కార్యాలయానికి కావచ్చు.. చిన్నచిన్న కార్యక్రమాలకు కావచ్చు.. చూడ్డానికి సింపుల్‌గా ఉండే చీరలే సౌకర్యంగా ఉంటాయి. అందుకు ఆధునికంగా, అందంగా తీర్చిదిద్దిన ఈ ఫ్యాన్సీ చీరలు చక్కని ఎంపిక. తేలికగా, ఆకట్టుకునే రంగుల్లో వినూత్నంగా డిజైన్ చేసిన ఈ చీరలు మీ వార్డ్‌రోబ్‌లోకి చేర్చుకోవడమే ఆలస్యం!
పసుపు రంగు ఫ్యాన్సీ చీరపై పరుచుకున్న పొద్దుతిరుగుడు పువ్వు మోటిఫ్‌లూ.. జామెట్రిక్ తరహాలో డిజైన్ చేసిన కొంగు ప్రత్యేకం.
|
పండు మిరప వర్ణంలో ప్రత్యేకంగా మలచిన చీరకు.. తులిప్ పువ్వుల డిజైన్‌తో తీర్చిదిద్దిన అంచు అద్భుతం.
|
మామిడి మోటిఫ్‌లతో డిజైన్ చేసిన నీలం రంగు చీర.. కొంగుకు వేలాడే టాసిల్స్ అదనపు అందం.
|
సంప్రదాయ వర్లీ మోటిఫ్ ప్రింట్లతో రూపొందిన ఫ్యాన్సీ చీరకు ఆకట్టుకునే గీతల అంచు.
|
FOLLOW US ON:---
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565