MohanPublications Print Books Online store clik Here Devullu.com

గోచారంలో రాహుగ్రహ సంచారం_rahu





గోచారంలో రాహుగ్రహ సంచారం


శ్రావణ మాసం 18- 08- 2017 న రాహువు గోచారరీత్యా కర్కాటక రాశినందు, కేతువు మకర రాశి నందు సంచారం జరుగును. జన్మ కుండలిలో రాహువు మరియు కేతువు వుండిన ఎడల వాటి ప్రభావము ఇవ్వకుండా ఏ గ్రహముతో వున్నదో ఆ గ్రహము యొక్క ప్రభావమును ఇచ్చును. ఏ నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి ఫలితాలను, ఏ భావంలో ఉన్నాడో ఆ భావాధిపతి ఫలితాలను ఇస్తాడు. రాహువు చంద్ర రాశి నుండి మూడవ బావము, ఆరవ బావము మరియు పదకొండవ బావములో శుభ ఫలములను ఇచ్చును కాని పంచమ, నవమ మరియు దశమ బావములో యది అన్య గ్రహములు వుండిన ఎడల రాహువు బలహీన లేదా గాయపడిన రాహువు యొక్క శుభఫలితములు లభించ జాలవు. జన్మ కాలీన చంద్ర రాశి నుండి ప్రత్యేక బావములో గోచార సమయములో రాహువు వేరు పలితములను ఇచ్చును.

రాహువు గోచారము ప్రధమ బావము:

జన్మ యొక్క సమయములో చంద్రుడు ఏ రాశిలో వుండునో ఆ రాశిలో రాహువు ప్రవేశించునప్పుడు వ్యక్తిని రోగములు మరియు వ్యాదులు ఆకట్టుకొనును. ఈ సమయములో వ్యక్తికి అనేక విధములైన శారీరక కష్టములను అనుభవించవలసి వుండును. వ్యక్తి ఆలోచనకు వ్యతిరేకముగా అన్ని జరుగును. అందువలన మానసికముగా సమస్యలు ఎదుర్కొన వలసి వుండును. శరీరము అలిసి నట్టుగా వుండి బద్దకముగా వుండును. అందువలన కార్య పరిణామములలో లోపము ఏర్పడును.

రాహువు గోచారము ద్వితీయ భావము:

ద్వితీయ భావములో రాహువు గోచరములో వుండిన ఎడల ధన హానిని కలిగించును. ఈ గోచరములో అనవసరముగా మీ ధనము ఖర్చు కాగలదు మరియు మీరు ఆర్ధిక సమస్యలను ఎదుర్కొన వలసి వుండును. మీ కుటుంబము మరియు సహ సంబందులలో ఈ రాశి కారణముగా కష్టములు కలుగును అందువలన మీకు సమస్యలు కూడా పెరుగును. రాహువు యొక్క ఈ గోచారము కుటుంబ ఆస్తుల మద్య వివాదములకు కారణము కాగలదు. తప్పు మార్గములో మిమ్ము మద్య పదార్ధములను బానిసగా మిమ్ము చేయగలవు. రాహువు యొక్క ఈ గోచారము మీకు మానసికముగా అశాంతిని కలిగించును.

రాహువు గోచారము తృతీయ భావము:

చంద్ర రాశి నుండి తృతీయ బావములో రాహువు శుభ ఫలదాయకముగా వుండును. ఈ భావములో రాహువు యొక్క గోచారము కారణముగా మీరు నీతి మరియు రాజనీతిలో మీ బుద్ధిని ఉపయోగించి మీ పనులను చేపట్టుటకు ప్రయత్నించెదరు. మీలో గుప్తరూపముగా పనిని చేపట్టే అలవాట్లు ఏర్పడును. మీరు మీ పని పూర్తిగా జరిగిన తరువాతే దానిని బయట చెప్పెదరు. రాహువు యొక్క ఈ గోచారము మీ సుఖ సంతోషములలో ప్రాభల్యమును ఇచ్చును.

రాహువు గోచారము చతుర్ధ బావము:

జన్మ రాశి నుండి చతుర్ధ బావములో రాహువు యొక్క గోచారము కలిగి వుండిన ఎడల ఇది వ్యక్తికి అనేక విధములైన సమస్యలను మరియు కష్టములను కలిగించును. రాహువు యొక్క ఈ గోచరము తల్లికి కష్టములను కలిగించును. జీవితములో అడుగడుగున వ్యక్తి కష్టములు మరియు బాధలతో సమస్య చెంది వుండును. అగౌరవము మరియు అవమానము యొక్క భయము కలిగి వుండును. కష్ట నష్టములు ఒకదాని వెనుక మరికటి వచ్చు చుండును. భూమి మరియు వాహన సంబందమైన విషయములలో సమస్యలను ఎదుర్కొన వలసి వుండును.

రాహువు గోచారము పంచమ బావము:

జ్యోతిష్య శాస్త్రమును బట్టి జన్మ రాశి నుండి పంచమ బావములో రాహువు యొక్క గోచారము వ్యక్తికి కష్టమును మరియు దు:ఖమును కలిగించును. వ్యక్తి యొక్క బుద్ది బ్రమించగలదు మరియు త్వరగా ధనవంతునిగా మారవలననే పగటి కలలు కంటూ వుంటాడు. దనవంతుడైయ్యే ప్రయత్నములో చేతులో వున్నది కూడా తరిగి పోవును దాని వలన ఆర్ధిక స్థితి మరింత బలహీనముగా మారును. ఈ బావములో రాహువు యొక్క గోచారము ఆరోగ్యముపై కూడా విపరీత ప్రభావమును చూపును. వ్యక్తి యొక్క ముఖము మరియు పళ్ళలో నెప్పి వలన సమస్యలను ఎదుర్కొనవలసి వుండును. ఈ సమయములో అనేక విధములైన సమస్యలను ఎదుర్కొన వలసి వుండును.

రాహువు గోచారము షష్టమ బావము:

జన్మ కుండలిలో చంద్ర రాశి నుండి షష్టమ బావములో రాహువు యొక్క గోచారము కలుగుతున్నప్పుడు వ్యక్తి రాహువు యొక్క గోచారము సామాన్యముగా హానిని కలిగించదు. ఆరోగ్య రీత్యా రాహువు యొక్క ప్రభావము కొంచెం విపరీతముగా వుండును. అందువలన బోజన పానీయములలో విపరీత శ్రద్ద వహించవలసి వుండును. ఉదర సంబందమైన సమస్యలు పీడించవచ్చును. ఆర్ధికముగా రాహువు యొక్క ఈ గోచారము శుభకారిగా వుండును. ఈ సమయములో వ్యక్తి ధనలాభము కలిగే అవకాశము వున్నది. వ్యక్తికి అకస్మికముగా ధనలాభము కలుగ వచ్చును.

రాహువు గోచారము సప్తమ బావము:

జన్మ రాశిలోని చంద్రుని నుండి సప్తమ బావములో రాహువు యొక్క గోచారము దాంపత్య జీవితమునకు కష్టకారిగా వుండును. ఈ రాహువు కారణముగా భార్యాభర్తల మద్య మధుర సంబందములలో లోపము ఏర్పడి దూరము పెరుగును. రాహువు యొక్క ఈ భావములో జీవిత భాగస్వామికి కష్టములను ఎదుర్కొన వలసి వుండును. ఈ సమయములో మీ స్వయ బుద్ది కూడా పనిచేయదు. అన్ని వైపుల నుండి మానసిక వొత్తిడి అధికముగా వుండును.

రాహువు గోచారము అష్టమ బావము:

జన్మ రాశిలోని చంద్రుని నుండి రాహువు అష్టమ బావములో వుండిన ఆశుభ ప్రభావమును ఇచ్చును. రాహువు ఈ గోచారములో శారీరక సమస్యలను ఇచ్చును. విభిన్న ప్రకారములైన రోగముల వలన మీరు బాదించబడగలరు. విశేష రూపముగా మూత్ర మార్గములో లేదా మల మార్గములో రోగము కలిగే అవకాశములు వుండును. ఆర్ధిక పరముగా కూడా అశుభ కారిగా చెప్పబడును. అనవసర ఖర్చులు ఏర్పడును మరియు ఆర్దిక నష్టము కలుగును.

రాహువు గోచారము నవమ బావము:

జన్మ రాశిలోని చంద్రుని నుండి రాహువు నవమబావములో గోచారము చేయుచున్నప్పుడు ఇది మీ పనులలో అవరోధములను కలిగించును. మీ ఆలోచనలు పూర్తి చేయుటలో రాహువు అడుగడుగున సమస్యలను కలిగించును. అనేక సమయములో మీ పని జరుగుతున్నదని సంతోషపడు సమయములో ఆపని జరుగకుండా నిలిచిపోవును. ధన విషయములో కూడా రాహువు యొక్క ఈ గోచారము విపరీత ప్రభావమును ఇచ్చును. ఇది మీకు అనవసర ఖర్చులను చేయించును. అందువలన మీకు ఆర్ధిక సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చును.

రాహువు గోచారము దశమ బావము:

జన్మ కాలిక చంద్రుని నుండి రాహువు దశమ బావములో గోచారము చేయుచున్నప్పుడు ఇది వ్యక్తి యొక్క జీవితమును తలక్రిందులుగా చేయును. రాహువు యొక్క ఈ గోచారము స్థానాంతరమును కలిగించును. మీరు ఇల్లు విడిచి వేరో చోటుకు వెల్లవలసి వుండును లేదా ఉద్యోగములో బదిలీలు ఏర్పడును. ఈ గోచారములో మీకు కార్య పరివర్తనము కలుగును మీరు ఏపని చేయుచున్నారో దానిని విడిచి మరే ఇతర పనినైనా చేపట్టవచ్చును. ఈ గోచారములో ఆర్ధిక నష్టమును కూడా ఎదుర్కొనవలసి వచ్చును. అనవసర పరిశ్రమ కారణముగా వ్యక్తి అలసటకు గురి కాగలడు.

రాహువు గోచారము ఏకాదశ బావము:

జన్మ రాశి నుండి ఏకాదశ బావములో రాహువు గోచారములో వున్నప్పుడు ఇది శుభ ఫలితములను ఇచ్చును. రాహువు యొక్క అశుభ ప్రభావము ఈ భావములో కలుగదు. గోచారములో రాహువు వ్యక్తికి గౌరవ మర్యాదలను మరియు ప్రతిష్టలను ఇచ్చును. వ్యక్తి కొరకు ధన సంపాదనమునకు క్రొత్త మార్గములను చూపును మరియు పాత మార్గముల నుండి కూడా ధన లాభము లభించును. ఈ గోచారము ధనము యొక్క దృష్టి నుండి అనుకూల పరిణామములను ఇచ్చును. వ్యక్తికి వారి కార్యములలో సఫలత లభించగలదు.

రాహువు గోచారము ద్వాదశ బావము:

ద్వాదశ బావములో జన్మ కాలిక చంద్రుడు నుండి రాహువు యొక్క గోచారము వ్యక్తికి శారీరక భాదలను కలిగించును. రాహువు గోచారములో ద్వాదశ బావములో ప్రవేశించునప్పుడు వ్యక్తి పగటి కళలు కనుట ప్రారంబించును. ఈ గాలి మేడల వలన ఏ విధమైన ప్రయోజనము వుండదు. వ్యక్తి యొక్క కల్పన అలేగే వుండి పోవును. ఆర్ధికముగా సమస్యలను ఎదుర్కొనవలసి వుండును. ఈ గోచారములో అనవసర ఖర్చులు అధికముగా వుండును.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list