MohanPublications Print Books Online store clik Here Devullu.com

ప్రపంచ పర్యావరణ దినోత్సవం | World Environment Day | Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu

ప్రపంచ పర్యావరణ దినోత్సవం | World Environment Day | Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu Environment Pollution Nature World Environment Day June 5 Don't Use Plastic Plastic waste high using of Plastic Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI


ప్రపంచ పర్యావరణ దినోత్సవం
జూన్‌ 5

ప్లాస్టిక్‌... పుట్టి వందేళ్లయిందేమో, అంతే... ఏ తపస్సూ చేయకుండానే వెయ్యేళ్ల ఆయుష్షును వెంటతెచ్చుకుంది. మన కోసం మనమే తయారుచేసుకున్న ఈ పదార్థం ఇప్పుడు భస్మాసురహస్తమై మన కొంపే ముంచుతోంది. గాల్లో, నీళ్లలో, ఇంట్లో, చేతిలో... సర్వాంతర్యామిలా ఎక్కడ చూసినా అదే. ఆఖరికి ఇప్పుడు మన ఒంట్లోకీ చేరుతోంది. మొత్తంగా ప్రాణికోటినే అమాంతం మింగేయడానికి సిద్ధమవుతున్న ఈ ప్లాస్టిక్‌ భూతాన్ని వదిలించుకోడానికి ప్రతి మనిషీ ఓ మాంత్రికుడు కావాలి. అది ‘అబ్రకదబ్ర’ అన్నంత తేలిక కాదు కానీ, తప్పదు.

కూరగాయలు కొంటే క్యారీబ్యాగ్‌. పండ్లు కొంటే క్యారీబ్యాగ్‌. బట్టలు కొన్నా క్యారీబ్యాగే.
గుడికెళ్తే దేవుడికి కొబ్బరికాయా పూలదండా ప్లాస్టిక్‌ క్యారీబ్యాగ్‌లోనే.
హోటల్‌ నుంచి క్యారేజీ తెచ్చుకుంటే- వేడి వేడి బిర్యానీనే కాదు, కూరలూ సాంబారూ రసమూ... అన్నీ ప్లాస్టిక్‌ సంచుల్లోనే.
సాయంత్రం వేళ మిర్చీలు, పానీపూరీ, ఆకుకూరలు, పువ్వులు... ఎక్కడ ఏవి కొన్నా వాటిని ఇచ్చేది ప్లాస్టిక్‌ సంచుల్లోనే.
పిల్లలకీ పెద్దలకీ అందరికీ టిఫిన్‌ బాక్సులూ నీళ్ల సీసాలూ ప్లాస్టిక్‌వే.
ఇంట్లో ఫర్నిచర్‌... ప్లాస్టిక్‌ కుర్చీలు. వంటింట్లో ఉప్పూ పప్పులూ పోసుకోవడానికీ ప్లాస్టిక్‌ డబ్బాలు!
మంచినీళ్ల బాటిళ్లూ, టీకప్పులూ, కూల్‌డ్రింక్‌ సీసాలూ, స్ట్రాలూ, ... అన్నీ ప్లాస్టిక్‌వే. కడిగే పని ఉండదు. ఎంచక్కా తాగేసి పక్కన పడేయొచ్చు! అలా అనుకునే ఎవరికి వారు వాడి పారేస్తున్నారు!
ఇప్పుడదే ప్లాస్టిక్‌- మనల్ని వాడి పారేయడానికి సిద్ధంగా ఉంది.
నిజం... సరుకులు తెచ్చుకోవడానికి చిన్న కవరుగా ఊపిరిపోసుకున్న ప్లాస్టిక్‌ ‘ఇంతింతై వటుడింతై...’ అన్నట్లు ఇంటింటా నిండిపోయింది. చివరకు వాతావరణంలోనూ అణువణువునా విస్తరించింది. ఇప్పుడిక మనిషిని కబళించడానికి సిద్ధంగా ఉంది.
ఇప్పటివరకూ మనం రక్తంలో హిమోగ్లోబిన్‌ చాలినంత ఉందో లేదో తెలుసుకోడానికీ, షుగర్‌ ఎక్కువ తక్కువ కాకుండా చూసుకోడానికీ తరచూ రక్త పరీక్షలు చేయించుకుంటున్నాం. ఇక ముందు రక్తంలో ప్లాస్టిక్‌ ఎంత ఉందో తెలుసుకోడానికీ పరీక్ష చేయించుకోవాల్సి వస్తుందేమో.తింటున్నాం... తాగుతున్నాం..!
ప్లాస్టిక్‌కి సంబంధించి ఇటీవల వెలువడిన పరిశోధన ఫలితాలు వెన్నులోంచి వణుకు తెప్పిస్తున్నాయి. అనునిత్యం మనం వాడుతున్న వస్తువుల ద్వారా ప్లాస్టిక్‌ నేరుగా మనిషి శరీరంలోకి చేరుతోందని రుజువులతో సహా చూపిస్తున్నాయి ఈ అధ్యయనాలు. మనం రోజూ సూక్ష్మ రూపంలో ప్లాస్టిక్‌ని తింటున్నాం, తాగుతున్నాం. ఎలా అంటారా... మనం వాడి చెత్తలో పడేసిన ప్లాస్టిక్‌ భూమి లోపలి పొరల్లోకి వెళ్తుంది. అక్కడది సూక్ష్మరేణువులుగా విడిపోయే క్రమంలో మొక్కలు దాన్ని పీల్చుకుంటాయి. ఆ భూమి మీద పండిన పంటలూ కూరగాయలూ పండ్ల ద్వారా కొంత ప్లాస్టిక్‌ మన శరీరంలోకి చేరుతుంది. పడేసిన ప్లాస్టిక్‌ చెత్తంతా ఎండకు ఎండీ వానకు తడిసీ రకరకాల మార్గాల్లో కొట్టుకెళ్లి నదుల్లో, సముద్రాల్లో చేరుతోంది. నీటి అడుగున అలా చేరిన చెత్తనుంచీ కంటికి కనపడనంత చిన్న చిన్న రేణువులు వెలువడతాయి. వాటిలోని పాలీస్టిరీన్‌ అనే అత్యంత సూక్ష్మమైన పదార్థాలను జలచరాలు ఆహారంగా పొరబడి తినేస్తున్నాయి. ఆ జలచరాలను మనం ఆహారంలో తీసుకుంటే ఆ పదార్థాలు నేరుగా మనలోకీ చేరుతున్నాయి. మరోపక్క నీటి సీసాలూ, ప్యాకెట్లలో విక్రయించే ఆహారపదార్థాలూ కూడా తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. వాటిల్లో మనిషి ఆరోగ్యానికి తీవ్రంగా హానిచేసే బీపీఏ అనే విషపదార్థాలుంటున్నాయి. మనలాంటి వేడి దేశంలో ప్లాస్టిక్‌ సీసాలోని నీళ్లలోకి ప్లాస్టిక్‌ అవక్షేపాలు చేరడానికి పదిహేను నిమిషాలు చాలట. మనమేమో రోజుల తరబడి సీసాల్లో నిల్వ చేసిన నీళ్లను తాగుతుంటాం. ఆహారపదార్థాలన్నీ ప్లాస్టిక్‌ క్యారీబ్యాగుల్లో ప్యాక్‌ చేస్తుంటాం. కొన్ని రకాల చూయింగ్‌గమ్‌లలోనూ ప్లాస్టిక్‌ ఉన్నట్లు పరిశోధనలు వెల్లడించాయి. ఈ లెక్కన మనం ఎంత ప్లాస్టిక్‌ తింటున్నట్లు?అవి మరీ ప్రమాదకరం
ఆ మధ్య దిల్లీలో ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రికి వెళ్లాడు. అతడి లక్షణాలను బట్టి చికిత్స చేసినా తగ్గలేదు. ఎన్ని పరీక్షలు చేసినా అసలా అనారోగ్యానికి కారణాలే తెలియలేదు. చివరికి కడుపులో క్యాన్సర్‌ అని నిర్ధారించి చికిత్స మొదలెట్టేసరికే చాలా ఆలస్యం అయిపోయింది. కానీ ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఓ వైద్యుడు అతడికి ఆ జబ్బు రావడానికి కారణమేమై ఉంటుందా అని అధ్యయనం మొదలెట్టాడు. కుటుంబసభ్యుల అనుమతితో రకరకాల పరీక్షలు చేస్తే అతడి రక్తంలో బిస్ఫెనాల్‌ అనే రసాయనం కన్పించింది. ప్లాస్టిక్‌ పాత్రల్లో వేడి వేడి ఆహారపదార్థాలను ఉంచినప్పుడు ఆ వేడికి ప్లాస్టిక్‌ నుంచి అలాంటి రసాయనాలు ఉత్పన్నమై ఆహారంలో కలుస్తాయట. మనం రోజూ చేస్తున్నది అదేనాయె!
ప్లాస్టిక్‌ని ఎలా వాడాలో తెలుసుకోకపోవడం వల్లా, తెలిసినా పట్టించుకోకపోవడం వల్లా, ప్లాస్టిక్‌ వ్యర్థాలను సరిగా నిర్వహించకపోవడం వల్లా అవి ఇప్పుడు గాలినీ నీటినీ మొత్తంగా పర్యావరణాన్నీ కలుషితం చేయడమే కాక, నేరుగా మన శరీరంలోకీ చేరుతున్నాయి. అతి పల్చని క్యారీ బ్యాగ్‌నుంచీ గట్టిగా ఉండే కుర్చీలూ బల్లల వరకూ అన్నిటి తయారీలోనూ ఉపయోగించేది మౌలికంగా ప్లాస్టిక్కే. మళ్లీ మళ్లీ వాడుకోవడానికి పనికొచ్చేవాటికన్నా ఒకసారి వాడి పారేసేవి మరింత ప్రమాదకరమైనవి. మనం వాడుతున్న ప్లాస్టిక్‌లో సగం అలా ఒకసారి వాడిపారేసేవే. నీళ్ల సీసాలూ క్యారీ బ్యాగులూ స్పూన్లూ స్ట్రాలూ కూల్‌డ్రింక్‌ సీసాలూ టూత్‌బ్రష్షులూ... ఇలాంటివన్నీ టన్నులకొద్దీ ప్లాస్టిక్‌ వ్యర్థాలుగా మారి చెత్తకుప్పల్లోకి చేరుతున్నాయి. బయటికి వెళ్లినవాళ్లు ఎవరైనా చేతిలో ఓ ప్లాస్టిక్‌ బ్యాగ్‌ లేకుండా ఇంట్లోకి వస్తారా? ఏ కిరాణాకొట్టుకో, పండ్ల దుకాణానికో, పిల్లలకోసం స్టేషనరీ షాపుకో వెళ్లకుండా ఇంటికి రారు. అక్కడ ఏం కొన్నా వాటితో పాటు ఒక క్యారీబ్యాగ్‌ ఉచితంగా వస్తుంది. వాటి వాడకాన్ని కాస్తన్నా తగ్గించాలని ఆ మధ్య ఎక్కడికక్కడ స్థానిక ప్రభుత్వాలు క్యారీ బ్యాగుల మీద నిషేధం విధించాయి. వాటికో రేటు కూడా పెట్టాయి. అయినా సరే, మనం మారలేదు. మూడు రూపాయలేగా, పర్వాలేదు చాలా పనులకు ఉపయోగపడుతుంది కదా- అనుకుంటున్నాం. ఆఫీసుకెళ్లేటప్పుడు ఓ బ్యాగు మడత పెట్టి హ్యాండ్‌బ్యాగులోనో బండి డిక్కీలోనో పెట్టుకుంటే మరోసారి దాంట్లో సరుకులు తెచ్చుకోవచ్చు, నాలుగు సార్లు వాడి పాడైపోయాక దాంట్లో చెత్త పారేయొచ్చు... ఇలా సాగుతుంది మన ఆలోచన. వాడి పారేయాల్సిన నీళ్ల సీసాల్ని కొందరైతే మళ్లీ మళ్లీ వాడుతుంటారు. ఇక క్యారీబ్యాగు సంగతి చెప్పనక్కరలేదు. తినుబండారాలకూ అదే. పిల్లల పుస్తకాల సంచీ అదే. వానొస్తే గొడుగూ అదే. అంటే మనం ఒకసారి వాడి పారేయాల్సిన వాటిని కూడా మళ్లీ మళ్లీ వాడుతున్నాం. అదెంత ప్రమాదకరమో అర్థం చేసుకోలేకపోతున్నాం.అడుగడుగునా గండమే!
మనం ఎంతో ఉపయోగపడుతున్నాయనుకునే ఈ క్యారీబ్యాగులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎన్నో అనర్థాలకు కారణమవుతున్నాయి. వాడేసిన ప్లాస్టిక్‌ వస్తువుల్ని మనం మన ఇంట్లో చెత్తబుట్టలో వేస్తాం. అక్కడినుంచీ మున్సిపాలిటీ చెత్తకుండీలోకి చేరతాయవి. మనం పాడైన ఆహార పదార్థాలను క్యారీబ్యాగుల్లో వేసి పడేస్తే వాటిని తినే ఆతృతలో పశువులు క్యారీబ్యాగుల్నీ మింగేసి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఆ దశ దాటి చెత్తకుండీలనుంచీ డంపింగ్‌యార్డులోకి చేరుతుంది ఆ చెత్త. అక్కడ చేరిన ప్లాస్టిక్‌ సంచులు గాలికి చెల్లాచెదురై ఎటెటో కొట్టుకుపోతాయి. పలు ప్రమాదాలకు కారణమవుతాయి. డ్రెయిన్స్‌కి అడ్డం పడి మురుగునీటి వ్యవస్థను పాడుచేస్తాయి. తగలబెడ్తే విషవాయువులు వెలువడి గాలిని కలుషితం చేస్తాయి. అయినా వాటి అవక్షేపాలు ఇంకా మిగిలే ఉంటాయి. అలాగని వదిలేస్తే భూమిపొరల్లోకి చేరి వాన నీరు భూమిలో ఇంకకుండా అడ్డుపడతాయి. ప్లాస్టిక్‌ బారిన పడి మరణించిన సముద్ర ప్రాణుల పొట్టల్లో పిల్లల చెవి శుభ్రం చేయడానికి వాడే దూది చుట్టిన ప్లాస్టిక్‌ పుల్లలు కన్పించాయట! ఎక్కడ మన ఇల్లు? ఎక్కడ సముద్రం? కాలువలూ నదులూ సముద్రాల ఒడ్డున చెత్తకుప్పలు పేరుకుపోవడం వల్ల చోటుచేసుకున్న పరిణామమిది. సముద్రాల్లో ప్లాస్టిక్‌ పదార్థాలను తిని ఏటా కొన్ని వేల ప్రాణులు మృత్యువాత పడుతున్నాయి.నిషేధం పనిచేసింది!
ప్లాస్టిక్‌ వల్ల జరుగుతున్న అనర్థాలు చూశాక చాలా దేశాల్లో దాని వాడకాన్ని తగ్గించే దిశగా చర్యలు ప్రారంభించారు. పదేళ్ల క్రితమే ప్లాస్టిక్‌ సంచులపై నిషేధం విధించి రువాండా ఆ పని చేసిన తొలి దేశమైంది. చాలా కఠినంగా నియమాలను అమలుచేసిన ఆ దేశం త్వరలోనే ప్రపంచంలోనే తొలి ప్లాస్టిక్‌ రహితదేశంగా అవతరించడానికి సన్నద్ధమవుతోంది. మనదేశంలోనూ సిక్కిం రాష్ట్రం ఇరవై ఏళ్ల క్రితమే క్యారీబ్యాగుల్నీ, రెండేళ్ల క్రితం నీళ్ల సీసాల్నీ, డిస్పోజబుల్‌ ప్లేట్లనీ విజయవంతంగా నిషేధించింది. సిక్కిం పర్వత ప్రాంతం. ఓసారి భారీ వర్షాలు పడ్డాయి. ప్లాస్టిక్‌ వ్యర్థాలు అడ్డుపడి డ్రెయిన్స్‌ మూసుకుపోయాయి. నీరు నిలిచిపోవడం వల్ల కొండ చరియ విరిగిపడింది. ఆ ప్రమాదంలో కొంత మంది చనిపోయారు. ఆ సంఘటనే సిక్కిం ప్రభుత్వాన్ని ప్లాస్టిక్‌ క్యారీబ్యాగుల్ని నిషేధించేలా చేసింది. అమెరికాలోని పలు రాష్ట్రాలు, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, చైనా, జింబాబ్వే, తైవాన్‌, కెనడా, ఫ్రాన్స్‌, ఐర్లండ్‌... ఇలా ఎన్నో దేశాలు ఇప్పటికే ఈ సంచుల వాడకంపై పెద్ద ఎత్తున పన్నులు విధించాయి. కొన్ని చోట్ల భారీ జరిమానాలు కూడా విధిస్తున్నారు. అలా వసూలుచేసిన డబ్బుని నదుల ప్రక్షాళనకు ఉపయోగిస్తున్నారు. దాంతో మంచి ఫలితమే కన్పించింది. తక్కువ మందంగల ప్లాస్టిక్‌ క్యారీబ్యాగుల వాడకం 70 నుంచి 85 శాతం తగ్గింది. ఆటోమేటిగ్గా చెత్తా తగ్గింది. ప్లాస్టిక్‌ని వాడేదీ దాని వల్ల కలిగే దుష్పరిణామాలను అనుభవించేదీ మనమే. కాబట్టి ప్రభుత్వాలు ఏమో చేయాలని ఎదురుచూడకుండా ఎవరికి వారు ఈ దిశగా చర్యలు చేపట్టడం ప్రతి ఒక్కరి తక్షణ కర్తవ్యం.ప్లాస్టిక్‌ వద్దే వద్దు!
మన ముందు ఇప్పుడు రెండే మార్గాలున్నాయి. అయితే ప్లాస్టిక్‌ని దూరం చేయడం, లేదంటే ఆరోగ్యాన్ని దూరం చేసుకోవడం. వినడానికి ఇబ్బందిగానే ఉన్నా సమస్య తీవ్రత అలా ఉంది మరి.
* మంచినీళ్ల కోసం వాడిపారేసే ప్లాస్టిక్‌ సీసాలకు ప్రత్యామ్నాయంగా స్టీలు సీసాలు వాడుకోవచ్చు. మళ్లీ మళ్లీ ఉపయోగించే ప్లాస్టిక్‌ సీసాలను కూడా- రీసైక్లింగ్‌ కోడ్‌ని పరిశీలించే కొనాలి. దాని గురించి తెలియని వాళ్లు అలాంటి వాటిని వాడకపోవడమే మంచిది.
* హోటళ్ల నుంచి క్యారియర్‌ తెచ్చుకోవాలనుకున్నప్పుడు టిఫిన్‌ క్యారియర్‌ పట్టుకెళ్లడం అలవాటు చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేడి పదార్థాల్ని ప్లాస్టిక్‌ కవర్లలో వేయనివ్వకూడదు. అలా వేసినవి తినకూడదు. కొన్ని ప్లాస్టిక్‌ పాత్రలు ‘మైక్రోవేవ్‌లోనూ వాడడానికి సురక్షితమైనవి’ అని అమ్ముతారు. అయినా సరే వాటిని వాడకూడదు. మైక్రోవేవ్‌లో వేడి అంతటా సమంగా వ్యాపించదు. ఒక్కోప్రాంతంలో ఎక్కువ వేడి ఉంటుంది. ఆ వేడి వల్ల ప్లాస్టిక్‌ నుంచి రసాయనాలు విడుదలవుతాయి. ఆహారపదార్థాల్లో కలుస్తాయి. ఒవెన్‌లో వీలైనంతవరకూ గాజు పాత్రల్ని ఉపయోగించడం మేలు.
* ప్లాస్టిక్‌ స్ట్రాల బదులు స్టీలు, వెదురు, గాజుతో చేసిన స్ట్రాలు వాడాలి.
* పిల్లల పుట్టినరోజు తదితర పార్టీల్లో కేకు తినడానికి ప్లాస్టిక్‌ స్పూన్ల బదులు వెదురు లేదా స్టీలు స్పూన్లు వాడాలి.
* టూత్‌బ్రష్‌ల తయారీలోనూ ప్లాస్టిక్‌ తగ్గించడానికి ఈ మధ్యే వెదురును వాడుతున్నారు. ఇవి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.
* కూరగాయలూ ఆహార పదార్థాలూ తీసుకెళ్లడానికి గుడ్డతో లేదా జనపనారతో కుట్టిన సంచీలు వాడుకోవాలి.
* తివాచీలూ, సోఫాకవర్లూ, కర్టెన్లూ లాంటివి తక్కువగా వాడాలి. వీటిల్లో ఎక్కువగా సింథటిక్‌ఫైబర్‌తో తయారుచేసినవే ఉంటాయి. వాటినుంచి ప్లాస్టిక్‌ కణాలు గాలిలో కలిసి శ్వాస ద్వారా మళ్లీ మనలోకే చేరతాయి.
* పిల్లలకు వాడే న్యాపీలూ, శానిటరీ న్యాప్‌కిన్లూ కూడా ప్లాస్టిక్‌తో తయారైనవే. వీటికి ప్రత్యామ్నాయంగా గుడ్డతో తయారైన న్యాప్‌కిన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.
* తెల్లారి లేస్తూనే పాలపాకెట్లతో మొదలుపెడితే రాత్రి పడుకునేవరకూ మనం వాడే ప్లాస్టిక్‌ వస్తువుల్ని జాబితా తయారుచేసుకోవాలి. వాటిల్లో వెంటనే మానెయ్యడానికి వీలయ్యే క్యారీబ్యాగుల్లాంటివాటికి ప్రత్యామ్నాయాలు వెదుక్కుని ముందుగా వాటిని వాడడం మానెయ్యాలి. ఆ తర్వాత నీళ్ల సీసాలు... అలా ఒక్కోటీ మానేస్తూ పోతే పెద్ద కష్టం లేకుండానే చాలావరకూ ప్లాస్టిక్‌ని మన జీవితాలనుంచి దూరంగా ఉంచవచ్చు.
ఉద్యమిస్తున్నారు...
ప్లాస్టిక్‌కి వ్యతిరేకంగా ఇప్పటికే ఎందరో ఉద్యమాలు చేస్తున్నారు. దారిలో కన్పించిన ప్లాస్టిక్‌ చెత్తనంతా ఏరిపారేస్తూ కొందరు ప్లాస్టిక్‌ బాబాల అవతారమెత్తితే, మరి కొందరు బీచ్‌లను శుభ్రంచేస్తూ టన్నులకొద్దీ ప్లాస్టిక్‌ చెత్త సముద్రాల్లో కలవకుండా చూస్తున్నారు. కొందరు గుడ్డతో కుట్టిన చేతిసంచులు వాడుతూ క్యారీబ్యాగులకు నో చెబుతున్నారు. అక్కడొకరూ ఇక్కడొకరూ కాదు, ప్రపంచ మానవాళి మొత్తం ఈ ఉద్యమంలో భాగం కావాల్సిందేనంటుంది బెత్‌ టెర్రీ అనే
అమెరికన్‌ మహిళ. ఆమె పదేళ్లుగా ప్లాస్టిక్‌ వాడడం లేదు. పైగా ‘ప్లాస్టిక్‌ ఫ్రీ: హౌ ఐ కిక్‌డ్‌ ద ప్లాస్టిక్‌ హ్యాబిట్‌ అండ్‌ హౌ యూ క్యాన్‌ టూ’ అనే పుస్తకమే రాసింది. సోషల్‌ మీడియా ద్వారా ఆమె నుంచి స్ఫూర్తిపొందిన చాలామంది ఇప్పుడు ప్లాస్టిక్‌ రహిత జీవనవిధానాన్ని అలవాటుచేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. పదిమంది కలిస్తే ఏ ఉద్యమానికైనా ఊపు వస్తుంది. ప్లాస్టిక్‌ ఫ్రీ క్లబ్బుల పేరుతో విదేశాల్లోనే కాదు, బెంగళూరు, చెన్నై లాంటి మన నగరాల్లోనూ ప్లాస్టిక్‌ వ్యతిరేక ఉద్యమాలు మొదలయ్యాయి.* * * * *



ప్రాణరక్షణకు పనికొస్తుందని వెనకటికెవరో బల్లెం పక్కన పెట్టుకుని పడుకున్నాడట. నిద్రలో అటూ ఇటూ కదిలాడు. అది కాస్తా అతని పొట్టలోనే గుచ్చుకుని ప్రాణం తీసింది. ప్లాస్టిక్‌ వాడకం కూడా అంతే. వాడడానికి సౌకర్యం అన్న సాకుతో మంచిది కాదని తెలిసీ దాన్ని ఇష్టం వచ్చినట్లు వాడుతూ ఆరోగ్యానికి ముప్పు తెచ్చుకుంటున్నాం. చివరికి ప్రాణాలకే ఎసరు తెచ్చుకుంటున్నాం. ఇప్పటికైనా కళ్లు తెరిచి ప్లాస్టిక్‌ ఎంత ప్రమాదకరమో గుర్తించకపోతే, నిర్లక్ష్యాన్ని వదిలి ప్లాస్టిక్‌ నిషేధ ప్రతిజ్ఞ చెయ్యకపోతే... మన సంగతి సరేసరి, మన పిల్లల్నీ వాళ్ల బిడ్డల్నీ కూడా క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధుల కౌగిట్లోకి చేజేతులా తోసేసిన వాళ్లం అవుతాం... తస్మాత్‌ జాగ్రత్త!



నిమిషానికి ఓ ట్రక్కు!

మన ప్లాస్టిక్‌ వాడకం ఏ స్థాయిలో ఉందంటే...
* ప్రపంచంలో ఏటా 50 వేల కోట్ల ప్లాస్టిక్‌ బ్యాగులు వాడుతున్నాం.
* ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి ఇరవై లక్షల క్యారీబ్యాగులు దుకాణాల నుంచీ వినియోగదారుల వెంట ఇళ్లకు చేరుతున్నాయి. అవన్నీ మరో రెండు రోజుల్లో చెత్తలోకి చేరతాయి.
* నిమిషానికి ఓ నిండు ట్రక్కు ప్లాస్టిక్‌ చెత్త సముద్రాల్లో కలుస్తోంది. అంటే ఏటా కనీసం 80 లక్షల టన్నులన్నమాట.
* మనం వాడుతున్న ప్లాస్టిక్‌లో 50 శాతం ఒకసారి వాడిపారేసేవే(డిస్పోజబుల్‌).
* నిమిషానికి పదిలక్షల ప్లాస్టిక్‌ సీసాలు (నీళ్లూ, పళ్లరసాలూ)అమ్ముడుపోతున్నాయి.
* ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న ముడిచమురులో 8నుంచి 10 శాతాన్ని క్యారీబ్యాగ్స్‌ తయారీకే వాడుతున్నారు.
* మత్య్సకారులు చేపలు పట్టడానికి వల వేస్తే చేపలకన్నా ఎక్కువ ప్లాస్టిక్‌ వస్తువులు పడుతున్నాయి. గత పది నెలల్లో కేరళ మత్య్సకారులు 25 టన్నుల ప్లాస్టిక్‌ చెత్తని సముద్రం నుంచి బయటకు తీశారు.
* అమెరికాలో 94 శాతం ఇండియాలో 86 శాతం నల్లా నీటిలో ప్లాస్టిక్‌ అణువులు ఉన్నట్లు గుర్తించారు.
* ప్లాస్టిక్‌ని వ్యాపారస్థాయిలో ఉత్పత్తిచేయడం మొదలుపెట్టినప్పుడు రెండు మెట్రిక్‌ టన్నులు తయారుచేసేవారు. ఇప్పుడు ఏటా 30 కోట్ల టన్నులు తయారుచేస్తున్నారు.

ఎన్ని సంవత్సరాలు?

ప్రాణం అనంతవాయువుల్లో కలవగానే మనిషి శరీరమూ కాలి బూడిదైపోతుంది. లేదా మట్టిలో కలిసిపోతుంది. మనం వాడే చాలా పదార్థాలూ అలాగే కొన్ని రోజులూ కొన్ని నెలల్లో... ప్రకృతిలో కలిసిపోతాయి. కానీ ప్లాస్టిక్‌ మాత్రం వందల ఏళ్లయినా చెక్కు చెదరదు. దీన్ని మనం ఎక్కువగా వాడడం మొదలుపెట్టి నాలుగు దశాబ్దాలు కూడా కాలేదు. ఇప్పటివరకూ మనం వాడి పారేసిన ప్లాస్టిక్‌లో 79 శాతం అలాగే ఉంది. అదంతా భూమ్మీదా, సముద్రాల్లో ఎక్కడ పడితే అక్కడ ఉండి ఆయా పరిసరాలను కలుషితం చేస్తోంది. రకరకాల ప్లాస్టిక్‌ వస్తువులు పూర్తిగా మట్టిలో కలిసిపోవడానికి ఎన్నేళ్లు పడతాయో తెలుసా?





1 comment:

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list