MohanPublications Print Books Online store clik Here Devullu.com

గంధము పూయరుగ.. పన్నీరు... _Sandalwood

 
PELLI,VIVAGAMU 
 
గంధము పూయరుగ.. పన్నీరు...
పెళ్లితో ఒక్కటైన యువతీయువకులకు కళ్లముందున్న పడకగది ప్రణయస్వప్నాన్ని సాకారం చేసే పూపొదరిల్లుగా సాక్షాత్కరిస్తుంది. అందుకే ‘పడకగది’ అనే పదం చెవిన పడగానే మనసు తీయని లోకాలకు వెళుతుంది. శారీరక, మానసిక సంగమంతో దాంపత్య బంధాన్ని నిత్యనూతనంగా మార్చే పడకగదిలో భార్యాభర్తలిద్దరూ ఆనందంగా ఉండాలంటే ఘ్రాణేంద్రియాన్ని నమ్ముకోవాలంటారు శాస్త్రవేత్తలు. అద్భుతమైన సుఖానికి చక్కని మార్గదర్శి మన ముక్కే!

మనిషి దేహంలోనే సహజమైన వాసనతో తేలిగ్గా ఇగిరిపోయే శక్తిగల కొన్ని రసాయనాలు ఉన్నాయి. వాటినే ‘ఫెరిమోన్స్‌’ అంటారు. ఎపోక్రైన్‌ గ్రంథుల్లోంచి విడుదలయ్యే ఈ హార్మోన్లు యవ్వనంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇవే కామవాంఛను కలిగించి స్త్రీ, పురుషులను దగ్గర చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. కొన్నిరకాల సువాసనలు స్త్రీలలో, పురుషుల్లో శృంగార వాంఛను ఉద్దీపింపజేస్తాయని కనుగొన్నారు. మత్తు కలిగించే మల్లెల సెంటు వల్ల ముక్కులోని కొన్ని భాగాలు ప్రేరేపితమై మెదడు కూడా ఉత్తేజితమయి శృంగార వాంఛలు కలుగుతాయని చెబుతున్నారు.

* సంప్రదాయ చైనాలో యువతీయువకులు అత్తర్లలో వెనీలాను ఎక్కువగా వాడతారు. వెనీలా నుంచి వచ్చే సుగంధం మనిషిలో కామాన్ని ఉత్తేజితం చేయడంతో ఆలోచనంతా శృంగారం వైపు మళ్ళుతుంది.

* మల్లెపువ్వు హెడోన్‌ అనే రసాయనాన్ని కలిగి ఉంటుంది. ‘హెడోన్‌’ గ్రీకు పదం. సరదా, సుఖం, కామం అని అర్థాలు. మల్లెలు, మాగ్నోలియాలను కలిపి చేసిన సుగంధం ఎన్నో అత్తర్లలో వాడుతున్నారు. కొన్ని చుక్కల మల్లెల సెంటును శరీరంపై మృదువుగా రుద్దుకుంటే కోరిక మేల్కొనడానికి ఎంతో సమయం పట్టదు.

* క్లియోపాత్ర దాల్చినచెక్క అత్తరు వాడేదట. అప్పటినుంచి దాల్చినచెక్క శక్తిపై ఎన్నో పరిశోధనలు సాగాయి. దీని వాసన తగలగానే మగవారిలో కామోద్రేకం కలుగుతుంది. భావోద్రేకాలు, ప్రవర్తన, హార్మోన్ల స్థాయి, శక్తి కూడా పెరుగుతుంది. కొలోన్స్‌, పెర్‌ఫ్యూమ్స్‌ తయారీలో దీన్ని ఎక్కువగా వాడతారు.

* లావెండర్‌ సెంటు పురుషుల్లో కామోద్రేకాన్ని కలిగించడంలో చాలా శక్తిమంతమైంది. గుమ్మడికాయతో చేసిన పదార్థాలు తిని, లావెండర్‌ సువాసనను పీలిస్తే పురుషుడు తక్షణం ఉన్ముఖుడవుతాడు.

* లవంగాలు నోటికి సుగంధాన్ని అందించడమే కాదు, స్త్రీ పురుషులిద్దరిలోనూ టెస్టోస్టిరాన్‌ స్థాయిని పైకి ఎగిసేట్టు చేస్తాయి. ఇవి పునరుత్పత్తి అవయవాలను ఉత్తేజితం చేసి పొందుకోసం పరితపించేట్టు చేస్తాయి. చిటికెడు లవంగాల పొడిని టీలోనో, కాఫీలోనో కలుపుకుని తాగితే ప్రతిరేయీ వారికి తొలిరేయి అవుతుంది.

* ధైర్యం తక్కువగా అనిపిస్తే నిమ్మకాయనో, దబ్బపండునో, నారింజనో, కమలానో, బత్తాయినో ముక్కు దగ్గర పెట్టుకుని మనసారా సువాసనను ఆస్వాదిస్తే చాలు బోల్డెంత ధైర్యం వస్తుందట.

* పింక్‌ ద్రాక్షపండ్ల సెంట్లను మధ్య వయసు స్త్రీలకు పూసి పురుషులు వారిని కలిసేట్టు చేశారు పరిశోధకులు. తాము కలిసిన స్త్రీ వయస్సుని వారి అసలు వయస్సుకంటే ఆరు సంవత్సరాలు తక్కువగా భావించారట ఎక్కువమంది పురుషులు. అలాగే ఆరెంజ్‌ సెంట్‌ ఇరవై శాతం మంది మగవారిలో కామోద్రేకాన్ని పుట్టించిందట. మగవాళ్ళు నిమ్మ జాతి సుగంధాన్ని కలిగిన సెంటు పూసుకున్న స్త్రీని ఇష్టపడతారని ఎన్నో పరిశోధనలు నొక్కి చెబుతున్నాయి.

* చందన సుగంధాన్ని తరతరాలుగా సెక్స్‌ సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగిస్తున్నారు. దీన్ని ఆఘ్రాణించడం వల్ల చురుకుదనం మరింత పెరుగుతుంది. శరీరంలో ఉండే ఎండ్రోక్రెయిన్‌ గ్రంథుల్లో ముఖ్యమైన పిట్యూటరీ గ్రంథిని చందనం ఎంతగానో ఉత్తేజితం చేస్తుంది. పిట్యూటరీ గ్రంథి చురుగ్గా లేకపోతే మనిషిలో శృంగార వాంఛలు తగ్గుతాయి.

* ప్రాచీన గ్రీకుల కాలం నుంచి పెప్పరమెంట్‌ కామోద్దీపనానికి పనికివచ్చేదిగా ఎంతో ప్రఖ్యాతిని పొందింది. విజ్ఞానశాస్త్రం కూడా దానిలో ఉత్తేజితం చేసే లక్షణాలున్నాయని కనుగొంది. పిప్పరమెంట్‌లో ఉన్న ఎస్టర్‌ లేదా మిథైల్‌ ఎసిటేట్‌లు సువాసనకు కారణం. ఇది మనసును శృంగారం వైపు తీసుకెళుతుంది. స్త్రీలలో ఎక్కువసార్లు భావప్రాప్తికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list