MohanPublications Print Books Online store clik Here Devullu.com

భద్రం చరిత్రదేముంది... చెరిపేస్తే చెరిగిపోతుంది!_Save History is ... eradicts



భద్రం
చరిత్రదేముంది... చెరిపేస్తే చెరిగిపోతుంది!

అనుకోకుండా ఫోన్‌ లేదా పర్సనల్‌ కంప్యూటర్‌ని ఇతరులకు ఇవ్వాల్సివస్తుంది! తిరిగి మళ్లీ మన చేతికొచ్చేంత వరకూ ఒకటే ఆలోచన...మన వ్యక్తిగత వివరాలు వారి కంటపడతాయేమోనని...ఎందుకంటే... ప్రతిఒక్కరికీ ప్రైవసీ ఉంటుంది... ‘నా ఫోన్‌లో నేనేం చేస్తున్నానో ఎవరికీ తెలియనక్కర్లేదు...’ ‘నా బ్రౌజర్‌లోని వెబ్‌ విహారం ఎవరి కంటా పడకూడదు...’ అని అనుకుంటారు! అందుకే ఎప్పటికప్పుడు చరిత్రని (హిస్టరీ) చెరిపేస్తే పోలా... ఈ చిట్కాల్ని చక చకా ఫాలో అయిపోండి!
బ్రౌజర్‌లో ఇలా...
నెట్టింట్లో విహారం ఎక్కువగా బ్రౌజర్‌లోనే సాగుతుంది. అందుకే ప్రైవసీ గోప్యతని ముందు బ్రౌజర్‌ నుంచే మొదలుపెడదాం! వాడే బ్రౌజర్‌ ఏదైనా సెట్టింగ్స్‌లోకి ‘హిస్టరీ’ ఎవరికంటా పడకుండా చూడొచ్చు. క్రోమ్‌ బ్రౌజర్‌ని వాడుతున్నట్లయితే పలు రకాలుగా మన డేటా హిస్టరీలో స్టోర్‌ అవుతుంది. మరి, తుడిచేయాలంటే బ్రౌజర్‌ టాప్‌లో ఉన్న మూడు చుక్కల మెనూను క్లిక్‌ చేసి హిస్టరీ ఆప్షన్‌ క్లిక్‌ చేయండి. అక్కడ ‘క్లియర్‌ బ్రౌజింగ్‌ డేటా’ ఆప్షన్‌తో గత 24 గంటలు, గత వారం, పూర్తి హిస్టరీ... లాంటి ఆప్షన్లుంటాయి. వాటిని సెలెక్ట్‌ చేస్తూ తీసేయవచ్చు.
ఎఫ్‌బీలో...
ఫేస్‌బుక్‌ ఆప్‌లో ‘సెర్చ్‌ బార్‌’ క్లిక్‌ చేయగానే గతంలో ఎఫ్‌బీలో సెర్చ్‌ చేసిన వ్యక్తులు, ప్రాంతాల పేర్లు కనిపిస్తాయి. ఉదాహరణకు ఎవరైనా వ్యక్తి గురించి పదే పదే వెతికిన విషయం ఈ డేటా ద్వారా ఇతరులు పసిగటొచ్చు. మరైతే, పాత ఆనవాళ్లను క్లియర్‌ చేసేందుకు సెర్చ్‌ బార్‌ దిగువనున్న ‘ఎడిట్‌’ ఆప్షన్‌ను క్లిక్‌ చేయండి. అప్పుడు మీరు ఎఫ్‌బీ వాడుతున్నప్పటి నుంచి ఏ రోజు దేని గురించి వెతికారనే వివరాలు కనిపిస్తాయి. మొత్తం సెర్చ్‌ వివరాలు డిలీట్‌ చేయాలంటే ‘క్లియర్‌ సెర్చ్స్‌’ ఆప్షన్‌ క్లిక్‌ చేయాలి. దేనికది తీసేయాలనుకుంటే కుడివైపు చివరనున్న క్లోజ్‌ మార్క్‌ను క్లిక్‌ చేయాలి.
ప్లేస్టోర్‌ గుర్తులు...
గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఏవేవో ఆప్స్‌ వెతుకుతుంటాం. ఈ క్రమంలో గతంలో వెతికిన పేర్లు సెర్చ్‌బాక్స్‌లో (డ్రాప్‌డౌన్‌ లిస్ట్‌) కనిపిస్తుంటాయి. వీటిని కూడా తొలగించేందుకు... ప్లే స్టోర్‌ ఆప్‌ ఎడమవైపు ఉన్న మూడు అడ్డ గీతల మెనూలోకి వెళ్లండి. అందులో సెట్టింగ్స్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేస్తే ‘క్లియర్‌ లోకల్‌ సెర్చ్‌ హిస్టరీ’ ఆప్షన్‌ కనిపిస్తుంది. క్లిక్‌ చేస్తే రీసెంట్‌ సెర్చ్‌ హిస్టరీ అంతా తొలగిపోతుంది.
జీబోర్డ్‌లోనూ తీయాలంటే...
గూగుల్‌ మాత్రమే కాదు దాని కీబోర్డు ‘జీబోర్డ్‌’ కూడా మీరు సెర్చ్‌ చేసిన సమాచారాన్ని కాస్త దాచుకుంటుంది. జీబోర్డ్‌లో మీరు టైప్‌ చేసి సెర్చ్‌ చేసిన పదాలు, జిఫ్‌ల వివరాలు హిస్టరీలో ఉండిపోతాయి. వాటిని కూడా మనం తొలగించేయొచ్చు. దీని కోసం... మొబైల్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. ఆ తర్వాత ఆప్స్‌ ట్యాబ్‌లో ‘జీబోర్డ్‌’ను క్లిక్‌ చేసి ఓపెన్‌ చేయ్యండి. అందులోని స్టోరేజ్‌ ట్యాబ్‌లోకి వెళ్తే క్లియర్‌ సెర్చ్‌ ఆప్షన్‌ వస్తుంది. దాన్ని ఒత్తితే హిస్టరీ డిలీట్‌ అయిపోతుంది.
ట్విట్టర్‌లోనూ....
హ్యాష్‌ట్యాగ్‌లు, పేర్ల వివరాలతో ట్విట్టర్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేస్తుంటారు. అయితే ప్రతిసారి ట్విట్టర్‌ సెర్చ్‌బార్‌ను క్లిక్‌ చేస్తే పాతవి కనిపిస్తాయి. ఒక్క క్లిక్‌తో వాటిని తొలగించేందుకు ఆప్‌లోని సెర్చ్‌ బార్‌ను క్లిక్‌ చేస్తే దిగువన ‘రీసెంట్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానికి కుడివైపు చివరన ఉన్న క్లోజ్‌ బటన్‌ను క్లిక్‌ చేస్తే సెర్చ్‌ హిస్టరీ క్లియర్‌ అయిపోతుంది.
వ్యక్తిగతంగా మీలో...
నెట్టింట్లోగానీ, సోషల్‌ లైఫ్‌లోగానీ ఏదైనా పోస్ట్‌ చేసే ముందు ఆలోచించి పంచుకోవాలి. మనం పంచుకునే డేటా ఆధారంగానే ఇతరులు మన గుట్టుని తెలుసుకునేందుకు మార్గం దొరుకుతుంది. ఇలాంటి వాటిని ‘సోషల్‌ ఇంజినీరింగ్‌’ ఎలాగ్‌లుగా పరిణిగస్తారు. వాల్‌పై మీరేం షేర్‌చేస్తూన్నారో పరిశీలిస్తూ మిమ్మల్ని ఎలా టార్గెట్‌ చేయాలో నిర్ణయించుకుంటారు. అలాగే, నెట్టింట్లో ఒక్కసారి డేటా పంచుకున్నాక అది ఏయే ఫ్లాట్‌ఫామ్‌ల్లో వెళ్తుందో వూహించలేం. మన వాల్‌పై తీసేసి ఇంకెక్కడా సేవ్‌ అయ్యి ఉండదులే అనుకుంటే మన భ్రమే!
‘ఓకే’ చెప్పేస్తే ఎలా?
ఏదైనా వాడేముందు నియమ, నిబంధనల్ని క్షుణ్ణంగా చదవాలి. మనం ఎంటర్‌చేసే కీవోర్డ్‌లు, హిస్టరీ, డేటా, ఎలా, ఎక్కడ స్టోర్‌ అవుతుంది? మనం వాడుతున్న డివైజ్‌ ఏమేరకు సర్వీసు ప్రొవైడర్‌ కంట్రోల్‌లోకి వెళ్తుందనే విషయాలపై అవగాహన ఉండాలి. కానీ, యూజర్లలో ఎక్కువ శాతం మంది వీటిని పట్టించుకోకుండా అన్నింటికీ ‘ఒకే’చేసేస్తుంటారు. దీంతో వ్యక్తిగతమైనవి కూడా ఆయా సర్వీసులు తెలుసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక బ్రౌజర్ల విషయానికొస్తే వాటిని ‘స్పైవేర్లు’ అనొచ్చు. ఎందుకంటే బ్రౌజర్‌ నుంచి యూజర్‌కి సంబంధించిన మొత్తం వ్యక్తిగత వివరాల్ని సేకరించేందుకు ఇతరులకు ఆస్కారం ఉంటుంది. ఏయే అంశాలు... ఎంత సమయం... ఎక్కడెక్కడ... వెబ్‌ విహారం చేశామో బ్రౌజరే విడమరిచి చెబుతుంది. అందుకే బ్రౌజర్‌లో ఉండే డీఫాల్ట్‌ సెట్టింగ్స్‌తో కాకుండా మన ప్రైవసీని కాపాడుకునేలా మార్పులు చేసుకుని వాడుకోవాలి. హిస్టరీ, కుకీస్‌లను ఎప్పటికప్పుడు డిలీట్‌చేయాలి. వాణిజ్య ప్రకటనల్ని బ్లాక్‌ చేస్తూ ప్రైవసీని కొంత వరకూ కాపాడుకోవచ్చు. కొన్ని లింక్‌లపై క్లిక్‌ చేయడం మూలంగా ‘నేవిగేషన్‌’ మన కంట్రోల్‌లో లేకుండా హ్యాకర్ల చేతికి చిక్కే అవకాశం లేకపోలేదు. దీన్ని ఆపేందుకు సీ-డాక్‌ అందించే ‘జేఎస్‌గార్డ్‌’ టూల్‌ని వాడొచ్చు. బ్రౌజర్‌కి యాడ్‌ఆన్‌ రూపంలో జత చేస్తే మాల్వేర్‌ల బారిన పడకుండా ఎలర్ట్‌ చేస్తుంది. వ్యక్తిగత సైట్‌ల్లో మీరు ఎంటర్‌చేసిన లాగిన్‌వివరాల్ని ట్రాక్‌ చేయడానికి ప్రయత్నిస్తే అడ్డుకుని యూజర్‌ని అప్రమత్తం చేస్తుంది. యాడ్‌ఆన్‌ డౌన్‌లోడ్‌ లింక్‌:https://goo.gl/ou6ABL

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list