MohanPublications Print Books Online store clik Here Devullu.com

శ్రీశైలం క్షేత్రం - స్థల పురాణం / లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడం ఎలా? / శివాష్టోత్తర శతనామ స్తోత్రం / చిత్రగుప్త వ్రత విధానం MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU


                        శ్రీశైలం క్షేత్రం - స్థల పురాణం


మొన్న నాల్గవతేదీ తిథులప్రకారం నాజన్మదిన సందర్భంగా శ్రీశైలాన్ని దర్శించుకున్నాము. ఆసమయంలో మేము చెప్పుకున్న కథలన్నీ ఒకచోట పొందుపరుద్దామని ఇక్కడ రాస్తున్నాను.  

    ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లిఖార్జున లింగము, అమ్మవారి కంఠం( గ్రీవం ) పడిన స్థానం కనుక అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన భ్రమరాంబికా శక్తి పీఠము శ్రీశైలంలో ఒకే ఆవరణలో వెలిశాయి. శ్రీశైల స్థల పురాణం మేరకు శ్రీమల్లి కార్జున స్వామి ఆలయం 10వ శతాబ్దానిదనీ, భ్రమరాంబాలయం 16వ శతాబ్దానిదని ఆధునిక చరిత్రకారులు చెప్తున్నప్పటికీ ఇది చాలా ప్రాచీన మైనది. శ్రీశైల స్థల పురాణమంతయు స్కాందపురాణములోని “శ్రీశైల ఖండము” అనుపేర గలదు.  

MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU
 

    ఈ ప్రాంతంలో శిలాదుడనే మహర్షి శివుని గురించి ఘోర తపస్సు చేయగా పరమశివుడు ఆ మహర్షి తపమునకు మెచ్చి ప్రత్యక్షమై వరము కోరుకోమని అడిగెను.అప్పుడు శిలాదుడు స్వామి నాకు నీ వరం చేత పుత్రుడు పొందేలా వరం ప్రాసాదించు అని కోరుకున్నాడు.ఆ వర ప్రభావంచేత శిలాదుడికి నందీశ్వరుడు,పర్వతుడనే ఇద్దరు కుమారులు జన్మించారు.వీరిలో పర్వతుడు స్వామి వారి గురించి మరలా తపస్సు చెయ్యగా స్వామి ప్రత్యక్షమయ్యి నీకు సాయుజ్య ముక్తి నిస్తున్నాను అని వరమివ్వగా,  పర్వతుడు స్వామికి నమస్కరించి పరమేశ్వరా! "నీవు నన్ను పర్వతంగా మార్చి నా మీదే నువ్వు కొలువుండేలా, నాయందు ముక్కోటి దేవతలు, సర్వ తీర్థములు, సమస్త ఓషధులు వసించేలా" వరం ప్రసాదించు అని అడిగెను. అదివిని శంకరుడు ఎందుకు అలాంటి వరం కోరుకొంటున్నావు అనగా నేనొక్కడిని తరించడంకాదు, ఇక్కడికి వచ్చిన ప్రతిభక్తుడూ తరించేందుకు అనువుగా ఈవరాన్ని కోరుతున్నాను. ఈ తీర్థాలలో స్నానమాడిన వారికి సమస్త పాపాలూ నశించాలి, ఇక్కడ లభించే ఓషధులతో ఎటువంటి రోగమైనా నశించాలి, శ్రమకోర్చి వచ్చిన వారందరూ నీ దర్శనాన్ని,అనుగ్రహాన్నీ పొందాలి. అందుకనే ఈవరంకోరుతున్నాను అని పర్వతుడు తెలుపగా బొళా శంకరుడు సంతోషించి వరం ప్రసాదించాడు.  శివుడు లింగరూపంలో అక్కడ అవతరించాడు. ఇక్కడ పరమేశ్వరుడు మల్లిఖార్జునిగా,పార్వతీ దేవి భ్రమరాంబికా దేవిగా స్వయంభువులుగా వెలిసారు.  

                                    MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU
మల్లికార్జున నామ ప్రశస్తి :
స్వామి వారిని మల్లిఖార్జునుడు అని పిలవడానికి ఒక పురాణగాధ ఉన్నది. పూర్వం తలిదండ్రులపై కోపించిన కుమారస్వామి కైలాసం నుండి వచ్చి క్రౌంచ పర్వతం చేరాడు. ఆ పర్వతమే నేడు శ్రీశైలం అయినది. కుమారస్వామి వచ్చి ఉన్నచోట మద్దిచెట్టుకు మల్లెతీగ అల్లుకుని ఉన్నది. కుమారునికోసం వచ్చిన శంకరుడు ఆచెట్టు క్రిందనే లింగ రూపంలో వెలిశాడు కనుక స్వామిని “మల్లికార్జునుడు” అంటారు. అర్జున వృక్షం అంటే మద్ది చెట్టు.

మరొక కథ కూడా ఉన్నది : పూర్వం చంద్రవంశపు రాజు అయిన చంద్రగుప్తుని కుమార్తె చంద్రావతి శివుని పరమ భక్తురాలు. ఎపుడూ శివునిని ద్యానిస్తూ గడిపేది. ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు సతీ సమేతుడై సాక్షాత్కరించి ఏమి వరము కావలెనో కోరుకోమ్మని అడగగా అంత చంద్రావతి స్వామీ! నేను మీ శిరముపై ఉంచిన మల్లెపూల దండ ఎన్నటికీ వాడి పోకుండా ఉండేలా వరం ప్రాసాదించమని కోరింది.అపుడు ఆ దండను శివుడు గంగ,చంద్రవంకల మద్య ధరిస్తాడు. శిరమున మల్లెపూల దండ ధరించాడు కావున స్వామి వారికి మల్లిఖార్జునుడు అనే పేరు వచ్చిందని అంటారు. 

వృద్ధ మల్లిఖార్జునుడు : పూర్వం అమ్మవారు తపమాచరించి పరమేశ్వరుని ఇక్కడకు వచ్చి తనను వివాహమాడవలసినదిగా ప్రార్థించారు. అందుకు స్వామివారు ఒక వృద్ధుని రూపంలో వచ్చి ప్రత్యక్షమౌతారు. అమ్మవారు స్వామీ ఏమిటి ఈ అవతారం అని ప్రశ్నించగా నేను అనాదినుండీ ఉన్నవాడను నారూపం ఇదే! ఇష్టమైనచో వివాహమాడుము అని తెలుపుతారు. అందుకు అమ్మ మాహాదేవా! మీ తత్వం నాకు తెలియనిది కాదు. మీ మనోహరత్వం నాకు బాగా తెలుసును మీరు ఏరూపంలో ఉన్నా నాకు ఆమోదమే అని తెలిపి స్వామిని వివాహం చేసుకుంటారు. అలా వచ్చిన స్వామే వృద్ధ మల్లిఖార్జునుడు. నేటికీ లింగ రూపంలో ప్రథాన ఆలయానికి కుడివైపున ఉన్నారు.  

MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU
భ్రమరాంబికా నామ ప్రశస్తి :
పూర్వం అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపదాలచే మరియు చతుష్పదాలచే మరణం లేకుండా వరం పొందాడు. ఈవరం తో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్ధించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది. తర్వాత దేవతలు పధకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతి ని అరుణాసురని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరుచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నమని, కాబట్టి ఈరాక లో వింత ఏమి లేదని చెపుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన అమ్మవారు  అరుణాసురుని సంహరించడానికి వెళతారు. ఆదిశక్తి ఎంతసేపు యుద్ధం చేసినా అరుణాసురుని చంపలేక పోతుంది. చివరికి అతని వరప్రభావమని తలచి షట్పదిఅయిన భ్రమర ( తుమ్మెద ) రూపం ధరించి అసంసాఖ్యకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడి సైన్యాన్ని సంహరిస్తాయి. అమ్మవారు పేద్ద తుమ్మెదగా వచ్చి అరుణాసురుని సంహరిస్తుంది. అరుణాసురుని సంహరించిన తరువాత భ్రమరాంబ దేవతలకోరిక మేరకు శ్రీశైలం నివాసయోగ్యమని తలచి తనంతట తానుగా వచ్చి “భ్రమరాంబికాదేవి”గా ఇక్కడవెలసింది. ఈ గాథ వైవస్వత మన్వంతరంలో జరిగింది. ఐతే అంతకు ముందు ఏనాడో ఈ క్షేత్రం వెలసి ఉంది. ఆనాడు “అర్థనారీశ్వరీ దేవియే” మహాశక్తిగా, క్షేత్ర దేవతగా మల్లికార్జునునితో పాటు వెలసి ఉంది. ఇందుకు నిదర్శనంగా అర్థనారీశ్వరీ దేవాలయం మల్లికార్జున స్వామి ఆలయానికి ప్రక్కనే ఉంది. అంతేకాదు. అర్థనారీశ్వరీదేవియే మహాదేవి అయినట్లు, క్షేత్ర దేవత అయినట్లు శ్రీశైల మహాసంకల్పం కూడా ''... అర్థనారీశ్వరీ భ్రమరాపరమేశ్వరీ ముఖ్యదశ కోటి మహాశక్తి స్థానానాం...'' అనడంలో నిరూపిత మయింది. 


" ఆయన్ని దర్శించుకుంటే జన్మాంతరం కైలాస లోకానికి వెళ్లినప్పుడు ఈ జీవి శ్రీశైలాన్ని దర్శించాడా లేదా అని ప్రశ్నవేస్తారట. అప్పుడు సాక్షిగణపతి మనకు సాక్షిగానిలబడి వచ్చాడని తెలుపుతాడట. అందువలన శ్రీశైలం వచ్చిన వారు "సాక్షిగణపతి" ని తప్పక దర్శించి గోత్రనామాలు తెలుపుకోవాలి.   
MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU

కుమ్మరి కేశప్పకు అటిక(కుండ పెంకు)లో శివుడు బంగారు లింగరూపంలో ప్రత్యక్షమైన ప్రదేశం  "హటకేశ్వరం".  ఇక్కడ అగస్త్యుడు తపస్సుచేశాడని ప్రతీతి.  ఆదేవాలయానికి ప్రదక్షిణలు చేస్తే సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని ప్రతీతి. ఆదిశంకరులు తపస్సు చేసిన ప్రదేశ"ఫాలధార-పంచధార" ఇక్కడే శంకరులు సౌందర్యలహరి, శివానందలహరి రచించారట. ఇచట శంకరులను చంపడానికి గజదొంగ ఒకడు ప్రయత్నించ బోతే నృసింహస్వామి సింహంగా వచ్చి అతనిని హతమార్చారు. "శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే"శిఖరేశ్వరం" మీదున్న నంది మీద నువ్వులు పోసి నందిని తిప్పి నందికొమ్ములలో నుండి శ్రీశైల దేవాలయ శిఖరాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదు.  శ్రీశైలం కొండలన్నిటిలోనూ ఈ శిఖరేశ్వరం అత్యంత ఎత్తైనది. 

       




చాలా మంది లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడం ఎలా? ధనవంతులవడం ఎలా? అదృష్టం కలిసిరావడం ఎలా? శ్రీమంతులు అవడం ఎలా? అని అలోచిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి నివసించడానికి ఇష్టపడే ప్రదేశాలను గూర్చి భారతంలోని శాంతిపర్వంలో ఈ విధంగా తెలిపారు. ధర్మరాజు భీష్ముడిని " పితామహా దేహంలోని పురుషుడు ఏ కారణంగా శ్రీమంతుడు ఔతాడు. ఏకారణంగా నశిస్తాడు " అని అడిగాడు. దానికి భీష్ముడు ఈ విధంగా తెలిపాడు. 

MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU
 ఒక రోజు నారదుడు లోక సంచారము చేస్తూ మందాకినీ నదిని చేరుకుని అక్కడ స్నానమాచరించి ఆ సమయంలోఅప్పటికే ఇంద్రుడు మందాకినీ నదిలో స్నానమాచరించి అనిష్టానం తీర్చుకోవడం చూసి ఇంద్రుడితో సంభాషించ సాగాడు. అప్పుడు ఒక స్త్రీ వచ్చి ఇంద్రుడికి నమస్కరించింది. ఇంద్రుడు " నీవు ఎవరు ఎక్కడకు పోతున్నావు ? " అని అడిగాడు. ఆస్త్రీ " ఓ ఇంద్రా ! నేను తామరపువ్వు నుండి జన్మించిన లక్ష్మినిఇప్పటి వరకు నేను రాక్షసుల వద్ద ఉన్నాను. ప్రస్తుతము వారి ప్రవర్తన నచ్చక ఇప్పుడు నీ వద్దకు వచ్చాను " అన్నది. ఇంద్రుడు " అదిసరే ఇప్పటి వరకు రాక్షసుల వద్ద ఏ గుణములు నచ్చి వారి వద్ద ఉన్నావు ? ఇప్పుడు నీకు వారు ఎందుకు నచ్చ లేదు ? నిన్ను మెప్పించాలంటే ఏమి చేయాలి ? " అని అడిగాడు. లక్ష్మి " ఇంద్రా ! ఇప్పటి వరకు అసురులు దానములువేదాధ్యయనము చేయడము,అతిథులను సత్కరించడం వంటి మంచి పనులు చేసారు. ఇప్పుడు వారికి గర్వము పెరిగి మంచి గుణములను విడిచి పెట్టారు. అందుకని నేను వారిని విడిచ పెట్టాను. నీవు సత్యధర్మపరుడవని ఎరిగి నీ వద్దకు వచ్చాను. గురువుల ఎడ భక్తి కల వారుపితరులను దేవతలను పూజించు వారుసత్యమును పలికే వారుదానశీలురుఇతరుల ధనమును కాని భార్యలను కాని కోరనివారుపగలునిద్రించని వారువృద్ధులపట్ల బాలలపట్ల స్త్రీలపట్ల దయ కలిగిన వారుబ్రాహ్మణులను పూజించు వారునిత్యము శుచిశుభ్రత కలిగిన వారుఅతిథులకు పెట్టికాని భుజించని వారు నాకు అత్యంత ప్రీతిపాత్రులు. నేను వారివద్ద ఉండడానికి ఇష్ట పడతాను. అలా కాక కామముకులోభముక్రోధములకు లోనై ధర్మమును విడిచిన వారు,గర్విష్టులుఅతిథి సత్కారము చేయని వారుపరుషవాక్యములు పలుకువారుక్రూరపు పనులు చేయువారిని నేను మెచ్చను. అటువంటి వారి వద్ద ఉండడానికి నేను ఇష్టపడను " అన్నది లక్ష్మి. ఆ మాటలకు ఇంద్రుడునారదుడు ఎంతో సంతోషించారు. ఇంద్రుడు లక్ష్మీదేవితోసహా స్వర్గానికి వెళ్ళాడు. కనుక ధర్మరాజా ! లక్ష్మీ దేవి నివాస స్థానములు తెలుసుకుంటివి కదా అలా నడచుకో " అన్నాడు. 

కనుక లక్ష్మీ దేవికి సంతోషమును కలిగించే విధంగా నడుచుకున్న వారు ఆ దేవి అనుగ్రహాన్ని పొంది సుఖసౌఖ్యాలు అనుభవిస్తారు.

 ఏనుగు యొక్క కుంభస్థలం, గో పృష్ఠం, తామరపువ్వు, బిల్వదళం, స్త్రీయొక్క సీమంతము ( నుదుటి భాగము ) ఈ ఐదు కూడా లక్ష్మీదేవికి ప్రబల నివాస స్థానములు. అందుకే ఏనుగు ముఖమును ( గజముఖుని ), గో పృష్ఠమును పూజించడం వలన, పద్మములతోను బిల్వదళములతోను ఈశ్వరుని సేవించడం వలన, సీమంతమందు కుంకుమతో అలంకరింపబడిన స్త్రీల ముఖమును దర్శించడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అనేక సంపదలను పొందగలము.




MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU

విఘ్నేశ్వరునిది బాలుడి మనస్తత్వం. అటుకులు, బెల్లం, చెఱకు, గుంజీళ్ళు, కుడుములు వంటి చిన్న చిన్న విషయాలకు సంతోషపడిపోతుంటారు. వినాయకుని ఎదుట గుంజీళ్లు తీయాలని పెద్దలు చెప్తారు. ఎందుకంటే అలా గుంజీళ్లు తీయడం వలన స్వామికి సంతోషం కలుగుతుందట. అలా సంతోషంతో మనకోర్కెలను త్వరగా తీర్చుతారని ప్రతీతి. ఈ గుంజీళ్లు తీయడం వెనుక ఒక పురాణ కథ ఉన్నది. 

                                          MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU

 ఒకనాడు శ్రీ మహావిష్ణువు మేనల్లుడైన గణపతికి అనేక బహుమతులు తీసుకువచ్చి ఇచ్చారట. అవన్నీ అల్లుడికి చూపిస్తూ తన సుదర్శన చక్రాన్ని ప్రక్కన పెట్టారట. విఘ్నేశ్వరుడు ఆ సుదర్శన చక్రాన్ని తొండంతో తీసుకుని చటుక్కున మ్రింగేశాడు. కాసేపటికి శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రం ఏదిరా అని అడిగితే  ఇంకెక్కడిది నేను మ్రింగేశాను అని సెలవిచ్చారు స్వామి. మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఎలా బయటకు తీయాలా అని ఆలోచించి చివరకు చెవులు రెండు పట్టుకుని గుంజీళ్లు తీయడం మొదలు పెట్టారట. అదిచూసి గణపతికి ఆనందం వేసి బిగ్గరగా నవ్వడం మొదలు పెట్టారు. ఈనవ్వడంలో సుదర్శనచక్రం బయటకు వచ్చింది. అలా మొదట గణపతికి గుంజీళ్లు సమర్పించినది శ్రీమహావిష్ణువే!

MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALUwww.mohanpublications.com


శివో మహేశ్వరశ్శంభుః పినాకీ శశిశేఖరః
వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః || 1 ||
శంకరశ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః
శిపివిష్టోంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః || 2 ||

భవశ్శర్వస్త్రిలోకేశః శితికంఠః శివప్రియః
ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః || 3 ||

గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః
భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః || 4 ||

కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః
వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహః || 5 ||

సామప్రియస్స్వరమయస్త్రయీమూర్తిరనీశ్వరః
సర్వఙ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః || 6 ||

హవిర్యఙ్ఞమయస్సోమః పంచవక్త్రస్సదాశివః
విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః || 7 ||

హిరణ్యరేతః దుర్ధర్షః గిరీశో గిరిశోనఘః
భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః || 8 ||

కృత్తివాసః పురారాతిర్భగవాన్ ప్రమథాధిపః
మృత్యుంజయస్సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః || 9 ||

వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమః
రుద్రో భూతపతిః స్థాణురహిర్భుధ్నో దిగంబరః || 10 ||

అష్టమూర్తిరనేకాత్మా సాత్త్వికశ్శుద్ధవిగ్రహః
శాశ్వతః ఖండపరశురజః పాశవిమోచకః || 11 ||

మృడః పశుపతిర్దేవో మహాదేవో‌உవ్యయో హరిః
భగనేత్రభిదవ్యక్తో దక్షాధ్వరహరో హరః || 12 ||

పూషదంతభిదవ్యగ్రో సహస్రాక్షస్సహస్రపాత్
అపవర్గప్రదో‌உనంతస్తారకః పరమేశ్వరః || 13 ||

ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరంశతమ్ ||


MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU



   ఈవ్రతము స్త్రీలు,పురుషులు లేక ఇద్దరూ చేసుకొనవచ్చును. స్త్రీలు చేసుకొనుట విశేషముగా చెప్పబడినది. ఈవ్రతము చేసుకొనుట వలన సమస్త పాపములు తొలగి, సమస్త సంపదలు లభించును. దేహనంతరము నరకలోక ప్రాప్తి కలుగ కుండుటకు, యమబాధలు తొలగుటకు ఈ వ్రతమును చేసెదరు.  ఎన్ని వ్రతములు చేసినను ఈ చిత్రగుప్త వ్రతము చేయనిదే అవి ఫలవంతములు కావని ఈవ్రతములో తెలుపబడినది. చిత్రగుప్తుడు  అనగా గుప్తంగా మనలోనే ఉంటూ చిత్రంగా మన పాపపుణ్యాలను లిఖించు వాడు. అంటే మన మనసే చిత్రగుప్తుడు. ఎన్ని వ్రతములు చేసిననూ చిత్రగుప్త వ్రతమును చేయకపోవుట అనగా ఎన్ని పుణ్యకర్మలను చేసినప్పటికీ మనోనియమము లేకుండుట. మనోనియమము చేయకుండుట వలన అవి అన్నియు వ్యర్థములగును. కనుక ఈవ్రతమును చేయుట వలన మనోనిశ్చలత చేకూరి సర్వకర్మలను పరిపూర్ణము చేయు శక్తి చేకూరునని గూఢార్థము. ఇది తెలుసుకుని ఆచరించిన నాడు వ్రతము ఫలవంతమగును.  


సూచనలు : మెదటి సారి మాఘ సప్తమినాడు ప్రారంభించవలెను. ప్రతి సంక్రమణమునాడు పూజించ వలెను. చివరికి మకరసంక్రమణము నాడు ఉద్యాపన చేసుకున్నచో బాగుండును. మొదటి నెలనే కానీ, మధ్యలో కానీ చివరన కానీ ఎవరి వీలును బట్టి వారు ఉద్యాపన చేసుకొనవచ్చును. బంగారు ప్రతిమలు, సువర్ణాలంకృతమైన గోదానం, వస్త్రదానాదులు, దశదానాలు, షోడశ మహాదానాలు, 30 మంది బ్రాహ్మణులకు భొజనం అంటే భారీఖర్చుకదా మరి పేదవారి సంగతి ఏమిటి? అని సందేహ పడనవసరం లేదు. ఎవరి వైభవాన్ని అనుసరించి వారు చేయవచ్చును. కానీ శక్తి ఉండికూడా లోభగుణముతో చేయవలసినవి చేయకుండ ఉండరాదు. ఆర్థిక స్థితి కలిగిన వారు యథావిధిగా చేయవలసినదే! శక్తిలేనివారు ఆర్తితో పరమేశ్వరునికి తమ స్థితి తెలుపుకుని పురోహితుల సూచన మేరకు నడుచుకొనవలెను.  దానం అన్నదమ్ములకు, గామ కరణానికి ఇవ్వాలా? అనికొందరు అడుగు చున్నారు. నిజానికి కల్పములో అలా లేదు. గృహస్థుడైన బ్రాహ్మణునకు దానమిమ్మని తెలిపిరి కనుక ఆవిధంగానే జేయవలెను.
 ప్రతినిత్యమూ భుజించు అన్నమును ముందుగా ”చిత్రాయనమః, చిత్రగుప్తాయనమః, యమాయ నమః” అనుచూ మూడు బలులను సమర్పించుట వలన చిత్రగుప్తుడు,యముడు ప్రీతి చెందుదురు. ఉపనయనమైన వారు ఔపోసనుము చేసినప్పుడు ఈవిధముగా విస్తరాకు ప్రక్కన మూడుసార్లు అన్నమును పెట్టుట నేటికీ కలదు. 

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list