మీరు వాట్సాప్ అడ్మినా? అయితే చదవండి!
శాన్‌ఫ్రాన్సికో: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో వినియోగదారుల ముందుకు వస్తోంది. ఇప్పుడు తీసుకొచ్చిన ఫీచర్‌తో గ్రూప్ అడ్మిన్‌ల చేతిలో ఆయుధాన్ని ఉంచింది. గ్రూపులోని కొందరు సభ్యులు నిత్యం అవసరం ఉన్నా లేకపోయినా టెక్ట్స్ మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఫైల్స్, డాక్యుమెంట్లు పోస్ట్ చేస్తుంటారు. ఇంకో గ్రూప్‌లో వచ్చిన సమాచారం.. ఈ గ్రూప్‌లోకి షేర్ చేస్తూ మిగిలిన సభ్యులకు తరచూ చికాకు కలిగిస్తుంటారు. అలాంటి వారు పంపే మెసేజ్‌లకు ఇక నుంచి అడ్డుకట్ట వేయవచ్చు.
డబ్ల్యూఏబీటా ఇన్ఫో ప్రకారం ఈ సరికొత్త వాట్సాప్ ఫీచర్‌ను పరీక్షిస్తున్నారట. బీటా ప్రోగామ్ వెర్షన్ 2.17.430 ద్వారా కొన్ని గ్రూప్‌లకు ఇది అందుబాటులోకి వచ్చింది. ‘రిస్ట్రిక్టెడ్ గ్రూప్స్’ సెట్టింగ్‌ను కేవలం గ్రూప్ అడ్మినిస్ట్రేటర్లు మాత్రమే యాక్టివేట్ చేసేందుకు వీలుంది. ఒకసారి ఒక సభ్యుడిని రిస్ట్రిక్ట్ చేస్తే అతను కేవలం గ్రూప్‌లో వచ్చే సందేశాలను మాత్రమే చదవగలడు. స్పందించడానికి ఎలాంటి వెసులుబాటూ ఉండదు. వారు కేవలం ‘మెసేజ్ అడ్మిన్’ బటన్‌ను ఉపయోగించి మాత్రమే మెసేజ్‌లు పోస్ట్ చేయగలరు. గ్రూప్‌లోకి ఆ పోస్ట్ వెళ్లే ముందు అది గ్రూప్ అడ్మిన్ పరిశీలనకు వెళ్తుంది. అతను ఆమోదం తెలిపిన తర్వాతే అది పోస్ట్ చేయడానికి వీలవుతుంది.
ఒక గ్రూప్‌లోని సభ్యుడిని కేవలం 72 గంటల పాటు మాత్రమే రిస్ట్రిక్ట్ చేసేందుకు వీలుంది. మరోవైపు ఇప్పటికే వాట్సాప్‌లో ఎదురవుతున్న బగ్స్ ఎప్పటికప్పుడు తొలగిస్తున్నారు. మరింత సమర్థంగా పనిచేందుకు వాట్సాప్ బృందం పనిచేస్తోంది.

No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565