Pages?sub_confirmation=1
జన జాతర_MedaramJatara
జన జాతర
విశ్వంలో శాంతి సౌభాగ్యాలు నిలిపేందుకు దేవతలు దివ్యరూపాల్లోను, మానవ రూపాల్లోను భూమిపై అవతరిస్తుంటారన్నది విశ్వాసం. దుష్టత్వాన్ని నిర్మూలించి, సాధుజీవుల్ని కాపాడుతుంటారన్నది నమ్మకం. దివ్యగుణాలు గల మానవులూ దేవతల్లా ధర్మ పరిరక్షణకు ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. సమాజం కోసం ప్రాణాల్ని తృణప్రాయంగా అర్పిస్తుంటారు. అందరూ వారిని ‘మహాత్ములు’గా కొలుస్తారు. అటువంటిమహనీయుల త్యాగనిరతిని స్మరిస్తూ, లోకులు జాతర జరపడం పరిపాటి. వాటిలో ప్రధానమైంది- సమ్మక్క సారలమ్మ జాతర. జనజీవన సంస్కృతిలో భాగమైన ఇది, ఉత్తర భారతదేశంలోని ‘కుంభమేళా’ను తలపిస్తుంది.
ఉత్తర తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన తాడ్వాయి ప్రాంతంలో మేడారం గ్రామం ఉంది. ఇక్కడి అడవులు, కొండలు, కోనల మధ్య గిరిజన సంస్కృతికి ప్రతీకగా ఈ జాతర జరుగుతుంది. తెలుగునేల నలు చెరగుల నుంచే కాకుండా; మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ రాష్ట్రాల నుంచి వచ్చిన లక్షలాది జనం ఈ వేడుకలతో మమేకం అవుతుంటారు.
ఈ జాతర వెనక ఒక చారిత్రక కథ ఉంది. పూర్వం జగిత్యాల ప్రాంతంలోని పొలాస (పొలవాస)ను మేడరాజు అనే గిరిజన దొర పాలించేవాడు. ఆయన కూతురు సమ్మక్క. ఆమెకు తన మేనల్లుడైన మేడారం పాలకుడికి ఇచ్చి వివాహం చేశాడు మేడరాజు. వారికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు. కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలాసపై దండెత్తి వెళ్లాడు. ఆ శౌర్యానికి తట్టుకోలేక మేడరాజు పొలాస నుంచి వెళ్లిపోయి, మేడారంలో అజ్ఞాతవాసం చేశాడు.
మేడారం పాలకుడు కాకతీయులకు సామంతుడు. కరవు కాటకాలు ఏర్పడటంతో, ఆ రాజులకు పన్నులు కట్టలేకపోయాడు. మేడరాజుకు ఆశ్రయం- అగ్నికి ఆజ్యంలా మారింది. మేడారం పాలకుడు గిరిజనుల్ని రెచ్చగొడుతున్నాడని, తన సార్వభౌమత్వాన్ని చిన్నచూపు చూస్తున్నాడని ప్రతాపరుద్రుడు మండిపడ్డాడు. మాఘ శుద్ధ పౌర్ణమినాడు మేడారం మీద దండెత్తాడు.
సమ్మక్క, సారక్క, నాగులమ్మ, జంపన్న వీరోచితంగా పోరాడారు. కాకతీయుల సైన్యం ధాటికి తట్టుకోలేక మేడరాజు, సారలమ్మ, నాగులమ్మ యుద్ధంలో మరణించారు. అవమానాన్ని తట్టుకోలేక జంపన్న సంపెంగ వాగులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు.
సమ్మక్క వీరోచితంగా పోరాడి, కాకతీయ సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతుంది. ప్రతాపరుద్రుడు సైతం ఆమె వీరత్వాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. గాయపడిన సమ్మక్క రక్తధారలతోనే యుద్ధభూమి నుంచి నిష్క్రమిస్తుంది. చిలుకల గుట్ట వైపు వెళుతూ, అందరూ చూస్తుండగానే మాయమవుతుంది. వెదుకుతూ వెళ్లిన అనుచరులకు ఆమెజాడ కనిపించదు. మాయమైన చోట పసుపు, కుంకుమల భరిణె కనిపిస్తుంది. పవిత్ర భరిణెను సమ్మక్కగా భావించి, ప్రతి రెండేళ్లకూ ఒకసారి మాఘ శుద్ధ పూర్ణిమనాడు సమ్మక్క జాతర జరపడం ఓ సంప్రదాయంగా మారింది.
నాలుగురోజులు జరిగే ఈ జాతరలో మొదటిరోజు కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దె వద్దకు తెస్తారు.రెండోరోజున-చిలుకల గుట్టలో కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. మూడోరోజున సమ్మక్క, సారలమ్మ గద్దెపై కొలువుతీరి, భక్తుల్ని అనుగ్రహిస్తారు. నాలుగో రోజు సాయంకాలం ఇద్దరినీ యుద్ధభూమికి తెస్తారు. ఆ ఇద్దరు అమ్మలకూ బెల్లాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇదంతా గిరిజన పూజారుల పర్యవేక్షణలోనే జరుగుతుంది.
సుదీర్ఘ చరిత్ర కలిగిన సమ్మక్క సారలమ్మ జాతర ఓ మహాపర్వంగా కొనసాగుతుంది. ఈ నాలుగు రోజుల తిరణాలలో జనం అసంఖ్యాకంగా ఉంటారు. పల్లెల ఒడిలో స్నేహ సౌజన్యాల్ని పెంపొందించే జాతరలు జనజీవన సంస్కృతికి అద్దం పడతాయి. సామాన్య జనుల వేషభాషలు, అభిరుచులు, కళలు, జీవన విధానాలు ఆవిష్కృతమవుతుంటాయి.
సంస్కృతి, సంప్రదాయం, నాగరికత- మనిషిని ఉన్నత స్థానంలో నిలుపుతాయి. అతడిలో సుగుణాలు రత్నాల్లా వెలుగొందడానికి ఇటువంటి జాతరలు దోహదం చేస్తాయి. జీవితం అంటే కేవలం తిండి, నిద్ర, సౌఖ్యం కాదని; మానసికోన్నతి సాధించడమేనని అందరూ తెలుసుకున్నప్పుడు- సమ్మక్క సారలమ్మ జాతరలోని పరమార్థం అవగతమవుతుంది.
- డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ

నేడే సూపర్ బ్లూ బ్లడ్ మూన్_TodaySuperBlueBloodMoon
నేడే సూపర్ బ్లూ బ్లడ్ మూన్
సుమారు 150 ఏళ్ల తర్వాత ఆకాశంలో నేడు ఒక అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. సూపర్‌మూన్, బ్లూమూన్, సంపూర్ణ చంద్రగ్రహణం మూడు కలసి కనువిందు చేయబోతున్నాయి. సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా భూమి పూర్తిగా నీడలోనే ఉండిపోనుండటంతో జాబిల్లి ముదురు ఎరుపురంగులో (బ్లడ్‌మూన్‌గా) కనిపించనుంది.
సాయంత్రం 4.21 గంటలకు ప్రారంభమై రాత్రి 7.37 గంటల వరకు ఆసియా, తూర్పు రష్యా, మధ్య ప్రాచ్యప్రాంతం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ఈ ఖగోళ వింత చోటుచేసుకోనుంది. అమెరికా పశ్చిమ ప్రాంతంలో ఇది మరింత బాగా కనపడవచ్చు.
భారత్ వ్యాప్తంగా...
మన దేశంలోనూ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని వీక్షించొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చందమామపై పాక్షిక నీడ లేదా భూమికి చెందిన పెన్యుంబ్రా నీడతో ఇది భారత్‌లో సాయంత్రం 5.20కి ప్రారంభమవుతుంది. ప్రధాన గ్రహణం మాత్రం సూర్యాస్తమయం తర్వాత 6.25 నిమిషాలకు ప్రారంభమై, తూర్పు వైపు ఆకాశంలో కనిపిస్తుంది.
ఆ తర్వాత జాబిల్లి వెండి రంగులోకి మారుతుంది. కొన్ని నిమిషాల తరువాత మొత్తం నీడ పరచుకుంటుంది. రాత్రి 7.25 గంటల నుంచి దాని పరిమాణం క్రమంగా తగ్గుతూ ఉంటుంది. దీనిని నెలలో రెండో నిండుపున్నమి లేదా నీలవర్ణ చంద్రుడిగా (బ్లూమూన్)గా పిలుస్తారు(జనవరి 1న తొలి పౌర్ణమి ఏర్పడింది). బ్లూమూన్ సందర్భంగా నదులు, సముద్రాల్లో అలలు కొంచెం ఎత్తులో ఎగిసిపడతాయని, దీని వల్ల భయపడాల్సిందేమీ లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సూపర్‌మూన్...
చంద్రుడు గుండ్రంగా ఒక స్థిరకక్ష్యలో కాకుండా కొంచెం అటూ ఇటూగా (అప్సిడల్ ప్రిసిషన్)లో భ్రమిస్తుండటంతో కొన్ని పర్యాయాలు భూమికి కొంత సమీపంగా వస్తాడు. ఇలాంటి సందర్భాల్లో... పున్నమి రోజుల్లో సూర్యుడికి ఎదురుగా వస్తాడు. ఈ కారణంగా చంద్రుడి పరిమాణం పెరిగినట్లుగా అనిపిస్తుంది.
ఈ విధంగా పౌర్ణమినాడు చంద్రుడు భూమికి దగ్గరగా వచ్చినపుడు ‘సూపర్‌మూన్’ అని పిలుస్తారు. భూమండలానికి సమీపంగా రావడం వల్ల చంద్రుడు కొంచెం పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. సాధారణంగా కనిపించే జాబిల్లితో పోల్చితే ఇది 30 శాతం పెద్దదిగా, రోజు కనిపించే దాని కంటే 14 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడని సైంటిస్టులు వెల్లడించారు.
ఆకాశంలో చోటుచేసుకునే ఈ అరుదైన అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు ప్రత్యేకమైన బైనాక్యులర్లు, టెలిస్కోప్‌ల అవసరం లేదని, మామూలుగా అందరూ చంద్రుడిని చూసినట్టే ఎలాంటి ఉపకరణాలు లేకుండా చూడొచ్చునని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మరో సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చే జూలై 27న ఏర్పడనుందని, అది బ్లూ లేదా సూపర్‌మూన్ మాత్రం కాదని వారు తెలిపారు.
ఎప్పుడు, ఎక్కడెక్కడ...
తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నంలో సూపర్ బ్లూబ్లడ్ మూన్‌ను ముందుగా వీక్షించొచ్చు. హైదరాబాద్ ప్రజలు సంపూర్ణ చంద్రగ్రహణాన్ని మొత్తం చూసే అవకాశముంది. దేశవ్యాప్తంగా అయితే ఈశాన్య రాష్ట్రాలతో పాటు కోల్‌కతా ప్రజలు ఈ అద్భుతాన్ని అందరికన్నా ముందు చూడొచ్చు. చంద్రోదయం..అరుణాచల్‌ప్రదేశ్ రాజధాని ఇటానగర్‌లో సాయంత్రం 4.47 గంటలకు, కోల్‌కతా–5.16, పట్నా–5.25, ఢిల్లీ–5.53, చెన్నై–6.04, ముంబై–6 గంటల 27 నిమిషాలకు జరగనుంది.

సర్వం స్వాహా చేస్తే?_Gastrable
సర్వం స్వాహా చేస్తే?
తినాలనే ఆశ ఉండాలేగానీ, వేలకొద్దీ రుచులు అందుబాటులో ఉన్నాయి. అంతే కాదు. తినే పదార్థాలతోపాటు, వాటి పరిమాణాలు, భోజన వేళలూ మారిపోతున్నాయి. దాంతో ఛాతీలో మంట, విరోచనాలు, కడుపులో పుండ్లు....ఇలా ఎన్నో జీర్ణకోశ సమస్యలు తలెత్తుతున్నాయి. వీటన్నిటికీ పరిష్కారం మరెక్కడో లేదు. మనలోనే ఉంది!
అల్పాహారం అంటే...ఇడ్లీలు, దోశలు కాదు....‘శాండ్‌విచ్‌లు, సలాడ్లు.
మరి భోజనం అంటే?... ‘బర్గర్లు, పిజ్జాలు’.
పానీయాలంటే...‘కూల్‌డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్’.
ఇవీ నేటి తరం ఆహారపుటలవాట్లు. ఉదయం అల్పాహారం తింటే తినటం, లేదంటే మానేయటం. మధ్యాహ్న భోజనం...సాయంత్రం, రాత్రి భోజనం అర్థరాత్రికి ముగించటం...ఇవి వారి ఆహారపు వేళలు. ఇలాంటి ఆహారశైలి దీర్ఘకాలంపాటు కొనసాగితే జీర్ణకోశ సమస్యలు తప్పవు.
గ్యాస్ట్రోఈసోఫీగల్ రిఫ్లక్స్ డిసీజ్ (జిఈఆర్‌డి )
అన్నవాహికకు సంబంధించిన సమస్య ఇది. విపరీతమైన నూనె, కొవ్వులు ఉన్న పదార్థాలను తినటం, ఈ పదార్థాల్లో పీచు తక్కువగా ఉండటం, తిన్న వెంటనే పడుకోవటం, అర్థరాత్రి తినటం, మొదలైన అలవాట్ల వల్ల జిఈఆర్‌డి సమస్య మొదలవుతుంది. ఈ సమస్య లక్షణాలు అసిడిటీని పోలి ఉండటంతో యాంటాసిడ్లు వాడేస్తూ ఉంటారు. కానీ ఇదే సమస్య పదే పదే కనిపిస్తూ ఉంటే జీఈఆర్‌డిగా భావించి వైద్యులను సంప్రదించాలి.
లక్షణాలు: ఛాతీలో మంట, నొప్పి, తిన్న వెంటనే నొప్పి ఎక్కువవటం, గొంతులోకి యాసిడ్ తన్నుకురావటం.
నిర్లక్ష్యం చేస్తే: అన్నవాహిక ఇరుకుగా మారి పదార్థం మింగుడుపడదు. అరుదుగా కొందరిలో అన్నవాహిక ఇరుకుగా మారిన కారణంగా అది క్యాన్సర్‌కు కూడా గురి కావొచ్చు.
చికిత్స ఇదే!
లక్షణాలతోపాటు, ఎండోస్కోపీ ద్వారా వ్యాధి నిర్ధారించుకుని వైద్యులు చికిత్స చేస్తారు. ఈ సమస్యకు నోటి మాత్రలు వాడడంతోపాటు, జీవనశైలిలో కూడా మార్పులు చేసుకోవటం అత్యవసరం. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తినటం, నూనె, కొవ్వులు తక్కువగా, పీచు ఎక్కువగా ఉండే ఆహారం తింటూ, ఆహారపు వేళలు సక్రమంగా పాటిస్తే జీఈఆర్‌డి లక్షణాలు తగ్గిపోతాయి. ఇదే జీవనశైలిని అనుసరిస్తూ ఉన్నంతకాలం ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఎప్పుడైనా లక్షణాలు తలెత్తితే వైద్యులు సూచించిన మందులు వాడితే సరిపోతుంది.
హయాటిక్ హెర్నియా
జీఈఆర్‌టీలో అరుదుగా కొందరికి అన్నవాహిక, జీర్ణాశయం కలిసే జంక్షన్‌లో ఈ హెర్నియా ఏర్పడుతుంది. ఎండోస్కోపీలో ఈ సమస్య కనిపిస్తే పరిమాణాన్ని బట్టి సర్జరీ చేసి హెర్నియాను సరిచేస్తారు. అయితే జీవనశైలిని పూర్తిగా మార్చుకుని సక్రమమైన ఆహారపుటలవాట్లను అలవరుచుకున్న తర్వాత కూడా సమస్య సర్దుకోకపోతే ఈ సర్జరీని వైద్యులు ఆశ్రయిస్తారు.
పెప్టిక్ అల్సర్ డిసీజ్
పొట్టలో, డియోడినమ్ (చిన్నపేగు ప్రారంభ ప్రదేశం)లో ఏర్పడే అల్సర్లే పెప్టిక్ అల్సర్లు. ఇలాంటి అల్సర్లు ఏర్పడటానికి ప్రధాన కారణం హెచ్ పైలోరీ బ్యాక్టీరియా!
ఎందుకొస్తుందంటే?: అపరిశుభ్ర ఆహారపదార్థాలు, నీళ్లు తీసుకోవటం మూలంగా ఈ బ్యాక్టీరియా పొట్టలోకి చేరుతుంది. రోడ్డు పక్కన ఉండే చిరుతిళ్ల బండ్లు, చాట్ బండ్లు, పానీయాలు, సోడాలు...వీటి ద్వారా సోకిన హెచ్ పైలోరీ బ్యాక్టీరియా పొట్ట, డియోడినమ్‌లో తిష్ట వేసి పుండ్లు ఏర్పడేలా చేస్తుంది. ఈ సమస్య లక్షణాలు అసిడిటీని పోలి ఉంటాయి.
పరీక్షలతో కనిపెట్టాలి!: పెప్టిక్ అల్సర్ సాధారణ అసిడిటీని పోలి ఉంటుంది కాబట్టి అసిడిటీ మందులు వాడేస్తూ ఉంటారు. కానీ అసిడిటీ లేక పెప్టిక్ అల్సర్...ఈ రెండిట్లో ఏదనేది నిర్థారించుకోవాలంటే ఎండోస్కోపీ, బయాప్సీ, రక్త పరీక్ష, మల పరీక్షలు చేయించుకోవాలి.
సమర్థ చికిత్స అవసరం: బ్యాక్టీరియా ఉందని నిర్ధారణ అయితే 14 రోజుల యాంటీబయాటిక్ కోర్సు అనుసారం మందులు వాడాలి. ఈ బ్యాక్టీరియాను శరీరం నుంచి సమూలంగా తొలగించే చికిత్స తీసుకోవాలి. మళ్లీ ఈ బ్యాక్టీరియా శరీరంలోకి చేరకుండా ఉండాలంటే బయటి ఆహారం తినటం మనేయాలి. శుభ్రమైన, శుచికరమైన ఆహారపుటలవాట్లను అలవరుచుకోవాలి. ఈ బ్యాక్టీరియా వల్ల అల్సర్లు ఏర్పడితే రక్తస్రావం జరగటం, పేగులకు రంథ్రం పడటం లాంటి తీవ్రమైన సమస్యలూ ఎదురవుతాయి. అలాంటప్పుడు సర్జరీ ఒక్కటే పరిష్కారం. ఇంత తీవ్రమైన స్థితికి దారి తీయకుండా ఉండాలంటే లక్షణాల ఆధారంగా సమస్యను ప్రారంభంలోనే గుర్తించి జాగ్రత్త పడాలి.
ఫ్యాటీ లివర్ డిసీజ్
శరీరంలోని మిగతా అవయవాల్లో మాదిరిగానే కాలేయం మీద కూడా కొవ్వు చేరుకుంటూ ఉంటుంది. నూనెలు, కొవ్వులు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్ తినే వాళ్లలో ఈ కొవ్వు మరీ ఎక్కువగా చేరుకుంటుంది. ఇదే ఫ్యాటీ లివర్. మొదట్లో కాలేయం మీద మాత్రమే కొవ్వు పేరుకుంటుంది. ఈ సమయంలో లివర్ ఫంక్షన్ పరీక్ష చేయించుకుంటే ఎటువంటి ప్రతికూల ఫలితం కనిపించకపోవచ్చు. కానీ అలా కొవ్వు కాలేయం మీద పేరుకుంటూపోతే కొంత కాలానికి కాలేయ కణాలు దెబ్బతిని, లివర్ సిర్రోసిస్‌కు దారి తీస్తుంది. ఈ స్థితిని కూడా నిర్లక్ష్యం చేసి జాగ్రత్త పడకపోతే లివర్ క్యాన్సర్‌కు కూడా దారి తీసే ప్రమాదం ఉంటుంది. అయితే ఫ్యాటీ లివర్ డిసీజ్‌లో పొట్ట కుడి వైపు పైభాగంలో నొప్పి ప్రధాన లక్షణంగా కనిపిస్తుంది. అయితే లివర్ ఫంక్షన్ పరీక్ష చేయించుకుంటే కొన్ని ఎంజైమ్‌ల పరిమాణం స్పష్టంగా కనిపిస్తుంది. వాటి ఆధారంగా కేవలం ఫ్యాటీ లివర్ కాదు, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనే విషయాన్ని వైద్యులు కనిపెట్టగలుగుతారు. ఇదే స్థితి పదేళ్లపాటు కొనసాగితే లివర్ సిర్రోసిస్‌కు దారి తీస్తుంది.
వీళ్లలో ఎక్కువ!: పొట్ట భాగంలో కొవ్వు ఉండేవారు, చక్కెర స్థాయిలు క్రమబద్ధంగా లేని మధుమేహులు, సెడెంటరీ లైఫ్ స్టయిల్ పాటించేవాళ్లు (ఎక్కువ సమయాలు విశ్రాంతిలో గడిపేవాళ్లు), వ్యాయామం చేయనివాళ్లు ఫ్యాటీ లివర్ బారిన పడే అవకాశాలు ఎక్కువ. ఈ కోవకు చెందిన వాళ్లు సంవత్సరానికోసారి అలా్ట్రసౌండ్, లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకుంటూ కాలేయ స్థితిని గమనించుకుంటూ ఉండాలి.
మెరుగైన జీవనశైలే చికిత్స: క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లే ఫ్యాటీ లివర్ సమస్యకు చికిత్స. కాలేయంలో పేరుకున్న కొవ్వును కరిగించే మందులు వాడుతూ సమతులాహారం తీసుకుంటే ఈ వ్యాధి అదుపులోకొస్తుంది.
ఫ్యాటీ లివర్ అనేది తిరిగి సరిదిద్దగల సమస్య. కానీ సిర్రోసిస్ అలా కాదు. ఒకసారి ఈ స్థితికి చేరుకుంటే కాలేయ మార్పిడి తప్ప వేరొక పరిష్కారం లేదు. కాబట్టి సిర్రోసిస్ దశ కంటే ముందే ఫ్యాటీ లివర్‌ను ఆరోగ్యకరంగా మార్చే జీవనశైలి, ఆహారపుటలవాట్లను అలవరుచుకోవాలి.
ఇన్‌ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ (పేగు పూత)
గత 15 ఏళ్ల వరకూ మన దేశంలో ఈ సమస్య కనిపించేది కాదు. అయితే ప్రపంచీకరణ ఫలితంగా, పాశ్చాత్య జీవనశైలి సంక్రమణ మూలంగా వారి ఆహారపుటలవాట్లు మనం జీవితంలో భాగాలయ్యాయి. కొవ్వులు, నూనెలు ఎక్కువగా ఉండే పిజ్జాలు, బర్గర్లు, చీజ్‌లు తినటం, నియమిత ఆహార వేళలు పాటించకపోవటం, వ్యాయామం పూర్తిగా లోపించటం...లాంటి అలవాట్లు అలవడటం వల్ల కాలక్రమేణా వాటి ప్రభావం ఆరోగ్యం, మరీ ముఖ్యంగా కాలేయం, జీర్ణ వ్యవస్థల మీద పడుతుంది. ఫలితంగా జీర్ణ సంబంధ సమస్యల్లో ఒకటైన ఇన్‌ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ తలెత్తుతుంది. చిన్న లేదా పెద్ద పేగులు తరచుగా వాస్తూ, వాటి మీద పూత ఏర్పడుతూ ఉంటుంది. దీనికి కారణం ‘ఆటో ఇమ్యూన్ డిజార్డర్’. దీనికి జన్యుపరమైన, పర్యావరణ పరమైన అంశాలే కారణం. పర్యావరణపరంగా చెప్పుకుంటే ఆహారపుటలవాట్లలో పాశ్యాత్య శైలిని అనుకరించటం వల్లే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ప్రేరేపితమవుతోంది. ఫలితంగా ఇన్‌ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ తలెత్తుతుంది.
ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్
ఈ సమస్య లక్షణాలు: కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం, త్రేన్పులు, విరోచనం పూర్తిగా కాలేదనే భావన, ఎక్కువసార్లు మల విసర్జన అవసరం పడడం, తినగానే మోషన్‌కి వెళ్లవలసి రావడం...ప్రధాన లక్షణాలు.
చికిత్స ఇదే!: ఈ సమస్యను ఇన్‌ఫ్లమేటరీ బోవెల్ సిండ్రోమ్ కాదనే విషయాన్ని రక్త పరీక్ష, పెద్ద పేగు పరీక్ష (కొలనోస్కోపీ)లతో నిర్థారించుకుని, ఆ తర్వాతే చికిత్స మొదలు పెట్టాలి. ఈ సమస్యకు జీవనశైలిని మార్చుకోవటతోపాటు, ఒత్తిడినీ తగ్గించుకోవాలి. ఐబిఎస్ ఉన్నవాళ్లు నూనె, కొవ్వు పదార్థాలతో పాటు మానసిక ఒత్తిడినీ తగ్గించుకోవాలి. మందులతోపాటు, వేళ పట్టున ఆహారం తినటం, సమతులాహారం, మరీ ముఖ్యంగా పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం తప్పనిసరి.
ఈ నియమాలు తప్పనిసరి!
జీర్ణకోశ, కాలేయ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఈ కింది నియమాలు పాటించాలి.
పీచు పదార్థం ఎక్కువగా ఉండే తాజా ఆకుకూరలు, కూరగాయలు, పళ్లు తినాలి.
మాంసకృత్తులతోపాటు పీచు, పిండి పదార్థాలు, విటమిన్లు, మినరల్స్ తగు పాళ్లలో ఉండే సమతులాహారం తీసుకోవాలి.
ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవటం వల్ల మలబద్ధకం తలెత్తకుండా పీచు పదార్థం ఉండే ఆహారం తప్పనిసరిగా తినాలి.
మైదా, చక్కెర, మసాలాలు, కారం, ఉప్పు తగ్గించాలి.
ప్రిజర్వేటివ్స్(పదార్థాల నిల్వకు వాడేవి), కలరింగ్ ఏజెంట్లు (పదార్థాలకు రంగు తెప్పించేవి) ఉన్న పదార్థాలు తినకూడదు.
ప్యాకేజ్‌డ్ ఫుడ్ పూర్తిగా మానేయాలి.
కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌కు బదులుగా తాజా కొబ్బరి నీరు, మజ్జిగ, నిమ్మరసం లాంటి పానీయాలు తాగాలి.
ఒకే నూనెలో పదే పదే వేయుంచిన పదార్థాలు తినకూడదు.
రోజుకి కనీసం 5 రకాల కూరగాయలు, పళ్లు తినాలి.
ఉదయం అల్పాహారం మానకూడదు.
రాత్రి నిద్రకు కనీసం 3 గంటల ముందే భోజనం ముగించాలి.
జంక్ ఫుడ్ సాధ్యమైనంత అరుదుగా తినాలి. ౌ నిమమిత వేళల్లో ఆహారం తీసుకోవాలి.
ఒత్తిడి తగ్గించుకోవాలి.
డాక్టర్ కె.ఎస్.సోమశేఖర రావు

గాంధీమార్గం అనుసరణీయం_GandhianWayIsPractical
గాంధీమార్గం అనుసరణీయం
నేడు మృతవీరుల సంస్మరణ దినం. 70 ఏళ్ల క్రితం హంతకుడి తుపాకి గుళ్లకు మహాత్మాగాంధీ నేలకొరిగిన రోజు. స్వతంత్ర భారత చరిత్రలోనే అత్యంత విషాదకరమైన ఘటన అది. మహాత్ముడు మన జాతిపిత. విశ్వ శాంతిదూత. అంతటి మహనీయుడిని ఆనాడు హింసోన్మాదం పొట్టన పెట్టుకొంది. మనిషిలోని మృగత్వం జడలు విప్పి, కరాళనృత్యం చేసిన దుర్దినమది. మృతవీరుల సంస్మరణ దినం పాటించడమంటే అహింసామూర్తి మహాత్మాగాంధీ ఒక్కరికే నివాళి అర్పించడం కాదు, ప్రపంచవ్యాప్తంగా హింస, ఉగ్రవాదం ప్రబలుతున్న తీరుపైన నిరసన ప్రకటించడం కూడా! మహాత్ముడి సిద్ధాంతాల గురించి, వాటిని ఆయన ఆచరించి చూపిన విధానం గురించి చర్చించాల్సిన సందర్భమిది.
ఆత్మవినాశనం దిశగా వేగంగా సాగిపోతున్న మనిషిలో జీవితంపట్ల ఆశలు రగిలించి, కొత్తవెలుగుల బాటలో నడిపించేవే మహాత్ముడి ఆలోచనలు, ప్రవచనాలు, ఆచరణలు. స్వదేశీ అన్నది మహాత్ముడి తారకమంత్రం. అదే ఆయన జీవన విధానం. స్వదేశీ అంటే స్వావలంబన, స్వయంపోషకత్వం, ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, అన్నింటికి మించి నిస్వార్థంగా సేవచేయాలన్న భావన, తపన. స్వదేశీ సిద్ధాంతాన్ని విజయవంతంగా ఆచరించి చూపారు మహాత్మాగాంధీ. విదేశీగడ్డపై నుంచే స్వదేశీ ప్రయోగాలు ప్రారంభించారాయన. సామ్రాజ్యవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించి, బానిస సంకెళ్లనుంచి ప్రజల్ని విముక్తం చేయడానికి ఆయన ఎంచుకొన్న మార్గం స్వదేశీ. అది ఆయన చేతిలోని దివ్యాస్త్రం. తిరుగులేని బ్రహ్మాస్త్రం.
సత్యాన్నే దైవంగా భావించారు మహాత్మాగాంధీ. దేవుడే సత్యం అన్నంత సునాయాసం కాదది. సత్యమనే దేవుడిలో మనిషి సంలీనమైనప్పుడే శాంతి లభిస్తుందని ఉద్బోధించారాయన. సత్యమార్గంలో పయనించడం ద్వారానే సంఘర్షణలను నివారించవచ్చునని అన్నారు. హింస ద్వారా ఘర్షణలను తాత్కాలికంగానే అణచివేయవచ్చునని, అహింసే శాశ్వత పరిష్కార మార్గమని స్పష్టం చేశారు. మహాత్మాగాంధీ దృష్టిలో సత్యం, అహింస అన్నవి నాణానికి బొమ్మా బొరుసు లాంటివి. సత్యం లక్ష్యమైతే, అహింస దాన్ని సాధించే మార్గమని అన్నారాయన. లక్ష్యం, మార్గం అభిభాజ్యమైనవి. ఆయన ప్రవచించిన దైవత్వానికి సత్యం, అహింస రెండు ముఖాలు. సత్యాన్ని శోధించి, సాధించాలంటే దేవుడిని గట్టిగా నమ్మాల్సి ఉంటుంది. అది ప్రేరణ ఇస్తుంది. మనోబలాన్ని ప్రసాదిస్తుంది. దానివల్ల లక్ష్యాన్ని సాధించడం సులువవుతుంది.దేవుడిని తెలుసుకోవడమంటే అహింసను ఆచరించడం ద్వారా జీవితంలో శాంతిని సాధించడమే. అలాంటి దేవుడిని తెలుసుకొనే మార్గాన్ని మతం చూపిస్తుంది, చూపించాలి. ఏ రూపంలోనైనా సరే హింసను ప్రేరేపించేది మతమే కాదు, అదెవరికీ సమ్మతం కారాదు. మతం అన్నది శాంతిని ప్రసాదించేది అయినప్పుడు మతపరమైన హింస అన్న పదాలే పరస్పర విరుద్ధమైనవి అవుతాయి. అసలు మతపరమైన హింస అన్నదే అర్థం లేనిది. హింస ఏ రూపంలో ఉన్నా, ఎలాంటిదైనా- హింస హింసే. ఏ మతంతోనూ దాన్ని ముడిపెట్టలేం.
మనిషి నిరామయుడిగా ఉండాలంటే సేవాభావం అలవరచుకోవాలి. ఎలాంటి త్యాగాలకైనా సంసిద్ధంగా ఉండాలి. అహం వదులు కోవాలి. మహాత్మాగాంధీ ఈ సిద్ధాంతాలు, సూత్రాలను ప్రవరించడమే కాదు, ఆచరించి చూపారు. సామాజిక కార్యాచరణకు ఆయన చేపట్టిన ధర్మాయుధం సత్యాగ్రహం. అటు దక్షిణాఫ్రికాలోను, ఇటు భారతదేశంలోనూ పలు సందర్భాల్లో ఆయన ఈ ఆయుధాన్ని విజయవంతంగా ప్రయోగించి, సత్ఫలితాలు సాధించారు. సత్యం, అహింస- ఈ రెండింటి స్ఫూర్తితో రూపొందినదే సత్యాగ్రహ ఆయుధం. ఇతరులకు సేవ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడాలన్నారు మహాత్ముడు. ఇది ఆయన ప్రబోధించిన దైవీభావం.
మహాత్మాగాంధీ కార్యాచరణ ప్రణాళికలో కొన్ని నిర్మాణాత్మక కార్యక్రమాలు ఉన్నాయి. అవి- 1. మత సామరస్యాన్ని పెంపొందించడం. 2. అంటరానితనాన్ని తొలగించడం, స్థూలంగా చెప్పాలంటే- అసమానతలను రూపుమాపడం. 3.అన్ని రకాల మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాలను నిషేధించటం. 4. అట్టడుగుస్థాయిలో ప్రజానీకానికి సాధికారత కల్పించే ప్రక్రియలో భాగంగా ఖాదీని, గ్రామీణ పరిశ్రమలను ప్రోత్సహించడం. 5. గ్రామీణ ప్రజారోగ్యాన్ని, పరిశుభ్రతను పెంపొందించడానికి పారిశుద్ధ్యాన్ని ప్రోది చేయడం. 6. ప్రాథమిక, వయోజన విద్యకు ప్రాధాన్యం. ముఖ్యంగా మహిళా అక్షరాస్యతపై ప్రత్యేక శ్రద్ధ. 7.జాతీయ భాషను నిర్లక్ష్యం చేయకుండానే ప్రాంతీయ భాషలకు అండదండ. 8. రైతులు, కూలీలు, వెలివేతకు గురైనవారు, గిరిజనులు తదితర అణగారిన వర్గాల సంక్షేమం. 9. సేవ, త్యాగనిరతి, ఇతరుల బాధలు తీర్చడానికి స్వయంగా బాధలు అనుభవించడానికైనా సిద్ధపడటం వంటి చర్యల ద్వారా ఆత్మశుద్ధి చేసుకోవడం.
మహాత్మాగాంధీకి స్ఫూర్తినిచ్చిన గ్రంథం భగవద్గీత. దేనిమీదా వ్యామోహం పెంచుకొనకపోవడం, ఫలితాలు ఆశించకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించడం, ప్రతిఫలాపేక్ష లేకుండా కార్యాచరణకు సిద్ధపడటం- భగవద్గీత ద్వారా ఆయన నేర్చుకొన్న జీవిత సత్యాలు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, భగవద్గీత ద్వారా అనాసక్తి యోగాన్ని ఆయన నేర్చుకొన్నారు. ఆత్మశుద్ధి అనేది గాంధేయ సంప్రదాయంలో కీలకం. తగినంత ఆధ్యాత్మిక వికాసం సాధించిన వ్యక్తి ఇతరులనూ ధర్మపథంలో నడపగలడని ఆయన నమ్మారు. పతంజలియోగ సూత్రాల నుంచి ఈ సత్యం గ్రహించారాయన. ఒకే ఒక్క వ్యక్తి పూనుకొంటేచాలు, జ్ఞానదీపాలు వెలిగించి యావత్ ప్రపంచాన్ని ప్రకాశపథంలో నడపగలడనేందుకు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంసలతోపాటు స్వయంగా మహాత్మాగాంధీ నిదర్శనం.
ప్రస్తుత ప్రపంచ స్థితిగతులు తీవ్ర భయోత్పాతం సృష్టిస్తున్నాయి. ఎల్లెడలా హింస, ఉగ్రవాదం పెట్రేగుతున్నాయి. ఉత్తర కొరియా వంటి దేశాల్లో దురహంకారంతో రగిలిపోతున్న నేతల చేతుల్లోని సామూహిక జనహనన ఆయుధాలు విశ్వవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మహాత్మాగాంధీ తన జీవితకాలంలో ఆచరించి చూపిన సిద్ధాంతాలు ప్రస్తుత పరిస్థితుల నుంచి సురక్షితంగా బయటపడేందుకు అనువైన మార్గాలు. పశు ప్రవృత్తితో చెలరేగిపోతున్నవారి కట్టడికి, తద్వారా మనిషి మనిషిగా బతకగలితే ఆశాజనక వాతావరణ సృష్టికి మహాత్ముడి మాటే మేలుబాట. ప్రపంచాన్ని చీకటి నుంచి వెలుగులోకి నడిపే దారి దీపమది... ధర్మరూపమది!
- ప్రొఫెసర్ కె.రామకృష్ణారావు

నమస్కారం_IndiansTraditionalWelcome
నమస్కారం
వ్యక్తి సంస్కారాన్ని తెలిపే సమున్నత ప్రక్రియ- నమస్కారం. అది ఎదిగిన మనసును ఆవిష్కరిస్తుంది. పరిపక్వత చెందిన వ్యక్తిత్వాన్ని చూపరుల మనసు వాకిట నిలుపుతుంది. ఎదుటివారిని గౌరవించాలనుకున్నప్పుడు నమస్కరిస్తారు. ప్రతినమస్కారం ద్వారా అవతలి వ్యక్తి నుంచీ గౌరవం, మన్నన పొందుతారు. డబ్బు, హోదా, పలుకుబడి... ఏదీ పనిచేయని సందర్భంలోనూ ఒక నమస్కారం అనేక పనులు చేసిపెడుతుంది. దానికి అంతటి మహత్తు ఉంది.
విద్యార్జన కోసం గురువును ఆశ్రయించిన శిష్యుడు, మొట్టమొదట నమస్కారంతోనే పలకరిస్తాడు. ఆ అనుబంధం ఏళ్ల తరబడి సాగిపోతుంటుంది. పవిత్రమైన ఆ విద్యాక్షేత్రంలో పలు జ్ఞాన కుసుమాలు వికసిస్త్తుంటాయి. వాటితో అనేకమందికి ఎంతో మేలు జరుగుతుంది. అన్నింటికీ తొలి బీజం నమస్కారమే! గర్భగుడిలో నిలుచున్నప్పుడు, భక్తుడు రెండు చేతులూ జోడించి దైవీ రూపాలకు దండం పెడతాడు. అలా నమస్కారం అనే క్రియ రెండు చేతులూ సమానమనే ఎరుక కలిగిస్తుంది.
భారతీయ సంస్కృతిలో ప్రణామానికి ఒక విశిష్టమైన స్థానమిచ్చారు. స్పందించే గుణం కలిగిన హృదయమే దానికి నాంది పలుకుతుంది. ప్రేమకు మాతృక నమస్కారం. హృదయాంతరాళంలో జనించే అనిర్వచనీయ మానసిక భావనకు అది భౌతిక రూపం. రెండు చేతులూ ఒక దరికి చేరడం వల్ల, నమస్కార ప్రక్రియ సంపూర్ణంగా ఆవిష్కృతమవుతుంది. పిల్లలు బుజ్జి చేతులతో దండం పెడితే, ఇంటికి వచ్చిన అతిథులు ముచ్చటపడతారు. ఆ చిన్నారుల్ని దగ్గరకు తీసుకుంటారు. ప్రేమతో ముద్దాడతారు. ఇంత చిన్నప్పుడే అంతటి మర్యాద నేర్పినందుకు తల్లిదండ్రుల పెంపకాన్ని అభినందిస్తారు.
నమస్కారం తెలిపే వ్యక్తి పట్ల ఎవరికైనా గౌరవభావం పెరుగుతుంది. సమాజం అతని పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది. రెండు చేతుల జోడింపు- హృదయాన్ని ప్రతిఫలిస్తుంది కాబట్టి, ప్రజల ఆదరాభిమానాలు చూరగొనడానికి నాయకులు దాన్ని ఓ విధానంగా ఆచరిస్తారు.
యోగశాస్త్రంలో సూర్యనమస్కారాలదే కీలక పాత్ర. రోజూ ఉదయంవేళ సూర్యుడికి అభిముఖంగా నిలబడి నమస్కరిస్తే, ఆరోగ్య భాగ్యం కలుగుతుంది. ఆధునిక వైద్యశాస్త్రమూ అదే చెబుతోంది. నమస్కార భంగిమలో ఉన్నప్పుడు, మనిషిలో తేజస్సు ఉట్టిపడుతుంటుంది. పద్మాసనం వేసి, కళ్లు మూసి, చేతులు జోడించి చేసే నమస్కారం అతడి అంతరంగంలోని ‘ఆత్మజ్యోతి’కి చెందుతుంది. పూర్వం రుషులు నమస్కార భంగిమలోనూ ధ్యానం చేసేవారు. అదే సాధనతో, వారు జీవితలక్ష్యం సాధించేవారు!
- మునిమడుగుల రాజారావు

మల్టీప్లెక్స్‌ల్లో పార్కింగ్ చార్జీలు లేవు_NoParkingFeesinTheatres
మల్టీప్లెక్స్‌ల్లో పార్కింగ్ చార్జీలు లేవు
రాష్ట్రంలోని థియేటర్లు, మల్టీప్లెక్స్ కాంప్లెక్సులు, మల్టీప్లెక్స్ థియేటర్లలోని పార్కింగ్ చార్జీల వసూళ్లకు చెక్ పడింది. పార్కింగ్ చార్జీలు వసూలు చేయరాదని గతంలో న్యాయస్థానాలు తీర్పులు ఇచ్చినా యాజమాన్యాలు పార్కింగ్ ఫీజులు వసూలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ కాంప్లెక్సుల్లో వస్తువుల కొనుగోలుకు వెళ్లిన వాహనదారుల నుంచి యాజమాన్యాలు ముక్కుపిండి మరీ చార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇక మల్టీప్లెక్స్ థియేటర్లు, సాధారణ థియేటర్లు ఇష్టం వచ్చిన రీతిలో పార్కింగ్ చార్జీలను వసూలు చేస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో ఇవి మరింత భారంగా ఉన్నాయనే అభిప్రాయాన్ని వాహనదారులు వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ధియేటర్ల యాజమాన్యాలు మోటారు సైకిళ్లకు రూ. 20, కార్లకు రూ. 40, ఆటోలకు రూ. 30, సైకిళ్లకు రూ.10 చొప్పున పార్కింగ్ చార్జీలుగా వసూలు చేస్తున్నాయి. రాష్ట్రంలో 16 మల్టీప్లెక్స్‌ల్లో 58 స్క్రీన్‌లు, 2,809 థియేటర్లు ఉన్నాయి. పార్కింగ్ చార్జీలు వసూలు చేయరాదనే కోర్టు తీర్పులున్న విషయం వాహనదారులకు తెలియకపోవడం, చార్జీల బాదుడును నియంత్రించాల్సిన స్థానిక సంస్థలు పట్టించుకోకపోవడంతో పార్కింగ్ వసూళ్ల దందా కొనసాగుతూనే ఉంది. ఈ నేపధ్యంలో గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన న్యాయవాది వి.హరనాథ్‌బాబు సమాచార హక్కు చట్టం కింద పార్కింగ్ చార్జీల వివరాలు కోరుతూ రాష్ట్ర పట్టణ, ప్రణాళికశాఖ సంచాలకులకు ఈ నెల 10న అర్జీ పెట్టారు. దీనిపై ఆ శాఖకు చెందిన ప్రజా సమాచార అధికారి స్పందిస్తూ, పార్కింగ్ ఫీజులు వసూలు చేసేలా ఎటువంటి నియమ నిబంధనలు, ఉత్తర్వులు లేవంటూ హరనాథ్‌బాబుకు వివరణ ఇచ్చారు.

పార్కింగ్ చార్జీలను వసూలు చేస్తున్న మల్టీప్లెక్సులు, థియేటర్లపై స్థానిక సంస్థలకు వాహనదారులు ఫిర్యాదు చేయవచ్చని ఆ లేఖలో స్పష్టం చేశారు. కాగా, పార్కింగ్ చార్జీలు వసూలు చేయరాదని 2003 మే నెలలో హైకోర్టు తీర్పు నిచ్చిందని, సీహెచ్ మదన్ మోహన్ అండ్ అదర్స్ వర్సెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ కేసులో మల్టీప్లెక్స్ యాజమాన్యాలు, మల్టీప్లెక్స్ థియేటర్లు, సాధారణ థియేటర్లు పార్కింగ్ చార్జీలు వసూలు చేయకూడదనే తీర్పు ఉందని హరనాథ్‌బాబు స్పష్టం చేశారు.
భక్తి లక్షణం _BhakthiLakshanam
భక్తి
లక్షణం
ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్విధ మార్గాలు ఆదికాలం నుంచీ భారతీయుల జీవన ధ్యేయాలయ్యాయి. మొదటి మూడూ (త్రిపుటి) ఉత్కృష్టమైన మోక్షసాధనకు సాధనాలు. జ్ఞాన భక్తి కర్మయోగాలనేవి భగవద్గీత ఆరంభ కాలం నుంచే జీవనమార్గాలయ్యాయి. మానవుడు తన అభిరుచిని అనుసరించి, ఈ మూడు మార్గాల్లో దేనినైనా స్వీకరించి లక్ష్యాన్ని సాధించవచ్చు.
బుద్ధిజీవులకు జ్ఞానమార్గం, భావనాశీలురకు భక్తిమార్గం, క్రియాశీలురకు కర్మమార్గం స్వీకారయోగ్యమవుతాయి. మానవ జీవనవిధానంలో భక్తి వినూత్న చైతన్యాన్ని సృష్టించింది.
ఇష్టదైవం పట్ల ప్రేమను ‘భక్తి’గా నిర్వచిస్తారు. ఆ మార్గంలో మొదటి మెట్టు ప్రతీకోపాసన. అంటే, విగ్రహారాధన. విగ్రహాన్ని సాక్షాత్తు దేవతగా భావిస్తారు. ఆ బాహ్య పూజావిధానానికి పైమెట్టు- మానసిక ప్రయత్నం. భక్తుడు తన హృదయపీఠం పైకి ఇష్టదైవాన్ని ఆహ్వానించి, ప్రతిష్ఠించి, పూజిస్తాడు. ‘అనన్య భక్తితో నన్ను ఎవరు ఆరాధిస్తారో, ఏ ఇతర భావాలూ లేక నన్నే ఎవరు ధ్యానిస్తారో, సదా అనుసరిస్తారో- వారి బాధ్యతలన్నీ నేనే నిర్వర్తిస్తాను’ అంటాడు గీతాకారుడు. భగవంతుడి పట్ల ప్రేమానుబంధం ఎక్కువయ్యేకొద్దీ, మిగిలిన వాటిపై భక్తుడి విముఖత పెరుగుతుంటుంది. దాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో ‘వైరాగ్య భావన’గా పరిగణిస్తారు.
భక్తికి సంబంధించి, రెండు దృక్పథాలున్నాయి. ఒకటి- భక్తుడు స్వప్రయత్నంతో ఈశ్వరానుగ్రహం సంపాదించడం, లేదా దైవం మీదే భారమంతా మోపి ‘సర్వాత్మ’గా ఆరాధించడం.రెండోది ప్రపత్తి. అంటే, బంధవిముక్తికి ప్రభు పాదాల్ని ఆశ్రయించడం. వీటిలో- మొదటిది మర్కట కిశోర న్యాయం. రెండోది మార్జాల కిశోర న్యాయం. మర్కటం (కోతిపిల్ల) ఎప్పుడూ తల్లి పొట్టను పట్టుకొనే ఉంటుంది. ఆ తల్లి చెట్లపై ఎంతగా గెంతుతున్నా, దాన్ని పిల్ల వదలదు. మార్జాలం (పిల్లి) తన పిల్లను నోట కరచుకొని తీసుకుపోతుంటుంది. పిల్లిపిల్ల తన రక్షణ కోసం ఏమీ చేయదు. మొదటి మార్గంలో దైవానుగ్రహాన్ని భక్తుడు సంపాదించుకుంటాడు. రెండో మార్గంలో, దైవమే అనుగ్రహిస్తాడు. ప్రపత్తి అంటే ఇదే! ఈ రెండూ పూర్తి విరుద్ధమైన మార్గాలు కావు. ఇవి అన్యోన్యమైనవి. సహానుభూతిని కలిగించేవి.
‘అంతర్యామివి నీవు, ఆడేటి బొమ్మను నేను, చెంత గాచుట నీ పని, సేవించుట నా పని...’ అంటాడు అన్నమయ్య. ఏ ప్రాణి పట్లా ద్వేషభావం లేనివాడు; సర్వ ప్రాణుల మీద అవ్యాజమైన ప్రేమ, కరుణ గలవాడు భక్తుడు. అతడు విపరీతమైన మమత, అహంకారం- రెండూ లేనివాడు. సుఖం ప్రాప్తించినా, దుఃఖం కలిగినా సమభావం కలిగి ఉండేవాడు. క్షమాగుణం కలిగినవాడు. మనసు, శరీరం, ఇంద్రియాల్ని వశంలో ఉంచగలవాడు. సర్వకాల సర్వావస్థల్లోనూ సంతుష్టుడైనవాడే అసలైన భక్తుడు. అతడు భగవంతుడికే తన మనసును, బుద్ధిని అర్పణ చేసేంత గొప్పవాడు.
భక్తుడు అందరితోనూ సమభావంతో మెలగాలి. నిందాస్తుతులకు చలించకూడదు. ఈర్ష్య, భయం వంటి మనోవికారాలకు లొంగకూడదు.
భక్తుల్ని మూడు విధాలుగా గుర్తిస్తారు. ‘భగవంతుడు అక్కడెక్కడో ఉన్నాడు. ఆయన వేరు, ఆ సృష్టి వేరు’ అని భావించేవాడిది అధమ భక్తి. ‘భగవంతుడు అంతర్యామి. లోపల నుంచి అందర్నీ నియంత్రిస్తాడు’ అని తలచేవాడు మధ్యముడు. ‘సర్వమూ భగవంతుడే’ అని తలపోస్తాడు ఉత్తమ భక్తుడు. ‘సకల తత్వాలూ భగవంతుడే... సృష్టి అంతటా ఆయనే నిండి ఉన్నాడు’ అనే భావనే ఉదాత్త భక్తి!
- డాక్టర్ దామెర వేంకట సూర్యారావు
ఆచార్యుల వల్లనే మనకు ఈ వైభవం_chaganti
ఆచార్యుల వల్లనే మనకు ఈ వైభవం
ప్రకృతిలోని ఇరవైనాలుగింటిని దత్తాత్రేయులవారు గురువులుగా స్వీకరించిన విషయం తెలుసుకున్నాం. మహానుభావులయిన ఈ గురువులు కేవలం ఉపదేశాలవల్ల కాక, వారి చేష్ఠితాలవల్ల ప్రకాశించారు. చంద్రశేఖరేంద్ర మహాస్వామివారు సన్యాసాశ్రమం స్వీకరించడానికి, వైరాగ్యం పొందడానికి దారితీసిన కారణాల్లో ఒకటి ఆయన చిన్నతనంలో జరిగిన సంఘటన. ఆయన వీథిలో ఉండే ఒకరు యాత్రలకు వెడుతూ ఇంటికి తాళంవేసుకుని వెళ్ళారు.
ఓ రాత్రివేళ ఆ ఇంట్లోనుంచి పెద్దశబ్దాలు వినిపిస్తుంటే, దొంగలు పడ్డారనుకుని చుట్టుపక్కల వాళ్లంతా దుడ్డుకర్రలు పట్టుకుని ఆ ఇంటిని చుట్టుముట్టి తలుపులు తట్టారు. అయినా శబ్దాలు ఆగకపోవడంతో తలుపులు బద్దలుకొట్టి లోపలకు వెళ్ళారు. తీరా చూస్తే ఒక పిల్లి. ఏదో ఆహార పదార్థం కోసం చెంబులో తలదూర్చింది. తల ఇరుక్కుపోయింది. కళ్ళు కనిపించక అటూ ఇటూ దూకుతూ ప్రతిదాన్నీ గుద్దేస్తున్నది.అక్కడ చేరినవారు నెమ్మదిగా తలవిడిపించి దానిని వదిలేసారు. నిజానికి ఇది మామూలు సంఘటనే. కానీ బాలుడిగా ఉన్న స్వామివారిని ప్రభావితం చేసింది. మనిషి అత్యాశతో ప్రవర్తించడంవల్ల ఆఖరికి చెంబులో తలదూర్చి ఇరుక్కుపోయిన పిల్లిలా కొట్టుమిట్టాడతాడని, ఆరోజు పిల్లిని చూసి నేర్చుకున్నానని 80 సంవత్సరాల వయసులో స్వామివారు గుర్తుచేసుకున్నారు.
మహాస్వామివారే ఒకసారి ఆశ్రమంలో బయట అరుగుమీద కూర్చుని ఉండగా కొద్దిదూరంలో వేదవిద్యార్థులు ఆడుకుంటున్నారు. వారిని పిలిపించి ‘మీ గురువుగారు ఇవ్వాళ రాలేదా, ఆడుకుంటున్నారు’ అని అడిగారు. ఒకడు చటుక్కున ‘రాలేదండి’ అన్నాడు. మరొకడు ‘వచ్చారండీ, పాఠం కూడా మొదలుపెట్టారు. కానీ మేమే ఆడుకుంటున్నాం’ అన్నాడు. అనుమానమొచ్చి శిష్యుణ్ణి పంపి విచారిస్తే వాళ్ళ గురువు రాలేదని తెలిసింది. రెండవవాణ్ణి ‘అబద్ధం ఎందుకు చెప్పావు’ అని అడిగారు.
‘‘మా గురువు గారి ఆలస్యాన్ని మీ దృష్టికి తీసుకురావడం ఇష్టంలేక, ఆయన తప్పును మీకు పితూరీగా చెప్పడం ఇష్టంలేక అబద్ధం చెప్పాను’’ అన్నాడతను. వారిని పంపేసిన తరువాత ‘వీడు రా శిష్యుడంటే... శిక్షకు సిద్ధపడి కూడా అబద్ధమాడి గురువుగారి వైభవం నిలబెట్టడానికి ప్రయత్నించాడు’ అన్నారు స్వామివారు. ప్రస్తుత శృంగేరీ పీఠాధిపతి భారతీ తీర్థస్వామివారి గురువులు శ్రీమద్ అభినవ విద్యాతీర్థుల వారి విషయంలో ఒక విశేషం జరిగింది. ఆయన పీఠాధిపతిగా ఉన్న రోజుల్లో ఒక ఆయుర్వేద వైద్యుడొచ్చి ‘‘స్వామీ, ఇది ఒక అద్భుతమైన పసరు. అంత తేలికగా ఎక్కడా దొరకదు.బాగా ఖరీదు కూడా. బెణికినా, కండరాలు పట్టేసినా, నొప్పి ఎక్కువగా ఉన్నా ఇది రాస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. కేవలం మీకోసం తెచ్చాను’’ అని ఆ మందు ఇచ్చాడు.
శిష్యులను భద్రపరచమని స్వామివారు చెప్పారు. ఓ గంట గడిచాక స్వామివారు బయటకు వచ్చారు. అక్కడ ఒక కుక్క నడవలేక కాలీడుస్తూ పోతున్నది. ఆయన చూసి దాని కాలు బెణికినట్లుందని చెప్పి అంతకుముందు ఆయుర్వేద వైద్యుడు ఇచ్చిన మందును శిష్యులచేత తెప్పించి దాని కాలుకు పట్టువేసారు. చూస్తుండగానే అది నిలుచుని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళింది. పక్కనున్న శిష్యులు ... ‘‘అయ్యో, ఆయన అంత ప్రేమగా తమరి కోసమని తెచ్చిచ్చారు కదా, దానిని కాస్తా ఆ కుక్క కాలుకు రాసేస్తిరి’’ అన్నారు.
‘అదేమిటి...నొప్పి నాదయితే ఒకరకం, కుక్కదయితే మరొకటీనా..!!!’’ అన్నారు స్వామి వారు. అందుకే వారు జగద్గురువులయ్యారు. గురుత్వంలో అంత శ్రేష్ఠత్వం ఉంటుంది. అసలు ఈ దేశ కీర్తిప్రతిష్ఠలన్నీ ఆచార్యులవే. ఇక్కడ ఉన్న ఐశ్వర్యంవల్లకాదు, ఇతర భోగోపకరణాలవల్లకాదు.. కేవలంగా వారు చేసిన ఉపదేశాలవల్ల, వారి ఆదర్శ నడవడికలవల్ల ఈ దేశ ప్రతిష్ఠ పెరిగింది.
- బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు
మేడారం_జాతర_MedaramJatara_sammakka_sarakka
జాతరమ్మ జాతర మేడారం జాతర
MedaramJatara
జాతరమ్మ జాతర మేడారం జాతర!
ఆసియాలోనే అతిపెద్ద జాతర... కుంభమేళా తరవాత దేశంలో జరిగే మహా జాతర... కోటిమంది భక్తులు హాజరయ్యే మేడారం జాతర. అదే సమ్మక్క-సారలమ్మ జాతర. తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆ గిరిజన జాతర విశేషాల్లోకి వెళ్తే...
కొయ్య దేవతలూ అశేష భక్తులూ, అంతులేని విశ్వాసాలూ కోయదొరల జోస్యాలూ, పొర్లుదండాలూ శివసత్తుల పూనకాలూ, రంగుల గుడారాలూ ఎడ్లబండ్ల పరుగులూ, కొత్తబెల్లం వాసనలూ... చెట్ల మందులూ...అదో చిత్రవిచిత్రమైన ప్రపంచం. దానికి వేదికే మేడారం.
తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కుగ్రామమే మేడారం. అక్కడ జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర గిరిజనేతరుల్నీ ఆకర్షిస్తూ మహా జాతరగా పేరొందింది. ఈ జాతరకు దేశ విదేశీయులూ భారీ సంఖ్యలో హాజరవుతున్నారట. అక్కడి హుండీలో కనిపించే డాలర్లే అందుకు సాక్ష్యం. జాతర సమయంలో ఏటూరు-నాగారం అభయారణ్యం జనారణ్యంగా మారిపోతుంది. ఏటా పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పర్యటక ప్రదేశంగా తీర్చిదిద్దుతోంది.
మాఘశుద్ధ పౌర్ణమి రోజున మొదలై నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతర, ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. ఈ ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకూ జరగనుంది. జనవరి 31న సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్ద రాజు గద్దెకు చేరుకోగా, ఫిబ్రవరి 1న చిలుకల గుట్ట నుంచి సమ్మక్క గద్దెకు వస్తుంది. 2న భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటే, మూడో తేదీన అంటే నాలుగోరోజున అధికారిక లాంఛనాలతో అమ్మలిద్దరూ తిరిగి వనప్రవేశం చేయడంతో మేడారం జాతర ముగుస్తుంది. ఈ మహా ఘట్టాలను వీక్షించేందుకు భక్తులు వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు.
వనదేవతలు!
13వ శతాబ్దంలో కాకతీయరాజు ప్రతాపరుద్రుడిని ఎదురించి గిరిజనుల పక్షాన పోరాడిన వీర వనితలే సమ్మక్క-సారలమ్మలు. వీళ్ళిద్దరూ తల్లీకూతుళ్లు. వాళ్లను స్మరించుకుంటూ జరిగే ఈ జాతర, ప్రతాపరుద్రుడి కాలం నుంచీ జరుగుతుందనేది చారిత్రక కథనం. ఆ కాలంలో మేడారం ప్రాంతాన్ని కాకతీయుల సామంతుడైన పగిడిద్ద రాజు పాలించేవాడు. ఆయన భార్యే సమ్మక్క. సమ్మక్క పుట్టుక గురించి ఓ కథ ప్రచారంలో ఉంది. మేడారానికి చెందిన కోయదొరలు గోదావరీ తీరంలోని అడవికి వేటకు వెళ్లినప్పుడు- అక్కడో పాప పులుల మధ్య ఆడుతూ కనిపించిందట. ఆ పాపను తీసుకొచ్చి మాఘశుద్ధ పౌర్ణమిరోజున సమ్మక్క అని పేరు పెట్టారట. ఆమె గ్రామానికి వచ్చినప్పటినుంచీ అన్నీ శుభాలు జరిగేవట. పాముకాటుకి గురయినవాళ్లని తన మహిమతో బతికించేదట. సంతానం లేనివారికి పిల్లలు పుట్టేవారట. దాంతో ఆమెను అంతా వనదేవతగా భావించేవారు. తరవాతి కాలంలో ఆమెను పగిడిద్ద రాజు వివాహమాడగా, ఆ దంపతులకు సారలమ్మ, జంపన్న, నాగులమ్మ అని ముగ్గురు సంతానం జన్మించారు.
అప్పట్లో కోయరాజులు కాకతీయులకు సామంతులుగా ఉండి, మేడారం పరగణాలను పాలించేవారు. ఓసారి ఆ ప్రాంతం వరసగా నాలుగేళ్లపాటు అనావృష్టికి గురైంది. ప్రజలంతా కరవుకాటకాలతో అల్లాడుతున్నారు. అయినప్పటికీ ప్రతాపరుద్రుడు పన్ను కట్టాల్సిందే అన్నాడు. దాన్ని వ్యతిరేకించిన కోయదొరలపై యుద్ధం ప్రకటించాడు. కాకతీయ సైన్యం ములుగు సమీపంలోని గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సు దగ్గర స్థావరాన్ని ఏర్పాటు చేసుకుని యుద్ధానికి దిగింది. అప్పుడు పగిడిద్ద రాజు, నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజుతో కలిసి సైన్యాన్ని మేడారం దగ్గరున్న సంపెంగ వాగు దగ్గర నిలువరించి వీరోచితంగా పోరాడి వీరమరణం పొందాడు. సైనికుల చేతిలో చావడం ఇష్టంలేని కొడుకు జంపన్న సంపెంగ వాగులో దూకి ప్రాణత్యాగం చేశాడు. అప్పటినుంచీ అది జంపన్న వాగుగా ప్రాచుర్యం పొందింది. భర్తాబిడ్డలు మరణించారన్న వార్త విన్న సమ్మక్క అపరకాళిలా విరుచుకుపడింది. ఈటెలతో యుద్ధం చేసి సైన్యాన్ని పరుగులెత్తించింది. ఓటమి తప్పదనుకున్న ఓ సైనికుడు ఆమెను దొంగచాటుగా బల్లెంతో పొడిచినట్లు చెబుతారు. అప్పుడామె గాయాలతో ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్ట వైపునకు వెళ్లి దాని చుట్టూ తిరిగి అదృశ్యమైందట.
కోయదొరలు ఆమెకోసం వెతకగా గుట్టమీద ఓ నెమలినార చెట్టు దగ్గరున్న పుట్ట దగ్గర ఓ కుంకుమ భరిణె కనిపించిందట. అదే సమ్మక్క ఆనవాలుగా భావించి, ఆమెకోసం ఎదురుచూస్తుండగా, ‘కుతంత్రాలతో సాధించిన రాజ్యం వీరభోజ్యం కాదనీ, ఈ గడ్డపై పుట్టిన ప్రతి వ్యక్తి వీరుడుగానే రాజ్యాన్ని సంపాదించాలనీ ఆ స్థలంలో గద్దె కట్టించి, రెండేళ్లకోసారి ఉత్సవం జరిపితే భక్తుల కోరికలు నెరవేరతాయ’నీ ఆకాశవాణి మాటలు వినిపించడంతో అవి సమ్మక్క మాటలుగా భావించి భరిణెతో వెనుతిరిగారట. యుద్ధనీతికి వ్యతిరేకంగా తన సైనికులు చేసిన తప్పిదాన్ని గ్రహించిన ప్రతాపరుద్రుడు కోయరాజ్యాన్ని తిరిగి వారికే ఇచ్చి, సమ్మక్క భక్తుడిగా మారి, ఈ జాతరను ప్రారంభించినట్లు నాటి శాసనాలద్వారా తెలుస్తోంది. సమ్మక్కతోబాటు వీరోచితంగా పోరాడిన సారలమ్మకు మేడారానికి మూడు కిలోమీటర్ల దూరంలో కన్నెపల్లి గ్రామంలో గుడి కట్టించి పూజించేవారట. మేడారంలో సమ్మక్క జాతర ఉత్సవాలు వైభవంగా జరగడంతో 1960 తరవాత సారలమ్మకు కూడా ఆమె గద్దె పక్కనే గద్దెను నిర్మించారు. అప్పట్నుంచీ మేడారం జాతర, సమ్మక్క-సారలమ్మ జాతరగా ప్రసిద్ధమైంది.
జాతర జరిగేదెలా?
పదిరోజుల ముందునుంచే పూజలు మొదలుపెట్టి, వేర్వేరు ప్రాంతాలనుంచి దేవతా మూర్తులను గద్దెల దగ్గరకు తీసుకురావడం ఈ జాతర ప్రత్యేకత. వెదురుకర్ర, కుంకుమభరిణెలే ఉత్సవమూర్తులు. మొదటిరోజు సారలమ్మ, ఆమె భర్త గోవిందరాజులు, తండ్రి పగిడిద్దరాజులు గద్దెలపైకి చేరుకుంటారు. సారలమ్మను కన్నెపల్లి గ్రామం నుంచి మేళతాళాలతో ఆరుగురు పూజారులు ఊరేగింపుగా తీసుకువస్తారు. ఆ సమయంలో కోరికలు కోరుకుంటూ సాష్టాంగ నమస్కారంతో పడుకుంటారు కొందరు భక్తులు. అప్పుడు పూజారి వారిపై నుంచి నడుచుకుంటూ వస్తారు. దాంతో జీవితం ధన్యమైనదిగా భావిస్తారా భక్తులు. జాతరకు రెండురోజుల ముందే కొత్తగూడ మండలం, పోనుగుండ్లలోని మరో పూజారి బృందం పగిడిద్దరాజుతో బయల్దేరుతుంది. సారలమ్మ భర్త గోవిందరాజులను ఏటూరు-నాగారం ప్రాంతంలోని కొండాయి గ్రామం నుంచి కాక వంశస్తులు తీసుకురావడం ఆనవాయితీ.
చివరగా సమ్మక్కను కుంకుమభరిణెగా భావించి, చిలుకల గుట్టకు చెందిన కొక్కెర వంశస్తులు ఎలాంటి ఆర్భాటాలూ లేకుండా తీసుకొచ్చి, గద్దెమీద ప్రతిష్ఠిస్తారు. వెదురుబొంగుతో చేసిన మొంటెలో గిరిజనులు తయారుచేసిన కుంకుమ వేసి, దాన్ని చిన్నపిల్లాడి నెత్తిన పెట్టి తీసుకువస్తారు. ఆ సమయంలో అధికారిక లాంఛనాలతో గాల్లోకి తుపాకీని పది రౌండ్లు పేలుస్తూ సమ్మక్కకు ఆహ్వానం పలుకుతారు. ఆ సమయంలోనే కోరికలు కోరుకుంటే నెరవేరతాయని భక్తులు అమ్మను చూడ్డానికి పరుగులు పెడుతుంటారు. దేవత రాకతో ఆ ప్రాంతం, శివసత్తుల శివాలుతో దద్దరిల్లిపోతుంది. బలులు మొదలవుతాయి. తరవాతి రోజు అమ్మవారి గద్దెను దర్శించి బంగారం(బెల్లం), ధన, వస్తు, ఆభరణ, కోడెరూపంలో మొక్కులు చెల్లించుకుంటారు.
ఏమేమి మొక్కుబడులు?
భక్తుల దృష్టిలో మేడారం సమస్త శుభాలకూ వేదిక.
జంపన్నవాగులో స్నానాలు చేసి శరణాలు చెబుతూ వాగుకి పసుపూకుంకుమలతో పూజలు చేస్తారు. కోరికలు తీరితే ఎడ్లబండ్లు కట్టుకువస్తామనీ, అమ్మవారి రూపంలో వస్తామనీ ఒడిబియ్యం(కొత్తబట్టలో పసుపూకుంకుమ కలిపిన బియ్యం పోసి, వాటిల్లో ఎండిన కొబ్బరి కుడుకలు, రెండు రవిక ముక్కలు, రెండు పోకవక్కలు, ఖర్జూరాలు వేసి నడుముకి కట్టుకుంటారు), ఎదురుకోళ్లు(కోళ్లను గాల్లోకి ఎగరేయడం), గాజులూ, రవికెలు సమర్పించడం, లసిందేవమ్మ మొక్కు(గుర్రం ఆకారపు తొడుగును మొహానికి కట్టుకుని వచ్చి దాన్ని అమ్మకి సమర్పించడం), నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించుకుంటామని మొక్కుకుని, అంతకు తూగే బెల్లానికి ఇంటి దగ్గరే పూజలు చేసి తీసుకురావడం, మేకపోతులూ కోళ్లూ బలివ్వడం, తలనీలాలివ్వడం, కోడెను సమర్పించడం... ఇలా రకరకాల మొక్కుబడులు చెల్లిస్తారు.
జాతరకు వెళ్లే దారిలో ములుగు దగ్గర గట్టమ్మ తల్లి దేవాలయం ఉంది. ఈ యాత్ర సఫలం కావాలంటే ఈ అమ్మను తప్పక దర్శించుకోవాల్సిందే అన్న నమ్మకంతో అక్కడ ఆగి వెళతారు.
మేడారం జాతరలోని ఆచారాలూ సంప్రదాయాలన్నీ గిరిజన సంస్కృతిని పట్టిస్తాయి. అయినప్పటికీ చెంచులు, వడ్డెరలు, కోయలు, భిల్లులు, సవరలు, గోండులు... వంటి గిరిజన తెగలతోబాటు హైదరాబాదు, ముంబై మహానగరాలనుంచీ కులమత భేదం లేకుండా ఎందరో అమ్మవారిని దర్శించుకుంటారు. దాంతో ఆ సమయంలో మేడారం మహానగరాన్నే తలపిస్తుంది.
ఏ ప్రాంతం వాళ్లయినా వరంగల్ నుంచి ములుగు, గోవిందరావుపేట, పస్రా మీదుగా లేదా ఏటూరు-నాగారం,తాడ్వాయి ద్వారా మేడారానికి చేరుకోవచ్చు.
- జంగిలి కోటేశ్వర్‌రావు, ములుగు,
భీష్మ ఏకాదశి_Bhishma
భీష్మ యోగి
భీష్మ ఏకాదశి జనవరి 27 2018
లోకరీతి, లోకనీతి తెలిసి మెలిగేవారు, స్థితప్రజ్ఞులు, నియమానువర్తులను లోకం ఏదోరూపంలో స్మరిస్తూనే ఉంటుంది. యుగాలు గడిచినా అలాంటి మహనీయుల జయంతులు, వర్ధంతులు స్మరణదినాలుగా నిలిచిపోతాయి. అలాంటి రోజుల్లో మాఘ శుక్ల ఏకాదశి ఒకటి. ఈరోజుకు జయైకాదశి అని పేరు. భీష్ముడి పేరిట భీష్మైకాదశి అని ప్రసిద్ధమైంది.
గంగాదేవికి శంతన మహారాజు ద్వారా జన్మించిన ఎనిమిదో సంతానం దేవవ్రతుడు. తొలి ఏడుగురి సంతానాన్ని నది పాలు చేసింది గంగ. అయినా తానేం చేసినా ఎదురాడకుండా ఉన్నన్నాళ్లే కాపురం చేస్తానన్న గంగ మాటకు కట్టుబడి శంతనుడు కిమ్మనలేదు. దేవవ్రతుణ్నీ అలాగే చేయబోతే వారించాడు శంతనుడు. దాంతో ఆ బిడ్డను వదిలిపెట్టి గంగ వెళ్ళిపోయింది. తల్లిదండ్రుల పేర్లతో ఆ శిశువు శాంతనవుడు, గాంగేయుడుగా ప్రసిద్ధుడయ్యాడు. వసిష్ఠ మహర్షి దగ్గర శిష్యరికం చేశాడు. అస్త్రశస్త్రాది యుద్ధవిద్యల్లో, ధర్మశాస్త్రాల్లో నిష్ణాతుడయ్యాడు. యౌవరాజ్య పట్టాభిషిక్తుడయ్యాడు. కొద్ది రోజుల్లో తండ్రి తరవాత రాజుగా పట్టాభిషిక్తుడు కావాల్సి ఉంది. అలాంటి సమయంలో సత్యవతి మీద తన తండ్రి మనసుపడ్డాడని, ఆమెకు కలిగిన సంతానాన్ని రాజు చేస్తేనే ఆమె శంతనుణ్ని వివాహమాడుతుందని దాశరాజు షరతు విధించాడని తెలుసుకున్నాడు. పట్టపురాణి బిడ్డను వదిలి, మనసుపడ్డదాని బిడ్డను రాజుగా చేయడమెలాగని తండ్రి మథనపడుతున్నాడనీ వింటాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా జన్మనిచ్చిన తండ్రి కోరిక తీర్చడం కొడుకుగా తన ధర్మమని భావించాడు దేవవ్రతుడు. వెంటనే దాశరాజు దగ్గరకెళ్లాడు. ఆమెకు పుట్టిన బిడ్డలకే రాజ్యాధికారం కల్పించడం కోసం తాను రాజ్యాధికారాన్ని వదులుకుంటున్నానని చెప్పాడు. ఆ మాటకు దాశరాజు- నీకు పుట్టిన బిడ్డలు అడ్డుపడరని నమ్మకమేమిటని నిలదీస్తాడు. అదీ నిజమేననిపించి క్షణం ఆలోచించాడు. తేరుకుని తాను వివాహమే చేసుకోకుండా ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉండిపోతానని ప్రతిజ్ఞ చేశాడు. అలా భీష్మ(భీకర)మైన ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి ఆ రోజు నుంచీ భీష్ముడిగా ప్రసిద్ధుడయ్యాడు.
సత్యవతికి శంతనుడి ద్వారా చిత్రాంగుడు, విచిత్రవీర్యుడు అని ఇద్దరు బిడ్డలు కలిగారు. చిత్రాంగుడు రాజయ్యాక గంధర్వులతో యుద్ధం చేస్తూ మరణించాడు. విచిత్రవీర్యుణ్ని రాజుగా చేసి అంబిక, అంబాలికలనిచ్చి వివాహం చేశాడు భీష్ముడు. అతడూ సంతానరహితుడిగానే మరణించాడు. తన వంశం నిర్వంశం కాబోతూంది, ఆ ప్రమాదం నుంచి కాపాడాలనే ఆలోచనతో పినతల్లి అయిన సత్యవతి భీష్ముణ్ని పిలిచింది. రాజ ధర్మానుసారం తమ్ముడి భార్యల్ని సంతానవతులుగా చేయమని కోరింది. అలా చేస్తే తన ప్రతిజ్ఞకు భంగం కలిగి తన సంతానమే రాజ్యమేలినట్లవుతుందనిపించి నిరాకరించాడు. అయినప్పటికీ- వేదశాస్త్రాలు తెలిసిన వ్యాసుడి ద్వారా వారిని సంతానవతులుగా చేయించాడు. ఆ సంతానమే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు.
కురు పాండవుల మధ్య రాజ్యార్హత అంశం వివాదాస్పదమై యుద్ధానికి దారి తీసింది. కౌరవ పక్షం వహించాడు భీష్ముడు. ధర్మబద్ధంగా యుద్ధం చేశాడు. అయినా పాండవ పక్షపాతం చూపుతున్నాడంటూ సైన్యాధ్యక్ష పదవినుంచి వైదొలగమన్నాడు దుర్యోధనుడు. అయినా కౌరవుల క్షేమం కోరి తప్పుకోవడానికి ఇష్టపడలేదు. భీష్ముడు సైన్యాధ్యక్షుడిగా ఉన్నంతకాలం కౌరవుల్ని జయించడం అసాధ్యమనిపించింది పాండవులకు. అందుకే భీష్ముణ్ని రహస్యంగా కలిసి మార్గం చూపించమని వేడుకున్నారు. అతడు సూచించిన విధంగా శిఖండిని యుద్ధంలో ఎదురుగా నిలబెట్టారు. యుద్ధనియమం ప్రకారం- భీష్ముడు అస్త్రసన్యాసం చేశాడు. అదే అదనుగా అర్జునుడు వేసిన బాణం దెబ్బకు నేలకూలాడు. అంతటి మహానుభావుడు నేలమీద పడటం అరిష్టమని తలచి అప్పటికప్పుడు బాణాలతో అంపశయ్య ఏర్పరచాడు అర్జునుడు. దానిపై మేనువాల్చిన అతడు కొద్దిరోజుల్లో రానున్న ఉత్తరాయణ పుణ్యకాలంలో తనువు చాలిస్తే కైవల్యం సంభవిస్తుందని తలపోశాడు. దేవతలు ఇచ్చిన వరప్రభావంతో మరణాన్ని నియంత్రించుకున్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం, అందునా మాఘ మాసం, విష్ణువుకు అత్యంత ప్రీతికరమైన ఏకాదశినాడు తన నిర్యాణానికి ముహూర్తం నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా మాఘ శుక్ల సప్తమి మొదలుకుని, ఏకాదశి నాటికి పూర్తిగా విష్ణువులో లీనమైపోయాడు. ఆ అయిదురోజుల్నీ భీష్మ పంచకం అంటారని పురాణ కథనం. భీష్ముడి నిర్యాణ విధి జగతికి స్మరణదినమైంది. ఆయన పేరు మీదే ఆ తిథికి భీష్మ ఏకాదశి అని పేరు వచ్చింది.
భూత, భవిష్యత్తులను మనోనేత్రంతో దర్శించడాన్ని ‘దివ్యదృష్టి’గా చెబుతారు. దైవాన్ని దర్శించడాన్నీ ఆ దృష్టిగానే భావించాలి. మనిషిగా దిగివచ్చిన దేవుణ్ని గుర్తించాలంటే, దివ్య చక్షువులు ఉండితీరాలి. మహాభారత కాలంలో మహావిష్ణువే కృష్ణుడిగా దిగివచ్చాడని చాలా కొద్దిమంది గుర్తించారు. వారిలో భీష్ముడు అగ్రగణ్యుడు. కృష్ణుణ్ని ఆయన నారాయణుడిగానే సంభావించాడు. అదొక యోగ ఫలం.
ఏ యోగ సాధన ఏ ఫలితమిస్తుందో పతంజలి మహర్షి ‘యోగ సూత్రాలు’ వివరించాయి.వాటి ప్రకారం, బ్రహ్మచర్యం వల్ల ‘దివ్యత్వం’ లభిస్తుంది. బ్రహ్మచర్య నిశిత వైభవానికి నికార్సయిన ఉదాహరణ భీష్మాచార్యుడు. మహాకవి జాషువా చెప్పినట్లు, ఆయన మూడు తరాలకు తాత! అవసానదశలోనూ భీష్ముడి నుంచి వ్యక్తమైన అవక్ర విక్రమ పరాక్రమానికి, విష్ణు సహస్రాన్ని వెల్లడించే స్థాయి మానసిక ధృతికి, దృఢత్వానికి- ఆయన త్రికరణ శుద్ధిగా పాటించిన బ్రహ్మచర్య వ్రతమే కారణమంటారు. భీష్ముడి వల్ల బ్రహ్మచర్యం ఒక అద్భుత నియమంగా లోకంలో గుర్తింపు పొందింది. మహాభారతంలోని భీష్మపర్వం నిజానికి వీరనాయక పర్వం! భీష్ముడు కర్మవీరుడు. ప్రతిజ్ఞ కారణంగా ఆయనను భీష్ముడన్నారు గాని- ప్రతాపం, శత్రుసంహార తీక్షణత, క్షత్రియ ధర్మనిర్వహణ పారీణత, ధర్మనిబద్ధత... అన్నీ భీష్మమే!
ఆయన తన జీవితకాలంలో ఇద్దరు అవతార పురుషులతో నేరుగా తలపడాల్సి వచ్చింది. అంబకు ఆశ్రయమిచ్చిన తన అస్త్రవిద్యా గురువు పరశురాముణ్ని భీష్ముడు యుద్ధంలో పరాజితుణ్ని చేశాడు. గురువు కాబట్టి ‘ఓడించాడు’ అనకుండా ‘మెప్పించాడు’ అన డం సమంజసం. అదీ భీష్మ హృదయం! శ్రీకృష్ణుడి విషయంలోనూ అదే జరిగింది. ఆయుధం పట్టనన్న ఆయనతో చక్రాయుధం పట్టించాడు భీష్ముడు. ‘భµ¼క్తుడి చేతిలో ఓడిపోవడాన్ని భగవంతుడు ఇష్టపడతాడు’ అని లోకానికి నిరూపించాడు. ‘నాకోసం నీ శపథాన్ని సైతం విడిచిపెట్టావా మహానుభావా!’ అని కన్నీటి పర్యంతమయ్యాడు. అదే మరొకరు అయితే ‘ముందేం చెప్పావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు’ అని శ్రీకృష్ణుణ్ని నిలదీసేవాడు. ‘కృష్ణుడు మాట తప్పాడు కనుక - నా చేతిలో ఓడిపోయినట్లే, ఆయన చేత ఆయుధం పట్టించాను’ అని సంబరపడేవాడు.
భీష్ముడు మేరునగ ధీరోదాత్తుడు. అసమాన స్థిరచిత్తుడు. ‘నీ చేతిలో మరణం కన్నా ఈ జీవితానికి ధన్యత ఏముంది’ అని కృష్ణుడితో అన్నాడు.‘సందేహించవద్దు. చక్రం విడిచిపెట్టు’ అని ప్రాధేయపడ్డాడు. అదీ స్థితప్రజ్ఞత అంటే! పరాక్రమంతో పరశురాముడిపై, భక్తితో కృష్ణుడిపై పైచేయి సాధించిన భీష్ముడు- దాన్ని ఎన్నడూ ప్రకటించకపోవడం గమనిస్తే, మానవుడు ఎక్కడ తగ్గాలో అర్థమవుతుంది. ఏది నిజమైన గెలుపో తెలుస్తుంది. భక్తి వల్ల భావోద్వేగాలు నెమ్మదించిన సన్నివేశమది. పరాక్రమం అనే మాటను తిరిగి నిర్వచించిన ఘట్టం అది.
‘కృష్ణుడి అసలు రూపం మీకు తెలియదు. ఆయన తోడుగా ఉన్నంతకాలం పాండవుల్ని జయించడం అసాధ్యం’ అని కౌరవులకు భీష్ముడు ఎంతగానో చెప్పిచూశాడు. ఆ హితబోధను పెడచెవిన పెట్టిన సుయోధనుడు, భీష్ముడి పట్ల పరుషంగా ప్రవర్తించాడు. ఆయన తన క్రోధాన్ని యుద్ధరంగంలో ప్రదర్శించాడు. ఒక దశలో కృష్ణుడే భీష్మసంహారానికి సిద్ధమైనా, నిగ్రహించుకొన్నాడు. ధర్మజుడికి దిక్కుతోచలేదు. సరాసరి వెళ్లి ‘త్రిశూలాన్ని దాచి, మూడో కంటిని మూసి, యుద్ధానికి దిగిన రుద్రుడిలా ఉన్నావు. తాతా! నిన్నెలా జయించాలి’ అని అడిగాడు. తనను పడగొట్టే మార్గాన్ని నిస్సంకోచంగా వివరించాడాయన.
ప్రపంచ సాహిత్యంలో భీష్ముడి వంటి కర్మయోధులు, త్యాగమూర్తులు అరుదుగా తటస్థపడతారు. భరతముని ప్రతిపాదించిన దానవీరం, దయావీరం, యుద్ధవీరంతోపాటు విద్యానాథుడు అనే లాక్షణికుడు చెప్పిన ధర్మవీరాన్నీ ఆ యోద్ధ జీవితంలో గ్రహించవచ్చు. ఆ వీరత్వాలతోనే భీష్ముడు తన గురువును, ఇష్టదైవాన్నీ మెప్పించగలిగాడు. భారత వీరులందరితోనూ పూజలందుకొన్న ఉదాత్త వ్యక్తిత్వం భీష్మ పితామహుడిది.భారతానికి, భరతావనికి ఆయన గర్వకారణం! - వై.శ్రీలక్ష్మి
జన గణ మనం ఆధ్యాత్మిక ఘనం_RepublicDay
జన గణ మనం ఆధ్యాత్మిక ఘనం
జర్మన్ భాషావేత్త మాక్స్‌ముల్లర్‌ను అక్కడి విలేకరులు అడిగారు...
‘పునర్జన్మ ఎలా ఉండాలని ప్రభువును కోరుకుంటారు’ అని...
‘భారత దేశంలో పుట్టించమని అడుగుతాను’... ఠక్కున సమాధానం చెప్పారాయన...
*ప్రఖ్యాత షెహనాయ్ విద్వాంసులు, రససిద్ధులు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్‌ను అమెరికాలో స్థిరపడమని, కోరినవన్నీ ఇస్తామని ఒత్తిడి చేశారు అక్కడి ప్రముఖులు ‘అమెరికాకు నాతోపాటు గంగామాయీ ఎలా వస్తుంది?’ అని ప్రశ్నించారాయన.
* ఈ ప్రపంచాన్ని రైలుబండితో పోలుస్తూ సత్యసాయిబాబా ‘భారతదేశం దానికి ఇంజిను’ అన్నారు. అప్పుడు విదేశీ పాత్రికేయులు ఆయనను అడిగారు ‘దేవతలందరూ మీ దేశంలోనే ఎందుకు పుడతారు?’ అని దానికి బాబా బదులిస్తూ ‘డ్రైవర్ ఇంజిన్‌లో కాకపోతే బోగీల్లో ఎక్కుతారా?’ అని ప్రశ్నించారు.
* స్వామి వివేకానంద చికాగో ప్రసంగాలను సమీక్షిస్తూ ‘‘భారతీయమైన ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక శక్తి ఆయనలో ఉప్పొంగాయి. ఆ దేశపు ప్రత్యేకత విశ్వానికి వెల్లడయింది’ అని ఒక పత్రిక రాసింది.
మహాత్ములు, కారణజన్ములు సైతం ఈ దేశాన్ని అదే విధంగా దర్శించారు. తరించారు!
నిజానికి భారతదేశమే ఒక తత్త్వశాస్త్ర గ్రంథం. సనాతన ధర్మమనే పటిష్ట పునాదులపై వెలసిన నిలువెత్తు హర్మ్యం. ఆధ్యాత్మికత దాని జీవ రసాయనం. ఆధ్యాత్మికత అంటే మతం కాదు. అదో గొప్ప నాగరికత. సంఘ జీవన హుందాతనాన్ని పెంచే సామాజిక ఉద్యమం. మనిషిని అభివృద్ధి వైపు ప్రోత్సహించే మహా చైతన్యం. ఒక జాతి నాగరికతను అంచనా వేయాలంటే ఆ దేశ జనాభా లెక్కలు పనికిరావు. సంస్కృతీ స్వరూపమే దాన్ని నిర్ణయిస్తుంది. ‘నాగరికత అనే పదార్థానికి రూపాన్నిచ్చేది సంస్కృతి’ అని అరిస్టాటిల్ నిర్వచనం. చాలా దేశాలు పురుడు పోసుకోకముందే మన దేశ సంస్కృతి, నాగరికత సర్వసంపన్నంగా అలరారాయి. ఆ వైభవానికి మూలం మన ఆధ్యాత్మిక నేపథ్యమేనన్నది నిస్సందేహం. ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా.. భారతదేశాన్ని ‘భగవంతుడి అనుగ్రహం పొందిన దేశాల్లో ముందు వరసలోని’దన్న నేపథ్యం ఇదే.
మనకు ఇష్టదైవం ఒకరు ఉంటారు. రాముడో, కృష్ణుడో, అల్లాహ్, క్రీస్తు ... ఇలా. వారిపై మన భక్తి వ్యక్తిగతం. కానీ దేశభక్తి నిర్వచనం వేరు. ఇక్కడ భక్తి అంటే ప్రేమ, గౌరవం. ఇక్కడున్న ప్రజలు, మట్టీ, నీరూ, చెట్టూ, పుట్టా, వనరులు అన్నిటిపై అవ్యాజమైన అనురాగం. ఇది నాది అనే భావన. ఈ దేశాన్ని ప్రేమించడమంటే దాని జీవ లక్షణాన్ని గురించి తెలుసుకోవాలన్న తపన పెంచుకోవడమే. ప్రజల అభిరుచులు, ఆచార వ్యవహారాలు, అన్నపానీయాలు, వస్త్రాభరణాలు, కళ, సంగీత, సాహిత్య, విజ్ఞాన విశేషాలు, భాషలు... ప్రజల మనుగడలో నుంచి తొంగిచూసే అన్ని అంశాలను కలిపి పోగేస్తే అది ఆ దేశపు సాంస్కృతిక స్వరూపమవుతుంది. ఓ జాతి నాగరికతను, ఔన్నత్యాన్ని అంచనా వేయాలంటే ఆ దేశంలో విలసిల్లిన సాంస్కృతిక వైభవాన్ని అర్థం చేసుకోవాలి.
పండగల్లో, పుష్కరాల్లో, కుంభమేళాల్లో ఈ దేశ సంస్కృతికి చెందిన విశ్వచైతన్యంతో పరిచయం కలుగుతుంది. అయితే భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో రెండు పండగలు మాత్రం అందరివీ. ఒకటి స్వాతంత్య్ర దినోత్సవం, రెండోది గణతంత్ర దినోత్సవం. ఈ పండగల సందర్భంగా దేశంపై కలిగిన భక్తిని కడదాకా కాపాడుకుంటున్నామా? ఈ సంస్కృతికి నిజమైన వారసులవుతున్నామా? అనేది నిరంతరం సమీక్షించుకోవాలి. ‘నేనంతా ఓ పిడికెడు మట్టే కావచ్చు. కానీ కలం ఎత్తితే ఒక దేశపు జెండాకున్నంత పొగరు ఉంటుంది’ అన్నారు కవి శేషేంద్రశర్మ. ఆ పోలిక ఆత్మగౌరవానికి పరాకాష్ఠ. జైహింద్ అనేది మామూలు పదం కానే కాదు. దేశమాతకు ఇష్టమైన సుస్వరవేదం. ‘స్వరాజ్యం నా జన్మ హక్కు’ అన్న తిలక్ మహాశయుని పిలుపు స్వాతంత్రోద్యమానికి ఇచ్చిన ఊతం అంతా ఇంతా కాదు. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాలు అలాంటి ఉజ్వల ఘట్టాలను సంస్మరించుకోవాల్సిన రోజులు. జాతి ఉత్తేజానికి ఉత్ప్రేరకాలు. ‘అనో భద్రాణి క్రతవోయన్తు విశ్వతః’ అన్నది భారతీయ ఆధ్యాత్మిక సందేశం. దశ దిశల నుంచి సర్వోన్నతమైన ఆలోచనలు మానవాళిని ఆవరించుగాక అని రుగ్వేదం దీవించింది. ఆ భావ వైశాల్యం భారతదేశ సంపద.
‘సాటిలేని జాతి, ఓటమెరుగని కోట నివురుగప్పి నిదురపోతుండాది’ అన్న కవి వాక్కు ఇప్పటికీ వర్తిస్తుండడం దురదృష్టకరం. ‘దేశమనియెడి దొడ్డ వృక్షం ప్రేమలను పూలెత్తవలెనోయి నరుల చెమటను తడిసి మూలధనం పంటలు పండవలెనోయి’ అన్న గురజాడ ప్రబోధం ఇప్పటికీ, ఎప్పటికీ జాతికి దిశానిర్దేశమే. ‘ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనియించినాడనీ స్వర్గ ఖండమ్మున’ అన్న దివ్యభావన గుండె పొరలను తాకితే మన ఖ్యాతి నిత్యస్మరణీయం అవుతుంది.
భారతదేశం ఒక అద్భుత కూడలి. ఎన్నో సంప్రదాయాలు, ఆచారాలు, పండగలు, పబ్బాలు, విభిన్న సంస్కృతుల మేలు కలయిక. అవన్నీ అమూల్య మణిమాణిక్యాలనుకుంటే వాటిని దండలో దారంలా కలిపి ఉంచేది ఈ దేశ ఆధ్యాత్మిక చైతన్యం. దాని సమ్మోహనశక్తి అనన్య సామాన్యం. ఈ దేశం ఇప్పటికీ ఒక్కటిగా ఉందంటే ఆ చైతన్యమే మూల సూత్రం. దేశ విదేశాలు మనకేసి చూపు సారించడానికి ఆ శక్తే కారణం. భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధిస్తున్న ఆధ్యాత్మిక కాంతి పరివేషమే ఈ దేశ ప్రధాన ఆకర్షణ. ఈ ఆకర్షణే వివేకానందుణ్ణి అంతర్జాతీయ వేదికలపై విజేతను చేసింది. వివిధ దేశాల తత్త్వవేత్తలను విశేషంగా ఆకర్షించింది. భారతీయ ఆత్మను జాగృతం చేస్తోంది. ఈ దేశ సమైక్యతకు, సంఘీభావానికి మంత్ర దండమై నిలుస్తోంది. గెలుస్తోంది. ఎర్రాప్రగడ రామకృష్ణ
మేరా భారత్ మహాన్
‘నాదేశం భగవద్గీత.. నా దేశం అగ్ని పునీత సీత... నా దేశం కరుణాంతరంగ. దేశంసంస్కార గంగ’
- డా.సి. నారాయణరెడ్డి
అత్యున్నత ఆశయాలు, ఉదాత్త లక్ష్యాలు, ఉత్తమ భావాలు కలిగిన ఓ వ్యక్తి కోరుకునేవన్నీ భారతదేశంలో పుష్కలంగా ఉన్నాయి. ఇది నా దేశం కాబట్టి నేను ప్రేమించడం లేదు. విశిష్ఠ లక్షణాలను ఇక్కడ గమనించాను కాబట్టి ప్రేమిస్తున్నాను. - మహాత్మాగాంధీ
శ్రీలక్ష్మీనరసింహస్వామి_ఆలయ_మోర్జంపాడు_LakshmiNarasimhaswamy_Morjampadu
పల్నాడులో తిరునాళ్ల వేడుక!
ఏడాదిలో ఆ రెండు రోజులూ పల్నాడువాసులకు ఎంతో ప్రత్యేకమైనవి. ఎందుకంటే, భక్తులపాలిట కొంగు బంగారంగా భాసిల్లుతున్న శ్రీలక్ష్మీ నరసింహస్వామికి ఆ రోజుల్లో ఘనంగా తిరునాళ్లు నిర్వహిస్తారిక్కడ. అసలు పేరు కంటే తిరునాళ్ల గ్రామంగానే ప్రసిద్ధి చెందిన మోర్జంపాడులో వెలసిన ఆ భక్తవత్సలుడు స్మరించినంతనే మనోభీష్టాలను నెరవేరుస్తాడన్నది భక్తుల విశ్వాసం.
లోకకళ్యాణం కోసం ఆ శ్రీమహావిష్ణువు ఎత్తిన దశావతారాల్లో ఉగ్రనారసింహుని అవతారం అత్యంత శ్రేష్ఠమైనది. పరమ భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడటం కోసం స్వామి ఉగ్రస్వరూపుడై స్తంభంలోంచి ఆవిర్భవించి, హిరణ్యకశ్యపుని సంహరిస్తాడు. అనంతరం ఆ భక్తుని ప్రార్థనతో శాంతించిన దేవదేవుడు లక్ష్మీనరసింహుడిగా, నమ్మిన భక్తులపాలిట కొంగుబంగారంగా భాసిల్లుతున్నాడు.
ఆ స్వామి కొలువైన క్షేత్రాల్లో మోర్జంపాడు ఒకటి. తిరునాళ్ల గ్రామంగా ప్రసిద్ధిచెందిన ఆ ఊరు గుంటూరు జిల్లా మాచవరం మండలంలో ఉంది. ఇక్కడ నెలవైన శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏటా మాఘమాసంలో (ఈ ఏడాది జనవరి 25న స్వామి సేవ, 26న కళ్యాణం) నిర్వహించే తిరునాళ్లకు ఈ ఊరు నెల రోజుల ముందు నుంచీ ముస్తాబైపోతుంది. తిరునాళ్ల సమయంలో పరిసర గ్రామాలనుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. నరసింహస్వామి కళ్యాణాన్ని చూసి పరవశిస్తారు. ఇక్కడ కొలువైన ఆ లక్ష్మీపతి ఆర్తితో కొలిచిన వారి కోర్కెలు తప్పక తీరుస్తాడని ప్రతీతి. అందుకే సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు కూడా ఇక్కడికి తరలివచ్చి స్వామికి మొక్కుబడులు చెల్లిస్తారు. తిరునాళ్లను నిర్వహించే ఆ రెండు రోజులూ ఈ గ్రామంలోని ప్రతి ఇల్లూ ఉత్సవశోభను సంతరించుకుంటుంది.
మొదట రాతిపలకే...
రెండు రోజులపాటు నిర్వహించే ఈ తిరునాళ్లకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. మోర్జంపాడుకు సమీపంలోని తుమ్మలచెరువులో 400 ఏళ్ల కిందట ధన్‌జీ నాయక్, ఆయన భార్య లక్ష్మీదేవి నివసించేవారు. వాళ్లకు పెళ్లయ్యి ఏళ్లు గడుస్తున్నా సంతానం కలగలేదు. పిల్లలకోసం ఆ దంపతులు మొక్కని మొక్కూ, చేయని పూజా లేదు. ఒకరోజు ధన్‌జీ నాయక్‌కి సాక్షాత్తూ ఆ లక్ష్మీనరసింహ స్వామే కలలో దర్శనమిచ్చి, గ్రామానికి వచ్చే మార్గంలో తాను యంత్రం రూపంలో ఉన్నాననీ, దాన్ని తీసుకొచ్చి పూజలు చేయమనీ ఆజ్ఞాపించాడట. మెలకువ వచ్చిన అనంతరం ఆ స్వప్న వృత్తాంతాన్ని భార్యకూ ఊరివారికీ చెప్పగా, అందరూ కలసి ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడ వారికో మూట కనిపించింది. విప్పి చూస్తే అందులో రాతి యంత్రం ఉంది. భద్రంగా దాన్ని ఇంటికి తీసుకెళ్లి పూజలు చేయడం మొదలుపెట్టారు. ఇది జరిగిన కొద్దిరోజుల్లోనే వీరికి సంతానం సిద్ధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏటా మాఘమాసంలో ఆ నరసింహస్వామికి రెండురోజులపాటు ఉత్సవాలను నిర్వహించడం ఆచారంగా వస్తోంది. అంతేకాదు, తరతరాలుగా ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులే స్వామికి నిత్యకైంకర్యాలు నిర్వహిస్తున్నారు. ఆ స్వామిని ఆర్తితో పిలిస్తే పలకడమే కాదు సంతానం లేనివారు ఈ క్షేత్రాన్ని దర్శిస్తే తప్పక సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల విశ్వాసం. దాంతో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. మొదట కేవలం యంత్రం మాత్రమే ఉండే ఈ ప్రదేశంలో తొంభయ్యో దశకంలో ఓ ఆలయాన్ని నిర్మించి, లక్ష్మీదేవి, నరసింహస్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ ఆలయ ప్రాంగణంలోనే ఆంజనేయస్వామి ఆలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రతి శనివారం సందడి వాతావరణం నెలకొంటుంది. ఆ రోజు ఉదయం నుంచే భజనలూ, ప్రత్యేక పూజలూ ప్రారంభమవుతాయి. శనివారం నిర్వహించే స్వామివారి కళ్యాణం విశేషమైనదని భక్తుల విశ్వాసం.
రాష్ట్రస్థాయి పోటీలు
ఈ తిరునాళ్లకు మరో విశేషం కూడా ఉంది. అవే రాష్ట్ర స్థాయిలో జరిగే ఎడ్ల పందాలు. ఇందులో పాల్గొనడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచీ పెద్దసంఖ్యలో ఎద్దులను ముస్తాబు చేసి, ఇక్కడికి తీసుకువస్తారు. వీటిలో గెలవడానికి ఎద్దులకు ప్రత్యేక తర్ఫీదు ఇస్తారు. ఈ పోటీల్లో పాల్గొనడానికే కాకుండా చూడటానికి కూడా భారీగానే జనం హాజరవుతారు.
ఇలా చేరుకోవచ్చు
ఈ ఆలయాన్ని చేరుకోవడానికి రైలు, రోడ్డుమార్గాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్లేదారిలో పిడుగురాళ్ల వద్ద దిగి అక్కడి నుంచి ఆటో, బస్సు ద్వారా ఇక్కడికి వెళ్లవచ్చు. విజయవాడ నుంచి పిడుగురాళ్ల, మాచర్ల బస్సు ఎక్కి పిడుగురాళ్లలో దిగి వెళ్లవచ్చు. రైలు మార్గమైతే పిడుగురాళ్ల స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా
ఆలయానికి చేరుకోవచ్చు. - డి.నాగేష్‌బాబు, ఈనాడు, గుంటూరు
సరస్వతి నమస్తుభ్యం_SaraswatiLeaf
సరస్వతీ దేవితోపాటు సరస్వతీ ఆకు కూడా పూజనీయమే. ఆ ఆకుకు అంతటి విలువ ఉంది మరి. సరస్వతీ ఆకు అనగానే అది ఔషధ మొక్క అనే విషయం మనలో చాలామందికి గుర్తొస్తుంది. కానీ దాన్ని చక్కని అలంకరణ మొక్కగా కూడా పెంచుకోవచ్చు.
సరస్వతీ ఆకును ‘సెంటెల్లా’, ‘గోటుకోలా’, ‘ఫౌంటేన్ ఆఫ్ యూత్’ అని రకరకాలుగా పిలుస్తారు. సంస్కృతంలో దీన్ని మండూక పర్ణి అంటారు. దీని శాస్త్రీయ నామం ‘సెంటెల్లా ఏషియాటికా’. ఇది మన ఆసియా ఖండానికి చెందిన మొక్క.
సరస్వతీ ఆకు తడినేలలో పెరిగే బహువార్షికం. నేలమీద పాకే కాండంతో, ప్రతి కణుపు వద్దా వేర్లతో అల్లుకుపోతుంది. ఈ మొక్క తేమగా ఉండే నేలలో, చల్లని వాతావరణంలో చక్కగా పెరుగుతుంది. ఇది చిన్నగా ఆరు అంగుళాలు మించని ఎత్తులో నేలమీద నుంచి మొదలై విసనకర్ర ఆకారపు ఆకులతో ఉంటుంది. ఈ ఆకులు లేతాకుపచ్చ రంగులో ఉంటాయి. ఎండ కంటే కొద్దిపాటి నీడ సరస్వతీ ఆకుకు అనువుగా ఉంటుంది. నీడ ఎక్కువైనా దీనికి పెద్ద ఇబ్బంది ఉండదు. ఇంట్లో పెంచుకునేటప్పుడు అంత తేమ నేలలు ఉండవు కాబట్టి క్రమం తప్పకుండా నీళ్లు పోస్తుంటే సరిపోతుంది. దీనికి నేల సారవంతంగా, నీరు నిలవకుండా తేమగా ఉండాలి కాబట్టి కంపోస్టు, కోకోపీట్, ఇసుక కలిపిన మట్టి మిశ్రమం అనువుగా ఉంటుంది. దీనికి చీడపీడల ప్రమాదం దాదాపు లేనట్లే. రసాయన ఎరువులు కాకుండా జీవామృతం లేదా ఇతర సేంద్రియ ఎరువులు వాడటం మంచిది.
వెడల్పు కుండీల్లో... సరస్వతీ ఆకు చక్కని గ్రౌండ్ కవర్‌లా పనిచేస్తుంది. ఇది వేలాడే కుండీల్లో/చెట్ల కింద నీడలో పెంచుకోవడానికి అనువుగా ఉంటుంది. లోతు తక్కువగా, వెడల్పుగా ఉండే కుండీల్లో పెంచుకుని వరండాల్లోనూ, బాల్కనీల్లోనూ అమర్చుకోవచ్చు. మిశ్రమ అమరికల్లో గ్రౌండ్ కవర్‌గా వాడుకోవచ్చు. బాట పక్కన బోర్డరు మొక్కల మొదట్లో కూడా నాటుకోవచ్చు.
ఆయుర్వేదంలో దశాబ్దాలుగా దీన్ని మెదడుకు సంబంధించిన మందుగా వాడుతున్నారు. జ్ఞాపకశక్తి, తెలివి పెరగడానికి విరివిగా ఉపయోగిస్తారు. జలుబూ, జ్వరం, విరేచనాలూ, కామెర్లు.. మూర్ఛ, మూత్రకోశ వ్యాధులు, నిద్రలేమీ- ఒకటేమిటి దీన్ని సర్వరోగనివారిణిగా నమ్ముతారు. ఇప్పుడిప్పుడే ప్రపంచ వ్యాప్తంగా దీని ఔషధ విలువలకు ప్రాచుర్యం లభిస్తోంది.
పోషకాలూ ఎక్కువే... సరస్వతీ ఆకులో పోషక విలువలు కూడా ఎక్కువే. దీనిలో అనేక విటమిన్లూ, ఖనిజ లవణాలూ, శరీరానికి ఉపయోగపడే రసాయనాలు ఉంటాయి. దీన్ని సలాడ్‌గా కూడా వాడతారు. బర్మా, శ్రీలంకా, ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాల్లో దీని వాడకం ఎక్కువ. శ్రీలంకలోనైతే దీని ఆకులను ఇతర ఆకుకూరలతోపాటు మార్కెట్లో అమ్ముతుంటారు.
అతిగా వద్దు... సరస్వతీ ఆకుకు ఇన్ని సుగుణాలున్నా దీన్ని అదేపనిగా వాడకూడదు. ఆరువారాలు వాడిన తరువాత కొంత విరామం ఇచ్చి తిరిగి వాడుకోవచ్చు. అలాగే కాలేయ సంబంధ వ్యాధులున్నవారు వైద్యుల సలహా మేరకు ఈ ఆకులను వాడటం మంచిదట. కణుపు మొక్కలను విడదీసి నాటుకుని సరస్వతీ ఆకును సులువుగా ప్రవర్థనం చేయొచ్చు. అయితే కలుషితమైన నీటిలో పెరిగినప్పుడు ఆ కాలుష్య కారక రసాయనాలను గ్రహించుకునే శక్తి దీనికి ఎక్కువ. అందువల్ల అలాంటి ప్రాంతాల నుంచి మొక్కలను సేకరించుకోవద్దు. అందం, ఆరోగ్యం, పోషకాలు మూడూ విరివిగా ఉండే సరస్వతీ ఆకును మీ తోటలో భాగస్వామిని చేసేందుకు ఇంకా ఆలస్యం ఎందుకు?
Subscribe to:
Posts (Atom)