MohanPublications Print Books Online store clik Here Devullu.com

ధ్యానం - Meditation | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu

ధ్యానం - Meditation



1.ధ్యానం 
2.ఆనాపానసతి , ధ్యానం చేయు పద్దతి 
3.ధ్యానం వల్ల లాభాలు 

"ధ్యానం"
ధ్యానం - Meditation | GRANTHANIDHI | MOHANPUBLICATIONS | bhaktipustakalu |Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry,BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA,TANTRA,YANTRA,RASIPALITALU,BHAKTI,LEELA,BHAKTHI SONGS,BHAKTHI,LAGNA,PURANA,devotional,  NOMULU,VRATHAMULU,POOJALU, traditional, hindu, SAHASRANAMAMULU,KAVACHAMULU,ASHTORAPUJA,KALASAPUJALU,KUJA DOSHA,DASAMAHAVIDYA,SADHANALU,MOHAN PUBLICATIONS,RAJAHMUNDRY BOOK STORE,BOOKS,DEVOTIONAL BOOKS,KALABHAIRAVA GURU,KALABHAIRAVA,RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI,FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION,PRINT BOOKS,E BOOKS,PDF BOOKS,FREE PDF BOOKS,freeebooks. pdf,BHAKTHI MANDARAM,GRANTHANIDHI,GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU,BHAKTIPUSTHAKALU,BHAKTHIPUSTHAKALU,pooja
"ధీ" + "యానం" = "ధ్యానం"
"ధీ" = "సూక్ష్మశరీరాది సముదాయం"
అంటే, "ఆస్ట్రల్ బాడీ కాంప్లెక్స్" అన్నమాట
"యానం" = "ప్రయాణం"
కనుక,
"ధ్యానం" అంటే,
"సూక్ష్మశరీరాది సముదాయంతో చేసే ప్రయాణం" అన్నమాట;
దీనినే "ఆస్ట్రల్ ట్రావెల్" అంటాం.
  • ధ్యానం ద్వారానే సర్వలోకాలూ తిరగగలుగుతాం
  • ధ్యానం ద్వారానే సర్వలోకవాసులనూ కలుసుకోగలుగుతాం
  • ధ్యానం ద్వారానే సర్వలోక రహస్యాలనూ తెలుసుకోగలుగుతాం
  • ధ్యానం ద్వారానే సర్వలోక ఆనందాలూ పొందగలుగుతాం.
"ఆనాపానసతి"
MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU
"ఆనాపానసతి" ... అన్నది గౌతమబుద్ధుడు సుమారు 2500 సం|| క్రితం ఉపయోగించిన పాళీ భాష పదం. పాళీ భాషలో... "ఆనాపానసతి" అంటే "మన శ్వాసతో మనం కూడుకుని వుండడం" ... మరి దీనినే మనం "శ్వాస మీద ధ్యాస" అని చెప్పుకుంటున్నాం. ఆనాపానసతి అన్నదే ప్రపంచానికి … సకల ఋషులు, సకల యోగులు .. అందరూ కలిసికట్టుగా ఇచ్చిన  అద్భుతమైన వరం.
'ఆనఅంటే 'ఉచ్ఛ్వాస'
'అపాన' అంటే 'నిశ్వాస'
'సతిఅంటే 'కూడుకుని వుండడం' 
"ఎన్నో సరికాని ధ్యాన పద్ధతులు వున్నాయి … అయితే వాటిల్లో ఒక్కటే సరి అయిన ధ్యాన పద్ధతి ... మరి అదే ఆనాపానసతి" అని బుద్ధుడు అన్నాడు.
సహజంగానే ప్రతి ఒక్కళ్ళూ  "సత్యాన్ని కనుక్కోవాలి" అన్నప్పుడు చివరిగా  చేరే స్థితే ఆనాపానసతి .. చివరికి కనుక్కునే ఉపాయమే ఆనాపానసతి.
ధ్యానం చేసే పద్ధతి 
MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU
సుఖాసనంలో .. హాయిగా .. కూర్చుని .. చేతులు రెండూ కలిపి .. కళ్ళు రెండూ మూసుకుని .. ప్రకృతి సహజంగా జరుగుతూన్న ఉచ్ఛ్వాస నిశ్వాసలనే .. ఏకధారగా .. గమనిస్తూ వుండాలి. ఏ దేవతారూపాన్నీ, ఏ గురు రూపాన్నీ ప్రత్యేకంగా ఊహించుకోరాదు. ఏ దైవ నామస్మరణా  వుండరాదు.
ఈ విధమైన ఆలోచనారహిత-స్థితిలో కలిగే అనేకానేక శారీరక, నాడీమండల, అత్మానుభవాలను శ్రద్ధగా గమనిస్తూ వుండాలి. ఆ స్థితిలో శరీరం వెలుపల వున్న విశ్వమయ ప్రాణశక్తి .. అపారంగా శరీరంలోకి  ప్రవేశించి .. నాడీమండలాన్ని  శుద్ధి చేస్తూ వుంటుంది. ఎవరి వయస్సు ఎంత వుంటుందో .. కనీసం  అన్ని నిమిషాలు .. తప్పనిసరిగా .. రోజుకి రెండు సార్లుగా .. ధ్యానం  చెయ్యాలి.  ఈ విధంగా ప్రతి రోజూ నియమబద్ధంగా ధ్యాన అభ్యాసాన్ని అలవాటు చేసుకోవాలి.

"ధ్యానం వల్ల లాభాలు"
  1. ధ్యాన సాధన ద్వారా శారీరక, మానసిక అనారోగ్యాలైన బి.పి, షుగరు, చర్మ వ్యాధులు, డిప్రెషన్, వెన్నునొప్పి, కాన్సరు, గుండెనొప్పి వంటి సమస్త వ్యాధులు తగ్గుతాయి మరియు దుర్గుణాలు, దురలవాట్లు కూడా పోగొట్టుకోవచ్చు.
  2. మానసిక ఆందోళనలు, ఒత్తిడిని జయించి మానసిక ప్రశాంతతను పొందవచ్చు.
  3. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, బుద్ధికుశలత మొదలైనవి పెరుగుతాయి.
  4. ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరిగి జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను, లాభ నష్టాలను సమబుద్ధితో స్వీకరించగలరు.
  5. మూఢ నమ్మకాలు, భయాలు పోయి చావు-పుట్టుకల జ్ఞానం ద్వారా మరణభయాన్ని కూడా జయించగలరు.
  6. ధ్యానం మనిషిని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి, హింస నుండి అహింస వైపు, అజ్ఞానం నుండి ఆత్మజ్ఞానం వైపు, మానవత్వం నుండి దైవత్వం వైపు నడిపిస్తుంది.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list