MohanPublications Print Books Online store clik Here Devullu.com

BrahamaSri Chaganti Koteshwara Rao Sharma books - బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ గ్రంథాలు


బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శర్మ గ్రంథాలు

BrahamaSri Chaganti Koteshwara Rao Sharma books 



Chaganti Koteswara Rao in August 2015.JPG
చాగంటి కోటేశ్వరరావు
జననం
చాగంటి కోటేశ్వరరావు
నివాస ప్రాంతం
ఇతర పేర్లు
ప్రవచన చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర
వృత్తి
ప్రభుత్వ ఉద్యోగి (ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా)
మతం
హిందూమతము
భార్య / భర్త
సుబ్రహ్మణ్యేశ్వరి
పిల్లలు
షణ్ముఖాంజనేయ సుందర శివ చరణ్ శర్మ ,
నాగ శ్రీ వల్లి
తండ్రి
చాగంటి సుందర శివరావు
తల్లి
సుశీలమ్మ


చాగంటి కోటేశ్వరరావు కాకినాడ వాస్తవ్యులు. ఈయన తండ్రి చాగంటి సుందర శివరావు, తల్లి సుశీలమ్మ. 1959జూలై 14వ తేదిన ఈయన జన్మించారు . . కోటేశ్వరరావు సతీమణి సుబ్రహ్మణ్యేశ్వరి. వీరికి ఇద్దరు పిల్లలు; శ్రీ శారదా మాత అనుగ్రహముతో అనితర సాధ్యమైన ధారణ పటిమతో అనర్గళమైన ప్రవచనములకు ఆయనకు ఆయనే సాటి. మానవ ధర్మం మీద ఆసక్తితో అష్టాదశ పురాణములను అథ్యయనము చేసి, తనదైన శైలిలో సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో ప్రవచనాలను అందిస్తూ, భక్త జన మనసులను దోచుకున్నారు. ఉపన్యాస చక్రవర్తి, శారదా జ్ఞాన పుత్ర, ఇత్యాది బిరుదులను అందుకున్నారు.
మండల దీక్షతో 42 రోజుల పాటు సంపూర్ణ రామాయణమును, 42 రోజుల పాటు భాగవతాన్ని, 30 రోజుల పాటు శివ మహా పురాణాన్ని, మరియు 40 రోజుల పాటు శ్రీ లలితా సహస్ర నామ స్తోత్రమునుఅనర్గళంగా ప్రవచించి పండిత, పామరుల మనసులు దోచుకొని, విన్నవారికి అవ్యక్తానుభూతిని అందిస్తున్నారు. కాకినాడ పట్టణ వాస్తవ్యులనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నఎంతో మంది తెలుగు వారికి తనదైన శైలిలో ఎన్నో అమృత ప్రవచనములు అందజేయుచున్నాడు.     


శ్రీ మద్రామాయణము
Srimadramayanam
Rs:750/-


About This Book


అయనము అంటే నడకకాలము ఉత్తరాయణముదక్షిణాయనము అని రెండుగా నడుస్తుంది
రెండు పాదములు అనగా రెండుకాళ్ళు లేవనుకోండి అపుడు మనం నడిచే నడక కుంటినడకసక్రమంగా నడవలేముఅలాగే రామచంద్రమూర్తి రెండుకాళ్ళు బాహ్యంలో ఉండే కాళ్ళుకావుఆయన సత్యాన్నిధర్మాన్ని రెండిటినీ రెండు పాదములుగా పెట్టుకొని నడిచాడుఅందుకని ఏదిపోనివ్వండి ఆయన లక్ష్యపెట్టలేదుఎంతటి కష్టం రానివ్వండి ఆయన బెంగపెట్టుకోలేదుసత్యముధర్మము రెండిటిని మాత్రము ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదుసత్యధర్మములను నమ్ముకొన్నవానిని  రెండూ ఎలా కాపాడతాయో రామాయణం మనకు చూపిస్తుంది.

శ్రీ సుబ్రహ్మణ్య వైభవం
Subrahmanya Vybhavam
Rs:40/-



About This Book



సుబ్రహ్మణ్య అవతారం ఎంత ఉత్కృష్టమైనదంటే  స్వామి అవతరించడంకోసం ముప్ఫైమూడు కోట్లమంది దేవతలూ కన్నులు కాయలుకాచేటట్లు ఎదురుచూశారు.  వాల్మీకి మహర్షి శ్రీమద్రామాయణాన్ని 24000 శ్లోకాలలో రచించారుఅ౦త చెప్పిన మహర్షి రామాయణ౦లో  ఘట్టానికీ కూడా ఫలశ్రుతి చెప్పడానికి ఇచ్చగి౦చలేదుకొన్ని స౦దర్భాలకి మాత్రమే ఫలశ్రుతి చెప్పారుఅలా చెప్పినవాటిలో శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి జనన౦ ఒకటి.

శ్రీ శివమహాపురాణము
Sri Sivamahaapuranam
Rs:500/-
       

About This Book


ప్రవచనము
శివ”, ”శంకర”, ”శంభుః నామములన్నీసుఖముఅను శబ్దమునే నిర్వచిస్తాయి. ”జ్ఞాన దాతా మహేశ్వరః” – శివుడు జ్ఞానకారకుడు. సమస్త కళలు ఆయన నుండే ఆవిర్భవించినవి. ఆయనే సకల విద్యలకూ ఆలవాలము. సమస్త వికారములకూ, అరిషడ్వర్గములకూ అతీతుడై, నిత్యము ప్రశాంతముగా ఉండే మూర్తి శంకరుడు. అందుకేసదా శివఅన్న నామము ఒక్క శంకరునికే అన్వయం అవుతుంది. అటువంటి పరమేశ్వరుని గూర్చిన అనేక విషయములుశ్రీ శివమహాపురాణములో వివరింపబడినవి


సౌందర్యలహరి
Soundaryalahari
Rs:75/-



About This Book


శంకరభగవత్పాదులు కైలాసపర్వతం మీద ఉండే పార్వతీపరమేశ్వరుల దర్శనం కోసమని వెళ్ళారు. అపుడు పరమశివుడు వారికి ఆయిదు ఆత్మలింగాలను ప్రసాదించారు. అవే ఇప్పటికీ శృంగేరీపీఠంలో, కంచిపీఠంలో, కేదార్లో, నాల్గవది నేపాల్లోని నీలకంఠేశ్వరాలయంలో, అయిదవది చిదంబరంలో ఉన్నాయి. ఆయన అయిదు లింగాలూ కూడా  భూమి మీదికి తీసుకువచ్చి అయిదుచోట్ల ప్రతిష్ఠించారు.
దశావతారాలు
Dasaavataaralu
Rs:150/-



About This Book


దశావతారాలు అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే పరమేశ్వరుడు అవతారాలు ఎందుకు స్వీకరిస్తాడు, దశావతారాలు అని పది అవతారాలు ఎందుకు విశిష్టతను పొందాయి? అన్న విషయం మీద మనకు ఒక సంగ్రహమైన అవగాహన ఏర్పడుతుంది. తార అన్న మాటకి వ్యతిరేకపదం అవతార. తార అంటే నక్షత్రం కాదు. తార అంటే ముత్యం. ఎంత నైర్మల్యంతో, మలినం లేకుండా శుద్ధమైనదిగా ఉంటుందో అంత శుద్ధమైనది అని ఒక అర్థం. తరింపచేసేది కాబట్టి తార అని రెండవ అర్థం.

కార్తికమాస వైభవము
Kartheekamaasam Vybhavam
Rs:70/-



About This Book


బ్రహ్మముహూర్తం కొద్దిగా దాటిన కాలం కార్తికమాసం. కార్తికమాసంలో అన్నీ ముఖ్యమైనవే. అందరికి అవకాశం ఇచ్చే ఉపాసనాకాలం కార్తికమాసం. కార్తికమాసంలోనే ద్వాదశిదీపాలు, కార్తికపౌర్ణమి, కార్తికదీపం, కార్తికస్నానం అన్నీ. అవకాశాన్ని అందరం వినియోగించుకోవాలి.

శృంగేరి జగద్గురు వైభవం
Srigeri Jagadguru Vybhavam
Rs:50/-



About This Book


రాక్షసులు ఎక్కడ ఉంటారు. అని అడిగితే కలిపురుషుడు ప్రవర్తిస్తున్న విశేషాన్ని పురస్కరించుకుని మనుష్యుల మనసులలోనే రాక్షసులు ఉంటారు. మనుష్యుని ప్రవర్తన రాక్షసత్వంతో కూడుకుని ఉంటుందో మనుష్యులందరినీ సంహరించవలసి ఉంటుంది. పరీక్షిత్ మహారాజు కలి పురుషునకు ఇచ్చిన ఐదు స్థానాలకు మరి ఐదు స్థానాలు ఏర్పడి లోకం అంతటా కలి విజృంభణం ఉన్న సందర్భం. పాపం చేసిన వాళ్ళను, ధర్మానికి విఘ్నం కలిగిస్తున్న వాళ్ళను నేను సంహారం చేస్తానని పరమేశ్వరుడు అవతారం స్వీకారం చేస్తే కలియుగంలో ఎంత మందిని మిగల్చాలి? ఎంత మందిని తెగటార్చాలి? కృష్ణ పరమాత్మ చేసిన ప్రతిజ్ఞ ఆయనకే ఇబ్బందికరం అవుతుంది. శివ కేశవుల మధ్య విధమైన భేదం లేదు కనక మనుష్యుల మనసులలో తిష్ఠ వేసి కూర్చున్న రాక్షసత్వాన్ని బోధ చేత తరిమి కొట్టి మనుష్యుడు మనుష్యుడుగా బతకగలగడానికి, శరీరంతో ఉత్కృష్ట కర్మ చేసి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తిరహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని పొందడానికి, పరమశివుడు శంకర భగవత్పాదులుగా భూమి మీద అవతరించాడు. ఆయన వచ్చేసరికి కలిపురుషుని విజృంభణం చేత సనాతనమైన ధర్మానికి ప్రమాణమైన వేదం ప్రామాణ్యం సన్నగిల్లి అనేక వాదనలు ప్రబలి పోయాయి. అటువంటి సందర్భంలో పరమ శివుడు శంకరాచార్యుడిగా అవతార స్వీకారం చేసాడు. కృష్ణుడు, పరమశివుడు జ్ఞానం అందిస్తారు.

శ్రీశంకర జీవితం - ప్రవచనం
Sri Sankara Jeevitham- Pravachanam
Rs:50/-



About This Book


శంకర భగవత్పాదులు పరమ కారుణ్యులు. వారు గొప్ప జ్ఞాని. సాక్షాత్తు శివావతారులు. అటువంటి వారికి ఎంత కరుణ చూడండి. మీరు కనకధారా స్తోత్రమే ఉదాహరణ తీసుకోండి. శంకరాచార్యులవారు కనకధారాస్తోత్రం తనకు ఒక గుప్పెడు అన్నం పెట్టమని చేశారా? చెయ్యలేదు. మనందరికీ అన్నం పెట్టమని అన్నపూర్ణాష్టకం చేసి ఆయనేం కోరుకున్నారు అమ్మాజ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాందేహిచపార్వతీఅన్నారు. అమ్మా జ్ఞానవైరాగ్యాలను కటాక్షించు అన్నారు. ఎన్నో స్తోత్రాలనిచ్చారు. అటువంటి శంకరులు ఒక బ్రాహ్మణ గృహిణికి ఉపకారం చెయ్యాలని కనకధారాస్తోత్రం చేశారు.
తిరుమల విశిష్టత
Tirumala Visishtatha
Rs:35/-




About This Book


శ్రీ వేంకటాచలపతి కలియుగంలో సమస్త ప్రపంచాన్నీ నిర్వహించే దక్షత, బాధ్యతని స్వీకరించిన స్వరూపం. శ్రీ వేంకటేశ్వర వైభవం సామాన్యమైన విషయం కాదు. ఆయన పేరే వేంకటేశ్వరుడు. మిగిలిన అవతారాలకూ వేంకటేశ్వర అవతారానికీ ఒక ప్రధానమైన భేదం ఉంది. మిగిలిన అవతారాలలో ఆయనకు రకరకాలైన పేర్లు వచ్చాయి. మత్స్య, కూర్మ, వామన, నృసింహ, కృష్ణ, రామావతారాలెన్ని వచ్చినా, ఆయా అవతారాలలో స్వామికి తన గుణాలను ఆవిష్కరించడం చేత ఒక ప్రత్యేకమైన నామంచేత పిలువబడ్డాడు. కలియుగంలో పిలువబడే పేరు వేంకటేశ్వరుడు. ఆయన తీసుకునేది కూడా తల వెంట్రుకలు. చాలా చిత్రమైన విశేషం. వేంకటేశ్వరుడు అన్న పేరులోనే ఉంది రహస్యమంతా.

దేవీ నవరాత్రులు
Devi Navarathrulu
Rs:150/-



About This Book


శరన్నవరాత్రులు శరద్ ఋతువు నందు మనం జరుపుకునే నవరాత్రులు కనుక పేరు వచ్చింది. నవరాత్రులకు ఖ్యాతి, పవిత్రత దేనివల్ల కలిగాయి? శరదృతువు నందు నల్లటి మేఘాలు ఉండవు. దూదిపింజలలా తెల్లటి మేఘాలు ఆకాశమంతా ఆవరించి అత్యంతవేగంగా వెళ్ళిపోతుంటాయి. జగత్తుకి మేఘ స్వరూపం చెయ్యవలసిన ఉపకారం శ్రావణ, భాద్రపద మాసాలలో విశేషమైన వర్షాలు పడటమనే రూపంలో పూర్తయిపోతుంది. తమ దగ్గర ఉన్నదంతా వర్షించి వెళ్ళిపోతున్న మేఘాలను చూసి ఒక నమస్కారం చేస్తాం. మీదంతా మాకిచ్చి మా అభ్యున్నతిని అపేక్షించి మేం కృతజ్ఞత చెప్పామా, చెప్పలేదా? అన్నది కూడా చూసుకోకుండా, ఎక్కడో సముద్రంలో ఉన్న ఉప్పు నీటిని తాగి చల్లటి నీటిని మాయందు వర్షించి మీరు నిరాధారమైన ఆకాశంలో వెళ్ళిపోతున్నారు.




శివ స్తోత్రం

Sivastotram
Rs:75/-

About This Book


 నారాయణునికి నారాయణికి అభేదం. సిద్ధాంతం చాలా విచిత్రంగా ఉంటుంది. శివుని భార్య శివాని. రుద్రుని భార్య రుద్రాణి. భైరవుని భార్య భైరవి. నారాయణి పేరు చెప్పినప్పుడు నారాయణుని భార్య అనకూడదు. నారాయణుని చెల్లెలు నారాయణి. వాళ్ళు ఇద్దరు ఒక్కలా ఉంటారు. ఇద్దరూ అలంకారప్రియులు, ఏవిధంగా నారాయణుడు పరమశివుని శరీరంలో సగభాగాన్ని పొందాడో అదేవిధంగా నారాయణి అయిన అమ్మవారు పరమశివుని శరీరంలో సగభాగాన్ని పొందడానికి శ్రీమన్నారాయణుని వద్ద ఉపదేశం పొందినది. మనకు అనుమానం రావచ్చు, శ్రీమన్నారాయణుడు అప్పటికే సగం శరీరాన్ని పొందితే మిగిలిన శరీరం అమ్మవారు పొందితే మరి శివునికి అస్తిత్వం ఏది? ఒక సగం నారాయణుడు. ఒక సగం అమ్మవారు. శివుడు అలా ఎలా ఇస్తాడు? అంటే అది ఒక పదార్థంవలె శరీరాన్ని కత్తిపెట్టి కోసెయ్యడం కాదు. దాని వెనక ఒక ఆధ్యాత్మికమైన రహస్యం ఉంటుంది. ఎంతమంది ఎక్కినా పుష్పక విమానంలో ఒకరికి చోటు ఉంటుంది అంటారు. అలా ఎంతమంది పరమాత్మలోకి చేరుతున్నా పరమాత్మలో అవకాశం ఉంటుంది. మూర్తి స్వరూపం మారుతుంటుంది. అమ్మవారు పక్కన చేరితే 14 వది అయిన అర్ధనారీశ్వరస్వామి. 13 స్వరూపం హరిహరమూర్తి. పరమశివునికి 63 లీలా మూర్తులు ఉన్నాయి.

శంకర విజయం
Sankara Vijayam
Rs:30/-

About This Book


శంకర విజయం
ద్వైతం అంటే రెండు. రెండు కానిది అద్వైతం. అంటే ఒకటి. మనకు ఉన్న జ్ఞానం ఒకటే. దీన్ని ప్రచారంలోకి తీసుకువచ్చిన మహానుభావుడు శంకరుడు. ఆయన కారణజన్ముడు. మన పుట్టుకకూ, మహానుభావుల పుట్టుకకు మధ్య వ్యత్యాసం ఉంటుంది. మనం గత జన్మలలో చేసిన పాపపుణ్యాల ఫలితాలను అనుభవించటం కోసం, ప్రాకృతమైన శరీరంలో ప్రవేశించి, కర్మ ఫలితాన్ని సుఖంగా, దుఃఖంగా అనుభవిస్తుంటాం. కానీ శంకరుడు సాక్షాత్తు సదాశివుడే. ‘‘పరిత్రాణాయ సాధూనాం, వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ, సంభవామి యుగే యుగే...’’ అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెబుతాడు. ధర్మానికి ఇబ్బంది కలిగినప్పుడు, ధర్మ సంస్థాపన కోసం ఈశ్వరుడు రకరకాల అవతారాలలో ప్రత్యక్షమవుతాడు. కొన్ని సార్లు భక్తి జ్ఞాన వైరాగ్యాల ప్రబోధాలు చెయ్యడం కోసం కూడా అవతరిస్తాడు. అలా శంకరభగవానులు స్వీకరించిన ఉత్కృష్టమైన అవతారాలలో ఆదిశంకరుడి అవతారం కూడా ఒకటి.

శ్రీకామాక్షీ వైభవం
Sri Kamakshi - Vybhavam
Rs:50/-


About This Book


ఒక కంటిలో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని తన దృష్టిప్రసారం చేత అనుగ్రహించగలిగిన తల్లి. కేవలం ఆవిడ చూపు పడితే చాలు, సరస్వతీ కటాక్షం కావాలనుకున్న వాళ్లకు సరస్వతీ కటాక్షం, లక్ష్మీకటాక్షం కావాలనుకున్నవాళ్ళకు లక్ష్మీకటాక్షం. ఒకటి గమనించాలి. రెండుకళ్ళు తిప్పి చూస్తున్నప్పుడు వస్తువుని చూస్తున్నామో. వస్తువుని రెండుకళ్లతో చూస్తాం తప్ప ఒక కంటితో చూసి ఒక కన్ను మూసివేయడం, ఒక కంటితో చూడకపోవడం అన్నది ఉండదు. రెండు కళ్ళూ కలిసే చూస్తాయి. ఎవరు కామాక్షి అనుగ్రహానికి పాత్రులు అవుతారో వారు సరస్వతీ, లక్ష్ముల కటాక్షానికి పాత్రులు అవుతారు. లక్ష్మీకటాక్షమన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. లక్ష్మీకటాక్షమంటే విపరీతమైన ఐశ్వర్యం అని అర్థం కాదు. లక్ష్మి అంటే గుర్తు. గుర్తించబడటానికి వీలుగా ఉంటాడు. దేని చేత అంటే, ఆయనకు ఉండవలసిన ఐశ్వర్యం ఏమిటి అంటే, వేళకు తినవలసిన పదార్థానికి అమ్మవారు లోటు రానివ్వదు. సమయానికి కావలసిన అన్నం సమయానికి అందుతుంది. సమయానికి కావలసిన సౌకర్యం సమయానికి అందుతుంది. సరస్వతీ కటాక్షం కావాలి అనుకున్నవాళ్ళకు సరస్వతీ కటాక్షం కలుగుతుంది.

సనాతన ధర్మం
Sanathana Dharmamu
Rs:70/-


About This Book


కడుపులోకి అన్నంతింటే శరీరమంతా శక్తి ప్రసరిస్తుంది. మీ ఊరికంతటికీ కావలసిన విద్యుత్తు- ఒక చోట విద్యుత్ గృహం ఉంటుంది ఊరికి చివరలో, పవర్ హౌస్ అంటుంటారు. అక్కడ నుంచి శక్తి ప్రసారమవుతుంది. అన్నిచోట్లకీ విద్యుత్తు వస్తోంది. అలాగే మనుష్య శరీరంలో కడుపులోకి తీసుకున్న అన్నం పచనమై, జీర్ణమై అందులో నుండి ఉద్భవించిన శక్తి శరీరానికంతటికీ అందుతోందా అందట్లేదా, అలాగే భరతవర్షే, భరతఖండే, జంబూద్వీపే. ఇక్కడ చేసిన కర్మానుష్ఠానం, ఇక్కడ చేసే యజ్ఞయాగాది క్రతువులు, ఇక్కడ చేసేధర్మాచరణాల వల్ల ప్రపంచంలో ఉన్న మనుష్యజాతి అంతా ఉద్ధరించబడుతూ ఉంటుంది. అంత గొప్ప అధికారం ఇవ్వబడిన ప్రాంతం భూమండలంలో ఇదొక్కటే.’

గోమాత వైభవం
Gomaatha Vybhavam
Rs:25/-


About This Book


లోకంలో మనకి తల్లులు నాలుగు స్వరూపాలుగా ఉంటారని చెపుతుంది శాస్త్రం. అందులో ఒకటి జనకమాత. అంటే శరీరాన్ని ఇచ్చిన తల్లి. రెండవ వారు భూమాత. భూమి తల్లి. రెండవది శ్రీమాత. నాలుగవది గోమాత. అందుకనే నలుగురుగా ఉంటుంది. ఇందులో చాలా చాలా గమనించతగ్గ విషయమిటంటే వేదం ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని ప్రకటించింది. ఒక వస్తువుని దానం చేసారనుకోండి. ఒక పంచెల చాపు పట్టుకువెళ్ళి ఎవరికో దానం చేసారనుకోండి ''ఇదం మమ'' అంటూ. మీరు ఒక పంచెల చాపు దానం చేసారని మీ ఖాతాలో వేస్తారు. రెండు పళ్ళు ఇచ్చారనుకోండి. మీ ఖాతాలో రెండు పళ్ళిచ్చారని వేస్తారు. ఒక ఆవుని ఇస్తే 1000 ఆవులు ఇచ్చారని ఖాతాలో వేస్తారు ఎందుచేత అంటే వేదం గోమాత విషయంలో అంత విశాలహృదయంతో మాట్లాడింది. మరి 1000 గోవులు ఇచ్చిన ఫలితం మీ ఖాతాలో వేశారనుకోండి. మరి పుచ్చుకున్నవాడి ఖాతాలో కూడా 1000 పుచ్చుకున్న ఫలితం పడుతుందా? కచ్చితంగా పడుతుంది. అన్ని గోవులు దానం పుచ్చుకున్నపుడు ఆయన తేజస్సు క్షీణిస్తుంది. కాబట్టి ఆయనెంత గాయత్రి చెయ్యాలి? లౌకికంగా చూసినపుడు వచ్చింది ఒక గోవు. కానీ ఆయన ఆధ్యాత్మికపు ఖాతాలో మాత్రం 1000 గోవులు దానం పట్టినట్టు వేస్తారు. వేదం అంది ఒక్క గోదానం పుచ్చుకున్నపుడు మాత్రం నీళ్ళు విడిచి పెట్టి గోదానాన్ని పుచ్చుకుంటే పుచ్చుకున్న ఉత్తరక్షణంలో అక్కడ ఉండకుండా పక్కకివెళ్ళి కొంతసేపు ఒక మంత్రం జపం చేయమని చెప్పింది. జపం చేస్తే తప్ప వేరు గోవులు పుచ్చుకున్న స్థితిపోదు. మంత్రజపం చేస్తే ఒక్క గోవు పుచ్చుకున్న స్థితిని అతని ఖాతాలో వేస్తారు. మీకు మాత్రం 1000 గోవులు ఇచ్చినట్లు వేస్తారు.

దుర్గా వైభవం
Durgavybhavam
Rs:75/-


About This Book


విశేషమేమిటంటే తొమ్మిది రాత్రులు దుర్గనే ఉపాసన చేస్తారు. దుర్గని ఉపాసన చేసేటప్పుడు మొదటి మూడు రోజులు కాళీ స్వరూపంగా, మధ్యలోని మూడు రోజులు మహాలక్ష్మీ స్వరూపంగా, చివరి మూడు రోజులు సరస్వతీ స్వరూపంగా ఉపాసన చేస్తారు. అలా చేయడంలోని ఆంతర్యం మనుష్యుడు సహజంగా అనేకమైన వాసనలతో లోకంలోకి వస్తాడు. వాసనలను తొలగించగల శక్తి పేరు దుర్గ. సంప్రదాయజ్ఞులైన పెద్దలుదుర్గనామస్మరణ లేని రోజు ఉండకుండా చూసుకోవాలంటారు.

శ్రీ మదాంధ్రభాగవత ప్రవచనం
Sri Madhaandhra Bhagavatham Pravachanam
Rs:500/-


About This Book


ప్రవచనము
శివ”, ”శంకర”, ”శంభుః నామములన్నీసుఖముఅను శబ్దమునే నిర్వచిస్తాయి. ”జ్ఞాన దాతా మహేశ్వరః” – శివుడు జ్ఞానకారకుడు. సమస్త కళలు ఆయన నుండే ఆవిర్భవించినవి. ఆయనే సకల విద్యలకూ ఆలవాలము. సమస్త వికారములకూ, అరిషడ్వర్గములకూ అతీతుడై, నిత్యము ప్రశాంతముగా ఉండే మూర్తి శంకరుడు. అందుకేసదా శివఅన్న నామము ఒక్క శంకరునికే అన్వయం అవుతుంది. అటువంటి పరమేశ్వరుని గూర్చిన అనేక విషయములుశ్రీ శివమహాపురాణములో వివరింపబడినవి.

  







 mohanpublications        mohanpublications       mohanpublications


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list