MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఆదర్శ హనుమ-Spiritually, Hanuman, ఆత్మీయం, హనుమ


ఆదర్శ హనుమ
ఆత్మీయం
నేటి కథానాయకుల నుంచి నేర్చుకోగలిగింది, నేర్చుకోవలసిందీ ఏమున్నా లేకపోయినా, యువత హనుమను చూసి నేర్చుకోవలసింది మాత్రం చాలా ఉంది. ఆయనను పూజించడం సరే, అసలాయనను ఎందుకు పూజించాలి, ఆయన నుంచి స్ఫూర్తిగా ఏమి తీసుకోవాలో చెబితే పిల్లలే కాదు, యువకులు కూడా హనుమను ఆదర్శంగా తీసుకోవాలనుకుంటారు. అవేమిటో చూద్దాం... స్వామి కార్యాన్ని నెరవేర్చడం కోసం నూరు యోజనాల విస్తీర్ణం గల సముద్రాన్ని అవలీలగా లంఘించాడు. తాను కనీసం ఎప్పుడూ చూసి ఎరుగని సీతమ్మను గుర్తించి, ఆమె ముందు శ్రీరాముని గుణగానం చేశాడు. తనపై ఆమెకు ఏమూలో శంక మిగిలి ఉన్నదని గ్రహించి ఆకాశమంత ఎత్తుకు ఎదిగి విశ్వరూపం చూపాడు. అడ్డువచ్చిన రాక్షసులను అవలీలగా మట్టుపెట్టాడు. బ్రహ్మాస్త్రం ఏ హానీ చేయదన్న వరం ఉన్నా, రావణుని సమక్షానికి వెళ్లేందుకు ఇంద్రజిత్తు వేసిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడి బ్రహ్మపట్ల తన విధేయతను చాటుకున్నాడు.
లంకాధీశుని కంటే ఎత్తుగా ఉండేట్లు తన వాలంతో ఆసనాన్ని ఏర్పరచుకుని దాని మీద ఆసీనుడయ్యాడు. నిష్కారణంగా అవతలివారికి హాని తలపెడితే తమకంతకన్నా ఎక్కువ కీడు జరుగుతుందన్న వాస్తవాన్ని నిరూపించేందుకు తన తోకకు పెట్టిన నిప్పుతోనే లంకాదహనం చేశాడు. సీతజాడకోసం పరితపిస్తున్న రామునికి అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా ‘దృష్ట్వాన్‌ దేవి’ (చూశాను సీతను) అని చెప్పి కొండంత ఉపశమనం కలిగించాడు. తాను ఆజన్మ బ్రహ్మచారి అయినప్పటికీ, ఆదర్శదంపతులైన సీతారాములను కలిపి భావితరాలకు ఆదర్శంగా నిలిచాడు. బుద్ధి, బలం, యశస్సు, ధైర్యం, చురుకుదనం, మాటకారితనం, పౌరుషం, పరోపకారం, అచంచలమైన ఆత్మవిశ్వాసం, దీక్ష, కార్యదక్షత, అపారమైన ప్రభుభక్తి, వజ్రంలా ప్రకాశించే ఆరోగ్యకరమైన శరీరం కలవాడు ఆంజనేయుడు. హనుమంతుని వంటి నమ్మినబంటు, దౌత్యవేత్త, మంత్రి మరెక్కడా కానరాడు. అందుకనే ఆయన చిరంజీవిగా.. ఆదర్శప్రాయుడిగా నేటికీ శాశ్వతంగా భక్తుల మనోఫలకంపై నిలిచిపోయాడు.

గోరింట వైద్యం!
గోరింటాకులను మెత్తగా నూరి, రాత్రివేళ అరికాళ్లకు పట్టిస్తే, పాదాల మంటలు తగ్గుతాయి.
గోరింటాకు కషాయంలో కొంచెం కాచు, కొంచెం మాచికాయ చూర్ణం కలిపి పుక్కిలిస్తే నోటి అల్సర్లు పోతాయి.
గోరింటాకు రసానికి సమానంగా, నువ్వుల నూనె కలిపి తైలం మాత్రమే మిగిలేలా సన్నటి మంటపై కాచి, ఆ తైలాన్ని త లకు మర్దన చేస్తే, తలవెంట్రుకల కుదుళ్లు గట్టిపడి వెంట్రుకలు రాలడం ఆగిపోతుంది.
ఆకులను నూరి ముద్దగా చేసి, బెణుకులపై కడితే వెంటనే ఉపశమనంలభిస్తుంది.
ఆకుల రసాన్ని గానీ, నూరిన ముద్దను గానీ నూనెలో కలిపి నుదుటిపై రాస్తే తలనొప్పి తగ్గుతుంది.
గోరింటాకును పసుపుతో చేర్చి ముద్దగా నూరి లేపనంగా వేస్తే చీము పట్టిన పుండ్లు సైతం మానిపోతాయి.
గోరింటాకు తోడుగా, నల్ల కరక్కాయలు, వేపాకులు, మామిడిపట్ట, దానిమ్మ మొగ్గలను సమభాగాలుగా తీసుకుని ముద్దగా చేసుకోవాలి. దాంట్లో కొన్ని చుక్కల నీళ్లు కలిపి పేస్ట్టులా తయారు చేసుకుని, ముఖం మీద లేపనంగా వేస్తే ముఖం ఎంతో కాంతివంతంగా తయారవుతుంది.

భలే బత్తాయి!
బత్తాయిలో పండులో మన శరీరానికి అవసరమైన ప్లావనాయిడ్స్‌, క్యాల్షియం, ఫాస్పరస్‌, ఐరన్‌, పొటాషియం, విటమిన్‌ బి- కాంప్లెక్స్‌, విటమిన్‌- సి వంటివి కావలసిన మోతాదులో ఉంటాయి.
బత్తాయి రక్తపోటును నియంత్రిస్తుంది. గుండెకు బలాన్నిస్తుంది.
బత్తాయి రసంలో రెండు చెంచాల తేనె కలిపి రాత్రివేళ నిద్రకు ముందు తీసుకుంటే సుఖ విరేచనం అవుతుంది.
అనారోగ్యంతో బాధపడుతున్న వారు వైద్య చికిత్సలతో పాటు బత్తాయి రసం తీసుకుంటే చాలా త్వరితంగా కోలుకుంటారు.
రోజూ బత్తాయి రసం తీసుకుంటే, చర్మం మీదున్న మచ్చలు తొలగిపోయి నిగారింపు వస్తుంది.
బత్తాయి రసంతో లాలాజలం ఉత్పత్తి పెరిగి జీర్ణక్రియలు సజావుగా జరుగుతాయి.
ఈ పండులో ఫ్లావనాయిడ్స్‌, జీవక్రియలకు అవసరమైన పిత్తరసంతో పాటు ఇతర జీర్ణరసాలూ, ఆమ్లాలూ విడుదల అయ్యేందుకు తోడ్పడతాయి. ఇందులోని ఆమ్లాలు పేగుల్లోని విషపదార్థాలను బయటికి పంపుతాయి. బత్తాయిలోని ఈ ఆమ్లాలు ఎసిడిటీని తగ్గిస్తాయి. పంటి చిగుళ్లనొప్పి, వాపును తగ్గిస్తాయి. కంటి చూపు మెరుగుపడుతుంది.
బత్తాయిలోని లిమోనాయిడ్స్‌ ఊపిరితిత్తులను శుభ్రపరుస్తాయి. గొంతు ఇన్‌ఫెక్షన్లకు గొప్ప ఔషధంగా ఈ పండు రసం పనిచేస్తుంది.
జాండి్‌స నుంచి అప్పుడప్పుడే కోలుకుంటున్న వారి శక్తిహీనతను, నీరసాన్నీ పోగొట్టి త్వరితంగా ఆరోగ్యవంతులు కావడానికి బత్తాయి రసం సహకరిస్తుంది.
బత్తాయి రసం త్వరితగతిన జీర్ణమై, వెంటనే రక్తంలో కలిసిపోతుంది.
యోగా, వాకింగ్‌, జాగింగ్‌ ఇలా ఏదైనా వ్యాయామం తర్వాత బత్తాయి రసం తాగితే, గుండె పనితీరు మెరుగుపడుతుంది. తద్వారా రక్తప్రసరణ వ్యవస్థ చక్కబడి రోగనిరోధకశక్తి అపారంగా పెరుగుతుంది.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list