పూలతోనే ఎందుకు పూజించాలి?
నిత్యం మనం భగవంతునికి చేస్తున్న పూజలలో పుష్పాలదే అగ్రస్థానం. ఏ స్వామి పూజ అయినప్పటికీ, ఏ తల్లి పూజ అయినప్పటికీ, వారి వారి పూజలలో పుష్పాలకే ప్రాముఖ్యత. ఎన్నో పూజా ద్రవ్యాలుండగా, పుష్పాలకే ఎందుకు ఇంత ప్రాముఖ్యత అని అనిపించవచ్చు. పుష్పం ముఖ్యత్వాన్ని అనేక గ్రంథాలు పేర్కొన్నాయి.
పుష్పామూలే వసేద్బహ్మ్ర మధ్యేచ కేశవః
పుష్పాగ్రేచ మహాదేవః సర్వదేవాః స్థితాదళే
పుష్పం మొదట్లో బ్రహ్మ, పుష్పమధ్యమంలో కేశవుడు, పుష్పపు కొనలో మహాదేవుడు నివసిస్తుంటారని, పుష్ప దళాలలో సర్వదేవతలుంటారని ప్రతీతి.
పరంజ్యోతిః పుష్పగతం పుష్పేణైవ ప్రసీదతి
త్రివర్గ సాధనం పుష్పం పుష్టిశ్రీ స్వర్గమోక్షదమ్
పువ్వులలో ఉన్న పరమాత్మ పువ్వులతోనే ప్రసన్నుడవుతుంటాడట. కాబట్టి పుష్పం త్రివర్గ సాధనం. అంటే సంపదలను, స్వర్గాన్ని, మోక్షాన్ని కలిగిస్తుంది.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565