MohanPublications Print Books Online store clik Here Devullu.com

శ్రీ నరసింహ పురాణం, Sri Narasimha Puranam

శ్రీ నరసింహ పురాణం
Sri Narasimha Puranam

శ్రీ నరసింహ పురాణం
మాఘ స్నానానికని మౌనులంతా ప్రయాగక్షేత్రానికి వచ్చారు. భరద్వాజ మహర్షిని కలిశారు. స్నానాదులయాక అందరూ సుఖోపవిష్టులైవుండగా అక్కడికి పౌరాణికాగ్రేసరుడు సూతుడు విచ్చేశాడు. సాభిప్రాయంగా మునులంతా భరద్వాజుణ్ణి చూశారు. వారి తలంపు గ్రహించి భరద్వాజుడు సూతమునీ! నరసింహపురాణం వినదలచి మునులిక్కడున్నారు అన్నాడు. ఏ పద్ధతిలో నృసింహపురాణం చెప్పాలో సూచించమని సూతుడడిగితే భరద్వాజుడు కొన్ని ప్రశ్నలు వేశాడు. ఆయన ప్రశ్నలకు సూతుడిచ్చిన సమాధానమే నృసింహ పురాణమయింది. ఇదీ లక్ష్మీనృసింహపురాణానికి ఉపక్రమణిక.
దురపగాహములైన వేదార్ధాలను ఇతిహాసపురాణాలు మిత్రసమ్మితంగా వివరిస్తాయి. పురాణాలు పద్దెనిమిది. ఉపపురాణాల సంఖ్య అంతే. నరసింహపురాణం ఉపపురాణంగా పరిగణించబడింది. బ్రహ్మాండ పురాణంలో నృసింహావతార కథ కలదు. సంస్క మీత భాగవతంలో ప్రహ్లాదకథ సుప్రసిద్ధం. పరమ భాగవత శ్రేణిలో ప్రథమస్థానం అలంకరించిన ప్రహ్లాద చరిత్రను బమ్మెర పోననామాత్యుడు మందార మకరంద మధురశైలిలో రచించి తెలుగువారి తలపులను పులకింపజేశాడు. ఆ మహనీయుని నృసింహావతార ఘట్టం చదవితీరవలసిన మనోజ్ఞరచన.
కవిరత్న యామిజాల పద్మనాభస్వామి వారి ఈ లక్ష్మీనరసింహ పురాణరచనలో సృష్టిక్రమం, కాలమానం, మనువు, కశ్యప సంతతి, మైత్రావరుణి, మార్కండేయుడు తుంగభద్రాతటంలో నృసింహదేవుని కొల్చి మృత్యుంజయుడై చిరంజీవియైన వృత్తాంతం, యముని ధర్మపరాయణత్వం, సావిత్రి అనే సాధ్వి దేవశర్మకు తెల్పిన స్వధర్మానుష్ఠాన ప్రభావం, అష్టాక్షర మంత్రమహిమ, అశ్వినీ దేవతల జన్మప్రకారం చోటుచేసుకున్నాయి; అంతేకాదు, మరుద్గణ వృత్తాంతం, నిర్మల్య మహిమ, దేవాలయ సమ్మార్జన ప్రభావం, దశావతార కథలు అనుక్రమంగా పశంసించబడ్డాయి. ప్రతి కథా విష్ణు తేజోవిలసితం.
పద్యగద్యాలలో ఆరితేరిన రచయితగా, పుస్తకసమీక్షకులుగా ప్రసిద్ధులైన యామిజాల పద్మనాభస్వామిగారి ‘‘శ్రీలక్ష్మీనరసింహపురాణం’’ గ్రంథాన్ని అందిస్తున్నాం.
పాఠకులు ఈ పురాణ గ్రంథాన్ని పఠించి తరింగలరని ఆకాంక్షిస్తూ....
"అందరికీ ఉపయోగపడేవిధంగా ఈ పోస్ట్ ని అందరూ షేర్ చేయగలరు
FREE DOWNLOAD
________👇_________



LIKE US TO FOLLOW: ---



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list