MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఇన్ఫెక్షన్లకు ఎదుర్కొనే వాము-Bishopsweed, Abdominal pain, వాము, కడుపునొప్పి


ఇన్ఫెక్షన్లకు ఎదుర్కొనే వాము
గుడ్‌ ఫుడ్‌
కడుపునొప్పి వస్తోందంటూ చిన్న పిల్లలు తల్లితో చెప్పగానే తల్లులు తినిపించే ఇంటి ఔషధం వాము. అప్పట్నుంచి మొదలుకొని చాలా వంటకాల్లో వాము పంటి కిందికి రాగానే దాన్ని నమిలి ఆస్వాదించడం అందరికీ అనుభవంలోకి వచ్చే విషయమే. కడుపునొప్పిని తగ్గించడం మాత్రమే కాదు... వాము మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. అందులో కొన్ని...
∙మంచి జీర్ణప్రక్రియకు వాము తోడ్పడుతుంది. వామును నమిలినప్పుడు ఇంపుగా ఉండే ఒక సుగంధపదార్థపు రుచి మనకు తెలుస్తుంది. వాములో ఉండే థైమ్‌ అనే ఔషధగుణాలున్న నూనె వంటి పదార్థమే ఇందుకు కారణం. వామును నమిలినప్పుడు స్రవించే ఈ రసం కడుపులోకి వెళ్లగానే జీర్ణక్రియను ప్రేరేపించే అనేక ఎంజైములను స్రవించేలా చేసి జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది ∙వాములో పీచు పదార్థాలు కూడా ఎక్కువే. అవి జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడి మల బద్ధకాన్ని నివారిస్తుంది.
∙వాములోని శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్‌ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తాయి ∙వాములో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్‌ గుణాలు ఉన్నాయి. అందుకే వాము తినేవారికి బ్యాక్టీరియల్, ఫంగల్‌ ఇన్ఫెక్షన్ల నుంచి స్వాభావిక రక్షణ ఉంటుంది ∙వాము తినేవారిలో ఆస్తమా నియంత్రణలో ఉంటుంది ∙గర్భవతుల్లో ఉండే వికారం, వాంతుల ఫీలింగ్‌ (మార్నింగ్‌ సిక్‌నెస్‌) తగ్గించడానికి కూడా వామును ఉపయోగిస్తారు ∙వాములో మూడ్స్‌ను చక్కబరిచే గుణాలు ఉన్నాయి.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list