MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఆ ఎనిమిది పాశాలతోనే అధర్మం_Iniquity



ఆ ఎనిమిది పాశాలతోనే అధర్మం Iniquity Adharma Bhagavadgitha Gita GithaMakarandam LordKrishna LordArjna GitaSlokam SwamyParipoornanda ParipoornandaSwamy BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu

                                 ఆ ఎనిమిది పాశాలతోనే అధర్మం
 
‘భీషాస్మాత్‌ వాతః పవతే భీషోదేతి సూర్యః భీషాస్మాద్‌ అగ్నిశ్చ ఇన్ద్రశ్చ మృత్యుః ధావతి పంచమ ఇతి’
ఏ కారణం చేత వాయువు వీస్తున్నది? సూర్యోదయ, అస్తమయాలు జరుగుతున్నాయి? అగ్ని మండుతున్నది? మృత్యువు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నది? అనంతమైన ఈ విశ్వాన్ని నడిపేది ఏది? నిగూఢంగా పరిశీలిస్తే వీటన్నింటినీ నడిపేది కేవలం ‘ధర్మం’ అని తెలుస్తుంది. సృష్టి, స్థితి, లయ ధర్మాలకు లోబడి ఈ విశ్వం సాగుతుంది. అందుకే ‘ధర్మంయందే ఈ విశ్వం ప్రతిష్ఠితమై ఉంది’ అని శాస్త్రాలు చెబుతాయి. ధర్మాన్ని ఆచరించడం అంటే.. విశ్వంతో, ప్రకృతితో మమేకమై జీవించడం. దీనివల్ల వ్యక్తి, సమాజం, విశ్వాసం సమతౌల్యాన్ని పొంది సుఖం సిద్ధిస్తుంది. ధర్మాన్ని ఉల్లంఘించినా, అతిక్రమించినా సమతుల్యత దెబ్బతింటుంది. విచిత్రమేమిటంటే.. మనిషి తప్ప ఈ ప్రకృతిలో ప్రతిదీ ధర్మబద్ధమై సమతుల్యతకు చేయూతనిచ్చే విధంగా ప్రవర్తిస్తుంది. మానవుడు మాత్రమే కొన్ని సందర్భాల్లో విపరీతధోరణితో ప్రవర్తిస్తాడు. అందుకే వ్యక్తిలో అలజడి, సమాజంలో అశాంతి, ప్రకృతిలో వైపరీత్యాలు చోటుచేసుకుంటాయి. ఇందుకు ఎనిమిది కారణాలున్నాయని ధర్మశాస్త్రం చెబుతుంది. ఘృణ(అసహ్యం), లజ్జ, భయం, శంక, జుగుప్స, కులం, మానం, శీలం.. ఇవీ ఆ ఎనిమిది పాశాలు. ఈ ఎనిమిదింటిలో ఏ ఒక్కటి పట్టుకున్నా ధర్మం క్షీణించి అధర్మం తాండవిస్తుంది. శోకానికి కారణమవుతుంది. వినాశానికి దారితీస్తుంది. ఇదే అర్జునుడిని పట్టిపీడించిన అంశం. ధర్మాధర్మ విచక్షణ కోల్పోయిన అర్జునుడు శోకతప్తుడై శ్రీకృష్ణుని పాదాలపై మోకరిల్లాడు. ఈ బలహీనత నుండి అర్జునుడిని శ్రీకృష్ణుడు ఏ విధంగా తప్పించాడో భగవద్గీత వివరిస్తుంది.
-స్వామి పరిపూర్ణానంద

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list