MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఆనందానికి 5 సూత్రాలు_5stepstohappiness

5 steps to happiness happyness ravishankaguruji anandaniki5sutralu



5 steps to happiness happyness ravishankaguruji anandaniki5sutralu

ఆనందానికి 5 సూత్రాలు
      అనగా అనగా ఒక గురువుగారు పాఠం చెబుతూ, నల్లబల్లపై ఒక గీత గీసి, ఆ గీతను చెరపకుండా చిన్నదిగా చేయమని విద్యార్థులను అడిగారు. ఎలా చేయగలం? ఆ గీతను ముట్టుకోకుండా చిన్నదిగా చేయాలి. అప్పుడు వారిలో ఒక తెలివైన విద్యార్థి లేచి ఆ గీత కింద మరొక పెద్ద గీత గీశాడు. ఇక్కడ నీతి ఏమంటే, మీ కష్టాలు చాలా పెద్దవిగా అనిపించినపుడు, ఒక్కసారి కనులు పైకెత్తి చూడండి. ఇప్పటివరకూ మీ దృష్టిని మీపైనే కేంద్రీకరించి ఉంచారు. ఒకసారి కనులు పైకెత్తి మీ చుట్టూ ఉన్నవారిని, మీ కంటే చాలా ఎక్కువ కష్టాలు పడుతున్నవారిని చూడండి. హఠాత్తుగా మీ కష్టం మీరనుకున్నంత పెద్దదేమీ కాదనిపిస్తుంది. మీలో ఆత్మవిశ్వాసం, ‘‘నా సమస్య చిన్నది, నేను దీనిని అధిగమించగలను’’ అనే నమ్మకం కలుగుతుంది.


1. ఆనందంగా ఉండటానికి మొదటి సూత్రం- ప్రపంచంలో ఎక్కడైతే పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయో అక్కడ చూడండి. ఎప్పుడైతే మీ సమస్యలు చిన్నవిగా కనిపిస్తాయో అప్పుడు ఆ సమస్యలను ఎదుర్కొనే, పరిష్కరించే శక్తి, ఆత్మ విశ్వాసం కలుగుతాయి. స్థూలంగా చెప్పాలంటే, ఎక్కువ కష్టాలున్నవారికి సహాయపడండి.

2. రెండవ సూత్రం- ఒకసారి మీ జీవితంలోకి తొంగి చూస్తే, గతంలో మీకు ఎన్నో సమస్యలు వచ్చాయి. అవన్నీ వచ్చి, వెళ్ళిపోయాయి. ఇది కూడా వెళ్ళిపోతుందని, ఈ సమస్యను అధిగమించగలిగే శక్తి సామర్థ్యాలు మీలో ఉన్నాయని తెలుసుకోండి. మీ గతాన్ని అర్థం చేసుకోవటం వలన మీలో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. 

3. మూడవది- కొద్దిసేపు యోగా, ప్రాణాయామం చేయండి.నాలుగవది- మనం కోపంగా ఉన్నప్పుడు ‘నేను ఇవన్నీ వదిలేస్తాను’ అని అంటూ ఉంటాము. ఇప్పుడు కోపం, చికాకు ఏమీ లేకుండా ‘నేను ఈ సమస్యను వదిలేస్తాను. దీనిని నేను పరిష్కరించలేను. దైవం నాకు సహాయపడనీ!’ అని చెప్పండి. చెప్పి, మీకు సహాయం తప్పక లభిస్తుందని తెలుసుకోండి. దివ్యశక్తి మీకు సహాయపడబోతోంది.

4. మీ అంతట మీరే వీటిని కనుక్కోగలిగితే బాగుంటుందని నా భావన. పరిష్కారాల కోసం మనం ఎప్పుడూ ఇతరుల వంక చూస్తాం. మన మనసును లోపలికి తిప్పగలిగితే మనకే ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందని మరచిపోతున్నాం.

5. ఐదవ సూత్రం- సద్యఃస్ఫూర్తి. అంతా సవ్యంగా ఉన్నపుడు, మీరు ఊహించినవిధంగానే అన్నీ జరుగుతున్నపుడు చిరునవ్వులు చిందించటంలో గొప్పతనమేమీ లేదు. అయితే మీలోని ధైర్యాన్ని మేలుకొలిపి, ‘ఏది ఏమైనా కానీ, నేను చిరునవ్వుతోనే ఉంటాను’ అని అన్నప్పుడు మీ లోపల అద్భుతమైన శక్తి జనించటం మీరు గమనిస్తారు. అప్పుడిక సమస్య దాదాపు శూన్యం. ఇలా వచ్చి అలా మాయమైపోతుంది.

శ్రీశ్రీ రవిశంకర్‌

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list