9 గురువారంల శ్రీ షిర్డీ సాయి బాబా వ్రత మహత్యం
(9 Thursdays Sri Shirdi Sai Baba Vratam)
(9 Thursdays Sri Shirdi Sai Baba Vratam)
శ్రీ షిర్డీ సాయిబాబా
9 గురువారముల వ్రతమహత్యం
9 గురువారముల వ్రతమహత్యం
సుఖ, శాంతి, జ్ఞాన, ప్రజ్ఞాన, ఐశ్వర్య, ఆరోగ్య భాగ్యములకు మహత్య పూర్వకమైన వ్రతం, పూజార్పణం.
(తెలుగు అనువాదం)
మూలం : నిషా జాని గారి గుజరాతి భాషలోని పుస్తక రచన మరియు సంకలనం
ఓం సాయి రాం
సాయి దైవం నీవే దీనులకు అభయం నీవే
జీవులకు శరణం నీవే ఆపద్భందుడవు నీవే
సాయి భక్తులకు చిన్న మనవి.
ఓం శ్రీ సాయి రాం
గత సంవత్సరము (2010) లండన్ నగరములో వెంబ్లి ప్రాంతంలో వున్న శ్రీ సాయిబాబా దేవాలయ ప్రారంభ మహోత్సవ సమయంలో పరిచయమైన మా స్నేహితుల ద్వారా ఈ వ్రత వివరములు మరియు పుస్తకము మాకు లభ్యమైనవి. అంతేకాక మా స్వానుభావమే కాక, ఈ వ్రతము భక్తి శ్రద్దలతో ఆచరించిన మా స్నేహితులు మరియు తోటి సాయి భక్తుల అనుభవమ గమనించిన పిమ్మట, అతి జనాదరణ పొందిన ఈ వ్రత వివరములు, వ్రత కథ మరియు నియమములు ప్రపంచ నలుమూలలనున్న ప్రవాసాంద్ర సాయి భక్త కోటికి అందుబాటులో వుంచాలని మా చిన్న ప్రయత్నం.
గమనిక: మాకు తెలుగులో టైపింగు అనుభవం లేని కారణంగా మా వల్ల ఏమైనా తప్పలు చేయబడినయెడల మమ్ములను మన్నించి, ఆ తప్పులను మాకు ఈ మెయిల్ (RamMohanRaoBhagyaLakshmi@gmail.com) ద్వారా తెలిపిన యెడల తగిన మార్పోర్పులు చేయుటకు మాకు వీలగును. అంతే కాక ఒక బాష నుండి మరొక బాషకు తర్జుమా చేయునపుడు కొన్ని మూలార్థములులు చేజారియిపోయే అవకాశము (lost in translation) వుంటుందనేది జగమెరిగిన సత్యం. ఈ విషయంలో గుజరాతి బాషనుండి తెలుగు బాషకు అనువదించుటలో పసుపులేటి రామచంద్ర పాపయ్య నాయుడు గారు ఈ వ్రతము యొక్క మూలార్థమును కాపాడుటకు తన శాయ శక్తులా కృషి చేసారని వేరే చెప్పనవసరం లేదు. కాని ఇది చదివిన భక్తులు ఎక్కడైనా మార్పులు చేసిన యెడల ఇందలి పరమార్థం భక్తులకు మరింత సులభంగా అగుపించునని తలచిన యెడల మాకు ఈమెయిల్ ద్వారా తెలియ జేయగలరని ఆశిస్తున్నాము.
అంతేకాక ఎవరైనా భక్తులు ఈ వ్రతము ఆచరించిన పిమ్మట వారికి కలిగిన అనుభవములు మిగిలిన భక్తులకు తెలియజేసి వీటి ద్వారా సాయినాధుని మహిమను, ఖ్యాతిని ప్రపంచ నలుమూలల వ్యాపించాలానే ఆశయంతో కోరి మాకు ఈ మెయిల్ ద్వారా పంపినచో, మేము ఈ బ్లాగ్(blog)లొ చేర్చుటకు మిక్కిలి సంతోషముతో స్వీకరించెదము. ఇందు కొరకు మాకు వారి అనుభవములను ఏ భాషలో (తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తమిళం, మలయాళం, ఫ్రెంచి.) పంపిననూ మాకు సమ్మతమే. సాయి కృపతో మాకు ఈ బాషలలో వున్న కొద్ది ప్రావీణ్యంతో మేము తెలుగులోకి (మీ సమ్మతముతో) అనువదించి ఈ బ్లాగ్ లో వుంచెదము.
భవదీయులు
డా|| కొంగర నాగ రామ మోహన్ రావు
శ్రీమతి కొంగర భాగ్యలక్ష్మి
---------------ఓం శ్రీ సాయి రాం---------------
శ్రీ షిర్డీ సాయిబాబా 9 గురువారముల వ్రతమహత్యం
సుఖ, శాంతి, ఆయురారోగ్య, అష్ట ఐశ్వరంల పొందు మహాసత్యం గల వ్రతం
దేహం, మనస్సు, బుద్ది, ఆత్మ అన్నీ నీవే. నన్ను సంహరించు హరివి.
నా ప్రతి శ్వాస విశ్వాసం హరివి. నా శ్రేయస్సును చేకూర్చు నీవే హరివి.
పరిచయం
మహాకాలుని పుణ్యక్షేత్రమైన ఉజ్జయిని నగరంలో నిషాజాని జన్మించినారు. నిషాజాని గారి అసలుపీరు నితాజాని. బంధు మిత్రులు ఆమెను అప్యాయంగా నిషా అని సంభోదిస్తూ వచ్చారు. ఆద్యాత్మిక వాతావరణంలో ఆమె బాల్యం గడచినది. ఆమె భావనలు ఆద్యాత్మిక ద్రుక్పదంలో సాగెను. దేవుడు ఒక్కడే అన్న సాయి మంత్రం, ఆమె మనస్సులోని ఆత్మ విశ్వాసం, సహప్రాణులపై కారుణ్యం అనేక బాధలు సెగల మధ్య పరస్పర సహనం ఐకమత్యం మానవతా విలువలు ఆమెను చిన్నప్పటి నుండి ప్రభావితం చేసాయి. పరమాత్మని ప్రేమించాలంటే మానవుడు తన సంసార బంధములను పరిత్యజించడం అవసరం లేదని ఆమె దృడ విశ్వాసం. సంసార సాగరంలో మానవుడు తన ఆత్మను, బుద్దిని, మనస్సును, సంపదను తన శక్యానుసారంగా సమర్పించ వచ్చను.
ప్రస్తుతం నిషా జాని గారు ఒక ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేయిచున్నారు. శ్రీ సాయిబాబా అనుగ్రహంతో వీరు రచించిన గుజరాతి పుస్తకం 2000 సం||లో ముద్రించబడినది. గుజరాతి బాష నుండి హిందీ బాషకు అనువాదం అవసరం తీవ్రత గుర్తించి, భక్తుల సౌకర్యార్ధం 2002 సం||లో హిందీ అనువాద పుస్తకం వెలువడినది.
భగవత్సరూపమైన సాయినాథుని మహత్యమును తమ జీవితంలో భక్తుల హృదయాలలో మెదలాలని తమ స్వానుభవమును ఇతరులతో పంచుకొని, వీటి ద్వారా సాయినాధుని మహిమను, ఖ్యాతిని ప్రపంచ నలుమూలల వ్యాపించాలానే ఆశయంతో “సాయి భవాని”, “దత్త భవాని” ని ప్రేమతోను శ్రద్ధతోను ధ్యానం చేయాలని రచయిత ముఖ్య ఉద్దేశ్యం. ప్రారంభంలో ఈ పుస్తకం ఉచితంగా భక్తులకు వితరణ చేయబడినది. ఈ 9 గురువారంల వ్రతములు ఆచరించు సాయి భక్తులు సుఖ శాంతులతో ఆయురారోగ్య అష్టైశ్వర్యములతో దేదీప్యమానంగా జీవిస్తారు. ఈ పుస్తకం భక్తులందరికీ ఉచితంగా ఇవ్వాలంటే ముద్రణ ఖర్చు పెరుగుతుంది. ఇది మా శక్తికి అతీతం కావున ఈ పుస్తకానికి కనీస ధర నిర్ణయించబడినది.
ఈ పుస్తకం ముద్రించడానికి ముఖ్య కారణం కలియుగంలో సాయిబాబా భక్తిని ప్రతి ఇంటికి ప్రవహించ చేయడానికి సాయిబాబా మహత్యం తెలియ చేయడానికి సాయి భక్తిని పెంపొందించడానికి ప్రపంచంలోని భక్తులందరూ సుఖంగా జీవించాలని, సాయి భక్తులుగా మా భావన, కర్తవ్యం, ..............
సాయిబాబా అందరిని కాపాడు గాక.
---------------ఓం శ్రీ సాయి రాం---------------
సాయిబాబా! సర్వ మానవులతో సహా నాకు వరం ప్రసాదించుము.
అలా సంభవించడంతో నాకు ప్రాప్తం కానిదేదీ ఉండబోదు. అలాగే సర్వ మానవాళికిని.
ఈ ఆధునిక భారత దేశంలో అగ్రగణ్యులైన మహాత్ములలో ఒకరైన సాయిబాబా షిర్డీలో 60 సంవత్సరములు జీవించారు. ఆ షిర్డీ ఒక పుణ్య క్షేత్రంగాను, ఒక గొప్ప ఆద్యాత్మిక కేంద్రంగా ఎదిగింది. తన అత్యాకర్షక, ఆద్యాత్మిక అయస్కాంతం అనే ప్రజర్విల్లు జ్యోతితోనే సాయిబాబా అనేక భక్తులను తన వైపుకు మళ్ళించాడు. ఈ నాడు సాయిబాబా ఒక చలనాత్మకమైనా ధార్మిక శక్తి అనేది భక్తుల ఆవాహన. ఆధ్యాత్మిక జీవనానికై ప్రాపంచిక సుఖములకై అనేకానేక భక్తులు ఒక చలనాత్మకమైన ధార్మిక శక్తిగా సాయిబాబాను ఆవాహన చేసుకుంటున్నారు.
ఈ తొమ్మిది గురువారంల వ్రతము ఆచరించు భక్తుల అనుభవములే సాయిబాబా అధ్యాత్మిక ప్రతిభ. ఆ మహాత్ముడు ఎన్నో సంవత్సరాలకు మునుపే నిర్యాణం చెందెను. మనకు సాయిబాబాపై గొప్ప ఆత్మ విశ్వాసం ఉన్నది. ఈ వ్రతం గుజరాత రాష్ట్రంలో అతి జనాదరణ పొందినది. మిగతా భాషలకు చెందిన సాయిభక్తుల హితం కోరి ఈ పుస్తకం మరాఠీ, తమిళం, కన్నడం, మరియు ఆంగ్లంలో కూడా అనువదించి ముద్రించ బడినది.
ఈ రచనను తెలుగు భాషలో సరళంగా అనువదించడమనే గొప్ప వరమును మహా సదవకాశమును ప్రసాదించిన శ్రీ సాయి భగవానుని పాదములకు హృదయ పూర్వకముగా ప్రణమిల్లుతున్నాను. నా కుటుంబంపై శ్రీ షిర్డీ సాయిబాబా చూపుతున్న కరుణకు మేము జీవితాంతం రుణపడి ఉందుము. సాయినాధుని మా హృదయ సింహాసనములపై సదా ప్రతిష్టించి ఉంచాలనియు, సాయినాథుని పాదపద్మములచే మాకు శరణం అందాలని పరమాత్ముని నిరంతరం ప్రార్థించు చున్నాను.
ఈ పూజ్య కర్తవ్యమును నాకు అందించిన వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
తెలుగు అనువాదకుడు.
పసుపులేటి రామచంద్ర పాపయ్య నాయుడు.
---------------ఓం శ్రీ సాయి రాం---------------
మూడు ముత్యాల తొలి పలుకులు.
1. షిర్డీలో వేపచెట్టు క్రింద ఒక పదహారేళ్ళ బాలునిగా సాయిబాబా తొలిసారిగా కనిపించాడు.
ఈ భూమినే తన మాతగాను, ఆ పరమాత్మనే తన పితగాను స్వీకరించి ఈ లౌకిక జీవనంలో మునిగియున్న జీవులను మరియు భాధలను అనుభవించుచున్న మానవ సముదాయమును ఉద్ధరించటానికై మనవ సాయిబాబా అవతరించాడు.
మహాత్ములకు కులమేదీ? మతమేది? హృదయములలో కరుణాభావములు ప్రవహించాలని, శాంతిని నెలకొల్పాలని మరియు సమస్త మానవాళిని ముక్తి మార్గములో తీసుకు వెళ్లాలన్నదే మహాత్ముల ధ్యేయము. ఈ కరుణామయుడు “దేవుడు ఒక్కడే” అనిచాటి చెప్పి ఈ పరమ సత్యమును భక్తుల అనుభవంతో ఎరుగుటకు మార్గదర్శకుడయ్యెను. “నీ పూర్వజన్మ లోపముతో కూడినది. నీ భవిష్యత్తు అనిశ్చితం. కనుక ఏ లోపము లేని నీ వర్తమాన కాలమును వృధా చేసుకోకు.” సాయిబాబా యొక్క దివ్య మంత్రములు ఆత్మ విశ్వాసం, నిరంతర శ్రమ (పట్టుదల) . ఇక మనిషి చేయాలన్నది ఏమనగా సాయిబాబాను సంపూర్ణ భక్తితో నిరంతరం స్మరించడమే!
తన దైవంపై ఎప్పుడైతే భక్తునికి స్తిరమైన విశ్వాసం, అనన్య భక్తి ఉండునో అప్పుడే భగవంతుడు అతని ప్రార్థనలను మన్నించును. సాయిబాబా యొక్క “ధుని” లాగే సాయినాథుని పై భక్తి సహితం మన హృదయంలలో ఉజ్వలంగా తేజోమంతం కావాలి. మనలోని “ఆత్మవాణి”ని వింటూ పరిమళ మకరందాన్ని ఆస్వాదించడానికై సాయినాధుని భక్తితో సేవించి పారవశ్యం చెందాలి.
“పరమాత్ముడా నీ అంతరాత్మలోనే స్థితుడై ఉండగా బాహ్య ప్రపంచంలో భగవంతుని అన్వేషించనేల అని సాయినాధుని తన భక్తులను ప్రశ్నించి జ్నానోపదేశం చేసాడు. ఏ భక్తుడైతే సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో సాయిబాబాకు శరణాగాతుడగునో అతని సమస్త బాధలను ఆపదలను తొలగించి సంరక్షించును” దుఃఖ పరిస్తుతుల్లో నీకు అండగా ఉండును అని తన భక్తులకు అభయం ఇచ్చాడు. సాయి భక్తులు నిశ్చయముగా సాయి భగవానుని దర్శనమును, కృపను అనుభవించెదరు.
ఏ భక్తుడు తన సకల సంపదను, తన శరీరమును, తన ఆత్మను సాయి నాథుని పాదమునకు సమర్పించునో ఆ భక్తునికి శ్రీ సాయిబాబా సదా ఋణపడి ఉండును. భక్తులు ఆ కృప, కరుణ బాబాపై మోపితే ఆ కరుణామయుడు ఆ భక్తుల కొరకై ఆ బాధలను తానూ మోయుచూ వాటిని కడతేర్చును. ఎప్పుడెప్పుడు ధర్మమునకు హాని సంభవించునో మరియు అధర్మము ప్రజలు చూచునో భగవంతుడు ఆయా సమయములందు తన కర్తవ్యపాలన కొరకై అనేక రూపములందు అవతరించును. సత్పురుషుల రక్షణకు, దుష్టులను శిక్షించటకు మరియు ధర్మమును నెల్పుటకుగాను ఈ విశ్వంలో యుగయుగాలందు పరమాత్ముడు అవతరించుచునే ఉండును. ఈ అవతారములలో శ్రీ షిర్డీ సాయిబాబా అవతారమొకటి.
శ్రీ షిర్డీ సాయిబాబా మీది భక్తి పరమ అయస్కాంతంలా కోట్లాది ప్రజలను ఆకర్షిస్తోంది. ఎవరికీ తెలుసు సాయిబాబా యొక్క కులము, మతము? సాయినాథుడు మహమ్మదీయుల పవిత్ర గ్రంధం ఖురాన్ లోని ఉపదేసములను అనర్గళంగా పాడెను. హిందూ వేదములలోని శ్లోకములను సందర్బానుసారంగా వినిపించెను. తన ద్వారా హిందూ ముస్లింల మద్య పరమ బాంధవ్యమును పెంపొందించాడు. సాయినాథుడు తన భక్తులకు వారి వారి ఇష్ట దైవముల స్వరూపంలోనే అద్భుత దృష్టిని ప్రసాదించాడు. అతి అదృష్టవంతులైన భక్తులకు బాబా శ్రీకృష్ణుని గాను, శివుని గాను, శ్రీరామచంద్రుని గాను మరియు సాయినాథుని అవతారంగాను వారి స్వప్నములందు దర్శనమిచ్చి వారిని భక్తీ పారవశ్యంలో ముంచాడు.
ఈ నాటికి, నిర్యాణం చెందినా ఎన్నో సంవత్సరమిల తరువాతనూ, సాయినాథుని పవిత్ర ఆత్మ సాయిబాబా భక్తులు తమ బాధలనుండి ఆ సాయినాథుని పవిత్ర ఆత్మయే తమను రక్షిస్తుందని ప్రత్యక్షానుభవంతో తెలుసుకున్నారు. సాయినాథుని అయస్కాంతం లాంటి ఆధ్యాత్మిక శక్తి ఆయన భక్తులను ఆకర్షిస్తూనే ఉండును. ఎప్పుడైతే సాయి భక్తులు తమ నిరాశలను, దుఃఖములను సాయినాథుని విన్నవిస్తూ ప్రార్థించెదరో అప్పుడు ఆ కరుణామయుడు ఆ దీనుల కన్నీటిని తుడుచును. ఆ భక్తులు దుఃఖ పరిస్తితులలో సాయిబాబా కృపను అనుభవించెదరు.
2.దైవమే సాయి బాబా
ఏ భక్తుడైతే తన సంపూర్ణ విశ్వాసంతో సాయిబాబా పాదపద్మములందు శరణాగతుడై ఈ నవ గురువారముల శ్రీ సాయి వ్రతమును ఆచరించునో అతని యొక్క సర్వ ప్రార్థనలు, కోరికలు నిశ్చయముగా ఫలించునదే కాక సకల విఘ్నములూ నివారించబడును.
3. శ్రీ సాయి కష్ట నివారణ స్తోత్రం
ఓం
అవిఘ్నమస్తు
సాయినాథాయ నమః
ప్రథమం సాయినాథాయ నమః - ద్వితీయ ద్వాఆజాయ - రకామాయినే
తృతీయం తీర్థ రాజాయ – చతుర్థం భాక్తవత్సలే
పంచమం పరమార్థాయ – షష్టించ షిర్డీ వాసనే
సప్తమం సద్గురు నాధాయ – అష్టమం అనాథ నాధనే
నవమం నిరాడంబరాయ –దశమం దత్తావతారమే
యతాని దవమానాని త్రిసంధ్యపదే నిత్యం
సర్వకష్ట భయోన్ముక్తో సాయినతగురు కృపా
(ఈ సాయినాథ కష్టనివారణ స్తోత్రం రోజుకు 3 సార్లు 11 పర్యాయములు ఎవరు పఠిస్తారో వారి సర్వ కష్టాలు తొలుగును)
---------------ఓం శ్రీ సాయి రాం---------------
నవ గురువార సాయిబాబా వ్రత ఆచరణ నియమాలు.
1). ఏ భక్తుడైనా స్త్రీ పురుష బేదము లేకుండా ఈ వ్రతమును ఆచరించవచ్చును.
2). ఏ కులము వారైనా సరే, ఏ మతము వారైనా సరే ఈ వ్రతమును ఆచరించవచ్చును.
3). ఈ వ్రతమును సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితోను ఆచరించినచో మహత్వపూరితమైన ఫలము ప్రాప్తించును.
4). ప్రార్థనలు ఫలించాలంటే, కోర్కెలు తీరాలంటే భక్తి పూరితముగా సాయి భగావానుని ప్రార్థించి గురువారం రోజున ఈ వ్రతమును ప్రారంభించాలి.
5). ఉదయం సమయమైనను, సాయంత్ర సమయమైనను ఈ పూజలు ఆచరించవచ్చును. ఒక పలకను సింహాసనముగా అమర్చి ఒక వస్త్రమును దానిపై పరిచి దానిపై సాయి నాధుని పటమును గాని విగ్రహమును గాని ప్రతిష్టించి సాయి నాథుని నుదిటిపై చందనం మరియు తిలకం దిద్దాలి. పూలమాలను గాని పసుపు పుష్పములను గాని సాయినాథునికి సమర్పించాలి. దీప స్తంభంలో సాయిజ్యోతిని వెలిగించి సాంబ్రాణి, అగరు దూపములను సమర్పించాలి. పవిత్ర ఆహార రూపంలోనున్న చక్కర గాని, మిఠాయి గాని, ఫలములు గాని నైవేద్యముగా సమర్పించాలి. వ్రతములో కూర్చున్నవారికి పవిత్ర ప్రసాదమును సమంగా పంచి భుజించాలి.
6). పాలుగాని, కాఫీగాని , టీగాని లేక మిఠాయిలనుగాని, ఫలములనుగాని ఆహారముగా సేవించో లేక వ్రతమును ఆచరించు భక్తుడు ఒకే పూట (మద్యాహ్నం/రాత్రి) ఆహారం సేవించిగానీ వ్రతమును ఆచరించాలి. ఆకలి కడుపుతోను లేదా పూర్తి ఉపవాసంతోను ఈ వ్రతమును ఆచరించ రాదు.
7). వీలైనచో 9 గురువారములు సాయి మందిరమునకు వెళ్లి ప్రార్థించాలి. సాయిబాబా మందిరం దగ్గరలో లేని పక్షంలో గృహం లోనే అత్యంత భక్తితో పూజను ఆచరించాలి.
8). భక్తులు వేరే గ్రామానికి వెళ్ళిన సమయంలో కూడా ఈ వ్రతమును కొనసాగించవచ్చును.
9). ఈ 9 గురువారంలు స్త్రీలు మైల పడితే లేక మరో కారణం చేత గాని పూజలను ఆచరించనిచో ఆ గురువారం వదిలివేయ వచ్చును. ఈ వదిలివేయబడిన గురువారం లెక్కించరాదు. మరియు రాబోవు గురువారం ఈ పూజను ఆచరించి 9 గురువారంలు పూర్తిచేయాలి.
---------------ఓం శ్రీ సాయి రాం---------------
ఉద్యాపాన (వ్రతం పూర్తిచేయు) విధానం మరియు నియమాలు
1). తొమ్మిదవ గురువారం 5 మంది బీదలకు అన్నదానం చేయాలి.
2). ఈ వ్రతం యొక్క శక్తిని ప్రజలకు తెలియ జేయడానికి ఈ “సాయిబాబా వ్రతం” పుస్తకములను ఉచితంగా (5, 11, లేదా 21) పంచవలెను.
3). తోమిదో గురువారం నాడు ఈ పుస్తకములను పూజ గృహమునందు ఉంచి పూజించి ఇతరులకు పంచితే పుస్తకం ప్రసాదముగా అందుకొనే వారికి దైవానుగ్రహం లభించును.
పైన చెప్పిన నియమాలతో ఈ వ్రతమును ఆచరించి ఈ దానములు గావించినచో సాయిబాబా కృపతో భక్తుని కోర్కెలు, ప్రార్థనలు నెరవేరును.
---------------ఓం శ్రీ సాయి రాం---------------
సాయిబాబా వ్రత గాధ
కోకీల అను సాధువైన స్త్రీ తన భర్త మహేష్ తొ ఒక నగరంలో నివిసిస్తోంది. పరస్పర ప్రేమానురాగాలతో, అన్యోన్యంగా వారు సంసారం సాగిస్తున్నారు. కాని మహేష్ ది దెబ్బలాడు స్వభావం మరియు అతని మాటలతో, భాషలలో సభ్యత అను హద్దులే ఉండేవి కావు. ఇరుగు పొరుగు వాళ్లకు మహేష్ స్వభావం చాలా ఇబ్బంది కరంగా ఉండేది. కాని కోకిల చాలా శాంత స్వభావురాలైన భక్తురాలు. అపారమైన విశ్వాసంతో ఆమె చల్ల సహనంతో అన్నీ కష్టాలు సహిస్తూ వస్తుండేది. కాల క్రమంగా ఆమె భర్త యొక్క వాపారము దెబ్బతినగా సంసారం సాగడమే కష్టంగా ఉండేది. కాని మహేష్ పొద్దస్తమానం ఇబ్బందులకు గురవుతూ చీటిమాటికి భార్యతో పోరాడుతూ ఉండే వాడు. ఒక రోజు మద్యాహ్నం నందు ఒక సాధువు వారి గృహమునందు నిలిచాడు. ఆ సాధువు కోకిల వందనం చూసి బియ్యం మరియు పప్పు భిక్షం అడుగుతూ సాయిబాబా నిన్ను అనుగ్రహించు గాక అని కోకిలను దీవించాడు. కోకిల చాలా బాధపడుతూ ఈ జీవితంలో తనకు సంతోషనేది రాయబడిలేదంటూ తన విషాద గాధను చెప్పుకుంది.
ఆ సాధువు ఆమెను సాయిబాబా వ్రతమును 9 గురువారములు ఆచరించమని ఉపదేశించినాడు. “వ్రతము సమయమునందు పళ్ళు పానీయములు లేక ఒక పూట ఆహారము మాత్రమే భుజించాలని ఆదేశించాడు. సాధ్యమైతే సాయిబాబా మందిరానికి వెళ్లి ప్రార్థించాలని లేదా గృహంలో సాయి పూజను ఆచరించి 9 గురువారంలు తన శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా నిర్దేశించబడిన నియమాలను అనుసరించి బీదలకు అన్నదానం గావించి 5 మందికి లేక 11 మందికి శ్రీ సాయి వ్రత పుస్తకాలను ఉచితంగా వితరణ గావించాలి. ఈ వ్రత ఆచరణ చాల మహత్వపూరిత మైనది. మరియు కలియుగానికి చాల యుక్తమైనది. ఈ వ్రతము భక్తుని కోర్కెలను తీర్చును. కాని భక్తునికి సాయినాథునిపై ప్రగాడ విశ్వాసము మరియు భక్తి కలిగి ఉండాలి. ఏ భక్తుడైతే ఈ వ్రతమును నియమానుసారంగా భక్తిశ్రద్ధలతో ఆచరించునో అతని సమస్త కోరికలు ప్రార్థనలు సాఫల్యం గావించును” అని సాధువు కోకిలకు చెప్పెను.
కోకిల గూడా ఈ నవ గురువార వ్రతమును ఆచరించాలన్న దీక్షను గైకొని నిర్దేశించబడిన సమయానుసారంగా బీద సాదలకు అన్నదానం గావించి సాయివ్రత పుస్తకములను తొమ్మిదవ గురువారం ఉచితంగా వితరణ గావించి వ్రత దీక్షను పూర్తిగావించినది. అలా కొన్ని రోజులు గడిచిన పిమ్మట ఆమె కష్టాలన్నీ మాయమైనవి. గృహంలో సుఖ శాంతి వెలిసినది. మహేష్ యొక్క కలహ స్వభావం శాశ్వతంగా అంతరించినది. అతని వ్యాపారం సజవుగా కొనసాగినిది. వారి జీవనం వృద్ది చెందినది మరియు ఆనందముతో జీవనం కొనసాగించడం మొదలు పెట్టారు.
ఆ తరువాత కొద్ది రోజుల పిమ్మట ఒక దినం సూరత్ నుండి కోకిల యొక్క బావ అతని భార్య తో కోకిల ఇంటికి విచ్చేసారు. వారు తన పిల్లలు చదువుల్లో బాగా వెనుకంజ వేసారని, పరీక్షలలో ఉత్తీర్ణులు కాలేదని వాపోయారు. కోకిల వారికి 9 గురువారంల సాయిబాబా వ్రతమును గూర్చి వివరించినది. ఆత్మవిశ్వాసం మరియు సహనంతో సాయిబాబాను ప్రార్ధించినచో వారి పిల్లల చదువులలో ప్రగతి చూపునని వారికి సలహా ఇచ్చినది. కోకిల యొక్క బావ భార్య వారికి వ్రతం యొక్క వివరణలను చెప్పమని కోరగా
“తొమ్మిది గురువారములు ఫలములు పానీయములు తీసుకుని గానీ ఒక పూట ఉపవాసము ఉండి గానీ తొమ్మిది వారములు సాయి మందిరంలో సాయి నాథుని దర్సనం చేసుకోవాలి. ఏ భక్తుడైనా స్త్రీ పురుష బేదము లేకుండా ఈ వ్రతమును ఆచరించవచ్చును. ఏ కులము వారైనా సరే, ఏ మతము వారైనా సరే ఈ వ్రతమును ఆచరించ వచ్చును. ఈ వ్రతమును సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో మరియు అత్యంత భక్తితోను ఆచరించినచో మహాత్వపూరితమైన ఫలము ప్రాప్తించును. ప్రార్థనలు ఫలించాలంటే, కోర్కెలు తీరాలంటే భక్తిపూరితముగా సాయి భగావానుని ప్రార్థించి గురువారం రోజున ఈ వ్రతమును ప్రారంభించాలి. ఉదయమైనను, సాయంత్ర సమయమైనను ఈ పూజలు ఆచరించవచ్చును. ఒక పలకను సింహాసనముగా అమర్చి ఒక వస్త్రమును దానిపై పరిచి దానిపై సాయినాధుని పటమును గాని విగ్రహమును గాని ప్రతిష్టించి సాయినాథుని నుదిటిపై చందనం మరియు తిలకం దిద్దాలి. పూలమాలను గాని పసుపు పుష్పములను గాని సాయినాథునికి సమర్పించాలి. దీపస్తంభంలో సాయిజ్యోతిని వెలిగించి సాంబ్రాణి, అగరు దూపములను సమర్పించాలి. పవిత్ర ఆహార రూపంలోనున్న చక్కర హాని, మిఠాయి గాని ఫలములు గాని నైవేద్యముగా సమరించాలి. వ్రతములో కూర్చున్నవారికి పవిత్ర ప్రసాదముని సమంగా పంచి భుజించాలి. పాలుగాని, కాఫిగాని , టీగాని లేక మిఠాయిలను గాని ఫలములను గాని ఆహారముగా సేవించో లేక వ్రతమును ఆచరించు భక్తుడు ఒకే పూట (మద్యాహ్నం/రాత్రి) ఆహారం సేవించి వ్రతమును ఆచరించాలి. ఆకలి కడుపుతోగాని లేదా పూర్తి ఉపవాసంతో గాని ఈ వ్రతమును ఆచరించ రాదు. వీలైనచో 9 గురువారములు సాయి మందిరమునకు వెళ్లి ప్రార్థించాలి. సాయిబాబా మందిరం దగ్గరలో లేని పక్షంలో గృహంలోనే అత్యంత భక్తితో పూజను ఆచరించాలి. భక్తులు వేరే గ్రామానికి వెళ్ళిన సమయం లో కూడా ఈ వ్రతమును కొనసాగించవచ్చును. ఈ 9 గురువారంలు స్త్రీలు మైల పడితే లేక మరో కారణం చేత గాని పూజలను ఆచరించనిచో ఆ గురువారం వదిలివేయ వచ్చును. ఈ వదిలివేయబడిన గురువారం లెక్కించరాదు. మరియు రాబోవు గురువారం ఈ పూజను ఆచరించి 9 గురువారంలు పూర్తిచేయాలి.”
పై విధముగా సాయివ్రతం చేయాలని కోకిల వారికి వివరించిన కొన్ని దినముల తరువాత సూరత్ లో ఉన్న అక్క బావల నుండి కోకిలకు ఉత్తరం వచ్చింది. ఆమె పిల్లలు సాయివ్రతం ప్రారంభించినారనియు, ఇప్పుడు పిల్లలు బాగా చదువుతున్నారనియు తాము సహితం వ్రతము ఆచరించి సాయివ్రతం పుస్తకములను ఉచితంగా పంచినామని ఆ ఉత్తరం ద్వారా తెలియజేసారు. ఈ వ్రతం ఆచరించడం ద్వారా ఆమె స్నేహితురాలు యొక్క కుమార్తెను ఒక చక్కని అబ్బాయితో వివాహం నిశ్చయమైనదనియు పక్కింటామె నగల పెట్టె కనపడకపోగా వారు సాయివ్రతం ఆచరించిన 2 నెలలకు పోగుట్టుకున్న నగల పెట్టెను ఎవరో ఆగంతుకుడు వారికి పంపాడని ఆ ఉత్తరం ద్వారా తెలియజేసింది. ఇంత అద్భుతమమైన అనుభవాలను ఉత్తరం ద్వారా కోకిలకి తెలియజేసింది. కోకిల భగవానుని శక్తిని సాయివ్రత మహిమను తెలుసుకొనినది. దీనితో ఆమెకు సాయినాధుని మీదున్న భక్తి మరీ ఘాడమైనది. ఓ సాయినాథ! మమ్ము దీవించుము. మాపై నీ కరుణాకృపను జూపుము.
సాయిబాబా వ్రతం యొక్క అద్భుత ప్రయోజనములు
మోకాలి నొప్పి అద్భుతముగా నయమైనది. (నిషాజాని గారి స్వానుభవం)
తనకున్నరోగం ఏదైనా కాని ఆ భక్తుడు సంకటంతో, నిరాశతో కడకు సాయి పాదములందు శరణాగతుడై సాయి అని ప్రార్థించిన యెడల ఆ బాధలు తొలగిపోతాయి, ఆ రోగం నుండి కోలుకొనును.
నేను మోకాళ్ళ నొప్పితో తీవ్రంగా బాదపడుతుండేదాన్ని. కొన్ని దినముల క్రితం ఒక చిన్న ప్రమాదంలో నా కాలు విరిగింది. శస్త్ర చికిత్స అవసరముందని వైద్యుడు సలహా ఇచ్చినాడు. కాని నేను వద్దన్నాను. కొన్ని రోజుల తరువాత నేను కోలుకున్నాను. ఆకస్మికంగా నొప్పి మళ్ళీ మొదలైనది. వారం రోజులపాటు ఒక్క అడుగు కూడా వేయలేని స్తితిలో ఉన్నాను. అదే సమయంలో సెలవుల రోజులు కావటంచే మా కుటుంబ సభ్యులందరూ షిర్డీ ప్రయాణానికి రాజస్తాన్ ప్రయాణానికి ఏర్పాటు చేసారు. వారి వెంట వెళ్ళాలన్న యోచన కూడా చేయడం సాధ్యం కాని స్థితిలో నేనున్నాను. నా కాళ్ళ బాథ తీవ్రతతో నా దుస్థితిని చెప్పుకుని చాలా దుఃఖించి నా జీవితంలో ఇక ముందెన్నడూ నయంకాదన్న భావంతో కృశించిపోయాను. కానీ నాకు సాయినాథునిపై నమ్మకం, భక్తి ఎక్కువ. ఇంతకు ముందే ఎన్నో సార్లు ఉపవాసంతో ప్రార్థించాను. కానీ నిర్ధేశించబడిన నియమాలు పాటించలేదు. పరిచయస్తులోకరు నవగురువారంల సాయివ్రతం మహిమను నాకు వివరించారు. నేను ఆ వ్రతమును ఆచరించాలన్న కోరికను నాకు కలిగినది. ఎలాగోలా కొంచెం ధైర్యం తెచ్చుకుని నా స్కూటరు మీద సాయి మందిరానికి వెళ్ళాను. నేను షిర్డీ దర్శించాలని రాజస్తాన్ కు పయనించాలనియు నా కాళ్ళ బాధ అతి తీవ్రం గా ఉండబట్టి ఇదెలా సాద్యమనియు ఈ సాయి మందిరం నుండి బయట అడుగుపెట్టగానే నా మోకాళ్ళ నొప్పి నయమయ్యిందంటే నేను తొమ్మిది గురువారంల సాయి వ్రతమును ఆచరించుదునని ప్రతిజ్న చేసి కరుణామయుని భక్తిపూర్వకంగా ప్రార్థించాను.
నా జీవితంలో అటువంటి అద్భుతమైన మహత్యమును ఎప్పుడూ అనుభవించలేదు. నేను సాయి మందిరం నుండి బయటికి అడుగు పెట్టగానే నా మోకాలి నొప్పి బాధ అత్యాశ్చర్యకరంగా అదృశ్యమైనది. నా ఆనందానికి అంతులేకుండా పోయినది. నేను మా కుటుంబ సభ్యులతో షిర్డీ, రాజస్తాన్ లకు వెళ్లాను. ప్రయాణంలో ఎంతో దూరం నడిచాను. కొండలపైకి సైతం ఏ నొప్పి లేక సాయి నాథుని ఆశీర్వాదంతో నడిచాను.
ఎస్.ఎస్.సి . పరీక్షలలో మంచి శాతం మార్కులతో ఉత్తీర్ణురాలైయ్యాను
హితల్ అనే అమ్మాయి తన చదువుమీద ఆశక్తి చూపలేక ఎలాగో 9 వ తరగతి అతి కష్టం మీద పూర్తిచేసింది. తనకు జ్ఞాపకశక్తి చాల వరకు తగ్గిపోయిందని చెబుతూ ఉండేది. హితల్ తల్లిదండ్రుల్లకు తమ కుమార్తె పదవ తరగతి ఎలా పూర్తిచేస్తుందోనని చాలా బాధపడేవారు. క్వార్టర్లీ పరీక్షల్లో అన్నీ సబ్జక్టుల్లోనూ మార్కులు చాలా తక్కువగా వచ్చాయి. కొందరు శ్రేయోభిలాషులు 9 గురువారముల సాయివ్రతం చేయమని సలహా ఇచ్చారు. ఆ విధం గానే హితల్ సాయివ్రతము ఆచరించి ఆ దీక్షను భక్తి శ్రద్దలతో పూర్తిచేసింది. ఈ వ్రతం పూర్తికాగానే క్రమంగా హితల్ యొక్క జ్ఞాపకశక్తి వృద్ది అయినది. మొదట పిర్యాదు చేసిన ఉపాద్యాయులందరూ హితల్ ను అభినందించసాగారు. సాయినాథుని కృపవల్ల హితల్ పదవ తరగతిలో 75% మార్కులతో ఉత్తీర్ణురాలై 11 వ తరగతిలో సైన్స్ గ్రూప్ లో చేరినది.
గడ్డ నయ మైనది.
ప్రీతి చెవుల్లో తీవ్రమైన నొప్పి ప్రారంభమైనది. చాలావరకు వినికిడి శక్తిని సైతం కోల్పోయింది. ఐ.ఎన్.టి. (INT) నిపుణుల పరిశోధనాభిప్రాయంతో చెవుల లోపలి బాగంలో ఒక పెద్ద గడ్డ పెరుగుతొందని శస్త్ర చికిత్స అనివార్యమని బైయాప్సి తీయించి ఆ రోగం పేరు కూడా చెప్పి ఆపరేషన్ కొరకు రోజు కూడా నిర్ణయించారు. ప్రీతి కుటుంబ సభ్యులు కలత పడ్డారు. కాని ప్రీతి మాత్రం కలత చెందలేదు. తాను 9 గురువారముల సాయివ్రతమును ఆచరించి తీరాలని పట్టుబట్టి ఆపరేషన్ వాయిదా కోరింది. బీదలకు అన్నదానము మరియు సాయిబాబా వ్రతమహిమ పుస్తకములు ఉచితముగా వితరణ గావించి భక్తి శ్రద్దలతో శ్రీ సాయి వ్రతమును పూర్తిచేసినది. తరువాత ఆమె ఆరోగ్యం కుదుటపడి ఆపరేషన్ అవసరం లేకుండా పోయింది.
వివాహమైన 18 సంవత్సరాలకు శిశువు ప్రసవించి మాత్రుమూర్తియైన అద్బుతం
మహేంద్ర , రేఖ దంపతులకు వివాహం జరిగి కొన్ని సంవత్సరములైనప్పటికీ సంతానం కలుగలేదు. సంతానం లేని కారణంగా రేఖ తన ఆత్తమామలతో అనేక విథములుగా అవమానం పాలైనది. ఎన్నో వైద్యములు చేయించుకున్నది కాని రేఖ మాత్రుమూర్తి కాలేక పోయినది. ఆ దంపతులు ఎంతోమంది జ్యోతిష్యులను సంప్రదించినా పలితం లేక పోయింది. ఒక రోజు రేఖ యొక్క సహోద్యోగి ఆమెకు సాయివ్రతం మహిమను వివరించింది. రేఖ ఎంతో భక్తి శ్రద్దలతో నవ గురువారముల సాయివ్రతం ఆచారించి బీద సాదలకు అన్న దానము మరియు సాయి వ్రత పుస్తకములను వితరణ గావించింది. అలా కొన్ని రోజులకు రేఖ గర్భం ధరించి ఒక పండంటి పాపకు జన్మనిచ్చినది.
బదిలీ ఆజ్ఞ రద్దు చేయబడినది.
నీల ఒక కార్యాలయంలో పని చేస్తుంది. ఆమెకు అహ్మదాబాద్ నుండి కచ్ కు బదిలీ అయినది. నీల అమ్మగారు చాలా కలత చెందింది. క్రమంగా జబ్బులో పడింది. బదిలీ ఆజ్ఞను రద్దుచేయమని ప్రార్థిస్తూ ఉన్నతాదికారులకు విన్నవించుకుంది. కాని ఇంకో పది రోజుల్లో ఆమె గాని బదిలి అయిన చోటిలో హాజరు కాని పక్షంలో ఆమెను పనిలోనుండి తీసివేయబడునని ఇంకో ఆర్డర్ వచ్చినది. అందుచేత అంతదూరం ఆ అమ్మాయిని ఒంటరిగా ఎలా పంపడం అని నీల అమ్మగారికి మరీ కంగారు ఎక్కువైనది. ఆ రోజు గురువారం నీల స్నేహితురాలు నందిత ఇంటికి వచ్చింది. నీల పరిస్తితులను గమనించి తొమ్మిది గురువారంల సాయి వ్రతం గురుంచి వివరించింది. ఆ ప్రకారమే నీల ఆ రోజే వ్రతం ఆరంభించింది. ఆమె యొక్క కచ్ బదిలి రద్దు చేయబడినది. ఆమెను అహ్మదాబాద్ లోనే ఉన్న వేరొక శాఖకు బదిలేచేయబదినదని ఆశ్చర్యకరమైన ఒక ఉత్తరం నీలకు మూడవరోజు అందింది. ఈ సంఘటనతో సాయి పైన నీలకు మరింత విశ్వాసం భక్తి పెరిగింది. నీల దీక్షను పట్టుదలతో భక్తి విశ్వాసాలతో సాయివ్రతం పూర్తిచేసి సాయివ్రత పుస్తకంలు ఉచితంగా పంపిణీ చేసి సాయి భక్తిని ప్రచారం చేసినది.
మరికొన్ని అద్భుతాలు
ఒక అందమైన, విద్యావంతుడైన వ్యక్తి ఒక ప్లీడరుగారి కార్యాలయంలో వ్రుత్తి చేస్తున్నాడు. ఏదో కారణాల వల్ల అతనికి వివాహం కాలేక పోయింది. కాని 9 గురువారముల సాయి వ్రతం ఆచరించగానే ఒక అందమైన, విద్యావంతురాలైన, సుగుణవంతురాలైన ఒక మంచి సంస్థ లో ఉద్యోగం చేస్తున్న అమ్మాయితో అతనికి వివాహం నిశ్చయింపబడినది.
-x-x-x-x-x-x-x-x-
ఒక వ్యాపారస్తుడు తన వ్యాపారంలో అనేక సమస్యలను ఎదుర్కొనవలసి వచ్చింది. మరియు రాబడి క్రమంగా క్షీణించడం మొదలు పెట్టింది. అతను సాయి వ్రతం చేపట్టగానే అతని వ్యాపారం వృద్దిచెందినది. ఆ తరువాత అతడు తన వ్యాపారంలో అంతో వృద్ది సాధించి ఎన్నో కోట్లు సంపాదించినాడు.
-x-x-x-x-x-x-x-x-
ఒక యువకుడికి ఎం.కాం. డిగ్రీ ఉన్నాసరే ఒక్క మంచి ఉద్యోగం కూడా లభించలేదు. అతను తన తల్లితో సైతం 9 గురువారంల సాయివ్రతము ఆచరించి నిర్దేశించబడిన విథముగా సాయివ్రతమును ఆచారించి సమస్త నియమాలను పాటించిన పిమ్మట అతనికి ఒక మంచి వృత్తి ఉద్యోగం లభించినది.
-x-x-x-x-x-x-x-x-
ఒక కళాకారునికి తన సంపాదనతోనే తన కుటుంబాన్ని పూర్తిగా పోషిస్తున్నాడు టి.వి.లో గాని సినిమాలో గాని మంచి పాత్రలు లభించక చాలా కష్ట పడుతుండేవాడు. 9 గురువారముల సాయివ్రతం ఆచరించి నిర్దేశించబడిన విధంగా సాయి వ్రతమును ఆచరించిన పిమ్మట టి.వి.లోను సినిమాలలోను మంచి పాత్రలు లభించి చాలా అభివృద్ధి సాధించాడు.
---------------ఓం శ్రీ సాయి రాం---------------
సాయి స్మరణం
నను దీవించు సాయి. నను దీవించి సాయి.
నీ శిశువును దీవించుము సాయి.
నా మొఱలను వినుము.
నాలో భక్తిని స్థిరపరుచుము.
నను దీవించు సాయి. నను దీవించు సాయి..
నా బాధలు తీర్చుము.
ఆనందము నాలో చిలుకుము.
నా పాపాల ప్రార్ధన వినుము.
నను దీవించు సాయి. నను దీవించు సాయి..
సాయిరామే జీవనము సాయి రామే ప్రార్ధనము.
సాయిరామే ఆనందము సాయి రామే కీర్తనము
సాయిరామే భాగ్యము సాయి రామే స్వర్ణము
నను దీవించు సాయి. నను దీవించు సాయి..
సాయిరామే తృప్తి సాయి రామే శాంతి
సాయి రామే భగవంతుని అవతారము సాయి రామే విశ్వము
సాయిరామే కరుణామూర్తి సాయి రామే వివేక స్ఫూర్తి
నను దీవించు సాయి. నను దీవించు సాయి..
సాయిరామే సత్పవర్తన సాయిరామే మోక్షం
సాయిరామే కర్తవ్యము సాయిరామే పరమ సత్యము
నను దీవించు సాయి. నను దీవించు సాయి..
సాయిరామే ఏసు క్రీస్తు
సాయిరామే హిందుమనుజుడు
సాయిరామే ఇస్లాం మతస్తుడు
నను దీవించు సాయి. నను దీవించు సాయి..
సాయిరామే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు.
సాయిరామే నిరాడంబరుడు. సాయిరామే మాతా పితా గురు దేవుడు
సాయిరామే ప్రాణ జీవుడు. సాయిరామే ఆత్మా రాముడు
నను దీవించు సాయి. నను దీవించు సాయి..
శ్రీ దత్తాత్రేయ ప్రాతఃస్మరణమ్
శ్లో|| ప్రాతఃస్మరామి కరుణా వరుణాలయంత్వం
శ్రీ దత్తమార్త వరదం వరదండహస్తం |
నంతం నిజార్తి శమనం దమనం వినీత
స్వాంతర్గాతాభిలమలం విమలం ప్రశాంతం ||
శ్లో|| ప్రాతర్భజామి భజదిష్ట వరప్రదంతం
దత్తం ప్రసాద నదనం వరహీదంతం |
కాంతం ముదాఃత్రితనయం భావనిమోక్షహేతుం
సేతుం వృషస్య పరమం జగదాది హేతుం ||
శ్లో|| ప్రాతర్నమామి ప్రయతో ననూయా
పుత్రం స్వమిత్రం యమితో ననూయ |
భూయంసి ఆప్తాస్తమిహార్తబందుం
కారుణ్యసింధుం ప్రయమామి భక్త్యా ||
శ్లో|| లోకత్రయ గురోర్యస్తు శ్లోకత్రయ మిదం పదేత్
శ్రీ దత్తాత్రేయ దేవస్య తన్య సంసారభీః కుతః
శ్రీ షిర్డీ వాస ద్వారకామాయి
పల్లవి : షిర్డీ వాస ద్వారకమాయీ
నిను వీడలేము ప్రభూ
బూటి వాడలోనా రోజు కొక్క రీతి
సేవలందుకోనుచు మమ్ము మరచినావా
నీ కరుణ లేని జన్మ నిరుపయోగమయ్యా
నీ మహిమ చూసి మమ్ము బ్రోవవయ్యా
నీ దరహాసం ఒక్కసారి చాలు ఒక్కసారి చాలు ప్రభూ ||షిర్డీ||
యోగులలో నీవు అత్మయోగివయ్యా
వేదాల సారం నీవే కదయ్యా
రాగాలలోని రాగం మమతానురాగం
భావాలలోభావం అనుభవసారం
అని మాకు తెల్పి మంచి దారు చూపి మము బ్రోచినావు ప్రభూ ||షిర్డీ||
సాయిరామ స్తోత్రం
శివం నిత్యమేకం విభుం తారకాభం శుభకార మకార సూన్యం సు మాన్యం
మహేశం కలేశం సురేశం పరేశం నరేశం నిరీశం మహీశం ప్రపద్యే
విశుద్ధం పరం సచ్చిదానంద రూపం గుణధార మాధార హీనం వరేణ్యం
మహాంతం నిభాంతం గుహాంతం గుణాంతం సుఖాంతం స్వయం సాయిరామం ప్రపద్యే ||
నిజే మానస మందిరే సన్నీదేహి ప్రసీద ప్రసీద ప్రభో సాయినాధ
త్వ మే వాసి దైవం పరం యే యదేకం సుచైతన్య మేతత్త్వ ధన్యం నమస్తే ||
నమః సచ్చిదానంద రూపాయ తస్మై నమోదేవ దేవాయ రామాయ తుభ్యం
నమో భక్తి యుక్తాను రుక్తాయ తుభ్యం నమః పుణ్య పుంజైకలఖ్యాయ తుభ్యం ||
నమో వేద వేద్యాయ చాద్యాయ పుంసే నమః పుండరీకాయ తాక్షాయ తుభ్యం
నమో విశ్వకర్రే నమో విశ్వహర్రే నమో విశ్వ భోక్తే నమో విశ్వ ధాత్రే ||
నమో విశ్వ నేత్రే నమో విశ్వ జైత్రే నమో విశ్వ పిత్రే నమో విశ్వ తాతా
నమస్తే నమస్తే సమస్త ప్రపంచ ప్రమోద ప్రభోద ప్రమాణ ప్రవీణ ||
పవిత్రం చరిత్రం విచిత్రం త్వదీయం నరాయే స్మరం త్వన్వహం సాయిరామ
భవంతం భావాతం భరత్యోభజంతో లభంతే సదానంద మానంద రూపం ||
సపుణ్యః సగణ్యః శరణ్యో మయాయం నరో వేద యోదేవ చూడామణిం త్వాం
సదాకారమేకం చిదానంద రూపం మనోతోవాగతం పరం సాయినాథ ||
సదా సాయి రామేతి నామామృతం తే సదా సాయి మానంద నిష్యంద కందం
పిబంతం నమంతం సుదంతం హసంతం హనుమాంత మందర్భజే తం నితాంతం
శరీరం కళత్రం సుతం బంధువర్గం వయస్యం దానం సత్య భృత్ర్యం భువంచ
సమస్తత్వమేవ నమో సాయి దేవ ప్రసీద ప్రసీద శ్రీయ శ్రేయ సాత్వం
ప్రసీద ప్రసీద ప్రచండ ప్రతాప ప్రసీద ప్రసీద ప్రంచడారికాల
ప్రసీద ప్రసీద ప్రసన్ననుకంపన్ ప్రసీద ప్రసీద ప్రభో సాయిరామ ||
---------------ఓం శ్రీ సాయి రాం---------------
శ్రీ సాయిబాబా చాలీసా
షిరిడి వాస సాయిప్రభో - జగతి మూలం నీవే ప్రభో
దత్తదిగంబర అవతారం – నీలో సృష్టికి వ్యవహారం
త్రిమూర్తిరూపా ఓసాయి – కరుణించు కాపాడోయి
దర్శనమీయగ రావయ్య –ముక్తికి మార్గం చూపవయా ||షిర్డి||
కఫినీవస్త్రము ధరియించి – భుజమునకు జోలి తగిలించి
నింబ వృక్షపు ఛాయలలో – ఫకీరు వేషపు ధారణలో
కలియుగమందున వేలిసితివి – త్యాగం సహనం నేర్పితివి
షిరిడి గ్రామం నీవాసం – భక్తుల మదిలో నీ రూపం ||షిర్డి||
చాంద్ పాటిల్ ను కులుసుకొని – అతని బాదలు తీర్చితివి.
వెలిగించావు జ్యోతులను – నీవుపయోగించి జలము
అచ్చెరువొందెను ఆ గ్రామం – చూసి వింతైనా దృశ్యం ||షిర్డి||
బాయిబా చేసెను నీ సేవ – ప్రతిఫలమిచ్చావో దేవా
నీ ద్వారములో నిలిచితిని – నిన్నే నిత్యం కొలిచితిని
అభయమిచ్చి బ్రోవుమయా – నీలో నిలిచెను శ్రీ సాయి
నీ ధుని మంటల వేడిమికి – పాపము పోవును తాకిడికి ||షిర్డి||
ప్రళయ కాలము ఆపితివి – భక్తులను నీవు బ్రోచితివి
చేసి మహమ్మారీ నాశనం – కాపాడి షిరిడీ గ్రామం
అగ్నిహోత్రి శాస్త్రికి – లీలా మహత్యం చూపించి
శ్యామాను బ్రతికించితివి – పాము విషము తొలగించి ||షిర్డి||
భక్త భీమాజికి క్షయ రోగం – నశించే అతని సహనం
ఊచీ వైద్యం చేసావు – వ్యాధిని మాయం చేసావు
కాకాజీకి ఓ సాయి – విఠల దర్సన మిచ్చితివి
దాము కిచ్చి సంతానం – కలిగించితివి సంతోషం ||షిర్డి||
కరుణసింధూ కరుణించు – మాపై కరుణా కురిపించు
సర్వం నీకే అర్పితము – పెంచుము భక్తి భావమును
ముస్లిం అనుకొని నేను మేఘా – తెలుసుకొని అతని బాధ
దాల్చి శివ శంకర రూపం - ఇచ్చావయ్యా దర్శనము ||షిర్డి||
డాక్టరుకు నీవు రామునిగా – బల్వంత్ కు నీవు దత్తునిగా
నిమోనుకర్ కు మారుతిగా – చిదంబరం కు శ్రీ గణపతిగా
మార్తాండ్ కు ఖండోబాగా – గణుకు సత్యదేవునిగా
నరసింహ స్వామిగా జోషి కి – దర్శనమిచ్చిన శ్రీ సాయి ||షిర్డి||
రేయి పగలు నీ ధ్యానం – నిత్యం నీ లీలా పఠణం
భక్తితో చేయండి ధ్యానం – లభించును ముక్తికి మార్గం
పదకొండు నీ వచనాలు – బాబా మాకవి వేదాలు
శరణమని వచ్చిన భక్తులను – కరుణించి నీవు బ్రోచితివి ||షిర్డి||
వందనమయ్యా పరమేశా – ఆపద్భాందవ సాయీశా
కరుణామూర్తి ఓసాయి – కరుణతో మము దరిచేర్చు
భక్తి భావన తెలుసుకొని – సాయిని మదిలో నిలుపుకొని
చిత్తముతో సాయి ధ్యానం – చేయాలండీ ప్రతి నిత్యం ||షిర్డి||
బాబా కాల్చిన ధుని ఊది – నివారించును అది వ్యాది
సమాధి నుండి శ్రీ సాయి – భక్తులను కాపాడునోయి
మా పాపములను కడతేర్చు – మా మది కోరిక నెరవేర్చు
సృష్టికి నీవేనయా మూలం – సాయి మేము సేవకులం
మా మనస్సే నీ మందిరం – మా పలుకులే నీ నైవేద్యం
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ||షిర్డి||
ఓం శాంతిః ఓం శాంతిః ఓం శాంతిః
---------------ఓం శ్రీ సాయి రాం---------------
శ్రీ సాయిబాబా గారి 11 వచనాలు
(1). ఎవరైతే షిర్డీకి వస్తారో వారి కష్టాలు కడ తేరును!
(2). ఎవరైతే నా సమాదిని దర్శించుతారో వారి కోరికలు నెరవేరును!
(3). ఎవరైతే నాపై దృడ విశ్వాసం ఉంచుతారో, వారిని నేను ఎల్లప్పుడూ కాపాడుతాను!
(4). నేను నా శరీరాన్ని వదిలి వెళ్ళినా, భక్తుల కొరకు పరుగెత్తి వస్తాను!
(5). నేను నిత్య జీవిని, సత్యదేవుణ్ణి!
(6). దేవుడు ఒక్కడే, సర్వ మతాలూ సమానమే!
(7). నేను నమ్మిన వారి విశ్వాసాన్ని వమ్ము కానివ్వను!
(8). నన్ను ఏ రూపంలో పూజిస్తారో వారికి నేను ఆ రూపంలో దర్సనమిస్తాను!
(9). నా శరణుకు వచ్చి ఖాళీగా వెళ్ళిన వారిని చూపండి?
(10). నాలో లీనమైన ప్రతి భక్తునికి నేను ఋణపడి ఉంటాను!
(11). నన్ను నమ్మిన వారెవరైనా ఎన్నటికీ చెడిపోరు.
---------------ఓం శ్రీ సాయి రాం---------------
శ్రీ సాయీశ్వరా
సాయీశ్వరా ! షిరిడీశ్వరా
పత్రీశ్వరా ! షిరిడి పత్రీశ్వరా
సాయి సాయి సాయి సాయీశ్వరా
పత్రీశ్వరా ! షిరిడి పత్రీశ్వరా
భక్త అభినా పరమేశ్వరా
అవతార పురుషా పురుషోత్తమా
పావన చరితా పరమాత్ముడా
మంగళరూపా మహిమాన్వితా
మనసార వేడెద మన్నించరా
శాంతి స్వరూప సాయీశ్వరా
ప్రేమావతారా పత్రీశ్వరా
యోగసాధనకార యోగీస్వరా
---------------ఓం శ్రీ సాయి రాం---------------
సాయీశ శరణం
సాయీశ శరణం ! శరణు సాయీశ పత్రీశ శరణం ! శరణు పత్రీశ
బూటీశ శరణం ! శరణు బూటీశ షిరిడీశ శరణం ! శరణు షిరిడీశ
రాజాది రాజ ! శరణు సాయీశ ఓ యోగి రాజా ! శరణు సాయీశ
దత్తాంశ జాతా ! శరణు సాయీశ ఆనంద రూపా ! శరణు సాయీశ
సచ్చిదానంద ! శరణు సాయీశ సద్గురు మూర్తీ ! శరణు సాయీశ
పరమ పవిత్ర ! శరణు సాయీశ పావన చరిత్ర ! శరణు సాయీశ
జ్యోతి స్వరూపా ! శరణు సాయీశ మాయ నిర్మల ! శరణు సాయీశ
అయోనిజవాస ! శరణు సాయీశ బ్రహ్మాండ నాయక ! శరణు సాయీశ
సచ్చరిత వాసా ! శరణు సాయీశ సకల కళామయ ! శరణు సాయీశ
అనాథ రక్షక ! శరణు సాయీశ ఆపద్బాంధవ ! శరణు సాయీశ
శ్రీ సాయినాథా ! శరణు సాయీశ శ్రీ పత్రినాధా ! శరణు సాయీశ
శ్రీ బూటి నాథా ! శరణు సాయీశ శ్రీ షిరిడి నాథా ! శరణు సాయీశ
అవతార పురుషా ! శరణు సాయీశ త్రిలోక పూజిత ! శరణు సాయీశ
సర్వమతసార ! శరణు సాయీశ శరణు శరణమయా ! శరణు సాయీశ
---------------ఓం శ్రీ సాయి రాం---------------
మేలు కొలుపు
ఓం శ్రీ సాయిబాబా ! శ్రిత పారిజాతా
పరమ పావన శ్రీ సచ్చారితా
మేలు కోవయ్యా శ్రీ షిరిడి వాసా
మేలుకో ! మమ్మేలుకో ! ఏలుకోవయ్యా శ్రీ సాయిబాబా
మందార మకరంద మనోభిరమా
సమస్త కళ్యాణ గుణాభిరామా
సర్వమతసార శ్రీ సాయిబాబా
మేలుకో ! మమ్మేలుకో ! ఏలుకోవయ్యా శ్రీ షిరిడి వాసా
అయోనిజవాసా శ్రీ అవతారపురుషా
వేదాంత వేద్య శ్రీ పత్రీ వాసా
మధురాతి మధురశ్రీ మందగమనా
తెల్లవారావచ్చే మేలుకో ! మమ్మేలుకో ! ఏలుకోవయ్యా శ్రీ బూటి వాసా
భక్తులందరు నిను కొల వచ్చినారు
సకల గణముల నిను చేర వేచినారు
మంగళద్వనులు మిన్నంటి మారు మ్రోగె
మంద హాస రూపా శ్రీ మహిని వాసా
మేలుకో ! మమ్మేలుకో ! ఏలుకోవయ్యా శ్రీ సాయిబాబా
కోడి కూసేను పక్షి రాగాలు తీసె
లేగదూడలు లేచి గంతులు వేచె
యక్ష, కిన్నర గందర్వులొచ్చినారు
మేలుకో ! మమ్మేలుకో ! ఏలుకోవయ్యా శ్రీ దత్త రూపా
తూర్పున భానుడుదయించే తేజమలరా
తొలికిరణాలు నినుచూడ ఎగిసిపడెను
కనులువిప్పుము ఒకసారి కాంతిరూపా
మేలుకో ! మమ్మేలుకో ! ఏలుకోవయ్యా శ్రీ సాయిబాబా
---------------ఓం శ్రీ సాయి రాం---------------
శ్రీ సాయి హారతి
మంగలంబిదే ! శ్రీ సాయినాధా నీకుమంగళంబిదే
అఖిలాండకోటి ! బ్రహ్మాండ రూపా
షిరిడి లోన వున్న ! సాయినాధా ||మంగళం||
దీనుజనులపాలి | దీన బాంధవనుచూ
ఆర్తితోడ పిలిచా | ఆదరించరావా ||మంగళం||
సద్గురుమూర్తీ | మహారాజ నీకు ||మంగళం||
అఖిలాండవాస | మంగలంబిదే
బ్రహ్మాండరూప| మంగలంబిదే
ఓ యోగిరాజా | మంగలంబిదే
సచ్చిదానంద| మంగలంబిదే
శాంతి స్వరూప| మంగలంబిదే
సద్గురుమూర్తి| మంగలంబిదే
మహారాజనీకు| మంగలంబిదే
---------------ఓం శ్రీ సాయి రాం---------------
శ్రీ సాయి హారతి
సర్వస్వ షిరిడీసుని నామ సంకీర్తన సాయిసా షిరిడీ సాయీశా
సర్వస పర్తీశుని నామ సంకీర్తన పర్తీశ షిరిడీ సాయీశా
నాగఃబియంటారు బాలసాయంటారు సాయీశా షిరిడీ సాయీశా
దత్తసాయంటారు పర్తిసాయంటారు సాయీశా షిరిడీ సాయీశా
సత్యసాయంటారు పాప సాయంటారు సాయీశా షిరిడీ సాయీశా
అన్నిదిశలలోనా హారతులు అందేవు సాయీశా షిరిడీ సాయీశా
ఓంకార రూపుడా శ్రీకార రూపుడా సాయీశా షిరిడీ సాయీశా
---------------ఓం శ్రీ సాయి రాం---------------
హరే సాయి హరే సాయి
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే సాయి హరే సాయి సాయి సాయి హరే హరే
హరే దత్త హరే దత్త దత్త దత్త హరే హరే
---------------ఓం శ్రీ సాయి రాం---------------
అంతా సాయిమాయం
అంతా సాయి మయం
ఈ జగమంతా సాయి మయం
అంతా సాయిమయం
సాయి సాయి అని వేడుము మనసా.... మనసా... అ...అ...(2)
సాయి నీడనే కోరుము మనసా
సాయి పదములు వీడకు మనసా
సాయే మనకు మార్గము మనసా ||అంతా||
ఏ రూపులో నున్నా సాయిని గనుమా
ఏ పేరుతొ నున్నా సాయిని గనుమా
ఏ చోట ఎందున్నా సాయిని గనుమా
కనుపాపలా నిన్ను కాయును మనసా ||అంతా||
సత్యములో నున్న సాయిని చూడు
ధర్మములోనున్న సాయిని చూడు
సహనంలోనున్న సాయిని గాంచి
శాంతి సాధనంతో సాయిని గనుమా ||అంతా||
ప్రేమే ప్రేమకు మార్గము మనసా
ప్రేమే భక్తికి మార్గము మనసా
ప్రేమే శక్తి ప్రేమే సంపద
ఈ జగమంతా ప్రేమ మయంరా ||అంతా||
---------------ఓం శ్రీ సాయి రాం---------------
జీవన సందేశం
మానవ జీవితం ఎంతో అమూల్యమైనది.
దీనిని సద్వినియోగం చేసుకోండి.
భగవంతుడు మనల్ని ఈ భూమిమీదకు పంపించినాడు.
కానీ మనము భగవంతుణ్ణే మరచిపోతున్నాము
ఇది ఎలా సంభంవం, భగవంతుని ఎల్లప్పుడూ స్మరించుము.
ఇతరుల సుఖ దుఃఖాలలో పాలు పంచుకోండి.
ఎల్లప్పుడూ ఇతరులకు మంచి చేయండి.
అవమానాలను భరించండి. ఇతరులపై జాలి, ప్రేమ, కరుణ చూపండి.
చిన్న పిల్లలు మరియు వృద్దులపై ప్రేమ చూపండి.
చిన్న పిల్లలు మరియు వృద్దులపై ప్రేమ చూపండి.
తల్లి దండ్రులకు సేవ చేయండి. కోపాన్ని విడనాడండి
.గర్వాన్ని విడనాడి వినయంతో జీవించండి.
బ్రహ్మచర్యాన్ని పాటించండి. దేవుడు మనకు జీవితాన్నిచ్చాడు
దానిని భక్తిలో లీనం చేయండి. జీవితాన్ని సార్థకం చేసుకోండి.
---------------ఓం శ్రీ సాయి రాం---------------
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565