MohanPublications Print Books Online store clik Here Devullu.com

స్త్రీలు ధరించే తాటంకాలు (చెవి దిద్దులు) | Earrings | Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu


· 
స్త్రీలు ధరించే తాటంకాలు (చెవి దిద్దులు) | Earrings | Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu Ear Rings Indian Bridal Hindu Marriage Indian Wedding Bridal Jewellery Wedding Jewellery Wedding Ear Rings Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI


స్త్రీలు ధరించే తాటంకాలు
(చెవి దిద్దులు)

స్త్రీలు ధరించే శుభప్రదమైన ఆభరణాలు, యితర వస్తువుల విషయంలో సరియైన శ్రద్ధ చూపాలి. సౌందర్యలహరిలో ఆదిశంకరులు ఈ విషయంపై క్రింది శ్లోకాన్ని చెప్పారు.

 శ్లో||"సుధామప్యా స్వాద్య ప్రతి-భయ-జరామృత్యు-హరిణీం| 
విపన్యంతే విశ్వే విధి - శతమఖాద్యా దివిషదః |
కరాలిం యత్‌ స్వేలం కబలితవతః కాలకలనా న 
శంభోస్తన్మూలం తవ జనని తాటం క-మహిమా||

'' మహేశ్వరీ ! దేవతలంతా అమృతం త్రాగినా, జరా మృత్యువులను పొందుతున్నారు. అంతా ప్రళయంలోలయమవుతున్నారు. అయితే కాల కూటవిషాన్ని త్రాగిన నీ భర్త శివుడు, ప్రళయ కాలంలో కూడా చని పోకుండా, కాలానికి అతీతుడై , మ్రుత్యుమ్జయుడై ఉన్నాడు. దీనికి కారణం నీ చెవి కమ్మల ప్రభావమే . తాటంకాలు అంటే చెవి కమ్మలు. సౌభాగ్య చిహ్నాలు. ఆమె కమ్మలకు చేటు తెచ్చే శక్తి కాలానికి లేదని అర్ధం. కారణం కాలానికి ఉత్పత్తి, స్తితి, లయాలు శ్రీ దేవి తాటంక నియతాలు. కనుక ఆమె పాతి వ్రత్య మహిమ సర్వాతీశయ మైనది అని భావం. దేవతలు సముద్రాన్ని మథించినప్పుడు ఆవిర్భవించిన వస్తువులనన్నిటిని వారు గ్రహించారు. కాని విషం బయల్పడగానే భయభ్రాంతులై ఆ స్థలాన్ని విడిచి వెళ్లటం ఆరంభించారు. అమృతం లభించగానే దేవతలు దాన్ని సేవించి అమరులైనారు. ఐనా విషం కనిపించగానే దేవతలు భయంతో బ్రహ్మతో సహా వెనుదిరిగారు. పరమేశ్వరుడు మాత్రం గరళాన్ని మ్రింగి కంఠ స్థలంలో వుంచి గరళ కంఠుడై భాసిల్లాడు. గరళం మ్రింగిన ఆయన మరణించలేదు. ఎందువలన? ఆదిశంకరులు నుడివిన ప్రకారం పార్వతీమాత ధరించిన తాటంకము యొక్క మహాత్మ్యమే దానికి కారణం. ఈ శ్లోకంలో ఒక గొప్పధర్మ సూత్రం ఇమిడివుంది. స్త్రీ తన చెవికి ధరించే ఆభరణం తన భర్తకేగాక తన మొత్తం కుటుంబానికి గొప్ప రక్షగా విలసిల్లుతుందనేదే ఆ ధర్మ సూత్రం. స్త్రీలు తాటంకాలు (చెవి దిద్దులు) లేకుండా భర్తకి కనపడరాదు. అలాకనపడితే భర్తకి గండం. భారతీయ సంస్కృతికి యీ తాటంకం ఒక ఉత్కృష్టమైన చిహ్నం గనుక దానికున్న సంరక్షక విలువల దృష్ట్యా ఆ ఆచారాన్ని మనం తప్పక నిలబెట్టుకోవాలి. కాని మన గృహిణులు వేరే ఆభరణాల్ని ధరించటం ప్రారంభిస్తే దానివల్ల వచ్చే ఫలితాలు వేరుగా వుంటాయి. నేడు మన పిల్లలు, పెద్ద ముత్తైదువులు కూడ బంగారంతోగాని, వెండితోగాని, ప్లాస్టిక్‌తోగాని చేసిన గుండ్రని బోలురింగులను చెవికి ఆభరణాలుగా ధరించటం గమనిస్తాం. ఇది పూర్తిగా భారతీయ సంస్కారానికి విరుద్ధం. ఉదాహరణకు పాఠశాల పరీక్షలో మన పిల్లవాడొకనికి ఒక సబ్జెక్టులో నూటికి సున్నా మార్కులొచ్చాయని అనుకుందాం. అలా వచ్చింది ఒకే ఒక సబ్జెక్టులోనైనా మనం అతిగా బాధపడతాం. కాని మన గృహిణులు సున్న రూపంలో వున్న ఆభరణాన్ని శరీరంపై ధరిస్తే దాన్ని గురించి పట్టించుకోము. వలయాకృతిలో వున్న ఆభరణాన్ని ధరిస్తే, మనకు ప్రాప్తించే కష్టాలకు నివారణ లభించదు. ఆ పొరపాటు వలన సంభవించే దుష్ఫలితాన్ని అనుభవించి తీరవలసిందే. తాటంకం మన భారతీయ సంస్కృతిలో అనాది చిహ్నము. కనుక దానిని ధరించుట మానరాదు. అందుచేత, బంగారంతోగాని, ప్లాస్టిక్‌తో గాని చేసిన బోలుగుండ్రని రింగులను ఎన్నడూ ధరించరాదు. వాటికి బదులు మన పిల్లలు మన ప్రాచీనుల నుండి సంక్రమించిన లోలకులను ధరించవచ్చును

1 comment:

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list