Like Us on Facebook
Connect With Us
పూర్ణమ్మ poornnamma MohanPublications GRANTHANIDHI BHAKTIPUSTAKALU
-
- మేలిమి బంగరు మెలతల్లారా !
- కలువల కన్నుల కన్నెల్లారా !
- తల్లులగన్నా పిల్లల్లారా !
-
-
- విన్నారమ్మా యీ కథను ?
-
- ఆటల పాటల పేటికలారా !
- కమ్మని మాటల కొమ్మల్లారా !
- అమ్మలగన్నా అమ్మల్లారా !
-
-
- విన్నారమ్మా మీరీ కథను ?
-
- కొండల నడుమను కోనొకటున్నది !
- కోనకి నడుమా కొలనొకటుంది !
- కొలని గట్టునా కోవెల లోపల
-
-
- వెలసెను బంగరు దుర్గమ్మ.
-
- పూజారింటను పుట్టెను చిన్నది
- పుత్తడి బొమ్మా పూర్ణమ్మా,
- అన్నల తమ్ముల కనుగై దుర్గకు
-
-
- పూజలు పువ్వులు కోసేది.
-
- ఏయే వేళల పూసే పువ్వుల
- ఆయా వేళల అందించి
- బంగరు దుర్గను భక్తితొ కొలిచెను
-
-
- పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.
-
- ఏయే ఋతువుల పండే పళ్ళను
- ఆయా ఋతువుల అందించి
- బంగరు దుర్గను భక్తితొ కొలిచెను
-
-
- పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.
-
- పళ్ళను మీరిన తీపుల నడలును
- పువ్వుల మీరిన పోడుములున్
- అంగము లందున అమరెను పూర్ణకు
-
-
- సౌరులు మించెను నానాటన్.
-
- కాసుకు లోనై తల్లీ తండ్రీ
- నెనరూ న్యాయం విడనాడి
- పుత్తడి బొమ్మను పూర్ణమ్మను వొక
-
-
- ముదుసలి మొగుడుకు ముడి వేస్రీ.
-
- ఆమని రాగా దుర్గ కొలనులో
- కలకల నవ్వెను తామరలు
- ఆమని రాగా దుర్గ వనములో;
-
-
- కిలకిల పలికెను కీరములు.
-
- ముద్దు నవ్వులూ మురిపెములూ మరి
- పెనిమిటి గాంచిన నిమిషమున
- బాసెను కన్నియ ముఖ కమలమ్మున
-
-
- కన్నుల గ్రమ్మెను కన్నీరు.
-
- ఆటల పాటల తోటి కన్నియలు
- మొగుడు తాత యని కేలించ,
- ఆటల పాటల కలియక పూర్ణిమ
-
-
- దుర్గను చేరీ దుక్కించె
-
- కొన్నాళ్ళకు పతి కొనిపోవచ్చెను
- పుత్తడి బొమ్మను పూర్ణమను;
- చీరెలు సొమ్ములు చాలగ దెచ్చెను
-
-
- పుత్తడి బొమ్మకు పూర్ణమకు.
-
- పసుపు రాసిరి బంగరు మేనికి
- జలకము లాడెను పూర్ణమ్మ;
- వదినెలు పూర్ణకు పరిపరి విధముల
-
-
- నేర్పులు మెరసీ కై చేస్రీ.
-
- పెద్దల కప్పుడు మొక్కెను పూర్ణమ
- తల్లీ తండ్రీ దీవించ్రీ;
- దీవన వింటూ పక్కున నవ్వెను
-
-
- పుత్తడి బొమ్మా పూర్ణమ్మ !
-
- చిన్నల నందర కౌగిట చేర్చుకు
- కంటను బెట్టెను కన్నీరూ !
- అన్నల తమ్ముల నప్పుడు పలికెను
-
-
- పుత్తడి బొమ్మా పూర్ణమ్మా.
-
- "అన్నల్లారా తమ్ముల్లారా !
- అమ్మను అయ్యను కానండీ
- బంగరు దుర్గను భక్తితొ కొలవం
-
-
- డమ్మల కమ్మా దుర్గమ్మ.
-
- "ఆయా వేళల పూసే పువ్వుల
- ఆయా ఋతువుల పళ్ళన్నీ,
- భక్తిని తెచ్చీ శక్తికి యివ్వం
-
-
- డమ్మల కమ్మా దుర్గమ్మ
-
- నలుగురు కూచుని నవ్వే వేళల
- నా పేరొక తరి తలవండి;
- మీమీ కన్న బిడ్డల నొకతెకు
-
-
- ప్రేమను నా పేరివ్వండి."
-
- బలబల కన్నుల కన్నీరొలికెను
- పుత్తడి బొమ్మకు పూర్ణమకు
- కన్నులు తుడుచుకు కలకల నవ్వెను
-
-
- పుత్తడి బొమ్మా పూర్ణమ్మ.
-
- వగచిరి వదినెలు, వగచిరి తమ్ములు
- తల్లియు కంటను తడిబెట్టన్
- కాసుకు లోనై అల్లుని చూసుకు
-
-
- ఆనందించెను అయ్యొకడె.
-
- యెప్పటి యట్టుల సాయంత్రమ్మున
- యేరిన పువ్వులు సరిగూర్చి
- సంతోషమ్మున దుర్గను కొలవను
-
-
- వొంటిగ పోయెను పూర్ణమ్మ.
-
- ఆవులు పెయ్యలు మందలు జేరెను
- పిట్టలు చెట్లను గుమిగూడెన్
- మింటను చుక్కలు మెరయుచు వొడమెను
-
-
- యింటికి పూర్ణమ రాదాయె.
-
- చీకటి నిండెను కొండల కోనల
- మేతకు మెకములు మెసల జనెన్
- దుర్గకు మెడలో హారము లమరెను
-
-
- పూర్ణమ యింటికి రాదాయె.
-
- కన్నుల కాంతులు కలవల చేరెను
- మేలిమి జేరెను మేని పసల్ !
- హంసల జేరెను నడకల బెడగులు
-
-
- దుర్గను జేరెను పూర్ణమ్మ.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565