MohanPublications Print Books Online store clik Here Devullu.com

చాణక్య నీతి Chanikya Neethi

చాణక్య నీతి
Chanikya Neethi

చాణక్య నీతి సూత్రాలు
అసలు నీతి అంటే ఏమిటి? నీతి అనే పదాన్ని మనం నిత్యకృత్య వ్యవహారంలో తరచుగా ఉపయోగిస్తుంటాం. నిఘంటువులు దీనికి న్యాయము, ఉపాయము, సత్ప్రవర్తనము, విధము, రీతి అనే అర్ధాలను ఇస్తున్నాయి.
ఏదైనా సరియైన లేక న్యాయమైన పద్ధతిలో ప్రవర్తించటం అనే అర్ధం 'నీతి' అనే పదానికి వర్తిస్తుందని భావించవచ్చు. పండితులు 'ఆయాదేశవాసుల వేషభాషాదులు, రాజ్య పరిపాలనా విధానము, వారు సమకూర్చుకొనే వివిధ సంపదలు, అనుభవించే భోగాలు, జీవన విధానము మొదలైన బాహ్య విషయాలకు సంబంధించినది 'నాగరికత' అని, వ్యక్తికి, వ్యక్తికి మధ్య ఉండే సంబంధ విశేషాలు, అభిరుచులు, ఆధ్యాత్మిక ప్రవృత్తి మొదలైన ఆంతరిక సంబంధి సంస్కృతి అని స్థూలంగా నిర్వచించారు. ఈ రకమైన సంస్కృతి, నాగరికతలు కలిగిన జీవన విధానాన్ని ఆచరించటమే నీతి. ఇవి సాధించటానికి పాలకులు, ప్రతి పౌరుని యోగక్షేమాలకు ప్రాధాన్యం ఇస్తూ, పాలనా విధానాలను రూపొందించుకొని, శాంతి, సోదరత్వాలు వర్ధిల్ల చేయటానికి అవలంబించవలసిన పద్ధతులే నీతి అని చెప్పవచ్చు.
ఈ గ్రంథంలో చాణక్యుడు వ్యక్తిగా, కుటుంబంలో ఒకనిగా, సమాజంలో ఒక సభ్యునిగా, ఒక పాలకునిగా పాలక వర్గ సభ్యునిగా ఆచరింపవలసిన కర్తవ్యాలు, పాటించవలసిన నియమాలు పరస్పర విరుద్ధ భావాలకు తావు ఇవ్వకుండా తెలియజేయబడ్డయి. ఈ సూత్రాల కూర్పులో చాణక్యుని మేధోశక్తి ద్యోతకమౌతుంది.
ఈ చాణక్య నీతి సూత్రాలు కూడ తెలుగువారి ఆదరాభిమానాలకు పాత్రం కాగలదని భావిస్తూ...



LIKE US TO FOLLOW: ---


No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list