ, లలితా సహస్రనామము కావించాము. మానసనరోవరము నుండి కైలాస పర్వతము ప్రస్ఫుటంగాకనిపిస్తుంది. ఒకవైపు హిమవత్పర్వతాలతో, మరో వైపు కైలాస పర్వతంతో మానససరోవరం మధ్యలో ఉంటుం ది. అయితే ఈ పర్వతాలన్నీ వాతావరణం అనుకూలంగా ఉంటేనే కన్పిస్తాయి. మేఘాలు కమ్మినప్పుడు, మంచు కురిసి నప్పుడు కన్పించవ్ఞ. ఈ ప్రదేశంలో క్షణాలలో వాతావరణం మారిపోతుంది. మేము అక్కడ గడిపిన నాలుగురోజులు ఎండ గా ఉన్నందున మాకే ఇబ్బందికలుగలేదు. జూన్‌ నుండి సెప్టెం బరు వరకే సరస్సు నీటి మంచు కురిసినప్పుడు కన్పించవు. ఈ ప్రదేశంలో క్షణాలలో వాతావరణం మారిపోతుంది. మేము అక్కడ గడిపిన నాలుగు రోజులు ఎండగా ఉన్నందున మాకే ఇబ్బంది కలుగలేదు.జూన్‌ నుండి సెప్టెంబరు వరకే సరస్సు నీటి రూపంలో ఉంటుంది. మిగిలిన నెలలో నీరు ఘనీభవి స్తుంది.
అష్టపది దర్శనం:
మానససరోవరం నుండి 40 కి.మీ.ల దూరంలో నంది ఆకారంలో ఉన్న కొండ ఎదురుగా ఉన్న దక్షిణ కైలాస పర్వతముఖమే అష్టపది. వ్యానుద్వారా అక్కడి వరకు వెళ్ళి కాలినడకన అష్టపది దర్శనము చేసు కోవచ్చు. కైలాసపర్వతం చుట్టూ పరిక్రమ చేసినపుడు కూడా ఇది కన్పిస్తుంది. కైలాస పర్వత పరిక్రమ ప్రారంభం లో బేస్‌ క్యాంప్‌ (మేము బసచేసిన ప్రదేశము) పేరు దార్చెన్‌ (4,560 మీటర్లు). పరిక్రమ: యాత్రలో అత్యంత ప్రధానమైన ఘట్ట మిది.
డార్చెన్‌ సమీపంలోని తార్బోచే అనే ప్రదేశంలో ఉన్న కట్టడాన్ని యమద్వారమంటారు. ఇక్కడ నుంచే కైలాస పరిక్రమ ప్రారంభమౌతుంది. మూడురోజులు సాగే ఈ ప్రయాణం అత్యంత క్లిష్టతరమైనదిగా ఉంటుంది. గుర్రాలపైనా లేదా కాలినడకన సాగే ఈ ప్రయాణం జీవితంలో మరపు రానిది. గుర్రాల పైన వెళ్ళనా దాదాపు సగం దూరం కాలినడ కన వెళ్ళాల్సి ఉంటుంది.
మొదటిరోజు 14 కిమీ. గుర్రాలపైన ఎగుడుదిగుడు మార్గాలగుండా మరియు రాళ్ళతో కూడిన లాచూనదిలో నుండి ఉత్తర కైలాసశిఖరం చేరుకుంటాం. దారి లో కైలాసానికి పశ్చిమదిశలో పాము పడగలా ఉన్న ఓ వింతైన పర్వతశిఖరం కనిపిస్తుంది. దీనిని రావణశిఖరం అంటారు.
మొదటిరోజు పరిక్రమ ఆరుగంటలు సాగుతుంది. ఆ రాత్రి బస డేరాపూర్‌ అనే గ్రామంలో ఇక్కడి నుండి కైలాసపర్వతం ఈశాన్యభాగం బోర్లించిన వెండిగిన్నెలా తళతళా మెరుస్తూ మైమరపిస్తుంది. జీవితంలో మరపురాని రెండవరోజు పరిక్రమ: అత్యంత కష్టతరమైన 22 కి.మీ.ల మార్గాన్ని డోల్మాలా పర్వతము పై భాగానికి చేరుకు న్నాం. ఇది 5,200 మీ. ఎత్తులో ఉంటుంది. ఇదే ప్రపంచంలోని అతి ఉన్నతమైన స్థలము. దీనినే పార్వతీదేవి స్థలంగా కూడా పిలుస్తారు. రెండు చేతులలో ఊతకర్రలతో నడవాల్సి వస్తుంది. కుడివైపున దాదాపు 500 అడుగుల లోతులో గౌరీకుండ దర్శనభాగ్యం లభిస్తుంది. మా వెంబడి ఉన్న నేపాలీ సహాయకుడు అందులో నుండి తెచ్చిన తీర్ధాన్ని తాగినవెంబడే శరీరంలోని అలసట పోయి ఉత్తేజం కలిగిస్తుంది. ఒకవైపు మహోన్నత పర్వతశ్రేణులు, మరోవైపు జలపాతాలు ఈ కష్టతరయాత్రలోని శ్రమను మరపింప చేశాయి. శివనామస్మరణగావిస్తూ ఆ అతిచల్లటి వాతావరణంలో అతి క్లిష్టమైన మార్గంలో పది కిలోమీటర్ల నడక సాగించవచ్చు. శివస్థలము, గౌరీకుండము, తారాదేవి శిల శివ్ఞణ్ణి వివాహం చేసుకునేందుకు గౌరీదేవి తపస్సు చేసిన స్థలాలు కనుక పౌరాణికంగా ఎంతో ప్రధానమైనవి.
మూడోరోజు పరిక్రమ:
చివరిరోజు 8 కి.మీ. గుర్రాలమీద ప్రయాణం చేసి 4 కి.మీ.లు వ్యానులో దార్చెన్‌ మార్గంగా తిరిగి మానససరోవరం చరుకోవచ్చు. ఇక్కడి నుండి తిరుగు ప్రయాణం ప్రారంభమవ్ఞతుంది. ఎలా వెళ్ళాలి? ఎప్పుడు వెళ్ళాలి? దాదాపు 15 రోజులపాటు సాగే ఈ యాత్రను మే-సెప్టెంబరు మధ్యకాలంలోనే చేయాలి. ఇందుకుగాను చైనాదేశపు వీసా అవసరము. ప్రస్తుతము కైలాస మానససరోవరము టిబెట్టులో ఉన్నందున కనీసంరెండు నెలల ముందే ప్రముఖమైన టూరు ఆపరేటర్స్‌ ద్వారా వీసా కొరకు దరఖాస్తు చేసుకోవాలి. వైద్యపరీక్షలు చేయించుకొని మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాలి. మానసికంగాను, శారీరకం గాను సంసిద్ధత అవసరము.
శ్వాసకోశ సమస్యలు, అత్యధిక రక్తపోటు (బిపి) లాంటి తీవ్రసమస్యలు ఉన్నవాళ్ళు కైలాస పర్వత పరిక్రమ చేయడం సమంజసంకాదు. కాని మానస సరోవరం వరకు రోడ్డు మార్గంగాగాని వాయుమార్గంగా గాని వెళ్ళవచ్చు. హైదరాబాదు నుండి ఘాట్మండు (నేపాల్‌ రాజ ధాని) చేరుకోవాలి. ఢిల్లీ ద్వారా సరాసరి వాయు మార్గము న్నది. అక్కడి నుండి కొడారి (నేపాల్‌ బార్డరు)లో చైనా వీసా తీసుకొని న్యాలం అనే ప్రదేశానికి చేరుకోవాలి. దీని ఎత్తు 3,750మీ. ఇక్కడ రెండు రోజులపాటు ఉంచుతారు. సముద్ర మట్టం నుండి ఎత్నై ప్రదేశాలకు వెళతాం కనుక ఆ వాతావర ణానికి అలవాటు కావడానికి అలా చేస్తారు. అక్కడి నుండి సాగా మార్గంగా డోంగ్వా అనే స్థలాన్ని చేరుకోవచ్చు.
నేపాల్‌ బోర్డర్‌ నుండి మానససరోవరం దాకా సుగమమైన రోడ్డు మార్గమున్నది. ఈ యాత్ర చేయాలంటే ధైర్య సాహసాలకన్న మనోనిబ్బరం అతి ముఖ్యమైనది. యాత్రకు రెండు నెలలకు ముందు శారీరక వ్యాయామము. నడక, యోగా, ప్రాణాయా మము లాంటివి చేయడం అత్యవసరం. ఈ యాత్రకు ముందుగాని, తర్వాతగాని ఖాట్నండులోని శ్రీపశుపతి నాథ దేవాలయం, శ్రీశేషనారాయణ దేవాలయం, స్వయంభూనాథ దేవాలయం, భక్తపూర్‌ పాటన్‌లలోని దేవాలయ సముదాయాలు దర్శింపదగినవి. కొందరు టూర్‌ ఆపరేటర్లు మనోకామనాదేవి ఆలయం, ముక్తినాథ్‌ యాత్ర కూడా జతచేస్తారు. వీటి కోసం ఆదనంగా వారం రోజులు అవసరం ఉంటుంది. ఖాట్మండు నుండి కైలాస మానససరోవర మార్గం దాదాపు 1,000కి.మీ. దాకా ఉంటుంది. అయితే ఈ మార్గమంతా దట్టమైన వృక్ష సంపదతో జలపాతాలతో, నదులతో కూడి కనువిందు చేస్తుంది. టిబెట్‌లో ప్రవేశించగానే భౌగోళిక పరిస్థితులు మారిపోతాయి. ఇసుక తన్నియలు, పర్వతాలు, మైదా నాలు, బ్రహ్మపుత్రానది దాదాపు మానససరోవరం దగ్గర వరకు ప్రవహిస్తుంది. వృక్షసంపద లేదు. ప్రాణవాయువ్ఞ తక్కువ. కనిష్ఠ ఉష్ణోగ్రతలుంటాయి. కావలసిన వస్తు వ్ఞలు, దుస్తుల వివరాలు టూర్‌ ఆపరేటర్స్‌ నుండి తెలు సుకుని తగిన ఏర్పాట్లు చేసుకొని యాత్రకు సంసిద్ధులై ఉండడం అతి ముఖ్యము.

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం_Sripada SriVallabha Charitamrutam- pitapuram







Sripada Srivallabha Charitamrutam in telugu 
 శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం



 SRI GURU CHARITRA in Telugu
Sri Vasudevananda Saraswati swamy
Telugu by eminent Pandit Sri Pannala Venkatadri Bhatta Sharma - pitapuram

శ్రీ గురు చరిత్ర
శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి
శ్రీ పన్నాలభట్ట శర్మ - పిఠాపురం
online....
-----------------------------------

శ్రీపాద శ్రీవల్లభులు

ఈ యుగంలో మొట్టమొదటి దత్తావతారం శ్రీపాదశ్రీవల్లభుడు. క్రీ.శ.1320లో ఘండికోట అప్పలరాజుశర్మగారికి, సుమతీ మహారాణికి తృతీయ సంతానంగా అవతరించారు. శ్రీపాదశ్రీవల్లభుడు. ఒకసారి నరసావధానులకు, శ్రీపాదులకు మధ్య ఆసక్తికరమైన చర్చ జరగుతుంది. జీవ్ఞడు, దేవ్ఞడు, కర్మ, వర్ణాశ్రమధర్మాలు, శాస్త్రము-వీటి ప్రస్తావన వస్తుంది. ఆ చర్చలో ‘ఏది ధర్మము, ఏది అధర్మము అనేది చర్చనీయాంశమైనప్పుడు శాస్రము నాశ్రయంచవలసిందే. అయితే శాస్త్రములో చెప్పినది ఆచరించదగునా? లేదా? అను మీమాంస వచ్చినప్పుడు నిర్మలాంతః కరణులు నిర్ణయించినదియే శాస్త్రమగును. వారు చెప్పినదే వేతమగును. వారి వాక్కు ధర్మ సమ్మతమగును. హింసచేయుట పాపమని నీశాస్త్రము చెప్పుచున్నది.
శ్రీకృష్ణ పరమాత్మ సమక్షములో జరిగిన యుద్ధము ధర్మ యుద్ధమైనదని,కౌరవ పాండవ యుద్ధము ధర్మయుద్ధమని అది జరిగిన స్థలము ధర్మక్షేత్రమని ప్రఖ్యాతి గాంచినది కదా! యజ్ఞము పుణ్యఫల ప్రదమే! కాని పరమాత్మ స్వరూపుడైన శివ్ఞని ఆహ్వానింపక దక్షుడు చేసిన యజ్ఞము ఆఖరికి యుద్ధముగా పరిణమించింది. దక్షుని తల తెగి పడింది. వానికి మేక తల అమర్చబడినది అని చెబుతారు. శ్రీపాదులవారు -(పుట 67-శ్రీపాద శ్రీవల్లభ చరిత్రామృతం). హింసతో నిండిన కురుక్షేత్ర యుద్ధం పవిత్రయజ్ఞంగా,వలసిన కార్యం హింసలో సమాప్తమైన యుద్ధంగా మారిన విషయాన్ని గుర్తుచేశారు శ్రీపాదులవారు. మరి,సాధారణ పండితులు శాస్త్రాన్ని ఉటంగిస్తూ ఉపనయనం శూద్రులకు చేయరాదని చెబుతారు. కానీ శ్రీపాద శ్రీవల్లభులు, ‘బ్రహ్మ, క్షత్రియ, వైశ్యులకే కాదు శూద్రులు కూడా నియమనిష్ఠలను పాటించునెడల వేదోక్త ఉపనయమునకు అర్హులే! ఉపనయనము వలన మూడోకన్ను విచ్చుకోవలెను. అంతఃకరణము పరిశుద్ధమై బ్రహ్మజ్ఞానమునందు మనస్సు లగ్నమవవలెను, అని చెబుతారు. (పుట 67-శ్రీపాదశ్రీవల్లభ చరిత్రామృతం) దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం ఉండిన శ్రీపాదులవారికి ఎంత విశాల దృక్పధము , దూరదృష్టి ఉన్నదో గమనింపవలసి ఉన్నది. కులాన్ని గూర్చి చెబుతూ, ‘బ్రహ్మజ్ఞాన సంబంధ విషయములు వచ్చినప్పుడు నేను బ్రాహ్మణుడను, దర్బారు చేయుచు భక్తుల యోగక్షేమములు విచారించుచూ, వారిని అనుగ్రహించునపుడు నేను క్షత్రియుడను, ప్రతి జీవికి, ఈ జీవి చేయు పాపపుణ్య కర్మములను బట్టి, వేతనము నిర్ణయించబడును. ప్రతివాని వేతనమునూ నావద్ద యున్నది, తూచి కొలచి ఎవరికి ఎంతెంత ఇవ్వవలసినది లెక్క చూచుకొనునపుడు నేను వైశ్యుడను, భక్తులబాధలను, కష్టములను నాశరీరము మీదికి ఆకర్షించుకొని వారికి సుఖశాంతులను కలుగచేయుటవలన సేవాధర్మము నెరపుటవలన నేను శూద్రుడను. జీవ్ఞల యొక్క పాపములను ప్రక్షాళనము చేయునపుడు నేను చాకలిని. మరణించిన జీవ్ఞలను కాల్చి బూడిద చేసి ఉత్తమ జన్మను ప్రసాదించుచున్నాను. అందుచేత నేను కాటి కాపరిని. ఇప్పుడు నేను ఏకులము వాడినో తేల్చి చెప్పు అని అంటారు. శ్రీపాదశ్రీవల్లభుడు (పుట68-శ్రీపాదశ్రీవల్లభ చరిత్రామృతమ్‌).బ్రాహ్రణ, వైశ్య, శూద్ర, చండాలుల్లో కూడా నేనున్నాని శ్రీకృష్ణ పరమత్ముడు చెప్పాడు. ‘ఈవ్యాసమిదం సర్వంఅని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. ‘సర్వం విష్ణుమయం అని మహనీయులంతా చెబుతున్నారు. అయినా హిందూ సమాజంలో నేటికీ అంటరానితనంముంది.
శూద్రుల కంటే మేము గొప్ప అని వైశ్యులు, వారందరి కంటే మేము ఉన్నతులమని బ్రాహ్మణులు ఇంకా ఈనాటికీ అహంకిరిస్తున్నారు. ”మామతం ఎంతో ఉన్నతమైనది,విశాలమైనది అని ఒక వైపు ఉపన్యాసాలిస్తూ మరో వైపు దళితులను దేవాలయాల్లోకి రానివ్వక, అంటకుండా దూరంగా పెడితే. నీచంగా చూస్తే అది మతానికి వన్నె తెచ్చే మార్గమా? ముట్టు,అంటు, మైల అని ఏవేవో సాకులు చూపి సంఘంలోని ఎనబైశాతం మంది స్రీలను,శ్రూద్రులను దళితలను ఆలయాల్లోకి రానివ్వకుండా ఆపితే ఆమతం ఎక్కవ కాలం మనగలదా? మనం శాస్త్రం,సాంప్రదాయం, ఆచారం,సంస్కృతి అని పెద్ద పెద్ద మాటలను పదే పదే వల్లె వేస్తే సరిపోతుందా? బాగా పరిశీలిస్తే మనం ఈనాడు ఏ శాస్త్రాన్ని అనుసరంచడం లేదు,
ఏమహాత్ముని బోధను ఆచరించడంలేదు. పరోపరామే పుణ్యమని,పరపీడనమే పాపమని వ్యాసభగవానులు చెప్పారు. దాన్ని ఆచరిస్తున్నామా? బ్రహ్మం సత్యం జగనిథ్య అని శంకరాచార్యుల వారు చెప్పారు. దాన్ని అవగాహన చేసుకున్నామా? ‘సర్వధర్మాన్‌ పరిత్సజ్య మామేకం శరణంవ్రజఅని శ్రీకృష్ణపరమాత్ముడు బోధించాడు. మనం అలా చేస్తున్నామా? ”సత్యమేవ జయతే నానృతం అని చెబుతుంది. శాస్త్రం. మనం దాన్ని నమ్మి ఆచరిస్తున్నామా? ఇతురులను పీడించి, హింసించి, మోసగించి మనల్ని మనం చాలా మంచివారమనుకొంటున్నాం దేవ్ఞడులే, గీవ్ఞడులే, డబ్బే ముఖ్యం అని సంపాదించడానికి నానా తంటాలు పడుతున్నాం . సత్యం యొక్క గొంతు నొక్కి నిమిషానికి అబద్దాలే పల్కుతున్నాం. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, కలియుగంలో శ్రీపాదులు ధర్మాన్ని నిలబెట్టుటకై వచ్చిన అవతార పురుషులు. వారి బోధే ముఖ్యం గానీ సాధారణ పండితుల బోధకాదు. దివ్యత్వంను కాకపోయినా కనీసం మనుష్యతాన్నైనా పొందాలి మనం. అహంకారాన్ని తొలగించేదే శాస్త్రగానీ పెంచి పోషించేది కాదు. సంఘాన్ని సంఘటిం చేసే సత్పురుషుడు గానీ చీల్చేవాడు కాడు.

                                                                                                                        – రాచమడుగు శ్రీనివాసులు





శ్రీ అక్కల్కోట స్వామి సమర్ధ లీలామృతం 
Sri Akkalkota Swamy Samardha Leelamrutham



శ్రీ నరసింహ సరస్వతి చరితము 
Sri Narasimha Saraswathi Charithamu




శ్రీపాద శ్రీవల్లభ కథాసుధ 
SriPada SriVallabha Kathasudha



శ్రీపాద శ్రీవల్లభ లీలా వైభవము
SriPada SriVallabha Leela Vibhavam
online....


శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం
Sripada SriVallabha Charitamrutam


NemaniGantalaPanchangam2017- 18

Coming soooon

వేయిస్తంభాల గుడిఓరుగల్లు_త్రికూటాలయం రుద్రేశ్వరుడు_VaisthabalaTempleWarangal_



త్రికూటాలయం

రుద్రేశ్వరుడు

వేయిస్తంభాల గుడిగా ఖ్యాతి చెందిన శ్రీరుద్రేశ్వరాలయం ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు చరిత్రాత్మకంగా కూడా విశిష్టమైనది. వరంగల్‌ జిల్లా హన్మకొండలో ఉన్న ఈ శైవాలయం 19వ, 20వ శతాబ్దాలలో విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షించి వారి చేత ‘టెంపుల్‌ ఆఫ్‌ హనమ్‌కొండ’గా నమోదు పొందింది. ఒకనాడు వేయి ఎకరాలలో వేలాది స్తంభాలతో భాసిల్లడం వల్లే ఈ ఆలయానికి ‘వేయి స్తంభాల గుడి’ అని పేరు వచ్చిందని అంటారు. ఈ పేరుతో మన దేశంలో ఉన్న గుడి ఇదొక్కటే కావడం తెలుగువారికి గర్వకారణం.
ఓరుగల్లు ప్రాంతాన్ని కాకతీయులు పరిపాలించిన కాలంలో మతాల మధ్య ఘర్షణ వాతావరణం ఎక్కువగా ఉండేది. జైనంతో పాటు శైవ, వైష్ణవ వర్గాలు కూడా తమ ప్రాబల్యం కోసం కీచులాడుకుంటూ ఉండేవారు. మరోవైపు సామ్రాజ్యవిస్తరణలో భాగంగా కాకతీయ ప్రభువులకు ఎక్కువ సమయం యుద్దభూమిలోనే ఉండాల్సి వచ్చేది. రాజ్య సరిహద్దులు పెరుగాలంటే రాజ్యంలో అంతర్గత శాంతి ఉండాలనీ సామరస్యం కలిగిన సైన్యాలతోటే ఇతర ప్రాంతాలను ఆక్రమించగలమని వారు గ్రహించారు. అందుకు సంకేతంగా శైవ, వైష్ణవ, జైన మతస్తుల సఖ్యత కోసం త్రికూట ఆలయంగా రుద్రేశ్వర ఆలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో ఒకే ఉపపీఠం పైన, ఒకే పైకప్పు కింద, ఒకే రంగమండపం, ఒకే ముఖమంటపం ఉండే విధంగా పశ్చిమాన శ్రీరుద్రేశ్వరాలయాన్ని, ఉత్తరాన కేశవ ఆలయాన్ని, తూర్పున సూర్యదేవాలయాన్ని నిర్మించారు. కొంతకాలం పూజలందుకున్న దరిమిలా అల్లావుద్దీన్‌ ఖిల్జీ హయాంలో జరిగిన దాడులలో వైష్ణవ, సూర్యదేవాలయాల మూలవిరాట్టులు ధ్వంసం అయ్యి రుద్రేశ్వర ఆలయం మాత్రం సంపూర్ణంగా మిగిలిందని చరిత్రకారుల పరిశోధన.
రాజ్యవిస్తరణకు సంకేతంగా..
అలాగే ఈ గుడి వెనుక మరో కథ కూడా ఉంది. ఈ ప్రాంతాన్ని పాలించిన రెండవ భేతరాజు తన మంత్రి వైద్యదండనాథుని సహాయంతో చాళుక్య త్రిభువన మల్లుడిని మెప్పించి వెయ్యిమండలాలను తన రాజ్యంలో కలుపుకున్నాడట. ఆ విధంగా వేయి మండలాలను కలుపుకున్నందుకు ఈశ్వరునికి కృతజ్ఞతగా వేయిస్తంభాలతో ఈ దేవాలయం నిర్మించడానికి అంకురార్పణ చేశాడని అంటారు. అతడి కాలంలో మొదలైన పని అతని కుమారుడు రెండవ ప్రోలరాజు (క్రీ.శ 1116–1157) కాలం వరకు కొనసాగింది. చివరకు రెండవ ప్రోలరాజు కుమారుడైన మొదటి ప్రతాప రుద్రదేవుడు (క్రీ.శ.1158– 1195) నిర్మాణాన్ని ముగించి క్రీ.శ.1163 జనవరి 19న ప్రతిష్టాపనో త్సవం అంగరంగ వైభోగంగా జరిపించాడు. ప్రతాప రుద్రదేవుని పేరు మీదుగానే ఇక్కడి శివుడికి రుద్రేశ్వరుడు అనే పేరు వచ్చింది.
అపురూప శిల్పకళ
నక్షత్ర ఆకారపు పీఠం మీద నిర్మించిన రుద్రేశ్వరాలయంలో అడుగడుగునా శిల్పకళా సౌందర్యం అబ్బుర పరుస్తుంది. గర్భగుడి ద్వారశాఖల్లోని నిలువుపట్టె పాదభాగంలో పూర్ణకుంభం ధరించిన స్త్రీ, చామరగ్రాహిణి, ద్వారపాలకులతో పాటు పొడగాటి చేపను ధరించిన వ్యక్తి కనిపిస్తారు. ఇది ఆనాటి మత్స్యసంపదకు తార్కాణం అని చరిత్రకారుల అభిప్రాయం. దీనికి పైభాగంలో దేవునికి సుప్రభాతం పలుకుతున్నట్లు వీర్నం, కంచు ఢంక, పలక, వాయువీణ, బూరవాద్యాలు ధరించిన వాద్యగాళ్లు, మాలధారులు కనిపిస్తారు. సింహవరుసలు, గొలుసులు, రుద్రాక్షహారాలు, లతలు, కీర్తిముఖహారాలు కనిపిస్తాయి. అంతరాళ ద్వారంపై నటరాజు, దక్షప్రజాపతి, పార్వతిదేవి, ప్రమథ గణాలు చెక్కబడి ఉంటారు.
అతుకులు లేని గోడలు
దేవాలయ గోడలను శిల్పులు అతుకులు, గీతలు కనిపించకుండా ఏకశిలానిర్మితం అనిపించేలా నిర్మించడం అబ్బుర పరిచే విషయం. ఈ గోడలలో కూడా చాలా స్తంభాలను ఉపయోగించారని ఆ విధంగా కూడా ఇది వేయిస్తంభాల గుడి అయ్యిందని భావిస్తున్నారు. ఈ ఆలయ ముఖమంటపం దక్షిణం వైపు ఉంటుంది. దీని నుంచి లోపలికి ప్రవేశించగానే పదహారు స్తంభాలతో చతురస్రాకార నిర్మాణం ఉంటుంది. మనోహరంగా తీర్చిదిద్దబడిన నాలుగు స్తంభాల మధ్యలో రంగమండపం ఉంటుంది. దారం పట్టేంత సన్నని రంధ్రాలున్న స్తంభాలు ఈ మండపంలో ఉన్నాయి.
జిట్టెడు ఆంజనేయస్వామి ...
ఆలయ బలిపీఠానికి ఆగ్నేయంగా లోపలి వైపు గోడ కింది భాగంలో జానెడు పరిమాణంలో ఉన్న ఆంజనేయస్వామి ఉంటాడు. ఈ అంజనేయస్వామిని ఆలయవాస్తురక్షకుడిగా ఆనాటి శిల్పులు ఏర్పాటు చేశారు. జానెడు కొలతను జిట్టెడుగా జానపదులుగా పిలుస్తారు కాబట్టి ఈ అంజనేయస్వామిని జిట్టెడు అంజనేయస్వామిగా పిలుస్తారు.
మహాగణపతి..
దేవాలయంలో శ్రీరుద్రేశ్వరాలయానికి కుడివైపున నైరుతిమూలలో మహాగణపతి కొలువై ఉన్నాడు. చేతిలో కల్వం, మరోచేతిలో నూరే రాయి ధరించి వైద్యగణపతిగా కనిపించే ఈ గణపతిని కొలిచిన వారికి ఆయురాగోగ్యాలు కలిగిస్తాడని విశ్వాసం.
నందీశ్వరుడు..
వేయి స్తంభాల గుడిలోని నందీశ్వరుడి శిల్ప సౌందర్యం చూడవలసిందేగాని వర్ణించతరం కాదు. బహుశా కాకతీయుల కాలం నాటి మొదటి నంది కనుక శిల్పులు నందీశ్వరునికి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ భారీపరిమాణంలో అనేక ఆభరణాలతో సర్వాంగసుందరంగా చెక్కారు. నందీశ్వరుడు కూర్చొని ఉండి దేవాలయానికి వస్తున్న భక్తులను చూస్తూ చెవులు రిక్కించి ఆలకిస్తున్నట్లు, ఎడమకాలిని పాదంపై మోపి లేవడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కన్పిస్తాడు. ఒకరకంగా చెప్పాలంటే ఈ నందీశ్వరునిమూర్తి భారతీయశిల్పకళాచరిత్రలోనే కాకతీయుల కీర్తిని పతాక స్థాయిలో నిలబెట్టింది.
ప్రసన్నాంజనేయస్వామి..
ఆలయ పశ్చిమ భాగంలో రావిచెట్టు క్రింద ప్రసన్నాంజనేయస్వామి కొలువై ఉన్నాడు. ప్రతిమంగళవారం స్వామివారికి ప్రత్యేకపూజలు జరుగుతాయి. భక్తులు తమ కోరికలను కోరుకుని రావిచెట్టు చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తూ దారం చుడతారు.
శనీశ్వర పూజలు..
రుద్రేశ్వరాలయంలో శనీశ్వరునికి పూజలు నిర్వహించుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు లభిస్తాయని, పూజల అనంతరం శ్రీరుద్రేశ్వరుణ్ణి దర్శించుకోవడం ద్వారా శని పీడ నుండి విముక్తులు కావచ్చునని విశ్వాసం ఉంది. ఆ విధంగా ఈ దేవాలయంలో ప్రతి శనిత్రయోదశి రోజు ఉదయం 5 గంటల నుంచి శనీశ్వరుని విగ్రహనికి తిల, తైలాభిషేకాలు నిర్వహిస్తారు. రాహుకేతు అర్ధాష్టమశని, ఏలిననాటి శని, అష్టమ శని తదితర గ్రహప్రభావాలతో బాధపడుతున్న వారు, శనిగ్రహపీడితులు పూజలలో పాల్గొంటారు. నవగ్రహ పూజలు, తిలపూజలు, తిలదానాలు, వస్త్రదానాలు చేస్తారు.
శిలాశాసనం..
దేవాలయ తూర్పుద్వారం వద్ద శిలాశాసనం ఉంది. 11 అడుగుల పొడవుతో, నల్లనిశిలతో తయారైన ఈ శాసనం పతాకస్థానంలో రుద్రేశ్వర మహారాజు శ్రీరుద్రేశ్వర మహాశివలింగాన్ని అర్చిస్తున్నట్లుగా ఉంది. పక్కనే నందీశ్వరుడు ఉంటాడు. శాసనానికి మూడువైపులా రుద్రేశ్వర, కేశవ, సూర్యనారాయణమూర్తుల నమూనాలు ఉన్నాయి. ఈ శాసనంలో రుద్రదేవుడి తండ్రి అయిన రెండవ ప్రోలరాజు శౌర్యపరాక్రమాలను విజయయాత్రలను వర్ణించారు. దక్షిణాన శ్రీశైలం, పడమరన కటకం వరకు రుద్రదేవుడి రాష్ట్ర సరిహద్దులు ఉన్నాయని చెప్పారు. రుద్రేశ్వర, కేశవ, సూర్యనారాయణమూర్తుల నిత్యకైంకర్యానికి మద్దిచెరువుల గ్రామాన్ని రుద్రేశ్వరుడు దానంగా ఇచ్చినట్లు ఈ శాసనంలో ఉంది.
అలసకన్య... ఆలాపన
శ్రీరుద్రేశ్వరాలయం నైరుతిభాగంలో అలసకన్య శిల్పం ఉంది. ప్రతి పౌర్ణమిరోజున దేవాలయం వెన్నెల వెలుగులో రాత్రి నడిజామున అలసకన్య దేవాలయ ప్రాంగణంలో విహరిస్తుందని నమ్మకం ఉండేదట. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ నవలా రచయిత ముదిగొండ శివప్రసాద్‌ ఆలాపన అనే నవల రాసారు. ముష్కరుల దాడిలో ఆమె అందమైన ముఖం ధ్వంసమైపోయింది.
నిత్య పూజలు..
ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు శ్రీరుద్రేశ్వరస్వామివారిని దర్శించుకోవచ్చు. శివ ప్రీతికరమైన సోమవారాలలో ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అనుమతిస్తారు. రాత్రి 8 గంటలకు స్వామివారికి నిర్వహించే మహాహారతి కార్యక్రమం శివ సాన్నిధ్యంలో ఉన్నామా అనిపించే విధంగా మహాద్భుతంగా జరుగుతుంది. దేవాలయంలో ప్రతి హిందూ పర్వదినాన్ని ఘనంగా జరుపుతారు. తొలిఏకాదశి, శ్రావణమాసోత్సవాలు, శ్రీమహాగణపతినవరాత్రులు, శ్రీదేవీనవరాత్రులు, కార్తీక మాసోత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవాలు, ఉగాది మహోత్సవం, శ్రీరామనవమి వేడుకలు, హనుమజ్జయంతి వేడుకలు వైభవంగా నిర్వహిస్తారు.
కళ్యాణమండపం..
త్రికూటాలయానికి దక్షిణం వైపున కళ్యాణమండపం ఉంది. ఇక్కడ ఉత్సవాల సమయంలో కళ్యాణోత్సవాలు, వీరుల నృత్యాలు, రాజసందర్శన సమయంలో సభలు జరిగేవి. అయితే, కళ్యాణమండపం శిథిలం కావడంతో ప్రస్తుతం జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నాయి. పనులలో సిమెంట్‌ వాడకుండా సాంప్రదాయ పద్ధతులలో ఇసుక, సున్నం, కరక్కాయ, బెల్లం మిశ్రమాలతో తయారు చేసిన పదార్థాన్ని ఉపయోగిస్తూ, అలనాటి సంస్కృతికి అద్దం పడుతున్నారు.
రేపటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు
చారిత్రాత్మక శ్రీ రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో మహా శివరాత్రిమహోత్సవాలు ఫిబ్రవరి 23 నుండి 27వ తేదీ వరకు జరగనున్నాయి.
23వతేదీ: 23వ తేదీ మాఘ బహుళ ద్వాదశి గురువారం ఉదయం 5 గంటల నుంచి సుప్రభాత పూజ, గణపతి పూజ, శ్రీరుద్రేశ్వరశివలింగానికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం పుణ్యాహవచనం, అంకురారోపణ, అగ్నిప్రతిష్టాపన, నవగ్రహమంటపారాధన, ఉత్సవవిగ్రహాలపూజ, కలశస్థాపన సాయంత్రం ప్రదోషకాల పూజ పంచమహాహారతి నిర్వహిస్తారు. రాత్రి
సాంస్కృతిక కార్యక్రమాలు.
24వతేదీ: 24 వతేదీ శుక్రవారం ఉదయం 4 గంటల నుంచి సుప్రభాతసేవ, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి సామూహిక రుద్రాభిషేకాలు, నిత్యవిధిహవనం, సాయంత్రం 6.40 గంటలకు శ్రవణానక్షత్రయుక్త గోధూళిలగ్నసుముహూర్తమున శ్రీరుద్రేశ్వరస్వామి వారి కళ్యాణోత్సవం జరుగుతుంది. రాత్రి నడిజాము 12గంటలకు లింగోద్భవసమయంలో జరిపే మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకం జరుగుతుంది.
25 వతేదీ: 25వతేదీ శనివారం ఉదయం 5గంటలకు సుప్రభాతం గణపతిపూజ, స్వామివారికి రుద్రాభిషేకములు, మహాపూజ, నాగవల్లి కార్యక్రమం జరుగుతుంది.
26 వతేదీ: 26వతేదీ ఆదివారం మహాన్నపూజ, అన్నప్రసాదాల వితరణ.
27 వతేదీ: 27వతేదీ ఉత్సవ ముగింపులో భాగంగా శ్రీఅంజనేయస్వామికి చందనోత్సవం, ఆకుపూజ, శ్రీరుద్రేశ్వరస్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, మహాబిల్వార్చన, చండీహోమం.
కళ్యాణమండపాన్ని వెంటనే పూర్తిచేయాలి..
నిర్లక్ష్యానికి గురైన రుద్రేశ్వరుని ఆలయంలో క్రీ.శ.1959 నుంచి∙పూజలు ప్రారంభమయ్యాయి. 2005 అక్టోబర్‌ 16న జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. ఏడున్నర కోట్ల రూపాయలతో పనులు జరుగుతు న్నప్పటికీ 10 సంవత్సరాల తరువాత కూడా కళ్యాణమండపం పూర్తి కాలేదు. కళ్యాణమండపం పూర్తయితే చూడాలని తపించిన ఎందరో ప్రస్తుతం లేరు. బడ్జెట్‌ లేదని శిల్పులు పని ఆపివేసి తమిళ నాడు వెళ్లిపోయారు. ప్రభుత్వాలు శ్రద్ధ చూపిస్తేనే ఇలాంటి పనులు పూర్తవుతాయి. కళ్యాణమండపం పూర్తయితేనే దేవాలయానికి పూర్వపు శోభ వస్తుంది. వాస్తుదోషం కూడా తొలగిపోతుంది. – గంగు ఉపేంద్రశర్మ , వేయిస్తంభాల దేవాలయ ప్రధానార్చకులు
– అడ్లూరి శివప్రసాద్‌ సాక్షి హన్మకొండ ప్రతినిధి
టాగ్లు: vaisthabala temple, warangal, Aladin Khalji, వేయిస్తంభాల గుడి, ఓరుగల్లు, అల్లావుద్దీన్‌ ఖిల్జీ

mohan publications price list