MohanPublications Print Books Online store clik Here Devullu.com

ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రమ్ Pragna Vivardhana Kartikeya Stotram| MohanPublications | GRANTHANIDHI | bhaktipustakalu

 ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రమ్ Pragna Vivardhana Kartikeya Stotram| MohanPublications | GRANTHANIDHI | bhaktipustakalu Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry,BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA,TANTRA,YANTRA,RASIPALITALU,BHAKTI,LEELA,BHAKTHI SONGS,BHAKTHI,LAGNA,PURANA,devotional,  NOMULU,VRATHAMULU,POOJALU, traditional, hindu, SAHASRANAMAMULU,KAVACHAMULU,ASHTORAPUJA,KALASAPUJALU,KUJA DOSHA,DASAMAHAVIDYA,SADHANALU,MOHAN PUBLICATIONS,RAJAHMUNDRY BOOK STORE,BOOKS,DEVOTIONAL BOOKS,KALABHAIRAVA GURU,KALABHAIRAVA,RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI,FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION,PRINT BOOKS,E BOOKS,PDF BOOKS,FREE PDF BOOKS,freeebooks. pdf,BHAKTHI MANDARAM,GRANTHANIDHI,GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU,BHAKTIPUSTHAKALU,BHAKTHIPUSTHAKALU,pooja,




శ్రీ గణేశాయ నమః
II స్కంద ఉవాచ II
యోగీశ్వరో మహాసేనః కార్తికేయోಽగ్నినన్దనః I
స్కందః కుమారః సేనానీః స్వామీ శఙ్కరసమ్భవః II 1 II
గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః I
తారకారిః ఉమాపుత్రః క్రౌంచారిశ్చ షడాననః II 2 II
శబ్దబ్రహ్మసముద్రశ్చ సిద్ధః సారస్వతో గుహః I
సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రదః II 3 II
శరజన్మా గణాధీశః పూర్వజో ముక్తిమార్గకృత్ I
సర్వాగమప్రణేతా చ వాంఛితార్థప్రదర్శనః II 4 II
అష్టావింశతినామాని మదీయానీతి యః పఠేత్ I
ప్రత్యూషే శ్రద్ధయా యుక్తో వాచస్పతిర్భవేత్ II 5 II
మహామన్త్ర మయానీతి మమ నామానుకీర్తనమ్ I
మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కారా విచారణా II 6 II
II ఇతి శ్రీరుద్రయమలే ప్రజ్ఞావివర్ధన శ్రీకార్తికేయస్తోత్రం సంపూర్ణం II


కార్తికేయుని 28 నామములు -
1. యోగీశ్వరః – యోగీశ్వరులకు అధిపతి
2. మహాసేనః – దేవసైన్యానికి అధిపతి, దేవసేనాపతి
3. కార్తికేయః – ఆరు కృత్తికా నక్షత్రములచే పోషింపబడిన వాడు
4. అగ్నినన్దనః – పరమశివుని జ్ఞానాగ్ని నుంచి ఉద్భవించినవాడు మరియు పరమశివుని తేజస్సు కొంత సేపు భరించినందువల్ల, అగ్ని దేవునికి కూడా తనయుడిగా పిలువబడినవాడు.
5. స్కందః – పరమశివుని తేజస్సు నుండి జన్మించినవాడు
6. కుమారః – కుమార అన్న నామం కేవలం సుబ్రహ్మణ్యునికేచెందినది. ఎందుకంటే, జగత్తుకి మాతా పితలు అయిన పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యతకి ఫలం మన బుజ్జి సుబ్రహ్మణ్యుడు.
7. సేనానీః – దేవసేనలకు అధిపతి, దేవసేనాధ్యుక్షుడు.
8. స్వామీ శంకరసంభవః – శంకరుని దివ్యమైన తేజస్సు నుండి పుట్టినవాడు.
9. గాంగేయః – పరమశివుని తేజస్సు అగ్నిదేవుడు భరించలేక, గంగా మాతకి ఇచ్చేస్తే, గంగా మాత కొంత సేపు శివుని తేజస్సును భరిస్తుంది. అందువల్ల, గంగా మాతకి కూడా పుత్రునిగా పిలబడ్డవాడు కాబట్టి గాంగేయ అనే నామం వచ్చింది.
10. తామ్రచూడః – కుక్కుటమును అధిరోహించిన వాడు.
11. బ్రహ్మచారీ – ఎల్లప్పుడూ బ్రహ్మనందు రమించువాడు.
12. శిఖిధ్వజః – అగ్ని ధ్వజముగా కలవాడు
13. తారకారిః – తారకాసురడనే రాక్షస సంహారము చేయుటకు అవతారం దాల్చిన వాడు, తారకాసురుడిని, ఇతర రాక్షస గణములను సంహరించి దేవతలను రక్షించినవాడు.
14. ఉమాపుత్రః – ఉమాదేవి, అంటే పార్వతీ అమ్మ వారి ముద్దుల తనయుడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి వారు అచ్చం అమ్మవారి లానే ఉంటారు.
15. క్రౌంచారిః – పర్వత రూపములో ఉన్న క్రౌంచ అనే రాక్షసుడిని సంహరించినవాడు.
16. షడాననః – ఆరు ముఖములు గలవాడు.
17. శబ్దబ్రహ్మసముద్రః – జ్ఞాన స్వరూపుడు, అంటే వేదములు ఏ పరబ్రహ్మ స్వరూపమును గురించి ఘోషిస్తున్నాయో, ఆ వేద శబ్దములచే ప్రతిపాదించబడిన వాడు.
18. సిద్ధః – పరిపూర్ణ సిద్ధ స్వరూపుడు
19. సారస్వతః – సరస్వతీ స్వరూపము, అంటే జ్ఞాన స్వరూపము.
20. గుహః – సకలజీవుల హృదయ గుహలో కొలువై ఉన్నవాడు.
21. భగవాన్ సనత్కుమారః – చతుర్ముఖ బ్రహ్మ గారి నలుగురు మానస పుత్రులలో ఒకరైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగావచ్చారు. ఈ విషయమే, శ్రీవిద్యా రహస్యంలో మాహాత్మ్యఖండంలో వివరించబడినదని, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్ధారించారు.
22. భోగమోక్షఫలప్రదః – ఈ భూమి మీద మనం సుఖంగా జీవించడానికి అవసరమైన సంపదతో పాటు అంత్యమునందు మోక్షమును కూడా ఇవ్వగలిగినవాడు.
23. శరజన్మా – శరవణతటాకము (రెల్లు పొదల) నుండి జన్మించినవాడు.
24. గణాధీశః – సకల దేవతలకు, గణములకు అధిపతి అయిన వాడు.
25. పూర్వజః – అందరికన్నా ముందున్నవాడు, అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు, కేవలం ఒక అవతారం మాత్రమే కాదు, ఎప్పుడూ ఉండే పరబ్రహ్మ స్వరూపం. ఆయన ఎప్పుడూఉన్నవాడు, పుట్టుక లేనివాడు.
26. ముక్తిమార్గకృత్ – ముక్తి మార్గమును బోధించే గురు స్వరూపం. అంత్యమున ముక్తిని ప్రసాదించి, తనలో కలుపుకునే స్వామి.
27. సర్వాగమప్రణేతా – సకల ఆగమములకు మూలము.
28. వాంచితార్ధప్రదర్శనః – అభీష్టములను నెరవేర్చే తండ్రి.
స్కంద ఉవాచ-
ఈ ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రము రుద్రయమల తంత్రములోనిది. ఎవరైతే ఈ 28 నామములు ప్రతీ దినం ప్రాతః కాలం భక్తి శ్రద్ధలతో చదువుతారో, వారు సరస్వతీ అనుగ్రహం పొంది, చక్కని తెలివితేటలు, మంచి వాక్కు మరియు జ్ఞానమును పొందుతారు.
సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు

www.GRANTHANIDHI.com

శ్రీ షష్ఠీ దేవి స్తోత్రం sri_sastidevi_stotram | MohanPublications | GRANTHANIDHI | bhaktipustakalunPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU

        MohanPublications | GRANTHANIDHI | bhaktipustakalu Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry,BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA,TANTRA,YANTRA,RASIPALITALU,BHAKTI,LEELA,BHAKTHI SONGS,BHAKTHI,LAGNA,PURANA,devotional,  NOMULU,VRATHAMULU,POOJALU, traditional, hindu, SAHASRANAMAMULU,KAVACHAMULU,ASHTORAPUJA,KALASAPUJALU,KUJA DOSHA,DASAMAHAVIDYA,SADHANALU,MOHAN PUBLICATIONS,RAJAHMUNDRY BOOK STORE,BOOKS,DEVOTIONAL BOOKS,KALABHAIRAVA GURU,KALABHAIRAVA,RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI,FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION,PRINT BOOKS,E BOOKS,PDF BOOKS,FREE PDF BOOKS,freeebooks. pdf,BHAKTHI MANDARAM,GRANTHANIDHI,GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU,BHAKTIPUSTHAKALU,BHAKTHIPUSTHAKALU,pooja,

MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU

     శ్రీ షష్ఠీ దేవి స్తుతి


II ధ్యానం II
శ్రీమన్మాతరం అంబికాం విధి మనోజాతాం సదాభీష్టదాం ।
స్కందేష్టాం చ జగత్ప్రసూం విజయదాం సత్పుత్ర సౌభాగ్యదాం ।
సద్రత్నాభరణాన్వితాం సకరుణాం శుభ్రాం శుభాం సుప్రభాం ।
షష్ఠాంశాం ప్రకృతేః పరాం భగవతీం శ్రీ దేవసేనాం భజే II
షష్ఠాంశాం ప్రకృతేః శుద్ధాం సుప్రతిష్ఠాం చ సువ్రతాం ।
సుపుత్రదాం చ శుభదాం దయారూపాం జగత్ప్రసూం ।
శ్వేతచంపక వర్ణాభాం రక్తభూషణ భూషితాం ।
పవిత్రరూపాం పరమాం దేవసేనాం పరాంభజే II
II శ్రీ షష్ఠీ దేవి స్తోత్రం II
నమోదేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాన్త్యై నమో నమః
శుభాయై దేవసేనాయై షష్ఠీదేవ్యై నమో నమః II 1 II
వరదాయై పుత్రదాయై ధనదాయై నమో నమః
సుఖదాయై మోక్షదాయై చ షష్ఠీదేవ్యై నమో నమః II 2 II
సృష్ట్యై షష్ఠాంశరూపాయై సిద్ధాయై చ నమో నమః
మాయాయై సిద్ధయోగిన్యై షష్ఠీదేవ్యై నమో నమః II 3 II
సారాయై శరదాయై చ పరాదేవ్యై నమో నమః
బాలాధిష్ఠాతృదేవ్యై చ షష్ఠీదేవ్యై నమో నమః II 4 II
కళ్యాణదాయై కళ్యాణ్యై ఫలదాయై చ కర్మణామ్
ప్రత్యక్షాయై చ భక్తానం షష్ఠీదేవ్యై నమో నమః II 5 II
పూజ్యాయై స్కందకాంతాయై సర్వేషాం సర్వకర్మసు
దేవరక్షణకారిణ్యై షష్ఠీదేవ్యై నమో నమః II 6 II
శుద్ధసత్త్వ స్వరూపాయై వందితాయై నృణాం సదా
హింసాక్రోధవర్జితాయై షష్ఠీదేవ్యై నమో నమః II 7 II
ధనం దేహి ప్రియం (ప్రియాం) దేహి పుత్రందేహి సురేశ్వరి
ధర్మం దేహి యశోదేహి షష్ఠీదేవ్యై నమో నమః II 8 II
మానందేహి జయందేహి దిషోజహి మహేశ్వరి
భూమిం దేహి ప్రజాందేహి విద్యాందేహి సుపూజితే
కల్యాణం చ జయందేహి విద్యాదేవ్యై నమోనమః II 9 II
II ఫలశృతి II
ఇతి దేవీం చ సంస్తుత్య లభే పుత్రం ప్రియవ్రతం
యశశ్వినం చ రాజేంద్రం షష్ఠీదేవి ప్రసాదతః II 10 II
షష్ఠీ స్తోత్ర మిదం బ్రహ్మన్ యః శృణోతి వత్సరం
అపుత్రో లభతే పుత్రమ్ వరం సుచిర జీవనం II 11 II
వర్షమేకం చ యాభక్త్యాసంస్తుత్యేదం శృణోతి చ
సర్వపాప వినిర్ముక్తా మహావంధ్యా ప్రసూయతే II 12 II
వీరం పుత్రం చ గుణినం విద్యావన్తం యశస్వినం
సుచిరాయుష్యవన్తం చ సూతే దేవి ప్రసాదతః II 13 II
కాక వంధ్యా చ యానారీ మృతపత్యా చ యా భవేత్
వర్షం శృత్వా లభేత్పుత్రం షష్ఠీ దేవీ ప్రసాదతః II 14 II
రోగయుక్తే చ బాలే చ పితామాతా శృణోతి చేత్
మాసేన ముచ్యతే రోగాన్ షష్ఠీ దేవీ ప్రసాదతః II 15 II
జయదేవి జగన్మాతః జగదానందకారిణి
ప్రసీద మమ కళ్యాణి నమస్తే షష్ఠి దేవతే II 17 II
II శ్రీ షష్ఠీ దేవి స్తోత్రం సంపూర్ణం II




దేశ భక్తి గీతాలు Desa Bhakthi Geethalu | MohanPublications | GRANTHANIDHI | bhaktipustakalu

దేశ భక్తి గీతాలు Desa Bhakthi Geethalu  | MohanPublications | GRANTHANIDHI | bhaktipustakalu Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry,BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA,TANTRA,YANTRA,RASIPALITALU,BHAKTI,LEELA,BHAKTHI SONGS,BHAKTHI,LAGNA,PURANA,devotional,  NOMULU,VRATHAMULU,POOJALU, traditional, hindu, SAHASRANAMAMULU,KAVACHAMULU,ASHTORAPUJA,KALASAPUJALU,KUJA DOSHA,DASAMAHAVIDYA,SADHANALU,MOHAN PUBLICATIONS,RAJAHMUNDRY BOOK STORE,BOOKS,DEVOTIONAL BOOKS,KALABHAIRAVA GURU,KALABHAIRAVA,RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI,FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION,PRINT BOOKS,E BOOKS,PDF BOOKS,FREE PDF BOOKS,freeebooks. pdf,BHAKTHI MANDARAM,GRANTHANIDHI,GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU,BHAKTIPUSTHAKALU,BHAKTHIPUSTHAKALU,pooja,

దేశ భక్తి గీతాలు

1.వందేమాతరం
వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీం
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం వందేమాతరం ||
సప్త కోటి కంఠ కలకల నివాద కరాలే
త్రిశంత్కోటి భుజై ధృత ఖర కరవాలే
అబలా కైనో మా ఐతో బోలే
బహుబల ధారిణీం నమామి తారిణీం
రిపుదల వారిణీం మాతరం వందేమాతరం ||
తుమి విద్యా తుమి ధర్మ్
తుమి హ్రుది తుమి మర్మ్ త్వాం హి ప్రాణాహ్ శరీరే ||
బాహుతే తుమి మా శక్తి
హ్రుదయే తుమి మా భక్తి
తోమారయి ప్రతిమా జడి మందిరే || వందేమాతరం ||
త్వాం హి దుర్గా దశప్రహరణ ధరిణీం
కమలా కమల-దళ-విహారిణీం
వాణీ విద్యాదాయినీ నమామి త్వాం
నమామి కమలాం అమలాం అతులాం
సుజలాం సుఫలాం మాతరం
వందే మాతరం |
శ్యామలాం, సరళాం, సుస్మితాం, భూషితాం,
ధరణీం భరణీం మాతరం ||
వందే మాతరమ్. వందే మాతరమ్||


2.మా తెనుగు తల్లికి
మా తెలుగు తల్లికి మల్లె పూదండ
మా కన్న తల్లికి మంగళారతులు
కడుపులో బంగారు కను చూపులో కరుణ
చిరునవ్వు లో సిరులు దొరలించు మా తల్లి
గల గలా గోదారి కదలి పోతుంటేను
బిర బిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలు తాయి
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలచి యుండే దాక
రుద్రమ్మ భుజ శక్తి
మల్లమ్మ పతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారు మ్రోగే దాక
నీ ఆటలే ఆడుతాం
నీ పాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ! జై తెలుగు తల్లీ!


3.అంతా ఒక్కటే
అంతా ఒక్కటే మనమంతా ఒక్కటే, ఆంధ్రులమైనా తమిళులమైనా
ఉత్కళులైనా కన్నడులైనా
మరాఠి అయినా గుజరాత్ అయినా
పంజాబ్ అయినా బంగ్లా అయినా - !!అంతా!!
వందనమండీ వందనం
వణక్కమమ్మా వణక్కం
ఎస్సలాం ఎస్సలాం
నమస్కార్ నమస్కార్
భాషలు వేర్వేరయినాగానీ
భావాలన్నీ ఒకటేనోయ్,
దేశాలన్నీ ఒకటే అయితే ద్వేషాలేమీ ఉండవుగా,
బాలప్రపంచం, భావిప్రపంచం
భావిభారత వారసులం !!అంతా!!
- న్యాయపతి రాఘవరావు

4.భారతీయ వీరులం
భారతీయ వీరులం - భరతమాత బిడ్డలం
భారతీయ వీరులం - భరతమాత బిడ్డలం
మాతృదేశ గౌరవం - కాపాడే ధీరులం
మాతృదేశ గౌరవం - కాపాడే ధీరులం
మాతృదేశ గౌరవం - కాపాడే ధీరులం
శాంతికోరు పాపలం - సమత పెంచు బాలలం
శాంతికోరు పాపలం - సమత పెంచు బాలలం
శాంతికోరు పాపలం - సమత పెంచు బాలలం
మేము భావి పౌరులం - త్యాగధనుల వారసులం
మేము భావి పౌరులం - త్యాగధనుల వారసులం
వేష భాష లేవైనా - మతాచార మేదైనా
వేష భాష లేవైనా - మతాచార మేదైనా
మనం భారతీయులం - ఒకే తల్లి పిల్లలం
మనం భారతీయులం - ఒకే తల్లి పిల్లలం
ప్రపంచాన మన దేశం - ప్రతిభను నిలబెట్టుదాం
మనమంతా సైనికులం - మనం ప్రజాసేవకులం
జాతి స్వేచ్ఛ నపహరించు - శత్రువు నెదిరించుతాం
విజయం సాధించుతాం - జయపతాక నెగరేద్దాం
విజయం సాధించుతాం - జయపతాక నెగరేద్దాం
హిమశైల కిరీటయై - సముద్ర పాదపీఠయై
గంగ, యమున, గోదావరి - కృష్ణవేణి సహితయై
విలసిల్లే భరతమాత - మన తల్లికి జోహార్
భారతీయ వీరులం - భరతమాత బిడ్డలం
భారతీయ వీరులం - భరతమాత బిడ్డలం
- దాశరథి

5.దేశమును ప్రేమించుమన్నా
దేశమును ప్రేమించుమన్నా
- మంచి అన్నది పెంచుమన్న
వట్టిమాటలు కట్టిపెట్టోయ్
- గట్టి మేల్ తలపెట్టవోయి!
పాడి పంటలు పొంగిపొర్లే
- దారిలో నువు పాటు పడవోయి
తింది కలిగితే కండ కలదోయి
- కండ కలవాడేను మనిషోయి
ఈసురోమని మనుషులుంటే
- దేశ మేగతి బాగుపడునోయి
జల్దుకొని కళలెల్ల నేర్చుకు
- దేసి సరుకులు నించవోయి
అన్ని దేశాల్ క్రమ్మవలె నోయి
- దేశి సరుకుల నమ్మవలె నోయి
డబ్బు తేలెనట్టి నరులకు
- కీర్తి సంపదలబ్బవోయి!
వెనుక చూసిన కార్యమేమోయి
- మంచి గతముల కొంచమేనోయి
మందగించక ముందు అడుగేయి
- వెనక పడితే వెనకే నోయి!
పూను స్పర్థను విద్యలందే
- వైరములు వాణిజ్య మందే
వ్యర్ధ కలహం పెఒచబోకోయి
- కత్తి వైరం కాల్చవోయి!
దేశాభిమానము నాకు కద్దని
- వట్టి గొప్పలు చెప్పుకో కోయి
పూని యేదైనాను, నొక మేల్
- కూర్చి జనులకు చూపవోయి!
ఓర్వ లేమి పిశాచి దేశం
- మూలుగులు పీల్చేసె నోయి!
ఒరుల మేలుకు సంతసిస్తూ
- ఐకమత్యం నేర్చవోయి!
పరుల కలిమికి పార్లి యేడ్చే
- పాపి కెక్కడ సుఖం కద్దోయి
ఒకరి మేల్ తన మేలనెంచే
- నేర్పరికి మేల్ కొల్ల లోయి
సొంత లాభము కొంత మానుకు
- పొరుగువారికి తోదు పడవోయి
దేసమంటే మట్టి కాదోయి
- దేశమంటే మనుషులోయి!
చెట్ట పట్టాల్ పట్టుకుని
- దేశస్థు లంతా నదువవలె నోయి
అన్నదమ్ముల వలెను జాతులు
- మతములన్నీ మెలగవలె నోయి!
మతం వేరైతేను యేమోయి
- మనము వొకటై మనుషులుంటే
జాతి యన్నది లేచి పెరిగి
- లోకము న రాణించునోయి!
దేశ మనియెడి దొడ్డ వృక్షం
- ప్రేమలను పూలెత్తవలె నోయి
నరుల చమటను తడిసి మూలం
- ధనం పంటలు పందవలె నోయి!
ఆకులందున అణిగి మణిగి
- కవిత పలకవలె నోయి
పలుకులను విని దేసమందలి
- మానములు మొలకెత్త వలెనోయి!
-గురజాడ వెంకట అప్పారావు


6.నారాయణ నారాయణ అల్లా అల్లా
నారాయణ నారాయణ అల్లా అల్లా
మా పాలిట తండ్రీ నీ పిల్లల మే మెల్ల !!నారాయణ!!
మతమన్నది నాకంటికి మసకైతే
మతమన్నది నామనసుకు మబ్బైతే
మతం వద్దు గితం వద్దు మాయామర్మంవద్దు !!నారాయణ!!
ద్వేషాలు రోషాలు తెచ్చేదే మతమైతే
కలహాలు కక్షలు కలిగించేదే గతమైతే
మతం వద్దు గితం వద్దు
మారణ హోమం వద్దు !!నారాయణ!!
మతమన్నది గాంధీజీ హితమైతే
మతమన్నది లోకానికి హితమైతే
హిందువులం ముస్లిములం
అందరము మానవులం,
అందరమూ సోదరులం !!నారాయణ!!

7. పిల్లల్లారా పాపల్లారా
పిల్లల్లారా పాపల్లారా రేపటి భారతపౌరుల్లారా
పెద్దలకే ఒక దారిని చూపే పిన్నల్లారా పిల్లల్లారా
మీ కన్నుల్లో పున్నమి జాబిలి
ఉన్నాడు, ఉన్నాడు పొంచున్నాడు.
మీ మనస్సుల్లో దేవుడు కొలువై ఉన్నాడు.
ఉన్నాడు అతడున్నడు.
భారత మాతకు ముద్దులబిడ్డలు, మీరేలే మీరేలే
అమ్మకు మీపై అంతేలేని ప్రేమలే, పిల్లల్లారా ప్రేమేలే
రేపటి భారత పౌరుల్లారా...
భారత దేశం ఒకటేఇల్లు భారత మాతకు మీరే కళ్లు,
మీరే కళ్లు, మీరే కళ్లు
జాతిపతాకం పైకెగరేసి
జాతి గౌరవం కాపాడండి బడిలోబయటా అంతా కలిసి
భారతీయులై మెలగండి కన్యాకుమారికి కాశ్మీరానికి
అన్యోన్యతను పెంచండి వీడని బంధం వేయండి. పిల్లల్లారా!!
- దాశరథి

8. తల్లీభారతి

తల్లీ భారతి వందనం - తల్లీ భారతి వందనం
నీ ఇల్లే మా నందనం - మేమంతా నీ పిల్లలము
నీ చల్లని ఒదిలో మల్లెలము - తల్లిదండ్రులను గురువులను
ఎల్లవేళల కొలిచెదమమ్మా - తల్లిదండ్రులను గురువులను
ఎల్లవేళల కొలిచెదమమ్మా - చదువులు బాగా చదివెదమమ్మా
జాతి గౌరవం పెంచెదమమ్మా - చదువులు బాగా చదివెదమమ్మా
జాతి గౌరవం పెంచెదమమ్మా - కులమత భేదం మరచెదము
కలతలు మాని మెలగెదము - కులమత భేదం మరచెదము
కలతలు మాని మెలగెదము - మానవులంతా సమానులంటూ
మమతను సమతను పెంచెదము - తెలుగు జాతికీ అభ్యుదయం
నవభారతికే నవోదయం - తెలుగు జాతికీ అభ్యుదయం
నవభారతికే నవోదయం - భావిపౌరులం మనం మనం
భారత జనులకు జయం జయం - భావిపౌరులం మనం మనం
- దాశరథి

9. వీరగంధము

వీరగంధము దెచ్చినారము
వీరుడెవ్వడో తెలుపండీ!
పూసి పోదుము మెడను వైతుము
పూలదండలు భక్తితో!!

తెలుగు బావుట కన్ను చెదరగ
కొండవీటను నెగిరినప్పుడు
తెలుగువారల కత్తిదెబ్బలు
గండికోటను కాచినప్పుడు

తెలుగువారల వేడి నెత్తురు
తుంగభద్రను గలిసినప్పుదు
దూరమందున నున్న సహ్యజ
కత్తి నెత్తురు కడిగి నప్పుడు

ఇట్టి సందియమెన్నడేనియు
బుట్టలేదు రవంతయున్;
ఇట్టి ప్రశ్నల నడుగువారలు
లేకపోయిరి సుంతయున్.

నదుముగట్టిన తెలుగు బాలుడు
వెనుక తిరుగండెన్నడున్,
బాసయుచ్చిన తెలుగు బాలుడు
పా¬ఋఇపోవం డెన్నడున్.

ఇదిగో! యున్నది వీరగంధము
మై నలందుము మైనలందుము;
శాంతిపర్వము జదువవచ్చును
శాంతి సమరంబైన పిమ్మట

తెలుగునాటిని వీరమాతను
జేసి మాత్రము తిరిగి రమ్మిక,
పలుతుపాకులు పలు ఫిరంగులు
దారి కడ్డము రాకతప్పవు

వీరగంధము దెచ్చినారము
వీరుడెవ్వడొ తెల్పుడీ!
పూసిపోదుము మెడను వైతుము
పూలదండలు భక్తితో!!

'కవిరాజు ' త్రిపురనేని రామస్వామి చౌదరి


10.జయ జయ జయ ప్రియ భారత
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి

జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ సశ్యామల సు శ్యామచలా చేలాంచల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల
జయ వసంత కుసుమలతా చరిత లలిత చూర్ణ కుంతల


జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా
జయ మదీయ హృదయాశ్రయ లాక్షారుణ పద యుగళా
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ దిశాంత గత శకుంత దివ్యగాన పరితోషణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ గాయక వైతాళిక గళ విశాల పద విహరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ
జయ మదీయ మధుర గేయ చుంబిత సుందర చరణ
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
జయ జయ జయ శత సహస్ర నర నారీ హృదయ నేత్రి
జయ జయ జయ ప్రియ భారత జనయిత్రి దివ్య ధాత్రి
దివ్య ధాత్రి దివ్య ధాత్రి


11. జై అందామంతా
వెలుగన్నదే రాని రాతిరుందా
ముగిసేది కాదన్న కలత ఉందా
కరి మబ్బు జల్లు పడి కరిగిపోదా
ఆశలకు అదుపంటు లేదు కదా...
జై అందామంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
స్వాతంత్ర్యం తెచ్చే ఉదయం వచ్చే దాస్యం తుడిచి పెట్టెలే..
జై అందామంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
స్వాతంత్ర్యం తెచ్చే ఉదయం వచ్చే దాస్యం తుడిచి పెట్టెలే...
కాలం మారిపోయే మన కథలే మారిపోయే
కష్టాలన్ని కరిగేనన్న నమ్మకం వచ్చిందోయ్
కాలం మారిపోయే మన కథలే మారిపోయే
కష్టాలన్ని కరిగేనన్న నమ్మకం వచ్చిందోయ్
జై అందామంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
స్వాతంత్ర్యం తెచ్చే ఉదయం వచ్చే దాస్యం తుడిచి పెట్టెలే...
చేతికిలా ఇలా ఇలా ఇలా...చంద్రుడందేనులే
జుంజుం జుంజుం జుంజుం. జుం జుంజుంజుం జుంజుం
ఇంక ఇలా ఇలా ఇలా ఇలా...నవ్వు చిందేనులే
తరుణం పోనీ చూద్దాం మనదయ్యే లోకం కొద్దాం
అరె ఇంకా కొంచెం పైపైకెళితే మనదే నీలాకాశం
పంతం పోనీ చూద్దాం మనదయ్యే లోకం కొద్దాం
అరె ఇంకా కొంచెం పైపైకెళితే మనదేలే నీలాకాశం
వన్నె చిన్నెల చిలకా...వన్నె చిన్నెల చిలకా
అవకాశం వచ్చెనమ్మ వెళ్ళి అందుకో
అమ్మ అందాల చిట్టెమ్మా...అమ్మా అందాల చిట్టెమ్మా
నీ జన్మాభూమి ఒడి చేరి ఆడుకో
జై అందామంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
స్వాతంత్ర్యం తెచ్చే ఉదయం వచ్చే దాస్యం తుడిచి పెట్టెలే...
జై అందామంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
స్వాతంత్ర్యం తెచ్చే ఉదయం వచ్చే దాస్యం తుడిచి పెట్టెలే...
కాలం మారిపోయే మన కథలే మారిపోయే
కష్టాలన్ని కరిగేనన్న నమ్మకం వచ్చిందోయ్
కాలం మారిపోయే మన కథలే మారిపోయే
కష్టాలన్ని కరిగేనన్న నమ్మకం వచ్చిందోయ్
కష్టాలన్ని కరిగేనన్న నమ్మకం వచ్చిందోయ్
గతపంజరాల శతబంధనాలు వీడి
మోసం ద్వేషం దోషంలేని దేశం నిర్మిద్దాము
గతపంజరాల శతబంధనాలు వీడి
మోసం ద్వేషం దోషంలేని దేశం నిర్మిద్దాము
స్వేచ్ఛ దొరికే మనకు ఇక మనసుపై మంచు పొరలు ఎందుకు
స్వేచ్ఛ దొరికే మనకు ఇక మనసుపై మంచు పొరలు ఎందుకు
జై అందాం అంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
జై అందాం అంతా ఒకటై ఇక ఇటుపై రాజ్యం మనదే
స్వాతంత్ర్యం తెచ్చే ఉదయం వచ్చే దాస్యం తుడిచి పెట్టెలే...ఏ...
అంబరంలో వాసంతం ఎటుదాక్కున్నా పిలిపిద్దాం
పిలిపిద్దాం పిలిపిద్దాం పిలిపిద్దాం పిలిపిద్దాం
మంచిని పూలుగ పూయిద్దాం మనిషిని మనిషిగ బ్రతిగిద్దాం
బ్రతిగిద్దాం బ్రతిగిద్దాం బ్రతిగిద్దాం బ్రతిగిద్దాం
అంబరంలో వాసంతం ఎటుదాక్కున్నా పిలిపిద్దాం
మంచిని పూలుగ పూయిద్దాం మనిషిని మనిషిగ బ్రతిగిద్దాం
లోకం మొత్తం కరిగిద్దాం సౌఖ్యం చిగురులు తొడిగిద్దాం
వాడా వాడా వెలిగిద్దాం వాడని వనమై వికసిద్దాం
వాడా వాడా వెలిగిద్దాం వాడని వనమై వికసిద్దాం
విశ్వాన్నేలే విజయదీతరం రెప రెపమంటూ ఎగరదాం
మేధస్వరమై వందేమాతరం బంగరు భవితను పిలవగా...

12.ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపురా నీ జాతి నిండు గౌరవము
రాయప్రోలన్నాడు ఆనాడు అది మరిచిపోవద్దు ఏనాడు
పుట్టింది నీ మట్టిలో సీత
రూపు కట్టింది దివ్య భగద్గీత
వేదాలు వెలసిన ధరణి రా
వేదాలు వెలసిన ధరణి రా
ఓంకార నాదాలు పలికిన అవని రా
ఎన్నెన్నో దేశాలు కన్ను తెరవని నాడు
వికసించె మన నేల విఙ్ఞాన కిరణాలు
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపురా నీ జాతి నిండు గౌరవము
వెన్నెలది ఏ మతము రా
కోకిలది ఏ కులము రా
గాలికి ఏ భాష ఉంది రా
నీతికి ఏ ప్రాంతముంది రా
గాలికీ నీటికీ లేవు భేదాలు
మనుషుల్లో ఎందుకీ తగాదాలు కులమత విభేదాలు
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపురా నీ జాతి నిండు గౌరవము
గౌతమ బుద్ధుని బోధలు మరవద్దు
గాంధీ చూపిన మార్గం విడవద్దు
గౌతమ బుద్ధుని బోధలు మరవద్దు
గాంధీ చూపిన మార్గం విడవద్దు
దేశాల చీకట్లు తొలగించు
స్నేహ దీపాలు ఇంటింటా వెలిగించు
ఐకమత్యమే జాతికి శ్రీరామ రక్ష
అందుకే నిరంతరం సాగాలి దీక్ష...
అందుకే నిరంతరం సాగాలి దీక్ష...

13.గాంధీ పుట్టిన దేశం
గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం
గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం
రఘుపతి రాఘవ రాజారాం
పతితపావన సీతారాం
ఈశ్వర అల్లా తేరేనాం
సబకోసన్మతి దే భగవాన్
భేదాలన్నీ మరచి మోసం ద్వేషం విడచి
భేదాలన్నీ మరచి మోసం ద్వేషం విడచి
మనిషి మనిషిగా బ్రతకాలి
ఏనాడూ నీతికి నిలవాలి
మనిషి మనిషిగా బ్రతకాలి
ఏనాడూ నీతికి నిలవాలి
బాపూ ఈ కమ్మని వరమే మాకివ్వు
అవినీతిని గెలిచే బలమివ్వు
అవినీతిని గెలిచే బలమివ్వు
గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం
రఘుపతి రాఘవ రాజారాం
పతితపావన సీతారాం
ఈశ్వర అల్లా తేరేనాం
సబకోసన్మతి దే భగవాన్
ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం
ప్రజలకు శాంతి సౌఖ్యం కలిగించే దేశమే దేశం
బానిసభావం విడనాడి ఏజాతి నిలుచునో అది జాతి
బానిసభావం విడనాడి ఏజాతి నిలుచునో అది జాతి
బాపూ నీ చల్లని దీవెన మాకివ్వు
నీ బాటను నడిచే బలమివ్వు
నీ బాటను నడిచే బలమివ్వు
గాంధీ పుట్టిన దేశం
రఘురాముడు ఏలిన రాజ్యం
ఇది సమతకు మమతకు సంకేతం
ఇది సమతకు మమతకు సంకేతం
రఘుపతి రాఘవ రాజారాం
పతితపావన సీతారాం
ఈశ్వర అల్లా తేరేనాం
సబకోసన్మతి దే భగవాన్
రఘుపతి రాఘవ రాజారాం
పతితపావన సీతారాం


14. వీర భారతీయ పౌరుల్లారా..ఆ..ఆ..ఆ..
వీర భారతీయ పౌరుల్లారా..ఆ..ఆ..ఆ..
దేశమాత పిలుపు వినలేరా..ఆ..ఆ..ఆ..
హిమాలయంలో మంటలు రేగి ప్రమాద సమయం వచ్చింది
స్వతంత్ర భారత యోధుల్లారా సవాలెదుర్కొని కదలండి
స్వతంత్ర భారత యోధుల్లారా సవాలెదుర్కొని కదలండి
సవాలెదుర్కొని కదలండి
అంతా స్నేహితులనుకున్నాము అందరి మేలు ఆశించాము
అందరి మేలు ఆశించాము
పరుల మంచికై నమ్మకముంచి పగటి కలలలో జీవించాము
నేటికి కలిగెను కనువిప్పు ముంచుకు వచ్చెను పెనుముప్పు
స్వతంత్ర భారత యోధుల్లారా సవాలెదుర్కొని కదలండి
సవాలెదుర్కొని కదలండి
వీరమాతలారా సుతులకు చంధన గంధం పూయండి
చంధన గంధం పూయండి
వీర వనితలారా పతులకు కుంకుమ తిలకం తీరచండి
కుంకుమ తిలకం తీరచండి
నెత్తురు జంకే యువకుల్లారా కత్తులు దూసి దుకండి
బానిసతనమున బ్రతికే కన్నా చావే మేలని తలచండి
స్వతంత్ర భారత యోధుల్లారా సవాలెదుర్కొని కదలండి
సవాలెదుర్కొని కదలండి
మనమంతా ఒక జాతి సమైక్యమే మన నీతి
మనమంతా ఒక జాతి సమైక్యమే మన నీతి
కులమేదైనా మతమేదైనా వేషం భాష వేరే అయినా
జనమొకటే అని చాటండి
ధర్మ దీక్షయే మన కవచం తప్పక మనదే ఘన విజయం
స్వతంత్ర భారత యోధుల్లారా సవాలెదుర్కొని కదలండి
సవాలెదుర్కొని కదలండి
భరతమాత పరువు నిల్పగా..ఆ..ఆ..ఆ..
భరతవీర ప్రతిన దాల్చరా..ఆ..ఆ..ఆ..
జయపతాక చేతబూనరా..ఆ..ఆ..ఆ..
సమర విజయ శంఖమూదరా..ఆ..ఆ..ఆ..
సమర విజయ శంఖమూదరా...

15. నీ ధర్మం నీ సంఘం నీ దేశం
నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు
సత్యం కోసం సతినే అమ్మిన్నదెవరు - హరిశ్చంద్రుడు
తండ్రిమాటకై కానలకేగినదెవరు - శ్రీరామచంద్రుడు
అన్న సేవకే అంకితమైనదెవరన్నా - లక్ష్మన్న
పతియే దైవమని తరించింపోయినదెవరమ్మ - సీతమ్మ
ఆ పుణ్యమూర్తులు చూపినమార్గం అనుసరించుటే ధర్మం
అనుసరించుటే నీ ధర్మం
నీ ధర్మం మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు
చాపకూడుతో సమతను నేర్పెను నాటి పలనాటి బ్రహ్మన్న
మేడిపండులా మెరిసే సంగం గుట్టువిప్పెను వేమన్న
వితంతుల విధి వ్రాతలు మార్చి బ్రతుకులు పండించె కందుకూరి
తెలుగు భారతిని ప్రజలభాషలో తీరిచిదిద్దెను గురజాడ
ఆ సంస్కర్తల ఆశయరంగం నీవు నిలిచిన సంఘం
నీవు నిలిచిన ఈ సంఘం
నీ సంఘం మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు
స్వతంత్రభారత రధసారధియై సమరాన దూకె నేతాజి
సత్యాగ్రహమే సాధనమ్ముగా స్వరాజ్యమే తెచ్చె బాపూజి
గుండెకెదురుగా గుండె నిలిపెను ఆంధ్రకేసరి టంగుటూరి
తెలుగువారికొక రాష్ట్రం కోరి ఆహుతి ఆయెను అమరజీవి
ఆ దేశభక్తులు వెలసిన దేశం నీవు పుట్టిన భారతదేశం
నీవు పుట్టిన ఈ దేశం
నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు
జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు
మహనీయులనే మరవద్దు

16. దేశం మనదే తేజం మనదే
దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జెండా మనదే
నీతి మనదే జాతి మనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైనా ఏ మతమైనా
ఏ కులమైనా ఏ మతమైనా
భరతమాతకొకటేలేరా
ఎన్ని బేధాలున్నా మాకెన్ని తేడాలున్నా
దేశమంటే ఏకమౌతాం అంతా ఈ వేళ
వందేమాతరం అంటామందరం
వందేమాతరం అంటామందరం
దేశం మనదే తేజం మనదే
ఎగురుతున్న జెండా మనదే
నీతీ మనదే జాతీ మనదే
ప్రజల అండదండా మనదే
అందాల బంధం ఉంది ఈ నేలలో
ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో
ఏ కులమైనా ఏ మతమైనా
భరతమాతకొకటేలేరా
రాజులు అయినా పేదలు అయినా
భరతమాత సుతులేలేరా
ఎన్ని దేశాలున్నా మాకెన్ని దోషాలున్నా
దేశమంటే ప్రాణమిస్తాం అంతా ఈవేళ
వందేమాతరం అంటామందరం
వందేమాతరం ఓ... అంటామందరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం
వందేమాతరం వందేమాతరం

17.భారత మాతా భగవద్గీత
భారత మాతా భగవద్గీత
మమతా సమతా మంగళ చరిత
మధురమైన సుస్వరం
ఇది మరిచిపోదు మా తరం
అది వందేమాతరం...
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
భారత మాతా భగవద్గీత
మమతా సమతా మంగళ చరిత
మధురమైన సుస్వరం
ఇది మరిచిపోదు మా తరం
అది వందేమాతరం...
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
హిమగిరి శోభలే సిగలో మల్లెలుగా
కుంకుమ రేఖలే కాశ్మీరాలుగా
కనులకు ఆ సొగసెంతో
చాల్ చాల్లే ఈ వేషం ఆవేశం
తెలిసెను నీ లయలెన్నో
ఏం తెలిసి ఈ అలుసు నా మనసు
గృహమొక దేశమైతే మధు మధురం కాపురం
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
గంగా సంగమం యమునకు ఆగునా
జెండా వందనం జాతికి దీవెన
జనగణ మానసగీతం
గోదారై వేదాలే వల్లించే
నవరస కన్నడ రాగం
కావేరై వాగ్దేయం పాడించే
శృతిలయలే మనమైతే ఇక మనదే ఈ తరం
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
భారత మాతా భగవద్గీత
మమతా సమతా మంగళ చరిత
మధురమైన సుస్వరం
ఇది మరిచిపోదు మా తరం
అది వందేమాతరం...
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే
వందేమాతరం వందేమాతరం వందేమాతరం వందే

18.I Love India... I Love India...
I Love India... I Love India...
జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం
మమతలెరిగిన మాతౄభూమికి మంగళం మాతరం
మగువ శిరస్సున మణులు పొదిగెను హిమగిరి
కలికి పదములు కడలి కడిగిన కళ ఇది
I Love India... I Love India...
I Love India... I Love India...
గంగ యమునలు సంగమించిన గానమో
కూచిపూడికి కులుకు నేర్పిన నాట్యమో
అజంతాల... ఖజురహోల...
సంపదలతో సొంపులొలికే భారతి జయహో
మంగళం మాతరం
I Love India... I Love India...
I Love India... I Love India...
జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం
తాజమహలే ప్రణయ జీవుల పావురం
కౄష్ణవేణి శిల్పరమణి నర్తనం
వివిద జాతుల వివిద మతముల
ఎదలు మీటిన ఏక తాళపు భారతి జయహో
మంగళం మాతరం
I Love India... I Love India...
I Love India... I Love India...
జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం
మమతలెరిగిన మాతృభూమికి మంగళం మాతరం
వందే మాతరం

19.rss ప్రార్థన
1. నమస్తే సదా వత్సలే మాతృభూమే
త్వయా హిందుభూమే సుఖవ్ వర్ధితోహం
మహామఙ్గలే పుణ్యభూమే త్వదర్థే
పతత్వేష కాయో నమస్తే నమస్తే ||
 2. ప్రభో శక్తిమన్ హిందు రాష్ట్రాఙ్గభూతా
ఇమే సాదరన్ త్వాన్ నమామో వయం
త్వదీయాయ కార్యాయ బధ్దా కటీయం
శుభామాశిషన్ దేహి తత్పూర్తయే
అజయ్యాఞచ విశ్వస్య దేహీశ శక్తిం
సుశీలన్ జగద్ యేన నమ్రం భవేత్
శ్రుతఞచైవ యత్ కణ్టకాకీర్ణ మార్గం
స్వయం స్వీకృతం నస్ సుగఙ కారయేత్

3. సముత్కర్ష నిస్ శ్రేయ సస్యైక ముగ్రం
పరం సాధనన్ నామ వీర వ్రతం
తదంతస్ స్ఫురత్వక్షయా ధ్యేయనిష్ఠా
హృదంతః ప్రజాగర్తు తీవ్రానిశం
విజేత్రీ చ నస్ సంహతా కార్యశక్తిర్
విధాయాస్య ధర్మస్య సంరక్షణం
పరవ్ వైభవన్ నేతు మేతత్ స్వరాష్ట్రం
సమర్థా భవత్వాశిశాతే భృశం
||భారత్ మాతా కీ జయ్||


20.హిందువులం హిందువులం
హిందువులం హిందువులం - హిందుజాతి వారసులం
హిందు ధర్మ రక్షకులం - హిందు రాష్ట్ర సాధకులం
స్ఫూర్తి శంఖ నాదకులం ప్రణవ ఫణవ వాదకులం
ప్రియ వంశీ నాదములం ధర్మానక ధ్వానములం ||హిందువులం||
ఇంద్రధనూ వర్ణములం సింధు త్రయ వీచికలం
తీవ్ర భాను తేజములం శరత్ చంద్ర కిరణములం ||హిందువులం||
రామ ధనుర్బాణములం శివ గణముల శూలములం
చక్రి చేతి చక్రములం భరతమాత సైనికులం ||హిందువులం||
సర్వజన ప్రేమికులం భగావాధ్వజ వాహకులం
విశ్వశాంతి కాముకులం వేద ధర్మ ఘోషకులం ||హిందువులం||


21.వేదంలా ఘోషించే గోదావరి
వేదంలా ఘోషించే గోదావరి
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరిత వి సుందర నగరం
గత వైభవ కీర్తులతో కమ్మని గానం || వేదంలా ||

1 . రాజరాజ నరేంద్రుడు కాకతీయులు
తేజమున్న మేటి దొరలు రెడ్డిరాజులు
గజపతులు నరపతులు ఏలిన ఊరు
ఆ కథలన్నీ వినిపించే గౌతమి హోరు || వేదంలా ||
శ్లోకం:
శ్రీవాణీ గిరిజాశ్చిరాయ ధధతో వక్షోముఖాంగేషు యే
లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీపుంస యోగోద్భవాం |
తే వేదత్రయ మూర్తయ స్త్రిపురుషా స్సంపూజితావస్సురై:
భూయాసు: పురుషోత్తమాం భుజభవ శ్రీకంధరా శ్రేయసే ||

2. ఆది కవిత నన్నయ్య వ్రాసేనిచ్చాటా
శ్రీనాథ కవి నివాసమూ పెద్ద ముచ్చటా
కవిసార్వభౌములకిది ఆలవాలమూ | కవి |
నవ కవితలు వికసించే నందనవనమూ || వేదంలా ||

3 . దిట్టమైన శిల్పాల దేవళాలు
కట్టుకథల చిత్రాంగి కనక మేడలు
కొట్టుకొని పోయె కొన్ని కోటి లింగాలు
వీరేశలింగమొకడు మిగిలెను చాలు || వేదంలా ||

22.భరత జనని ఘన విభవము
భరత జనని ఘన విభవము - భూ నభముల ప్రభవించగ (2)
శుభ మంగళ జయ ఘోషల
గళము గళము కలుపుదాం - పదము పదము కదుపుదాం (2)
రుద్ర రౌద్ర భద్ర హస్త ఢమరుక నాదమ్ముగా
శంభు శిఖా దిగ్భందిత గంగ ఝరీ భంగముగా
దక్ష యఙ్ఞ ధ్వంస భూత భద్రుని హుంకారముగా (2)
ఫణవ నాద ధ్వంకారం దశదిశలా మ్రోగగా ||గళము||
కురు రణ నిష్కర్మణాంత ఫల్గుణ కౄత బాణముగా
జలది లంఘనోత్సాహిత హనుమ సింహ నాదముగా
ధర్మ రక్ష దీక్ష మాన్య పాంచజన్య రావముగా (2)
విజయ శంఖ స్వర నాదము వినువీధుల నినదించగ ||గళము||
రిపు గళ శోణిత శోభిత శివ ఖడ్గ ప్రహేళిగా
రుద్ర రాణి రణ విరచిత కరవాలపు హేలగా
వన జన సమరపు ప్రేరక రామరాజ ధనువుగా (2)
ఆనక తంకార ధ్వనులు లోకమంత వ్యాపించగ ||గళము||

23.స్వామీజీ వివేకుడు కలలు గన్న భారతం
స్వామీజీ వివేకుడు కలలు గన్న భారతం
గత వైభవ శిఖరాల అంచుదాక చేర్చుదాం
ఇహపరాలతో కూడిన జీవనమే మన లక్ష్యం
ఆ లక్ష్యం చేరుదాక ఆగకుండ సాగుదాం
ఇనుపకండరాలు సంఘ శక్తినినుమడించగా
ఉక్కు నరాలే ఉద్యమ స్ఫూర్తి ప్రేరకాలుగా
విలాసాల మత్తు వదిలి వివేకుని బాటనడిచి
స్వాభిమాన భారతాన్ని జగతిలోన నిలుపుదాం
దేవుడెక్కడ ఉన్నాడని నలుదిక్కుల శోధించే
దీనదళిత దు:ఖితులను దైవంగా దర్శించే
పంథాలెన్నున్నా మన గమ్యం ఒకటేనని
ప్రపంచానికందించే సందేశం ఇదేనని
ప్రతి హిందువు సోదరుడని సగర్వంగ ప్రకటించి
అన్నార్తుల అజ్ఞానుల కష్టాలను కడతీర్చే
జగతిలోన భరతమాత అధిదేవతగా నిలపి
హిందుత్వమె వసుధ లోన మార్గదర్శి కావాలని

24. మా ప్రాణాలకు నవ ప్రాణం
మా ప్రాణాలకు నవ ప్రాణం
మా జీవాలకు నవ జీవం
మా రాష్ట్రానికి ఉజ్వల కేంద్రం
అరుణారుణ భగవ పతాకం అరుణారుణ భగవ పతాకం

(1) సుర సరితా కల్లోలంలో
మహనీయ ప్రణవ ఘోషలో
మా భారత కీర్తికి ఏక ప్రతీకం ||అరుణారుణ||

(2)రామ విభుని రథ కేతనమై
రావణు చంపిన పౌరుష రూపం
నరనారాయణ సమగ్ర తేజం ||అరుణారుణ||

(3) చంద్రగుప్త చాణుక్యాదుల
శంకరవిద్యారణ్యమౌనుల
తపహ్ పూతమగు పవిత్ర చిహ్నం ||అరుణారుణ||
మా ప్రాణాలకు నవ ప్రాణం
మా జీవాలకు నవ జీవం
మా రాష్ట్రానికి ఉజ్వల కేంద్రం
అరుణారుణ భగవ పతాకం అరుణారుణ భగవ పతాకం

25. ఓ జన్మభూమి భారతి
ఓ జన్మభూమి భారతి - ఓ పుణ్యభూమి భారతి
ఓ వందనీయ భారతి - అభినందనీయ భారతి
జీవన కుసుమమొసంగి ఆరాధింతుము జననీ
ఎన్నెన్ని జన్మలైనా నీ పూజ చేతుమమ్మా
నిన్నే స్మరింతుమమ్మా || ఓ జన్మభూమి||
నీ మకుట మైన హిమగిరి జగమెల్ల మెరయు చుండ
సాగరము రతనములతో అంజలి ఘటించుచుండ
నా మాతౄభూమి ఇదియని ఎలుగెత్తి పాడుకొనుచు
నీ సేవ చేయ జననీ మా జన్మ ధన్యమమ్మా || ఓ జన్మభూమి||
శక హూణ మ్లేఛ్చులంతా ఈ భూమి నాక్రమింప
నీ స్ఫూర్తి తోడ జననీ విక్రముని వంటి వీరుల్
తమ సర్వ శక్తి తోడ జాతిని సమైఖ్య పరచి
అరితతుల చండినారు నీ వీర పుత్రులమ్మా
నీ పూజ చేతుమమ్మా || ఓ జన్మభూమి||

26. శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై
శ్రీలు పొంగిన జీవగడ్డై పాలు పారిన భాగ్యసీమై
వరలినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా !(2)
వేద శాఖలు వెలసెనిచ్చట ఆదికావ్యం బలరె నిచ్చట |
బాదరాయణ పరమ ఋషులకు పాదు సుమ్మిది తమ్ముడా ||శ్రీలు పొంగిన||
విపిన బంధుర వృక్ష వాటిక ఉపనిషన్మధువొలికెనిచ్చట |
విపుల తత్వము విస్తరించిన విమల తలమిది తమ్ముడా || శ్రీలు పొంగిన||
సూత్ర యుగముల శుద్ధ వాసన క్షాత్ర యుగముల శౌర్య చండిమ
చిత్ర దాస్యము చే చరిత్రల చెరిగిపోయెర తమ్ముడా || శ్రీలు పొంగిన
మేలి కిన్నెర మేళవించీ రాలు కరుగగ రాగమెత్తి
పాలతీయని బాలభారత పథము పాడర తమ్ముడా|| (శ్రీలు పొంగిన)||
దేశగర్వము దీప్తి చెందగ దేశచరితము తేజరిల్లగ |
దేశమరసిన ధీరపురుషుల తెలిసి పాడర తమ్ముడా || (శ్రీలు పొంగిన)||
పాండవేయుల పదునుకత్తులు మండి మెరిసిన మహితరణ కధ |
కండగల చిక్కని పదంబుల కలిపి పాడర తమ్ముడా|| (శ్రీలు పొంగిన)||

27.సంఘ శాఖకు మనము రావాలోయ్
సంఘ శాఖకు మనము రావాలోయ్ - సంఘటన దృశ్యమ్ము చూడాలోయ్
అన్ని రంగులు కలుపు ఆత్మ చిత్రము శాఖ - స్నేహ సంబంధాల స్వర్గధామము రా
భిన్నతలొ ఏకతా భవ్య రూపము చూసి - శీల బలములు గూర్చు సిద్ధి మార్గమురా ||సంఘ శాఖకు||
వ్యక్తి వ్యక్తిని కలుపు ముక్తి మార్గము శాఖ - భారతీయుల సౌఖ్య భావి రూపము గా
స్వార్ధమే లేనట్టి స్వచ్ఛంద పథము రా - సహృదయ భావాల సౌందర్య సీమ రా ||సంఘ శాఖకు||
జ్ఞాన, భక్తి, కర్మ యోగ మార్గము శాఖ - వీరవ్రతము ద్యేయనిష్ఠలబ్బును రా
సంఘానుభూతికిది సాధనాస్థలి రా - లోక కళ్యాణమే సాధనా ఫలము రా ||సంఘ శాఖకు||

28.మనమంతా హిందువులం
హిందువులం ప్రియ బంధువులం సుగుణ సింధు జల బిందువులం
హిందు రాష్ట్రమును పూజిద్దాం హైందవ జాతిని సేవిద్దాం
విశ్వ శాంతికై హిందు సంఘటన సోపానమ్మని చూపిద్దాం
హిందుత్వమే మన ఊపిరి హైందవమే మన సిరుల ఝరి
హిందువుగానే జీవిద్దాం హిందువుగానే మరణిద్దాం
మరల మరల ఇల జననమందుచో హిందువుగానే జన్మిద్దాం
హిందువుగా మది గర్వించు స్వాభిమానమును ఎద పెంచు
బందా రాణా గురు గోవిందుల బలిదానాలను తలపించు
ఎవరేమన్నా ఎదురేదైనా నే హిందువునని నినదించు
చేయ్ చేయ్ కలుపుదాం సేవ చేయ కదులుదాం
ప్రజల కొరకు సంఘముగా ప్రతినిమిషం బ్రతుకుదాం

29.చేయ్ చేయ్ కలుపుదాం
చరణం1: అవయవాలు వేరైనా ఆత్మ మాత్రం ఒక్కటే
ప్రాంతం పెరేధైన ప్రజలంతా ఒక్కటే
భాషలేన్ని పలికిన భావ సంపదోక్కటే
ప్రమాదాలు ఎదురైతే ప్రతిస్పందన ఒక్కటే ||చేయ్ ||
చరణం2:కంటినలుసు కాలి ముళ్ళు కలిగిఒచే బాధలను
గుండె రగుల మెదడు కాదుల కరముల తొలగించుదాం
భారత భూమిని సీమను భాదలు పెల్లు బికినా
మన కండలు కరిగించి యిడుములు తొలగించుదాం ||చేయ్ ||
చరణం 3: జన శక్తిని జాతి కొరకు జాగ్రుత మొనరించుదాం
ఒకే తల్లి బిడ్డలమను ఊహనిచట పెంచుదాం
వందేమాతరం అంటూ ముందు ముందు కేడుదాం
ఒకకోకరి తోడూ నిలిచి ఉన్నతి సదించుదాం ||చేయ్ ||

30.ఆంధ్ర సముద్ర మీయమ్మ పాదాలపై
కానిపింపదే నేడు కాకతీయ ప్రాజ్య
సామ్రాజ్య జాతీయ జయపతక:
వినిపింపరే నేడు విద్యానగర రాజ
సభలోని విజయ దుందుభుక మ్రోత:

వెలగదే నేడు బొబ్బిలి కోట బురుజుపై
తాండ్ర పాపయ తళత్తళల బాకు;
నిప్పచ్చరంబయ్యెనే నేడు వీర ప
ల్నాటి యోధుల సింహనాధలక్ష్మీ;

చెక్కు చెదరని, యేనాడు మొక్కవోని,
అంధ్ర పౌరుషమిప్పు డద్వాన్నమయె;
మరలనొక మాటు వెనుకకు మరలి, చూచి
దిద్దుకోవమ్మ బిడ్డల, తెలుగు తల్లి!

కవులకు బంగారు క్డియాలు తొడిగిన
రాయల గన్న వరాల కడుపు
సీసాలతో కవితాసార మిచ్చు శ్రీ
నాధుని గన్న రత్నాల కడుపు

భద్రాద్రిలో రామభద్రు స్థాపించు గో
పన్నకు గన్న పుర్వాంపు కడుపు
జగమగంటిమి నల్డెసల్ వెలార్చిన పాప
రాయని గన్న వజ్రాల కడుపు

పిసినిగొట్టు రాజులకును, పిలక జుట్టు
కుకవులకు, పిచ్చి పిచ్చి భక్తులకు, పిరికి
వందలకు తావు గాకుండ ముందు ముందు
దిద్దుకోవమ్మ బిడ్డల, తెలుగుతల్లి!

అభ్రంకషంబ్ హిమాలయం బే తల్లి
మౌళి జుట్టిన మల్లెపూల చెండు
గోదావరి కృష్ణ లేవేవి కటిసీమ
వ్రేలాడు ఆణిముత్యాల నదులు

ఆంధ్ర సముద్రమీ యమ్మ పాదాలపై
జీరాడు పట్టుకుంచ్చెల చెరంగు
ఎనుబది కోట్లు దాటిన భారతీయు లే
కళ్యాణి చల్లని కడుపు పంట

ఆమె బ్రహ్మర్షి జాతి కళ్యాణ గీతి
ధర్మాసముసేత వీరమాత ప్రవూతి
విశ్వవిఖ్యాత సిశ్రీల వెలముగాతి
పరమ కరుణ సమేత మా భరతమాత

31. జయము జయము భరతమాత
ఈ జగాన సాటి యెవ్వరే ఓయమ్మ నీకు || జయము ||

గంగ యమున గోదారీ సింధు కృష్ణ కావేరీ
బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతీ నర్మద పెన్నా
పొంగి పొరలె తరంగాలు నీ మెడలో హారాలు
జీవనదుల గన్నతల్లివే ఓయమ్మ నీవు || జయము ||

హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు
దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు
పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు
నిజముగ నువు రత్గర్భవే ఓయమ్మ నీవు || జయము ||

లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు
నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు
వేదాలను వెలికితెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు
నిజముగ నువు జగద్గురువువే ఓయమ్మ నీవు || జయము ||

32. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే
తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా
భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవన యానం చేయుదమా
సాగర మేఖల చుత్తుకొని సుర గంగ చీరగా మలచుకొని
గీతా గానం పాడుకొని మన దేవి కి ఇవ్వాలి హారతులు

గాంగ జటాధర భావనతో హిమ శైల శిఖరమే నిలబడగా
గలగల పారే నదులన్నీ ఒక బృంద గానమే చేస్తుంటే

ఎందరు వీరుల త్యాగబలం మన నేటి స్వేచ్చకే మూలబలం
వారందరిని తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని

33.నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం
నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం
రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం
భారతదేశం మన జన్మ ప్రదేశం
భారత ఖండం ఒక అమృత భాండం

ఉత్తరాన ఉన్నతమౌ హిమగిరి శిఖరం
దక్షిణాన నెలకొన్నది హిందు సముద్రం
తూరుపు దిశ పొంగి పొరలె గంగా సంద్రం
పశ్చిమాన అనంతమై సింధు సముద్రం || భారతదేశం ||

ఒకే జాతి సంస్కృతి ఒకటున్న ప్రదేశం
రత్నగర్భ పేరు గన్న భారత దేశం
ధీర పుణ్య చరితలున్న ఆలయ శిఖరం
సత్య ధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం || భారతదేశం ||

కోకిలమ్మ పాడగలదు జాతీయ గీతం
కొండకోన వాగు పాడు సంస్కృతి గీతం
గుండె గుండె కలుసుకుంటే సమరస భావం
చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం || భారతదేశం ||

34.జయ భారతా వాణీ సకల కళా రాణీ

జయ భారతా వాణీ సకల కళా రాణీ
సంగీత వాహినీ స్వర హార ధారిణీ
అభివందనం అభివందనం

హిందువు కావేరీ హిమగిరి మకుట ధారిణీ
నవమార్గ దర్శినీ సత్యామృత వర్షిణీ
యుగయుగాల చరిత గన్న ఆనంద దాయినీ

సమతా సుహృద్భావం వెల్లివిరియు ప్రతి ఎదలో
నీ మమతా మానవతలె నిలిచిపోనీ మా మదిలో
నీ సేవయె మాకు మిన్న నవజీవన సంధాయినీ

35.సత్యం శివం సుందరం

సాధమరి సంస్కార భారతి భారతే నవజీవనం
ప్రణవ మూలం ప్రగతి శీలం
ప్రణవ మూలం ప్రగతి శీలం ప్రఖరరాష్ట్రు వివర్థకం
శివం సత్యం సుందరం
అభినవం సంస్కరణోధ్యమం
మధుర మంజుల రాగభరితం
హృదయ తంత్రీ మంత్రితం
వాదయతి సంగీతకం
వసుదైక భావన పోషకం
లలిత రసమయ లాస్యలీల
చండ తాందవ గమక హేల
కలిత జీవిన నాట్యవేదం
కాంతి క్రాంతి కధా ప్రమోదం
చతుష్షష్టి కళాన్వితం
పరమేష్టినా పరవర్తితం
విశ్వ చక్రభమణ రూపం
శాశ్వతం శృతి సమ్మతం
జూవయత్యభి లేఖ మఖిలం
సప్తవర్ణ సమీకృతం
ప్లావయతి రససింధునా
ప్రతి హిందు మానస నందనం

36.ఒకటే దేశం మనది నిజం నిజం
ఒకటే దేశం మనది నిజం నిజం
ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం
వర్ణములేవైనా మరి కులములెన్ని ఉన్నా
వనంలోని చెట్లు మనం వసుదైవ కుటుంబకం
|| ఒకటే దేశం ||

భరతుడు పరిపాలించిన భారతదేశం మనది
తరతరాల వారసత్వ సంపద మనకున్నది
చేయి చాచి యాచించే అవసరమేమున్నది
అంతకన్న హీనమైన బ్రతుకింకేమున్నది
|| ఒకటే దేశం ||

వాల్మీకి మనవాడే వ్రాసెను రామాయణం
వ్యాసుండెవరో కాదు వ్రాసె మహాభారతం
అష్టాదశ పురాణాలు అంతులేని గ్రంథాలు
అందించిన ఋషులందరు వందనీయులే మనకు
|| ఒకటే దేశం ||

గుండెలలో భగవంతుని బంధించిన భక్తులు
ప్రకృతినే శాసించిన పతివ్రతా మూర్తులు
సత్యాన్వేషణకై తమ సర్వస్వాన్నర్పించిన
త్యాగులు యోగులు భళిరే వీతరాగులెందరో
|| ఒకటే దేశం ||

37.జన జాగృత నవ భారత మహోదయం

ఈ కనులతోనే కాంచుదాము
ఈ జీవితమున సాధించుదాం || జన ||

ప్రతి హృదిలో దేశభక్తి మోసులెత్త
నరనరాన నవచేతన వెల్లివిరియ
సమతాభావన పెంచి ప్రతి హృదిలో మమత నింపి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం || జన ||

మన పూర్వుల మహనీయుల స్మరియించి
మన సంస్కృతీ మహోన్నతిని గుర్తెరిగి
అహరహము శ్రమియించి జగతిన శిరమెత్తి నిలిచి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం || జన ||

ప్రాంత భాష కులమతాల కలతలతో
పలురీతుల బలహీనత లావరించే
అందరమొకటిగా నిలచి తరతమ భేదాలు మరచి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం || జన ||

నలుదిక్కుల ప్రమాదాలు పెచ్చు పెరిగి
అదనుచూచి కాటువేయ చూస్తున్నవి
జనతను జాగృత పరచి ఎదఎదలో శక్తి నింపి
జాతిని సేవించుదాం మన భారతినే పూజించుదాం || జన ||

38.భారతి నా కన్నతల్లి భాగ్యోదయ కల్పవల్లి

భారతి నా కన్నతల్లి భాగ్యోదయ కల్పవల్లి
విశ్వ శాంతి విరియించిన చిరుపువ్వుల శిరసు మల్లి || భారతి ||

వార్ధిత్రయ భవ్య వసన వింధ్యాచల విశద రచన
కాశ్మీరపు రశ్మి వదన నిర్మల గుణ నిఖిల సదన || భారతి ||

సన్నుత హిమశిఖరము వలె ఉన్నత మస్తక శోభిని
పావన గంగా నది వలె జీవన గీతాదాయిని || భారతి ||

భారతి బంగరు ముంగిట భగవంతుడె పారాడెను
ఋషి సంతతి గొంతు విప్పి ఋక్కులు చక్కగ పాడెను || భారతి ||

క్షమతా కేతనమెత్తెను సమతా శంఖమునొత్తెను
వితరణ గుణ గౌరవమున విశ్వమునే ముంచెత్తెను || భారతి ||

39.మన జాతీయ జెండా
మూడు రంగుల జెండా
ముచ్చటైన జెండా
భారతీయుల జెండా
బహు గొప్ప జెండా
అందరూ మెచ్చిన జెండా
ఆకాశంలో ఎగిరే జెండా
అంధకారం పోగిట్టిన జెండా
ఆశలు మనలో రేపిన జెండా
గాంధీతాత మెచ్చిన జెండా
నెహ్రుగారికి నచ్చిన జెండా
భగత్‌సింగ్ పట్టిన జెండా
బోసు నేత ఎగరేసిన జెండా
తెల్లదొరలను ఎదిరించిన జెండా
చల్లగ స్వరాజ్యం తెచ్చిన జెండా
అందరి మదిలో నిండిన జెండా
పింగళి వెంకయ్య ఊహల జెండా
శాంతి సహనం చూపిన జెండా
అందరి నొక్కటిగా నడిపిన జెండా
మంచి మమతలు చూపిన జెండా
ఇదే నండి మన జాతీయ జెండా

40.ఈ జెండ పసిబోసి చిరునవ్వురా
ఈ జెండ పసిబోసి చిరునవ్వురా దాశ్య సంకెళ్ళు తెంచిందిరా
ఈ జెండ అమరుల తుదిశ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా
వీర స్వతంత్ర పోరాట తొలి పిలుపురా
మనవెలలేని త్యాగాల ఘనచరితరా
తన తగుబాలతో పోరు నెర్పిందిరా
ఉరికొయ్యల్ని ఉయ్యాల చేసిందిరా
ఆ తెల్లోడి గుండెల్ని తొలిచేసినా అమ్మురా
వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి నరం
చరణం 1
శాస్త్రానికి జ్ఞానానికి ఆది గురువురా మనదేశం
మానవాళికే వైతాళిక గీతం రా.. భారతం
ధర్మానికి సత్యానికి జన్మ భూమిరా మనదేశం
ఎన్నో మతాల సహజీవన సూత్రం రా.. భారతం
ఆ దైవం మనకోసం సృష్టించే ఈ స్వర్గం
శికాలలు పోసింది ఆ తల్లిరా తన దేహాన్ని తీరాన్ని పంచిందిరా
మనమేమిస్తే తీరేను ఆ రుణమురా
ఇక మనకేమి ఇచ్చిందనడగొద్దురా
భారతీయులుగ పుట్టాము ఈ జన్మకిది చాలురా...
వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి నరం
చరణం 2
పిచ్చి కుక్కల ఉగ్రవాదమే రెచ్చిపోయిక కాటేసినా
వెన్ను చూపని ఉక్కు సైన్యానికే.. సలామురా
మంచు మల్లెల శాంతికపోతం నెత్తుటి తడిలో తడిసినా
చెక్కు చెదరని ఐకమత్యమే ఒక్కటే.. సవాలురా
మానవుడే మావేదం మానవతే సందేశం
మా శతకోటి హృదయాలదొకమాటరా
నువ్వు పిడికిలితో అణిచేను నీ బలుపురా
చావుకెదురైన భయపడదు మా గుండెరా
శతృవుడెవడైన తలవంచని ఈ జెండారా
ఫిరంగుల్ని ఎదిరించి తొడగొట్టి నిలిచిందిరా
వందేమాతరం మనదే ఈ తరం
వందేమాతరం పలికే ప్రతి నరం

41.రమణీయకముతో రాగమంచి
పావన నాగావళీ వంశధారలు సీమత దామ సుశ్రి నహింప
నిఖిల పుణ్యపగా నిలయ గోదావరి మరకత హార విస్పురణ
నెరవ శోభన కృష్ణవేణీ భద్రగామిని మణిహేమ కాంబికా
మహిమ నింప విమల పెన్నా నదీ వీలుకా బిభవమ్ము
చరణ మంజీర నైఖలి భజింప దివ్యమోహన కళలతో తేజరిల్లి
దెసలు దెసెలెల్ల దీపింప తెలుగు తల్లి ప్రాజ్య సువిశాల సుప్రజా
రాజ్య వీధి నిండు కొలువుండె కన్నుల పండువగుచు పుడమికి
పండుగయ్యె విరబూచెను భూ జన హత్సుమావశుల్ బడుగుల
ఝీవితాల చిర భాబ్య శుభోదయ దోచి దోచె సం దడిగ జనావళీ
హృదయ తంత్రులు తీయగ మ్రోగ సాగి లే వరులను సోలు జీవికల
వైభవముల్ విలసిల్లె కొల్లగా లేవోయీ నలుదిక్కులందు జయభేరి
నాద ముప్పొంగ రా రావోయీ హృదయాంతరాన శుభ సమ్రంభంబు
జృంభించె లే లే వోయీ కనుగోనలందు మనసేలే కాంక్ష రూపించెరా
రావోయీ ప్రియ బాంధవా ప్రియ సఖా రా!మానవోత్తంసమా!
శ్రీనాధ కవిరాజ చిత్రవర్ణా కీర్ణ భవ్య ప్రభంధాల భావమంచి
రాగ రంజిత త్యాగరాజ సంకీర్తనా రమణీయకముతో రాగమంచి
కృష్ణవేణీ సముతృక్ష్ణ నర్తన కళా కేళీ తరంగిణిన్ తాళమంచి
ఆంధ్ర ప్రదేశోదయానంద వేళా స మారంభ సంగీత మంచుకొసగ
కావ్యగానము సేయు సత్కవులు వెలయ మాపదాంధ్ర ప్రతిభ
మన భాని నిలువ పుడమి నిడె ఎర్ర మందారపూవు పగిది
పరిమళీంచెను బ్రతుకు సంపంగి కరణి నన్నయ్య మొదలుగా
నాబోటి కవిదాక గలయాంధ్ర సుకవితా కౌశలమ్ము భారతమ్మాదిగా
చిడి పాత్తముల దాక గలయాంధ్ర సాహితీ గౌరవమ్ము శ్రీకాకుళము
మొదల్ చిత్తూర్ కడదాక గల యాంధ్ర దేశీయ ఎలననమ్ము ముసలి
వొగ్గుల మొదల్ ముద్దుబిడ్డల దాక గల యాంధ్ర జాతీయ కలకలమ్ము
గొంతు గొంతున గాన స్రవంతి గాగ పుటపుతాంతర్గత పురాణ భోధ గాగ
దిక్కుదిక్కుల ధ్వనియించు బుక్కుగాగ పొడిచె నిపుడిప్పుడె తెంగు
ప్రొద్దుపొడుపు బ్రతుకు బ్రతుకున తీయని పాట రేగి గొంతు గొంతున
గనస్రవంతు లురలి దేశదేశాల తెలుగుల దీప్తి వెలుగ పాడుచు
మెల్లమెల్లగా తెంగు ప్రొద్దుపొడుపు ప్రాబాతోత్సనమయ్యె ప్రాగ్గిశ మఫారాజీవ
రాగంశువుల్ శోభారామముగాగ జేసె ప్రకృతిన్ సుతాలచలాలంకృతిన్
భూభాగసమ్ము వసంత గార రస సంఫూర్ణంబు గాదోచె జ్ రా! భవ్యాశయ
దివ్య దీప్తులలమెన్ త్రైలింగ దేశమ్మునన్!

42.పురాతన భరత భూమిని
నేను పుట్టిన నేల తల్లికి
నిండుగా కై దండ లిడుదుము
తల్లి గుండెల పరిమళములను
తమ్ము అందరి కందజేతును
భరతమాతను చెరుపు చేసి
దుష్టులను దునుమాడి గెలుతును
దేశమాత సమగ్ర సౌష్టవ
రూపమును కాపాడ నిలుతును
మానవతనీ మంట కలిపే
మత దురంతము నతికరింతును
వర్తమాన చరిత్ర తలపై
గత పిశాచిని తొలగ ద్రోతును
నేలతల్లి తనూజలందరు
అన్నతమ్ముల ఆత్మబంధము
పెనచి ఒకటై సంపదల సృజి
యించు మంచికి పోరెదన్
లేమి నలిగే రేదలను ధన
బలము గల పీడకులు దోచని
సర్వ స్వతంత్ర సమాన ధర్మము
విలసిలగ పోరాడెదన్
శ్రామికుల హాలికుల నొక్కటి
చేసి నూతన జన స్వామ్యము
ఈ పురాతన భరత భూమిని
స్వర్గ తుల్య మొనర్చెదన్

43.ప్రజకూర్చిన రాజ్యాంగం
తరగలించె కాంతిరేఖ
భరతజాతి మస్తకమున
పరిమళించె విశ్వంభర
ఇరువది ఆరవ జనవరి
||తర||
పెదరాచరికపు చాయలు
చిరిగి చిరిగి చెరగిపోయె
తరిగిన మన భారతమ్మె
పరిపుష్టమై నిలచెను
||తర||
ఎలుగెత్తెను భారతమ్ము
వెలుగుల శంఖాలు నొత్తి
విజయ దుంధుభులే మ్రోగెను
ప్రజకూర్చిన రాజ్యాంగం
||తర||

44.పండుగరోజు
ఏడు కోట్ల పూలువిరిసి మురిసిన పండుగరోజు
విరుల తావు లచ్చరలై వియచ్చరలైన రోజు
నెల బాలుడు మిన్నులు దిగి నేలకు వచ్చినరోజు
కొమ్మల్లో కోయిలవై కుహుకుహు అన్నను
నదుల మతులు పులకరించి నాట్యం చేసిన రోజు
గట్లు త్రంచి సముద్రాల కౌగిలించుకున్న రోజు
ప్రభాత ప్రదోషాలు పసుపు కుంకుమలు చల్లిన రోజు
భావాలు రంగుల తోర్ణాలై ద్యోవా పృధుల మధ్య ఎగిరిన రోజు
మమత విశాల మానవతకు కర్పూర నీరాజన మిచ్చిన రోజు
ఉల్లిపార కాగితాన్నై ఊదా రంగు పులుముకొని
ఒక ఉజ్వల పతాంగాన్నై అనంత నీలిమలో విహరంచాను
ధరిత్రి తిరిగెను చరిత్రలో ఒక పేజీ పెరిగెను
చైత్రం విరిసిన తోటకు ఝంఝూ మరత్తు వచ్చెను
పూల గుండెలను హొలాహొల పూరితాలు చేశారు
వెన్నెలలు వెలార్చు విషజ్వాల రగిల్చారు
విరులు రాలి తరులు కూలి ఝరుల నీరు జారిపోయి
జీవకాంత లారిపోయి సుందర వందర లైతే
ఏ కొమ్మలు చేరి నేను ఏ గీతిక పాడతాను
ప్రపంచ విపంచి పంచమ స్థాయి నెట్లు చేరుతాను
రెండు యెదలు కలియు మాట రెండు య్దలు కలుపు చేత
పొదలించుము సోదరుడా చదలందున నీ చరిత్ర
రాహువు పట్టిన పట్టొక సెకండు అఖండమైనా
లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా?
మూర్ఖుడు గడియారంలో ముల్లు కదలనీకుంటే
ధరాగమన మతటితో తలక్రిందై పోతుందా?
కుటిలాత్ముల కూటమికొక త్రుటికాలం జయముస్తే
విశ్వసృష్టి పరిణామం విచ్చిన్నం అవుతుందా?
దనుజలోక మేకంగా దారినడ్డు నిల్చుంటే
నరజాతి ప్రస్థానం పరిసమాప్త మవుతుందా?

45.ఒక్కటేరా! తెలుగుదేశం
ఒక్కటేరా!తెలుగుదేశం ఒక్కటేరా! తెలుగుదేశం
ఒకటేరా!తెలుగు భాష ఎక్కడున్నా తెలుగులందరు
ఒక్కటేరా! ఒక్కటేరా! ఒక్కటే గోదావరీ నది
ఒక్కటే కృష్ణానది రెండు నదులూ తెలుగు జాతి
గుండెలో ఒకటైనవి ||ఒక్కటే రా||
అరకు లోయల గలికొండ హైదరాబాద్ గోల్కొండ
కలిసి కట్టెను తెలుగుతల్లి కంఠసీమను పూలదండ
||ఒక్కటే రా||
సాగరమ్ముక వైపున నిజాం సాగరమ్ముక వైపున
తెలుగు తల్లిని వీచు చల్లని అలల వీనన అదముప్పగ
||ఒక్కటేరా||
ఎదలు ఎదలు కూర్చి కట్టిన ఏకతా సేతువుల మీద
కదలివచ్చీ అభ్యుదయ చక్రాల నడ్డుట చేటుగదా?
||ఒక్కటేరా||
నలుగు రెవరో తప్పుచేసిన ఏడు కోట్లకు శిక్ష తగునా
ఎలుగ లేవో దూరినాయని ఇంటినే తగలేయ తగునా
||ఒక్కటేరా||
పాడి తప్పక పాటు పడదాం పంటలు పరిశ్రమలు పెడదాం
మెండుగా ఉత్పత్తి పెంచి దండిగా అందరము ఉందాం
||ఒక్కటేరా||
పేదవోయిన తెలంగాణను సెలవయిన సర్కారు ప్రాంతము
మధ్య రాయలసీమ తమ్ముల మధ్య భేధము మానివేద్దం
||ఒక్కటేరా||
ఆకలికి ఆవేశమునకు అహంకృతికి ద్వేషమునకు
మంచి చెడ్డలు కానుపించవు మంచి మాటలు వినుపుంచవు
||ఒక్కటేరా||
ఒక్క జాతిని రెండు ముక్కలు ఒక్క గుండెకు రెండు చెక్కలు
చేయువాదెవడైన ద్రోహము చేయువాడే తెలుగు తల్లికి
||ఒక్కటేరా||
గోదావరి కృష్న నేడు కూడి సాగగా ప్రతి ఆంధ్రుని ఎద
సమైక్య భావమాడెగా!
||ఒక్కటేరా||
జాతిని చీల్చిన గోడల జాడ మానెరా మూగపడ్డ వీణ తిరిగి
మ్రోయ సాగెరా! కలలు నిజములై కన్నుల
||ఒక్కటేరా||
కాంతి నించగా చరిత్రలో స్వర్ణ యుగం
తిరిగి మొలిచెరా!
||ఒక్కటేరా||
గతమునుండి గుణపాఠము గరచి మెలగరా
ద్వేషానైక్యతలు సమాధిలో పూడ్చరా!
||ఒక్కటేరా||
పేవవనం నాటు యద శ్రీలు పూయగా
శ్ర్మామృతము చల్లు సుఖం జాలు వారగా!
||ఒక్కటేరా||
పగిలిన ప్రతిశీతి గుండె పదిల పడెనురా
ప్రతి జాతియు స్వీయ గృహము ప్రవేశించెరా!
||ఒక్కటేరా||
జాతి జాతి కల భారతి జాతి మనదిర
శాంతి క్రాంతి కోరు తెలుగు జాతి మనదిరా
||ఒక్కటేరా||
సమైక్యత విశ్వప్రేమ గీత పాడరా
నవ్య జీవితభ్యుదయో త్సవము సేయరా
||ఒక్కటేరా||
గోదావరి కృష్ణ నేడు కూడి పాడగా
మహొంధ్రోందయ సౌభాగ్య మహిమ పాడరా!
||ఒక్కటేరా||

46.నీ చిన్ని నవ్వులో
ఓ తెలుగు తల్లీ శ్రీ కల్పవల్లీ వందనము
చేకొమ్ము వందనం హృదయ పూర్వక
వందనం మధుర కవనాలలో మహిత
శిల్పాలలో మృదుల గానములలో
ప్రతిపదంబు కళా రాజ్యాలు సృష్టించు
ప్రతిలేని బంగారు బంగారు తల్లీ!
నీ చిన్ని నవ్వులో నుప్పొంగు నదులన్నీ
నీ పలకరింపుతో పులకీంచు మాగాణి
నీకంటి చలువకై దివి నుండి దేవతలె
నిండు వేడుకలతో వేం చేసినారు
వీరమాతల ధాత్రి త్యాగయోగుల నేత్రి!
భవ్య జనయిత్రీ!

47.నవభారతదేశం
ఇది సుందర దేశం నవభారత దేశం
మృదు మంజులనాదం పురిగొల్పిన వేదం ||ఇది||
గల గల గల సవ్వడి గమకాలకు పల్లవి
అలనురగల వెల్లుడి పలికించిన అల్లరి
జ్వనదులె సంగమ సారాలకు తేటని
ప్రేమ ఎదల కలయికయే వెలుగొందిన జీవని ||ఇది||
కులమతమను భదము మనకెందుకు మిత్రుడా!
మతమౌధ్యాలెందుకు? భరతజాతి పుత్రుడా!
భాషలు వేరైనను భావమొకటి కనుమరా
భేదము లెంచకురా భారతికే మొప్పరా ||ఇది||
మారణ హొమాలను రగిలించుట తగదని
మానసదీపాలను వెలిగించుట సుఖమని
నడవడు లొకటైతే కలదందున రసధుని
కులమతమను తేడాలను వీడితే శుభశశి ||ఇది||

48.కోటి కోటి నరనారీ!
జయము జయము భరతావని!
సకల భువన పావనీ!
జయము జయము స్వేచ్చాప్రియ
జనతా సంజీవనీ!
అరుణారుణ చరణ కిరణ
కరుణా రసవాహినీ!
క్షమతాప్రియ మమతామయ
సమతా సమ్మోహినీ!
ధర్మవీర సమరధీర
దానశూర జనయిత్రీ!
నిర్మల విజ్ఞాన ధాత్రి!
కార్మిక కర్షక సవిత్రి!
మలయ పవన చలమపవన
కలిత లలిత హరితాంబర!
అతి సుందర సరిదంతర
ప్రతి బింబిత నీలాంబర!
పాటల సుమ సుకుమారీ!
కోటి కోటి నరనారీ!
గళమంగల విజయవాణి!
లలితకళా కల్యాణీ!

49.ఇదే ఇదే నా దేశం - ఇదే ఆంధ్రదేశం
తరతరాల చరిత్రలో తడిసిన సందేశం
శాతవాహనుల నాటి శౌర్యము ఊపిరిగా
కాకతీయ రాజుల సంగ్రామ దీక్ష సిరిగా
త్యాగరాజు గానసుధ ధారలు సంపదగా
పోతరాజు భాగవతపు గాధలు నా ఎదగా
హంసి అమరావతి నాకమరినని శ్రీకళలై
గోదానది కృష్ణవేణి కూరిమి నిచ్చెలులై
కూచిపూడి నాట్యము నా గొప్పను పెన్నిధిగా
విలసిల్లిన వికసించిన సంస్కృతి సన్నిధిగా
అంధ్రత్వం అన్ని దిశల ఆలోచన రేపగా
తెలుగుల అభిమాన ధనం దిక్కుల వ్యాపించగా
ఇది కోస్తా తెలంగాణా ఇది రాయలసీమగా
ఏడు కోట్ల గొంతులచే రాగము వినిపించగా

50. గురువులకిదే మా వందనం
చదువు నేర్పే గురులకిదె మా వందనం
జ్ఞాన దాతల చరనధూళికి వందనం
శాంతమూర్తులు స్వచ్చకీర్తులు
సుజన చంద్రులు - సుగుణసాంద్రులు
గురులు - సుతరులు

||చదువు||

రామునికి - విలువిద్య నేర్పెను
మౌని విశ్వామిత్రుడు
కృష్ణునే చదివించే
సాందీప జ్ఞాని పవిత్రుడు
ఎంత ఘనులకునైన గాని
గురువులే ప్రత్యక్ష దేవులు

||చదువు||

రాధాకృష్ణులు - రామకృష్ణులు
విశ్వకవులు - వివేకానందులు
శంకరులు - వేదవ్యాసులు
ఎందరెందరో జగద్గురువులు
||చదువు||

కోటి సూర్యులున్న - కోటి చంద్రులున్న
గురువు మాట లేకుండా - ఎద చీకటి పోతుందా?
జ్ఞానజ్యోతి వెలిగించి మము ప్రగతికి నడిపించె
గురువే బ్రహ్మ గురువే విష్ణువు - గురువే మహేశ్వరుడు
ఆ త్రిమూత్రి రూపునకిదె వందనం
ఆ దరుంతరంగున కిదె వందనం
||చదువు||

51.పాడవోయి భారతీయుడా

పల్లవి

పాడవోయి భారతీయుడా
ఆడి - పాడవోయి విజయగీతిక
నేడే స్వాతంత్ర్యదినం - వీరుల త్యాగఫలం
నేడే నవోదయం - నీదే ఆనందం ||పాడ||
చరణం 1
స్వాతంత్ర్యం వచ్చెననీ సభలే చేసి
సంబరపడగానే సరిపోదోయి
సాధించినదానికి సంతృప్తిని చెంది..
అదే విజయమనుకుంటే పొరబాటోయి
ఆగకోయి భారతీయుడా
కదలి సాగవోయి ప్రగతిదారులా ||ఆగ||

చరణం 2
ఆకాశం అందుకునే ధరలొకవైపు
అదుపులేని నిరుద్యోగం మింకొకవైపు
అవినీతి బంధు ప్రీతి చీకటిబజారు
అలుముకొన్న నీదేశం ఎటు దిగజారు
కాంచవోయి నేటి దుస్థితి
ఎదిరించవోయి ఈ పరిస్థితి ||కాం||

52. చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా

చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా
గతమెంతో ఘన కీర్తి గలవోడా

వీర రక్తపు ధార వార వోసిన సీమ
పలనాడు నీదెరా వెలనాడు నీదెరా
బాల చంద్రుడు చూడ ఎవరోడోయ్
తాండ్ర పాపయ కూడ నీవోడోయ్ ||చెయ్యెత్తి ||

నాయకీ నాగమ్మ, మంగమాంబ, మొల్ల
మగువ మాంచాల నీ తోడ బుట్టిన వోళ్ళె
వీర వనితల గన్న తల్లేరా
ధీర మాతల జన్మ భూమేరా ||చెయ్యెత్తి ||

కల్లోల గౌతమి వెల్లువల క్రిష్ణమ్మ
తుంగభద్రా తల్లి పొంగిపొరలిన చాలు
ధాన్య రాశులు పండు దేశాన
కూడు గుడ్డకు కొదువ లేదోయి ||చెయ్యెత్తి ||

పెనుగాలి వీచింది అణగారి పోయింది
నట్టనడి సంద్రాన నావ నిలుచుండాది
ముక్కోటి బలగమై ఒక్కటై మనముంటే
ఇరుగు పొరుగూలోన ఊరు పేరుంటాది
తల్లి ఒక్కటె నీకు తెలుగోడా
సవతి బిడ్డల పోరు మనకేలా? ||చెయ్యెత్తి ||

53. పాడనా తెలుగుపాట

పాడనా తెలుగుపాట! పరవశనై - మీ ఎదుట - మీ పాట
పాడనా తెలుగు పాట

కోవెల గంటల గణ గణలో - గోదావరి తరగల గల గలలో
మావుల పూవుల మోపులపైనా - మసలే గాలుల గుసగుసలో
మంచి ముత్యాల పేట - మధురామృతాల తేట - ఒక పాట పాడనా

త్యాగయ క్షేత్రయ రామదాసులు - తనివితీర వినిపించినది
నాడు నాడులా కదిలించెది - వాడ వాడలా కనిపించెది
చక్కెర మాటల మూట - చిక్కని తేనెల వూట - ఒక పాట పాడనా

వళ్ళంత వయ్యారి కోక - కళ్ళకు కాటుక రేఖ
మెళ్ళో తాళి - కాళ్ళకు పారాణి - మెరిసే కుంకుమ బొట్టు
ఘల్లు ఘల్లున కడియాలందెలు - అల్లనల్లన నడయాడె
తెలుగుతల్లి పెట్టని కొట - తెనుగును నాటె ప్రతిచోట - ఒక పాట పాడనా

54. దినదినము వర్దిల్లు తెలుగు దేశం

దినదినము వర్దిల్లు తెలుగు దేశం...
దీప్తులను వెదజల్లు తెలుగు తేజం...

తేనె కన్నా తీయనిదీ, తెలుగు భాష!
దేశ భాషలందు లెస్స, తెలుగు భాష!

మయూరాల వయారాలు మాటలలో పురివిప్పును
పావురాల కువకువలు పలుకులందు నినదించును
సప్తస్వరనాదసుధలు, నవరసభావాలమనులు
చారు తెలుగు సొగసులోన జాలువారు జాతీయం

తేనె కన్నా తీయనిదీ, తెలుగు భాష!
దేశ భాషలందు లెస్స, తెలుగు భాష!

అమరావతి సీమలో కమనీయ శిలామంజరి
రామప్ప గుడి గోడల రమనీయ కళారంజని
అన్నమయ్య సంకీర్తనం, క్షేత్రయ్య శృంగారం
త్యాగరాజు రాగమధువు తెలుగు సామగానమయం

తేనె కన్నా తీయనిదీ, తెలుగు భాష!
దేశ భాషలందు లెస్స, తెలుగు భాష!

55.తెలుగు జాతి మనది

తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ నాది … రాయలసీమ నాది … సర్కారు నాది … నెల్లూరు నాది ..
అన్నీ కలిసిన తెలుగునాడు … మనదే … మనదే … మనదేరా..
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

ప్రాంతాలు వేరైనా మన అంతరంగమొకటేనన్నా
యాసలు వేరుగ ఉన్నా ..మన భాష తెలుగు భాషన్నా
వచ్చిండన్నా …. వచ్చాడన్నా … ఆ …..
వచ్చిండన్నా …. వచ్చాడన్నా పరాల తెలుగు ఒకటేనన్నా …
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

మహాభారతం పుట్టింది రాణ్మహేంద్రవరంలో
భాగవతం పుట్టింది ఏకశిలానగరంలో
ఈ రెంటిలోన ఏది కాదన్న
ఈ రెంటిలోన ఏది కాదన్న ఇన్నాళ్ళ సంస్కృతి నిండుసున్నా
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

పోచంపాడు ఎవరిది …నాగార్జున సాగరమెవరిది
పోచంపాడు ఎవరిది …నాగార్జున సాగరమెవరిది
మూడు కొండలు కలిపి దున్నినా ముక్కారు పంటలుబండ్లకెత్తినా
అన్నపూర్ణమ్మ కన్నబిడ్డలం . ఐదు కోట్ల తెలుగువారిది
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

సిపాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జంచాము
స్వతంత్ర భారత్ కి జై
గాంధీ, నెహ్రూల పిలుపునందుకుని సత్యాగ్రహాలు చేసాము
వందేమాతరం .. వందేమాతరం
స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రమును సాధించాము
జై విశాలాంధ్ర
దేశభక్తిలో తెలుగువారికి దీటే లేదనిపించాము
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

ఇంటిలోన అరమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా
కంటిలో నలక తీయాలంటే కనుగుడ్డు పెరికి వేయాలా
పాలుపొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు
పాలుపొంగు మన తెలుగుగడ్డను పగులగొట్టవద్దు
నలుగురిలో మనజాతిపేరును నవ్వులపాలు చెయ్యెద్దు

తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది
తెలంగాణ మనది … రాయలసీమ మనది … సర్కారు మనది … నెల్లూరు మనది ..
అన్నీ కలిసిన తెలుగునాడు … మనదే … మనదే … మనదేరా..
తెలుగు జాతి మనది …. నిండుగ వెలుగు జాతి మనది

56.తెలుగు యువకుల్లారా!
ఇది వైకుంఠము, వేంకటేశ్వరుడు ల
క్ష్మీ శుండు కొల్వుండుటన్:
ఇది కైలాసము, మల్లికార్జునుడి ఆ
ర్యే శుండు చెల్వొందుటన్:
ఇది బ్రహ్మొర్పి, సరసవతీ చరణ పం
కే జాతిమై యొప్పుటన్:
ఇది మా ఆంధ్రము నీకు పీఠము త్రిశ
క్తీ; పూజ గై కోగదే;
వాణియు తీర వాటిక, భ
వానియె రాయలసీమ, శ్రీ తెలం
గాణము పూర్ణ రాజ్యరమ
గా ముగురమ్మల మూర్తిదాల్చి గీ
ర్వాణ పధమ్ములనే గదలి
వచ్చితినే; జగమేలు కొమ్మకన్
రాజ దలిర్ప, మాగపతి
రంజిల, ఆంధమ; భాగ్యసాంద్రమా!

దేశము జుట్ట బెట్టి తల
దిండుగ బెట్టుక నిద్రపోవు ఆ
వేశము తెల్గువానిది; ప్ర
వేశము తక్కువ కార్య నైపుణిన్;

ఏ శిఖరాల వెంబడి గ
మించునో, ఏ శశిపై శ్రమించునో
పరమ కవిత్వ మందు ప్రతి
వారును బమ్మిర పోతరాజె; సుం

దర తమ గాన మందు ప్రతి
తమ్ముడు తానొక త్యాగరాజె; న
త్వర పరదన మందు, ప్రతి
త్వర పరదన మందు, ప్రతి

డరయ సవాంధ్ర మందు ప్రజ
లందరు రాజులె రాజ తేజులే
కలసి ఉంటే గెలుపు కొస్తాం
చీలిపోతే కూలిపోతాం

భీముడూ గొప్పవాడే
అర్జునుడూ గొప్పవాడే
ధర్మరాజు కూడ గొప్పవాడే
కలిసి ఉన్నపుడు

సుందోవ సుందులు కాకండర్రా!
ఓ తెలుగు యువకుల్లారా!
మిమ్మల్ని భ్రమింప జేస్తున్న రంభ
వట్టి వయాముఖ విషకుంభ!

57.ధర్మశాస్త్రాలు

ఇదేనా మా దేశం - ఇదేనా భారతదేశం
గనిలో పనిలో కార్ఖానాలో
పాటుపడే దౌర్భాగ్య జీవులను
తిండి బట్ట యేర్పరున బూనిన
పండిత జవహారు ప్రభవించినది
ధనవంతుల మేడల నీడలతో
నిరుపేదల జీవిత యాతనలు
కానరాని గతి కన్ను మూసి
లోకాన ధర్మశాస్త్రాలు చాటునది

58.దేశభాషలందు తెలుగు లెస్స

ఉగ్గుపాల నుండి ఉయ్యాలలో నుండి
అమ్మపాట పాడినట్టి భాష
తేనె వంటి మందు వీనులకును విందు
దేశభాషలందు తెలుగులెస్స!
సంస్కృతంబులోని చక్కెర పాకంబు
అరవభాషలోని అమృతరాశి
కన్నడంబులోని కస్తూరి వాసన
కలిసిపోయే తేట తెలుగు నందు
వేలవేల కవుల వెలుగులో రూపొంది
దేశదేశములను వాసిగాంచి
వేయియేండ్ల నుండి విలసిల్లు నా భాషా
దేశభాషలందు తెలుగు లెస్స!

59.నన్నుగన్న తల్లి

నన్నుగన్న తల్లి! నా భాగ్యమా!
నారాయణి! ధర్మాంబికే
నన్నుగన్న తల్లి! నా భాగ్యమా!
నారాయణి! ధర్మాంబికే
కనకాంగి! రామావతి సోదరి!
కాదనీ నను, కాత్యాయని!
నన్నుగన్న తల్లి! నా భాగ్యమా!
నారాయణి! ధర్మాంబికే
కావుకావుమని నీ మొఱబెట్టగా
కనులలోచన! కరుగుచుండగా,
నీవు బ్రోవకున్న నెవరు బ్రోతురు? స
దా వరంబొసగు త్యాగరాజనుతి
నన్నుగన్న తల్లి! నా భాగ్యమా!
నారాయణి! ధర్మాంబికే!


60.త్రిలింగ దేశం

త్రిలింగ దేశం మనదేనోయ్,
తెలుంగులంటే మనమేనోయ్
మధురం మధురం మధురం మధురం
ఆంధ్రమ్మంటే అతిమధురం
దేశభాషలా తీరుల్లోకీ, ఆంధ్రమ్మంటే అతిమధురం
రాయలు మనవాడోయ్
పండితరాయలు, మనవాడోయ్
కలం తిక్కనా, ఖడ్గ తిక్కనా,
గణపతిదేవులు మనవారోయ్!!
అమరావతి నాగార్జున కొండా,
సిద్ధహస్తులా శిల్పాలోయ్
మల్లినాధ కుమారిభట్టులు,
అందెవేసినా హస్తాలోయ్!!
గోదావరి కృష్ణా, తుంగభద్రా పెన్నా
కనిపెంచినవోయ్ తెలుగుజాతిని,
వినిపించనవోయ్ వీణానాదం!!
ఓడలు కట్టామూ
మిటికి, మేడలు కట్టామూ
మున్నీరంతా ఏకరాశిగా
ముద్దరవేశామూ!!
సంతలలో వజ్రాల రాసులూ,
జలజలలాడినవీ
కుబేరతుల్యం మహదైశ్వర్యం
గొడుగుపట్టినాదీ!!
కలకలలాడే తెలుగుదేవికి,
గంధాగరుధూపం,
కిలకిలలాడే తెలుంగు కన్నెల
కిన్నెరలాలాపం
బలం గడించీ - వెలుంగునింపే,
తెలుంగుజండా "హు"
తెలుంగు భేరీ "ఢాం"
గణగణ గణగణ గణగణ గణగణ,
తెలుంగు జయఘంటా!
గణగణా గణాగణ, గణాగణా గణ,
తెలుంగు జయఘంటా... త్రి||

61.ఆంధ్రమాత పుత్రులారా
మిత్రులార
ఆంధ్ర మాత పుత్రులార
మంజుళ మధు పాత్రలార!
నలుబది ఆరేండ్లకు ముందర
హృదయాలను కలిపేసిన
మననేకం చేసేసిన
మధుర మంగళోషస్సును
మనకు జ్ఞాపకం చేసే
ఈ హేమంత తమస్సులో
విభేదాల దుమ్ముదులిపి
వివరాల మడతలు విపొపేసి
విషాదాల చలి తొలగించి
కవిత్వాల రగ్గు కప్పి
ఉత్సవాల హుక్కుతో
మత్తెక్కిన మనసుతో
కైపెక్కిన కనులతో
మనసు మనం తెలుసుకునే
మాట మరచిపోరాదు
భగవంతుని తలపించీ
వరమాత్తమమైన మతం
యమునింటికి పంపించీ
అతి హీన మతమైంది
ప్రజాక్షేమమును నోరే
రాజకీయ రాజీవం
ప్రజాక్షామ కారకమై
నేశైనది నిర్జీనం
గుండెను రెండుగ చీల్చే
మొండితనం పనికిరాదు
మనసులనేకం చేసే
మంచితనం కావాలి
అభాగ్యుల్ని కాము మనం
భాగ్యనగరి మనది
అపజయం లేదు మనకు
విజయవాడ మనది
హిమశైలం మనది
హిందూ మహాసముద్ర జలం మనది
హరశూలం మనది హరిచక్రం మనది
హరి హరులను మించినట్టి
నర హృదయం ఈనాడు
వానర హృదయ మయింది
మన్ ఏక్ మందిర్ నహీ
మన్ ఏక్ బందర్ హై
నరుడు అలనాడు వానరుడు
ఈనాడు నిశాచరుడు
ప్రశాంత మానవ జగతిని
అశాంతి రేకెత్తించే
నిశాచరుడు మనకు వద్దు
నరుడు కావాలి నిండైన నిశాకరుడు
గుండెలలో అనురాగపు పండు వెన్నెలలు
పండించే నిండైన నిశాచరుడు
నేక్కడో దూర దూరాల వున్నాను
కాని మీ హృదయాల తీరతీరాల వున్నాను
మీ గుండెల పూడండల దార దారాన వున్నాను
రవీంద్ర భారతిలో
కవీంద్రుల కవిత్వపు హారతిలో వున్నాను
తెగిన గాలిపటం కాదు
తెలంగాణ
తెలంగాణ తేనెసోన
తెలంగాణ దివ్యవీణ
తెలంగాణ మహారాణా
తెలంగాణ నవకవితల నజరానా
తెలుగు జాతి ఒక్కటి
భరత జాతి ఒక్కటి
ప్రపంచమే ఒక్కటి
శశి బింబం ఒక్కటి
రవి బింబం ఒక్కటి
రేపు నవంబరు ఒక్కటి
యెప్పుడూ మనమంతా ఒక్కటి

62.ఆనందాల కల్పవల్లి

అదేనో తెలుగు తల్లి
అందాల నిండు జాబిల్లి
ఆనందాల కల్పవల్లి
అదే నీ తెలుగు తల్లి
పదవోయ్ తెలుగువాడా
అదే నీ తెలుగు మేడ
సంకెళ్ళు లేని నేల
సంతోష చంద్రశాల
కనవోయ్ తెనుంగు రేడా
అదే నీ అనుంగు నేల
అదిగో సుదూరనేల
చనవోయ్ తెలుగు వీరా
స్వర్ణాల కాంతి స్వప్నాలు
స్వప్నాల శాంతి స్వర్గాలు
నిన్నే పిలుస్తున్నాయి
నిన్నే వరిస్తున్నాయి
ఆందోళనాల డోల
సందేహాల హిందోళ
ఎందాక ఊగిసలాట
ఇదే నీ గులాబీ తోట

63.ఇదే ఆంధ్రదేశం

ఇదే ఇదే నా దేశం - ఇదే ఆంధ్రదేశం
తరతరాల చరిత్రలో తడిసిన సందేశం
శాతవాహనుల నాటి శౌర్యము ఊపిరిగా
కాకతీయ రాజుల సంగ్రామ దీక్ష సిరిగా
త్యాగరాజు గానసుధ ధారలు సంపదగా
పోతరాజు భాగవతపు గాధలు నా ఎదగా
హంసి అమరావతి నాకమరినని శ్రీకళలై
గోదానది కృష్ణవేణి కూరిమి నిచ్చెలులై
కూచిపూడి నాట్యము నా గొప్పను పెన్నిధిగా
విలసిల్లిన వికసించిన సంస్కృతి సన్నిధిగా
అంధత్వం అన్ని దిశల ఆలోచన రేపగా
తెలుగుల అభిమాన ధనం దిక్కుల వ్యాపించగా
ఇది కోస్తా తెలంగాణా ఇది రాయలసీమగా
ఏడు కోట్ల గొంతులచే రాగము వినిపించగా

64. ఇల్లలుకుతూ అలుకుతూ

ఆంధ్రప్రదేశ్ అవతరణోత్సవ దినాన
అబద్దం ఆడతానికి నోరు రాక
అంత క్షేమంగా వున్నామని చెప్పలేక
అటూ ఇటూ వూగిసలాడూతూ
అల్లుకు వచ్చిన గీతం వినండి
నిజానికి కాలం మన మీద యింకా
కారాలు మిరియాలు నూరుతూనే ఉంది
కఠినంగా కరిచింది కాలం మనల్ని
అందరి మనసుల్ని అడ్డంగా విరిచింది
ఐక్యతా లత అల్లుకున్న అందాల పూల పందిరి మీద
అంగుళానికి అరడజను వంతున
గొంగళి పురుగులు ప్రాకుతున్నాయి
వాటి పీద్డ పడలేక తోటంతా
పీకేద్దామంటున్నారు కొందరు!
చుక్కల లోకం లోకి ఎక్కాలని
వేసిన నిచ్చెన్లు విరగొట్టారు కొందరు
కూచున్న కుర్చీ కుషన్లలో
గుండు సూదులు గ్రుచ్చి వెళ్ళారు కొందరు
వానదేవుణ్ణి రమ్మని టెలిగ్రాం పంపితే
వరద దేవుడొచ్చి కూర్చున్నాడు
పైర గాలిని రమ్మని కబురు చేస్తే
తుఫాను గాలులు తొంగి చూశాయి
కూలిపోయిన నిరుపేదల గుడిశెలు
కాలిపోయిన గ్రామీణుల జీవితాలు
హృదయం దహించుకు పోయే
విషాద సంఘటనలు ఒక వైపు
కొండ అడ్డు తగిలి రెండుగా చీలుతానంటున్న ప్రవాహం
కక్షలు కార్పణ్యాలు ప్రాంతీయ తత్వాల ప్రభావం
మనసులు చెదిరి మనుషులందరూ చెదిరి
తోలగి దూరంగా పోతున్న దృశ్యాలు ఒక వైపు
ఏం చెప్పను నాదేశపు శోభ
మనసులు మారడం లేదు
మాకేమిటి లాభమనీ
మాట మారడం లేదు ఆంధ్రులెవరో అరవలెవరో అసలే తెలీదు నాకు
తెలుగు వారికి యీ మధ్య పుట్టిన తెగులేమితో తెలీదు నాకు
అనైక్యత బీజాలు నాటిన వారికి నికరంగా వచ్చిన
ఆదా ఎంతో తెలీదు నాకు
చరిత్రను వెనక్కు మళ్ళింప జూస్తున్న వారి
చేతుల్లో ఎంత బలముందో తెలీదు నాకు
ఇల్లలుకుతూ అలుకుతూ ఈగ తన పేరు తాను మరిచిపోయినట్లు
ఇటీవల మన తెలుగువాండ్లు తమ ఊరూ పేరూ మరచిపోయి
ఊరేగారు వీధుల వెంట!
అవును ప్రజలు నిజంగా నిద్రపోతున్నారు
చైతన్యం చంద్రమండలానికి వలస పోయింది
మనిషి కత్తికి పదును పోయింది
చరిత్ర పొలంలో నాట దలచుకున్న
పైరుకు అదును పోయింది
పామరుడు పొదలో పొంచి కూర్చున్నాడు
పాములా కాటేస్తాడు బహుపరాకే
తెల్లవరకుండా సూర్యుడికి మబ్బులు అడ్డు వస్తున్న
బడాబడా ఖామందులు బహుపరాకే!

65. ఉగ్రనేత్రం తెరచి ఉరికింది తెలుగు

కడలి అంచులు దాటి కదిలింది తెలుగు
ఎదల లోతులు మీటి ఎగిసింది తెలుగు
ఇటు మలేషియ నుంచి అటు అమెరికా వరకు
నలుదిశల గొంతుకల పలికింది తెలుగు
పెనుయెడారులలోన ఇనుప దారులలోన
పలుకు పలుకున జీవమలికింది తెలుగు
ఎక్కడున్న ఎన్ని చిక్కులున్న సరే
తలేత్తి నిలుపుమని తెలిపింది తెలుగు
ఏ భాష వేణుకైన ఏ వాన చినుకైన
తనలోన కలుపుకుని తరలింది తెలుగు
బరిగొదిగి పోతన్న బరవళ్ళతో సాగి
హమ్మంటు వేమనగ ఉరిమింది తెలుగు
అభినయానికి హృదయ మర్పించుకొని కూచి
పూడియే నాడిగా ఆడింది తెలుగు
సంగీతమే జీవసంపుటిగ త్యాగయ్య
ప్రతిపదంలో కరిగి పాడింది తెలుగు
పల్లె పాటలలో పభంధ నాటికలలో
కలికి బయ్యారాలు చిలికింది తెలుగు
స్వాతంత్ర్య సమరాన స్వచ్చంధగతులీన
ఉగ్రనేత్రం తెరిచి ఉరికింది తెలుగు
శాంతికి కపోతమైన క్రాంతి జలపాతమై
నిత్యవర్థిష్ణువై నిలిచింది తెలుగు

66. ఎవడయ్య ఎవడు వాడు

శాతవాహనుల్ వంశాన పుట్టినవాడు
కాకతీయుల పోతుగడ్డ మెట్టినవాడు
పల్లెలోని కాదు ఢిల్లీలో సైతమ్ము
పెద్ద గద్దెల నేలి పేరుకెక్కినవాడు
ఎవడయ్య ఎవడువాడు ఇం
కెవడయ్య తెలుగువాడు!
పంచెకట్టుటలో ప్రపంచాన మొంగాడు
కండువా లేనిదే గడప దాటనివాడు
పంచభక్ష్యాలు ఆన కంచాన వడ్డించ
గోంగూర కోసమై గుటక లేసేవాడు ||ఎవడయ్య||!
తెలుగు బాసను జుంటితేనెయని తెగపొగడి
పొరిగింటి పులుపుకై మరులు పెంచినవాడు
దేశ భాషలలోన తెలుగు లెస్సని చాటి
మల్లెలకు బదులు లిల్లీలు వలచినవాడు ||ఎవడయ్య||
ఒక చేతి మజ్జిగని బరసి పట్టినవాడు
ఒక చేతి మధుపాత్ర వొదిలి పెట్టనివాడు
ఒక ముహుర్తాన ఇంచుక బుర్రగోకుకొని
చల్ల వంచిన చేత కల్లు పంచినవాడు ||ఎవడయ్య||
నేల నల్దెసల డేరాలు నాటినవాడు
అన్ని మూసలలోన అట్టె బదిగినవాడు
ఏ దేశమేగిన ఎందు కాలిడినా
ఆవకాయ వియోగ మసలె సైపనివాడు

67.కలిసి పాడుదాం

కలసి పాడుదాం తెలుగుపాట
కదలి సాగుదాం వెలుగుబాట
తెలుగువారు నవజీవన నిర్మాతలనీ
తెలుగుజాతి సకలావనికే జ్యోతియని||కలసి||
కార్యశూరుడు వీరేశలింగం
కలం పట్టి పోరాడిన సింగం
దురాచారాల దురాగతాలను
తుదముట్టించిన అగ్ని తరంగం
అడుగో అతడే వీరేశలింగం.....
మగవాడెంతటి ముసలాడైనా
మళ్ళీ పెళ్ళికి అర్హవుతుంటే
బ్రతుకే తెలియని బాలవితంతువు
కెందుకు లేదా హక్కంటాను.....
చేతికి గాజులు తొడిగాడు
చెదిరిన తిలకం దిద్దాడు
మోడువారిన ఆడబ్రతుకుల
పసుపుకుంకుమ నిలిపాడు.....
అడుగో అతడే గురజాడ
మంచి చెడ్డలు లోకమందున
ఎంచి చూడగా రెండు కులములు
మంచియన్నది మాలయైతే
మాలనేనౌతాను అన్నాడు.....

68.కోహినూరు

తెనుగు తల్లీ! నీకు జోహారు
దేశమాతా! నీకు జేజేలు
నిను జూచి నిను బాడి నిను గొల్పు వేళ నా
కను లాణిముత్యాల గనులుగా నగు నహొ! ||తెనుగు తల్లీ!||
నీ పాలు జుంటి తేనియల తేటలో గోస్త
నీ పక్వరసమో సుధా పురమో యోట
నా పల్కు లీ లీయనకు నోని విశ్వవా
ణీ ప్రపంచ ప్రశంసాపూరితము లాయె ||తెనుగు||
కుటిల శాత్రన కోటిగుండెలో నిదురించి
యిటు సేతు సటుగంగ యెల్లంగా జగమేలు
నటరాజ కంఠవైశాల్యము నడగించు
నటుకీర్తి పెంచె నట్టి యెంతటి వాడో ||తెనుగు||
ఎల్లోర కొండ నీ యల్లారు గీమటీ
కొల్లూరి కోహినూరు కొప్పులో బూచటీ
కోలారు గనులు నీ కోశంబటీ పండ్లు
పుల్లనైపోవు భోగమ్ము కన్నచో ||తెనుగు||
గౌతమీ కృష్ణనదీ తుంగభద్రాది
వూత స్రవంతికా పుంజమ్ము నీ ముద్దు
కూతురై నీ చను నీ తోట పండింప
నీ తనూజులు పైడి పాతఱల్ కప్పిరే ||తెనుగు||
నీ పుణ్యలేశమ్ము నాపాలి దాయనో
నా పూజకే లోకనాధుండు పొంగెనో
నీ పావనోదర శ్రీపరంపరలలో
నీ సదార్చనులలో నేను నొక్కడనైతి ||తెనుగు||

69.గాంధీ పుట్టిన దేశమా ఇది

శాతవాహనుల్ వంశాన పుట్టినవాడు
గాంధీ పుట్టిన దేశమా ఇది నెహ్రూ కోరిన సంఘమా ఇది
సామ్యవాదం రామరాజ్యం సంభవించే కాలమా || గాంధీ ||
సస్యశ్యామల దేశం అయినా నిత్యం క్షామం
ఉప్పొంగే నదులు జీవజలాలు ఉపు సమురాల పాలు
యువకుల శక్తిని భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు
ఉన్నది మనకూ ఓటు బ్రతుకు తెరువుకే లోటు || గాంధీ ||
సమ్మె ఘెరావు దొమ్మీ బస్సుల దహనం లూటీ
అధికారంకై తగవులాటలో అన్నదమ్ముల పోటీ
హెచ్చెను హింసా ద్వేషం ఏమవుతుంది దేశం || గాంధీ ||
వ్యాపారాలకు పర్మిట్ వ్యవహారాలను లైసెన్సు
అర్హతలేని ఉద్యోగాలు లంచం యిస్తే ఓయస్
సిఫార్సు లేనిదే స్మశానమందు దొరకదు రవ్వంత చోటు
ప్రేరుకు ప్రజలది రాజ్యం పెత్తందార్లదే భోజ్యం || గాంధీ ||

70.గురిపెట్టిన మన గాండీవం

యువ భారత యుగోదయంలో
నవభారత మహొదయంలో
పూచిందొక అరున తరంగం
లేచిందొక క్రాంతి విహంగం
కంఠంలో విప్లవ రాగం
గమనంలో విద్యుద్వేగం
దేశానికి నవసందేశం
లోకానికి నూత్నాలోకం
త్యాగోజ్వల మహిమామండిత
రాగారుణ రక్తపతాకం
నవభారత హృదయాంబరమున
ప్రసరించిన మహేంద్ర వాసం
చైతన్యం జీవిత లక్ష్యం
స్వాతంత్ర్య అంతస్సాక్ష్యం
ప్రాచీ దిగ్ దృంగంచలంలో
రోజస్సుల చిలికే కిరణం
అజ్ఞాతం అతిక్రమించిన
ప్రజ్ఞామయ విజయ విహారం
కురుక్షేత్ర సంగ్రామానికి
గురిపెట్టిన మన గాండీవం

71.జయము జయము భరతావని!

జయము జయము భరతావని!
సకల భువన పావనీ!
జయము జయము స్వేచ్చాప్రియ
జనతా సంజీవనీ!
అరుణారుణ చరణ కిరణ
కరుణా రసవాహినీ!
క్షమతాప్రియ మమతామయ
సమతా సమ్మోహినీ!
ధర్మవీర సమరధీర
దానశూర జనయిత్రీ!
నిర్మల విజ్ఞాన ధాత్రి!
కార్మిక కర్షక సవిత్రి!
మలయ పవన చలమపవన
కలిత లలిత హరితాంబర!
అతి సుందర సరిదంతర
ప్రతి బింబిత నీలాంబర!
పాటల సుమ సుకుమారీ!
కోటి కోటి నరనారీ!
గళమంగల విజయవాణి!
లలితకళా కల్యాణీ!

72.జననీ జన్మ భూమిశ్చ

జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసి స్వర్గాదపీ గరీయసి
ఏ తల్లి నిను కన్నదో ఆతల్లినే కన్నభూమి గొప్పదిరా ||2|| ||జననీ||
నీ తల్లి మోసేది నవమాసాలేరా ఈ తల్లి మోయాలి కడవరకురా కట్టె కాలే వరకురా
ఆ రుణం తలకొరివితో తీరేనురా ఈ రుణం మరి ఏ రూపాన తీరేను
ఆ రూపమే ఈ జవానురా త్యాగానికి మరో రూపు నువ్వురా ||జననీ||
గుండె గుండెకు తెలుసు గుండె బరువెంతో
ఆ గుండెకే తెలుసు గుండె కోత బాధెంతో
ఈ గుండె రాయి కావాలి ఆ గుండెల్లో ఫిరంగులు మోగాలి
మనిషిగా పుట్టిన ఓ మనిషీ మారాలి నువ్వు రాక్షసుడిగా
మనుషుల కోసం ఈ మనుషుల కోసం ఈ మనుషుల కోసం ||జననీ||

73.జన్మభూమి

జన్మభూమి కన్న స్వర్గంబు వేరేది
మాతృభాష కన్న మధుర మేది
తల్లికన్న వేరె దైవమింకేదిరా?
తెలియుమోయి నీవు తెలుగు బిడ్డ!
మధుర మధురమైన మనభాషకంతెను
చక్కనైన భాష జగతి లేదు
పాలకంటె తనయులకే పలు
బలమునీయ గలవు తెలుగుబిడ్డ!
అలర పలనాటి బాలుడే అన్న యనుము
అమర రుద్రమదేవి నా కప్ప యనుము
తిక్కనామాత్యుడే గురుదేవు డనుము
ఇట్టి వీరాంధ్రజాతిలో బుట్టి అనుము

74.తల్లీ భారతి

స్వాతంత్ర్యమే మా జన్మహక్కని చాటండి
నిరంకుసము శక్తి అయినా
నిర్ణయముగా ఎదిరించండి
నదుల న్యాయమున బాధలు పొంది
బ్రతికిన చచ్చిన భేదములేదు నరుల || స్వాతం ||
కవోష్ట రుధీర జ్వాలల తోటి
స్వాతంత్ర్య సమరం నడపండి
ఎంతకాలమిటు దహించుయున్న
దోపిడి మూకకు దయరాదన్న - ఎంత || స్వాతం ||
సహ్ఘములలోను ఐక్యంలేదని
నలకలపడికు శాంతి వధాన
స్వర్ణ తుల్లమౌ స్వతంత్ర జ్యోతికి
మాంగల్యపు హారతులమ్మా || స్వాతం ||
సీతా మొగల్ రణధీరు కాంతి యాదోసే
జాన్సీల స్వాతంత్ర్య సమరదీప్తి
త్యాగమూర్తులు తిలకే దాదా ఫిరోజు
మాల్యన మన గాంధీ మహీర శక్తి
జాతీయ సంయోకామ్యా హింసతోడ
కాంగ్రేస్సు నడిపించిన కదన రేగతి
తమిళ, ఆంధ్ర, కేరళ దారిణి ప్రజలెల్ల
ధారపోసిన మహాత్యాగ ఫలము
మాతృదేశముగాన క్షాత్రమూసినబోను
బడరాని ఇడుముల బడిన క్రమము
పండిత నెహ్రూజీ పటేలు పట్టాభి
రాజాజీ నెరసిన రాజ్య పటిమ
భారతీయుల పుణ్యంబు పుచ్చెననెగా
వచ్చెనదిగో సుస్వాతంత్ర్య వత్సరము
పొత్తుకూడక సుఖముల పొందరయ్య
తల్లి భారతి విభనమ్ము వెల్లివిరియు

75.తెనుగుబాస

మంచి గుమ్మడికన్న దంచిన యెఱ్రని
క్రొప్పడ్ల బియ్యము కూడుకన్న
మేల్ జహంగీరు మామిడి పండుకన్న నుం
కాఱున లే సజ్జ కంకికన్న
కమియ పండిన ద్రాక్షకన్న, చెక్కర తీగ
బోసి పండిన పాల బువ్వకన్న
రస దాడికన్న పనస తొనకన్న క
జూరముకన్నను జున్నుకన్న
అలతి పెరతీనియలకన్న నామని తఱి
కొసరి కూసిన కోయిల కూతకన్న
ముద్దు లొలికెడి జవరాలి మానికన్న
తెయ్యనైన దెయ్యది? యదే తెనుగు బాస
కడిది యక్కరముల కలయిక సమసక
మ్మన దయ్యు నూగించు పసరు కలది
వీణ యూదిన యట్లు కూర్చు కలది
శివకవి హరిహర కవులకు మఱచిపో
నటుల జనుల చేసి నలవు కలది
తొమ్మిది లక్షల దొడ్డ పోటది విండ్ల
నారి మ్రోయించిన ధీర గలది
మీరు కృషి చేయనిది నీటి మీ కయిలకు
పట్టుదల లేనిది తెనుంగు బాసయంచు
గుర్తెరుగు డోయి దేశమున్ గుస్తరించు
ననుగులార! వల్బాసల మఱుగులార!
ఈ బాస ధూర్జటి పేలాపనగ బల్కి
కన్నబోయడు ముత్తికాలు ద్రొక్కె
ఈ బాసలో లా కు నేర్వము దా కు కొ
మ్మీయక భాస్కరు డిపుడు నుండె
ఈ బాస మాటాడి యెల్లరు గణపతి
ఒక్క గొడుగు నీడ నుంచి మురిసి
ఈ బాసతో కాపుటిండ్ల పాలించి రా
యక్ భువన విజయం బందుకొనియె
క్రోల్పులిని చూచి కుందేలు గుఱ్రుమనిన
చప్పు డీ బాసలోనిది చెప్పవచ్చు
నెంతయేని తెంగొందన మంత గూర్చి
దీని కీనాడు పట్టిన దిగులు గూర్చి
కడుపు కొఱకును మిక్కిలి ముడుపు కొఱకు
కీర్తి కొఱ కధికార విస్పూర్తి కొఱకు
నెన్ని వేసాలు వేసిన నేమికాని
మాతృభాష చక్కగ నేర్చి మనుత నరుడు
పైడికి నింబదమ్మునకు ప్రాతలు క్రొత్తలు లేవు లేనిచో
వాడుక లేనియట్లే యగు బావి జలమ్ములు వోలె శబ్దముల్
వాడు కొలంది శోభలును పంతము పట్టుడి నేడు నాల్కపై
నాడవలెన్ చతుర్విధ మహాంధ్ర మశేష మటంచు నాంధ్రజు;
మూవురు లింగ మూర్తులకు భోగము సెల్లెడు నంతదాక గో
దావరి పాయ పాయ వఱదల్ రవళీంచెడు నంతదాక కృ
షా నిమిలాంబు పూరమున చంద్రిక లాడెడు నంత దాక నాం
ద్రావని కైత జోతి కఖిలావని పళ్ళెరమై తనర్చుతిన్

76.తెలుగు దేశమే నాది

తెలుగు దేశమే నాది తెలుగు బిడ్డనే నేను
తెలుగు పేరు వింటేనే మురిసిపోతాను
తెలుగు భాష అంటే మైమరచిపోతాను
నన్నయ భట్టిక్కడనే పుట్టినాడు
తిక్కన కవి ఘంట మిచట పట్టినాడు
పోతన్నలు, శ్రీనాధులు రామరాహు భూషణులు
తెలుగు భాషకై వన్నెలు దిద్దినారు
తెలుగు జాతి నాల్కలపై నిలిచినారు
ఆట వెలదులను ముద్దుల మూటగట్టె వేమన్న
భావి కాలగతుల తెలియ బల్కెడు వీరబ్రహ్మం
కర్ణాటక గానానికి కళదెచ్చెను త్యాగరాజు
ఇంతటి విజ్ఞాన ధనులు ఎవరున్నారు
వెదకి చూచినా గాని కానరారు
బరిపై తొడగొట్టి, కత్తి బట్టెను నాయకురాలు
పురుష వేషమున శత్రుల మారుమాడెను రుద్రమ్మ
మొల్లలు మల్లమ దేవులు మహిళలకే మణిపూసలు
తెలుగు గడ్డకే పేరు దెచ్చినారు
స్త్రీ జాతికి గౌరవమ్ము నిచ్చినారు
ఓరుగల్లు నేలిన శూరుడు ప్రతాపరుద్రుడు
పౌరుషమ్ము చింధించిన బాలచంద్రుడు
రాచకొండ వెలను దొరలు కొండవీటి రెడ్డి విభులు
మన ప్రతాపమునకు బలే మచ్చు తునకలు
వేడి నెత్తురు పారించిన వీరపుత్రులు
కలియుగ భీముడని బిరుదు గొన్న కోడి రామమూర్తి
అద్భుత మేధావిగా, పేరందిన విశ్వేశ్వరయ్య
జగము మెచ్చు రాధాకృష్ణ, త్యాగమూర్తి ప్రకాశం
గత్యసాయి బాబాలు మనవాళ్ళంటే చాలు
సింహాచల మప్పన్న శ్రీశైలం మల్లన్న
యాదగిరి నరసింహ ఏడుకొండల వెంకన్న
వీరంతా తెలుగువారి కిలవేలుపులు
మహిమలు జూపించునట్టి మన దేవుళ్ళు
కృష్ణా, గోదావరులు, కేరింతలు గొడుతున్నవి
తుంగభద్ర మంజీరలు అంగలు వేస్తున్నవి
నిత్యము ప్రవహించుచున్న నిర్మలమగు జీవనదులు
బంగారపు పంటలు పండిస్తున్న వీ
కరువు రక్కిసిని దూరం తరుముతున్నవీ
తెలుగువాడు ఏడనున్న, తెలుగువాడు
తెలుగు బాషనే సొంపుగ పలుకుతాడు
మరచిపోని అతని కట్టు మారిపోని అతని బొట్టు
తలచుకున్న రోమ రోమం పులకరిస్తుంది
అభిమానం పొంగిపొరలి ఉరకలేస్తుంది

77.తెలుగు పతాక గీతం

తెలుగు పతాకమా...
మా జాతి పతాకమా...
ఎగరవేస్తాం మళ్ళీ పైపైకీ
మా గుండెల ఊపిరి పోసే ||తెలుగు||

ఒక్కోతరం, ఒక్కోతరం
ఎంత నలిగిపొయ్యావో...
ఏ చీకటి దుమ్ములో
ఎంత మాసిపొయ్యావో...
నీ ఏపుకు అడ్డమైన ప్రతికంపను పెళ్లగించి
జనం బతుకు మలుపుల్లో ఏరువాక పొంగిస్తాం ||తెలుగు||

ఏ అవసర దూరాలను
నీ గొంతై కలుపునో...
ఏ అలజడి తీరాలను
నీ నడకై నిలుపునో...
అదే యాస, అదే బాస శ్వాసశ్వాసకూ పంచీ
ఉద్యమాల కనురెప్పల రెపరెపలై జీవిస్తాం ||తెలుగు||

78.తెలుగుతల్లి

సిరుల నిచ్చే కన్నతల్లి!
శుభము గూర్చే కల్పవల్లి!
దీవెనల దయచేయవే భూ
దేవి మనకి తెనుగు తల్లి!
కల్లకపటము లేము తెలియని
పిల్లలందరి ప్రేమజూపి!
ఎల్లవేళల నీదు కృప వెద
జల్లి బ్రొవవె? పాలవెల్లి!
విద్యలొసగవె మాకు జననీ
బుద్దిగరపవె ఆంధ్రవాణి
పాడిపంటల నిచ్చి యందరి
కడుపు నింపనే కృష్ణవాణి
బాలచంద్రుని పాపరాయుని
మల్లమాంబను గంటివమ్మా
పౌరుషముతో తెలుగు వీరుల
తీర్చిదిద్ది తరలిస్తివమ్మా!

79.తెలుగుదనము తీయదనము

తెనుగుదనము వంటి తీయదనము లేదు
తెనుగు కవులవంటి ఘనులు లేరు
తెనుగుతల్లి సాధుజన కల్పవల్లి రా
లలిత సుగుణజాల! తెలుగు బాల!
కష్టబెట్టబోకు కన్నతల్లి మనస్సు
నష్టబెట్టబోకు నాన్న పనులు
తల్లిదండ్రులన్న దైవ సన్నిధులురా
లలిత సుగుణజాల! తెలుగు బాల!
బడికి నడువలేడు; పాఠాలు వినలేడు;
చిన్న పద్య మప్పజెప్పలేడు
రాజరాజు బిడ్డరా నేటి విద్యార్థి!
లలిత సుగుణజాల! తెలుగుబాల!
బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటెగాదు
చచ్చికూడ చీల్చి యిచ్చు తనువు
త్యాగభావమునకు తరుపులే గురువులు!
లలిత సుగుణజాల! తెలుగుబాల!
దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు;
భాత్ర్పజనము వచ్చి పంచుకోరు
విశ్వవర్ధనంబు విద్యా ధనంబురా
లలిత సుగుణజాల! తెలుగుబాల!

80.తెలుగునేల

ప్రాచీన సంస్కృతీ పరిఢవిల్లిన నేల
పౌరుషాగ్నికి పేరుపడిన నేల
జాతీయ స్పూర్తికి జయకేతమౌనేల
జాగృతీ క్రతువులన్ జరుపునేల
పరమస్వంతంత్రేచ్చ పరిమళించెడు నేల
పోరులో వెన్నొడిబోని నేల
చేతనాయుతమైన చేవకల్గిన నేల
వీరులగన్న బంగారునేల
వెలుగు జిలుగుల నెలబాల తెలుగునేల
దిక్కులేక రాహూవునోట చిక్కెనేడు
చక్రిపైలేచి చూపు పరాక్రమమ్ము
కలిగిన ధీరుడా తెలుగువాడ:

81.నవభారతదేశం

ఇది సుందర దేశం నవభారత దేశం
మృదు మంజులనాదం పురిగొల్పిన వేదం ||ఇది||
గల గల గల సవ్వడి గమకాలకు పల్లవి
అలనురగల వెల్లుడి పలికించిన అల్లరి
జ్వనదులె సంగమ సారాలకు తేటని
ప్రేమ ఎదల కలయికయే వెలుగొందిన జీవని ||ఇది||
కులమతమను బేధము మనకెందుకు మిత్రుడా!
మతమౌధ్యాలెందుకు? భరతజాతి పుత్రుడా!
భాషలు వేరైనను భావమొకటి కనుమరా
భేదము లెంచకురా భారతికే మొప్పరా ||ఇది||
మారణ హొమాలను రగిలించుట తగదని
మానసదీపాలను వెలిగించుట సుఖమని
నడవడు లొకటైతే కలదందున రసధుని
కులమతమను తేడాలను వీడితే శుభశశి ||ఇది||

82.తేనెకన్న మధురం మన తెలుగు

తేనెకన్న మధురం రా, తెలుగు ఆ
తెలుగుదనం మా కంటి వెలుగు
తెలుగుగడ్డ పోతుగడ్డ ఎంత పచ్చన, మా
తెలుగు దుండెలో స్నేహము ఎంత చెప్పన!
మన పొలాల శాంతి పులుగు ఎంత తెల్లన, మన
తరతరాల కధను పాడు గుండె ఝుల్లున
పాటుపడిన వాళ్ళకే లోటు లేదను
చాటి చెప్పు తల్లికదా తెలుగుతల్లి
లలితకళలి సంగీతం సాహిత్యం
తెలుగు తల్లి జీవితాన దినకృత్యాలు
గత చరిత్ర మన చరిఒత్ర ఎంత ఖ్యాతి!
గర్వించదగ్గ జాతి తెలుగు జాతి!
అయినా గతంకన్న భవిషత్త్య్ ఆశాజనకం
ఆ భావికొరకు ధరించాలి దీక్షాతిలకం

83.నన్నుగన్న తల్లి

నన్నుగన్న తల్లి! నా భాగ్యమా!
నారాయణి! ధర్మాంబికే
నన్నుగన్న తల్లి! నా భాగ్యమా!
నారాయణి! ధర్మాంబికే
కనకాంగి! రామావతి సోదరి!
కాదనీ నను, కాత్యాయని!
నన్నుగన్న తల్లి! నా భాగ్యమా!
నారాయణి! ధర్మాంబికే
కావుకావుమని నీ మొఱబెట్టగా
కనులలోచన! కరుగుచుండగా,
నీవు బ్రోవకున్న నెవరు బ్రోతురు? స
దా వరంబొసగు త్యాగరాజనుతి
నన్నుగన్న తల్లి! నా భాగ్యమా!
నారాయణి! ధర్మాంబికే!

84.నమ్మలేనంతగా నేడు

కొన్ని పుష్కరాల క్రితం తెలుగుజాతి వృక్షం పుష్పించింది
పుష్పించి వివిధ శాఖల
ఏకతా పరీమళాల శోభలను గుప్పించింది
పువ్వు ఫలంగా పరిణామం చెందే పరిణతి దశలో
నవ్వుల పాలైంది తెలుగుజాతి నమ్మలేనంతగా నేడు
తెలుగు జాతి వెలుగు జాతి
భాషా ప్రాతిపదిక ప్రమిదలో
ఐక్యత కాంతులు ప్రసరించిన దినం - నాడు
ముక్కోటి తెలుగువారి
మూడు ప్రాంతాలను ముడ్లెవేసి
మంగళ సూత్రంలా బంధించిన దినం - నాడు
సస్యశ్యామల సంభరిత శోభావృత ప్రాంతములు
సోదర భావ సంపన్నతి నందించి
వాత్సల్యామృతం గర్వంగా పంచుకున్న దినం - నాడు
కల లీడేరాలని తెలుగుజాతి జగత్కల్యాణ
సంఘటిత ప్రమాదాలకు
కంకణం కట్టుకున్న దినం - నాడు
శ్రీ రాములు దయచేతను
ఆరూఢిగ సకల జనులు నౌరాయనగా
అవతరించిన సంఘటిత తెలుగు దేశం
ఆయన రక్తాశ్రువుల జనించిన
గారాలు పట్టి పుట్టిన దినం - నాడు
తరతరాలు తెగి విడివడిన
తమ రావృత త్రిలింగ దేశం
పరస్పర ప్రేమాస్పద స్పందనలో
ఆనందపు దివ్వెలు వెలిగించిన దీపావళి - నాడు
ఆనాడు నేడై మోడుగా మారితిరి
కలలన్ని శిలలై కూకటి వ్రేళ్ళ ప్రసరణ స్థంభన చేసింది
కొద్ది తుఫాను గాలి చాలు వాలి రాలి పోడానికి
అశోకుడు నాటిన వృక్షం
అక్బరు పెంచిన చెట్టు అక్బరు పెంచిన చెట్టు
అన్నీ బోధించే దొకటే ఆ నీడలో అనురాగ స్పందనం
చరిత్ర చెరిగి పోయినా చెట్టు కనిపించక పోయినా
ఫలరసాస్వాదనలో ఆనాడు
ఫలించినవి జాతి ఆశలు ఆశయాలు
పువ్వు ఫలంగా పరిణామం చెందే పరిణత దశలో
నవ్వుల పాలైందితెలుగు జాతి
నమ్మలేనంతగా నేడు
ఉమ్మడి కుటుంబాలు గుంపుగా కలిసి బ్రతుకుతున్నాయి
దేశాంతర పరిణయాల జంటలు హాయిగా కలిసి జీవిస్తున్నారు
సర్వ జీవ జాల జాతుల్లో అనైక్యత లేనే లేదు
ఒకే గూటి పక్షుల్లో వేరు బ్రతుకు మిధ్య కాని
తెలుగుజాతి గూటిలో తెగులొకటి ఉద్భవించింది
తెలుగు భూమి బ్రద్దలయే భూకంపన శబ్దించింది
నాడు నేడై మాడిన మాడు రూపంలో ప్రతిబింబిస్తోంది
కొన్ని పుష్కరాల క్రితం తెలుగుజాతి వృక్షం పుష్పించింది
పుష్పించింది వివిధ శాఖల ఏకతా పరీమళాలను గుప్పించింది
తెలుగు జాతి వృక్షానికి తోటమాలి ఎవరైతేనేం?
కాలం పరిధిలో ఐక్యత తోయం పోయాలి కాని
పుష్ప పరిమళాలు ఫలరసాల చైతన్యం
పంపకం ఔచిత్యంతో ఫలప్రదం కావాలి
నరకాసుర వధతో దీపావళి వెలసింది నాడు
నరాసురులిచ్చే వ్యధలు బాపితేనే దీపావళి నేడు
అసుర శక్తులనినుమడించిన గతి తప్పిన మతుల
నఖ్యాతంలోకి త్రోసి సంతృప్తి సమాధులు కట్టాలి
శాతవాహనుల సహస్త్ర శతజయంతులు
ప్రతాపరుద్రుని సర్ణాంధ్ర గర్వకీర్తి
కృష్ణరాయని కర్ణాకర్ణ ధీధీతి
నన్నయ తిక్కనల భారత కవితా సౌరభాలు
బమ్మెర పోతన జగబ్ద్భిత భాగవత కర్పూర హారతి
గత చరిత్రలోంచి దాతలు వల్లించే కీర్తి మాతలు
దరిద్ర నారాయణుడవు నీవు
వీటిపై వరభాగ్యోన జీవిగా బ్రతకడం దేనికి
వర్తమాన చరిత్ర పుటలు భవిష్యత్తుకు ఉజ్జ్వల బాటలు కావాలి
వంకర గుంటల బాటలు చరిత్ర వాహనానికే ముప్పు
రుతువుల రాపిడిలో వృక్ష స్వరూపం మారినా
స్థిత ప్రజ్ఞ కూడిన సజీవ శక్త్రి నిత్యం వెలగాలి
దేశసర్వతోముఖ సంపన్నత అణువే దేశ వృద్ధి
జాతుల బహుముఖ ఉద్దీపనమే దేశ వృద్ధి
తరాల నుంచి మరలుగా పనిచేసే మానవ బుద్ధి
భారత నూతన చైతన్య వాశిత సమాజానికే ముద్దు
తెలుగుజాతి వెలుగు జోతిరోషద్వేషాల నుసి ప్రమిదతో
శాంతిద్రవ ఆద్రతతో ఐక్యకాంతులు వెదజల్లాలి నేడు

85.నా జన్మభూమి

నా జన్మభూమి... భూమి... భూమి...
నా జన్మభూమి ఎంత అందమయిన దేశము
నా యిల్లు అందులోని కమ్మని ప్రదేశము
నా సామిరంగ హొయ్ హొయ్ నా సామిరంగ ||నా జన్మభూమి||


నడిచే దారిలో నవ్వే పువ్వులు
శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు ||నడిచే||
పచ్చని పంటలు వెచ్చని జంటలు
చల్లని జీవితం ఇదే నవభారతం హొయ్ నా సామిరంగ || నా జన్మ||


బతకాలందరు దేశం కోసము
దేశమంటేను మట్టికాదోయ్ మనుష్యులోయ్
స్వార్ధము వంచనా లేనిదే పుణ్యము
త్యాగమూ రాగమూ మిళితమే ధన్యహొవోయ్ నా సామిరంగ ||నా జన్మ||

86.నా దేశము

గౌతమీ కృష్ణవేణీ తుంగభద్ర పె
న్నా నదుల్ పాఱు మాగాణి గడ్డ
భ్రమరాంబ, కనకదుర్గాదేవి, వెంకన్న
పొత్తిళ్ళ బెంచిన ముద్దు బిడ్డ
నాగార్జున, విజయనగర, వినూత్న క
ళా సరస్వతుల విలాస భూమి
నన్నయ్య, యజ్వ తిక్కన్న, పోతన్నది
కవుల వాగ్వల్లి బంగారు తల్లి
సృష్ణరాయ మహీజూని, విష్ణువర్ణ
నాది నృప బాహు దండంబులందు నలం
మఱల స్వేచ్చాప్రపూర్ణయై మాన్యమైన
ఆంధ్ర్మాతకు భక్తి జోహారు లిడుచు
కట్టిన దాంధ్రమాత యిడు కమ్మని ఖద్దరు బట్ట, వెన్నతో
బెట్టిన విద్యలే సహజ వీర పరాక్రమ శౌర్య సంపదల్
పుట్టిన దాంధ్రదేశమని పొంగని యాంధ్రుడొకండు కల్గునే
పుట్టిన దేశమాత రుణమున్ సరిదీర్చిననాడె యాంధ్రుడున్
ఏ నాంధ్రుండను, పుట్టి పెర్గితి కదోయి అంధ్రదేశాననీ
నా నోటన్ వినుభెల్ల, కాలమనది యాంధ్రమ్మాయి, యీ దేశమం
తా నా దేశమే, స్వీయ రక్త మది, ఆంధ్రంబేకదా యంచున్‌
నానందింపని వాడొకండు కలడే, అంధ్రేతరుండున్ వినా
తెలుగు దేశము నాయది, తెనుగు వాడ
తెలుగుతల్లి యనుంగు చేతులను బెరిగి
తెలిసి గొంటిని, మంటిని, తెలుగు తల్లి
పేరు నిలుపుటె మీదె యూపిరి జెలంగ

87.నేనూ నా దేశం

నేనూ నా దేశం పవిత్ర భారతదేశం
అశోకుడేలిన ధర్మప్రదేశం బుద్ధుడు వెలిసిన శాంతిదేశం
బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం
శరణం గచ్చామి ||అశో||
కులమత భేధం మాపిన త్యాగి అమరబాపూజీ వెలసిన దేశం
వందేమాతరం||3|| ||కుల, నేనూ||
కదం త్రొక్కిన వీరశివాజీ - 2 వీర విహారిణి ఝాన్సీరాణి||2||
స్వరాజ్య సమరుడు అల నేతాజీ ||జైహింద్‌||3||
కట్టబ్రహ్మాన్న పుట్టినదేశం ||నేనూ||
అజాద్‌ గోఖలే వల్లభాపటేలు లజపతి తిలక్‌ నౌరోజీలు||2||
అంబులు కురిపిన మన అల్లూరి భగత్‌ రక్తము చిందిన దేశం
హిందుస్తాన్‌హమరాహై ||నేనూ - 3||
గుండ్ల తుపాకి చూపిన దొరలకు గుండెచూపే మన ఆంధ్రకేసరి
శాంతిదూత మన జవహర్‌నెహ్రూ||3|| ||శాంతి||
లాల్‌ బహదూర్‌ జన్మించిన దేశం, జై జవాన్‌ జై కిసాన్‌ ||3|| ||నేనూ||
అదిగో స్వరాజ్య రధానసారధి - 2 ఆదర్శనారి ఇందిరాగాంధి గరీబీ హటావో ||3||
ఆదర్శనారి ఇందిరాగాంధి అడుగుజాడలో పయనిద్దాం
అఖండ విజయం సాదిద్దాం ||అ.ఆఖం.నేనూ||
సాటిలేనిది దీటురానిది శాంతికి నిలయం మనదేశం నేనూ నా దేశం ||3||

88.భారత దేశం మనదేర

||ప|| భారత దేశం మనదేర
భారతీయులం మనమంత
భారతదేశం మనదేర

1. చ భరతుడు ఏలిన రాజ్యముర
బుద్ధుడు పుట్టిన దేశముర
గాంధీ, నెహ్రూ, జనని ఇందిర
రాణి రుద్రమ వెలసిన క్షేత్రం ||భా||

2. చ ఒకటే కులముగ కలిసుంటాం
ఒకటే మతముగ నిలిచుంటాం
గాంధీతాత చెప్పిన సూక్తులు
మరవక మేము పాటిస్తాం ||భా||

3. చ జై జవానులమై రక్షిస్తాం
జై కిసానులమై పండిస్తాం
దేశం కోసం పిల్లలమంత
తూటాలై మేము దూసుకు వెళతాం ||భా||

4. చ శాంతికి మేము దూతలము
దేశభక్తికి వారసులం
శత్రువు లెవరైన మా జోలికి వస్తే
ఖబడ్దారంటు తరిమేస్తాం ||భా||
రచయిత్రి అప్పల బాలరత్నం

89.పండిత నెహ్రూ పుట్టినరోజు

పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికీ పుట్టినరోజు
సమతా మమతా పుట్టినరోజు మంచికి కోవెల కట్టిన రోజు
ముత్యం లాంటి మోతీలాలుకు రత్నం లా జన్మించాడు
జాతిరత్నమై వెలిగి ఇంకొక జాతిరత్నం ను కన్నాడు
అతడే జవహరులాలు అతనికి మన జేజేలు ||2|| ||పం||
తలపై తెల్లని టోపి ఎదపై ఎర్రగులాబి ||2|| ||పం||
పెదవులపై చిరునవ్వు మదిలో పున్నమినవ్వు
చేతిలో పావురం మనజాతికి అతడే గోపురం ||2|| ||పం||
మహాత్మాగాంధీ అడుగుజాడలో స్వరాజ్య సమరం నడిపారూ
రణదాహంతో రగిలే జగతిని శాంతి సుధలు కురిపించాడు
కన్నుమూసినా జవహర్‌లాల్‌ కంటిపాపగా వున్నాడు
ఇంటింట జ్యోతిగా వున్నాడు చాచానెహ్రూ అమర్‌ రహే ||3|| ||పం||

90.భారతమాతకు జేజేలు

భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు
ఆ సేతు హిమాచల సస్యశ్యామల జీవ ధాత్రికి జేజేలు ||భారత||
త్రివేణి సంగమ పవిత్ర భూమి నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి ||భారత||
శాంతి దూతగ వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ
విప్లవ వీరులు వీర మాతలు ముద్దు బిడ్డలై మురిసిన భూమి ||భారత||
సహజీవనము సమభావనమూ సమతావాదము వేదముగా
ప్రజాస్వామ్యమే ప్రగతి మార్గముగ లక్ష్యములైన విలక్షణ భూమి ||భారత||

91.సారే జహాసె అచ్ఛా

సారే జహాసె అచ్ఛా హిందుస్తాన్ హమారా
హమ్ బుల్ బులే హై ఇస్‌కే, యే గుల్ సితా హమారా||
పరబత్ వో సబ్ సే ఊంఛా హమ్‌సాయా ఆస్‌మాన్ కా
వో సంతరీ హమారా ! వో పాస్‌బా హమారా||
గోదిమే ఖేల్‌తీహై ఇస్‌కీ హజారో నదియా
గుల్‌షన్ హై జిన్‌కే దమ్‌సే రష్‌కే జినా హమారా||
మజ్ - హబ్ నహీ సిఖాతా ఆపస్‌మె బైర్ రఖ్‌నా
హిందీ హై హమ్ వతన్ హై హిందుస్తాన్ హమారా||

92.భారతదేశం నా దేశం

నా దేశం నా దేశం భారతదేశం
భారతదేశం నా దేశం
జగద్గురువు శృంగేరి శంకరుడు
జగత్య వీశ్వరుడు వాల్మీకి
జగదుభారం కృష్ణమహస్సు
జగదాధారం రామచంద్రుడు
కొలువు తీర్చినా నా దేశం
వెలుగునిచ్చినా నాదేశం
జగదుత్తలము హిమాలయము
జగత్పవిత్రం గంగాతోయము
జగత్పండితుడు జగన్నాధుడు
జగమెరిగిన రాజు శిబిదాన వీరుడు
ఇవియన్నియు
నా దేశములోనే నాదేశము వారు
అందుకే భారతదేశం నా దేశం

93.మన ఐక్యత కాపాడాలి

తెలుగు పతాకం యెగురని దిశయే లేదు
తెలుగు దివ్వె వెలుగనట్టి దిశయే లేదు
తెలుగు వెలుగు చేరలేని దేశం లేదు
తెలుగు వెలుగు దూరలేని కోశం లేదు
వేయి స్తంభముల గుడిని వెలయించిన చేతులు
వేయి యేండ్ల మన గాధలు వినిపించే గీతలు
కాకతి రుద్రమను మరువగలుగునెవరు? సోదరీ
రాయల పౌరుషము మరువరాదెన్నడు సోదరా!
నాగార్జునాచార్య నవ బోధనలోన
నరుల నాగరకతయే నాట్యమాడేనులే
నందికొండ శిల్పాలకు నతు లొనరించాలి
సుందరమగు రామప్పకు వందే అనాలి
గోదావరి తీరంలో కో అంటే చాలును
నా దేశం వైభవము నాదాలై వినబడును
కృష్ణానది తరంగాల తృష్ణతీర్చు సుధాఝురులు
నాగార్జున సాగరాన నాట్యమాడు తరంగాలు
తిరుపతి కొండకు పోయి తిరుమలేశు పూజిస్తే
పరమ భాగవతుల కిహము పరము కరతలా మలకము
శ్రీశైలం మల్లన్నను సేవిస్తే చాలును
చింతలన్ని తొలగిపోయి జీవితమే విరబూయును
నన్నయ పద్యమ్మొక్కటి నాల్క మీద ఉన్న చాలు
అన్ని విద్య లొకసారే ఆకళించినట్లును
తిక్కన పద్య మొక్కటి చక్కగ చదివిన చాలు
తెలుగు జాతి నుడికారము తెలిసికొన్న యటులన్
పోతన పద్య మొక్కటి ప్రీతిగ చదివిన చాలును
అమృతమునే రుచిచూచిన అనందము కలుగును
విశ్వదాభిరాముడైన వేమన ఆటవెలదిలో
విశ్వమెల్ల ఇమిడిపోయి వేదాంతం విరియును
త్యాగరాజ కీర్తనతో తాదాత్మ్యం పొందితే
సంగీతం హృదయంలో జడివానై కురియును
కలకాలం మన ఐక్యత కాపాడాలి
తెలుగుజాతి గౌరవాన్ని నిలబెట్టాలి

94.రమణీయకముతో రాగమంచి

పావన నాగావళీ వంశధారలు
సీమత దామ సుశ్రి నహింప
నిఖిల పుణ్యపగా నిలయ గోదావరి
మరకత హార విస్పురణ నెరవ
శోభన కృష్ణవేణీ, భద్రగామిని
మణిహేమ కాంబికా మహిమ నింప
విమల పెన్నా నదీ వీలుకా బిభవమ్ము
చరణ మంజీర నైఖలి భజింప
దివ్యమోహన కళలతో తేజరిల్లి
దెసలు దెసెలెల్ల దీపింప తెలుగు తల్లి
ప్రాజ్య సువిశాల సుప్రజా రాజ్య వీధి
నిండు కొలువుండె కన్నుల పండువగుచు
పుడమికి పండుగయ్యె విరబూచెను
భూ జన హత్సుమావశుల్
బడుగుల జీవితాల చిర భాబ్య
శుభోదయ దోచి దోచె సం
దడిగ జనావళీ హృదయ తంత్రులు
తీయగ మ్రోగ సాగి లే
వరులను సోలు జీవికల వైభవముల్
విలసిల్లె కొల్లగా
లేవోయీ నలుదిక్కులందు జయభేరి నాద ముప్పొంగ రా
రావోయీ హృదయాంతరాన శుభ
సమ్రంభంబు జృంభించె లే
లే వోయీ కనుగోనలందు మనసేలే కాంక్ష రూపించెరా
రావోయీ ప్రియ బాంధవా ప్రియ సఖా రా!
మానవోత్తంసమా!
శ్రీనాధ కవిరాజ చిత్రవర్ణా కీర్ణ
భవ్య ప్రభంధాల భావమంచి
రాగ రంజిత త్యాగరాజ సంకీర్తనా
రమణీయకముతో రాగమంచి
కృష్ణవేణీ సముతృష్ణ నర్తన కళా
కేళీ తరంగిణిన్ తాళమంచి
ఆంధ్ర ప్రదేశోదయానంద వేళా స
మారంభ సంగీత మంచుకొసగ
కావ్యగానము సేయు సత్కవులు వెలయ
మాపదాంధ్ర ప్రతిభ మన భాని నిలువ
పుడమి నిడె ఎర్ర మందారపూవు పగిది
పరిమళీంచెను బ్రతుకు సంపంగి కరణి
నన్నయ్య మొదలుగా నాబోటి కవిదాక
గలయాంధ్ర సుకవితా కౌశలమ్ము
భారతమ్మాదిగా చిడి పాత్తముల దాక
గలయాంధ్ర సాహితీ గౌరవమ్ము
శ్రీకాకుళము మొదల్ చిత్తూర్ కడదాక
గల యాంధ్ర దేశీయ ఎలననమ్ము
ముసలి వొగ్గుల మొదల్ ముద్దుబిడ్డల దాక
గల యాంధ్ర జాతీయ కలకలమ్ము
గొంతు గొంతున గాన స్రవంతి గాగ
పుటపుతాంతర్గత పురాణ బోధ గాగ
దిక్కుదిక్కుల ధ్వనియించు బుక్కుగాగ
పొడిచె నిపుడిప్పుడె తెనుగు ప్రొద్దుపొడుపు
బ్రతుకు బ్రతుకున తీయని పాట రేగి
గొంతు గొంతున గానస్రవంతు లురలి
దేశదేశాల తెలుగుల దీప్తి వెలుగ పాడుచు
మెల్లమెల్లగా తెనుగు ప్రొద్దుపొడుపు
ప్రాబాతోత్సనమయ్యె ప్రాగ్దిశ మఫారాజీవ
రాగంశువుల్
శోభారామముగాగ జేసె ప్రకృతిన్
సుతాలచలాలంకృతిన్
భూభాగసమ్ము వసంత గార రస సంపూర్ణంబు గాదోచె
రా! భవ్యాశయ దివ్య దీప్తులమరెన్
త్రైలింగ దేశమ్మునన్!

95.విశ్వశాంతి బాటలు
పలు మతాల భాద్షల పరిమళాల కదంబం
పలురీతుల సంగమం మా భారత కుటుంబం
ఉరికేటి నదులు మన జానపదులు
వికసించే తోటలు వినిపించే పాటలు
వేదఘోషలు బౌద్ధ వాక్కులు
గుభాళీంచి పరచినవి విశ్వశాంతి బాటలు
మానవాళి వికాసమే భారతీయ తత్వం
పలురీతుల సంగమం మా భారత కుటుంబం
సకల కళారామమిదే మానివాసము
అందరినీ ఆదరించు సర్వధమము
ఇలా తలముపై వెలసిన స్నేహదీపము
సమత మమత రూపమే మా దేశము
జనహితమే మా జాతి చల్లని హృదయం
పలురీతుల సంగమం మా భారత కుటుంబం

96.వీరభూమిరా మనది

ఆర్యభూమి సూర్యభూమి వీరభూమి మనది
అంధకారమును గని వెనకడుగు వేయకురా!
సత్యభూబి చిత్త్వభూమి తత్వభూమిరా మనది
రాజసతా మనముల గని ఓజి చెడకురా!
యంత్రభూమి తంత్రభూమి మంత్రభూమిరా మనది
పరమాణువులు పగులుట గని భయము చెందకురా
అన్నభూమి వెన్నభూమి కన్నభూమి మనది
భవ్య భూమిరా! మనది దివ్యభూమిరా!


97.వేద వేదములన్ని తరచి

తెలుగు తల్లికి మంగళం! మా
కల్పవల్లికి మంగళం!
కొలుసు మా యద నిలుచు మా
రాజ్జిమ తల్లికి మంగళం
ప్రాతక్రొత్తల కౌగిలింతల
ప్రసవమగు బంగారుకాంతుల
భావికాల స్వర్గమమరుచు
ఫ్రాఢ ప్రతిమకు మంగళం
నాగరికతను వలచి మెచ్చిన
నాడు నాడులు తరలిచచ్చిన
భోగభాగ్యము లందజూపే
రగ రహితకు మంగళం
వేద వేదములన్ని తరచీ
వార భేదములన్ని మరచీ
స్వాదు ధర్మ పధమ్ముపరచు
విశాలడాలకు మంగళం
నాక మందిన పగటివేళ
నరకమంతటిన కాకురేల
ఏక గతి తెలుగమ్మ నడిపిన
ఏకంతకు మంగళం

98.సంఘ శక్తి

రుక్మాఖీమైత రేయోపనిషది
విపులాం సంస్తుతిం లబ్దపూర్వః
శ్రీ మచ్చీషాద్రి నాధోవచిత విభవ
సంప్రాప్త కళ్యాణ లక్ష్మీ
శ్రీశైలీంద్రస్య శంభోరనితర కృపయా
వర్ధమనో విశా హం
త్రైలింగో దేశ ఏష ప్రవిలతు సదా
సంపదుద్దామకోశః
గోదావర్యాః ప్రవాత ప్రశిధిలవులినీ
క్రీడోమానా అటంతః
కృష్ణాపానీయ బిందు ప్రవిమలతీరు భూ
వాసమా సేవమానాః
తుంగా పాదాని రక్తాః రుచి కతరవమో
భంగ విన్యాస శోభం
మంజీరాం రంజయంతో విజయ మనుగతాః
అంధ్రలోనాః ప్రధంతాం
కలాభింప్ర్యాభిర్నిగమదదవీధిః శ్రుతిచయైః
కవిత్వ ప్రఖ్యాతిభిః లలిత హృదయైర్భుద్ది నిభవైః
ప్రశస్త రాచారైరభి నవవచః ఖ్యాతిభిరిమే
శు విఖ్యాతా ఆంధ్రాః విజయ మధియంతు ప్రతివదం!
సస్యశ్యామల భూమి భిన్సునిపులై దాదశ్యాకైః పర్యతైః
నర్వర్తుప్రసృతైః ప్రమాననిచయైః పక్వైశ్చ నానాఫలైః
స్వచ్చైస్సారితవారిభిః శ్రుతిహితైః శాకుంతమంజువనైః
పుణ్వైః కర్మభిరాచితా చ నతతన్ పుశ్యాంధ్ర భూర్వర్దతాం
ఆంధ్రే పుణ్య ప్రదేశే స్పురతి హి సతతం శ్రీ హరిప్రేమ పాత్రం
దుర్గా శైలీంద్రకన్యా కలయతిక్ నుచిరం భవ్య సౌభాగ్య లక్ష్మిం
భాజంతీ వాచి వాచి శ్రుతివిహిత విధేన్ కారయంతే చ వాణి
ఆంధ్రా సాకల నవత్నీ విభవ మనుగతీః ఆనతే నిత్యనూత్నం
నిశ్ణాతాస్పర్శ శాస్త్రే ప్పునితరమతయో దుర్గమే వేదమార్గే
మృద్వికాపాదరస్యే నిరువమరసికాః కోమలీ కావ్య మార్గే
ప్రత్యత్పన్న ప్రదీకా వ్యవహృతి విషయేప్పు ప్రతీవ ప్రభావా
అంధ్రాః స్వీయే ప్రదేశ్ శుభవిభగవగతాః కీర్తిమాయాం త్వజప్రం
విద్యానాక కుమారో బుధజన వినుతీ మల్లినాధన్న్సుధీంద్రః
అన్నంభట్టో ధ విశ్వప్రదిత బుధవరః శ్రీ జగన్నాధసూరః
నన్నయ్యంతిక్కయజ్వా అధితరకవమో హ్యాంద్రస్ గీర్వాశాశస్తా
సతైర్విభ్రాజితేయం విలసతు సతతం సర్వ పస్యా న్ర్ధభూమి
మదమాతంగ మాదాంబుజికముల సంభావింపన్ గాక నీ
స్స్రమై యెప్పునుగాకః నీ ప్రభ ప్రపంచంగుల్ల సూర్య ప్రభా
సదృశంబై వెలుగిందు గాక జననీ! సర్వాంధ్ర విశ్వంభరాః
శాలివాహన రాజచంద్రుల యేల్చడి నిగ్గుదేరిన పంటనేల యిద్ది
భాళుక్య రాజేంద్ర సమద సానుజ దానదారల దడిసినధరశా యిద్ది
కాకతీయ నృపాల ఖడ్గస్పులింగాళి పరిడవిల్లిన వీర్యసుధ యిద్ది
విద్యానగర రాజవీరుల శౌర్మోష్య సరిగర్వ మణగిన యబ్నని యిద్ది
నేడు జనతగ్రణతంత్రనీతరాల్ల
సోద రాంధ్రులనొక త్రాట నొక్కమాట
నైక్యమున నలరించి రోయబ్న్నలారా
నడూము గట్టును నైక్యసన్నద్దులగుడు
అన్నల్ దమ్ముల్ నేకమి జనని పాదాభ్యర్చనల్ సేయుల్
ళ్ న్నీమంబున నాంధ్రమాతకు నముల్లాసంబు గల్గించు కా
ర్యోన్నత్యంబు దలంచి సత్పధకముల్ ప్రారంభుం జేసి మీ
రన్నల్ దమ్ముల్ నాంధ్ర సోదర నమైక్యంబున్ ప్రసాదింపుడి
ఓ సమాజ పూరుషుండ యాంధ్రోర్విజనులు
నీకు నవయవములె కారె నీరు సంత
సౌష్టవంబును నిల సంఘశక్తి గాదె
యిట్టి తధ్యంబు నాంధ్రుల కెఱుక పఱచి
ప్రగతి సాధింపుమీః ధర్మ పధమునందు
దొరలెను సిద్ది, కాని కడు దూరముగా పరుగెత్తె శ్రీద్ద సం
బరమున సర్వవస్తువులు ప్రక్కన జేరెను కాని మానవుం
ఉరిమురి మానవున్ గపటియై కడూదూరము చేసెః సాంధ్రసో
దర సమతనే క్షమా గుణము దాలిచి యేలు మహాంధ్ర సంస్కృతినే
పరిణతి కాలంబిందియని
ఉరియుచు సోదరుల మాంధ్ర భూమాతకు నే
డరుసమున మ్రొక్కు లిడుచును
పరస్పరము చేయి గలిపి బయనించవలెన్


99.సంస్కార హృదయులు

ఏ దేశమందున్న ఏ రాష్ట్రమందున్న
భారతీయ్యులమన్న భావమ్ము వదలక
ఆంధ్ర సంస్కృతి భువినే అలరింపజేయుడీ!
ఆంధ్రులారా! సుగుణసాంధ్రులై వెలయుడీ!
మానవతావాది మంజుల ద్వాంతుండు
శాక్యముని శిష్యుండు షంఘాభిరాముడు
పండితవ రేణ్యుండు సంఘాభిరాముడు
ఆర్య నాగార్జునుడు ఆంధ్రుల కులపతి
సంఘాభివృద్దికే సాహిత్య మనుమాట
సార్థకము చేసిన సత్కవిశ్రేష్టులు
సంస్కార హృదయులు సదసద్వివేకులు
తిక్కన వేమనలు తెలుగు మేధావులు
పంచేంద్రియంబుల వంచనను బరిమార్చి
సచ్చరిత్రంబున శాంతి మార్గమున నిచ్చు
సంగీత సాధకుని సహృదయ తిలకుని
త్యాగయ్య గని ఆంధ్ర ధన్యురా లయ్యెను
వెంకట రత్నము, వూరేశలింగము
అప్పరాయ మనీషు లాంధ్రులకు గురువులు
ఇదే ఆంధ్ర సంస్కృతి ఇవే తెల్గు వెలుగులు
అంధ్ర సంస్కృతి నిలన్ అలదింపజేయండీ.

100.జాతీయగీతం

జన గణ మన అధినాయక జయహే
భారత భాగ్య విధాతా
పంజాబ సింధు గుజరాత మరాఠా
ద్రావిడ ఉత్కళ వంగా
వింధ్య హిమాచల యమునా గంగా
ఉచ్ఛల జలధి తరంగా
తవ శుభ నామే జాగే
తవ శుభ ఆశిష మాగే
గాహే తవ జయ గాథా
జన గణ మంగళ దాయక జయహే
భారత భాగ్య విధాతా
జయహే జయహే జయహే
జయ జయ జయ జయహే
జయహే


www.GRANTHANIDHI.com

mohan publications price list