గత ఆగస్టులో ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ఐక్యరాజ్యసమితి వేదికగా ఎమ్మెస్ సుబ్బులక్ష్మికి సంగీత నివాళి అర్పించాడు. 360 డిగ్రీల కోణంలో చిత్రీకరించిన ఆ మ్యూజికల్ ట్రిబ్యూట్‌ను వర్చువల్ రియాలిటీ రూపంలో విఆర్ ఫిల్మ్‌గా విడుదల చేయబోతున్న సందర్భంగా రెహమాన్ ఇంటర్వ్యూ విశేషాలు...
మీ ట్రిబ్యూట్ కాన్సర్ట్ ఇప్పుడు వి.ఆర్ ఫిల్మ్‌గా రూపం పోసుకుంది. 360 డిగ్రీల్లో చిత్రించిన ఈ ఫిల్మ్ ప్రత్యక్ష అనుభవానికి ప్రత్యామ్నాయమవుతుందా?
ఆ ప్రత్యక్ష అనుభవానికి నోచుకోలేని వాళ్లకోసమే ఈ ఫిల్మ్. ఆ కాన్సర్ట్‌కి అందరూ రాలేరు కదా! యాభై ఏళ్ల క్రితం సుబ్బులక్ష్మి యుఎన్‌కి వెళ్లారు. ఇప్పుడు అదే వేదిక మీద నేను ఆమెకు నివాళిగా కాన్సర్ట్ చేశాను. ఈ రెండు సంఘటనల్నీ అన్ని కోణాలనుంచి రికార్డు చేసి ఫిల్మ్‌గా రూపొందించటం అనేది గొప్ప ప్రయోగం. దీన్ని రెగ్యులర్ వీడియోగా కూడా రికార్డు చేయొచ్చు. కానీ అంతకంటే ఎత్తుకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే విఆర్‌లో రూపొందించాం. ఈ లైవ్ కాన్సర్ట్‌ని విఆర్‌లో చూస్తున్నప్పుడు దాన్లో ప్రేక్షకుడిగా ఉన్న అనుభవం కలుగుతుంది. అందుకే ఈ ప్రయోగం.
ప్రస్తుతం సంగీతాన్ని టెక్నాలజీ శాసిస్తోంది. సాంకేతికత లేని సంగీతాన్ని వినటం అనేది ఓ భ్రమగా మిగిలిపోయింది. దీనికి మీరేమంటారు?
భ్రమ కూడా అద్భుతంగా ఉంటుంది. విఆర్ ఫిల్మింగ్ అనే ప్రయోగం ప్రత్యక్ష అనుభవాన్ని తక్కువ చేయటం కానే కాదు. ఒక మరపురాని సందర్భాన్ని మళ్లీ మళ్లీ అనుభవంలోకి తెచ్చే అద్భుతమైన టెక్నాలజీ. ఉన్న చోటనే హిమాలయాలు, అంటార్కిటికాలో ఉన్న అనుభూతిని పొందే వీలుంటుంది. మా అమ్మ పుట్టినరోజునాడు ఆమెతో విఆర్ ద్వారానే కనెక్ట్ అయ్యాను.అదొక అద్భుతమైన అనుభవం.
ప్రొడ్యూసర్‌గా మారాక గత కొద్ది కాలంగా కథ చెప్పాలనే మీ కోరిక క్రమంగా పెరుగుతున్నట్టు అనిపిస్తోంది. నిజమేనా?
ఒక మ్యుజీషియన్‌గా సంగీతంతో ప్రపంచాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఆ ప్రయత్నంలో ప్రపంచ ప్రజలు రెలిజియన్, జెండర్, మనీ...ఇలా వర్గాలుగా విడిపోయి ఉండటం కనిపించింది. ఈ విషయాల గురించి వాళ్లతో సంగీతంలోనే సంభాషించాలనుకుంటాను. నేను చెప్పాలనుకున్నవి కొన్ని సంగీతంలో పలకకపోవచ్చు. కానీ ఈ ప్రపంచంలో భాగంగా బ్రతుకుతున్నందుకు అది నా బాధ్యతగా భావిస్తాను. నా కథలన్నీ ఇలా నేను వ్యక్తం చేయాలనుకున్న భావాలే!
సంగీతం పరిధి తగ్గిపోతోందని ఎప్పుడైనా ఫీలయ్యారా?
సంగీతం మీద దాడి పెరుగుతోంది. నాణ్యత కొరవడి పరిధులకే పరిమితమైపోతోంది. ప్యూర్ మ్యూజిక్ సినిమా చూస్తున్నప్పుడే వినగలం. అదే పాటను డౌన్‌లోడ్ చేసుకుని ఐపాడ్‌లో వింటే పాట స్వచ్ఛత తరిగిపోతోంది కదా! నేను రూపొందించిన పాటను ప్రత్యక్షంగా కాకుండా యూట్యూబ్‌లో క్లిప్‌లో వింటే దాన్లో నోట్స్‌కు నేనెంతవరకూ న్యాయం చేశానో మీకెలా తెలుస్తుంది? కానీ ఈ పరిస్థితిని మార్చలేం.
మణిరత్నంతో కలిసి చేసిన సినిమాలతో మొదలుకుని మీరందించిన గొప్ప సంగీతం మూలాలన్నీ మీ ప్రాంతంతో పెనవేసుకున్నవే! అప్పటి కథలతో పోలిస్తే ఇప్పటి యువ రచయితల కథలు ఎలా ఉంటున్నాయి?
అప్పట్లో ఒకరి ఆలోచన, భావాల్ని మరొకరం పూర్తిగా అర్థం చేసుకుని పని చేసేవాళ్లం. అలా రూపొందినవే రోజా, బొంబాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమా తీసేవాళ్లు, కథ చెప్పేవాళ్ల మధ్య చాలా మార్పొచ్చింది. మనం ఎంత కొత్తగా, ప్రత్యేకంగా ఉండగలిగితే అంత ఎక్కువగా గుర్తింపు పొందుతాం. ఇందుకు సత్యజిత రే మంచి ఉదాహరణ. మన దేశం పట్ల ఆయన దృక్పథం నిజానికి ఎంత దగ్గరగా ఉంటుందో అంతే ఉన్నతంగా కూడా ఉంటుంది.
ఇండిపెండెంట్‌గా సినిమా తీసేవాళ్లు సంగీతం కోసం మిమ్మల్ని ఆశ్రయించలేని పరిస్థితి ఉంది?
నేనే ఎందుకు? భారతదేశంలో ఎంతోమంది గొప్ప సంగీత దర్శకులున్నారు. కొత్త ఆలోచనతో, కొత్త కథతో వచ్చే వాళ్ల కోసం పని చేయాలని నేనూ ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నాను.
మీరు మొదటిసారి కథ అందిస్తున్న చిత్రం గురించి చెప్తారా?
ఈ సినిమాకు విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకులు. దీని గురించి ఆరేళ్లుగా చర్చిస్తున్నాం. సంగీతంతో తనని తాను తెలుసుకోవాలని సాగే అన్వేషణే ఈ కథ.
ప్రస్తుతం మీరు ఐదు సినిమాలకు వర్క్ చేస్తున్నారు. ఇందుకోసం చెన్నై, లాస్ ఏంజిలిస్స్ మధ్య అదే పనిగా తిరుగుతున్నారు. లైవ్ షోస్ చేస్తున్నారు. వీటితోపాటు ఇండియన్ టాలెంట్‌ని అంతర్జాతీయంగా పరిచయం చేసే నాఫ్స్ ఇనిషియేటివ్...ఇన్ని పనుల్లో మీకు తీరిక ఎక్కడ? అసలు మీరు నిద్ర పోతారా?
నిద్రపోతాను...విమానాల్లో! ఇన్ని పనులా అనుకుంటేనే భయం అనిపిస్తుంది. కానీ నిజానికి నా దృక్ఫథంతో సమానంగా నాతో నడిచే తెలివైన యువకులు నా చుట్టూ ఉన్నారు. కాబట్టి అంతకంటే ఎక్కువే చేయగలమనిపిస్తుంది. నా సంగీతంతో ప్రజలందర్నీ చేరువ చేయాలనుకుంటాను. నేను చేసే ప్రతి పనీ అందుకోసమే! అలా చేయలేకపోతే నా పనికి అసలు అర్థమే లేదు.
ఒక మ్యుజీషియన్‌గా సంగీతంతో ప్రపంచాన్ని విశ్లేషించే ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఆ ప్రయత్నంలో ప్రపంచ ప్రజలు రెలిజియన్, జెండర్, మనీ...ఇలా వర్గాలుగా విడిపోయి ఉండటం కనిపించింది. ఈ విషయాల గురించి వాళ్లతో సంగీతంలోనే సంభాషించాలనుకుంటాను. నేను చెప్పాలనుకున్నవి కొన్ని సంగీతంలో పలకకపోవచ్చు. కానీ ఈ ప్రపంచంలో భాగంగా బ్రతుకుతున్నందుకు అది నా బాధ్యతగా భావిస్తాను.
సంగీతం మీద దాడి పెరుగుతోంది. నాణ్యత కొరవడి పరిధులకే పరిమితమైపోతోంది. ప్యూర్ మ్యూజిక్ సినిమా చూస్తున్నప్పుడే వినగలం. అదే పాటను డౌన్‌లోడ్ చేసుకుని ఐపాడ్‌లో వింటే పాట స్వచ్ఛత తరిగిపోతోంది కదా! నేను రూపొందించిన పాటను ప్రత్యక్షంగా కాకుండా యూట్యూబ్‌లో క్లిప్‌లో వింటే దాన్లో నోట్స్‌కు నేనెంతవరకూ న్యాయం చేశానో మీకెలా తెలుస్తుంది? కానీ ఈ పరిస్థితిని మార్చలేం.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565