MohanPublications Print Books Online store clik Here Devullu.com

Agnyaathavaasi Songs Jukebox || Pawan Kalyan || Trivikram || Anirudh Ravichander

Agnyaathavaasi Songs Jukebox || Pawan Kalyan || Trivikram || Anirudh Ravichander

Search Results

 

earch Results


అజ్ఞాతవాసి
ద్వారా మరొక్కసారి
వాటిని సామాన్యప్రజలకు
గుర్తు చేస్తున్నందుకు 
గుర్తు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు


అజ్నాతవాసి టీజర్ చూసిన తరువాత చాలామందికి తెలియని ఒక వ్యక్తి గురించి చెప్పాలనిపిస్తుంది అని కళాతపస్వి విశ్వనాథ్ అన్నారు. ఆయన గుర్తుచేసుకున్న వ్యక్తి ఎవరో కాదు, ఉత్తుక్కాడు శ్రీ వెంకట సుబ్బయ్యర్.

వివరాలలోకి వెళ్తే... 

ఉత్తుక్కాడు శ్రీ వెంకట సుబ్బయ్యర్. సుప్రసిద్ధ కర్ణాటక సంగీతకారుడు, కృతికర్త, తమిళనాడులోని మన్నార్ కుడి గ్రామంలో 1700 సంవత్సరంలో జన్మించారు. కానీ పెరిగిందీ గుర్తింపు పొందిందీ పాపనాశం కు దగ్గరలో ఉన్న దేనుజవాసపురం (ఊత్తుక్కాడు) గ్రామంలోనే. ఇదే ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. 

నీడామంగళం నటేశరత్న భాగవతార్ వద్ద అతి తక్కువ సమయంలో సంగీత సాధన పూర్తి చేసి ఆ స్ధాయికి విద్య నేర్పే గురువులెవరూ లేక శ్రీకృష్ణుడ్నే గురువుగా భావించి కృష్ణతత్వాన్ని గురించిన అద్భుతమైన కీర్తనలను రచించారు. గాయకుల స్వరాలకు వరాలుగా భావించే , భక్తినీ తన్మయత్వాన్నీ కలిగించే అనేక మధురమైన కీర్తనలను ప్రపంచానికి అందించిన ఘనత ఉత్తుక్కాడు శ్రీ వెంకట సుబ్బయ్యర్ దే....! 

ఇప్పుడు అజ్నాతవాసి సినిమాలో ఉపయోగించిన 'స్వాగతం కృష్ణా' అనే కీర్తన వెంకట కవిగా పిలవబడే ఉత్తుక్కాడు శ్రీ వెంకట సుబ్బయ్యర్ కవి రచించినదే. పవన్ త్రివిక్రమ్ సినిమాలలో ఇలాంటి కీర్తనలను ఉపయోగించడం ద్వారా మరొక్కసారి వాటిని సామాన్యప్రజలకు గుర్తు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియచేయాలి. 

ఆ కీర్తన ఇదే....!   https://www.youtube.com/watch?v=GViCXaFip_c
స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా
స్వాగతం కృష్ణా శరణాగతం కృష్ణా 
మధురాపురి సదనా మృదువదనా 
మధుసూదన ఇహ  //స్వాగతం కృష్ణా//  
 భోగ ధాప్త సులభా సుపుష్ప గంధ కలభా 
కస్తూరి తిలక మహిపా మమ కాంత నంద గోపకంద  //స్వాగతం కృష్ణా//  
ముష్టికాసూర ఛాణూర మల్ల మల్ల విశారద మధుసూదనా
కువలయాపీడమర్దన కాళింగ నర్తన
గోకులరక్షణ సకల సులక్షణ దేవా 
శిష్ట జన పాల సంకల్ప కల్ప
కల్ప శత కోటి అసమపరాభవ
ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా
ధీర ముని జన విహార మదన సుకుమార దైత్య సంహార దేవా
మధుర మధుర రతి సాహస సాహస
వ్రజ యువతి జన మానస పూజిత  //స్వాగతం కృష్ణా// 
స ,గప, గరి , ,ప గ రి స గ స ,
స రి గ ప ద ,స ప ...సగ రి.ప గ రి స గ సా
స స రి రి గ గ ప ప స స దపప, గ రి రి స గరిస
స రి గ, రి గ ప ,గ ప ద స ,ద ప గ రి, మా గ రి స ద స
తిటక జనుతాం తకజనుతాం తతకి టకజనుతాం
తకతరి కుకుంతన కితతకదీం
తకతరి కుకుంతన కితతకదీం
తకతరి కుకుంతన కితటక ధీం  //స్వాగతం కృష్ణా//రావినుతల సుధాకర్ సహకారంతో






No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list