MohanPublications Print Books Online store clik Here Devullu.com

నిల్చొని నీళ్లు తాగడం వల్ల _Is It Bad To Drink Water While Standing?





హెచ్చరిక :
నిల్చొని నీళ్లు తాగడం వల్ల
శరీరంలో జరిగే డేంజరెస్ ఎఫెక్ట్స్..!

దాహమేస్తే నీళ్లను తాగేయడం వరకే మనకు తెలుసు. అది కూర్చుని తాగుతున్నామా? నిల్చుని తాగుతున్నామా? అనేది తర్వాతి విషయం. కానీ నీళ్లు తాగేటప్పుడు కూడా కొన్ని నియమాలను పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నార

దాహమేస్తే నీళ్లను తాగేయడం వరకే మనకు తెలుసు. అది కూర్చుని తాగుతున్నామా? నిల్చుని తాగుతున్నామా? అనేది తర్వాతి విషయం. కానీ నీళ్లు తాగేటప్పుడు కూడా కొన్ని నియమాలను పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయాన్నేఖాళీ పొట్టతో నీరుత్రాగితే పొందే గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్ పరిగెత్తుతూ పాలు తాగేకన్నా నిల్చుని నీళ్లు తాగడం మంచిది అనే సామెత మనం వినే ఉంటాం. కానీ నీళ్లు నిల్చుని తాగడం అనేది హానికరం మీరు చదివింది నిజమే. నిల్చుని నీల్లు తాగడం వల్ల అనేక దుష్పరిమాణాలున్నాయి. నీళ్లు మన శరీరానికి మంచివి అయితే అవి నిల్చుని తాగితే ఏంటి? కూర్చుని తాగితే ఏంటి అంటారా?? మనలో చాలామంది ఆదరా బాదరా గుటుక్కున ఒక్క సిప్ లో నీళ్లు తాగేస్తారు.అలా తాగడం మంచిది కాదని కూర్చుని మెల్లిగా సిప్ చేస్తూ వాటర్ తాగితే ఆరోగ్యప్రయోజనాలున్నాయని నిపుణులు చెప్తున్నారు. ప్రతిరోజు 8గ్లాసుల నీరు తాగడం మంచిది అని తెలిసిన మనకు అవి ఏవిధంగా తీసుకోవాలి అనేది తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఆ ఆరోగ్య ప్రయోజనాలేంటో, నిల్చొని నీళ్ళు తాగడం వల్ల కలిగే దుష్ప్రభావాలేంటో ఒకసారి తెలుసుకుందాం...

రోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లైనా తాగాలి. రోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లైనా తాగాలి. నీటిని తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగవుతుంది. అయితే నీటిని ఎంత తాగినా, ఎప్పుడు తాగినా నిల‌బ‌డి మాత్రం తాగ‌కూడ‌ద‌ట‌.

క‌చ్చితంగా కూర్చునే నీటిని తాగాల‌ట‌.
క‌చ్చితంగా కూర్చునే నీటిని తాగాల‌ట‌. ఎందుకంటే..? నిలబడి ఉన్నప్పుడు నీటిని సేవిస్తే నీరు ఆహార నాళం గుండా జీర్ణాశయంలోకి ఒక్కసారిగా వచ్చి పడుతుంది. తద్వారా జీర్ణాశయం గోడలపై నీరు ఒకేసారి చిమ్మినట్లవుతుంది. దీంతో అత్యంత సున్నితంగా ఉండే జీర్ణాశ‌యం గోడ‌లు దెబ్బ తింటాయి. జీర్ణాశయ గోడలు దెబ్బతింటే.. అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.

నిలబడి నీరు తాగితే కిడ్నీలకు ఆ నీరు అందదని..
ఇక నిలబడి ఉన్నప్పుడు కానీ నీరు తాగితే కిడ్నీలకు ఆ నీరు అందదని.. తద్వారా కిడ్నీ, మూత్రాశయ సంబంధ వ్యాధులు ఏర్పడే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

కూర్చున్నప్పుడు శరీరం విశ్రాంతి తీసుకుంటుంది.
కానీ కూర్చున్నప్పుడు శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. ఆ స్థితిలో నీరు తాగితే.. మనం తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అంతేకాదు జీర్ణాశ‌యంలోకి అధికంగా ఉత్ప‌త్తి అయ్యే ఆమ్లాల ప్ర‌భావం త‌గ్గుతుంది.

నిలబడి నీరు తాగితే ద్రవాల సమతుల్యత దెబ్బతినడంతో
అదే నిలబడి నీరు తాగితే ద్రవాల సమతుల్యత దెబ్బతినడంతో ఎక్కువ ద్రవాలు కీళ్లలో చేరిపోయి ఆర్థ‌రైటిస్(కీళ్లనొప్పులు) వంటి స‌మ‌స్య‌లకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
మూత్రాశయ సంభందిత సమస్యలకు వడకట్టని వాటర్ తాగడం వలన మూత్రాశయ సంభందిత సమస్యలకు మనమే కారణమయినవాళ్లమవుతాం.కావున నీటిని వడకట్టి తాగడం మంచిది.

జీర్ణాశయ గోడలనుండి రిలీజ్ అయ్యే ఆమ్లాల వల్ల
మనకు కడుపులో మంటగా ఉంటుంది.
కూర్చుని వాటర్ తాగితే GERD (గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి) రాకుండా ఉంటుంది.నిల్చుని వాటర్ తాగడం వల్ల మనం తీసుకున్నవాటర్ డైరెక్ట్ గా జీర్ణాశయ కింది బాగానికి చేరుకుంటుంది.జీర్ణాశయ గోడలనుండి రిలీజ్ అయ్యే ఆమ్లాల వల్ల మనకు కడుపులో మంటగా ఉంటుంది.
నాడీవ్యవస్ధ మెరుగు పడడమే కాదు... కూర్చుని వాటర్ తాగడం వల్ల నాడీవ్యవస్ధ మెరుగు పడడమే కాదు.శరీర కండరాలు చురుగ్గా పని చేస్తాయి.నిలబడి నీళ్లు తాగడం వల్ల అజీర్ణానికి దారి తీస్తుంది.



నీటిని ఒకేసారి కాకుండా మెల్లి మెల్లిగా సిప్ చేయాలి నీటిని ఒకేసారి కాకుండా మెల్లి మెల్లిగా సిప్ చేయాలని మనకు ఆయుర్వేదం లో కూడా చెప్తారు. నీటిని తాగడం వల్ల మన దాహం కూడా పూర్తిగా తీరదు నిల్చుని నీటిని తాగడం వల్ల మన దాహం కూడా పూర్తిగా తీరదు.దానికి తోడు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list