MohanPublications Print Books Online store clik Here Devullu.com

శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం_Paidithalli SIRIMANOTSAVAM



ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో ప్రతి ఏటా జరిగే శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం ఓ భక్తి పూర్వక సంప్రదాయం. రెండు రోజుల ఈ ఉత్సవం వేలాది జనం మధ్య ఓ కన్నుల పండుగ.

పశ్చిమాకాశం సిందూరవర్ణం పులుముకుంది. పుడమి తల్లి పులకరించింది. పైడితల్లికి ప్రతీకగా సిరిమాను సిరులు కురిపించేందుకు ముందుకు కదిలింది. జయజయ ధ్వానాలు మిన్నుముట్టాయి. అందరి చూపులు నింగివైపుకే! భక్తిపారవశ్యంలో సిరిమానును తిలకించి బతుకు బంగారం చేసుకోవాలని ఒకటే ఆరాటం. పండుగలకే పండుగ ఉత్తరాంధ్రులకు ‘సిరిమాను పండుగ’.

ఎవరీ పైడితల్లి? ఏమిటీ సిరిమాను పండుగ?
పూసపాటి వంశీయులు, విజయనగరం సంస్థానాధీశులకు ఇలవేల్పు - బెజవాడ కనకదుర్గమ్మ. మడులు, మాన్యాలు ఇతోధికంగా సమర్పించిన భక్తులు వారు. కనకదుర్గమ్మ క టాక్షంతో పూసపాటి వంశంలో జన్మించినదో ఆణిముత్యం. అమ్మపేరునే పైడితల్లి (బంగారు తల్లి) అనేపేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచారు. చిన్నారి పైడితల్లి రాజప్రాసాదంలోని భోగ భాగ్యాలకు దూరంగా ఉంటూనే, కనకదుర్గమ్మను హృదయంలో పదిలపరుచుకుంది. రాజదర్పాన్ని ఏనాడూ దరి చేరనీయలేదు. జనబాహుళ్యంలో మమేకమై అందరి కష్టసుఖాలనూ పంచుకుంది. ప్రజల మన స్సులను దోచుకుంది.

అయినా విధి వక్రించింది. పొరుగున ఉన్న బొబ్బిలి సంస్థానంతో పొరపొచ్చాలు ఏర్పడ్డాయి. అధికార ఆధిపత్యం కోసం విదేశీయులైన ఆంగ్లేయులు, ఫ్రెంచి వారి కుతంత్రాలకు రెండు సంస్థానాల అధీశులూ ప్రభావితమై ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్నారు. మాటలు పెరిగి పోరుకు సిద్ధమయ్యారు. పోరువద్దని చిట్టితల్లి మొరపెట్టింది. కాదన్నాడు అన్న విజయ రామరాజు! కదనానికి కదిలాడు. ఫలితం భీభత్సం. రెండు సంస్థానాల అధీశులు విదేశీయుల కుతంత్రాలకు కన్నులు మూశారు. పరిస్థితికి తల్లడిల్లిన పైడితల్లి కోట వెనుక భాగాన ఉన్న పెద్ద చెరువులో తనువు చాలించింది. ప్రజల్లో హహాకారాలు. పైడితల్లి కనుమరుగవడంతో కకావికలమయ్యారు.
కానీ పైడితల్లి క్షేమదేవతగా కదిలింది.

విజయరామరాజు సన్నిహితుడైన పతివాడ అప్పలనాయుడుకి కలలో కనిపించి, తన ఉనికిని చెప్పింది. ఆ ప్రాంత ప్రజలకు ‘ఇలవేల్పు’గా అవతరిస్తానంది. జలదేవతగా ఉద్భవించింది. చెరువు గర్భం నుంచి బంగారు బొమ్మను వెలికి తీసి గుడి కట్టించాడు. ‘వనంగుడి’ గా ప్రాచుర్యం పొందిన ఈ గుడిలో అవివాహితయైున పైడితల్లికి క్రీ. శ. 1758 నుంచి ‘పేరంటాలు’గా ఉత్సవాలు జరుగుతున్నాయి. విజయ నగరం విస్తరించడంతో, నడిబొడ్డున ‘మూడు లాంతరు’ల ప్రాంతంలో మరొక ఆలయం నిర్మించి, సంవత్సరంలో ఆరుమాసాల పాటు పైడితల్లికి ఇక్కడ అన్ని ప్రధాన ఉత్సవాలూ నిర్వహిస్తున్నారు. ‘చదురుగుడి’ గా ప్రశస్తి పొందిన ఇక్కడ నిర్వహించే ఉత్సవాలలో ‘సిరిమాను ఉత్సవం’ అత్యంత ప్రధాన ఉత్సవం.

సిరిమాను ఉత్సవం ఎప్పుడు?
సుమారు మూడు శతాబ్దాలుగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవానికి ధర్మశాస్త్రాలు ఆలంబనగా ఉన్నాయి. శరదృతువులో చంద్రుడు షోడశ కళాప్రపూర్ణుడు. చంద్రుడు, జగన్మాత ఒక్కటేనంటారు. శరన్నవరాత్రులు శక్తి పూజలకు విశిష్టమైనవి. పైడితల్లి కనకదుర్గ ప్రసాదం. బెజవాడ కనకదుర్గమ్మను శరన్నవరాత్రులలో ఆరాధించి, విజయదశమి నాడు అపరాజితగా, రాజరాజేశ్వరిగా ఆరాధించటం అందరికీ తెలిసిందే. ‘విజయదశమి’లో ‘విజయ’ అంటే అమ్మవారే! ఆమెకు ఇష్టమైన వారం మంగళవారం. జగన్మాత మంగళదేవత. పైడితల్లి కూడా మంగళదేవత. అందువల్ల విజయదశమి గడచిన తరువాత తొలి మంగళవారం పైడితల్లికి పండుగ చేయాలన్నది నిర్ణయం.

రెండు రోజుల ఉత్సవం
పైడితల్లి పండుగ రెండు రోజులు జరుగుతుంది. ముందురోజు ‘తోలేళ్లు’. ప్రజలంతా మ్రొక్కులు తీర్చుకుంటారు. చుట్టాలు పక్కాలతో, బాజా భజంత్రీలతో ఘటాలను శిరస్సులపై ఉంచుకొని , గుంపులు గుంపులుగా ప్రతి వీధి, వాడల నుంచి పైడితల్లిని దర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. రోజంతా పండుగ వాతావరణమే. పగలు రాత్రి అనే తేడా లేక అంతటా సందడే సందడి. రాత్రి తెల్లవార్లూ సాంస్కృతిక కార్యక్రమాలు. ఆలయంలో వేద ఘోషలు. బయట నాటకాలు. సంగీత విభావరులు. ఎటుచూసినా ఎక్కడ చూసినా ఒకటే సందడి.

మరునాడు ‘సిరిమాను ఉత్సవం’. సిరిమానును ‘‘చింతచెట్టు’’ మానుతో రూపొందిస్తారు. చింత చెట్టు చింతలు తీర్చే చెట్టు. ప్రధాన పూజారికి తల్లి కలలో కనిపించి చింతచెట్టు ఉనికి తెలియజేస్తుంది. అలా ఆ చెట్టుకు పూజలు చేసి పండగనాటికి తెచ్చి సిద్ధం చేస్తారు. పైడితల్లికి ప్రతీకగా ప్రధాన పూజారి ఆ సిరిమానును అధిష్ఠించి సూర్యాస్తమయ సమయంలో ఆలయం నుంచి అమ్మవారి పుట్టిల్లయిన రాజప్రాసాదానికి ముమ్మారు వెళతారు. రోడ్డు కిరువైపులా పైడితల్లి రూపంలో వస్తున్న సిరిమానును తిలకించడానికి వచ్చిన లక్షలాది జనాన్ని అనుగ్రహిస్తూ ఆ కోలాహలం ముందుకు సాగుతుంది. రాజ ప్రాసాద ప్రాంగణంలో పుట్టింటి ఆడపడచును సంప్రదాయ సిద్ధంగా సత్కరించడం జరుగుతుంది.

ధర్మశాస్త్రాల్లో మూడు సంఖ్యకు ప్రాముఖ్యం ఉంది. త్రిమూర్తులు, త్రిశక్తులు, ముల్లోకాలు, మూడు కాలాలు, మూడు గుణాలు, త్రిపుటులు - ఇలా ఎన్నో ఉన్నాయి. మన భావనలోనే రహస్యమంతా అంతర్లీనమై ఉంది. ఆ భావనయే రసం. రసం అంటే పరమాత్మ. పరమాత్మ ప్రతీక ఒక దీపిక. ఆ దీపికయే మనం పూజించే మంగళదేవత. కన్నతల్లి, కల్పవల్లి, పైడితల్లి.

తల్లికి పిల్లలపై తాపత్రయం ఎక్కువ. ఏ అమ్మకైనా అంతే! అందుకే బంగారుతల్లి పైడితల్లికి బెంగ మరీ ఎక్కువ. తన సంతానాన్ని కన్నులారా చూడాలనీ, ఆప్యాయంగా పలుకరించాలనీ, వారి కన్నుల్లో ఆనందాన్ని వీక్షించాలనీ, అనుగ్రహించాలనీ సంవత్సరానికొకమారు ‘‘సిరిమాను దేవత’’గా ముందుకొస్తుంది. ఆ తల్లి చూపులు వెలకట్టలేనివి. ‘‘ పైడితల్లిని నిరంతరం తలుస్తూ, కొలుస్తూ ఉండడం ఉత్తరాంధ్ర ప్రాంతంలో కొన్ని వందల ఏళ్లుగా ఉన్న విశ్వాసం!
                                                                 - ఏ. సీతారామారావు

శుభాశుభ ఫలాల నవగ్రహాలు_Navagrahalu


అయ్యప్ప దీక్ష_AyyappaDiksha





     వివిధ రకాల దీక్ష సంప్రదాయాల గురించి ఇందులో చూడవచ్చు. అయ్యప్ప మాల అందరికీ తెలిసిందే... అయితే భవానీ మాల, గోవింద మాల, సాయి దీక్ష వంటి వాటిని కూడా ఇందులో చేర్చాను. ఎవరికి వీలైన దీక్ష వారు చేపట్టి వాటిని ఆచరించవచ్చు. అందుకు అనుగుణంగా ఉండాలనే ఇన్ని వివరాలను ఇచ్చాను. 






కొలిచిన వారికి కనక వర్షం_VijayaDasami



























అన్నదాతా సుఖీభవ_Annadatha Sukhevva


అన్నదాతా సుఖీభవ
భగవంతుడు ప్రసాదించిన భాగవత రత్నాకరములో అన్నము విశిష్టత చతుర్థ స్కంధములో చక్కగా తెలుపబడి నది. మైత్రేయుడు విదురునికి ధృవ్ఞని విషయాలను వివరిస్తూ విదురా! ధృవ్ఞడు వనములకు వెళ్లిన పిదప వారి కుమారుడు ఉత్కళుడు తన తండ్రి సార్వభౌమవైభవాన్ని, రాజ్యసింహాసనమును, రాజ్యభారాన్ని స్వీకరించలేదు. వైరాగ్యభావముతో పుట్టుకనుండియు శాంతిచిత్తుడును-ఆసక్తిరహితుడును, సమదర్శిగా నుండి సమస్త లోకములను తన ఆత్మయందును తన ఆత్మను సమస్తలోకములందును చూచినాడు.

శ్లోI సజన్మనో పశాన్తాత్మా నిఃసంగఃసమదర్శనంః                    దదర్శలోకేవితతం ఆత్మానలోకమాత్మని మరొక

శ్లోకం ద్వారా ఇలా తెలుపుతూ…

శ్లో ఆత్మానం బ్రహ్మనిర్వాణం ప్రత్యస్తమిత విగ్రహం అవబోధరసైకాత్మ్యం ఆనందమనుసంతతం విదురా! ఉత్కళుడు తన అంతఃకరణమునందలి వాసనా రూపమైన మాలిన్యమును అఖండయోగాగ్నిచే భస్మము చేసినాడు. తన ఆత్మను విశుద్ధ రస స్వరూపముగను, ఆనందమయముగను సర్వత్ర వ్యాపించిన దానినిగను చూచి నాడు. ఆత్మకంటె వేరుగా దేనినీ చూచేవాడు కాదు. అతని రాజ్యంలో కులవృద్ధులు, మంత్రులు అతనిని జడుడుగా, ఉన్మత్తునిగా భావించారు.

రాజ్యం అరాచకమౌతుందని గ్రహించారు. వెంటనే అతని చిన్నతమ్ముడును, భ్రమీ పుత్రు డును అగు వత్సరుని రాజుగా చేశారు. ఆ వంశ పరంపరలోని అంగుడను రాజునకు సునీత అను పత్ని వలన క్రూరుడైన వేనుడు జన్మించినాడు. అతని దుర్మార్గపు ప్రవర్తనకు ఖిన్నుడై అంగుడునగరము విడిచివెళ్లినాడు. మునులు అది గాంచి వేనుని దుస్స్వభావమునకు కుపితులైనారు. అతనికి శాపమిచ్చినారు. మునులశాపం అమోఘం. వేనుడు మరణించిన పిదప రాజ్యాన్ని పాలించే రాజు ఎవరునూ లేరు. రాజ్యంలో దొంగలు ప్రబలినారు. ప్రజల బాధలు ఎక్కువైనాయి.

అది చూచియును వేనుని కుడిభుజమును మధించినారు. దాని నుండి నారాయణుని అంశావతార మున్ను, ఆది సామాట్ట్రును అయిన పృథు చక్రవర్తి ప్రత్యక్షమై నాడు. విప్రులు పృథువ్ఞనకు రాజ్యాభిషేకం చేసి ప్రజలకు రక్ష కునిగా ప్రకటించారు. ఆ కాలంలో భూమిలో పంటలు క్షీణిం పగా ప్రజలు అన్నహీనమై, ఆకలితో అలమటించి శుష్కించిపో సాగినారు. పృథురాజుకు ఆకలిబాధను వివరింపగా ప్రజల ఆక్రందన విన్న రాజు ఖిన్ను డైనాడు. తీవ్రమైన విచారం సలిపిన పిదప ఒక ఆలోచన చేసినాడు రాజు. భూమి స్వయముగనే అన్న, ఓషధులను తన లోపల దాచియున్న దని నిశ్చయించుకుని వెంటనే తన ధనుస్సునెత్తి, క్రుద్ధుడై భూమి వైపు గురిబెట్టి బాణమును సంధిం చినాడు. భూమి కంపించి వణకసాగినది.

భయపడి భూమాత గోరూపము ధరించి పరుగిడసాగింది. రాజు వెంటాడినాడు. రాజు ఆగ్ర హమును గ్రహించి భూమి రాజును స్తుతించి హృదయమును విచారణ చేసుకుని ఇలా అన్నది. శ్లోII సంనియచ్ఛాభిభోమన్యుం నిబోధశ్రావితంచమే సర్వతః సారమాదత్తే యధామధుకరోబుధఃII ప్రభూ! మీరు కోపమును చల్లార్చుకుని నా ప్రార్థననాలకింపుడు. బుద్ధిమంతులైన వారు తుమ్మెద వలె అన్ని చోట్ల నుండి సారమును గ్రహించుదురు. సమస్త ప్రాణులకును అభీష్టమైనదియును, బలమును వృద్ధి పఱచునదియునగు అన్నము మీకు కావలసినచో నాకు మీకు వెంటనే యోగ్యమగు దూడను, పాత్రను, పాలు పితుకువానిని తెచ్చుకొను ఏర్పాటుచేయుడు. ఆ దూడమీద ప్రేమచే నేను క్షీరరూపమున నీకు సమస్త అభీష్ట పదార్థములను ఇస్తాను అన్నది భూదేవి. భూమి తెలిపిన హితవచనములను విన్నాడు. ఆమె మనవికి అంగీకరించి పృధ్డువు మనువును దూడగా చేసుకుని స్వయముగ సమస్త ధాన్యములను పితికినాడు.

పృథుచక్రవర్తి ఆచరించిన యజ్ఞములచే చాలా సంతసించి యజ్ఞభోక్తయు, యజ్ఞేశ్వరుడును అగు విష్ణు భగవానుడు ఇంద్రునితో కలిపి రాజు వద్దకు వచ్చాడు. రాజా! రూను అశ్వమేథ యాగములు పూర్తి చేయవలెనను మీ సంకల్పమునకు ఇంద్రుడు విఘ్నము కలుగజేసెను. ఇపుడు వారు మిమ్ములను క్షమాపణ కోరుచున్నారు. మీరు క్షమించమని కోరినాడు. ఇంకనూ భగవంతుడు రాజునుద్దేశించి శ్లోII సుధియఃసాధవోలోకే నరదేవనరోత్తమాః నాభిద్రుహ్యన్తి భూతేభ్యో యర్హినాత్మాకలేవరమ్‌II అంటూ రాజా! సాధువులు, సద్బుద్ధి సంపన్నులు అగు శ్రేష్టమానవులు ఇతరులకు ద్రోహం చేయరు. ఈ శరీరము ఆత్మకాదు కావ్ఞన మీ వంటివారు కూడా నా మాయచే మోహితులైనచో, ఇక బహుకాలమాచరింపబడిన జ్ఞానుల సేవచే కేవలం శ్రమయే మిగిలినదగును. జ్ఞానులైనవారు ఈ శరీరమును అవిద్యా, వాసనా, కర్మముల ఫలితమని తలచి దీనియందు ఆసక్తులు కాకుందురు.

మమత్వం కల్గియుండరు. అంటూ ఆత్మతత్వం బోధగావించి రాజా! మీ ఉన్నతగుణములు, స్వభావమును నన్ను తృప్తిపరచినవి. మీకిష్టమైన వరము కోరడు. సమత్వము గలవారి హృద యంలో నేను వసిస్తాను అన్నాడు భగవంతుడు. పృథువ్ఞ స్తోత్రముచేయగా ఆజ్ఞను పాలంచుట ధర్మమని ఎరింగ నంతనే భగవంతుడు అంతర్థానమైనాడు. రాజు పిదప యజ్ఞదీక్ష చేపట్టి దీక్షచేయగా దేవతలు బ్రహ్మర్షులు, రాజ ర్షులుగా వారిని గౌరవించి వారిని స్తోత్రము చేసి భూదేవి నుండి వివిధ ధ్యానములను స్వీకరించి ప్రజలను ఆకలి బాధ నుండి విముక్తులను గావించినాడు. ప్రజలు రాజు ఉదారతను, సద్గుణములను స్తుతించారు. రాజ ధర్మాన్ని ప్రశంసించి సంతృప్తులై అన్నం పరబ్రహ్మ స్వరూపంగా భావించి అన్నదాతా సుఖీభవ అని పృధుమహారాజును కొనిచాడుట రాజు ప్రజల మధ్య వాత్సల్యాన్ని తెలుపుతుంది. జీవ్ఞలకు అన్నపానాదులే కదా ప్రధానం. ”నమో భగవతే వాసుదేవాయ

                                                      – పి.వి. సీతారామమూర్తి

Bathukamma Song 2017 | Bangaru Bathukamma | Saddula Bathukamma



పూజలో సందేహం వద్దు..!_No doubt in the puja ..!



పూజలో సందేహం వద్దు..!
No doubt in the puja ..!

పూజ చేసేటప్పుడు మడిబట్ట కట్టుకోవడం, పూజలో చేసేవన్నీ ఒక పద్ధతి ప్రకారం పాటించడం లాంటివన్నీ ఆచార సంప్రదాయాల్లో భాగాలే. అయితే ఈ ఆచార సంప్రదాయాల కన్నా కూడా భగవంతునిపై చిత్తం ఏమేరకు ఉందనేదే ముఖ్యం. ఇలాంటి కర్మలు ఆచారాల్లో భాగాలే. సంప్రదాయాలను పాటించాల్సిందే. కాని ఇవన్నీ ఈ శరీరానికి సంబంధించినవి. ఈ శరీరంలో జీవుడు ఉన్నందువల్ల ఇలాంటి సాధారణ కర్మలను చేస్తూ ఉండాలి. అంతేగాని మనం చేసే కర్మల్లో అనుమానాలు వ్యక్తం చేస్తూ, అసలైన ధ్యానం దెబ్బతినకూడదు. కొంతమంది సంప్రదాయబద్ధంగానే పూజ చేస్తుంటారు. ధ్యాస మాత్రం ఎటో ఉంటుంది. ఇలాంటి వాళ్లను కర్మలంపటులు అంటారు. ఇలా భగవంతునిపై ధ్యాస లేకుండా నామమాత్రంగా చేయడం వల్ల ఆయా పూజలు, కర్మల వల్ల కలిగే ఫలం దక్కదు. అంతేకాదు. జీవుడికి యమయాతన కూడా తప్పదని యమధర్మరాజు చెప్పారు. భాగవతంలో భాగమైన అజామిలోపాఖ్యానంలో యమధర్మరాజు ఈ విషయాన్ని ప్రస్తావిస్తాడు. నరకంలోకి ఎలాంటివాళ్లను ముందుగా తీసుకురావాలో తన భటులతో చెప్తూ వాళ్ల లక్షణాల గురించి వివరించే సందర్భంలో కర్మలంపటుల ప్రస్తావన ఉంటుంది.


యాంత్రికంగా చేసే పూజలు, నమస్కారాల వల్ల ఫలితం ఉండదు. అందుకే ఎవరైనా సరే ముందుగా తమ మనసును భగవంతుని వైపు ఎన్నిసార్లు ఎలా మళ్లించుకోగలమా అనే ఆలోచించాలి. శరీరంలో జీవుడు ఉన్నందువల్ల సాధారణ కర్మలు నిర్వర్తించాల్సి ఉంటుంది. నిజానికి మనసులో చేసే భగవన్నామస్మరణే అన్నింటి కన్నా ముఖ్యమైంది. సాధారణ కర్మలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ అసలైన భగవన్నామ స్మరణ మరువడం తగదంటాడు యమధర్మరాజు.

మడి, ఆచారం వంటివి పాటించాలని మన పెద్దలు చెప్తారు. నిజమే. కాని కొంతమంది ఈ మడి, ఆచారం అనే ప్రవాహంలో కొట్టుమిట్టాడుతుంటారు. కానీ నిశ్చలమైన మనసుతో భగవంతుడ్ని ధ్యానించరు. ఉదాహరణకి పూజలో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న పసిపిల్లవాడు వచ్చి మడిబట్టలు ముట్టుకున్నారనుకోండి. ఇక రణరంగమే. పూజ చేస్తున్నామనే విషయాన్ని కూడా మరిచిపోయి ఆ పసివాళ్లకు పాపం అంటుతుందేమోనని ఆలోచిస్తూ ఉంటారు. మనసు భగవంతునిపై ఉండదు. మడి బట్టలు ముట్టుకున్న పిల్లవాడి మీదనే ఉంటుంది. అదేవిధంగా దీపారాధన కోసం వత్తులు వేస్తున్నప్పుడు ఎన్ని వత్తులు వేయాలి.. నేను చేసేది సరైనదేనా.. ఏ నూనె వాడాలి.. ఇలా ఎన్నో రకాల సందేహాలు. ఈ ఆలోచనల్లో మునిగితేలి భగవంతునికి దూరమవుతారు. యాంత్రికంగా పూజ చేస్తుంటారే గానీ మనసు మాత్రం భగవంతునిపై లగ్నం కాదు.

ఏం చేయాలి?
పరమాత్మను అర్చించేటప్పుడు మనసు ఆయన మీద తప్ప మరే ఇతర అంశాలపై ఉండకూడదు. కనీసం అందుకు ప్రయత్నించాలి. ఎన్ని అనుమానాలున్నా వదిలేయాలి. పసిపిల్లలు దేవుడితో సమానం. ఉదాహరణకు పసిపిల్లవాడు మడి బట్టలు ముట్టుకున్నప్పుడు అతడినే భగవంతుడిగా భావించాలి. నేను కట్టుకోబోయే ముందే నా చీర లేదా పంచె ముట్టుకుని నన్ను ఆశీర్వదించావా తండ్రీ! అంటూ చేతులు జోడించాలి. స్వామికి నైవేద్యం పెట్టకముందే పాపాయి ఎంగిలి చేసిందనుకోండి. అప్పుడు కోపం తెచ్చుకోకుండా భగవతుని అనుగ్రహంలాగే భావించాలి. స్వామీ! నీవే ఈ రూపంలో వచ్చి, నన్ను అనుగ్రహించావా! ఈ నైవేద్యాన్ని తీసుకున్నావా! నాపై నీకెంత కరుణ! అనుకుంటూ స్వామికి నమస్కరించుకోవాలి. ఈ రకమైన ఆలోచనా ధోరణి భగవంతునివైపు మన ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ప్రతి మనిషిలోనూ దేవుడున్నాడనే స్పృహను కలిగిస్తుంది. పూజాది కార్యక్రమాల్లో సందేహాలు వచ్చినప్పుడు, నా దగ్గర ఉన్నవన్నీ ఆయన ఇచ్చినవే. ఇక ఏదైతేనేమి! ఇంట్లో ఉన్నది పెడుతున్నా స్వామీ! అని మనసులో గట్టిగా నమ్మి, మనస్ఫూర్తిగా ఆయనకు నమస్కరిస్తే మనం ఊహించని ఫలితాలను ఆయన కలుగజేస్తాడు. 
                                                            --వేదశ్రుతి వెంకట్రామన్

దశకంఠుడు రావణుడు_Ravana





శ్రీరాముని గొప్పతనం గురించి అందరికీ తెలుసు.. ప్రతినాయకుడైన రావణుడి గురించి గొప్పగా వర్ణించగలమా? రావణుని రూపం అత్యద్భుతం.. ధైర్యం నిరుపమానం.. తేజస్సు అసదృశం.. రాక్షస రాజు సర్వ లక్షణ శోభితుడు.. అధర్మానికి ఒడిగట్టకపోతే సురలోకానికి సైతం ప్రభువయ్యేవాడు.. అయితే రావణుని శివభక్తి అనుపమానం.. ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ఘోర తపస్సు చేశాడు.. ఆ మహాదేవుడు ఎంతకూ కరుగపోయేసరికి శిరసు ఖండించుకొని స్వామికి సమర్పించుకున్నాడు. ఖండించుకున్న స్థానంలో మరొక శిరస్సు ఉద్భవించేది! ఇలా పదిసార్లు జరిగింది.. అందుకే రావణుడు దశకంఠుడయ్యాడు.. ఈ పది తలలు మనలోని గుణాలకు ప్రతీకలంటారు..మరి ఆ గుణాలేంటో.. వాటికి రావణుడి జీవితం ఎలా అన్వయమైందో చదువండి..


మోహం
చెడు ఆలోచనలైన.. కామ, క్రోధ, మద మాత్సర్యం వంటిదే అసూయలోంచి పుట్టేదే మోహం. ఈ గుణాలన్నీ రావణుడిలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే మోహ స్వరూపంగా రావణుడిని 
పోలుస్తారు. ఈ గుణం పాళ్లు ఎక్కువగా ఉండడంతోనే అతని వినాశనం జరిగింది. 

కామం
ఒకరి భావాలను నియంత్రించకూడదు. ఒకరి మీద అధికారం చెలాయించకూడదు. తెలివిని మాత్రమే అంచనా వేసి వారి ప్రాముఖ్యాన్ని గురించి నొక్కి చెప్పడం హైందవ సంప్రదాయం ప్రకారం తప్పుగా పరిగణిస్తారు. కానీ, రావణుడు తనను తాను నాశనం చేసుకోవడానికి మరొక వ్యక్తి భార్యను అపహరించాడు. అక్కడ ఒకరి భావాలను నియత్రించాడు.

క్రోధం
తన కోపమే తనకు శత్రువు అని పెద్దలు ఊరికే అనలేదు. రావణుడి విషయంలో కూడా ఈ సామెత వర్తిస్తుంది. రావణుడు తమ్ముడు విభీషణుడిపై కోపంతో రాజ్య బహిష్కరణ విధిస్తాడు. దాంతో అతనే శత్రువుగా మారి లంక వినాశనం, రావణుడి మరణానికి కారణమయ్యాడు.

అహంభావం
కొన్ని కోణాల్లో చూస్తే రావణుడు అహంభావి అని అర్థమవుతుంది. దానికి ఒక ఉదాహరణ.. రావణుడు శివుడి కోసం తపస్సు చేస్తాడు. కానీ ఆ దేవుడు కరుణించకపోయేసరికి ఆ కైలాస పర్వతాన్నే పెకిలించి వేస్తాడు. తను అనుకున్నడంటే ఆ సమయంలో అన్ని జరిగిపోవాలనుకునేవాడే రావణుడు. అంతటి అహంభావం అతనిది.

బుద్ధి రాహిత్యం
గొప్ప చక్రవర్తి మహాబలి ఒక మాట చెబుతాడు రావణుడి గురించి. పది భావోద్వేగాల్లో తొమ్మిది మాత్రమే ఆయనకు వర్తిస్తాయి. ఒక్క తెలివి మాత్రం ఆయనకు వర్తించదు. బుద్ధిబలంతో అన్ని పనులు చేసుకోగలం. ఒకవేళ ఆ ఒక్కటి ఉండి ఉంటే ఆయన చరితార్థుడు అయ్యేవాడన్నాడు ఆ చక్రవర్తి.

జ్ఞానం వృథా
రావణుడు గొప్ప వైదిక పండితుడు. అతని జన్మ ద్వారా, వేద జ్ఞానం ద్వారా అతడు బ్రహ్మజ్ఞానిగా పరిగణించబడ్డాడు. ఆయన సంస్కృత పండితుడు. రావణుడు ఎన్నో రచనలు చేశాడు. మంచి ఆయుర్వేద వైద్యుడు. కాకపోతే ఆ జ్ఞానాన్ని మంచి కోసం కాకుండా అన్యాయమైన ఆలోచనలకు ఉపయోగించాడు. తెలివిని మంచి కోసం ఉపయోగిస్తే రావణుడు మంచి పరిపాలకుడయ్యేవాడు.

అసూయ
ఒక వ్యక్తి నుంచి దీవెన పొందడం అంత సులువు కాదు. ఇతరుల మంచి కోరినప్పుడు మాత్రమే ఆ దీవెనలు అందుతాయి. కానీ రావణుడు ఎక్కడా ఎవరి మంచీ కోరలేదు. అసూయ, ద్వేషాలతో రగిలిపోయేవాడు. అందుకే ఆయన వినాశనం తప్పలేదు.

రాక్షసమాయ
రావణుడు ఆలోచనా పరుడే! ఆ ఆలోచనలతోనే మూడు లోకాలకు అధిపతి అయ్యాడు. తన నిగూఢమైన ఆలోచనలతో రావణుడు ఈ లోకాలను స్వాధీనం చేసుకోగలిగాడు. మానవులను తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోగలిగాడు. అలాగే రాక్షసగణాన్ని తన ఆలోచనలతో కట్టిపడేసి రాక్షసాధిపతిగా చలామణి కాగలిగాడు.

లోభం
మనిషికి ఆశ ఉండొచ్చు. అత్యాశ ఉండకూడదంటారు. కానీ రావణుడికి ఈ గుణం కూడా ఎక్కువే. వాస్తవానికి లంకా నగరం చాలా చిన్నది. రావణుడు ఇతర రాజ్యాల నుంచి కొల్లగొట్టి తన నగరాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించుకున్నాడు. వారి ఏడుపే ఆయనకు తగిలి ఉండొచ్చు.

పాపాల ఫలితం
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని పెద్దలు చెబుతారు. గర్వం మన బుద్ధిని చిన్నగా చేస్తుంది. అది అత్యంత ప్రమాదకరం. తెలియకుండా అది ఒక ఉచ్చులా మారి మనల్నే నాశనం చేస్తుంది. దేవుడి వరంతో మరణం లేదని విర్రవీగిన రావణుడు ఎంత భక్తుడైనా అతని పాపం అతన్ని వెంటాడకుండా ఉండలేదు కదా!

మరో అర్థం..
రావణుడి పది తలలకు మరో అర్థం కూడా ఉందంటున్నది శాస్త్రం. దాని ప్రకారం ఆరు శాస్ర్తాలు, నాలుగు వేదాలకు గుర్తుగా ఆ పది తలలు ఉన్నాయని పండితులు చెబుతారు. ఇంతకీ అవేమిటంటే..

-సాంఖ్యాక శాస్త్రం 
-యోగశాస్త్రం
-న్యాయశాస్త్రం 
-వైశాశిక శాస్త్రం
-పూర్వమీమాంస 
- ఉత్తర మీమాంస
-రుగ్వేదం
- యజుర్వేదం 
-సామవేదం 
- అథర్వణ వేదం














పొరపాటున మంగళ సుత్రాలు పెరిగిపోతే (తెగిపోతే) ఏమి చెయ్యాలంటే..?-MangalaSutram



మీకు తెలుసా?

అగ్రతాంబూలాన్ని సమర్పించారు. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినపుడు అది సంకల్పబలం చేతనే విజయవంతం అవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేము. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేది రక్షాబంధన సూత్రం. ఆ సంకల్ప సూత్రానికి ప్రతీకే సూత్రావతీ దేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు, కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించే మాత జయదేవి. ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికే విజయం సిద్ధిస్తుంది. సూత్రవతీదేవి, జయదేవి అనేవారిద్దరూ విష్ణుసైన్యానికి అధిపతి అయిన విష్వక్సేనుని భార్యలు. 

    మంగళసూత్రాలకు పిన్నీసులు తదితరాలు పెట్టకూడదు ∙మంగళసూత్రం ఎప్పుడు హృదయం కింద వరకు ఉండాలి ∙మంగళ సూత్రాలకి పగడం, ముత్యం, నల్లపూసలు ఉండాలి.


పొరపాటున మంగళ సుత్రాలు
 పెరిగిపోతే (తెగిపోతే) 
ఏమి చెయ్యాలంటే..?
వెంటనే 5 వరసల దారం తీసుకుని దానికి పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని దానిని ఆడపడుచు లేదా భర్త చేత కట్టించుకోవాలి. వారు అందుబాటులో లేకపోతే తమకు తామే వేసుకోవాలి. మంచి రోజు చూసి మధ్యాన్నం 12 గంటల లోపు బంగారు తాళిని వేసుకోవాలి.

తాళి బొట్టు... 
గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు
భార్య మెడలో మంగళసూత్రం, నుదుటి సింధూరం భర్త ఆయురారోగ్యాలకు బాసటగా నిలుస్తుంది. అలాగే వివిధ రకాల దుష్ట శక్తుల నుండి రక్షిస్తుంది. అయితే మంగళసూత్రాల విషయంలో స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే ఆ ఇంట్లో సుమంగళి యోగం సిద్ధిస్తుంది. ప్రతి శుక్ర, మంగళవారాలలో అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపుని మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఐదవతనాన్ని ఇచ్చే పార్వతీ దేవి కటాక్షిస్తుంది.

శ్రీనివాస కల్యాణం_SrinivasaKalyanam



శ్రీ వేంకటేశ్వర వైభవం

ద్వాపర యుగం చివరి రోజుల్లో ధర్మం అడుగంటింది. అధర్మం పెచ్చుమీరింది. లోకం అంతటా అశాంతి, అలజడి, హింస ఆవరించాయి. ప్రజల్లో మాంసభక్షణ పెరిగింది. మద్యపానం నిత్యకృత్యంగా మారింది. దుర్భర పరిస్థితుల్లో లోకం అల్లాడసాగింది. కలియుగంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం భగవంతుడు అవతరించాల్సిన సమయం ఆసన్నమైంది. మానవాళి శ్రేయస్సు కోసం యజ్ఞం చేయాలని యోగులు, మునిపుంగవులు, మహర్షులు, దేవతలు సంకల్పించారు. అయితే, యజ్ఞఫలాన్ని ఎవరికి ధారపోయాలనే ధర్మసందేహం వారిలో కలిగింది. ముందుగా త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు గొప్పో, ఎవరు ఉత్తమోత్తముడో తేల్చుకున్న తర్వాతే వారికి ఆ యజ్ఞఫలాన్ని ధారపోయాలని నిర్ణయించారు. లోక కల్యాణం కోసం చేపడుతున్న ఈ మహత్కార్యాన్ని నిర్వహించాల్సిందిగా భృగు మహర్షిని కోరారు దేవతలు. పరమ భాగవతోత్తముడైన భృగు మహర్షి దేవతల కోరికను మన్నించాడు.

‘మహా మహిమాన్వితులైన త్రిమూర్తులను పరీక్షించి, వారిలో ఎవరు సర్వశక్తి సత్వగుణ సంపన్నులో, జగత్కల్యాణ కారకులెవరో తేల్చి చెప్పడం దుస్సాధ్యమైన పని. నా ప్రయత్నంలో భవిష్యత్తులో జరగబోయే లోకకల్యాణం గోచరిస్తోంది. ఈ మహత్కార్యంలో నేను నావంతు పాత్ర పోషించడం సుకృతమే కదా!’ అని తలపోస్తూ నడుస్తున్నంతలోనే సత్యలోకం చేరుకున్నాడు భృగుమహర్షి. సత్యలోకంలో ఆయన అడుగుపెట్టే సమయానికి సువిశాల దివ్య సభా భవనంలో సరస్వతీ సమేతుడై కొలువుదీరిన బ్రహ్మ తన చతుర్ముఖాలతో నాలుగు వేదాలనూ వల్లిస్తున్నాడు. మరోవైపు తన మనో సంకల్పంతోనే సకల చరాచర జగత్తునూ సృష్టిస్తూ ఉన్నాడు.

సరస్వతీదేవి వీణ మోగిస్తోంది. భృగు మహర్షి వినమ్రుడై బ్రహ్మకి సాష్టాంగ ప్రణామం చేశాడు. స్తోత్రగానంతో కీర్తించాడు. బ్రహ్మ ఆయనను గమనించలేదు. ఆయన ప్రార్థనను ఆలకించలేదు. కనీసం కన్నెత్తి చూడలేదు. ఎప్పటికైనా బ్రహ్మ తనను చూడకపోతాడా అనే ఉద్దేశంతో భృగుమహర్షి స్తోత్రాలను కొనసాగిస్తూ వచ్చాడు. ఎంతకీ బ్రహ్మ తనను పలకరించకపోవడంతో భృగు మహర్షికి సహనం నశించింది. ఉద్దేశపూర్వకంగానే బ్రహ్మదేవుడు పలకడం లేదని, ఇది తనకు తీరని అవమానమని భావించాడు. ఆగ్రహంతో ఊగిపోయాడు. ‘ఎంతటి సృష్టికర్త అయినా ఈ బ్రహ్మదేవుడు రజోగుణంతో నిండి ఉన్నాడు. ఇతడిలో సత్వగుణం లేశమైనా లేదే! ఇతడు ఇక లోకానికి మేలేమి చేయగలడు? దేవతలలో సర్వోన్నత స్థానం పొందడానికి, మహర్షులు సమర్పించే యజ్ఞఫలాన్ని అందుకోవడానికి ఇతడు అర్హుడు కాదు’ అని తలపోసి, ‘బ్రహ్మకి భూలోకంలో ఆరాధనలు, పూజలు లేకుండుగాక’ అని శపించి, అక్కడి నుంచి కైలాస మార్గం పట్టాడు భృగు మహర్షి.

కైలాస దర్శనం
సత్యలోకంలో బ్రహ్మ తనకు చేసిన అవమానానికి అశాంతితో రగిలిపోతూనే కైలాసం వైపు పయనం సాగించాడు భృగు మహర్షి. కైలాసం ముంగిట అడుగుపెడుతూనే ద్వారపాలకుడైన నందీశ్వరుడు ఆయనను అడ్డగించాడు. పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ఉన్నారని, ఎవరూ లోనికి ప్రవేశించరాదని చెప్పాడు. అసలే కోపంతో ఉన్న భృగు మహర్షికి నందీశ్వరుడి మాటలు మరింతగా కోపం తెప్పించాయి. ఉచితానుచితాలను మరచి నందీశ్వరుడిని పక్కకు నెట్టి, లోపలకు ప్రవేశించాడు. తమ ఏకాంతానికి భంగం కలిగిస్తూ దురుసుగా లోపలకు ప్రవేశించిన భృగువును చూసి పరమశివుడు శివమెత్తి నర్తిస్తూ త్రిశూలంతో అతడిని పొడవడానికి ఉద్యుక్తుడయ్యాడు.

అంతలో పార్వతీదేవి పరమశివునికి అడ్డు నిలిచి, వారించింది. ‘ప్రభూ! విచక్షణాజ్ఞానం లోపించిన ఈ మహర్షిని దయతో క్షమించి విడిచిపెట్టండి’ అని ప్రార్థించింది. సమయానికి పార్వతీదేవి అడ్డు పడటంతో భృగు మహర్షి ప్రాణాలు దక్కాయి. ‘బతుకు జీవుడా’ అనుకుంటూ ఆయన బయటపడ్డాడు. ‘ఈ పరమేశ్వరుడు తామసగుణంతో నిండి ఉన్నాడు. ఇలాంటివాడు దేవతలలో సర్వోన్నత స్థానం ఎలా పొందగలడు? ఇతడికి యజ్ఞఫలాన్ని పొందే అర్హత లేదుగాక లేదు’ అని నిర్ణయించుకున్నాడు. ‘ఇతడు భూలోకంలో స్థాణువై, లింగాకారంలో మాత్రమే పూజలు పొందు గాక!’ అని శపించాడు. ఇక అక్కడి నుంచి వైకుంఠం వైపు బయలుదేరాడు.

వైకుంఠ ప్రవేశం
సత్యలోకంలో, కైలాసంలో ఎదురైన అనుభవాలతో తీవ్ర మనస్తాపం చెందిన భృగు మహర్షి ఆలోచనలు కొనసాగుతుండగా వైకుంఠానికి చేరుకున్నాడు. క్షీరసముద్రంలో శ్రీమహావిష్ణువు శేషతల్పంపై అరమోడ్పు కనులతో తన్మయావస్థలో శయనించి ఉండగా, ఆయన హృదయంపై శ్రీ మహాలక్ష్మి తలవాల్చి మైమరచి గడుపుతున్న మధుర క్షణాలవి. అలాంటి రసవత్తర సమయంలో వైకుంఠంలో అడుగుపెట్టిన భృగుమహర్షి శ్రీమహావిష్ణువుకు సాష్టాంగ ప్రణామం ఆచరించి, స్తోత్రాలతో కీర్తించసాగాడు.బాహ్యప్రపంచాన్ని శ్రీమహాలక్ష్మితో సరస సంభాషణలతో మునిగినట్లుగా భ్రమింపజేస్తూ జగన్నాటక సూత్రధారి అయిన శ్రీమహావిష్ణువు పరాకు ప్రదర్శించాడు.

భృగు మహర్షి రాకను గమనించనట్లుగానే శ్రీమహాలక్ష్మిని మరింతగా అక్కున చేర్చుకున్నాడు. అప్పటికే బ్రహ్మదేవుని వద్ద, పరమేశ్వరుని వద్ద పరాభవం పొందిన భృగుమహర్షికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆవేశంతో ఊగిపోయాడు. పరుగెత్తుకుంటూ వెళ్లి శ్రీమహావిష్ణువు వక్షస్థలాన్ని కాలితో తన్నడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఈ హఠాత్పరిణామానికి భీతిల్లిన మహాలక్ష్మి పక్కకు తొలగింది. విసురుగా వచ్చిన మహర్షి కాలు శ్రీహరి వక్షస్థలాన్ని బలంగా తాకింది. మహర్షి పాదతాడనంతో శ్రీమహావిష్ణువు వెంటనే శేషపాన్పుపై నుంచి తటాలున లేచాడు. కోపంతో ఊగిపోతున్న భృగుమహర్షికి ప్రణామం చేశాడు. మునివర్యుని రాకను గమనించని తన ఏమరుపాటును మన్నించమని ప్రాధేయపడ్డాడు. ఆయనను సగౌరవంగా తోడ్కొని వచ్చి, శేషపాన్పుపై కూర్చుండబెట్టాడు.

భృగు మహర్షి పాదాల చెంత కూర్చుని, పాదాలను ఒత్తుతూ, ముని పాదంలో ఉన్న అజ్ఞానంతో కూడిన కంటిని చిదిమివేశాడు. పాదంలోని కన్ను శ్రీహరి చేతుల్లో చితికిపోవడంతో భృగుమహర్షికి అహంకారం, అజ్ఞానం అడుగంటాయి. కాలితో తన్నిన తన తప్పిదానికి క్షమించమని కోరుతూ శ్రీహరిని పరిపరి విధాల స్తుతించాడు. త్రిమూర్తులలో శ్రీమహావిష్ణువు ఒక్కడే పరమోన్నతుడు. పరమ శ్రేష్ఠుడు. సత్వగుణ సంపన్నుడు అని, ఆయన మాత్రమే మహర్షులు నిర్వహించే యాగఫలాన్ని స్వీకరించడానికి అన్నివిధాలా యోగ్యుడని తీర్మానించాడు. శ్రీహరి పురుషోత్తమ తత్వాన్ని అనేక విధాలుగా స్తుతిస్తూ వైకుంఠం నుంచి భూలోకానికి పయనమయ్యాడు. నారదుడి ఆనతి మేరకు, మహర్షుల ప్రార్థనలపై ముల్లోకాలకు స్వయంగా వెళ్లి, త్రిమూర్తులలోకెల్లా వైకుంఠవాసుడైన శ్రీమహావిష్ణువు మాత్రమే సర్వోన్నతుడైన వాడని నిగ్గు తేల్చుకున్నట్లు ప్రకటించాడు. భృగుమహర్షి మాటలకు సంతోషించిన మునీశ్వరులందరూ ఘనంగా యాగాన్ని నిర్వహించారు. యాగఫలాన్ని శ్రీమహా విష్ణువుకు సమర్పించారు.

ఆదిలక్ష్మి భూలోక పయనం
తన నివాసస్థలమైన శ్రీహరి వక్షస్థలాన్ని భృగు మహర్షి కాలితో తన్ని అపవిత్రం చేయడాన్ని శ్రీమహాలక్ష్మి ఎంతమాత్రం సహించలేకపోయింది. ‘ఇంతటి దుశ్చర్యకు పాల్పడిన మునీశ్వరుడిని నా స్వామి దండించకపోగా, తనతో సమానంగా శేషపాన్పుపై సగౌరవంగా కూర్చోబెట్టాడు. అంతటితో ఊరుకున్నాడా? తనను తన్నినందుకు అతడి పాదాలు కందినవేమోనని పరామర్శిస్తూ ఆ పాదాలను ఒత్తడమా! ఇది మరింత మనోవేదన కలిగిస్తోంది’ అని తలపోస్తూ అవమాన భారంతో దహించుకుపోయింది శ్రీమహాలక్ష్మి. మునిపాద తాడనంతో అపవిత్రమైన స్వామి హృదయంలో ఇక తనకు స్థానం లేదని తీవ్ర మనస్తాపంతో వైకుంఠాన్ని వీడి భూలోకానికి బయలుదేరడానికి సిద్ధపడింది. తనను విడిచి వెళ్లవద్దని మహావిష్ణువు ఎంతగానో వేడుకున్నాడు. అయినప్పటికీ మహాలక్ష్మి శాంతించలేదు. తీవ్రమైన కోపంతో, తీరని దుఃఖభారంతో స్వామి ప్రార్థనలను లెక్కచేయకుండా వైకుంఠాన్ని వీడి భూలోకాన్ని చేరుకుంది. భూలోకంలో పుణ్యస్థలమైన కొల్హాపురమనే చోట ఒంటరిగా తపస్సు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతూ ఉంది.

శ్రీమహావిష్ణువు వైరాగ్యం
వైకుంఠంలో తనను అనునిత్యం సేవిస్తూ ఆనందింపజేసే తన ఇల్లాలు శ్రీమహాలక్ష్మీదేవి అర్ధంతరంగా తనను విడిచి వెళ్లడాన్ని శ్రీమహావిష్ణువు ఎంతమాత్రం భరించలేక పోయాడు. తన హృదయేశ్వరి లక్ష్మీదేవి లేని వైకుంఠంతో ఇక పనేమిటని వైరాగ్యానికి లోనయ్యాడు. ‘లక్ష్మీ..! లక్ష్మీ..!’ అంటూ వైకుంఠాన్ని వదిలి లక్ష్మీదేవిని వెదుకుతూ భూలోకానికి తరలివచ్చాడు. ఆమె కోసం భూలోకమంతా వెతికి వేసారిపోయాడు. అయినా ఆమె జాడ కానరాలేదు. లక్ష్మీదేవి లేకుండా వైకుంఠానికి వెళ్లడం వ్యర్థమనిపించింది. లక్ష్మీదేవి జాడకోసం వెదుకుతూ చివరకు వేంకటాచల పర్వతానికి చేరుకున్నాడు విష్ణువు.

చింతచెట్టు తొర్రలో తలదాచుకున్న స్వామి
వేంకటాచల పర్వతసానువులలో తిరుగుతూ ఉన్న శ్రీమహావిష్ణువుకు అక్కడ ఒక పుష్కరిణి కనపడింది. దానికి దక్షిణాన విశాలమైన చింతచెట్టు గోచరించింది. చెట్టు కింద విశాలమైన పుట్ట కనిపించింది. ఆ చింతచెట్టును, ఆ చెట్టు కింది పుట్టను విష్ణువు కోసమే బ్రహ్మ సృష్టించాడు. దిక్కు తెలియక తిరుగుతున్న విష్ణువు బాగా అలసిపోయినాడు. అలా అలసి పోయిన స్వామికి చింతచెట్టు తన చల్లని నీడలో సేదతీర్చుకొమ్మని పిలిచినట్లుగా తోచింది. అంతే! ఆనందంతో విశాలమైన ఆ చింతచెట్టు కిందికి చేరాడు. చెట్టు కిందే వున్న పుట్టలోని తొర్రలో తలదాచుకున్నాడు. అలా ఆ తొర్రలోనే తలదాచుకుంటూ కాలం వెళ్లదీయసాగాడు.

గోపాలికగా శ్రీమహాలక్ష్మి, గోవుగా బ్రహ్మ...
శ్రీమహావిష్ణువు కారడవిలో చింతచెట్టు కింది పుట్టలో తలదాచుకుని ఆకలిదప్పులతో అలమటిస్తూ ఉన్న విషయాన్ని కొల్హాపురంలో కొలువై ఉన్న శ్రీమహాలక్ష్మి బ్రహ్మాది దేవతల ద్వారా తెలుసుకుని బాధపడింది. అయితే, స్వామి వద్దకు వెళ్లడానికి మాత్రం ససేమిరా అన్నది. శ్రీనివాసుని ఆకలి దప్పులు తీర్చడానికి బ్రహ్మ, శివుడు స్వయంగా ప్రార్థించడంతో వారి కోరికను మన్నించింది. బ్రహ్మదేవుడు గోవుగా, శివుడు దూడగా మారగా, లక్ష్మీదేవి గోపాలికగా మారింది. బ్రహ్మ మహేశ్వరులు గోవుగా, దూడగా చోళరాజు గోశాలలోని పశువుల మందలో చేరారు.

శ్రీనివాసుని ఆకలి తీర్చిన గోవు
చోళరాజు పశువుల కాపరి ప్రతిరోజూ మందతో పాటు కొత్తగా వచ్చిన ఆవును, దూడను కూడా మేతకు తోలుకుపోయేవాడు. మేతకు వెళ్లిన కొత్త ఆవు, దూడతో కూడా పశువుల మందను వదిలి, కాపరి కళ్లు గప్పి అడవిలోని చింతచెట్టు కింద పుట్టలో దాగి ఉన్న శ్రీనివాసుని వద్దకు వెళ్లి ధారగా పాలు కార్చేది. పుట్టలోని దేవుడు ఆ పాలను కడుపారా తాగుతూ తృప్తి చెందేవాడు. పాలను వదిలిన తర్వాత మళ్లీ యథాప్రకారం ఆవు, దూడ తిరిగి మందలో చేరి రాజుగారి గోశాలకు చేరుకునేవి. ఇలా కొంతకాలం సాగింది.

శ్రీనివాసునిపై గొల్లవాని గొడ్డలి వేటు
ఎంతకాలమవుతున్నా కొత్తగోవు ఏమాత్రం పాలు ఇవ్వకపోతుండటంతో రాణివారు గొల్లవానిపై కోపించి రాజుగారికి ఫిర్యాదు చేశారు. రాజుగారు గొల్లవాణ్ణి పిలిపించి, అతడిని కొరడాతో కొట్టించారు. ఆవునూ దూడనూ జాగ్రత్తగా గమనించాలని హెచ్చరించారు. రాజుగారి హెచ్చరికతో ప్రాణభీతి చెందిన గొల్లవాడు కొత్త ఆవునూ దూడనూ జాగ్రత్తగా గమనించసాగాడు. మధ్యాహ్న సమయంలో అతడికి ఒక విచిత్ర సన్నివేశం కనిపించింది. ఆవు, దూడ మందను విడిచిపెట్టి కొండలు, గుట్టలు దాటుకుంటూ వెళ్లడం చూశాడు. అతడు కూడా వాటిని అనుసరించాడు. ఆవూ దూడా పుష్కరిణి సమీపానికి చేరుకున్నాయి. ఆవు పుట్టను ఎక్కి దాని బొరియలోకి పాలను ధారగా విడువసాగింది. అది చూసిన గొల్లవానికి కోపం కట్టలు తెంచుకుంది. దొంగచాటుగా వెనుక నుంచి వచ్చి ఆవుపై చేతిలో ఉన్న గొడ్డలి ఎత్తి గట్టిగా కొట్టాడు. అలికిడికి బెదిరిన ఆవు పక్కకు తప్పుకోవడంతో పుట్టలో దాగిన శ్రీనివాసుడు గభాలున పైకి లేచాడు. అంతే! గొడ్డలి వేటు శ్రీనివాసుని నుదుటికి తాకింది. నెత్తురు ధారగా చిమ్మింది. నుదుట నెత్తురోడుతూ కనిపించిన శ్రీనివాసుడిని చూస్తూ దిమ్మెరపోయిన గొల్లవాడు భయభ్రాంతుడై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. వెంటనే ఆవు పరుగెత్తుకుంటూ చోళరాజు ఆస్థానానికి వెళ్లి కన్నీరు కారుస్తూ అంబారావాలు చేసింది.

చోళరాజుకు శాపం
ఆవు అంబారావాలు చేస్తుండటంతో ఏమైందో ఏమోనని ఆందోళన చెంది ఆవు వెంట నడిచాడు చోళరాజు. ఆవుతో పాటే గొల్లవాడు చచ్చిపడి ఉన్న పుట్ట దగ్గరకు చేరుకున్నాడు. అంతలో పుట్టలో దాగి ఉన్న శ్రీనివాసుడు పైకి వచ్చి ‘‘ప్రజలు, సేవకులు, భార్యా బిడ్డలు చేసిన పాపాలు ప్రభువుకు చెందుతాయి. అందువల్ల ఈ దుష్కృత్యానికి ఫలితాన్ని నీవు అనుభవించి తీరాలి. నీవు ఈ క్షణమే పిశాచ రూపాన్ని పొందెదవుగాక’’ అని శపించాడు. శ్రీనివాసుడి శాపానికి చోళరాజు ఎంతగానో తల్లడిల్లాడు. ‘‘స్వామీ! తెలియక జరిగిన దోషానికి ఇంతలా శపించడం నీకు తగునా? నీవే నాకు దిక్కు... శాప విముక్తిని సెలవివ్వు’ అని ప్రాధేయపడ్డాడు. ఆశ్రిత వత్సలుడైన శ్రీనివాసుడు కరుణించి, ‘‘రాజా! కొద్దికాలంలోనే ఆకాశరాజు తన కూతురు పద్మావతిని నాకిచ్చి పరిణయం చేస్తాడు. అల్లుడినైన నాకు ఆ రాజు ఒక బంగారు కిరీటాన్ని కానుకగా ఇస్తాడు. నేను ఆ కిరీటాన్ని ధరించినప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది’’ అని సెలవిచ్చాడు. వెంటనే చోళరాజు పిశాచమై అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అంతలో అక్కడ చచ్చిపడి ఉన్న గొల్లవాని బంధువులు ఏడుస్తూ వచ్చి స్వామివారి వద్ద మొర పెట్టుకున్నారు. శ్రీనివాసుడు వారికి అభయమిస్తూ ‘‘భూలోకంలో నన్ను తొలిసారిగా దర్శించిన వ్యక్తి ఆ పశువుల కాపరి. ఇక మీదట కలియుగాంతం వరకు ఇతని సంతతి వారైన మీకు ప్రతిరోజూ నా తొలి దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తున్నాను’’ అంటూ వరమిచ్చాడు.

భూ వరాహస్వామికి దాన శాసనపత్రం
గొల్లవాని వల్ల కలిగిన గాయాన్ని మాన్పుకోవడానికి వనమూలికల కోసం వెదుకుతున్న శ్రీనివాసునికి ఆది వరాహస్వామి కనిపించాడు. శ్రీనివాసుడి రాకకు ముందు చాలాకాలం కిందటే వరాహస్వామి ఆ క్షేత్రంలో స్థిరపడ్డాడు. వరాహస్వామికి తన దీనగాథను విన్నవించుకున్నాడు శ్రీనివాసుడు. తాను ఆ క్షేత్రంలో ఉండటానికి నూరు అడుగుల స్థలాన్ని ఇమ్మని ప్రార్థించాడు. వరాహస్వామి శ్రీనివాసుడి కోరికను సమ్మతించాడు.

అయితే, తానిచ్చే నూరు అడుగుల స్థలానికి పైకం చెల్లించాలని కోరాడు. ప్రస్తుతం తన వద్ద చిల్లిగవ్వ అయినా లేదని, అందుకు ప్రతిఫలంగా తన వద్దకు దర్శనార్థం వచ్చే భక్తుల చేత ‘మొదటి పూజ, మొదటి నైవేద్యం, మొదటి దర్శనం’ వంటి ఏర్పాటును కట్టడిగా చేయిస్తానని శ్రీనివాసుడు వాగ్దానం చేస్తూ దాన శాసనపత్రం కూడా రాసి ఇచ్చాడు. అందుకు వరాహస్వామి అంగీకరించి, స్వామి పుష్కరిణికి దక్షిణ తీరంలో శ్రీనివాసునికి స్థలాన్ని ధారాదత్తం చేశాడు. శ్రీనివాసుడి దీనగాథను ఆలకించిన ఆదివరాహస్వామి వకుళమాలిక అనే యోగినిని శ్రీనివాసుడికి సేవ చేయమని ఆదేశించాడు. వరాహస్వామి ఆనతిపై వకుళమాత శ్రీనివాసుడిని కన్నకొడుకులా సేవించసాగింది.

ఎవరీ వకుళమాత
శ్రీమహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. శ్రీకృష్ణుడిని పొత్తిళ్ల నాటి నుంచి కంటికి రెప్పలా సాకింది యశోద. చిన్నప్పటి నుంచి ఎందరో రాక్షసులను సంహరించడమే కాకుండా, వివిధ సందర్భాలలో శ్రీకృష్ణుడు ప్రదర్శించిన లీలలను, మహిమలను కన్నులారా తిలకించి ఆనందించింది. రాక్షసుల వల్ల చిన్ని కృష్ణుడికి ఎక్కడ కీడు కలుగుతుందేమోనని ఆమె తల్లడిల్లేది. కంసుడిని వధించిన తర్వాత శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల చెంతకు చేరాడు. వారి వద్దనే అతడికి వివాహాది కార్యక్రమాలన్నీ జరిగాయి. శ్రీకృష్ణుడికి స్వయంగా వివాహం చేసే భాగ్యానికి నోచుకోలేదని యశోద చింతాక్రాంతురాలైంది. ఆమె మనసు తెలుసుకున్న శ్రీకృష్ణుడు ‘‘అమ్మా! మాతృమూర్తివి అయిన నీవు బాధపడితే ఈ కృష్ణుడికి మనుగడే లేదు.

ఇప్పుడు పెంచి పెద్ద చేసిన చేతులతో నీవే స్వయంగా నాకు వివాహాన్ని చేసి సంతోషించే భాగ్యాన్ని కలిగిస్తున్నాను. కలియుగంలో వేంకటాచలంపై నీవు యోగినిగా ఉన్న సమయంలో నేను శ్రీనివాసుడనే పేరుతో నీ వద్దకు చేరుతాను. అప్పుడు నీ చేతుల మీదుగానే నా వివాహం జరిపించి ఆనందించే భాగ్యాన్ని పొందగలవు’’ అని వరమిస్తాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు ఇచ్చిన వరం వల్ల యశోదాదేవి కలియుగంలో వకుళాదేవిగా అవతరించింది. అప్పటి శ్రీకృష్ణుడే నేడు శ్రీనివాసుడిగా అవతరించి వేంకటాచలానికి చేరి వరాహస్వామి అండదండలతో అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు. అప్పటి నుంచి వకుళమాత శ్రీనివాసుని ఆలనాపాలనా చూస్తూ తృప్తిగా కాలక్షేపం చేయసాగింది.

పద్మావతిని రక్షించిన శ్రీనివాసుడు
వరాహక్షేత్రంలో వకుళమాత సేవలో శ్రీనివాసుడు మహలక్ష్మిని మరచిపోయి, కొండలు కోనలు తిరుగుతూ కాలం వెళ్లబుచ్చసాగాడు. కొంతకాలానికి ఒకరోజు శ్రీనివాసుడు విల్లంబులు చేత ధరించి గుర్రం మీద స్వారీ చేస్తూ వనవిహారం చేయసాగాడు. ఇంతలో ఆ కారడవిలో ‘రక్షించండి!.. రక్షించండి!’ అనే ఆర్తనాదాలు వినిపించాయి. ఆర్తనాదాలు వినిపించిన దిశగా శ్రీనివాసుడు విల్లంబులను చేతబూని తన గుర్రాన్ని పరుగులు పెట్టించాడు. అక్కడ ఒక మదపుటేనుగు తరుముతుండగా కొందరు కన్యలు ప్రాణభీతితో ఆర్తనాదాలు చేస్తూ చెట్టుకొకరు పుట్టకొకరుగా పరుగులు తీస్తూ కనిపించారు. వెంటనే శ్రీనివాసుడు ‘‘గజేంద్రా! అని బిగ్గరగా గర్జిస్తూ విల్లును గురిపెట్టి ఆ ఏనుగు ఎదుటకు వెళ్లాడు.

ఆ గర్జనకు బెదిరిన ఏనుగు వెనుదిరిగి అడవిలోకి పారిపోయి, ఎవరికీ కనిపించకుండా అదృశ్యమైపోయింది. తృటిలో తప్పిన ప్రాణాపాయం నుంచి తేరుకుని అయోమయంగా దిక్కులు చూస్తున్న యువతుల వద్దకు వెళ్లాడు శ్రీనివాసుడు. వారి మధ్య చుక్కలనడుమ చందమామలా మెరిసిపోతున్న యువతిని చూసి దిగ్భ్రమ చెందాడు. ఆమె అందచందాలకు పరవశుడై రెప్పవాల్చకుండా తదేకంగా చూస్తూ నిలుచుండిపోయాడు. ఆ యువతి కూడా తనను ఏనుగు బారి నుంచి కాపాడిన శ్రీనివాసుడిని చూస్తూ నివ్వెరపోయింది. ఆయన రూపానికి, తేజస్సుకు మంత్రముగ్ధురాలై అలాగే చూస్తూ ఉండిపోయింది.

పద్మావతి శ్రీనివాసుల ప్రేమానురాగాలు
వారిద్దరి వాలకాన్ని గమనించిన చెలికత్తెలు ఆందోళనతో భయపడుతూ శ్రీనివాసుడిని గట్టిగా వారిస్తూ్త ‘‘ఎవరయ్యా నీవు’’? ఆమె ఎవరనుకున్నావు? ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న మా మహారాజు ఆకాశరాజుగారి గారాలపట్టి పద్మావతిదేవి. అంతఃపుర కన్యలు విహరించే ఈ వనంలో పరపురుషులు ప్రవేశించడం నిషిద్ధం. పద్మావతిని చూడటం చాలా తప్పు. వెళ్లు... వెళ్లు! తొందరగా... ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడి నుంచి వెళ్లిపో! ఇంకా ఏమిటి అలా కొరకొర చూస్తావు... మేం చెప్పేది వినిపించడం లేదా? వినిపించినా అర్థం కావడం లేదా? మా రాజభటులు వస్తే నీ సంగతి ఇక అంతే!’’ అని చెలికత్తెలు శ్రీనివాసుడిని చుట్టుముట్టి, బెదిరింపులతో అతడిని అక్కడి నుంచి వెడలగొట్ట చూశారు. అంతలో పద్మావతి వారిని వారిస్తూ... ‘‘ఆయన మనలను ఏనుగు బారి నుంచి రక్షించి మన ప్రాణాలను కాపాడిన ఆపద్బాంధవుడు. ఆయనను తూలనాడటం తగదు. అసలు ఆయన ఎవరో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఇక్కడకు ఎందుకు వచ్చాడో తెలుసుకోండి’’ అని తన చెలికత్తెలను కోరింది.

పద్మావతి చొరవకు చెలికత్తెలు ఆశ్చర్యపోతూనే శ్రీనివాసుని చెంతకు వెళ్లి అతనిపై ప్రశ్నల పరంపర కురిపించారు. ‘‘ఎవరయ్యా నువ్వు? నీ పేరేమిటి? ఊరేమిటి? నీ తల్లిదండ్రులెవరు? నీ కులమేది? గోత్రమేది?’’ అని అడిగారు. శ్రీనివాసుడు చిరునవ్వులు చిందిస్తూ... ‘‘నా తండ్రి వసుదేవుడు. తల్లి దేవకీదేవి. అన్న బలరాముడు. నన్ను శ్రీకృష్ణుడంటారు. వశిష్ఠ గోత్రానికి చెందినవాణ్ణి. ఈ అందాల భరిణను తొలిచూపులోనే ప్రేమించాను. మీరంతా అంగీకరిస్తే పెళ్లి చేసుకుంటాను’’ అంటూ చెలికత్తెలు వారిస్తున్నా పద్మావతిని సమీపిస్తూ ఆమె కౌగిలి కోసం చేతులు చాపాడు. శ్రీనివాసుడి చేష్టలు శ్రుతిమించి రాగాన పడుతుండటాన్ని గమనించిన పద్మావతి చెలికత్తెలు అతన్ని మాటలతో వారించే ప్రయత్నం చేశారు. అయినా, ఫలితం లేకపోవడంతో రాళ్లతో దాడి చేసి వెంటబడి తరిమి తరిమి కొట్టారు. పద్మావతిని ఊహించుకుంటూ మైమరపులో ఉన్న శ్రీనివాసుడు ఈ హఠాత్పరిణామానికి నిశ్చేష్టుడయ్యాడు. పద్మావతి చెలికత్తెల రాళ్ల దాడిలో గాయాల పాలయ్యాడు. నెత్తురోడుతున్న దేహంతోనే పద్మావతిని పదేపదే వెనక్కు తిరిగి చూస్తూ వేంకటాద్రికి చేరుకున్నాడు.

శ్రీనివాసునిపై వకుళమాత మాతృప్రేమ
పొద్దున్నే వెన్నముద్దలైనా తినకుండా శ్రీనివాసుడు పరగడుపున ఎక్కడికి వెళ్లాడోనని ఆలోచిస్తూ వకుళమాత ఎదురు చూస్తూ వుంది. ఇంతలో తనువంతా నెత్తురోడుతున్న గాయాలతో బాధతో మూలుగుతూ వస్తున్న శ్రీనివాసుణ్ణి చూసి వకుళమాత ఆందోళన చెందింది. ఆతృతతో ఎదురేగి, శ్రీనివాసుని చేయి పట్టుకొని నడిపించుకుని వస్తూ ‘‘ఒళ్లంతా ఈ దెబ్బలేమిటి?, అసలు ఏం జరిగింది! ఏ దుర్మార్గులు చేశారీ పని? ఏం జరిగిందో చెప్పరా కన్నయ్యా’’ అని కన్నీళ్లు పెట్టుకొంది. తన చీర కొంగును చించి గాయాలకు కట్లు కట్టింది. గాయాల బాధకు సన్నగా మూలుగుతున్న శ్రీనివాసుడు, తల్లిని మభ్యపెట్టడం తగదని భావించి జరిగిన కథంతా పూస గుచ్చినట్లుగా వకుళమాతకు చెప్పాడు.

నారాయణవనం పరిసర ఉద్యాన వనంలో విహరిస్తున్న ఆకాశరాజు కూతురు పద్మావతిదేవిని చూశానని, ప్రేమించానని, ఆమె కూడా తన ప్రేమలో పడిందనీ, ఇక ఆమెను తాను వివాహమాడనిదే బతకలేనని చెప్పాడు.‘‘నాయనా! శ్రీనివాసా! నీవే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివనే సంగతి మరచినట్లున్నావు. దివ్యపురుషుడవైన నీవు సామాన్య మానవుడిలా మానవకాంతను ప్రేమించడం, ఆమె లేకుంటే బతకలేననడం వింతగా ఉంది. అలా చెప్పడం నీవంటి వాడికి ఎంతవరకు సమంజసమో ఆలోచించు’’ అంటూ అనునయించింది వకుళమాత. ‘‘నీవన్నది సత్యమే! నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ అనైతికంగా ప్రవర్తించను తల్లీ! నేను చూసిన ఆకాశరాజు కూతురు పద్మావతి నీవు తలచినట్లు సామాన్య వనిత కాదు. ఆమె సాక్షాత్తు మహాలక్ష్మి అంశతో భూలోకంలో నన్ను వివాహమాడటానికే అయోనిజగా అవతరించిన కారణజన్మురాలు’’ అంటూ పద్మావతి గాథను తల్లితో ఇలా చెప్పాడు...

వేదవతే మాయాసీత
‘‘త్రేతాయుగంలో రామావతార సమయంలో శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతంగా పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు. అప్పుడు రావణాసురుడు సీతాదేవిని అపహరించుకుపోయాడు. సీతను ఎత్తుకుపోతున్న రావణుడికి అగ్నిదేవుడు అడ్డుపడి ‘రావణా! నీవు తీసుకుపోతున్నది అసలైన సీత కాదు. శ్రీరాముని భార్య అయిన సీత నా వద్ద ఉన్నది. ఈమెను విడిచిపెట్టి నా వద్దనున్న సీతను తీసుకువెళ్లు’’ అని చెప్పి ఆమెను అగ్నిప్రవేశం చేయించి తన వద్ద భద్రంగా రక్షించాడు. ఆమెకు బదులుగా తన వద్దనున్న వేదవతిని సీతగా మభ్యపెట్టి రావణుడికిచ్చి పంపాడు. అగ్నిదేవుడి మాటలు నమ్మిన రావణుడు వేదవతిని తీసుకుపోయి లంకలో బంధించాడు. రావణ సంహారం తర్వాత రాముడు లంకలో ఉన్న సీతను స్వీకరించాడు.

అయితే, లోకనింద రాకుండా ఉండటానికి సీతను అగ్నిప్రవేశం చేయించాడు. అప్పుడు అగ్ని నుంచి ఇద్దరు సీతలు వెలుపలకు వచ్చారు. ఈ పరిణామానికి ఆశ్చర్యపోయిన రాముడు ‘‘వీళ్లిద్దరూ ఎవరు? వీరిలో నా భార్య సీత ఎవరు?’ అని ప్రశ్నించాడు. అగ్నిదేవుడు తాను సీతను తన దగ్గర భద్రంగా కాపాడి మాయసీత అయిన వేదవతిని రావణుని వద్దకు పంపిన విషయాన్ని వివరించాడు. ‘‘సీతకు బదులుగా వేదవతి లంకలో నానా కష్టాలను అనుభవించింది. సీత మాదిరిగానే నిన్నే తన భర్తగా భావించింది. అందువల్ల సీతతో పాటు మాయసీత అయిన వేదవతిని కూడా భార్యగా స్వీకరించు’’ అని సూచించాడు. అగ్నిదేవుని మాటపై వేదవతిని భార్యగా స్వీకరించాలని సీత కూడా కోరింది. అయితే, రాముడు అందుకు తిరస్కరించాడు.

‘‘ఈ అవతారంలో ఒకటే మాట, ఒకటే బాణం, ఒకే భార్య... అనే వ్రత నియమానికి కట్టుబడి ఉన్నాను’’ అని బదులిచ్చాడు. కలియుగంలో వేదవతి కోరిక తీర్చగలనని మాట ఇచ్చాడు. కలియుగంలో తాను శ్రీనివాసుడిగా అవతరించినప్పుడు వేదవతి ఆకాశరాజు కూతురు పద్మావతిగా అవతరిస్తుందని, అప్పుడు తాను ఆమెను దేవేరిగా స్వీకరిస్తానని వాగ్దానం చేశాడు. అప్పటి శ్రీరాముడే ఇప్పుడు శ్రీనివాసుడిగా వచ్చాడు, నాటి వేదవతి నేడు ఆకాశరాజు కూతురు పద్మావతిగా అవతరించింది’’ అని శ్రీనివాసుడు చెప్పాడు. ‘‘శ్రీనివాసా! నీవు చెప్పిన వృత్తాంతం ఆశ్చర్యకరంగా ఉంది. ఇంతకూ పద్మావతి తండ్రి ఆకాశరాజు ఎవరు తండ్రీ!’’ అని ప్రశ్నించింది.

పూర్వజన్మలో ఆకాశరాజు
పూర్వం మాధవుడనే బ్రాహ్మణుడు కుంతల అనే స్త్రీతో సంబంధం పెట్టుకొని పాపం చేశాడు. అతడు ఆ పాప విముక్తి కోసం వేంకటాద్రికి వచ్చి స్వామి పుష్కరిణిలో స్నానం చేశాడు. అక్కడే భగవంతుని కోసం తపస్సు చేశాడు. ఎంతకూ దేవుడు ప్రత్యక్షం కానందుకు చింతిస్తూ ప్రాణత్యాగానికి తలపడ్డాడు. ఆ సమయంలో దేవుడు ప్రత్యక్షమై ‘‘వచ్చే జన్మలో పాండవ వంశంలో సుధర్ముడనే రాజుకు పుత్రునిగా పుట్టి ఆకాశరాజు అనే పేరుతో ప్రసిద్ధి పొందుతావు. ఆ సమయంలో సాక్షాత్తు శ్రీమహాలక్ష్మి స్వరూపిణి అయిన కన్యక నీకు పుత్రికగా లభిస్తుంది. ఆమెను నాకు ఇచ్చి వివాహం చేస్తావు. నీ కీర్తి వెలుగుతుంది’’ అని వరమిచ్చాడు.

ఆ బ్రాహ్మణుడే ఆకాశరాజు. ఇతడి భార్య ధరణీదేవి మహాపతివ్రత. వీరికి ఎంతకాలమైనా సంతానం కలగనందున జ్యోతిషుల సూచనతో పుత్రకామేష్టి యాగం చేశాడు. యాగ సమయంలో భూమిని దున్నుతుండగా, నాగేటి చాలులో బంగారు పెట్టె దొరికింది. అందులో సహస్రదళాల బంగారు పద్మం ఉంది. ఆ పద్మంలో దివ్యతేజస్సుతో ప్రకాశిస్తున్న పసిపాప కనిపించింది. పద్మంలో దొరికినందున ఆమెకు పద్మావతిగా నామకరణం చేసి, పెంచి పెద్ద చేశారు. యవ్వనవతి అయి అద్భుత సౌందర్యంతో విరాజిల్లుతూ చెలికత్తెలతో వనవిహారం చేస్తున్న ఆ పద్మావతినే నేను చూశాను. ఆమెను చూసినప్పటి నుంచి నా మనస్సు అగమ్యగోచరంగా ఉంది తల్లీ!’’ అంటూ శ్రీనివాసుడు చెప్పగా మైమరచి విన్న వకుళమాత... ‘నాయనా! శ్రీనివాసా! నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు నన్నేం చేయమంటావో చెప్పు’’ అని అడిగింది.

పెళ్లి రాయబారం!
‘‘అమ్మా! వకుళమాతా! నీవు నారాయణవనం చక్రవర్తి ఆకాశరాజు వద్దకు వెళ్లి ఆయన కూతురు పద్మావతిని నాకు ఇచ్చి వివాహం చేయాలని అర్థించు తల్లీ! లోక కల్యాణం కోసం నీవు ప్రయత్నించే ఈ కార్యం తప్పక నెరవేరుతుంది. ముందుగా ఈ పర్వత మూలలో వెలసిన కపిలేశ్వరస్వామిని దర్శించుకుని, పవిత్ర కార్యానికి శ్రీకారం చుట్టాల’’ని తల్లిని కోరాడు. శ్రీనివాసుడు తనపై ఉంచిన కార్యభారానికి ఆనందించిన వకుళమాత, కపిలతీర్థంలో స్నానమాడి, కామాక్షీసమేత కపిలేశ్వరస్వామిని దర్శించుకుని, శ్రీనివాసుని కల్యాణాన్ని శుభస్య శీఘ్రంగా నెరవేర్చాలని ప్రార్థించింది. అక్కడి నుంచి నారాయణవనానికి బయలుదేరింది. దారిలో శుక మహర్షి ఆశ్రమాన్ని, అక్కడకు చేరువలోని అగస్త్యేశ్వరుడిని దర్శించుకుంది. అక్కడినుంచి నారాయణవనానికి చేరుకుంది వకుళమాత.

ఎరుకలసానిగా శ్రీనివాసుడు
తన వివాహం కోసం తల్లి వకుళమాతను నారాయణవనానికి పంపిన శ్రీనివాసుడు, వెంటనే తన రూపురేఖలను మార్చుకుని, ఎరుకలసాని వేషం ధరించాడు. ‘‘ఎరుక సెబుతానమ్మ! ఎరుక! ఎరుకమ్మో ఎరుక!’’ అంటూ వయ్యారాలు పోతూ నారాయణపుర వీథుల్లో తిరుగసాగాడు. పద్మావతి జ్వరంతో బాధపడుతుండటంతో ఆమెకు ఏదైనా భూతం పట్టుకుందేమో! ఎన్ని చికిత్సలు చేస్తున్నా జ్వరం తగ్గడం లేదెందుకోనని దిగులుగా ఆలోచిస్తున్న ధరణీదేవికి ఎరుకలసాని అరుపులు వినిపించాయి. వెంటనే ఆమె ఎరుకలసానిని అంతఃపురానికి పిలిపించింది. ఎరుకతెకు ఎదురుగా పద్మావతిని కూర్చోబెట్టి ఎరుక చెప్పమని కోరింది.

ఎరుకలసాని రూపంలోని శ్రీనివాసుడు పద్మావతి ఎడమచేతిని తన చేతిలోకి తీసుకుంటూ ‘‘కొండదేవర మీద ఆన! ఉన్నది ఉన్నట్టు సెబుతాను తల్లె! ఈ క్షణం నుంచే నీ బిడ్డ కుదుటబడుతుంది. నీ బిడ్డ చేతిని కొండమీది ఆదినారాయణుడు అందుకొన్నాడె తల్లె! వాడు కూడా ఈ బొమ్మ మీద మోజు పడ్డాడె తల్లె! జెరం తగ్గి బిడ్డ బతికి బట్టగట్టాలంటే కొండ మీద ఉన్న ఆదిదేవునికిచ్చి మనువు సెయ్యాలె తల్లె! నేను సెప్పేది సత్తెమే తల్లె! కొండ దేవర మీద ఆన! తొందర్లోనే నీ బిడ్డ లగ్గమవుతాది!’’ అంటూ శ్రీనివాసుడు పద్మావతి చేతిని స్పృశిస్తూ ఆమె మనసును మరింత ఊరిస్తూ వెళ్లిపోయాడు. కొద్దిసేపటికే వకుళమాత వచ్చింది. అగస్త్యేశ్వరునికి అభిషేకం చేయించి, తీర్థప్రసాదాలను తీసుకొచ్చిన చెలికత్తెలు పద్మావతీదేవికి వాటిని అందించారు. తమ వెంట వచ్చిన వకుళమాతను రాణి ధరణీదేవికి పరిచయం చేశారు. వకుళమాత రాజ దంపతులకు నమస్కరించి, శ్రీనివాసుడు వనవిహారం చేస్తున్న పద్మావతిని మోహించాడని, ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడని, అందువల్ల పద్మావతి కూడా కారణ జన్మురాలని వారికి ఎరుకపరచింది. వకుళమాత మాటలకు ఆకాశరాజు దంపతులు ఆనందపరవశులయ్యారు. శ్రీనివాసుడికి పద్మావతిని ఇచ్చి వివాహం చేయడానికి అంగీకారం తెలిపారు. త్వరలోనే ముహూర్తాన్ని నిశ్చయించి, వివాహం జరిపించగలమని తెలిపారు. వకుళమాత అక్కడి నుంచి సెలవు తీసుకుని వరాహక్షేత్రానికి చేరుకుని, శ్రీనివాసుడికి తీపి కబురు తెలియజేసింది.

పద్మావతీ శ్రీనివాసుల వివాహ నిశ్చయం
వకుళమాత వెళ్లిన వెంటనే పద్మావతీ శ్రీనివాసుల కల్యాణానికి ముహూర్తం నిశ్చయించాలని కోరుతూ దేవగురువు బృహస్పతిని, శుక మహర్షిని ఆకాశరాజు ఆహ్వానించాడు. ఆకాశరాజు కోరికను మన్నించిన వారిద్దరూ గ్రహగతులను పరిశీలించి, రాబోయే వైశాఖ శుక్ల దశమి, శుక్రవారం నాటి ఉత్తర ఫల్గుణీ శుభ నక్షత్రంలో వివాహ ముహూర్తం అత్యంత శ్రేష్ఠమైనదిగా నిశ్చయించారు. వెంటనే శుభలేఖను తయారు చేశారు. ఆకాశరాజు కోరికపై బృహస్పతి ఆ శుభలేఖను శుకమహర్షికి ఇచ్చి, శ్రీనివాసుని వివాహానికి ఆహ్వానించాల్సిందిగా ఆదేశించాడు. శుకమహర్షి శ్రీనివాసునికి ఆ శుభలేఖను అందించాడు. శుకమహర్షిని సాదరంగా సత్కరించిన శ్రీనివాసుడు, శుభలగ్నానికి బంధుమిత్రులతో తరలి రాగలనని తెలిపి సాగనంపాడు.

ముక్కోటి దేవతల సాక్షిగా..
శుకమహర్షి వివాహ లగ్నపత్రికను ఇచ్చి వెళ్లిన తర్వాత శ్రీనివాసుడు పద్మావతితో తన వివాహ ఏర్పాట్లు చూడటానికి బ్రహ్మాది దేవతలను ఆహ్వానించాడు. శ్రీనివాసుని ఆహ్వానంపై బ్రహ్మ, మహేశ్వర, ఇంద్రాది ముక్కోటి దేవతలు, వశిష్ఠ వామదేవ విశ్వామిత్ర, కశ్యప, భరద్వాజాది సకల మహర్షులు వేంకటాచలానికి చేరుకున్నారు. ఇలా వస్తున్న వారందరికీ శ్రీనివాసుడు సాదరంగా ఆహ్వానించి గౌరవ సత్కారాలు అందజేశాడు. తన వివాహాన్ని తిలకించేందుకు వచ్చిన వారు విడిది చేయడానికి వీలుగా విశ్వకర్మ చేత వివాహపురాన్ని నిర్మించాలని శ్రీనివాసుడు ఇంద్రుడిని ఆదేశించాడు. అలాగే, ఆకాశరాజు పాలిస్తున్న నారాయణవనంలో పద్మావతీ శ్రీనివాసుల వివాహార్థమై ఘనంగా రత్నస్తంభాలతో ఒక వివాహ వేదికను కూడా విశ్వకర్మ నిర్మించాడు.

శ్రీనివాసుడి కల్యాణ వేడుకల్లో దేవతలందరూ ఒక్కొక్కరూ ఒక్కొక్క బాధ్యతను నిర్వర్తించారు. ఇంతలో శ్రీనివాసుడు సూర్యభగవానుని పిలిచి, ‘‘నీవు మహాలక్ష్మి వేంచేసి ఉన్న కొల్హాపురానికి వెళ్లు. శ్రీనివాసుడు నీ వియోగం వల్ల అస్వస్థుడై ఉన్నాడని అసత్యం చెప్పి ఆమెను పిలుచుకు రావాలి’’ అని ఆదేశించాడు. శ్రీనివాసుని ఆనతిని శిరసావహించిన సూర్యుడు కొల్హాపురానికి వెళ్లి లక్ష్మీదేవిని వేంకటాచలానికి తోడ్కొని వచ్చాడు. శ్రీనివాసుని చూసి లక్ష్మీదేవి ఆనంద పరవశురాలైంది. వేంకటాచలమంతా దేవతలతో నిండి కోలాహలంగా ఉండటంతో విశేషమేమిటని ప్రశ్నించింది. అంతట శ్రీనివాసుడు ‘‘త్రేతాయుగంలో నీ ఆనతి ప్రకారం అప్పటి వేదవతిని ఈనాడు పద్మావతిగా వివాహమాడుతున్నాను. నాటి నీ కోరిక తీరే వేళ ఆసన్నమయింది. అందుకే నిన్ను పిలిపించాను’’ అని చెప్పగా, లక్ష్మీదేవి సంతోషిస్తూ శ్రీనివాసుని పెండ్లికుమారుడిగా అలంకరించడానికి ఉద్యుక్తురాలైంది. లక్ష్మి, సరస్వతి, పార్వతి మున్నగువారు శ్రీనివాసునికి అభ్యంగనస్నానం చేయించారు. కుబేరుడు ఇచ్చిన నూతన వస్త్రాభరణాలను అలంకరించి, పెండ్లికొడుకును చేశారు. శ్రీనివాసుడు తమ కులదైవమైన శమీ వృక్షాన్ని కుమారధార తీర్థంలో దర్శించుకుని, దాని కొమ్మను వరాహస్వామి ఆలయ సమీపంలో ప్రతిష్ఠించాడు.

వివాహానికి తరలి వెళ్లే ముందు ఇక్కడ వేంచేసి ఉన్న కోట్లాది మంది దేవగంధర్వ ఋష్యాదులకు అన్న సంతర్పణ కోసం భోజన ఏర్పాట్లు చేయవలసిందని బ్రహ్మదేవుడు శ్రీనివాసుని కోరాడు. అయితే, శ్రీనివాసుడు తన వద్ద ధనం ఏమాత్రం లేదని, ఇప్పుడు ఇంత ఖర్చు ఎలా భరించగలనని దిగులుపడ్డాడు. ఇంతలోనే శివుని సలహాపై తేరుకుని కుబేరుని ఏకాంతంగా పిలిచి, తన పెళ్లికి కావలసిన ధనాన్ని అప్పుగా ఇవ్వమని కోరాడు శ్రీనివాసుడు. అప్పు ఇవ్వడానికి అంగీకరించిన కుబేరుడు రుణపత్రం రాసి ఇవ్వమని అడిగాడు. సరేనన్న శ్రీనివాసుడు పుష్కరిణి పశ్చిమ తీరాన ఉన్న అశ్వత్థ వృక్షం కింద కూర్చుని రుణపత్రాన్ని ఇలా రాయించాడు. ‘‘కలియుగంలో హేవిళంబనామ సంవత్సర వైశాఖ శుక్ల సప్తమి దినాన కుబేరుని వద్ద నుంచి నా వివాహార్థమై రామముద్రలు కలిగిన పద్నాలుగు లక్షల నిష్కాలను వడ్డీ చెల్లించే విధాంగా రుణం స్వీకరించడమైనది.

వివాహం జరిగిన ఈ ఏడాది మొదలు కొని వెయ్యేళ్లలోగా రుణాన్ని వడ్డీతో సహా తీర్చగలనని నేను రాసి ఇస్తున్న రుణపత్రం ఇది. దీనికి చతుర్ముఖుడైన బ్రహ్మదేవుడు మొదటి సాక్షి. త్రినేత్రుడైన పరమశివుడు రెండవ సాక్షి. మేము కూర్చున్న అశ్వత్థ వృక్షం మూడవ సాక్షి’’ అంటూ బ్రహ్మదేవుని చేత రుణపత్రాన్ని రాయించాడు. రుణం దొరికి ఆర్థిక సమస్య పరిష్కారం కావడంతో శ్రీనివాసుడు వెంటనే అగ్నిదేవుడిని పిలిచి అందరికీ భోజన ఏర్పాట్లు చేయమని ఆదేశించాడు. స్వామి ఆనతిపై అగ్నిదేవుడు పుష్కరిణిని అన్నపాత్రగా, పాపనాశన తీర్థాన్ని పప్పుపాత్రగా, ఆకాశగంగను పరమాన్నపాత్రగా, దేవతీర్థాన్ని భక్ష్యాల పాత్రగా, పాండవ తీర్థాన్ని చారు పాత్రగా, మిగిలిన దివ్యతీర్థాలను పిండివంటల పాత్రలుగా చేసుకుని రుచికరమైన వంటలు చేశాడు. వాటన్నింటినీ అహోబిల లక్ష్మీనరసింహస్వామికి నివేదన చేసిన తర్వాత పాండవ తీర్థం నుంచి శ్రీశైలం వరకు బారులుగా కూర్చున్న దేవతలకు వడ్డనలు చేశారు. విందు ముగిసిన తర్వాత దేవ యక్ష గంధర్వ రుషి గణాలతో శ్రీనివాసుడు నారాయణ వనానికి తరలి వెళ్లాడు. ఆకాశరాజు వారందరినీ భక్తిగౌర





పెళ్లి వేడుక_pelliVeduka

     


డబ్బున్న మారాజులకి అన్నీ తీపి ముచ్చట్లే... సరదా వేడుకలే... పిల్లా పిల్లాడు పుట్టింది మొదలు... బారసాలలో వండి వార్చే పాయసాల రుచులూ, గడపలు దాటితే బూరెల దిగదుడుపులూ, అడుగులేస్తే అరిసెలు పరిచే మురిపాలూ, పెద్దపిల్లయితే నవపిండివంటల ఆరగింపులూ... ఇలా పెరిగేకొద్దీ అడుగడుగునా తియ్యని వేడుకలే. ఇక, పెళ్లంటే మాటలా... నిశ్చితార్థం మొదలు అంపకాల వరకూ అన్నీ తీపి కబుర్లే... రకరకాల మిఠాయిల పంపకాలే.

ఒకప్పుడు ఆడపెళ్లివారయినా, మగపెళ్లివారయినా పెళ్లి వేడుకల్లో భాగంగా ఏవో రెండుమూడు రకాలు మహాఅయితే ఆరేడు స్వీట్లను భారీ సైజుల్లో చేయించి ఇచ్చిపుచ్చుకుని, ఆపైన చుట్టపక్కాలకు పంచుకునేవారు. కానీ నేటి పెళ్లి తంతులో అలంకరణకి ప్రాధాన్యం పెరిగింది. పెళ్లి దుస్తులూ మండపాలే కాదు, పెళ్లిలో వాడే వస్తుసామగ్రిని కూడా ఆకర్షణీయంగా మెరిపిస్తున్నారు. అందులో భాగంగానే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునే పండ్లూ మిఠాయిలతో కూడిన నిశ్చితార్థ తాంబూలాలను సైతం ఆకర్షణీయంగా తయారుచేసి అందంగా అలంకరించడం క్రమంగా పెరుగుతోంది.

అయితే, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో మగపెళ్లివారు తమ ఇంటి మహాలక్ష్మి కాబోతున్న కోడలికి నిశ్చితార్థం, వివాహం, శోభనం వేడుకల్లో నగలూ చీరసారెలతోబాటు బూందీలడ్డూలూ, గోరుమీఠీలూ, కజ్జికాయలూ, జహంగీరులూ, మడతకాజాలూ, మినపసున్నుండలూ, పంచదార చిలకలూ... ఇలా పలు రకాల మిఠాయిలూ పూలూ పండ్లతో ‘కంత’ను తీసుకొచ్చి, చూడచక్కగా ప్రదర్శిస్తారు. ఫొటోవీడియో షూట్‌ల పుణ్యమా అని అవి మరింత ఘనంగా ఆడంబరంగా కనిపించాలన్న ఉద్దేశంతో ఆయా మిఠాయిల్ని భారీ సైజుల్లో చేయడంతోబాటు అందులో పెట్టే చిలకల్నీ కోవా స్వీట్లనీ రకరకాల పూలూ పండ్లూ కూరగాయలూ కట్టడాలూ దేవుడి విగ్రహాల రూపాల్లో ఆకర్షణీయంగా తయారుచేయించడం ఆనవాయితీగా మారి, క్రమంగా ఇతర ప్రాంతాలకూ వ్యాపించింది.

అయితే, మిఠాయిల్లో ఎప్పుడూ పంచదార చిలకలూ కోవా రకాలే అయితే కొత్తదనం ఏముంటుంది అనుకున్న తాపేశ్వరం, రాజమండ్రికి చెందిన సురుచి, భక్తాంజనేయ దుకాణదారులు రోళ్లూ రోకళ్లలాంటి వస్తువులతోబాటు దేవుళ్ల విగ్రహాలూ బిందెలూ చెంబుల రూపంలోనూ మిఠాయిలను తయారుచేస్తున్నారు. మరమరాలూ, బూందీ పాకంతో చేసి, పలుచని ప్లాస్టిక్‌ కవర్‌తో ప్యాక్‌ చేసి చమ్కీదారాలతో అలంకరిస్తోన్న ఈ తీపి పెళ్లితంతు సామగ్రి పెళ్లివారిని విశేషంగా ఆకర్షిస్తోంది. ఇవనే కాదు, ఆయా దుకాణాల్లో కోవా స్వీట్లను పండ్లూ కూరగాయలూ కొబ్బరికాయల ఆకారాల్లో ఎంతో అద్భుతంగా తయారుచేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ నుంచి రప్పించిన పాకశాస్త్ర నిపుణులతో పెళ్లివారి అభిరుచులకు తగ్గట్లుగా సహజరంగులతో ప్రత్యేకంగా చేయిస్తోన్న సురుచి వారి కోవా స్వీట్లు ఔరా అనిపించేలా ఉంటున్నాయి.

నిజానికి ఈ కంతలూ సారెల సంస్కృతి ఈనాటిదేం కాదు, కమనీయ కావ్యంగా చెప్పుకునే సీతారాముల కళ్యాణ కాలం నుంచీ ఉన్నాయని తెలుస్తోంది. దశరథమహారాజు నలుగురి కుమారుల వివాహానికి పట్టుచీరలూ ఆభరణాలతోబాటు పలు పిండివంటలతో వూరేగింపుగా వెళ్లినట్లు పౌరాణిక కథనం. ఆనాటి సంస్కృతికి చిహ్నంగా రాజులూ సంపన్నులూ తమ దర్పాన్ని ప్రదర్శించేందుకు కంతల్ని తీసుకురావడం ప్రారంభించారు. పూర్వం గుర్రబ్బండ్లూ ఎడ్లబండ్లతో మగపెళ్లివారు పండ్లూ మిఠాయిల కంతలతో వస్తే, ఆడపెళ్లివారు వూరి పొలిమేరల్లోనే వారికి ఎదురెళ్లి, బ్యాండుమేళంతోనూ పానకాల కావిళ్లతోనూ విడిది గృహాలకు తీసుకెళ్లి, అతిథి మర్యాదలు చేసేవారు. ఇప్పుడు బండ్లు పోయాయి, కార్లు వచ్చాయి. మర్యాదలు మాత్రం అలాగే ఉన్నాయి, కంతలూ మరింత ఘనంగా రూపుదిద్దుకున్నాయి. ఫలితం... మగపెళ్లివారు తమ స్థాయిని బట్టి కంతలకోసం పదివేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకూ ఖర్చుపెడుతున్నారు. కోవా, డ్రైఫ్రూట్స్‌తో భిన్న రూపాల్లో చేసే స్వీట్లతోబాటు కొత్తగా బూందీ, మరమరాలతో చేసే తియ్యని రోళ్లూ, రోకళ్లూ, బిందెలూ, చెంబులూ... లాంటి వస్తువుల్నీ కంతల్లోకి చేర్చేస్తున్నారు. తమదైన తీపి అందాలతో పెళ్లికొచ్చిన అతిథుల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తున్నారు. ‘ఆయ్‌... మరేనండీ... పెళ్లంటే పందిళ్లూ... సందళ్లూ... తీపి తీపి రుబ్బురోళ్లూ సన్నికళ్లూ కూడానండీ...’ అంటూ సన్నాయి రాగాలు ఆలపిస్తోన్న గోదారోళ్ల తీపి కళాపోషణను అభినందించకుండా ఉండగలమా..!
- గాడేపల్లి వెంకటరమణమూర్తి 
న్యూస్‌టుడే, మండపేట 
ఫొటోలు: జి.శేషగిరి, రాజమండ్రి

శ్రీ మల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి ఆలయం_Kamakshi temple




శ్రీ మల్లికార్జునస్వామి సమేత
 కామాక్షితాయి ఆలయం

శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయికదా. దేవీ పూజలు, ఆలయాలలో అమ్మవారికి రకరకాల అలంకారాలతో అనేక అవతారాలలో అమ్మ దర్శనాలు, ఈ పది రోజులు ఎంతో సందడిగా వుంటుంది కదా. మరి ఈ సందర్భంగా మనం కూడా కొన్ని అమ్మవారి ఆలయాలను దర్శిద్దాము.

నెల్లూరుజిల్లాలో ప్రసిధ్ధి చెందిన శ్రీ మల్లికార్జునస్వామి సమేత కామాక్షితాయి ఆలయం నెల్లూరుకి 18 కి.మీ. ల దూరంలో వున్నది. స్కాంద పురాణంలో శ్లాఘించబడిన ఈ దేవతల ఆవిర్భావం కృతయుగంలో జరిగింది. ఆ కధ ఏమిటంటే….

ఆ కాలంలో ఋషీశ్వరులు, రాజులు, లోక కళ్యాణంకోసం యజ్ఞాలు చేసేవారు. ఒకసారి కశ్యప ప్రజాపతి ప్రజాక్షేమం కోసం ఒక యజ్ఞాన్ని చేయాలనుకుని తగిన ప్రదేశంకోసం వెతుకుతూ పినాకినీ నదీతీరాన వున్న ఈ ప్రాంతాన్ని చూసి యజ్ఞానికి అనువైన ప్రదేశమనుకుని ఇక్కడ తూర్పు, నైరుతి, వాయవ్యాలలో యజ్ఞకుండాలను స్ధాపించి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేశాడు. ఈ యజ్ఞంమూలంగా అప్పుడు జరిగిన లోక కళ్యాణం సంగతి ఎలా వున్నా, ఇన్ని యుగాలయినా భక్తుల కోరికలు తీరుస్తూ, వారి కొంగు బంగారమై పూజలందుకుంటున్న మూడు దేవతామూర్తుల ఆవిర్భావం జరిగింది.


యజ్ఞం పూర్తయిన వెంటనే తూర్పున ప్రతిష్టింపబడ్డ ఆహవనీయాగ్నియందు శ్రీదేవి, భూదేవి సమేతుడై శ్రీరంగనాధుడు ఆవిర్భవించాడు. ఆయనే ప్రస్తుతం నెల్లూరులోవున్న తల్పగిరి రంగనాధస్వామి. నైరుతిలోప్రతిష్టింపబడ్డ వైవస్వతాగ్నిలో శ్రీలక్ష్మీ సమేతుడైన నరసింహస్వామి ఆవిర్భవించి వేదగిరిలో కొలువుతీరాడు. వాయువ్యానవున్న గార్హస్పత్యాగ్నియందు పరమశివుడు లింగాకృతిలో ఆవిర్భవించాడు. కశ్యప ప్రజాపతి మహాశివుణ్ణి అక్కడనే కొలువుండి ప్రజలను కాపాడమని ప్రార్ధించగా పరమశివుడు అంగీకరించాడు. అదే నాటి రజతగిరి. యజ్ఞము చేసిన ప్రదేశముగనుక యజ్ఞవాటిక, అదే కాలక్రమేణా జన్నవాడ, జొన్నవాడ అయింది.

కైలాసంలో పార్వతీదేవి శివుడు కనబడక తన మనోనేత్రంతో అసలు విషయం తెలుసుకుని తానూ అక్కడికి వచ్చి పరమశివుణ్ణి కైలాసానికి రమ్మని కోరింది. అందుకు శివుడు అత్యంత సుందరమైన ఆ ప్రదేశాన్ని వీడలేనని పార్వతీదేవినికూడా అక్కడే కొలువుతీరి భక్తుల కోర్కెలు తీర్చమని ఈశ్వరుడు ఆదేశించగా పార్వతీదేవి కూడా అక్కడే కొలువుతీరింది. ఇది పురాణగాధ. కాలక్రమంలో పినాకినీ నది (పెన్నా నది) వరదలలో ఈ ప్రదేశమూ, ఆలయమూ నీట మునిగాయి. మేటలు వేసి, బీళ్ళుగామారిన ఈ ప్రాంతంలో మనుమసిధ్ధి రాజుల పాలనా కాలంలో చుట్టుపక్కల ప్రాంతాలనుంచి పశువులు ఇక్కడికి మేతకివచ్చేవి.

వాటిలో సమీప గ్రామమయిన పెనుబల్లి జమీందారుకి చెందిన ఒక ఆవు సరిగా పాలు ఇవ్వక పోవటంతో ఒకనాడు పశువుల కాపరి ఆ ఆవుని వెంబడించి, ఆ ఆవు ఒక పుట్టలోకి పాలను వదులుతూండటం చూసి, చేతిలోని గునపాన్ని విసిరాడు. ఆవు తప్పించుకుందిగానీ, గునపం పుట్టలోదిగి పుట్టనుంచి రక్తంరావటం మొదలయింది. అది చూసిన పశువుల కాపరి భయపడి పరుగున వెళ్ళి జమీందారుకి విషయం తెలియజేశాడు. వెంటనే జమీందారు ఆ ప్రదేశానికి చేరుకుని పనివాళ్ళతో ఆ పుట్టని తవ్వించగా రక్తపు మడుగులో శివలింగము కనిపించింది. జమీందారు వెంటనే ఆ లింగాన్ని పినాకినీ నది నీళ్ళతో శుభ్రపరిచి, ఆ పరిసరాలన్నీ శుభ్రంచేయించి, లింగానికి పూజలు జరపటానికి ఒక బ్రాహ్మణుణ్ణి నియమించాడు.

కొన్నాళ్ళకి శివుడు జమీందారు కలలో కనిపించి తనకి శిరోవేదనగావున్నదనీ, మల్లెపూవుల చల్లదనంతో తన శిరో వేదన తీర్చమని ఆదేశించాడుట. జమీందారు తన కలని గురించి పెద్దలకి తెలియజేసి, తన తోటలోని మల్లెపూవులతో శివుణ్ణి అర్చించాడుట. అప్పటి పండితులు ఆలోచించి మల్లెపూవులతో పూజించమని శివుడు ఆజ్ఞాపించాడుగనుక, మల్లెపూవుల నడుమ విలసిల్లుతున్న ఆ దేవదేవునికి మల్లికార్జునుడని పేరుపెట్టారు.


మరికొంతకాలము తర్వాత పార్వతీదేవి ఆ జమీందారుకి స్వప్న దర్శనమిచ్చి తాను వస్తున్నానని, తనని పరమేశ్వరుని చెంత ప్రతిష్టించమని ఆదేశించింది. తర్వాత ఒకనాడు పెనుబల్లి గ్రామ సమీపంలో పినాకినీ నదిలో చేపలు పడుతున్న బెస్తవారికి అమ్మవారి విగ్రహం కనబడింది. వారు అమిత సంతోషంతో ఆ తల్లిని గంగమ్మతల్లిగా భావించి తమకు చేతయిన విధంగా పూజించి, తమకు లభించిన ఆహారాన్ని ఆ తల్లికి నివేదించి తాము తినసాగారు. (అందుకే ఇప్పటికీ ఈ ఆలయంలో సంకల్పంలో గంగా, కామాక్షీ అనుగ్రహసిధ్ధ్యర్ధం అని చెబుతారు). జమీందారుకి ఈ విషయం తెలిసి అక్కడికివెళ్ళి, తన కలసంగతి చెప్పి, వారి అంగీకారంతో అమ్మవారినితెచ్చి స్వామి దగ్గర ప్రతిష్టించారు. అమ్మవారి విగ్రహం పెనుబల్లి సమీపంలో దొరికిందికనుక అమ్మవారిని పెనుబల్లి ఆడబడుచుఅని, ఈనాటికికూడా బ్రహ్మోత్సవాలలో కళ్యాణంనాడు అమ్మవారికి ఆ గ్రామమునుంచి సారె తీసుకువస్తారు. కళ్యాణం తర్వాత అమ్మవారు ఊరేగింపుగా ఆ గ్రామానికి వెళ్తారు.

అమ్మవారిని శివుని పక్కన ప్రతిష్టించిన తర్వాత ఆలయంలో బ్రాహ్మణుడు నివేదన చేస్తే బయట పామరులయిన భక్తులు తాము వండుకున్న మాంసాదులు నివేదించేవారు. ఆ నివేదనలు అలవాటుపడ్డ అమ్మవారు మాంసాహార నివేదన లేని రోజు అర్ధరాత్రి ఊరిలో ప్రవేశించి పశువులను ఆరగించటం మొదలుపెట్టింది. భయపడిన భక్తులు రాత్రిళ్లు ప్రాణాలరచేతిలో పెట్టుకుని బతికేవారు.

ఆ సమయంలో ఆది శంకరాచార్యులు ఆ గ్రామానికి విచ్చేశారు. గ్రామస్తులద్వారా అమ్మవారి ఆగడాలు విన్న శంకరాచార్యులవారు ఆలయం తలుపులు తెరిపించి రాత్రికి అక్కడే విశ్రమించారు. అర్ధరాత్రి బయటకు వెళ్ళబోతున్న అమ్మని ప్రార్ధించి, అనేక విధముల స్తోత్రములు చేసి, శాంతపరచి, తిరిగి గర్భగుడికి చేర్చారు. అమ్మ ఉగ్ర రూపాన్ని శాంత రూపంగా మార్చటానికి తన తపశ్శక్తిని ధారపోసి ఒక శ్రీచక్రాన్ని అమ్మవారి పాదాలచెంత ప్రతిష్టించారు.

తన ధ్యానములో కృతయుగములో అమ్మవారు స్వామిని చూడవలెనని కోరికతో కైలాసమునుంచి వచ్చి ఇచ్చట కొలువుతీరిన వృత్తాంతము, తరువాత జరిగిన విషయములు గ్రహించి, స్వామిని చూడవలెననే కోరికతో వచ్చినది కావున ఆనాడే పరమేశ్వరుడు కామాక్షీ అని పిలిచిన పలుకులు గ్రహించి, అమ్మకి కామాక్షీతాయి అని నామకరణము చేశారు. తాయి అంటే అమ్మ అని అర్ధము. ఆది శంకరాచార్యులవారు కాలడివారు, జన్నవాడ ఆ కాలములో మదరాసు ప్రాంతములో వున్నది కనుక తాయి అని అనివుండవచ్చు.


ఆది శంకరులవారు కొంతకాలము అక్కడే వుండి అమ్మవారికి మాంసాహరము పూర్తిగా నిషేధించి, పైదీక మార్గమున శ్రీచక్రమును నవావరణములతో పూజించే విధానాన్ని అక్కడి బ్రాహ్మణులకు బోధించారు. అప్పుడు గ్రామస్ధులు ఆదిశంకరులవారిని “అయ్యా, మేము మాసాహారులం, ఏ ఆహారమైనా భగవంతునికి చూపించిన తరువాత భుజించాలి అంటారు..మరి మేము తినే ఆహారము అమ్మవారికి చూపించకూడదు అంటున్నారు..దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి” అని అడిగారు. అందుకు శంకరాచార్యులవారు దేవాలయమునకి సమీపములోవున్న వేపమానును చూపించి దీనిని కనకదుర్గ అవతారముగా భావించి, మీ నైవేద్యములు ఇక్కడ సమర్పించుకోండి అని చెప్పి తమ యాత్రని కొనసాగించారు.

కొంతకాలం తర్వాత పల్లవరాజు నరసింహవర్మ తురుష్కలమీద దండయాత్రకి వెళ్తూ తోవలో 
ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు. అమ్మవారు నరసింహవర్మకు స్వప్న దర్శనమిచ్చి, నీకు యుధ్ధములో విజయం చేకూరుతుంది, తిరుగు ప్రయాణంలో ఈ ఆలయాన్ని పునరుధ్ధరించమని ఆదేశించారు. యుధ్ధములో విజయము సాధించిన పల్లవరాజు తిరుగు ప్రయాణంలో ఈ దేవాలయమును దృఢముగా నిర్మింపచేసి, దేవీ కైంకర్యమునకు అనేక భూములను దానము చేసెను.

సంతానము లేనివారు ఈ ఆలయములో నిద్ర చేస్తే అమ్మ స్వప్న సాక్షాత్కారమిచ్చి వారి కోరికలు తీరుస్తుందని భక్తుల నమ్మకం.

ఈ దేవాలయంలో జరిగే నవావరణ పూజ బీజాక్షరములతో వుంటుంది. కొన్ని తరముల క్రితం సాక్షాత్తూ అమ్మవారిచేత గుడిలోని ప్రధాన పూజారికి ఉపదేశింపబడిన బీజాక్షరముల సంపుటీకరణమే ఈ నవావరణయని ప్రసిధ్ధి. ఈ పూజ ప్రపంచంలో కేవలం ఈ దేవాలయమునందుమాత్రమే జరుపబడుతుంది. ఈ పూజకి ఎంతో శక్తి వున్నదని భక్తుల నమ్మకం. అమ్మవారికి ఈ పూజ అంటే ఎంతో ప్రీతి అని ఇక్కడికి వచ్చే భక్తులు ఈ పూజ జరిపించుకుంటారు.


ఇక్కడ శివాలయంలో శివునికి జరిగే సహస్రనామం కూడా సాక్షాత్తూ వేదవ్యాసుడు ఈ దేవాలయంలో పూజారులకు దర్శనమిచ్చి వేదములలోని సారమంతా క్రోడీకరించి సహస్రనామాలుగా ఉపదేశించారని ప్రతీతి. ఈ సహస్రనామ పూజ వలన నాలుగు వేదములు పారాయణ చేసినంత ఫలితం వస్తుందిట. ఈ సహస్రనామం వేరే ఏ దేవాలయంలో జరుగదు. వ్రాత ప్రతి తప్ప ఏ గ్రంధములోను ఈ సహస్రనామం లేదు. దీనిని ఇక్కడి అర్చకులు ఎవరికి చెప్పరు. అది వారి నియమము.

ఇన్ని విశేషాలు వున్న ఈ ఆలయాన్ని అవకాశం వున్నవారు తప్పక దర్శించాలి.
దర్శన సమయాలు ఉదయం 6-30 నుంచి మధ్యాహ్నం 1-00 గం. దాకా తిరిగి సాయంత్రం 5-00 గం. ల నుంచి రాత్రి 9-00 గం. ల దాకా.                                     -పి.యస్.యమ్. లక్ష్మి



Boost Post


mohan publications price list