దీపావళి
శ్రీ మహ లక్ష్మి పూజ
శ్లో : శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే
(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)
శ్లో : అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్ (గంటను మ్రోగించవలెను) ఆచమనం ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా (అని మూడుసార్లు ఆచమనం చేయాలి) ఓం గోవిందాయ నమః,విష్ణవే నమః, మధుసూదనాయ నమః,త్రివిక్రమాయ నమః, వామనాయ నమః,శ్రీధరాయ నమః, ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీ కృష్ణాయ నమః ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే || (ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.) ప్రాణాయామము (కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను) ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్ సంకల్పం ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ మహా లక్ష్మి ప్రీత్యర్ధం శుభే శోభ్నే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిన) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈరోజు నక్షత్రము) శుభనక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దైర్య విజయ అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం ధర్మార్దకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్ధ సిద్ద్యర్థం ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం పుత్రపౌత్రాభి వృద్ద్యర్ధం,సర్వాపదా నివారణార్ధం,సకలకార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిద్యర్ధం,పుత్రపుత్రికా నాంసర్వతో ముఖాభివృద్యర్దం,ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం,సర్వదేవతా స్వరూపిణీ శ్రీ మహా లక్ష్మి ప్రీత్యర్ధం యావద్బక్తి ద్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. (అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.) తదంగత్వేన కలశారాధనం కరిష్యే కలశారాధనం శ్లో : కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః (కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.) శ్లో : గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య (కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను.) మం : ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్ శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి మీద అక్షతలు, గంధం పువ్వులు వేయవలెను . ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాదిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః,ఫాలచంద్రాయ నమః,గజాననాయ నమః,వక్రతుండాయనమః,శూర్పకర్ణాయ నమః,హేరంబాయ నమః,స్కందపూర్వజాయ నమః,ఒం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాంసమ్ర్పయామి. మహాగణాదిపత్యేనమః ధూపమాఘ్రాపయామి. ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి. శ్రీ మహాగణాధిపతి బెల్లము OR పండ్లు గానీ ప్రసాదముగ నివేదించాలి. కర్పూర నీరాజనం దర్శయామి. (కర్పూరమును వెలిగించి చూపవలెను). లక్ష్మి పూజ విధానము : లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీమ్ | దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ || శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరామ్ | త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ లక్ష్మి దేవి ప్రతిమ గాని , శ్రీ చక్రంతో గాని , పసుపుతో ముద్ద చేసి లక్ష్మి దేవి గాని పూజించవలెను శ్రీ లక్ష్మి దేవియే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ లక్ష్మి దేవి యే నమః పాదయోః పాద్యం సమర్పయామి (నీళ్ళు చల్లవలెను) శ్రీ మహాలక్ష్మి దేవి యే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి (నీళ్ళు చల్లవలెను) ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి (నీళ్ళు చల్లవలెను) శ్రీ లక్ష్మి దేవియే నమః వస్త్రయుగ్మం సమర్పయామి (అక్షతలు చల్లవలెను) శ్రీ లక్ష్మి దేవి యే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి (గంధం చల్లవలెను) శ్రీ లక్ష్మి దేవియే నమః అక్షతాన్ సమర్పయామి (అక్షతలు చల్లవలెను) యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా” అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము .మహాలక్ష్మీదేవిని పూజిస్తే సర్వమంగళ మాంగల్యాలు కలుగుతాయి. శ్రీ లక్ష్మి దేవికి ఆశ్తోత్తరములతో కుంకుమ పూజ చేయవలెను శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి శ్రీ మహాలక్ష్మ్యష్టకమ్ శ్రీ లక్ష్మీ అశోత్తర శత నామ స్తోత్రము శ్రీ సూక్తం పఠించవలెను. “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహా” అనే మంత్రమును 108 మార్లు జపించవలెను. ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ లక్ష్మి దేవి యే నమః (ప్రసాదం నివేదయామి). ఓం ప్రాణాయస్వాహా, ఓమ్ అపానాయస్వాహా, ఓంవ్యానాయ స్వాహా ఓమ్ ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. (నీరు వదలాలి.) తాంబూలం సమర్పయామి నీరాజనం దర్శయామి. (తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను) ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయా”త్ శ్రీ లక్ష్మి దేవి యే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ లక్ష్మి దేవి సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు (అనుకొని నమస్కరించుకొనిదేవుని వద్దగల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)
శ్రీ లక్ష్మి దేవి పూజ సమాప్తం.
_______________________
వయసుతో నిమిత్తం లేకుండా, స్త్రీ, పురుష భేదం లేకుండా అందరూ ఇష్టపడే ఏకైక పండుగ మాత్రం దీపావళి ఒక్కటే. దక్షిణ భారతదేశమంతా మూడు రోజులపాటు జరుపుకునే దీపావళి ఎంతో ఉత్తేజకరమైన పండుగ. ఆశ్వయుజ బహుళ చతుర్దశి, అమావాస్య, కార్తీక శుద్ధ పాఢ్యమి మూడు రోజులనూ కలిసి సమగ్రమైన దీపావళి. ఈ మూడు రోజుల్లో మొదటిది నరక చతుర్దశి. రెండవది దీపావళి. మూడవది బలిపాడ్యమి. పూర్వకాలమున అమృతము కొరకు దేవతలు, రాక్షసులు పాలసముద్రమును చిలుకు సమయమున ముందుగా లక్మిదేవి పాలసముద్రము నుండి ఉద్భవించిన. అందుకే ఆమె క్షీరరాజతనయ అని పిలవబడుతున్నది. తరువాత కామధేనువు,కల్పవృక్షము హాలాహలము,చివరిగా అమృతము లభించినవి.ఈ విధంగా ఉద్భవించిన శ్రీమహలక్ష్మిని మనసారాపూజించిన సకల జనులకు ఈ జన్మమునసర్వసుఖములు పరమందు మోక్ష సిద్ధి కలుగుతాయి. కరుణావీక్షణము చేతనే సకల సౌఖ్యముల సమకూర్చగల శ్రిiలక్ష్మి వైకుంఠమున శ్రీమహావిష్ణువు పై కినుక వహించి,భూఅలోకమున అవతరించినది. నీవు తప్ప నాకేవ్వరు దిక్కని స్తుతించిన వారికి అన్నిటా ఆ లక్ష్మిదేవితోడై అండగా నిలుస్తుంది.భాగ్యం కోసం ఆ తల్లినుఇ ఆరాదించిన వారికి,ఆ మాత బోగభగ్యములను ప్రసాదించే సకల వరప్రదాయిని అవుతుంది.నిస్సంతులు పుజించినచోసంతానలక్ష్మిగా తన అనురాగమును పసతానమును కలిగించును.విజయము కొరకు ప్రార్ధించిన జయలక్ష్మి అయి విజయాన్ని కలిగిస్తుంది.పాండిత్యము కొరకు పూజించిన వారికి విద్యాలక్ష్మిగా సర్వశాస్త్ర పారంగతులను చేసే తల్లి.ధనము కొరకు పూజించే వారికి ధనలక్ష్మి కోరికలు నెరవేర్చే కరుణామూర్తి. పంటలు లేక బాధపడేవారు పూజించిన,ధాన్యమునిచ్చు ధన్యలక్ష్మి.పిరికితనము పొకొట్టు దైర్యలక్ష్మి నిత్యజీవితావసరాలను ఆశించి ప్యజించువారికి అండగా నిలిచి కాపాడే ఆదిలక్ష్మి. ఆ తల్లి యెక్క అష్టరూపాలను ఎవరైతే భక్తిగా,శ్రద్ధగా నియమములతో పూజిస్తారో వారికి తప్పకుండా ఆ తల్లి యెక్క అనుగ్రహము లభిస్తూందనటలో సంశయము లేదు.అశ్ఠలక్ష్మి పూజను చేసి లక్ష్మి పూజాకధను విని,ప్రసాదమును స్వీకరించిన వారి కోరికలు తప్పక నెరవేరగలవు. దీపావళి ఈ పండుగను ఆచరించే విధానంలో అనేక గాధలున్నాయి. 1. నరకాసుర వధ, 2. బలి చక్రవర్తి రాజ్యదానము, 3. శ్రీరాముడు రావణ సంహారానంతరం అయోధ్యకు తిరిగి వచ్చి భరతునితో సమావేశమగుట (భరత్ మిలాప్), 4. విక్రమార్క చక్రవరి పట్టాభిషేకం. భారత దేశమంతటా ప్రచారమున్న గాధ నరకాసుర వధ. ఆశ్వయుజ కృష్ణ చతుర్దశి నాటి రాత్రి రెండు జాములకు తరువాత శ్రీకృష్ణుడు నరకాసురుని వధించెను. నరకుడి పీడ వదలటంతో ఆనందపరవశులైన ప్రజలు అదే రాత్రి మిగిలిన భాగమును, మరుదినమునను మహోత్సవాలు జరుపుకొన్నారు. ఆనాటి ఉత్సవాలకు చిహ్నంగా ప్రజలు ప్రతి యేటా ఈ రెండు రోజులూ గొప్పగా పండుగలు చేసుకొంటున్నారు. భరత్ మిలాప్ : శ్రీరామచంద్రుడు రావణ వధానంతరం లంక నుండి అయోధ్యా నగరానికి మరల తిరిగిరావడం, పట్టాభిషేకం జరగడం ఈనాడే అంటారు. శ్రీరాముడు భరతునితో మరల కలియుటకు ఉపలక్షణంగా “భరత్ మిలాప్”అను పండుగ ఉత్తర భారతమంతా నేటికీ చేస్తున్నారు. ఈ విశ్వాసం వల్లనే రాజులు విజయదశమి నాడు సీమోల్లంఘన చేసి శత్రువులపై దాడి చేసి, విజయంతో దీపావళి నాడు మరలి వచ్చుట సంప్రదామయ్యింది. ఒక్కో పురాణంలో, ఒక్కో ధర్మ శాస్త్రంలో ఒక్కో గాధ లిఖించబడినప్పటికీ నరకాసుర వధ మాత్రమే దీపావళి పండుగకు అంకురార్పణ అన్న గాధనే అందరూ అనుసరిస్తుండడంతో అదే స్థిరపడిపోయింది. దీపావళి ఆశ్వయుజ మాస బహుళ చతుర్ధశిని ‘నరక చతుర్ధశి’ అని, ఆ మరుసటి రోజును ‘దీపావళి’ అమావాస్య అని అంటారు. ఇది పిన్నలకూ, పెద్దలకూ సరదా పండుగ. తలస్నానం చేసి, కొత్త దుస్తులు ధరించడం, పిండివంటలతో భోజనం చేసి, సాయంత్రం కాగానే దీపాల్ని వరుసగా వెలిగించి, అనంతరం టపాకాయలు కాల్చడం ఈ పండుగకు ఆనవాయితి. నరకాసుర సహారం జరిగినందుకు ఆనంద సూచకంగ జరుపుకొనే ఈపండుగ, మార్వాడీలకు ఇంకో విధంగా కూడా ప్రత్యేకమైనది. వారికిది లక్ష్మీ పూజాదినం. పాత ఖాతాలు మూసేసి, కొత్త పద్దులు ప్రారంభిస్తారు. శ్రీకృష్ణుడు సత్యభామ సమేతుడై లోకకంటకుడైన నరకాసురుని వధించినందుకు సంబరంగా జరుపుకొనే ఈ దీపావళి పండుగను దేవదానవులు పాలసముద్రాన్ని మధించినప్పుడు వచ్చిన దివ్యజ్యోతి ఈ జీవకోటికి వెలుగును ప్రసాదించిన విశిష్టమైన రోజుగా మరియు శ్రీరామచంద్రుడు రావణ సంహారం గావించి సీతాదేవితో అయోధ్యకు చేరి పట్టాభిషిక్తుడైన శుభసందర్భంగా కూడా చెప్పుకుంటారు. దీపావళి రోజు లక్ష్మి పూజ ఎందుకు చేయాలనే దానికి చాలా కథలు ప్రాచుర్యము లో వున్నాయి . అందులో ఒకటి , వొకరోజు , ఒకషావుకారు దగ్గరికి ,జేష్టాదేవి , లక్ష్మీదేవి వచ్చి ,ఇద్దరిలో ఎవరు అందముగా వున్నారో చెప్పమని అడిగారు . జేష్టాదేవిని ఇంట్లోనుండి బయటకి పంపాలి , లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించాలి .అందుకు ఉపాయముగా ,జేష్టాదేవితో అమ్మా నీవు వెనుకనుండి అందముగా వున్నావు అనగానే జేష్టాదేవి ఆనందముగా బయటికినడిచింది . లక్ష్మీదేవితో అమ్మా నీవు ముందునుండి అందముగా వున్నావు అనిచెప్పాడు .అప్పుడు లక్ష్మీ దేవి వయ్యారముగా ఇంటిలోకి నడిచింది దీపావళికి దేదీప్యమైన దివ్యకాంతుల దీపాలను అలంకరించి, బాణాసంచా కాలుస్తూ, అందరూ వారి వారి ఆనందాలను వ్యక్త పరుస్తూ ఉంటారు. ఇక ప్రకృతి పరంగా ఆలోచిస్తే, ఈ కాలమందు సర్వజీవులను వ్యాధిగ్రస్తులను చేసే కీటకాలు, పంటలను నాశనము చేసే క్రిమికీటకాలు అధికంగా ఉధ్బవిస్తాయి. కనుక ఈ బాణాసంచా కాల్పుల వల్ల కీటకసంహారం కలిగి ప్రజలకు అన్నివిధాల మేలు జరుగుటకే ఈఆచారం పెట్టి ఉంటారని పెద్దలు చెప్తూ ఉంటారు. దీపావళి ఏ ఇంటి యందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో, ఆ ఇంట శ్రీమహాలక్ష్మి ప్రవేశిస్తుందని మనకు ఋగ్వేదం చెప్తోంది. అటువంటి పుణ్య దిన సాయం సంధ్యా కాలమందు లక్ష్మీస్వరూపమైన తులసికోట ముందు తొలుత దీపాలు వెలిగించి, శ్రీమహాలక్ష్మి అష్టోత్తరశతనామాలతో క్రింద వర్ణించిన విధంగాపూజ గావించి, ఈ సర్వప్రాణ కోటికి హృదయ తాపాలను పోగొట్టు సర్వ సంపన్న శక్తివంతురాలుగా భావించి, నివేదన చేసి, పూజానంతరం గృహమంతా దీపాలంకృతం చేయుటవల్ల కాలి అందియలు ఘల్లు ఘల్లుమని అన్నట్లు ఆమహాలక్ష్మి ప్రసన్నమౌతుందట!
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565