MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఉడుపి భూలోక వైకుంఠం _special story to Udupi temple



ఉడుపి భూలోక వైకుంఠం
special story to Udupi temple


సరిగ్గా బ్రాహ్మీముహూర్తం రాగానే శంఖనాదాలు, దుందుభులు, నగారాలతో ప్రతిధ్వనిస్తుంది ఉడుపి మఠం. ఆలయ పూజార.ులతో సహా మuý.ంలో పని చేసేవార.ందర.ూ ఆ దివ్యనాదాలతో మేల్కొని, తమ దైనందిన చర్యలు ప్రారంభిస్తారు. కర్ణాటకలోని పేరెన్నికగన్న పుణ్యక్షేత్రాల్లో ప్రసిద్ధి పొందినది ఉడుపి. ధనిక– పేద; అగ్ర– నిమ్న కులాలనే భేదభావాలు మనుషులకే తప్ప, పర.మాత్ము్మడికి లేవనేందుకు సాక్షాత్తూ ఆ కృష్ణభగవానుడే నిదర.్శనం చూపించిన పుణ్యస్థలి ఉడుపి. కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాకు పశ్చిమంగా, మంగుళూర.ుకు 60 కి.మీ దూర.ంలో ఉంది. ఉడుపి పుణ్యక్షేత్రం. నిత్యం ఉత్సవాలతో, లక్షలాది మంది యాత్రికులతో కళకళలాడుతూ ఉంటుంది ఈ పవిత్ర యాత్రాస్థలం. ‘ఉడుప’(చంద్రుడు)’ అనే పదాన్ని అనుసరించి ఈ క్షేత్రానికి ఉడుపి అనే పేర.ు వచ్చింది. పేర.ుకు తగ్గట్టే ఈ పవిత్ర క్షేత్రం స్వచ్ఛంగా, వెన్నెలలో ప్రకాశించే చంద్రుడిలా అద్వితీయమైన, అగోచర.మైన దివ్యచైతన్యంతో అక్కడక్కడ పెద్ద పెద్ద మామిడి, పనస తోటలు, సువిశాలమైన పొలాలగుండా ప్రయాణించే యాత్రికులకు కొబ్బరి, పోక చెట్లు తమ తలలూపుతూ స్వాగతం పలుకుతాయి.

విశిష్టాద్వైత మత స్థాపకులు మధ్వాచార్యుల పవిత్ర హస్తాల మీదుగా స్థాపితమైన మఠం ఉడుపి. కనకదాసు అనే పర.మభక్తుడిని నిమ్న కులస్థుడనే కార.ణంతో పూజార.ులు కృష్ణ దర.్శనానికి నిరాకరించగా స్వయంగా తానే తన ప్రియభక్తునికి ప్రత్యక్ష దర.్శనమిచ్చిన కర.ుణామూర్తి ఉడుపి చిన్నికృష్ణుడు. ఉడుపి పూర్వపు పేరు శివళ్ళీ. ఇది పరశురామక్షేత్రాలలో ప్రథమస్థానం కలిగి ఉంది. ప్రతి సంవత్సరం, లక్షలాది భక్తులు కృష్ణుని దర్శనం చేసుకోవటానికి ఉడుపిని సందర్శిస్తారు. స్వామి దర్శనం నవరంధ్రాలున్న కిటికీ ద్వారా చేసుకోవలసి ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత. ఉడుపి రథవీధిలో శ్రీ కృష్ణమందిరం ఉంది. ఉత్తర ద్వారం గుండా గుడిలోకి ప్రవేశించినప్పుడు కుడివైపు దేవాలయ కార్యాలయం, ఇంకొద్దిగా ముందుకు వెళ్ళితే మధ్వ సరోవరం కనిపిస్తుంది. ప్రధాన ఆలయానికి ద్వారం ఎడమవైపు ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవ ద్వారం వస్తుంది. దీని ద్వారా గర్భగుడిలో ప్రవేశం పీఠాధిపతులకు తప్పితే అన్యులకు ఉండదు. చెన్నకేశవ స్వామి ద్వారం నుండి ముందు వెళ్ళితే ప్రదక్షిణం చేసిన తరువాత శ్రీకృష్ణ దర్శనం వెండితో తాపడం పెట్టిన నవరంధ్రాల గవాక్షం గుండా చేసుకోవచ్చు. గర్భగుడికి కుడివైపు ముఖ్యప్రాణ దేవత (హనుమంతుడు), వామభాగాన గరుడ దేవర ఉన్నారు. స్వామి దర్శనం చేసుకొని ముందుకు వెళ్ళి దక్షిణ మార్గం వైపు వెళితే, ఎడమభాగాన మధ్వాచ్యారులు మంటపం కనిపిస్తుంది. ఉడుపి శ్రీకృష్ణ మఠానికి అనుసంధానంగా అష్టమఠాలు కృష్ణ మఠాలు ఉన్నాయి. ఈ ఎనిమిది మఠాలు ఉడుపి రథవీధిలో, శ్రీ కృష్ణ దేవాలయానికి చుట్టూ ఉంటాయి. అవి: పుత్తగె, పేజావర, పలిమారు, అదమారు, సోదె, శీరూరు, కాణియూరు, కృష్ణాపుర.

మధ్వాచార్యులవారు ఒకసారి సముద్రంలో తుఫానులో చిక్కుకున్న ఓడను, అందులోని ప్రయాణికులను తన తపశ్శక్తితో రక్షించాడు. అప్పుడు ఓడలోని నావికుడు ఆయనకు గోపీచందనం మూటను కానుకగా సమర్పించాడు. మధ్వాచార్యులు ఆ మూటను విప్పి చూడగా, ఆ చందనపు కణికల మధ్య చిన్నికృష్ణుడి విగ్రహం కనిపించింది. అది శ్రీకృష్ణుడి లీలగా భావించిన మధ్వాచార్యులవారు ఆ కృష్ణుడి విగ్రహాన్ని ఉడుపిలో ప్రతిష్ఠించారు. అదే మనం చూస్తున్న విగ్రహం. కనకదాసుకు కృష్ణపరమాత్మ పశ్చిమాభిముఖుడై దర్శనమిచ్చిన చోటనే ఒక మంటపం కట్టించారు. ఆ మంటపానికే కనకదాసు మంటపమని పేరు. ఉడుపిలో జరిపే పండుగలు, పర.్వదినాలు: మకర. సంక్రాంతి, మధ్వ నవమి, హనుమాన్‌ జయంతి, శ్రీ కృష్ణ జన్మాష్టమి, నవరాత్రి మహోత్సవం, మధ్వ జయంతి (విజయ దశమి), నర.క చతుర.్దశి, దీపావళి, గీతాజయంతి వంటి పండుగలను పర్యాయ మఠంలో అంగర.ంగవైభవంగా జర.ుపుతార.ు.

దగ్గరలో ఉన్న మరికొన్ని ముఖ్య ప్రదేశాలు: కొల్లూరు ముకాంబికా దేవాలయం, మరవంతె బీచ్, మల్పే రేవు, కాపు దీపస్తంభం (కాపు లైటు హౌసు), కార్కళ లోని గోమటేశ్వరుడు, వేణూరు లోని గోమటేశ్వరుడు, అత్తూరులో సెయింట్‌ లారెన్స్‌ ఇగర్జి, సెయింట్‌ మేరీస్‌ ద్వీపం, మూడబిదరెలో సావిరకంబద బసది మణిపాల్, బైందూరు కోసళ్ళి జలపాతం, జామియా మసీదు, 200 సంవత్సరాల జామియా మసీదులో సరికొత్తగా 18, 000 మంది ప్రార్థనలు చేసే విధంగా ప్రార్థనాశాలలున్నాయి. ఇక్కడ 3000 మంది భక్తులు బసచేయవచ్చు.
పాజక: ఉడిపి నుండి 12 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ మాధవాచార్యుడు ద్వైతసిద్ధాంత ప్రసంగం చేశాడు. కొల్లూరు (ఉడిపి): ఉడిపి నుండి 74 కి.మీ దూరంలో ఉంది. మూకాంబికాదేవి నివాసిత ప్రదేశమని భక్తుల విశ్వాసం. కర్కల: ఉడిపి నుండి 37 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ జైన బసదీలు (ఆలయాలు) గోమటేశ్వర శిల్పం బృహద్రూపం ) ప్రత్యేక ఆకర్షణ. అనెగుడ్డె: ఉడిపి నుండి 30 కి.మీ.లు. ఇక్కడ ప్రముఖ గణేశాలయం ఉంది. ఆత్తుర్‌ చర్చి: ఉడిపి నుండి 25 కి.మీ.లు. ఇక్కడ ఏటా నిర్వహించే సంతకు కులమతభేద రహితంగా ప్రజలు వస్తారు. బర్కూర్‌: ఉడిపి నుండి 15కి.మీల దూరం. జైన బసదీలు ఉన్న బర్కూరు తులునాడు రాజులకు రాజధాని. సాలిగ్రామ: ఉడిపి నుండి 27కి.మీల దూరం. ఇక్కడా గురునరసింహస్వామి ఆలయం ఉంది. పరంపల్లి: ఇక్కడ ఎనిమిది వందల ఏళ్ల నాటి పురాతనమైన విష్ణుమూర్తి ఆలయం ఉంది. పెర్నకిల: ఇక్కడ ఒక పురాతన గణేశుని ఆలయం ఉంది. పెర్దోర్‌: ఉడిపి నుండి 22 కి.మీ దూరంలో ఉంది. అగుంబే – షిమోగా రాష్టీయ్ర రహదారి సమీపంలో అనంతపద్మనాభస్వామి ఆలయం ఉంది.

హరియాద్క: ఉడిపి నుండి 16 కి.మీలు. పురాతనమైన వీరభద్రాలయం ఉంది. శంకరనారాయణ: ఉడిపి నుండి 40 కి.మీలు. శకరనారాయణాలయం ఒక సరోవరం మధ్యన ఉండడం విశేష ఆకర్షణ. మారనకట్టె: ఉడిపి నుండి 45 కి.మీలు. ఈప్రాంతం ప్రకృతి ఆరాధకులకు స్వర్గభూమివంటిది. మందర్హి: ఉడిపి నుండి 20 కి.మీలు. ఇక్కడ అమ్మనవారు (దుర్గాపరమేశ్వరి) ఆలయం ఉంది. ఇక్కడ ప్రసాదంగా ఇచ్చే ‘దోశ‘ సంతానప్రాప్తి కలిగిస్తుందని ప్రజలు విశ్వాసం. ముదుహోలె కర్కడ: ఇక్కడ పురాతన దుర్గాపరమేశ్వరి ఆలయం ఉంది. సోమేశ్వర వన్యప్రాణి అభయారణ్యం: ఇది ఉడిపి నుండి 40 కి.మీలు. ఇక్కడ అరుదైన జంతువులు, పక్షులు, ఔషధ మొక్కలు ఉన్నాయి. మూకాంబికా వన్యప్రాణి అభయారణ్యం: ఇది ఉడిపి నుండి 50 కి.మీలు. కుందపూర్‌– కొల్లూర్‌ రోడ్డు పక్కన విస్తరించి ఉంది. కుర్ధు తీర్ధ జలపాతాలు: ఉడిపి నుండి 42 కి.మీలు. పశ్చిమ కనుమలలోని దట్టమైన అరణ్యాల మధ్య, 300 అడుగులున్న ఒక అందమైన జలపాతం. ఋషుల తపస్సుతో ఈ మడుగు ఎంతో పవిత్రతను, ప్రాధాన్యతను సంతరించుకుంది. మంగ తీర్ధ: కుర్ధు తీర్ధకు ఎగువన మంగ తీర్ధ ఉంది. ఇది దట్టమైన అరణ్యాల మధ్య నిటారుగా ఉన్న పర్వతాలలో ఉంది కనుక ఇక్కడకు కోతులు తప్ప మానవమాత్రులు చేరలేరు కనుక దీనిని కోతుల తీర్థం అని కూడా అంటారు. బర్కన జలపాతం: ఉడిపి నుండి 54 కి.మీ దూరంలో ఉంది. ఇది పశ్చిమ కనుమలలో ఉడిపి, చికమగళూరు, శివమొగ్గ కూడలి ప్రాంతంలో ఉంది; బెల్కల్‌ తీర్థ జలపాతం, అరసిన గుండి, కుద్లు తీర్థ, కొసల్లి జలపాతం, సౌపర్ణిక, స్వర్ణ, చక్ర, సీత, వర్హి, కుబ్జ నదులున్నాయి. ఈ నదులలో అందమైన నదీ ద్వీపాలు ఉన్నాయి. వీటిని కుర్దూలు అంటారు. వీటిలో కొన్ని ద్వీపాలలో జనావాసాలు ఉన్నాయి.

విశేషాల ఉడిపి
శ్రీ కృష్ణుని రథానికి బ్రహ్మరథమని పేరు. ఇది బంగారంతో రూపొందింది. 
శ్రీ కృష్ణుని ఉత్సవ విగ్రహాన్ని రత్నఖచితమైన సింహాసనంపై ఉంచుతారు.
అలనాడు శ్రీ కృష్ణుడు కనకదాసుకు దర్శనమిచ్చిన గవాక్షం(కిటికీ)లోనుంచే ఈ నాటికీ భక్తులు స్వామిని దర్శనం చేసుకుంటున్నారు.

ఎలా వెళ్లాలి?
దేశంలోని అన్ని ప్రధాన నగరాలనుంచి మంగుళూరుకు రైళ్లు, బస్సులు ఉన్నాయి. అక్కడినుంచి
యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడుపికి బస్సులు, ప్రైవేటు వాహనాలలో చేరుకోవచ్చు. హైదరాబాద్‌ నుంచి ఉడుపికి నేరుగా బస్సులున్నాయి. హైదరాబాద్‌ డెక్కన్‌ నుంచి వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్‌ ఉంది. 
– డి.వి.ఆర్‌.భాస్కర్‌

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list