అంతర్జాతీయ మహిళా దినోత్సవం,
International Women's Day
గత చరిత్ర ను , మన పూర్వీకుల అనుభవాలను నెమరువేసుకుంటూ ఆనందం గా జీవితం గడపడానికే ఉత్సవాలు చేస్తూ ఉంటాము . సమాజానికి ఒక నిర్ధేశిత సందేశము ఇవ్వడానికి దినోత్సవాలు చేస్తూఉంటాం . సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం పండుగలు చేస్తాము . ఏది చేసినా ఎక్కడ చేసినా ప్రపంచ మానవాలి శ్రేయస్సు కోసమే నిర్ధేశించబడుతుంది .పుట్టిన రోజు, పెళ్లి రోజు, అమ్మల రోజు, నాన్నల రోజు మరియు ప్రేమికుల రోజు. ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వారి గురించి అలోచించి, వాళ్ళను కొనియాడి, మన బాధ్యతను గుర్తు చేసుకొంటాము. మరి ఈరోజు (Mar.08) -అంతర్జాతీయ మహిళా దినోత్సవం- గురించి అలోచించి మన బాధ్యతలేమిటో తెలుసుకుందాము.
మార్చి 8 ఒక చారిత్రాత్మక ప్రాధాన్యత గల రోజు. పదిగంటల పనిదినాలకోసం, పురుషులతో సమానమైన వేతనాలకోసం పశ్చిమ పెన్సిల్వేనియాలోని ఒక బట్టల మిల్లులో సమ్మె ప్రారంభమైంది. ఇందులో 5000 మంది పాల్గొన్నారు. ఇతర ప్రాంతాలకూ విస్తరించింది. చివరకు 1857 మార్చి 8వ తేదీన ఈ సమ్మె విజయవంతమైంది. అందుకే ఆరోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇంతటి ప్రాధాన్యతల గల 8వ తేదీ ముంగిట్లో... మార్కెట్ యుగంలో మహిళ స్థితిగతులను పరిశీలిద్దాం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిదవ తేదీన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. దేశం, జాతి, భాష, రాజ్యం, సాంస్కతిక భేదభావాలకు తావు లేకుండా మహిళలందరూ ఒకచోట చేరి ఉత్సవాన్ని ఘనంగా చేసుకుంటారు. చరిత్రను అనుసరించి సాధికారత సాధన దిశగా మహిళలు పోరాటానికి అంకురార్పణ చేశారు. ప్రాచీన గ్రీకు రాజ్యంలో లీసిస్టాటా పేరు గల మహిళ ఫ్రెంచి విప్లవం ద్వారా యుద్ధానికి ముగింపు చెప్పాలని విజ్ఞప్తి చేస్తూ ఆందోళనకు శ్రీకారం చుట్టింది. పార్శీ మహిళలతో కూడిన సమూహం ఒకటి ఇదే రోజు వెర్సెల్స్‌లో ఒక ఊరేగింపును నిర్వహించింది.
యుద్ధం కారణంగా మహిళలపై రోజురోజుకు పెరిగిపోతున్న అత్యాచారాలను నిరోధించాలని డిమాండ్ చేస్తూ వారు ఊరేగింపు జరిపారు. 1909 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అమెరికాలో మహిళా దినోత్సవం జరిగింది. 1910 సంవత్సరంలో కొపెన్‌హెగన్‌లో సోషలిస్ట్ ఇంటర్నేషనల్ ద్వారా మహిళా దినోత్సవం ఆవిర్భవించింది. 1911 సంవత్సరంలో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ మరియు స్విట్జర్లాండ్ దేశాల్లో లక్షలాదిగా మహిళలు ర్యాలీలో పాల్గొన్నారు.
మతాధికారం, ప్రభుత్వ ఉద్యోగాల్లో తగు ప్రాధాన్యత, కార్యక్షేత్రంలో వివక్ష నిర్మూలన తదితర డిమాండ్ల సాధనకు మహిళలు ఈ ర్యాలీలో పాలు పంచుకున్నారు. 1913-14 మధ్య కాలంలో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో శాంతిని స్థాపించాలని కోరుతూ ఫిబ్రవరి మాసాపు చివరి ఆదివారం నాడు రష్యా దేశపు మహిళలు మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు.
ఐరోపా అంతటా యుద్ధ వ్యతిరేక ఆందోళన కార్యక్రమాలు చోటు చేసుకున్నాయి. 1917 సంవత్సరం వరకు జరిగిన ప్రపంచ యుద్ధంలో రష్యాకు చెందిన రెండు లక్షలకు పైగా సైనికులు మరణించారు. ఆహారం మరియు శాంతిని కోరుతూ ఇదే రోజున రష్యా మహిళలు హర్తాళ్ కార్యక్రమం చేపట్టారు. తమ ఉద్యమాలు, పోరాటాలతో రష్యా మహిళలు ఓటు హక్కును సాధించుకున్నారు. మహిళలు సాధించిన విజయాలకు చిహ్నంగా సాధికారతను పొందే క్రమంలో ప్రతి యేటా మార్చి ఎనిమిదవతేదీన విశ్వవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
మహిళా సంరక్షణలో భారతీయ చట్టాలు
స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు, వారి హక్కులను పరిరక్షించేందుకు గడచిన దశాబ్ద కాలంగా భారీ సంఖ్యలో చట్టాలు రూపుదిద్దుకున్నాయి. అయితే ఈ చట్టాలు సక్రమంగా అమలుకు నోచుకుని ఉన్నట్లయితే భారత దేశంలో మహిళల పట్ల వివక్ష మరియు అత్యాచారాలు ఈ సరికే ముగిసిపోయి ఉండేవి. కానీ పురుషాధ్యికత విశృంఖలమైన పరిస్థితులు ఈ అద్భుతం ఆవిష్కరణకు అడ్డుపడ్డాయి. అయితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత మేరకు ఈ చట్టాలు అమలుకు నోచుకుంటున్నాయి. భారతదేశంలో స్త్రీలను కాచుకోవడంలో చట్టాలను మించినవి మరేవీ కానరావు. భారతీయ సంవిధానంలోని ప్రతి అంశం కూడా మహిళలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ రూపుదిద్దుకుంది. ఈ విషయమై మహిళలు సంపూర్ణమైన అవగాహనను కలిగి ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది.
సంవిధానంలోని 14వ అధ్యాయం ద్వారా సమన్యాయం, అధ్యాయం 15 (3) లో జాతి, ధర్మం, లింగం మరియు జన్మస్థానం తదితరాలను అనుసరించి భేదభావం చూపరాదు. అధ్యాయం 16 (1) ని అనుసరించి లోక సేవలో బేధభావం లేకుండా సమానత్వం, అధ్యాయం 19 (1) లో సమాన రూపంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, స్త్రీ మరియు పురుషులను ప్రాణ, దేహపరమైన స్వాధీనం చేసుకోవడంతో వంచించిరాదని అధ్యాయం 21 తెలుపుతుంది. అధ్యాయాలు 23-24 లలో శోషణకు విరుద్ధంగా సమాన రూపంలో అధికార ప్రాప్తి, అధ్యాయాలు 25-28 లలో స్త్రీపురుషులివురికి సమాన రూపంలో ధార్మిక స్వతంత్రత ప్రాప్తి, అధ్యాయాలు 29-30 ల ద్వారా విద్య మరియు సాంస్కృతిక అధికారం సంప్రాప్తించింది.
అధ్యాయం 32లో సంవిధానపు సేవలపై అధికారం, అధ్యాయం 39 (ఘ) ను అనుసరించి స్త్రీలు పురుషులు చేసే సమానమైన పనికి సమవేతనాన్ని పొందే హక్కు, అధ్యాయం 40లో పంచాయతీ రాజ్ వ్యవస్థ 73 మరియు 74 అధికరణాలను అనుసరించి ఆరక్షణ యొక్క వ్యవస్థ, అధ్యాయం 41 ద్వారా పని లేమి, వృద్ధాప్యం, అనారోగ్యం తదితర అసహాయ స్థితిలో సహాయాన్ని పొందే అధికారం, అధ్యాయం 42లో మహిళా శిశు సంక్షేమ ప్రాప్తి, అధ్యాయం 33 (క) లో పొందుపరిచిన 84వ అధికరణ ద్వారా లోక్‌సభలో మహిళలకు తగు ప్రాధాన్యత, అధ్యాయం 332 (క) లోని 84వ అధికరణాన్ని అనుసరించి రాష్ట్రాల్లోని శాసనసభల్లో మహిళలకు తగు ప్రాధాన్యత సంప్రాప్తించాయి.
చట్టం ఇలా అంటోంది-
* కార్యక్షేత్రంలో స్త్రీపురుషులకు సమానమైన వేతనాన్ని ఇవ్వాలి.
* మహిళా ఉద్యోగుల కోసం ప్రత్యేక మరుగుదొడ్లు మరియు స్నానాల గదులు ఏర్పాటు చేయాలి.
* ఏ మహిళను కూడా దాస్యభావంతో చూడరాదు.
* బలాత్కారం నుంచి బయటపడేందుకు అవసరమైతే సదరు పురుషుని హత్య చేసే అధికారం మహిళకు ఉంది.
* వివాహితురాలైన హిందూ మహిళకు తన ధనంపై సర్వాధికారాలు ఉంటాయి. తన ధనాన్ని ఏ విధంగానైనా ఖర్చు పెట్టుకునే అధికారం ఆమెకు ఉంటుంది.
* వరకట్నం తీసుకోవడం లేదా ఇవ్వడం చట్టవిరుద్ధం.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565