MohanPublications Print Books Online store clik Here Devullu.com

మాట్లాడే కళ_Speaking art



\
మాట్లాడే కళ

మాట్లాడటం ఒక కళ. అందరూ మాట్లాడతారు. ఏది అనుకుంటే అది మాట్లాడేస్తారు. కాని చక్కగా మాట్లాడటం మనకు వచ్చునా? అందరూ వక్తలు కాకపోయినా, చక్కటి సంబంధాలు నెలకొల్పాలంటే ఎంతో సౌమ్యంగా మాట్లాడాలి. చక్కగా సంభాషించాలి. మాట్లాడకపోతే నష్టమా? ఎంతో నష్టం. నోరు మంచిదైతే వూరు మంచిది అన్నారు.

మాట్లాడటంలో ఏముంది అని అనుకోవడం పొరపాటు. చక్కగా మాట్లాడటం ఒక కళ. తానొవ్వక ఇతరుల నొప్పించక మాట్లాడాలి. చాతుర్యంగా మాట్లాడాలి. మాట్లాడుతుంటే మళ్ళీ మళ్ళీ వినాలని అనిపించాలి. మంచినే మాట్లాడాలి. చెడు మాట్లాడే అవకాశం రానివ్వకుండా జాగ్రత్తపడాలి. నిజాయతీగా మాట్లాడాలి. నిరాడంబరంగా మాట్లాడాలి. సందర్భానుసారం ఏం మాట్లాడాలో తెలుసుకుని మాట్లాడాలి. వ్యవహారం చక్కబెట్టుకు రావడానికి అప్రమత్తంగా మాట్లాడాలి.

ముందే దుర్యోధనుడు వచ్చినా, అర్జునుణ్ని ముందు పలకరించిన శ్రీకృష్ణుడు మాట్లాడిన విధానం, దాని వెనక ఉన్న రాజనీతిజ్ఞత గ్రహించాలి. కురుక్షేత్ర రణరంగం మధ్యలో రథాన్ని నిలిపి, అర్జునుడి విషాదం గ్రహించి, అతణ్ని యుద్ధం వైపు తిప్పిన ఆ భగవానుడి సంభాషణలు విశ్వస్ఫూర్తిదాయకమై భగవద్గీతగా వెలుగుతున్నాయి. ఆ పలుకుల వెనక ప్రస్తుత కాలానికి అవసరమైన వ్యక్తిత్వ వికాసం, మానవ సంబంధాల గురించి ఎన్నో విషయాలున్నాయి. ఇంతవరకు అంత అద్భుతంగా మాట్లాడిన అవతారమూర్తి కానరాడు.

బుద్ధుడు కొన్నివేల మైళ్లు తిరిగి, ఒక సంఘం స్థాపించి ఎంతో మందిని తనవైపు ఆకర్షించడానికి ఎన్నో సంభాషణలు చేశాడు. అతడి మాటలు వినడానికి జనం బారులు తీరారు. పరుగులు తీశారు. ఇప్పటికీ ప్రపంచంలో ఎన్నోచోట్ల బుద్ధుడి దివ్యమైన శక్తిమంతమైన మాటలు వినిపిస్తూనే ఉంటాయి.

చిన్న చిన్న ఉదాహరణలతో చక్కటి మహిమగల మాటలాడి తన దివ్యత్వం చూపించిన జీసస్‌ను ఎన్నో మిలియన్ల మంది ఆరాధిస్తున్నారు. ఆయన వాక్యం శక్తి అందరికీ తెలిసిందే కదా. తన అనుభూతిని అందరికీ తెలిసిన ఉపమానాలతో హృదయంలో ముద్రించుకుపోయేటట్లు తెలియజేసిన రామకృష్ణ పరమహంస సాధారణమైన మాటల ముందు కేశవచంద్ర సేన్‌ లాంటి పండితులు తలవంచారు. ఇచ్చిన కొన్ని నిమిషాల కాలాన్ని అపరిమితంగా సద్వినియోగం చేసుకుని చికాగో నగరంలో అద్భుత ప్రసంగం చేసి భారతదేశ ఔన్నత్యాన్ని చాటిచెప్పిన వివేకానందుడి మాటలు అమెరికా అంతా మార్మోగాయి. దేశదేశాలు వివేకానందుడి వాక్కులకోసం పరితపించి పోయాయి. జ్ఞాన సరస్వతి వివేకానందుడి మాటలు నేటి యువతకు కూడా జీవన లక్ష్యంవైపు దిశానిర్దేశం చేస్తూనే ఉన్నాయి. అంకితభావం కలిగి, శుద్ధత్వం సంపాదించుకుని లోక కల్యాణం కోసం జీవించిన గురునానక్‌, ఆదిశంకరుల వంటి మహాత్ముల సంభాషణలు మరచిపోగలమా?

అందరం మాట్లాడతాం. మంచిగా మాట్లాడదాం. మంచి కోసం మాట్లాడదాం. దీన, హీన జనుల పక్షాన నిలబడి మాట్లాడదాం. లోకం నీతిమార్గంలో నడవడానికి, మహనీయుల బోధలు అనుసరించడానికి జనులను జాగృతం చేయడానికి మాట్లాడదాం. నీకోసం నాకోసం మాటలు తగ్గించి పదిమంది మేలు కోసం పరులహితం కోసం అహోరాత్రాలు మాట్లాడదాం. అదే నిజమైన దైవస్తుతి.

- ఆనందసాయి స్వామి

శ్రీ గణేశ కృత శ్లోకాత్మక రుద్రాధ్యాయ పారాయణ_Rudraadyayam


Rudraadyayam

శ్రీ గణేశ కృత శ్లోకాత్మక
 రుద్రాధ్యాయ పారాయణ


       

శివానుగ్రహ సిద్ధికోసం రుద్రనమక మంత్రాలను వినియోగించడం సంప్రదాయం. అభిషేకానికీ, జపానికీ, అర్చనకీ ఈ దివ్యమంత్రాలు ఉపయోగించి ఇష్టిసిద్ధి, అనిష్ట పరిహారం పొందుతారని శాస్త్రోక్తి. ఎందరికో అనుభవం కూడా. అంతేకాక - ఆత్మవిద్యకి సంబంధించిన ఉపనిషత్ భాగంగా ’రుద్రోపనిషత్’ పేరున దీనిని వ్యవహరిస్తారు. ఇది కైవల్య ప్రాప్తి హేతువని యజ్ఞవల్క్యాది మహర్షులు వేదభాగాలలో వివరించారు.

ఆగమాలు, పురాణేతిహాసాలు, ప్రత్యేకించి దీని ప్రశస్తిని పేర్కొన్నాయి. అయితే వేదభాగమై అపౌరుషేయమైన ఈ రుద్ర పఠనానికి, పారాయణకీ, నియమాలు, నిబంధనలు ఉన్నాయి. స్వరం రానివారు, నియమపాలన కుదరని వారు తదితరులు దీనిని పారాయణ చేయడం కూడదని శాస్త్రనియమం.

కానీ ఈ రుద్రమంత్రాల వల్ల లభించే సిద్ధి, కైవల్యం వంటి అద్భుత ఫలాలను అందరికీ అందజేయాలని సంకల్పించుకున్న ఋషులు ఆ రుద్రనమకాన్ని శ్లోక రూపంగా మలచి పురాేతిహాసాల ద్వారా, తంత్రశాస్త్ర గ్రంథాలద్వారా అందజేశారు.

మంత్రాలను శ్లోకంగా మలచాలంటే ఋష్యత్వం కలిగిన వారికే సాధ్యం. అందుకే వేదాలను వ్యాసం చేసి ప్రసాదించిన భగవాన్ వేదవ్యాసులవారు మహాభారతం, సూతసంహిత, శివరహస్యం - వంటి గ్రంథాలద్వారా వివిధ వివిధాలుగా ’శతరుద్రీయ’ శ్లోకాలను అందజేశారు.

విష్ణుసహస్ర, శివసహస్ర, లలితా సహస్ర నామ స్తోత్రాలవలె ఈ నమక స్తోత్రాన్ని - స్నానాది శుచి నియమాలు పాటిస్తూ పారాయణ చేస్తే చాలు పరిపూర్ణ ఫలం లభిస్తుమ్ది. అందులో సందేహం లేదు. దీనిని పారాయణ స్తోత్రంగా పఠించవచ్చు. అభిషేకానికి వినియోగించుకోవచ్చు, స్వరనియమం లేదు. ఉచ్ఛారణలో జాగ్రత్త వహించాలి. శ్రద్ధావిశ్వాసాలున్న ఆస్తికులందూ దీని పఠనానికి అర్హులే.

పైగా - ఇది సాక్షాత్తు డుంఠి వినాయకుడు కాశీ విశ్వనాథుని దర్శించి చేసిన స్తోత్రంగా శివరహస్యం పేర్కొన్నది.

ఇంతటి మహిమాన్వితమైన స్తోత్రాన్ని సర్వజన సౌలభ్యంకోసం ప్రచురిస్తున్నాం.


ధ్యానమ్:

ఆపాతాళ నభస్స్థలాంత భువన బ్రహ్మాండ మావిస్ఫుర

జ్జ్యోతిఃస్ఫాటిక లింగ మౌళివిలసత్ పూర్ణేందు వాంతామృతైః!

అస్తోకాప్లుత మేకమీశ మనిశం రుద్రానువాకాన్ జపన్

ధ్యాయేదీప్సిత సిద్ధయే ధ్రువ పదం విప్రోభిషించేచ్ఛివమ్!!

బ్రహ్మాండ వ్యాప్తదేహా భసిత హిమరుచా భాసమానా భుజన్గైః

కంఠే కాలాః కపర్దా కలిత శశికలాశ్చండ కోదండ హస్తాః

త్ర్యక్షా రుద్రాక్షమాలా స్సులలితవపుష శ్శాంభవామూర్తి భేదా

రుద్రాశ్శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవా నః ప్రయచ్ఛంతు సౌఖ్యమ్!!

ఇత్యుక్త్వా సత్వరం సాంబం స్మృత్వా శంకరపాదుకే

ధ్యాత్వా యయౌ గణాధీశః శివసన్నిధి మాదరాత్!

తతః ప్రణమ్య బహుధా కృతాంజలి పుటః ప్రభుః

శంభుం స్తోతుం మతిం చక్రే సర్వాభీష్ట ప్రదాయకమ్!!


గణేశ ఉవాచ:

నమస్తే దేవ దేవాయ నమస్తే రుద్ర మన్యవే!

నమస్తే చంద్రచూడాయా ప్యుతోత ఇషవే నమః!!1!!

నమస్తే పార్వతీ కాంతా యైక రూపాయ ధన్వనే!

నమస్తే భగవన్ శంభో బాహుభ్యాముత తే నమః!!2!!

ఇషుః శివతమా యా తే తయా మృడయ రుద్రమామ్!

శివం ధనుర్యద్బభూవ తేనాపి మృడయాధునా!!3!!

శరవ్యా యా శివతమా తయాపి మృడయ ప్రభో!

యా తే రుద్రశివా నిత్యం సర్వంగలసాధనమ్!!4!!

తయాభిచాకశీహి త్వం తనువా మా ముమాపతే!

ఘోరయా తనువాచాపి రుద్రాద్యాపాపకాశినీ!!5!!

యా తయా మృడయ స్వామిన్ సదా శంతమయా ప్రభో!

గిరిశంత మహారుద్ర హస్తే యా మిషు మస్తవే!!6!!

బిభర్షి తాం గిరిత్రాద్య శివాం కురు శివాపతే!

శివేన వచసా రుద్ర నిత్యం వాచా వదామసి!!7!!

త్వద్భక్తి పరిపూతాంగం మహింసీః పురుషం జగత్!

యచ్చ శర్వ జగత్సర్వ మయక్ష్మం సుమనా అసత్!!8!!

యథాతథావమాం రుద్ర తదన్యధాపి మే ప్రభో!

రుద్ర త్వమ్ ప్రథమో దైవ్యో భిషక్ పాపవినాశకః!!9!!

అధివక్తా ధ్యవోచ న్మాం భావలింగార్చకం ముదా!

అహీన్ సర్వాన్ యాతు ధాన్యః సర్వా అప్యద్య జంభయన్!!10!!

అసౌ తామ్రోరుణో బభ్రుః నీలగ్రీవ స్సుమంగళః!

విలోహితో స్త్వయం శంభో త్వదధిష్ఠాన ఏవహి!!11!!

నమో నమస్తే భగవన్ నీలగ్రీవ మీఢుషే!

సహస్రాక్షాయ శుద్ధాయ సచ్చిదానంద మూర్తయే!!12!!

ఉభయోగార్త్ని యోర్జ్యా యా ధన్వన స్తాం ప్రముంచతామ్!

సంప్రాప్య ధనురన్యేషాం భయాయ ప్రభవిష్యతి!!13!!

అస్మద్భయ వినాశార్థ మధునాభయద ప్రభో!

యాశ్చతే హస్త ఇషవః పరాతా భగవో వాప!!14!!

అవతత్య ధనుశ్చత్వం సహస్రాక్ష శతేషుధే!

ముఖానిశీర్య శల్యానాం శివోనః సుమనా భవ!!15!!

విజ్యం ధనురిదం భూయాత్ విశల్యో బాణవానపి!

అనేశన్నిషవశ్చాపి హ్యాభురస్తు నిషంగధిః!!16!!

కపర్దినో మహేశస్య యది నాభుర్నిషంగధిః!

ఇషవో పి సమర్థాశ్చేత్ సామర్థ్యాతు భయం భవేత్!!17!!

యాతే హేతిర్ధనుర్హస్తే మీఢుష్టమ బభూవ యా!

తయాస్మాన్ విశ్వతస్తేన పాలయ త్వ మయక్ష్మయా!!18!!

అనాతతాయాయుధాయనమస్తే ధృష్ణవే నమః!

బాహుభ్యాం ధన్వనే శంభో నమో భూయో నమో నమః!!19!!

పరితే ధన్వనో హేతిః విశ్వతోస్మాన్ వృణక్తు నః!

ఇషుధిస్తవ యా తావదస్మదారే నిధేహి తమ్!!20!!

హిరణ్య బాహవే తుభ్యం సేనాన్యే తే నమోనమః!

దిశాంచ పతయే తుభ్యం పశూనాం పతయే నమః!!21!!

త్విషీమతే నమస్తుభ్యం నమస్సస్పింజరాయతే!

నమః పథీనాం పతయే బభ్లుశాయ నమోనమః!!22!!

నమో వివ్యాధినేన్నానాం పతయే ప్రభవే నమః!

నమస్తే హరికేశాయ రుద్రాయ స్తూపవీతినే!!23!!

పుష్టానాం పతయే తుభ్యం జగతాం పతయే నమః!

సంసార హేతి రూపాయ రుద్రాయాప్యాతతాయినే!!24!!

క్షేత్రాణాం పతయే తుభ్యం సూతాయ సుకృతాత్మనే!

అహన్త్యాయ నమస్తుభ్యం వనానాం పతయే నమః!!25!!

రోహితాయ స్థపతయే మంత్రిణే వానిజాయచ!

కక్షాణాం పతయే తుభ్యం నమస్తుభ్యం భువంతయే!!26!!

తద్వారి వస్కృతాయాస్తు మహాదేవాయ తే నమః!

ఓషధీనాం చ పతయే నమస్తుభ్యం మహాత్మనే!!27!!

ఉచ్చైర్ఘోషాయ ధీరాయ ధీరాన్ క్రందయతే నమః!28!!

పత్తీనాం పతయే తుభ్యం కృత్స్నవీతాయ తే నమః!

ధావతే ధవలాయాపి సత్త్వనాం పతయే నమః!!29!!

అవ్యాధినీనాం పతయే కకుభాయ నిషంగిణే!

స్తేనానాం పతయే తుభ్యం దివ్యేషు ధిమతే నమః!!30!!

తస్కరాణాం చ పతయే వంచతే పరివంచతే!

స్తాయూనాం పతయే తుభ్యం నమస్తేస్తు నిచేరవే!!31!!

నమః పరిచరాయాపి మహారుద్రాయతే నమః!

అరణ్యానాం చ పతయే ముష్ణతాం పతయే నమః!!32!!

ఉష్ణీషిణే నమస్తుభ్యం నమో గిరిచరాయతే!

కులుంచానాం చ పతయే నమస్తుభ్యం భవాయ చ!!33!!

నమో రుద్రాయ శర్వాయ తుభ్యం పశుపతయే నమః!

నమ ఉగ్రాయ భీమాయ నమశ్చాగ్రేవధాయచ!!34!!

నమో దూరేవధాయాపి నమో హంత్రే నమోనమః!

హనీయసే నమస్తుభ్యం నీలగ్రీవాయ తే నమః!!35!!

నమస్తే శితికంఠాయ నమస్తేస్తు కపర్దినే!

నమస్తే వ్యుప్తకేశాయ సహస్రాక్షాయ మీఢుషే!!36!!

గిరిశాయ నమస్తేస్తు శిపివిష్టాయ తే నమః!

నమస్తే శంభవే తుభ్యం మయోభవ నమోస్తుతే!!37!!

మయస్కర నమస్తుభ్యం శంకరాయ నమోనమః!

నమశ్శివాయ శర్వాయ నమశ్శివతరాయ చ!!38!!

నమస్తీర్థ్యాయ కూల్యాయ నమః పార్యాయతే నమః!

ఆవార్యాయ నమస్తేస్తు నమః ప్రతరణాయచ!!39!!

నమ ఉత్తరణాయాపి హరాతార్యాయ తే నమః!

ఆలాద్యాయ నమస్తేస్తు భక్తానాం వరదాయ చ!!40!

నమశ్శష్ప్యాయ ఫేన్యాయ సికత్యాయ నమోనమః!

ప్రవాహ్యాయ నమస్తేస్తు హ్రస్వాయాస్తు నమోనమః!!41!!

వామనాయ నమస్తేస్తు బృహతేచ నమోనమః!

వర్షీయసే నమస్తేస్తు నమో వృద్ధాయతే నమః!!42!!

సంవృధ్వనే నమస్తుభ్య మగ్రియాయ నమోనమః!

ప్రథమాయ నమస్తుభ్య మాశవే చాజిరాయ చ!!43!!

శీఘ్రిమాయ నమస్తేస్తు శీభ్యాయ చ నమోనమః!

నమ ఊర్మ్యాయ శర్వాయాప్యవస్వన్యాయతే నమః!!44!!

స్రోతస్యాయ నమస్తుభ్యం ద్వీప్యాయచ నమోనమః!

జ్యేష్ఠాయ చ నమస్తుభ్యం కనిష్ఠాయ నమోనమః!!45!!

పూర్వజాయ నమస్తుభ్యం నమోస్త్వవరజాయచ!

మధ్యమాయ నమస్తుభ్యమపగల్భాయ తే నమః!!46!!

జఘన్యాయ నమస్తుభ్యం బుధ్నియాయ నమోనమః!

సోభ్యాయ ప్రతిసర్యాయ యామ్యాయచ నమోనమః!!47!!

క్షేమ్యాయ చ నమస్తుభ్యం యామ్యాయ చ నమోనమః!

ఉర్వర్యాయ నమస్తుభ్యం ఖల్యాయ చ నమోనమః!!48!!

శ్లోక్యాయ చావసాన్యాయావస్వన్యాయ చ తే నమః!

నమో వన్యాయ కక్ష్యాయ మౌన్జ్యాయ చ నమోనమః!!49!!

శ్రవాయ చ నమస్తుభ్యం ప్రతిశ్రవ నమోనమః!

ఆశుషేణాయ శూరాయ నమోస్త్వాశు రథాయ చ!!50!!

వరూథినే పర్మిణే చ బిల్మినే చ నమోనమః!

శ్రుతాయ శ్రుత సేనాయ నమః కవచినే నమః!!51!!

దుందుభ్యాయ నమస్తుభ్య మాహనన్యాయతే నమః!

ప్రహితాయ నమస్తుభ్యం ధృష్ణవే ప్రమృశాయ చ!!52!!

పారాయ పారవిందాయ నమస్తీక్ణేషవే నమః!

సుధన్వనే నమస్తుభ్యం స్వాయుధాయ నమోనమః!!53!!

నమః స్రుత్యాయ పథ్యాయ నమః కాట్యాయ తే నమః!

నమో నీప్యాయ సోద్యాయ సరస్యాయ చ తే నమః!!54!

నమో నాద్యాయ భవ్యాయ వైశంతాయ నమోనమః!

అవట్యాయ నమస్తుభ్యం నమః కూప్యాయ తే నమః!!55!!

అవర్ష్యాయ చ వర్ష్యాయ మేఘ్యాయ చ నమోనమః!

విద్యుత్యాయ నమస్తుభ్యమీథ్రియాయ నమోనమః!!56!!

ఆతప్యాయ నమస్తుభ్యం వాత్యాయచ నమోనమః!

రేష్మియాయ నమస్తుభ్యం వాస్తవ్యాయ చ తే నమః!!57!!

వాస్తుపాయ నమస్తుభ్యం నమస్సోమాయతే నమః!

నమో రుద్రాయ తామ్రాయాప్యరుణాయ చ తే నమః!!58!!

నమ ఉగ్రాయ భీమాయ నమశ్శంగాయ తే నమః!

నమస్తీర్థ్యాయ కూల్యాయ సికత్యాయ నమోనమః!!59!!

ప్రవాహ్యాయ నమస్తుభ్యమిరిణ్యాయ నమోనమః!

నమస్తే చంద్రచూడాయ ప్రపధ్యాయ నమోనమః!!6౦!!

కింశిలాయ నమస్తేస్తు క్షయణాయ చ తే నమః!

కపర్దినే నమస్తేస్తు నమస్తేస్తు పులస్తయే!!61!!

నమో గోష్ఠ్యాయ గృహ్యాయ గ్రహాణాం పతయే నమః!

సమస్తల్ప్యాయ గేహ్యాయ గుహావాసాయ తే నమః!!62!!

కాట్యాయ గహ్వరేష్ఠాయ హ్రదయ్యాయ చ తే నమః!

నివేష్ప్యాయ నమస్తుభ్యం పాగ్oసవ్యాయ తే నమః!!63!!

రజస్యాయ నమస్తుభ్యం పరాత్పర తరాయ చ!

నమస్తే హరికేశాయ శుష్క్యాయ చ నమోనమః!!64!!

హరిత్యాయ నమస్తుభ్యం హరిద్వర్ణాయ తే నమః!

నమ ఉర్మ్యాయ సూర్మ్యాయ పర్ణ్యాయ చ నమోనమః!!65!!

నమోపగుర మాణాయ పర్ణశద్యాయ తే నమః!

అభిఘ్నతే చాఖ్ఖిదతే నమః ప్రఖ్ఖిదతే నమః!!66!!

విశ్వరూపాయ విశ్వాయ విశ్వాధారాయతే నమః!

త్ర్యంబకాయ చ రుద్రాయ గిరిజాపతయే నమః!!67!!

మణికోటీర కోటిస్థ కాన్తిదీప్తాయ తే నమః!

వేదవేదాంత వేద్యాయ వృషారూఢాయ తే నమః!!68!!

అవిజ్ఞేయ స్వరూపాయ సుందరాయ నమోనమః!

ఉమాకాంత నమస్తేస్తు నమస్తే సర్వసాక్షిణే!!69!!

హిరణ్య బాహవే తుభ్యం హిరణ్యాభరణాయ చ!

నమో హిరణ్య రూపాయ రూపాతీతాయ తే నమః!!70!!

హిరణ్యపతయే తుభ్యమంబికాపతయే నమః!

ఉమాయాః పతయే తుభ్యం నమః పాప ప్రణాశక!!71!!

మీఢుష్టమాయ దుర్గాయ కద్రుద్రాయ ప్రచేతసే!

తవ్యసే బిల్వపూజ్యాయ నమః కళ్యాణ రూపిణే!!72!!

అపార కళ్యాణ గుణార్ణవాయ 

శ్రీ నీలకంఠాయ నిరంజనాయ!

కాలంతకాయాపి నమో నమస్తే 

దిక్కాల రూపాయ నమో నమస్తే!!!73!!

వేదాంత బృంద స్తుత సద్గుణాయ

గుణ ప్రవీణాయ గుణాశ్రయాయ!

శ్రీ విశ్వనాథాయ నమో నమస్తే 

కాశీ నివాసాయ నమో నమస్తే!!74!!

అమేయ సౌందర్య సుధానిధాన సమృద్ధి రూపాయ నమోనమస్తే!

ధరాధరాకార నమోనమస్తే ధారా స్వరూపాయ నమో నమస్తే!!75!!

నీహార శైలాత్మజ హృద్విహార ప్రకాశ హార ప్రవిభాసి వీర!

వీరేశ్వరాపార దయానిధాన పాహి ప్రభో పాహి నమోనమస్తే!!76!!


వ్యాస ఉవాచ:

ఏవం స్తుత్వా మహాదేవం ప్రణిపత్య పునఃపునః!

కృతాంజలి పుటస్తస్థౌ పార్శ్వే డుంఠివినాయకః!!

త మాలోక్య సుతం ప్రాప్తం వేదం వేదాంగపారగం!

స్నేహాశ్రుధారా సంవీతం ప్రాహ డుంఠిం సదాశివః!!

ఇతి శ్రీ శివ రహస్యే హరాఖ్యే తృతీయాంశే పూర్వార్ధే

గణేశ కృత రుద్రాధ్యాయ స్తుతిః నామ దశమోధ్యాయః

అనేనా శ్రీ గణేశ కృత శ్లోకాత్మక రుద్రాధ్యాయ పారాయణేన

శ్రీ విశ్వేశ్వర స్సుప్రీత స్సుప్రసన్నో వరదో భవతు!!

అభిషేక ఫలం_AbhisekaFalam


Shiva అభిషేక ఫలం_AbhisekaFalam

    శివుడు అభిషేక ప్రియుడని అందరికీ తెలిసిందే.
 సాధారణంగా క్షీరాభిషేకం, 
పంచామృత అభిషేకం లాంటివి మాత్రమే వింటుంటాం. ఇంకా చాలా రకాల పదార్థాలతో అభిషేకం చేయొచ్చు. 
ఒక్కో పదార్థంతో చేసే అభిషేకానికి 
ఒక్కోరకమైన పుణ్యఫలం దక్కుతుంది. అవేంటంటే... 

ఆవు పెరుగు - ఆరోగ్యం
ఆవు నెయ్యి - ఐశ్వర్యం
చక్కెర - దుఃఖ నాశనం
తేనె - తేజస్సు పెరుగుతుంది.
చెరుకు రసం - ధనవృద్ధి
కొబ్బరి నీళ్లు - సంపదలు పెరుగుతాయి.
విభూతి - పాపనాశనం
పనీరు - పుత్ర లాభం
పుష్పోదకం - భూలాభం
బిల్వజలం - భోగభాగ్యాలు
నువ్వుల నూనె - అపమృత్యు దోషాల నివారణ
సువర్ణోదకం - పేదరిక నివారణ
ద్రాక్షరసం - పనులు నెరవేరుతాయి. ధనలాభం.
ఖర్జూర జలం - సుఖ జీవనం, శత్రుహాని
నేరేడు పండ్ల రసం - కార్య జయం, వైరాగ్యం
కస్తూరీ జలం - శత్రుభయాలు తొలగిపోతాయి. చక్రవర్తిత్వం
సుగంధ జలం - పుత్ర లాభం
గరిక నీరు (దూర్వోదకం) - పోయిన సొమ్ము లభిస్తుంది. 
రుద్రాక్ష జలం - ఐశ్వర్యం
అన్నం - రాజ్యం, ఆయుర్దాయం, సుఖ జీవనం, మోక్షం
పసుపు నీరు - సౌభాగ్యాలు, సకల మంగళాలు
మామిడి పండ్ల రసం - దీర్ఘవ్యాధి నివారణ

యాత్రలెందుకు? Yatralenduku?

యాత్రలెందుకు?  Yatralenduku? Kailash Mansarovar Yatra


యాత్రలెందుకు?

దైవదర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడున్నది శిలా విగ్రహమో, చెక్కబొమ్మో అనుకోకూడదు. దానిలోని దైవత్వాన్ని మనం అనుభూతం చేసుకోవాలి. క్షేత్రాల్లో ఆధ్యాత్మిక చైతన్యం విరాజిల్లుతూ ఉంటుంది. క్షేత్రదర్శనాలకోసం చేసే ప్రయాణాలను తీర్థయాత్రలంటారు. తీర్థయాత్రలకు, విహారయాత్రలకు మధ్య చాలా తేడా ఉంది. నిత్యజీవనంలో కాస్త ఆటవిడుపుకోసం, మానసిక ఆహ్లాదంకోసం చేసేవి విహారయాత్రలు. అవి మనిషిని సేదతీరుస్తాయి. దివ్య ఆధ్యాత్మిక అనుభూతికోసం, ఆత్మసంతృప్తికోసం సంస్కారవంతమైన చిత్తం తీర్థయాత్రలను కోరుకుంటుంది. విహారయాత్రలకు వెళ్ళేటప్పుడు మనిషి మానసికస్థితి ఒకలా ఉంటుంది, పుణ్యతీర్థాలను సేవించేటప్పుడు మరొకలా ఉంటుంది.
మహాభారతం అరణ్యపర్వంలో తీర్థయాత్రలకు వెళ్ళదలచినవారికి ఉండవలసిన యోగ్యతల గురించి భీష్ముడికి పులస్త్యుడు చెబుతాడు. వ్రత నిష్ఠ, శౌచం, ధర్మశుభస్థితి, ఉపవాసదీక్ష వంటి లక్షణాలు వివరించి, అవన్నీ ఉంటే తప్ప, 'తీర్థములాడనేరరు' అంటాడు పులస్త్యుడు. పుణ్యక్షేత్రాలకు వెళ్ళదలచినవారి మానసిక సంసిద్ధత ఎలా ఉండాలో చెబుతాడు.


భారతంలోనే కాదు, శ్రీదేవీభాగవతం వంటి అనేక పురాణాల్లో సైతం మనిషి ముందుగా దీక్ష తీసుకుని మరీ తీర్థయాత్రా సేవనం చేయాలని ఉంది. అలాంటివారిని అన్నమయ్య 'సువ్రతులు'గా వర్ణించాడు. భక్తితో, ఆర్తితో దేవుడి దివ్యసాక్షాత్కార అనుభవం కోసం అర్రులుచాస్తూ ఆతృతగా వెళ్ళాలన్నాడు. తిరుమల గిరుల్లోను, కొండమీద ప్రతీ అణువు పావనం, ప్రతి శిలా సాలగ్రామం, ప్రతి అంశం బ్రహ్మమయం అన్న భావనతో సంతోషంగా వెళ్ళాలి. ఆ రకమైన మానసిక సంసిద్ధతతో వెళ్ళినప్పుడు అద్భుత ఆధ్యాత్మిక అనుభూతి మనిషికి దక్కుతుంది. అంతేతప్ప- సెలవులు వచ్చాయనో, విహారయాత్రలకనో పుణ్యక్షేత్రాలకు వెళ్ళకూడదు. దేవుడి నెలవులు కనుగొనడం కోసం వెళ్ళాలి.


తీర్థయాత్రలకే కాదు, విహారయాత్రలకు సైతం ఒక పద్థతి అవసరం. మానసిక సంసిద్ధత ముఖ్యం. ప్రకృతితో మనిషి బంధం గట్టిపడేందుకు విహారయాత్రలు గొప్పగా ఉపకరిస్తాయి. ఇటీవలి కాలంలో ప్రకృతికీ మనిషికీ మధ్య వైరం బాగా పెరిగిపోయింది. మనిషి చేతిలో ప్రకృతి సర్వవిధాలా నాశనమవుతోంది. సఖ్యత పూర్తిగా చెడిపోయింది. భయంకరమైన కాలుష్యంలో మునిగిపోయి, దేహం మట్టికొట్టుకుపోయి, మన మనసు మసిబారిపోతున్న స్థితిలోంచి ఒకసారి చల్లని మంచుకొండల్లోకి, పచ్చని అడవుల్లోకి, మెత్తని ఇసుక తిన్నెలపైకి వెళ్ళి గడిపితే ఎంత ఆహ్లాదంగా ఉంటుందో వహించండి! తీరిగ్గా కూర్చుని వరిపైరు వయ్యారాలను గమనిస్తూ చేలగట్లపై విహరిస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి!


విహారయాత్రలకు వెళ్ళడమంటే ప్రకృతి సోయగాలను ఆస్వాదించడానికి వెళ్ళాలి. ఒక సీతాకోకచిలుకను చూస్తే- అంత చిన్నజీవి ఎన్నెన్ని రంగులతో ఎంత అందంగా ఉందో కదా అనిపించాలి. ఒక్కరోజుతో తన జీవితాన్ని చాలించే పువ్వు అంత హాయిగా నవ్వుతూ ఎంత పరిమళాన్ని వెదజల్లుతోందో చూసి మనం మురిసిపోవాలి. చక్కగా అల్లుకున్న తమలపాకు తీగలకు ఈ పూటే చిగిర్చిన లేలేత చివురాకు మృదుస్పర్శకు ముందెన్నడో మొలిచిన ముదురాకుల ముతకదనానికి గలతేడా మన చేతికి తెలిసిందంటే- ప్రకృతితో ఇంకా స్నేహం మిగిలి ఉందని అర్థం. మన గుండెలో ఎక్కడో ఓ మూల కాస్త పచ్చదనం ఇంకా మిగిలే ఉందని ధైర్యం. అందుకోసం విహారయాత్రలు! మన హోదాలు, బాధ్యతలు, కష్టాలు, కాలుష్యాలు అన్నింటినీ కాసేపు మరిచిపోయి, కాస్తంత పచ్చిగాలిని హాయిగా పీల్చుకొని ప్రకృతికి ధన్యవాదాలు చెప్పుకోవడం కోసం మనం విహారయాత్రలు తలపెట్టాలి.


తీర్థయాత్రలంటే ఏవేవో నియమాలంటారు, పోనీ విహారయాత్రలన్నా ఆస్వాదిస్తున్నారా అంటే- అదీ సందేహమే! చాలామందికి విహారయాత్రలపట్ల ఆసక్తి, అవగాహన ఉండటంలేదు. గోదావరిలో పాపికొండల విహారయాత్రలకు వందలమంది నిత్యం వెళుతూనే ఉంటారు. కమ్మనిమట్టి వాసనతో మొదలై చల్లని పిల్లగాలులు, గోదావరి తరగల నురుగులు, గాలిలోంచి తేలివచ్చే పట్టిసీమ గుడిగంటల మోతలు, నదికిరువైపులా జనపచేల తెల్లని మొవ్వులు... దూరంగా ఆకుపచ్చని నునుపుకొండలు, పసుపు పచ్చని పూలతో విరగబూసిన నువ్వుచేలు... నీళ్ళను చీల్చుకుంటూ లాంచీ పోతుంటే వచ్చే లయబద్ధమైన సంగీతం, నీలిమబ్బులు, గోదావరి వయ్యారాలు... వీటన్నింటినీ ఆస్వాదించాలి. వాటిని వదిలేసి- ఖరీదైన బోట్లలోని శీతల మందిరాల్లో తలుపులు బిడాయించుకుని పేకాటతో కాలక్షేపం చేసేవాళ్లకు విహార యాత్రలు అక్కర్లేదు. మనిషి తనలోకి ఇంకెప్పుడు తొంగిచూడగలడు? తిరిగొస్తుంటే మళ్ళీ ఎప్పుడో! అన్న బెంగ పుట్టించాలి. వాలిపోయే పొద్దుకు ప్రకృతి అద్దుతున్న వర్ణాలను చూసి మురిసిపోవాలి. గోదావరిలో మునిగిపోతున్న సూర్యుణ్ని చూస్తే- అయ్యో ఈ రోజెంత త్వరగా అయిపోయిందో కదా! అనిపించాలి. తలచుకున్నప్పుడల్లా జ్ఞాపకాలు తియ్యగా చెలరేగి మనసుకు కితకితలు పెట్టాలి. విహారయాత్రలు మనిషి జీవితంలోకి ఇంద్రధనుస్సులోని రంగులన్నింటినీ ఒంపాలి. ఇన్ని వర్ణాలా అని మనిషి అబ్బురపోవాలి. అదీ విహారయాత్రల పరమార్థం! 
సంస్కారశుద్ధి లేకుంటే తీర్థయాత్రలు వ్యర్థం. 
సంతోషసిద్ధి లేకుంటే విహారయాత్రలూ వ్యర్థమే!
- ఎర్రాప్రగడ రామకృష్ణ

ముహూర్త భేదాలు_ Muhoortha_differences


ముహూర్త భేదాలు_ Muhoortha_differences

ముహూర్త భేదాలు

కార్యసాధకుడికి మనోనిశ్చయమే ప్రధానం. శుభాశుభ ముహూర్తాల విచారణ అవసరం లేదు. ఈ దేహం పతనమవుతున్నా సరే, మనోనిశ్చయంతో కార్యాన్ని సాధించాలన్నది తైత్తరీయోపనిషత్‌ సందేశం. కార్యం పవిత్రమైనదే అయితే ఆ కార్యసాధకుడు ముహూర్తబలం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో అంటాడు.

రాయబారానికి వెళుతున్న శ్రీకృష్ణునితో ప్రయాణానికి ముహూర్తం బాగాలేదని పాండవులు సూచిస్తే... 'అయిననూ పోయి రావలె హస్తినకు' అంటాడు కృష్ణుడు. మనం తలపెట్టిన కార్యం స్వప్రయోజనానికి కాకుండా సమాజానికి అవసరమైనదైతే చాలు- అలాంటి కార్యాన్ని ఎప్పుడు ప్రారంభించినా అదే సుముహూర్తమవుతుంది.


కాలం అనేది ప్రాపంచికమైనది. కాలానుగుణంగా తిథి వార నక్షత్రాలు మారుతుంటాయి. పరంలో కాలమనేదే లేదు. ఇహ పరాల్లోని అన్నీ బ్రహ్మమేనని ఉపనిషత్తులు చెబుతున్నాయి. కాలం సైతం బ్రహ్మమే కనుక సుముహూర్తమనీ, దుర్ముహూర్తమనీ భేదాలు లేవు. యద్భావం తద్భవతి అన్నట్లుగా భావాన్ని అనుసరించి మాత్రమే కాలం మనకు గోచరమవుతుంది.


కర్రతో గుర్రం వంటి ఆకారాన్ని తయారుచేసి ఉంచారనుకుందాం. కొంతదూరం నుంచి గమనించినవారికి అది నిజమైన గుర్రంగానే కనిపిస్తుంది. ఆ సమయంలో మన దృష్టికి కర్ర కనబడదు. కర్ర అనే పదార్థం గుర్రం ఆకారంలో లీనమై ఉంటుంది. మనం దగ్గరకు వెళ్లి చూశామనుకోండి. అప్పుడు ఆ ఆకారం మొత్తం కర్రమయమై కనిపిస్తుంది. అంతవరకు కనిపించిన గుర్రం ఆ కర్రలో లీనమైపోతుంది. అదేవిధంగా ఈ భూమిపైన కాలంలో సుముహూర్తం దుర్ముహూర్తంగా కనపడినా, నిశితంగా గమనిస్తే కాలం యావత్తు బ్రహ్మమయమై ఉంటుంది. అలాంటప్పుడు చెడు, మంచి ముహూర్తాలెక్కడివి?


కాల గమనాలన్నీ కాల్పనికాలేనని యముడు నచికేతుడికి చెప్పినట్లుగా కఠోపనిషత్తులో ఉంది. అటువంటి వాక్కుల నేపథ్యంలో తిథి, వార, నక్షత్రాల్లో మంచివి కొన్ని, చెడువి కొన్ని ఉంటాయని ఎలా చెప్పగలం?


జరాసంధుడి వధను లక్షించి శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు బ్రాహ్మణుల వేషంలో మగధకు బయలుదేరతారు. మగధలో అడుగు పెట్టేటప్పుడు అర్జునుడు శ్రీకృష్ణునితో అంటాడు- 'బావా! శత్రువును జయించేందుకు ముగ్గురం బ్రాహ్మణ వేషంలో బయలుదేరాం... బ్రాహ్మణత్రయం శుభం కాదు కదా' అని ప్రశ్నిస్తాడు. శ్రీకృష్ణుడు 'బావా! మూఢ నమ్మకాలు మంచివి కావు. శత్రు సంహారంవల్ల దుష్ట శిక్షణ జరుగుతుంది. జరాసంధుడి మరణ సమయమే మనకు సుముహూర్తం' అంటాడు. జరాసంధుడి వధ నిరాటంకంగా సాగుతుంది.


కాలాలు ముహూర్తాలు అనేవి అత్యంత ప్రభావం కలిగి ఉంటాయి. ముహూర్తాలు ఇలాంటివే! కాల స్వరూప స్వభావాలు ముహూర్త బలాలు ఇలా ఇంటాయని చెప్పడం కష్టమని రఘువంశంలో కాళిదాసు వివరిస్తాడు. సాధారణంగా అష్టమి నవములు మంచి తిథులు కావని భావిస్తారు. నవమి తరవాత దశమి వస్తుంది. దశమి తిథి అన్ని విధాలా మంచి రోజని చాలామంది విశ్వసిస్తారు. మరి శ్రీరామచంద్రుడు శుక్లపక్ష నవమి రోజు ఎందుకు జన్మించాడు? ఆ మరుసటి రోజు చాలా మంచిది కదా! ఇదే ప్రశ్నను దశరథుడు వశిష్ఠుని అడుగుతాడు. అందుకు ఆయన బదులిస్తూ 'రాజా! ఈ మహాపురుషుడు కారణజన్ముడు. కార్యసాఫల్యం కోసం అవతరించినవారికి జన్మించడమే ప్రధానం కాని తిథి, వార, నక్షత్రాలు కాదు. మనోనిశ్చయంతో ఉన్నవాడు కాలానికి సైతం ఎదురీదగలడు. ముహూర్తబలం కన్నా ఆత్మబలం గొప్పది కదా దశరథ మహారాజా!' అంటాడు.


జీవన్ముక్తులకు శుభాశుభ ఘడియలు ఉండవు. మూఢ నమ్మకాలు అవిద్యకు సంకేతమని రమణ మహర్షి బోధించేవారు. పూర్ణచంద్రుడు ఉదయించిన రాత్రినీ, అమావాస్య నిశినీ ఒకే రీతిలో ఆస్వాదిస్తానని ఆయన అనేవారు. 

వశిష్ఠుడు శుభ ముహూర్తమని తలచిన రోజునే శ్రీరాముడు అరణ్యవాసం వెళ్లాడు. 'మంచి రోజని రేపు తలపెట్టిన కార్యాన్ని ఈ రోజే చేసెయ్‌. ఈ రోజు తలపెట్టిన కార్యాన్ని ఇప్పుడే ప్రారంభించు' అంటాడు కబీర్‌! 

సూర్యుడు రోజూ ఉదయిస్తాడు. రాత్రి కాగానే అస్తమిస్తాడు. ఆదిత్యుడికి తిథి, వార, నక్షత్రాల పట్టింపులు లేవు. విధి నిర్వహణే ఆ ఆదిత్యుడికి ముఖ్యం. కార్యసాధకుడెప్పుడూ కాలం కోసం వేచి ఉండరాదు. కార్యం మంచిదైతే కాలం సైతం సహకరిస్తుంది. దుర్ముహూర్తం కూడా సుముహూర్తంగా మారుతుంది!                          - అప్పరుసు రమాకాంతరావు

Rasifalalu_2018_MylavarapuSrinivasaRao

Rasifalalu 2018 MylavarapuSrinivasaRao

Rasifalalu 2018 
 Mylavarapu Srinivasa Rao


 Rasifalalu 2018 MylavarapuSrinivasaRao
 Rasifalalu 2018 MylavarapuSrinivasaRao Rasifalalu 2018 MylavarapuSrinivasaRao

ఏడు రోజుల్లో.. బరువు తగ్గండిలా..._weight loss

weight loss
















డు రోజుల్లో.. బరువు తగ్గండిలా...

బరువు తగ్గడానికి ఎలాంటి డైట్‌ తీసుకోవాలో చెప్పండి అని చాలా ఉత్తరాలు వస్త్తున్నాయి. ముఖ్యంగా ఏడాది చివరకు వచ్చేసరికి బరువు తగ్గడం అత్యంత ముఖ్యమైన పనిగా మారింది. కనీసం కొత్త ఏడాదిలోనైనా బరువు తగ్గాలని ప్రతినబూనుతారు. నిజానికి, బరువు పెరగడానికి అనేక కారణాలు ఉంటాయి. అవి ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఉంటాయి. అందరికీ ఒకే విధమైన ఆహారం పడకపోవచ్చు. ఎవరికి వారు తమ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆహార నియమాలు పాటిస్తూ, బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. అందుకు వారంలోని ఏడు రోజుల డైట్‌ ప్రణాళిక ఉంది. ఎంతోమందికి లాభం చేకూర్చి పెట్టిన ఏడు రోజుల ప్రణాళిక మీ కోసం...

మొదటి రోజు:
కేవలం పండ్లు మాత్రమే తీసుకోవాలి. ఒక్క అరటి పండు తప్ప అన్ని పండ్లూ తీసుకోవచ్చు. గంట గంటకూ తీసుకోవచ్చు.

రెండో రోజు:
కేవలం కూరగాయలు మాత్రమే తీసుకోవాలి. ఉదయాన్నే అల్పాహారంలో ఒక మాదిరి సైజు బంగాళాదుంపను ఉడక బెట్టి తీసుకోవాలి. తరువాత గంట గంటకూ కూరగాయలు ఉడకబెట్టినవి కానీ, పచ్చివి కానీ కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం ఉపయోగించి తీసుకోవచ్చు.

మూడో రోజు:
పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. అరటి పండు, బంగాళదుంప మాత్రం తీసుకోరాదు.
ఈ మూడు రోజులు అయ్యేసరికి ఒంట్లో ఉన్న ఎక్సెస్‌ వాటర్‌ బయటకు వెళ్లిపోతుంది. అదనపు నీరంతా వెళ్ళిపోవడంతో పాటు, మలబద్ధకం పోయి శరీరం తేలిక పడుతుంది. పండ్లు, కూరగాయల్లో బోలెడన్ని యాంటీ ఆక్సిడెంట్లు ఉండడం వల్ల, శరీరం రిపేర్‌ అయ్యి, కాంతిమంతంగా కనపడతారు.

నాలుగో రోజు:
ఆరు అరటి పళ్ళు, దానితో పాటు మూడు గ్లాసుల పాలు (ముప్పావు లీటరు) తీసుకోవాలి. వీటిని మూడు భాగాలుగా చేసి తీసుకోవచ్చు. ఉదాహరణకు రెండు అరటి పండ్లు, వాటితో పాటు ఒక గ్లాస్‌ పాలు చొప్పున ఉదయం అల్పాహారంలో, మధ్యాహ్నం భోజనంలో, అలాగే రాత్రి డిన్నర్‌లో తీసుకోవాలి. మధ్యమధ్యలో క్యాబేజ్‌ క్లియర్‌ సూప్‌ తీసుకోవాలి.

ఐదో రోజు:
నాన్‌ వెజ్‌ తినేవారైతే, అరకిలో చికెన్‌, ఎనిమిది టొమాటోలు కలిపి, కొద్దిగా మసాలా దినుసులు, ఉప్పు, మిరియాలు వేసి బాయిల్‌ చేయాలి. ప్రతి రెండు గంటలకూ కప్పు చొప్పున తీసుకోవాలి. శాకాహారులైతే తోఫూ (సోయా పన్నీర్‌) 300గ్రాముల వరకు తీసుకోవచ్చు (చికెన్‌కు బదులుగా).

ఆరో రోజు:
అయిదో రోజు లాగానే తీసుకోవాలి. కానీ, టొమాటోల బదులుగా కూరగాయలు ఉపయోగించాలి.

ఏడో రోజు:
బ్రౌన్‌ రైస్‌ ఒక కప్‌ + గ్రీన్‌ పీస్‌ కర్రీ + ఒక కప్‌ బత్తాయి రసం (పంచదార లేకుండా). ఇవే మూడు పూటలూ తీసుకోవాలి.

కొన్ని ముఖ్య సూచనలు
నాలుగో రోజు నుండి క్యాబేజ్‌ క్లియర్‌ సూప్‌ తీసుకోవచ్చు.
అయిదు, ఆరో రోజుల్లో నీళ్ళు ఎక్కువగా తీసుకోవాలి.
బ్లాక్‌ టీ, కాఫీలు చక్కెర లేకుండా తీసుకోవచ్చు.
పల్చటి మజ్జిగ, కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు.
ఏడు రోజుల డైట్‌ అయిన తరువాత, రెగ్యులర్‌ డైట్‌లో కొంత నియంత్రణ పాటిస్తే, తగ్గిన
బరువును నిలుపుకోగలుగుతారు.
బీపీ, షుగర్‌ ఉన్నవాళ్ళు, ఇతర జబ్బులున్నవాళ్ళు ఈ డైట్‌ పాటించకూడదు.
మహిళలు ఋతుస్రావ సమయంలో ఈ డైట్‌ను పాటించకూడదు.
నెలకు ఒక్కసారి ఈ డైట్‌ చేయడం వల్ల బరువు క్రమంగా తగ్గుతారు.

డాక్టర్‌ జానకి, న్యూట్రిషనిస్ట్‌






KoddigaAlochinchandi



ఉత్తమం ఉత్తరద్వార దర్శనం_Uttamam uttaradwara darshanam

ఉత్తమం ఉత్తరద్వార దర్శనం Uttara Dwaram Tirumala Venkateswara Swamy TTD Tirupathi


 ఉత్తమం ఉత్తరద్వార దర్శనం
Uttamam uttaradwara darshanam


ఉత్తమం ఉత్తరద్వార దర్శనం Uttara Dwaram Tirumala Venkateswara Swamy TTD Tirupathi
#VaikunthaEkadashi 
#MukkotiEkadashi
ఉత్తమం ఉత్తరద్వార దర్శనం Uttara Dwaram Tirumala Venkateswara Swamy TTD Tirupathi


వైకుంఠ ఏకాదశి_VaikuntaEakadasi #VaikunthaEkadashi #MukkotiEkadashi

వైకుంఠ ఏకాదశి, VaikuntaEakadasi, mukkotieakadasi


వైకుంఠ ఏకాదశి 
ప్రాముఖ్యం గురించి తెలుసా..?


వైకుంఠ ఏకాదశి రోజు అన్నం ముట్టకూడదట...
తింటే వచ్చే ప్రమాదం ఏమిటి

ధనుర్మాసం అత్యంత పవిత్రమైనది. ఆ మాసంలో ఎన్నో పర్వదినాలు. అందులో ఒకటి ముక్కోటి ఏకాదశి. పరమపవిత్రమైన రోజు ఈ ఏకాదశి. ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు. ఆరోజు ముఖ్యంగా వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఉత్తరద్వార మార్గంలో స్వామిని దర్శించుకోవాలని ఆ రోజు భక్తులు ఎంతో ఆరాటపడతారు. వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యంపై ఒక అవలోకనం...

ఒక్క ఏడాదిలో ఇరవైనాలుగు ఏకాదశులు వస్తాయి. ప్రతి ఏకాదశీ పవిత్రమైనదే. అందులో మరీ విశేషంగా పరిగణించే ఏకాదశులు నాలుగు. ఆ విశేష ఏకాదశులలో ఒకటిగా పరిగణించేదే ఈ వైకుంఠ ఏకాదశి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి అంటారు. అసలు ఈ రోజుకు ఎందుకు అంత ప్రాధాన్యం అంటే....


ఉత్తర ద్వార దర్శనం

ముక్కోటి ఏకాదశినాడు తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార భగవత దర్శనార్థం వేచి ఉంటారు. ఈరోజున వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినం. ముక్కోటి ఏకాదశినాడు సాక్షాత్తూ ఆ శ్రీమహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు. అందువల్లనే ముక్కోటి ఏకాదశి అని దీనికి పేరు. మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన ఈ ఏకాదశి పవిత్రత సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. దేవతలు, రాక్షసులు జరిపిన క్షీరసాగర మథనంలో ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. కాలకూటవిషాన్ని పరమేశ్వరుడు తన గరళాన బంధించింది ఆ రోజే. మహాభారత యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించింది కూడా ముక్కోటి ఏకాదశినాడే అనేది ఒక విశ్వాసం. తిరుమల శ్రీవారి పుష్కరిణిలో ఏడాదికి నాలుగు మార్లు మాత్రమే చక్రస్నానం జరుగుతుంది.

ఏడాదిలో ఈ చక్రస్నానాలు జరిగే నాలుగుసార్లూ ముల్లోకాల్లో ఉన్న పుణ్యతీర్థాలు స్వామి పుష్కరిణిలో సూక్ష్మరూపంలో ప్రవేశిస్తాయని విశ్వాసం. అనంతపద్మనాభ వ్రతం రోజున, బ్రహ్మోత్సవాలలో చివరి రోజున, వైకుంఠ ఏకాదశి మరునాటికి ద్వాదశి తిథి ఉన్నరోజు, రథసప్తమి రోజు, స్వామివారికి చక్రస్నానాలు జరుగుతాయి. అందుకే ఈరోజున ప్రత్యేకించి వైష్ణవ ఆలయాల్లో విశేష పూజలు నిర్వహిస్తారు.


ఏకాదశి ప్రాశస్త్యం

వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం గురించిన వివ రణ అనేక పురాణాలలో ఉంది.. పద్మ పురాణం ప్రకారం కృతయుగంలో ‘ముర’ అనే రాక్షసుడు దేవతలను, సాధువులను క్రూరంగా హింసించేవాడు. ఈ మురాసురుని అక్రమాలు, ఆగడాలు భరించలేక దేవతలు మహావిష్ణువును శరణువేడుకున్నారు. దేవతల మొర ఆలకించిన శ్రీమహా విష్ణువు మురాసుర వధకు ప్రత్యేక అస్త్రం అవసర మని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. ఇదే అదనుగా భావించిన మురాసురుడు ఆ గుహలోకి ప్రవేశించి అక్కడ విశ్రమిస్తున్న విష్ణువుని సంహరించేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో శ్రీమహావిష్ణువు నుంచి ఒక శక్తి ఉద్భవించి మురాసురుణ్ణి సంహరించింది. ఈ విధంగా దేవతలను సంరక్షించిన ఆ శక్తికే ‘‘ఏకాదశి’’ అని నామకరణం చేశారు. వైష్ణవ ఆళ్వారులలో ప్రసిద్ధిచెందిన శ్రీనమ్మాళ్వారు కూడా ముక్కోటి ఏకాదశినాడే పరమపదించడం ఒక విశేషంగా చెప్పుకుంటారు. - ముస్త్యాల రామచంద్ర శర్మ, అవధాని


విశేష ఆరాధన 

వైకుంఠ ఏకాదశి రోజు అన్నం ముట్టకూడదు. ముర అనే రాక్షసుడు అన్నం రూపంలో ఉంటాడని ఒక విశ్వాసం అయితే, ఇంకొక కథ ప్రకారం బ్రహ్మ తలనుంచి ఒక స్వేద బిందువు నేలమీదపడి వెంటనే రాక్షస రూపం దాల్చింది. ‘‘ఓ బ్రహ్మదేవ, నాకు నివాస స్థానం చూపించు’’ అని ఆ రాక్షస రూపం ప్రార్థించింది. ఏకాదశినాడు మానవులు భుజించే వరి అన్నంలో ప్రవేశించి తద్వారా వారి ఉదరాల్లో స్థావరం ఏర్పర్చుకోమని బ్రహ్మ ఆ రాక్షస రూపానికి వరం ఇచ్చాడు. అందుకే ఈ రోజు శ్రీ మహావిష్ణువును షోడ శోపచారాలతో ఆరాధించి, చాలామంది ఉపవాసం చేస్తారు.



ఉత్తరం ఉత్తమం

     సంవత్సరానికి పన్నెండు నెలలు. నెలకు రెండు పక్షాలు. పక్షానికి ఒక ఏకాదశి. వెరసి ఏడాదికి ఇరవైనాలుగు ఏకాదశులు. ఒక్కో ఏకాదశికీ ఒక్కో పేరుంది. కానీ, వాటిలో వైకుంఠ ఏకాదశి చేరలేదు. దానికి కారణం. ఇతర ఏకాదశులన్నీ చాంద్రమాన (చంద్రుడి గమనం) గణన ఆధారంగా ఏర్పడినవి. వాటికి భిన్నంగా సౌరమాన (సూర్యుడి గమనం) గణన ఆధారంగా ఏర్పడిందీ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి ధనుర్మాసంలో వస్తుంది. ధనుర్మాసం సూర్య గమనాన్ని బట్టి ఏర్పడుతుంది. మార్గశిరం-పుష్యం ఈ రెండింట్లో ఏదో ఒక మాసంలో వస్తుంది. అదైనా శుక్లపక్షంలో వచ్చే ఏకాదశే వైకుంఠ ఏకాదశి అవుతుంది. 

వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశని, స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారు. ఈ పేర్లు రావడం వెనుక వేర్వేరు కథనాలు పురాణాల్లో కనిపిస్తాయి. విష్ణువు కొలువై ఉన్న వైకుంఠ ద్వారాలు ఈరోజు తెరుస్తారని వైకుంఠ ఏకాదశి అంటారు. దక్షిణాయణంలో యోగనిద్రలోకి వెళ్లిన మహావిష్ణువు ఈ రోజునే మేల్కొంటాడట. ఆ స్వామిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలూ వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. దక్షిణాయణంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారని పురాణ కథనాలు.

ఉత్తర ద్వార దర్శనం 
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా ఆలయంలోకి ప్రవేశించి స్వామిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. దీని వెనుకా అనేకమైన కారణాలు ఉన్నాయి. మధుకైటభులనే రాక్షసులు వేదాలను అపహరించుకుపోతుంటే.. వాటిని రక్షించడం కోసం మహావిష్ణువు వైకుంఠం నుంచి ఉత్తర ద్వారం గుండా వెళ్లాడని, మధుకైటభులను సంహరించి తిరిగి ఉత్తర ద్వారం గుండానే వైకుంఠంలోకి ప్రవేశించాడని చెబుతారు. ఆయన నడిచిన ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకుంటే పుణ్యమని భక్తులు విశ్వసిస్తారు.
- అయ్యగారి శ్రీనివాసరావు







వైకుంఠ ఏకాదశి - ముక్కోటిఏకాదశి

వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు.

ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు.


ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.

వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాదులు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తరువాతి రోజు చేయడం వలన జిహ్వకు భోజనం రుచి తెలుస్తుంది.

తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈనాడు ఉపవసించినవారు పాప విముక్తులవుతారంటారు. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం.

ఔషధం సేవించేటప్పుడు అనుపానంగా చేయవలసిన పథ్యమే ఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం; దైవానికి దగ్గరవాలనేదే ఉపవాసంలోని ఆశయం. పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రతం నియమాలు : 1. దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. 2. ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. 3. అసత్య మాడరాదు. 4. స్త్రీ సాంగత్యం పనికి రాదు. 5. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. 6. ఆ రోజు రాత్రంతా జాగరణ చేయాలి. 7. అన్నదానం చేయాలి.





కన్నిస్వామి_kanneswamy

kanneswamy ptaithulli erumeli vavarswamy ayyappaswamy sabalimala


కన్నిస్వామి

     స్వామి అయ్యప్ప దీక్షను ప్రథమంగా చేపట్టి, శబరిమల యాత్ర సాగించే భక్తుణ్ని ‘కన్నిస్వామి’ అంటారు. ఆ దీక్షను నియమబద్ధంగా చేయించి, యాత్రకు తీసుకువెళ్లే గురువును ‘గురుస్వామి’గా భావిస్తారు.

అనేక పర్యాయాలు యాత్రలు నిర్వహిం చడంతో పాటు సదా ఆధ్యాత్మిక చింతన, భక్తిభావన కలిగి; నాయకత్వ లక్షణాలున్నవారే ఉత్తమ గురుస్వామిగా రాణిస్తారు. అదే గురువు నేతృత్వంలో ధార్మిక అక్షరాభ్యాసం చేసి, కొత్తగా బడిలో చేరి చదువుకునే విద్యార్థి వంటివాడు కన్నిస్వామి!

అతడు దైవం పైనే మనసు నిలిపి, గురుస్వామి మాట తు.చ. తప్పక పాటించి, భక్తిశ్రద్ధలతో దీక్ష సాగించాలి. అప్పుడే ఆ కన్నిస్వామికి నూతన శక్తి, ఉత్సాహం కలుగుతాయి. అటువంటివారు యాత్రాబృందంలో ఎంత ఎక్కువమంది ఉంటే, అంత బాగా లక్ష్యం నెరవేరుతుందంటారు. అందుకే ఎప్పుడూ మితంగా, సత్యసమ్మతంగా మాట్లా డాలని గురుస్వామి ముందుగానే సూచిస్తుంటారు. దీక్షలో, యాత్రలోనూ స్వామి శరణాలే తప్ప ఇతర చింతనలు మనసులోకి రానివ్వరాదని చెబుతుంటారు. ఆ సూచనలనే కన్నిస్వాములు అక్షరాలా పాటిస్తుంటారు.

హరిహర సుతుడైన మణికంఠుడు తన తల్లికి వైద్యం కోసం ప్రయత్నిస్తాడు. పులిపాలు ఔషధమన్న రాజవైద్యుల సూచనను అనుసరించి, ఒంటరిగా అడవులకు పయనమవుతాడు. మార్గమధ్యంలో ఎరుమేలి వద్ద ఎదురైన బందిపోటు నేరస్వభావాన్ని ఆయన అణచివేస్తాడు. పాదాక్రాంతుడైన ఆ వ్యక్తితో కలిసి సంప్రదాయ నృత్యం సాగించి, విందు ఆరగించి, ఆ రాత్రికి అక్కడే విశ్రమిస్తాడు.

అందువల్ల ఇప్పటికీ శబరిమల యాత్రికులు ఎరుమేలిలో మజిలీ చేస్తారు. నృత్యం అనంతరమే యాత్ర కొనసాగిస్తారు. అలా దీక్ష చేసేవారు తమలో ఇంకా ఏదైనా అహంకారం మిగిలి ఉంటే, దాన్ని అక్కడికక్కడే త్యజించాలి. వారు స్వామికి పూర్తిగా శరణాగతులు కావాలన్నదే ఇందులోని అంతరార్థం.

ఆనాడు మణికంఠుడు ఎరుమేలి నుంచి అళుదామేడు చేరేసరికి, గగనమార్గంలో విహరించే రక్కసి కనిపిస్తుంది. అవతార స్వరూపుడైన ఆయన దానితో పోరాడి సంహరించి, శాపవిమోచన కలిగిస్తాడు.

ఆమె పూర్వం దత్తాత్రేయుడి భార్య లీలావతి అని, శాపవశాత్తు రాక్షసిగా జన్మించిందని లోకానికి ఆయన ఎరుకపరుస్తాడు. శాపవిముక్తితో సుందరిగా మారిన ఆమె- మణికంఠుడితో వివాహం కోరుతుంది. ఆయన సమ్మతించడు. ఆమె పదేపదే ప్రాధేయపడటంతో, ఇక ఏ సంవత్సర మైనా కన్నిస్వాములు యాత్రకు రాకపోతే ఆ ఏడాది వివాహం చేసుకుంటానని మాటిచ్చినట్లు చెబుతారు. శబరిమలలో మాలికపురత్తమ్మ పేరిట పూజలు అందుకొనేలా అయ్యప్పస్వామి వరమిస్తాడని, ‘భూతనాథోపాఖ్యానం’ విశదీకరిస్తుంది.

మకర సంక్రాంతినాడు శబరిమలలో రాత్రి పదిగంటల వేళ, ఏనుగు అంబారీపై మాలికపురత్తమ్మను వూరేగిస్తారు. కన్నిస్వాముల ప్రాంతమైన ‘శరంగుత్తి’ వరకు తీసుకువెళతారు. కన్నిస్వాములంటే అయ్యప్పకు సర్వదా ప్రీతి అంటూ ఇప్పటికీ వారికి సమధిక ప్రాధాన్యమిస్తుంటారు. స్వామి శరణం.
- మహాభాష్యం నరసింహారావు

2021-22 telugu Calender | telugu calender



kalachakram gantala panchangam

pls clik 













MadhuraPanchangam2018-19


mohan publications price list