MohanPublications Print Books Online store clik Here Devullu.com

దీపావళి_Diwali




వెలుగుల దీపావళి 

       దీపావళి ఆనందదాయకమైన పర్వదినం. లోకాల్ని పీడిస్తున్న నరకాసురుడిని శ్రీకృష్ణుడు, తన సతీమణి సత్యభామతో కలిసి సంహారం చేశాడు. నరకాసురుడి బాధలు తీరినందుకు గుర్తుగా టపాసులు పేలుస్తాం. చిచ్చుబుడ్డీల వెలుగుల్లో పండుగ‌ను ఆనందంగా జరుపుకొంటాం. ఈ పండగకు అన్నలు చెల్లెలి ఇంటికెళ్లి భోజనం చేయడం సంప్రదాయంగా వస్తోంది. దీపావళికి తులాసంక్రమణం ప్రారంభమవుతుంది. అంటే చలి, చీకటి కలిసిన కాలం అన్నమాట. పితృదేవతలకు దారి చూపడం కోసం ప్రాచీన కాలంలో దీపాలు పెట్టేవారు. కాలక్రమేణా టపాసులు కూడా వచ్చాయి. నరకాసురుడు వ‌రాహ‌స్వామికి భూదేవికి జన్మించినవాడు. అయితే లోకకంటకుడైన పుత్రుడిని లోకకల్యాణం కోసం సత్యభామ హతమార్చుతుంది. ఆమె భూదేవి స్వరూపం. ధర్మకంటకుడిగా ఎవరు మారినా వారిని అణచేందుకు పరంధాముడు, మ‌హాల‌క్ష్మి ఎలా వ్యవహరించార‌న్న‌ అంశాన్ని ఈ ఘట్టం మనకు వివరిస్తుంది. త్రయోదశి రోజు రాత్రి వెలిగించే దీపం అపమృత్యువును నివారిస్తుంది. చతుర్దశి నాడు యముడికి తర్పణం వదిలి అనంతరం దీపం వెలిగించాలి. ఇలా చేస్తే నరకభయం ఉండదని పురాణాలు చెబుతున్నాయి.


నరకాంతకం... ఆనందోత్సవం! 







దీపావళి పండుగకు సంబంధించి ధార్మిక గ్రంథాల్లో అనేకాంశాలు ముడివడి ఉన్నాయి. పితృపర్వంగా, లక్ష్మీపూజగా, అమంగళనిరాసనం (అశుభాలను తొలగించడం)గా ప్రధానమైన ఈ పర్వంలో కుటుంబ వేడుకలు, సామాజికోత్సవాలు కలగలిసి సందడి చేస్తాయి. 

శ్రీకృష్ణ పరమాత్మ లోక కల్యాణార్థం నరకాసురుని సంహరించిన గాథ కూడా ఈ పర్వంతో ప్రస్తావించడం సంప్రదాయం. మానవ ధర్మాలను ప్రతిష్ఠించడమే కాక, తన భగవత్తత్వాన్ని ప్రకటించడం కృష్ణావతార ప్రత్యేకత. దేవలోక సంపదలను దోచుకున్న నరకాసురుడు లోక కంటకుడై, తన అరుదైన బలపరాక్రమాలతో అకృత్యాలకు పాల్పడి దేవతలకు సైతం అజేయుడైన వైనాన్ని భాగవతాది గ్రంథాలు వివరించాయి. లోక కల్యాణార్థం దేవేంద్రుడు ద్వారకకు వచ్చి వాసుదేవుని ప్రార్థించగా, గరుత్మంతుని వాహనంగా చేసుకొని సత్యభామాసహితుడై ముకుందుడు యుద్ధానికి బయలుదేరిన వివరాన్ని కృష్ణకథా గ్రంథాలు వర్ణించాయి. నరకుడికి మిత్రుడైన ‘ముర’ అనే అసురుడు మాయాయుద్ధాల్లో, అస్త్రశస్త్ర విద్యల్లో నేర్పరి. ముందుగా ఆ భయంకర రాక్షసుణ్ని సంహరించి, కృష్ణుడు ‘మురారి’ అయ్యాడు. 

అటుపై నరకుడితో యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం నరకుడి రాజధానీ నగరమైన ప్రాగ్జ్యోతిషపురం (ప్రస్తుత అసోం ప్రాంతం)లో జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి. ప్రామాణిక ఇతిహాసాల ప్రకారం- శ్రీకృష్ణుడే నరకుడితో యుద్ధంచేసి అతణ్ని సంహరించాడు. అంతేకానీ- సత్యభామ నరకాసుర సంహారం చేయలేదు. అనంతర కవుల కల్పనల్లో సత్యభామను వీరవనితగా చేసి చూపించారు. భారత భాగవత విష్ణుపురాణాది కృష్ణ కథామూలగ్రంథాల్లో ఈ అంశం కానరాదు. ఆ వేళలో సత్యభామ కృష్ణుడితో ఉన్నట్లుగా మాత్రమే అవి వర్ణించాయి. 

నరకాసురుని బందీలుగా ఉన్న పదహారు వేలమంది రాచకన్యలను బంధవిముక్తులను చేసిన పరమాత్మ- వారికి భద్రమైన స్థితి ఏర్పాటుచేయాలని సంకల్పించాడు. వారికి క్షేమంకరమైనది ఏదో కోరుకొమ్మని చెప్పగానే, వారందరూ కృష్ణునే ఆశ్రయించారు. భూదేవి కూడా వారిని అనుగ్రహించమని అభ్యర్థించింది. ఆ స్త్రీలందరికీ రక్షణ కల్పిస్తూ, పదహారు వేలమందినీ పదహారువేల పద్ధతుల్లో పదహారు వేల రూపాలతో ఏకకాలంలో మాధవుడు వివాహమాడినట్లుగా భాగవతాదుల కథనం. నరకుడి పుత్రుడైన భగదత్తుని ఆ ప్రాంతరాజుగా నిలబెట్టాడు కృష్ణుడు. సత్యభామ భూదేవి అంశగా ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి. భూపుత్రుడైన నరకుడు లోక కంటకుడు కావడంవల్ల, సర్వజన క్షేమం కోసం ఆ అసురుణ్ని సంహరించడానికి భూమాత స్వయంగా సమ్మతిని తెలుపుతూ సత్యభామ రూపంతో అక్కడ ఉంది. 

నరులను బాధింపజేసే (క్రందింపజేసే) స్థితి ‘నరకం’. ఆ దుర్గతిని తొలగించే సాధనలకు కాలపరంగా, ఆధ్యాత్మికంగా అనుకూలమైన పర్వంగా, వివిధప్రాంతాల్లో వివిధ రకాల పద్ధతులతో దీన్ని పాటిస్తారు. దారిద్య్రం, దురాక్రమణ, దౌర్జన్యానికి అధికారం- ఇవే నిజమైన నరకాలు. వాటిని తొలగించే ఆనందస్థితే- కాంతి ఐశ్వర్య సంకేతమైన దీపపర్వం. 

నరకుడు దుఃఖకారకమైన స్థితికి ప్రతీక అయితే, ‘కృష్ణశబ్దం తాత్వికంగా ‘సచ్చిదానందరూపుడు’ అనే అర్థాన్ని చెబుతోంది- (మంత్రశాస్త్రపరంగా).సమాజానికి నరకాన్ని (దుఃఖమయ పరిస్థితిని) తొలగించి, ఆనందాన్ని ప్రసాదించే పండుగగా అభివర్ణించదగినదీ పర్వం. దుష్టత్వాన్ని జయించే విజయానందకేళీ విలాసం-శరన్నవరాత్రుల నుంచి మొదలై, ఈ పండుగతో సంపూర్ణతను సంతరించుకుంటుంది. నరక చతుర్దశిని‘కాళరాత్రి’గా, దీపఅమావాస్యను ‘మహారాత్రి’గా శాక్తేయం చెబుతోంది. శక్తి ఆరాధనకూ ప్రాధాన్యమిచ్చిన పుణ్యకాలమిది. - సామవేదం షణ్ముఖ శర్మ 


దీపాంజలి: 

చీకటిని తరిమేసే వెలుగుల పండుగ దీపావళి.
ఇది అమావాస్య రోజున వచ్చే వెన్నెల పండుగ.
చెడును దునుమాడటంలో పడతి సాహసానికి
ప్రతీకగా నిలిచే పండుగ.
పిల్లలూ పెద్దలూ సంబరంగా జరుపుకొనే పండుగ.
ఇంటిల్లిపాదీ సందడి సందడిగా జరుపుకొనే పండుగ ఇది.
మన దేశం నలుమూలల్లోనే కాదు,
ఖండ ఖండాంతరాల్లోనూ దేదీప్యమానంగా జరుపుకొనే
విశిష్టమైన పండుగ ఇది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మాత్రమే కాదు,
జైనులు, బౌద్ధులు, సిక్కులు కూడా వేడుకగా జరుపుకొనే పండుగ ఇది.

ప్రపంచంలో అత్యధికులు జరుపుకొనే పండుగల్లో దీపావళి ఒకటి. రంజాన్, క్రిస్మస్‌ల తర్వాత ఎక్కువ మంది జరుపుకొనే పండుగ దీపావళి మాత్రమే. దీపావళిని ప్రధానంగా హిందువుల పండుగగా భావిస్తారు గాని, ఈ పండుగను జైనులు, బౌద్ధులు, సిక్కులు కూడా తమ తమ సంప్రదాయాల ప్రకారం ఘనంగా జరుపుకొంటారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 102.2 కోట్ల మందికి పైగా ప్రజలు దీపావళిని వివిధ రీతుల్లో జరుపుకొంటారు. దీపావళి నేపథ్యానికి సంబంధించి నరకాసుర వధ గాథ అందరికీ తెలిసినదే. నరకాసురుడితో జరిగిన యుద్ధంలో శ్రీకృష్ణుడు అలసి సొలసి సొమ్మసిల్లిపోతే సత్యభామ సాహసోపేతంగా నడుం బిగించి, విల్లు సంధించింది. శ్రీకృష్ణుడు తెప్పరిల్లే వరకు నరకుడిని నిలువరించింది.

చివరకు శ్రీకృష్ణుడు చక్రాయుధం సంధించి నరకుడిని వధించాడు. ఆశ్వీయుజ బహుళ చతుర్దశి రోజున నరకాసురుడి పీడ విరగడ కావడంతో ఆ మరునాడు అమావాస్య నాడు ప్రజలు దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకొన్నారు. అప్పటి నుంచి ఏటా నరక చతుర్దశి మర్నాడు జనం ఇళ్ల ముంగిళ్లలో వరుసగా దీపాలు వెలిగించి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దీపావళి ప్రాశస్త్యానికి సంబంధించి మరికొన్ని పౌరాణిక విశేషాలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి. శ్రీరాముడి పద్నాలుగేళ్ల వనవాసం దీపావళి రోజునే ముగిసిందట. లంకలో రావణ సంహారం తర్వాత సీతారామ లక్ష్మణులు దీపావళి నాడే తిరిగి అయోధ్యకు చేరుకున్నారని ప్రతీతి. పాండవుల పన్నెండేళ్ల అరణ్యవాసం, ఏడాది అజ్ఞాతవాసం కూడా దీపావళి రోజునే ముగిసినట్లు పురాణాలు చెబుతున్నాయి.

ఐదురోజుల వేడుక
దీపావళి వేడుకలు ఐదు రోజులు సాగుతాయి. అమావాస్యకు రెండు రోజుల ముందు అశ్వీయుజ బహుళ త్రయోదశి నుంచి ఈ వేడుకలు మొదలవుతాయి. ఈ త్రయోదశి నాడే క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి, ధన్వంతరి జన్మించారని, అందుకే ఇది ధనత్రయోదశిగా పేరు పొందిందని పురాణాలు చెబుతున్నాయి. దీపావళి సందర్భంగా లక్ష్మీదేవిని పూజించే ఆచారం దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. లక్ష్మీదేవి జన్మించిన ధనత్రయోదశి రోజున కొత్త వస్తువులు, ఆభరణాలు, వాహనాలు వంటివి కొనుగోలు చేయడం శుభదాయకమని చాలామంది నమ్ముతారు. దీపావళి ముందు రోజు నరక చతుర్దశి నాడు వేకువ జామునే నిద్రలేచి మంగళ హారతులిచ్చి, పూజలు చేస్తారు. దీపావళి వేడుకలకు సన్నాహంగా ఇళ్లను అందంగా అలంకరించుకుంటారు. దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు వినాయకుడిని, సరస్వతిని, కుబేరుడిని కూడా పూజిస్తారు. సాయంత్రం ఇంటి ముందు వరుసగా దీపాలు పెట్టి, బాణసంచా కాలుస్తారు.

మార్వాడీలకు, గుజరాతీలకు, నేపాలీలకు దీపావళితో కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఆ ప్రాంతాల్లోని వ్యాపార వర్గాల వారు దీపావళి రోజు నుంచే తమ తమ వ్యాపారాలకు చెందిన జమా ఖర్చుల లెక్కలకు సంబంధించిన కొత్త ఖాతాలను ప్రారంభిస్తారు. దీపావళి మర్నాడు... కార్తీక శుద్ధ పాడ్యమిని బలి పాడ్యమి అంటారు. బలి చక్రవర్తిని వామనావతారంలో వచ్చిన విష్ణువు పాతాళానికి అణగదొక్కినది ఈరోజేనని ప్రతీతి. ఇదే రోజు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి ఇంద్రుడి తాకిడి నుంచి గోపాలకులను, గోవులను కాపాడాడని కూడా పురాణాలు చెబుతాయి. కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ హస్త భోజనంగా పాటిస్తారు. రక్షాబంధనాన్ని తలపించే పండుగ ఇది. ఈ రోజున సోదరులు తమ తమ సోదరీమణుల ఇళ్లకు వెళ్లి వారి చేతి భోజనాన్ని ఆరగించి, వారికి కానుకలను బహూకరిస్తారు.

తూర్పున కాళీపూజలు

దీపావళి రోజున దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో లక్ష్మీదేవి పూజలు చేయడం ఆనవాయితీగా ఉంటే, తూర్పు ప్రాంతాల్లోని ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, అసోం రాష్ట్రాల్లో కాళీపూజలు చేస్తారు. కాళీపూజను ఒడిశా, బెంగాల్, అసోంలలో శ్యామాపూజగా కూడా వ్యవహరిస్తారు. బిహార్‌లోని మైథిలీ ప్రజలు దీనిని మహానిశా పూజగా వ్యవహరిస్తారు. పద్దెనిమిదో శతాబ్దిలో బెంగాల్‌లోని నవద్వీప ప్రాంతాన్ని పాలించిన రాజా కృష్ణచంద్ర హయాంలో కాళీపూజలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. వీధుల్లో కాళీమాత మంటపాలను ఏర్పాటు చేసి పూజలు చేసే పద్ధతి అప్పటి నుంచి నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇదేరోజు రామకృష్ణ పరమహంస శారదాదేవిని షోడశిగా ఆరాధించినట్లు ప్రతీతి. అందుకే బెంగాల్‌లోని కాళీ మంటపాల్లో రామకృష్ణ పరమహంస, శారదాదేవి దంపతుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేసి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది.

ఇతర మతాలకూ పవిత్ర దినం

దీపావళిని హిందువులతో పాటు జైనులు, బౌద్ధులు, సిక్కులు కూడా పవిత్ర దినంగా భావిస్తారు. వర్ధమాన మహావీరుడు దీపావళి నాడే నిర్యాణం చెందాడు. ఆయన ప్రధాన శిష్యుడైన గౌతమ గాంధార స్వామి అదే రోజున ‘కేవల జ్ఞానం’ పొందాడు. అందుకే జైనులు దీనిని సంస్మరణ దినంగా జరుపుకొంటారు. జైన దేవాలయాల్లో దీపావళి ఉదయాన్నే వర్ధమాన మహావీరుడికి ‘నిర్వాణ లడ్డూ’ను నివేదిస్తారు. నేపాల్, మయాన్మార్ దేశాల్లో వజ్రయాన శాఖకు చెందిన బౌద్ధులు దీపావళిని వేడుకగా జరుపుకొంటారు. నేపాల్‌లోని నేవార్ తెగవారు దీపావళి రోజున ఇళ్ల ముంగిళ్లలో దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని, విష్ణువును ఆరాధిస్తారు. మయాన్మార్‌లోనైతే పగోడాలను సైతం దీపాలతో దేదీప్యమానంగా అలంకరిస్తారు. మొఘల్ చక్రవర్తి జహంగీర్ చెర నుంచి సిక్కు గురువు గురు హరగోవింద్ విముక్తి పొందినది దీపావళి రోజునే కావడంతో సిక్కులు దీనిని పవిత్ర దినంగా భావిస్తారు. దీనిని వారు ‘బందీ ఛూడ్ దివస్’గా పాటిస్తారు. సిక్కులు తమ దేవాలయాలను దీపాలతో అలంకరించి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకొంటారు.

దేశదేశాల్లో దీపావళి

దీపావళి వేడుకలు భారతదేశంలోనే కాకుండా హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కుల జనాభా ఎక్కువగా ఉండే నేపాల్, భూటాన్, శ్రీలంక, మయాన్మార్, థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, ఫిజీ, మారిషస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, కెన్యా, సురినామ్, గుయానా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, బ్రిటన్, కెనడా, అమెరికా, ట్రినిడాడ్ అండ్ టొబాగో తదితర దేశాల్లోనూ ఘనంగా జరుగుతాయి. నేపాల్‌లో కూడా భారత్ మాదిరిగానే ఐదు రోజుల వేడుకలు జరుగుతాయి. దీపావళిని నేపాలీలు ‘తీహార్’ అని, ‘స్వాంతి’ అని వ్యవహరిస్తారు. దీపావళి సందర్భంగా నేపాలీలు లక్ష్మీపూజలతో పాటు పశుసంపదను కూడా పూజిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేన్, మెల్‌బోర్న్ తదితర నగరాల్లో అక్కడ స్థిరపడ్డ భారతీయులతో పాటు స్థానిక ఆస్ట్రేలియన్లు కూడా ఉత్సాహంగా బాణసంచా కాల్చే వేడుకల్లో పాల్గొంటారు. ఇండోనేషియాలో దీపావళిని ‘గులుంగాన్’గా వ్యవహరిస్తారు. ‘గులుంగాన్’ రోజున పూర్వీకుల ఆత్మలు భూమ్మీదకు వస్తాయని ఇండోనేషియన్లు విశ్వసిస్తారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో దీపావళి వేడుకల కోసం ప్రత్యేకంగా ‘దివాలీ నగర్’ అనే ప్రదేశమే ఉంది. దీపావళి రోజున ‘దివాలీ నగర్’ దీపాలంకరణతో, బాణసంచా కాల్పులతో దేదీప్యమానంగా మెరుపులీనుతూ కనువిందు చేస్తుంది. నేపాల్, శ్రీలంక, ఫిజీ, మారిషస్, సింగపూర్ తదితర దేశాల్లో దీపావళిని ప్రభుత్వ సెలవు దినంగా పాటిస్తారు. పాకిస్థాన్ ప్రభుత్వం సైతం ఈ ఏడాది దీపావళిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించడం విశేషం. పాకిస్థాన్‌లోని స్వల్పసంఖ్యాకులైన హిందువులతో పాటు అక్కడి ముస్లింలు, క్రైస్తవుల్లో కూడా కొందరు దీపావళి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. 

అగ్రరాజ్యాల్లో అధికారిక వేడుకలు

అగ్రరాజ్యాలైన బ్రిటన్, అమెరికాల్లో స్థిరపడిన హిందువులు దశాబ్దాలుగా దీపావళి వేడుకలను జరుపుకొంటూ వస్తున్నారు. అయితే దాదాపు దశాబ్ద కాలంగా లండన్ 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం వద్ద సైతం దీపావళి వేడుకలు అధికారికంగా నిర్వహిస్తూ ఉండటం విశేషం. గార్డన్ బ్రౌన్ బ్రిటన్ ప్రధానిగా ఉండగా మొదలైన ఈ ఆనవాయితీ ఇప్పటికీ కొనసాగుతోంది. అమెరికాలో ఉండే దాదాపు ముప్పయి లక్షల మంది హిందువులు కూడా దశాబ్దాలుగా దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకొంటున్నారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక భవనం వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు నిర్వహించడం 2003 నుంచి మొదలైంది. ఆ తర్వాత 2007లో అమెరికన్ కాంగ్రెస్ దీపావళికి అధికారిక హోదా కల్పించింది. వైట్‌హౌస్‌లో జరిగే దీపావళి వేడుకల్లో స్వయంగా పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామానే. ఒబామా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక తొలిసారిగా 2009లో జరిగిన వేడుకల్లో ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఇదిలా ఉంటే, దీపావళి సందర్భంగా అమెరికా ప్రభుత్వం ఈ ఏడాది అక్టోబర్ 5న ప్రత్యేకంగా పోస్టల్ స్టాంపును కూడా విడుదల చేయడం విశేషం.

బాణసంచా చరిత్ర

బాణసంచా కాల్చనిదే దీపావళి సంబరాలకు నిండుదనం ఉండదు. దీపావళి అంటే దీపాల వరుస అనే అర్థం ఉంది. అలాగని కేవలం ఇళ్ల ముందు వరుసగా దీపాలను పేర్చి అంతటితో సరిపెట్టుకోరు. బాణసంచా అందుబాటులోకి రాకముందు కేవలం దీపాలు వెలిగించి, పూజపునస్కారాలతో సరిపెట్టుకునే వారేమో గాని, బాణసంచా అందుబాటులోకి వచ్చాక బాణసంచా కాల్చనిదే దీపావళి వేడుకలు పూర్తయిన సందర్భాలు చరిత్రలో చాలా అరుదు. ఎప్పుడో ఔరంగజేబు కాలంలో కేవలం కొద్ది సంవత్సరాలు మాత్రమే బాణసంచా వాడుకపై నిషేధం అమలులో ఉండేది. ఆ తర్వాత మరెన్నడూ బాణసంచా వెలుగులు లేకుండా దీపావళి జరగనే జరగలేదు. బాణసంచాకు దాదాపు 2200 ఏళ్ల చరిత్ర ఉంది. చైనా దేశస్థులు మొదట్లో జంతువులను భయపెట్టడానికి వెదురు బొంగులను కాల్చి పేలుడు శబ్దాన్ని సృష్టించేవారు. కాలక్రమంలో వారు పొటాషియం నైట్రేట్‌ను (సురేకారం) కనుగొన్నారు. సురేకారం, గంధకం, బొగ్గు రకరకాల పాళ్లలో మేళవించడం ద్వారా పేలుడు పదార్థాలను, వాటిలో మరికొన్ని రసాయనాలను మేళవించడం ద్వారా రకరకాల బాణసంచా సామగ్రిని తయారు చేయడం తెలుసుకున్నారు. బాణసంచా వెలుగులు, పేలుళ్లతోనే దీపావళికి కళాకాంతులు వస్తాయని చాలామంది భావిస్తారు. ఇదిలా ఉండగా బాణసంచా వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతోందనే ప్రచారం ఊపందుకోవడంతో ఇటీవలి కాలంలో కొందరు బాణసంచా లేకుండానే దీపావళి జరుపుకొంటున్నారు. అయితే వారి సంఖ్య చాలా తక్కువ.

దీపావళి జాగ్రత్తలు

► బాణసంచా కారణంగా అగ్నిప్రమాదాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. టపాసులు చేతిలోనే పేలిపోవడం, చిచ్చుబుడ్లు, మతాబుల నుంచి శరవేగంగా ఎగజిమ్మే నిప్పురవ్వలు ఒంటి మీదపడి గాయపడటం వంటి ప్రమాదాలు అక్కడక్కడా చోటు చేసుకుంటూ ఉండటం మామూలే. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు లేకుండా ఆనందంగా దీపావళి జరుపుకోవచ్చు. ప్రమాదాలు లేని దీపావళి కోసం ఈ జాగ్రత్తలు పాటిద్దాం...

► బాణసంచా కాల్చేటప్పుడు వీలైనంత వరకు కాస్త వదులైన మందపాటి కాటన్ దుస్తులను ధరించడం, తప్పనిసరిగా కాళ్లకు చెప్పులు ధరించడం మంచిది.

►కాకరపువ్వొత్తులు, మతాబులు వంటివి కాల్చేటప్పుడు చేతిని పూర్తిగా చాచి ఒంటికి దూరంగా ఉండేలా వాటిని కాల్చడం మంచిది. చిన్నపిల్లలు వీటిని కాల్చేటప్పుడు పెద్దలెవరైనా వారికి సహాయంగా ఉండటం మంచిది.

► టపాసులు, బాంబులు వంటి పేలుడు పదార్థాలను ఇళ్లకు దూరంగా ఆరుబయట ప్రదేశంలో కాల్చడం మంచిది. పిల్లలు ఇలాంటి పేలుడు పదార్థాలను ఇళ్ల దగ్గర కాల్చకుండా పెద్దలు వారిపై ఓ కన్నేసి ఉంచడం క్షేమం.

► కొన్ని రకాల టపాసులను కాల్చేసిన తర్వాత కూడా కొంతసేపటి వరకు వాటికి నిప్పు అంటుకునే ఉంటుంది. అలాంటి వాటిని ఎప్పటికప్పుడు నీటి బకెట్‌లో పడేయడం వల్ల ప్రమాదాలను అరికట్టవచ్చు.


► బాణసంచా కాల్చేటప్పుడు ఇంట్లో ఉన్న అందరూ ఒకేసారి కాల్చకుండా, ఒకరి తర్వాత ఒకరు కాల్చడం ద్వారా కూడా చాలా వరకు ప్రమాదాలను నివారించవచ్చు.

► రాకెట్లు, తారజువ్వలు వంటివి కాల్చేటప్పుడు అవి ఇతరుల ఇళ్లలోకి చొరబడకుండా వాటి దిశ సరిగా ఉండేలా చూసుకోవాలి.


దీపావళి అంటే మన అందరికి చాలా ఇష్టం . ఐతే చాలామంది లో దీపావళి అంటే దీపాలు వెలిగించటమే కదా!

అని కాని దీపావళి కి చాలా విశిష్టత వుంది . దీపావళి పండుగ చేసుకునే విధానం కుడా వుంది . ఇవి చాలామందికి తెలిదు. పూర్వపు పద్ధతులు మరచి పోయారు. ఆ రోజుకి స్వీట్స్ కొనుక్కొని వచ్చి వెరైటి వంటలుచేసుకొని , రాత్రి దీపాలు వెలిగించి టపాసు కాల్చుకొని ఎంజాయ్ చేయటమే అనుకుంటున్నారు మనలోచాలామంది.

దీపావళి పండుగ ఆశ్విజ బహుళ చతుర్దశి అమావస్య నాడు వస్తుంది. ఇది రెండురోజుల పండుగ త్రయోదసినాటి రాత్రి అపమృత్యు నివారణ కోసం ప్రమిదలతో దీపాలు వెలిగించి ఇంటిముందు వుంచాలి.

నరకచతుర్దసిని ప్రేతచతుర్దసి అని కుడా అంటారు. ఎందుకంటే ఇది యమునికి కుడా ప్రీతి కలిగించేరోజు.యముడు పితృత్వం కూడా ఉన్నా దేవుడు. సూర్యోదయానికి ముందు, రాత్రి తుదిజాములోనువ్వులనూనెతో తలంటు పోసుకోవాలి. ఇలా చేయడంలో చాలా విశేషం వుందిట. దీపావళి పర్వదినాలలోనువ్వుల నూనెలో లక్ష్మి దేవి ఉంటుందిట. . అలాగే నదులు, చెరువులు, బావులు, కాలువలు, వంటి అన్నిజలవనరులలోకి గంగాదేవి ఆ రోజుల్లో

ప్రవేశిస్తుందిట . నువ్వులనునేల్తో అభ్యంగనస్నానం చెయ్యడం వల్ల దారిద్ర్యం తొలగి గంగాస్నాన ఫలం లభిస్తుందిట. నరక బాధలు తప్పుతాయట . చివరకు సన్యాసులు కుడా చేస్తారుట.

స్నానం కూడా ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యడం కాదు. సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియల కాలం అరుణోదయం అంటారు . ఆలోగా చెయ్యాలి.

స్నానం చేసేటప్పుడు ఉత్తరేణి కొమ్మను శిరస్సు మీద తిప్పుతూ ఈ శ్లోకం పాటించాలి .


శీతలోష్ట సమాయుక్త సకంటక దలాన్విత

హరపాప మపామార్గ భ్రామ్యమానః పునః పునఃఅపామార్గం అంటే ఉత్తరేణి . ఇలాచేయటం వల్ల నరకం రాదట. నువ్వులనునే , ఉత్తరేను మొదలైనవి ప్రకృతితో మనకు ఎంత ముడిపది వున్నామో తెలుస్తుంది. ప్రక్రుతిసామరస్యంలో మనం జేవించాలని ఇందులో సందేశం. ఇందు వల్ల నరకంబయం అన్నది ఉంటే అది మన భావన ద్వారా ఆ స్థితికి చేరుకున్తామన్నామాట. స్వర్గనరకాలు మనస్సు నందు కల్గేవే. ఇది అంతా మనసుకి శిక్షణ ఇవ్వటమే.

స్నానం తరువాత `యమాయ తర్పయుఆమి, తర్పయామి, తర్పయామి' అంటు మూడుసార్లు నువ్వులతో యమునికి తరపనాలు ఇవ్వాలి.

ఈ శ్లోకం చదవాలి.

యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ
వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ
ఔదుమ్బరాయ ధర్మాయ నీలాయ పరమేష్టినే
మహొదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః

దీపావళి రోజు మినపాకుతో చేసిన కూరతొ భోజనం చేస్తే మంచిది అని అంటారుట.

దీపదానం:

సాయంకాలం ప్రోదోషసమయంలో నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి . విష్ణ్వాలయంలో, శివాలయాలలో, మతాలలో , దీపాలు పెట్టడంతో పాటు నదీతీరాలలో, చేరుగాట్లు, తోటలు, వీధులు, పర్వతాల్పైన చివరకు స్మసానాలల వద్ద కుడా దీపాలు పెట్టాలని పెద్దల శాసనం. దీపావళి రోజున పితృదేవతలు తమతమ సంతానం ఇంటిని దర్సిస్తారట. వారికి మనం పెట్టె దీపాలే దారి చుపిస్తాయట

దీపావళినాడు మరి ముఖ్యంగా ఐదు ప్రదేశాలలో దీపాలు పెట్టాలిట .అవి:

1) ఇంటిధ్వారం.

2) ధాన్యపుకొట్టు.

౩) బావి.

4) రావిచెట్టు.

5)వంటిల్లు . ఇంట్లో ఆశుచం ( మైల) పాటిస్తున్నాసారే ఈ ఐదు చోట్లా దీపం పెట్టవలసిందే.

ఉల్కాదానం:

యముడు దక్షినదిసగా ఉంటాడు. మగపిల్లలు ఆ దిక్కువైపు నిలబడి దివిటీలు వెలిగించి పితృదేవతలకు దారి చూపించాలి. తర్వాత కాళ్ళు కడుక్కుని లోపలికి వచ్చి ఏదైనా తీపి పదార్ధాలు తినాలి.

లక్ష్మి పూజ :

దీపాలు వెలిగించి వాటిలోకి లక్ష్మి దేవిని ఆహ్వానించి లక్ష్మీపూజ చెయ్యాలి. ఆ తర్వాత బాణసంచా వెలిగించాలి. అర్ధరాత్రి స్త్రీలు అందరు కలసి చేతలు, వాయిద్యాలు మోగించాలి. దారిద్రాన్ని దూరంగా తరిమికొట్టడానికి ఇలా చెయ్యడం ను "అలక్ష్మినిస్సరణం" అని అంటారు. మనం టపాసు పెల్చడంలోని అర్ధం ఇదే.

ఈ టపాసుల వల్ల వర్షాకాలంలో పుట్టిన ఎన్నో క్రిములు కీటకాలు ముక్తి ని పొందుతాయి. కార్తీకమాసం అంతా దీపాలు వెలిగించేది అందుకే.

రోజూ సాయంకాల దీపం వెలిగించి శ్లొకం చదివి తే చాలామంచిధీ.

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||

దీపజ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు.

దీపం జ్యొతిః పరబ్రహ్మ,
దీపం జ్యోతి జనార్దనః
దీపేన హరతే పాపం
సంద్యాదీపం నమోస్తుతే,

సాయంత్రం సంద్యాదీపం వెలిగించీ ధానికి నమస్కారిచుట చాలాపున్యము. దీపం అంటే పరమాత్మ . దీపంకు నమస్కరించుట పరమాత్మకు నమస్కరించుటే . 


దిబ్బు దిబ్బు దీపావళి


మళ్ళీ వచ్చే నాగులచవితి...
అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయం గా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం. ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. దీపావళి రోజు శ్రీమహాలక్ష్మికి పూజ చేయాలి. శ్రీసూక్తము గాని, లక్ష్మీసహస్రనామ స్తోత్రం కానీ, అష్టోత్రంకానీ చేసుకోవటంవల్ల లక్ష్మీ కటాక్ష్మము లభిస్తుందిటమరి.

అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.


దీపావళి చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. శ్రీకృష్ణుడు సత్యభామ సహకారంతో నరకాసురుణ్ణీ వధించాడు గనుక ప్రజలు ఆనందంతో మరునాడు దీపావళి సంబరం చేసుకుంటారని ఒక కథ. ఇంకో కథకూడా ఉంది. లంకలో రావణుని సంహరించి , రాముడు సీతాసమేతంగాఅయోధ్య కు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు. ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజును కొత్త సంవత్సరంగా పాటిస్తారు.
    .










No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list