MohanPublications Print Books Online store clik Here Devullu.com

పల్లికొండేశ్వరాలయం



SundayMagazine Sunday Magazine Eenadu Paper Bhakthi Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu Bhakti Pustakalu



SundayMagazine Sunday Magazine Eenadu Paper Bhakthi Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu Bhakti Pustakalu

 శయన శివుణ్ణి చూశారా?

  
SundayMagazine Sunday Magazine Eenadu Paper Bhakthi Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu Bhakti Pustakalu

    బోళా శంకరుడిని తలచినంతనే మదిలో లింగరూపమే సాక్షాత్కరిస్తుంది. కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ ఏ శివాలయానికి వెళ్లినా ఆ రూపమే దర్శనమిస్తుంది. పరమశివుడు భూలోకంలో లింగరూపంలోనే పూజలందుకుంటాడని పురాణ కథనం. కానీ, అందుకు అతీతంగా విగ్రహ రూపంలో కొలువైన శివుణ్ణి దర్శించుకోవాలంటే మాత్రం చిత్తూరు జిల్లాలోని సురుటుపల్లికి వెళ్లాల్సిందే.

     చుట్టూ పచ్చదనాన్ని ఇనుమడింపచేసే కొండలూ, పక్కనే సెలయేటి గలగలలను వినిపించే అరుణానదీ తీరం... ఇలా ఈ క్షేత్రంలో అణువణువూ ప్రకృతి ఒడిలో సేదతీరిన అనుభూతిని కలిగిస్తుంది. భక్తులపాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఇక్కడి పళ్లికొండేశ్వరస్వామి ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యానికి చెందిన హరిహర బుక్కరాయలు క్రీ.శ1344-77 మధ్యకాలంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి.

ఎలా వచ్చిందంటే... 
దుర్వాస మహాముని శాపం వల్ల ఇంద్రలోకంలోని దేవతలందరూ అమరత్వాన్ని కోల్పోయి, ముసలివాళ్లు అవుతారు. అప్పుడు ఇంద్రుడు మహావిష్ణువును శరణు కోరగా సముద్రగర్భంలోని అమృతాన్ని సేవిస్తే మీకు తిరిగి అమరత్వం సిద్ధిస్తుందని చెబుతాడు. దాంతో దేవతలు రాక్షసులతో ఒక ఒప్పందం కుదుర్చుకుని, మంథర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి (పాము)ని తాడుగా చేసుకొని క్షీరసాగర మథనాన్ని చేపడతారు. ఈ క్రమంలో వాసుకి నొప్పిని భరించలేక హాలం అనే విషాన్ని విడుదలచేస్తుంది. అదే సమయంలో క్షీరసాగరం నుంచి హాలా అనే విషం బయటికి వస్తుంది. సమస్తలోకాలనూ దహించడానికి సిద్ధమైన ఆ కాలకూట విషాల బారి నుంచి రక్షించమని సురాసురులు శివుణ్ణి ప్రార్థిస్తారు. వారికి అభయమిచ్చిన పరమశివుడు విషాన్ని తానే మింగుతాడు. మహా శక్తిమంతుడైన శివుడుసైతం భయంకరమైన విష ప్రభావానికిలోనై పళ్లికొండేశ్వరస్వామి క్షేత్రంలోనే పార్వతీ దేవి ఒడిలో కాసేపు విశ్రమించాడట. శివుడు శయనించిన క్షేత్రం కాబట్టి దీనికి శివ శయన క్షేత్రం అనే పేరు వచ్చిందనే కథనం ప్రచారంలో ఉంది.

SundayMagazine Sunday Magazine Eenadu Paper Bhakthi Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu Bhakti PustakaluSundayMagazine Sunday Magazine Eenadu Paper Bhakthi Pustakalu BhakthiPustakalu BhaktiPustakalu Bhakti Pustakalu




దివ్య రూపం 
సర్వమంగళ సమేత శ్రీపళ్లికొండేశ్వరస్వామి విగ్రహం 12 అడుగుల పొడవు ఉంటుంది. ఈ ఆలయంలో దేవతలూ, రుషులూ చుట్టూ నిలబడి ప్రార్థిస్తుండగా పార్వతీ దేవి ఒడిలో శయనిస్తున్నట్టు ఉండే స్వామివారి దివ్యరూపం భక్తులకు దర్శనమిస్తుంది. సురుళ్‌ అంటే దేవతలని అర్థం. విష ప్రభావానికిలోనైన స్వామివారు తిరిగి లేచేవరకూ బ్రహ్మ, మహావిష్ణువు మొదలైన దేవతలందరూ వచ్చి ఈ క్షేత్రంలోనే ఉన్నారట. అందుకే ఈ ప్రాంతానికి సురుటుపల్లి అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతారు. ఈ ఆలయంలోని శివుడి విగ్రహానికి అభిషేకానికి బదులు తమిళనాడు నుంచి తెచ్చిన చందన తైలాన్ని ప్రతి పదిహేను రోజులకోసారి పూస్తారు.

మరగదాంబిక... 
ఆలయంలోకి వెళ్లగానే ముందుగా మరగదాంబికా అమ్మవారు దర్శనమిస్తారు. శివుడు మింగిన విషం శరీరంలోకి వెళ్లకుండా భువనేశ్వరీ దేవి ఆయన కంఠాన్ని గట్టిగా పట్టుకుంటుంది. విషాన్ని ఆపి, జీవితాన్ని అమృతమయం చేసినందువల్లే ఆ తల్లి అముదాంబికై (మరగదాంబికా) అయ్యింది. అందుకే ఈ క్షేత్రంలో ముందుగా అమ్మవారినీ, ఆ తర్వాత స్వామివారినీ దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వాల్మీకి మహర్షి తపస్సుకు మెచ్చిన శివుడు ఇక్కడ స్వయంభూగా వెలిశాడనీ, అందుకే ఇక్కడ కొలువైన దేవదేవుడిని వాల్మికేశ్వర స్వామిగా కూడా అర్చిస్తారనీ పండితులు చెబుతున్నారు.

సతీ సమేతంగా... 
దక్షిణామూర్తి గౌరీదేవితో కలిసి ఉండటం ఇక్కడి మరో ప్రత్యేకత. శివుడి 64 అవతారాల్లో దక్షిణామూర్తి అవతారం ఒకటి. ప్రతి ఆలయంలో మర్రిచెట్టు కింద కూర్చొని ఉండే స్వామివారు ఇక్కడ నందిపై ఆశీనుడై దర్శనమిస్తాడు. గౌరీ సమేత దక్షిణామూర్తిని దర్శించడం వల్ల వివాహం కానివారికి వివాహం అవుతుందనీ, సంతానంలేని వారికి సంతానం లభిస్తుందనీ భక్తుల విశ్వాసం.

ప్రదోషవేళ ప్రత్యేకం 
హాలాహలాన్ని సేవించిన శివుడు శయనించిన సమయంలో స్వామి నిర్వహించాల్సిన క్రతువులను నందీశ్వరుడు నెరవేరుస్తాడు. కోరిన వారికి వరాలిచ్చి భక్తులకు రక్షణగా నిలుస్తాడు. త్రయోదశి నాటి సాయంకాలం శివుడు కళ్లు తెరిచేటప్పటికి అందరూ నందిని పొగడటం చూసి, మహదానంద భరితుడై, ‘నందీ, నీకు ఏ వరం కావాలో కోరుకో’ అని అంటాడు. ‘రోజూ మీకు పూజ జరిగిన తర్వాత మీరు భుజించిన భోజన శేషాన్ని నేను భుజిస్తాను. కానీ త్రయోదశినాడు మాత్రం మొదటి పూజ నాకే చేయాల’ని కోరుకుంటాడు. ఇది జరిగింది శనిత్రయోదశినాడు కావడంతో అప్పటి నుంచీ శనిత్రయోదశి రోజున ప్రదోష కాలంలో మొదటి పూజను నందీశ్వరుడికే నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో నందికి నమస్కరించి, ఆయన చెవిలో మన కోర్కెలను విన్నవిస్తే అవి తప్పక నెరవేరతాయని భక్తుల నమ్మకం.



ఇలా చేరుకోవచ్చు... 
ఈ క్షేత్రానికి వెళ్లాలనుకునే వారు చిత్తూరు జిల్లా కేంద్రం లేదా తిరుపతి నుంచి పుత్తూరు చేరుకోవాలి. అక్కడి నుంచి చెన్నైకి వెళ్లే మార్గంలో 21 కిలోమీటర్లు ప్రయాణించి పళ్లికొండేశ్వరుడిని దర్శించుకోవచ్చు. పుత్తూరు నుంచి ప్రతి పావుగంటకూ ఒక ఆర్టీసీ బస్సు అందుబాటులో ఉంటుంది.







----------------------------------------
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నందు గల 'సత్యవేడు'కు దగ్గరలో గల క్షేత్రం ఇది. అరుణానదీ తీరంలో గల ఈ క్షేత్రంలోని ఆలయం పేరు 'పల్లికొండేశ్వరాలయం'. శివశైవ క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రంలో గరళం త్రాగిన శివుడు పరుండి యుంటే బయట ఏకాంతంగా నంది ఉంటుంది. స్వయంభూ శివలింగంతో పాటు స్వయంభూ గణపతి విగ్రహం కలదు. స్కాంద పురాణ శివరహస్య ఖండంలో శివుడు హాలాహలం మ్రింగి విశ్రమించి నందున 'కాలకూటానన'క్షేత్రంగా ఇది వర్ణించబడింది. నిదురించే శివుని చుట్టూ బ్రహ్మాది దేవతలు అందరూ ఉన్నారు.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list