ఎంత సక్కగున్నావే
సినిమా : రంగస్థలం (2018)తారాగణం : రామ్‌చరణ్, సమంత
దర్శకత్వం : సుకుమార్
గానం , సంగీతం : దేవి శ్రీ ప్రసాద్
లిరిక్స్ : చంద్రబోస్
వేరుశనగ కోసం మట్టిని తవ్వితే
ఏకంగా తలిగిన లంకే బిందేలాగ
ఎంత సక్కగున్నావే లచ్చిమి
ఎంత సక్కగున్నావే
సింత సెట్టు ఎక్కి సిగురు కోయబోతే
సెతికి అందిన సందమామలాగ
ఎంత సక్కగున్నావే లచ్చిమి
ఎంత సక్కగున్నావే
మల్లెపూల మద్దే ముద్ద బంతిలాగ
ఎంత సక్కగున్నవే
ముత్తైదువ మెళ్లో పసుపు కొమ్ములాగ
ఎంత సక్కగున్నవే
సుక్కల సీర కట్టుకున్న వెన్నెలలాగ
ఎంత సక్కగున్నవే ॥వేరు శనగ ॥
ఓ..రెండు కళ్ల సినుకువి నువ్వు
గుండె సెర్లో దొరికినావు
అలల మూటలనిప్పేసినావు
ఎంత సక్కగున్నవావు
లచ్చిమి ఎంత సక్కగున్నావే
మబ్బులేని మెరుపువి నువ్వు
నేల మీద నడిసేసినావు
నన్ను నింగి సేసేసినావు
ఎంత సక్కగున్నావే
లచ్చిమి ఎంత సక్కగున్నావే
సెరుకు ముక్క నువు కొరికి తింటా ఉంటే
ఎంత సక్కగున్నావే
తిరునాళ్లలో తప్పి ఏడ్సేటి బిడ్డకు
ఎదురొచ్చిన తల్లి సిరునవ్వులాగ
ఎంత సక్కగున్నావే
లచ్చిమి ఎంత సక్కగున్నావే
గాలి పల్లకిలో ఎంకి పాటలాగ
ఎంకి పాటలోన తెలుగు మాటలాగ
ఎంత సక్కగున్నావే
లచ్చిమి ఎంత సక్కగున్నావే
కడవ నువు నడుమున బెట్టి
కట్ట మీద నడిసొస్తా ఉంటే
సంద్రం నీ సంకనెక్కినట్టు
ఎంత సక్కగున్నావే
లచ్చిమి ఎంత సక్కగున్నావే
కట్టెల మోపు తలకెత్తుకొని
అడుగులోన అడుగేత్త ఉంటే
అడవి నీకు గొడుగట్టినట్టు
ఎంత సక్కగున్నావే
లచ్చిమి ఎంత సక్కగున్నావే
బురద సేలో వరినాటు వేత్తా ఉంటే
ఎంత సక్కగున్నావే
భూమి బొమ్మకు నువు ప్రాణం పోస్టున్నట్టు
ఎంత సక్కగున్నావే ॥వేరు శనగ ॥
#bhaktipustakalu





Very Nice site and it is helpful info, also check out List Of Upcoming Telugu Movies please visit at https://mtwiki.blogspot.com/2015/05/release-dates-of-telugu-movies-in-2016-new-upcoming.html/
ReplyDelete