MohanPublications Print Books Online store clik Here Devullu.com

హలీమ్‌ | Haleem | Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu


హలీమ్‌ | Haleem | Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu Haleem Hydrabadi Haleem Hydrabad Haleem Haleem Recipe Ramzan Ramjaan Ramadan Ramzan Festival Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI



హలీమ్‌


రంజాన్‌ అంటే హలీమ్‌... సాయంత్రం ఏడు దాటితే చాలు చౌరస్తాల్లో హలీమ్‌ ఘుమఘుమలు గుబాళిస్తుంటాయి. ఆ దారంట వెళ్లే వారందరి చవులూరిస్తుంటాయి. తెలియకుండానే అందరి దారి అటు మళ్లుతుంది. ఈ నెలంతా హలీమ్‌ను ఆస్వాదిస్తూ పరవశించిపోయే చిన్నా పెద్దా గుంపులు గుంపులుగా కనిపిస్తారు. మటన్‌ హలీమ్‌, చికెన్‌ హలీమ్‌, ఫిష్‌ హలీమ్‌.. ఇలా రకరకాల నాన్‌వెజ్‌ హలీమ్‌లతోపాటు వెరైటీ వెజ్‌ హలీమ్‌లను సైతం ఫుడీస్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. మీకోసం ఈ వారం కొన్ని హలీమ్‌మ్‌మ్‌లు...


చికెన్‌ హలీమ్‌
కావలసినవి: చికెన్‌- 750 గ్రాములు, అల్లం-వెల్లుల్లి పేస్టు-ఒక టేబుల్‌స్పూను, ఉల్లిపాయలు-అర కప్పు (సన్నగా తరిగి), గులాబీ రెక్కలు-పావు కప్పు, పచ్చిమిర్చి-ఐదు, నెయ్యి-అరకప్పు, గోధుమరవ్వ-అర కప్పు, ఓట్స్‌-పావు కప్పు, బాదంపప్పులు-ఆరు, శెనగపప్పు, పెసరపప్పు, ఎర్రకందిపప్పు, మినపప్పు-ఒక్కొక్కటీ ఒక్కో స్పూను, నువ్వులు-మూడు గ్రాములు, జీలకర్ర-నాలుగు గ్రాములు, లవంగాలు-రెండు గ్రాములు, మిరియాలు-మూడు గ్రాములు, దాల్చినచెక్క-రెండు అంగుళాల ముక్క, యాలకులు-ఎనిమిది, సాజీరా- రెండు గ్రాములు, కబాబ్‌చినీ-రెండు గ్రాములు, పాలు-ఒక కప్పు, ఉప్పు- రుచికి సరిపడా, వేగించిన ఉల్లిపాయముక్కలు-అర కప్పు, పెరుగు-రెండు టేబుల్‌స్పూన్లు (ఛాయిస్‌), కొత్తిమీర-అరకట్ట (తరుగు), పుదీనా-అర కట్ట (తరుగు).
తయారీ:
  • వెడల్పాటి గిన్నెలో కబాబ్‌ చినీ, సాజీరా, యాలకులు, దాల్చినచెక్క, మిరియాలు, జీలకర్ర, పెసరపప్పు, మినపప్పు, శెనగపప్పు, ఎర్ర కందిపప్పు, బాదం, ఓట్స్‌, గోధుమరవ్వ అన్నింటినీ కలిపి ఆ మిశ్రమాన్ని బ్లెండర్‌లో వేసి మెత్తగా పొడిచేయాలి.
  • ప్రెషర్‌ కుక్కర్‌లో నెయ్యి వేసి వేడెక్కాక అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేగించాలి. చికెన్‌ ముక్కలతో పాటు చికెన్‌ను నానబెట్టిన నీళ్లను కూడా అందులో పోసి కలపాలి. ఈ మిశ్రమంలో వేగించిన ఉల్లిపాయముక్కలు, గులాబిరెక్కలు, పెరుగు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా తరుగు, ఉప్పు, రెడీచేసి పెట్టుకున్న పొడిని వేసి బాగా కలపాలి. పెద్దమంటపై రెండు విజిల్స్‌ వచ్చేదాకా ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. ఆతర్వాత సన్నని మంటపై 40 నిమిషాలు ఉడికించాలి. తర్వాత పొటాటో మాషర్‌ తీసుకుని దాన్ని మెత్తగా పేస్టులా చేయాలి. అందులో నెయ్యి వేసి కలపి, దానిపై నిమ్మరసం చల్లి వేడిగా తింటే ఎంతో బాగుంటుంది.
ఫిష్‌ హలీమ్‌
కావలసినవి: ముల్లు తీసిన చేపముక్కలు-అరకేజి, గోధుమరవ్వ- ఒక కప్పు (రాత్రి నీళ్లలో నానబెట్టాలి), శెనగపప్పు, పెసరపప్పు, ఎర్రకందిపప్పు, మినపప్పు-ఒక్కొక్కటీ ఒక్కో పావు కప్పు(వీటన్నింటినీ విడివిడిగా మూడు గంటలు నీళ్లలో నానబెట్టాలి) అల్లంపేస్టు-ఒక టేబుల్‌స్పూను, వెల్లుల్లిపేస్టు-3/4 టేబుల్‌స్పూను, పచ్చిమిర్చి-రెండు, తులసి ఆకు-ఒకటి, ఉల్లిపాయ-ఒకటి (సన్నగా తరిగి),పెరుగు-రెండు టేబుల్‌స్పూన్లు, ధనియాలపొడి-అర టేబుల్‌స్పూను, గరంమసాలాపొడి-ఒక టేబుల్‌స్పూను, నల్లమిరియాలపొడి-ఒక టేబుల్‌స్పూను, వేగించిన జీలకర్ర-పావు టేబుల్‌స్పూను, యాలకులు, లవంగాలు-ఒక్కొక్కటీ రెండేసి చొప్పున, దాల్చినచెక్క-చిన్నముక్క, ఉప్పు-రుచికి సరిపడా, నెయ్యి-అర కప్పు, నిమ్మరసం-రెండు టేబుల్‌స్పూన్లు. పైనఅలంకరణకు:నిమ్మ ముక్కలు, కొత్తిమీర- రెండు టేబుల్‌స్పూన్లు, వేగించిన జీడిపప్పులు-ఒక టేబుల్‌స్పూను (ఛాయిస్‌), వేగించిన ఉల్లిపాయముక్కలు-ఒక టేబుల్‌స్పూను, తాజా కొత్తిమీర ఆకులు- అర కప్పు, పుదీనా- పావు కప్పు.
తయారీ:
  • అల్లం- వెల్లులి పేస్టు, ఉప్పు, కారం మిశ్రమాన్ని చేపముక్కలకు పట్టించి అరగంటపాటు నాననివ్వాలి.
  • తర్వాత వాటిని నీటిలో ఉడికించాలి.
  • ఉడికిన చేపముక్కలను చిన్న ముక్కలుగా కట్‌ చేయాలి.
  • పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఆకులును మిక్సీలో వేసి పేస్టు చేయాలి.
  • నీళ్లలో నానబెట్టిన శెనగపప్పు, పెసరపప్పు, మినపప్పులను కుక్కర్‌లో వేసి మెత్తగా ఉడికించాలి.
  • చల్లారిన తర్వాత దీన్ని మెత్తటి పేస్టులా గ్రైండ్‌ చేయాలి.
  • రాత్రంతా నానబెట్టిన గోధుమరవ్వను ప్రెషర్‌కుక్కర్‌లో మెత్తగా ఉడికించాలి.
  • ఇందులో పెరుగుతోపాటు దాల్‌ పేస్టు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్టు, అల్లం పేస్టు, వెల్లుల్లి పేస్టు, నల్లమిరియాలపొడి, ధనియాలపొడి, జీలకర్ర పొడి, గరంమసాలా వేసి పేస్టులా చేయాలి.
  • ఈ పేస్టులో చేపముక్కలతోపాటు రెండు కప్పుల నీళ్లు పోసి బాగా కలపాలి. వాటిని సన్నని మంటపై ఉంచి మధ్య మధ్యలో కదుపుతూ అరగంటపాటు ఉడకనిచ్చి ఉప్పు చల్లాలి.
  • పెద్ద కడాయిలో నెయ్యి వేసి తులసి ఆకు, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు అందులో వేసి వేగించాలి.
  • సువాసన రావడం మొదలవ్వగానే కిందికి దించి వేగించిన ఉల్లిపాయముక్కలను ఫిష్‌ హలీమ్‌పై చల్లాలి.
  • పైన కొత్తిమీర తరుగు గార్నిష్‌లా చేసి, కొద్దిగా నిమ్మరసం చల్లి సర్వ్‌ చేయాలి.
మటన్‌ హలీమ్‌
కావలసినవి: బోన్‌లెస్‌ మటన్‌-250 గ్రాములు, అల్లం-వెల్లుల్లిముద్ద- టేబుల్‌స్పూను, ఉప్పు-తగినంత, పచ్చిమిర్చి- సరిపడా, గోధుమరవ్వ- కొద్దిగా, మిరియాలు- కొన్ని, గరంమసాలా-అర టీస్పూను, వేగించిన ఉల్లిపాయముక్కలు- ఒకటిన్నర కప్పు, సాజీరా-ఒక స్పూను, పుదీనా-ఒక కట్ట, నూనె- టేబుల్‌స్పూను, నెయ్యి-పావు కప్పు, ధనియాలపొడి- ఒక స్పూను, నిమ్మరసం-టేబుల్‌స్పూను, నీళ్లు-సరిపడా.
తయారీ:
  • మటన్‌ని నీటిలో శుభ్రంగా కడగాలి.
  • గోధుమరవ్వను అరగంటసేపు నీళ్లలో నానబెట్టాలి.
  • కుక్కర్‌లో నూనె వేడిచేయాలి.
  • వేడెక్కిన నూనెలో మటన్‌, మిరియాలు, అల్లంవెల్లుల్లిముద్ద, సాజీరా, గరంమసాలా, ధనియాలపొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి, నీళ్లు పోసి కుక్కర్‌ మూత పెట్టాలి.
  • ఆరు విజిల్స్‌ వచ్చాక స్టవ్‌ ఆపేయాలి.
  • ఆవిరిపోయాక ఉడికిన మటన్‌ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.
  • కడాయిలో గోధుమరవ్వ, తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి.
  • రవ్వ ఉడికాక స్టవ్‌ ఆపేయాలి.
  • మరో కడాయిలో నెయ్యి కరిగించాలి.
  • అందులో ఉడికిన గోధుమరవ్వ, మటన్‌లను వేయాలి.
  • మిశ్రమం ముద్దలా అయ్యాక వేగించిన ఉల్లిపాయముక్కలు, పుదీనా, నిమ్మరసం పైన చల్లి కిందికి దించాలి.
వెజ్‌ హలీమ్‌
కావలసినవి: గోధుమరవ్వ-అరకప్పు, ఓట్స్‌- రెండు టేబుల్‌స్పూన్లు, ఎర్రకందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, నువ్వులు- ఒక్కొక్కటీ ఒక్కో టేబుల్‌స్పూను, మిరియాలు-పావు టీస్పూను, యాలకులు-మూడు, లవంగాలు-నాలుగు, దాల్చినచెక్క-చిన్నముక్కలు రెండు, జీలకర్ర-ఒక టీస్పూను, సోయా వాటర్‌ గ్రాన్యూల్స్‌-పావు కప్పు (నీళ్లల్లో పదినిమిషాలు నాననిచ్చి), బాదంపప్పులు, జీడిపప్పు- ఒక్కొక్కటీ ఒక్కో టేబుల్‌స్పూను, ఉల్లిపాయలు- రెండు (సన్నటి ముక్కలుగా తరిగి), మిక్స్‌డ్‌ వెజిటబుల్స్‌-అరకప్పు(క్యారెట్‌, బీన్స్‌, పచ్చిబటాణీ గింజలు, గ్రీన్‌ బీన్స్‌, లిమా బీన్స్‌ లాంటివి), పాలు-అర కప్పు, పచ్చిమిర్చి-మూడు (నిలువుగా కట్‌ చేసి), పుదీనా, కొత్తిమీర - ఒక్కొక్కటీ ఒక్కో అర కప్పు (తరుగు), ఉప్పు- రుచికి సరిపడా, నిమ్మకాయముక్కలు- అలంకరణకు.
తయారీ:
  • గోధుమరవ్వ నుంచి జీరా వరకూ పైన చెప్పిన అన్ని పదార్థాలనూ పొడిగా గ్రైండ్‌ చేయాలి. ఈ పొడి ఒక కప్పు ఉంటుంది.
  • పాన్‌ తీసుకుని రెండు టేబుల్‌స్పూన్ల నూనె అందులో వేయాలి. వేడెక్కిన నూనెలో తరిగిపెట్టుకున్న ఉల్లిపాయముక్కల్ని వేసి బ్రౌన్‌ రంగులో వచ్చేవరకూ వేగించి ఒక ప్లేటులో పోయాలి.
  • ప్రెషర్‌ కుక్కర్‌లో రెండు టేబుల్‌స్పూన్ల నెయ్యి లేదా నూనె వేసి అందులో జీడిపప్పును బంగారు వర్ణంలోకి వచ్చేదాకా వేగించాలి. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వే సి వేగించాలి.
  • ఇందులో వేగించిన ఉల్లిపాయలను (అలంకరణకు కొద్దిగా విడిగా తీసి) కూడా కలిపి రెండు నిమిషాలు ఉడికించాలి.
  • మిక్స్‌డ్‌ వెజిటబుల్స్‌ కూడా ఇందులో వేసి రెండు నిమిషాలు ఉడికించాలి.
  • నానబెట్టిన సోయా గింజల్లోని నీళ్లను తీసేసి ప్రెషర్‌కుక్కర్‌లో వేసి ఒక నిమిషం ఉడకనివ్వాలి.
  • అందులో పాలు కూడా ఉడకనివ్వాలి.
  • తర్వాత మూడు కప్పుల నీళ్లు అందులో పోసి పుదీనా, కొత్తిమీర తరుగు వేయాలి. రెడీ చేసి పెట్టుకున్న పొడిని, రుచికి సరిపడా ఉప్పును కూడా ఇందులో వేసి ఉండ కట్టకుండా కలపాలి. ఈ మిశ్రమం మరుగుకు వచ్చేదాకా ఉంచి కుక్కర్‌పై మూతపెట్టి 15 నిమిషాలు సన్నని మంటపై ఉడికించాలి.
  • ఆవిరి తగ్గిన తర్వాత కుక్కర్‌ మూత తీసి అందులోని మిశ్రమాన్ని మాషర్‌తో మెత్తగా చేయాలి.
  • ఇలా రెడీ అయిన వెజ్‌ హలీమ్‌పై పుదీనా, కొత్తిమీర తరుగు, నిమ్మకాయముక్కలు, వేగించిన నట్స్‌లతో అలంకరించి సర్వ్‌ చేయాలి.

హలీమ్‌ | Haleem | Mohanpublications | Granthanidhi | Bhaktipustakalu Haleem Hydrabadi Haleem Hydrabad Haleem Haleem Recipe Ramzan Ramjaan Ramadan Ramzan Festival Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU,  KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI



3 comments:

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list