MohanPublications Print Books Online store clik Here Devullu.com

కల్పనే నిజమాయనే!_Fiction comes true!



కల్పనే నిజమాయనే! Fiction comes true! Android IOS Apple Smartphone Fiction World E-Eenadu Eenadu E-Eenadu BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu


కల్పనే నిజమాయనే!

అగ్మెంటెడ్‌ రియాలిటీ... వాస్తవ ప్రపంచానికి వింతల్ని జత చేస్తోంది! అంగుళాల తెరలపై అన్నీ అద్భుతాలే! ఎలాగంటే...
* ఫోన్‌ కెమెరాతో చూస్తూ గది కొలతల్ని తీసుకోవచ్చు
* ఉన్నచోటే 3డీ బొమ్మల్ని సృష్టించొచ్చు
* మీ పక్కనే హాలోగ్రామ్స్‌ని ప్రత్యక్షమయ్యేలా చేయొచ్చు
* ఆకాశపు హద్దుల్ని చెరిపేసి నక్షత్రమండలాల్ని చూడొచ్చు.
* ఫోన్‌ని స్కేలుగా మార్చేసి వస్తువుల్ని కొలవొచ్చు.
... చెప్పాలంటే ఇలా ‘ఏఆర్‌’ ఆప్‌లు చేసే అద్భుతాలు అనేకం! ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లకు ఇవి ప్రత్యేకం...
ఫోన్‌ని ముందు పెట్టుకుని కెమెరా కంటితో చూస్తూ ఆడిన పోకిమాన్‌ గేమ్‌ గుర్తుందిగా! అది మొదలు ఈ అగ్మెంటెడ్‌ రియాలిటీ ఓ మోస్తరు టెకీలకు పరిచయం అయింది. అయితే, కేవలం గేమింగ్‌కి మాత్రమే వేదిక కాకుండా పరిధిని పెంచుకుని పలు రంగాల్లో ప్రవేశిస్తోంది. ఐటీ దిగ్గజాలైన గూగుల్‌, యాపిల్‌ సంస్థలు ఏఆర్‌ని మరో మెట్టుపైకి ఎక్కిస్తూ పలు రకాల ఆవిష్కరణలతో ముందుకొస్తున్నాయి. దీంతో అగ్మెంటెడ్‌ రియాలిటీ వాస్తవ ప్రపంచంతో వేగంగా జత కట్టేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. వర్చువల్‌ కార్డ్‌బోర్డులు, టెక్‌ గ్యాడ్జెట్‌లు ఆన్‌లైన్‌ అంగళ్లలో... మొబైల్‌ అప్లికేషన్లు ప్లే స్టోర్‌ల్లో తెగ సందడి చేస్తున్నాయి. ఇప్పటికే యాపిల్‌ కంపెనీ ‘ఏఆర్‌కిట్‌’తో ఐఓఎస్‌ 11 ఓఎస్‌ వెర్షన్‌తో ఐఫోన్‌, ఐప్యాడ్‌పై ఏఆర్‌ అద్భుతాల్ని వినియోగదారులకు పరిచయం చేసింది. మరోవైపు గూగుల్‌ ‘ఏఆర్‌కోర్‌’ పేరుతో ఏఆర్‌ ఆప్స్‌ని సులభంగా ఆధునిక ఫోన్లపై రన్‌ చేసుకునేలా ప్రత్యేక ఫ్లాట్‌ఫామ్‌ని సిద్ధం చేసింది. రాబోయే రోజుల్లో ఏఆర్‌కోర్‌ ‘వెర్షన్‌ 1.0’తో సుమారు 10 కోట్ల ఆండ్రాయిడ్‌ ఫోన్లను మార్కెట్‌లో పరిచయం చేసేందుకు గూగుల్‌ సిద్ధం అవుతోంది. దీంతో భవిష్యత్‌లో బడ్జెట్‌ ఫోన్లలోనూ ఏఆర్‌ ఆప్‌లను రన్‌ చేసుకునే వీలుంటుంది. ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీలన్నీ ఈ దిశగానే అడుగులు వేస్తున్నాయి. ఏఆర్‌కోర్‌ వెర్షన్‌ 1.0తో ఆప్‌ డెవలపర్లకీ ఏఆర్‌ ఆప్స్‌ని ప్లే స్టోర్‌లోకి ప్రవేశపెట్టేందుకు దార్లు తెరుచుకోనున్నాయి. ఆప్‌లే కాకుండా మరోవైపు ఏఆర్‌ గ్యాడ్జెట్‌లతోనూ గూగుల్‌ ముందుకొస్తోంది. గతంలో పరిచయం చేసి పక్కన పెట్టిన ‘గూగుల్‌ గ్లాస్‌’ను తిరిగి మార్కెట్‌లోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇప్పటికైతే మొబైల్‌ ప్రియుల్ని లక్ష్యంగా చేసుకుని మొబైల్‌ అప్లికేషన్లు ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లను అలరిస్తూ ఆయా ఆప్‌ స్టోరుల్లో సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం పదండి!


3డీ బొమ్మలతో నేర్చుకోవచ్చు
జిగ్‌ స్పేస్‌- ఐఓఎస్‌

కల్పనే నిజమాయనే! Fiction comes true! Android IOS Apple Smartphone Fiction World E-Eenadu Eenadu E-Eenadu BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu

ఏదైనా పరికరం ఎలా పని చేస్తుందో వివరంగా తెలుసుకోవాలంటే? వెంటనే స్మార్ట్‌ ఫోన్‌ అందుకుని టెక్స్ట్‌ మేటర్‌ చదివో, వీడియో చూసో తెలుసుకుని ఉంటారు. ఇంకాస్త వివరంగా ఉన్నచోటే ఫోన్‌తో పలు పరికరాల్ని 3డీలో సృష్టించి పరిశీలిస్తే! జిగ్‌ స్పేస్‌ ఆప్‌ ఇన్‌స్టాల్‌ చేస్తే ఇది సాధ్యమే. ఎందుకంటే ఇదో 3డీ లెర్నింగ్‌ ఆప్‌. ఇన్‌స్టాల్‌ చేసి గ్యాలరీలో ఉన్న వాటిని ఎప్పుడైనా... ఎక్కడైనా... 3డీలో సృష్టించి చూడొచ్చు. ఉదాహరణకు మీరో ఆటోమొబైల్‌ విద్యార్థి అయితే వాహన ఇంజిన్లని డ్రాయింగ్‌ టేబుల్‌పైనే 3డీలో సృష్టించొచ్చు. భాగాల్ని విడదీసి ఇంటరాక్టివ్‌ పద్ధతిలో నిశితంగా పరిశీలించే వీలుంది. ఇప్పటికైతే జిగ్స్‌ గ్యాలరీలో పరిమిత డిజైన్లే ఉన్నాయి. కొత్తగా రానున్న వెర్షన్లో ‘జిగ్‌ వర్క్‌షాప్‌’ విభాగాన్ని జత చేయనున్నారు. దీంతో యూజర్లూ వారు రూపొందించిన వాటిని గ్యాలరీలోకి అప్‌లోడ్‌ చేసి ఇతరులతో పంచుకోవచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌:https://jig.space/


యాపిల్‌ పరికరాలే ‘స్కేళ్లు’
మెజర్‌కిట్‌- ఐఓఎస్‌

కల్పనే నిజమాయనే! Fiction comes true! Android IOS Apple Smartphone Fiction World E-Eenadu Eenadu E-Eenadu BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu ఏదైనా కొలవాలంటే ఇక మీదట స్కేల్‌ కోసం వెతకాల్సిన పని లేదు. జేబులోని ఐఫోనో, ఐప్యాడో తీస్తే చాలు. అదెలా అంటారా? ఏఆర్‌ మెజర్‌కిట్‌ ఆప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఆప్‌ కెమెరా ఆప్షన్‌తో దేన్నయినా ఇట్టే కొలవొచ్చు. అందుకు ‘రూలర్‌’ ఆప్షన్‌ని ఉచితంగా అందిస్తున్నారు. కెమెరాతో చూస్తున్నప్పుడు అగ్మెంటెడ్‌ రియాలిటీలో స్కేల్‌ ప్రత్యక్షమవుతుంది. దాంతో వస్తువు కొలతల్ని తీసుకోవచ్చు. ప్రీమియం ఆప్షన్లుగా... మాగ్నెటోమీటర్‌, ఫేస్‌ మెష్‌, మార్కర్‌ పిన్‌, యాంగిల్స్‌, క్యూబ్‌, లెవల్‌... ఆప్షన్లు ఉన్నాయి. ‘యాంగిల్స్‌’తో గది నాలుగు మూలల్నీ కొలవొచ్చు. ‘పర్సన్‌ హైట్‌’ ఆప్షన్‌తో ముందు నిలిచున్న వ్యక్తి ఎత్తుని క్షణాల్లో కొలవొచ్చు. ‘ఫేస్‌ మెష్‌’తో ముఖాన్ని 3డీ మోడల్‌లో సృష్టించొచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్: ‌https://measurekit.com/


ప్రపంచమంతా కాన్వాసే
వరల్డ్‌ బ్రష్‌- ఐఓఎస్‌

కల్పనే నిజమాయనే! Fiction comes true! Android IOS Apple Smartphone Fiction World E-Eenadu Eenadu E-Eenadu BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakaluచూసేకళ్లుంటే ప్రపంచమే ఓ పెద్ద కాన్వాస్‌. అందుకే మీ ఫోన్‌ కెమెరా కంటితో చూసే మొత్తం ప్రపంచాన్ని ఓ కాన్వాస్‌లా మార్చేసి కుంచెతో బొమ్మలు తీస్తే! ఎలా సాధ్యమో తెలియాలంటే యాపిల్‌ యూజర్లు వరల్డ్‌ బ్రష్‌ ఆప్‌ని ప్రయత్నించొచ్చు. ఆప్‌ని రన్‌ చేసి కెమెరా ఆప్షన్స్‌లో బ్రష్‌లను సెలెక్ట్‌ చేసి ‘లైవ్‌ లొకేషన్‌’లో బొమ్మలు గీయొచ్చు. సందర్శించిన ప్రాంతాల్ని చూస్తూ మీదైన శైలిలో స్పందిస్తూ తెరపై రాయొచ్చు. ఇలా గీసిన, రాసిన వాటిని పబ్లిక్‌తో పంచుకుంటే... ఆప్‌ వాడే యూజర్లు మీరు సందర్శించిన చోటికి వెళ్తే తెరపై అవి కూడా కనిపిస్తాయి. ఇతరుల ఏఆర్‌ స్పందనల్ని మీరూ చూడొచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://worldbrush.net/


ఆకాశం హద్దులు దాటి...
స్కైవ్యూ- ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌

కల్పనే నిజమాయనే! Fiction comes true! Android IOS Apple Smartphone Fiction World E-Eenadu Eenadu E-Eenadu BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakaluనక్షత్ర మండలాలు, గ్రహాల్ని చూడాలంటే? ప్లానిటోరియం అడ్రసో... టెలిస్కోప్‌ అడ్డాకో వెళ్లాల్సిన పని లేదు. జేబులో స్మార్ట్‌ ఫోన్‌ తీస్తే చాలు. మీరు ఉన్న చోట ఆకాశపు హద్దుల్ని చెరిపేస్తూ గ్రహాలు, నక్షత్ర మండాల్ని ప్రత్యక్షంగా చూడొచ్చు. ఆప్‌ని ఓపెన్‌ చేసి కెమెరా కంటితో ఆకాశం వైపు చూపితే చాలు. కోట్ల నక్షత్రాల్ని కథలు, వాటి ఆకారాల్ని ఎక్స్‌ప్లోర్‌ చేసి చూడొచ్చు. రాత్రి సమయంలో ఆప్‌ని వాడితే మంచి ఫలితాల్ని రాబట్టొచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://goo.gl/iiS1QL


‘హాలో’ మ్యాన్‌లు వచ్చేస్తారు
హాలో- ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌

కల్పనే నిజమాయనే! Fiction comes true! Android IOS Apple Smartphone Fiction World E-Eenadu Eenadu E-Eenadu BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakaluపులితో ఫొటో దిగాలంటే? జంతు ప్రదర్శనశాలకి వెళ్లాల్సిన పని లేదు. ఉన్నచోటకే పులిని పిలవొచ్చు. ఇంకా చెప్పాలంటే... స్పైడర్‌ మ్యాన్‌తో స్నాప్‌ తీసుకుందాం అనుకుంటే? హాలీవుడ్‌కి ఎగిరి వెళ్లాల్సిన పని లేదు. పిలిస్తే మీ ఇంటి సోఫాలోకి వచ్చేస్తాడు. ‘హాలో’ ఏఐ ఆప్‌తో ఇది సాధ్యమే. ఇన్‌స్టాల్‌ చేస్తే ఆప్‌తో పాటు హాలో మ్యాన్ల గ్యాలరీ డౌన్‌లోడ్‌ అవుతుంది. ఇంకేముందీ... ఆప్‌ కెమెరా కంటితో హాలోగ్రామ్‌ ఇమేజ్‌లను చిటికెలో ప్రత్యక్షమయ్యేలా చేయవచ్చు. ఉదాహరణకు ఇంట్లో మీకున్న సింహాసనం పక్కనే పులికీ ఓ స్టూల్‌ వేసి నిలబెట్టి ఫొటో లేదా వీడియో తీసుకోవాలంటే క్షణాల్లో చిత్రీకరించొచ్చు. ఇదే మాదిరిగా స్పైడర్‌ మ్యాన్‌తో సందడి చేస్తూ వీడియో తీసుకోవచ్చు. ఆప్‌ గ్యాలరీలో విభాగాల వారీగా చాలానే ఉన్నాయి. అన్నింటినీ ఒక్కొక్కటిగా ఆప్‌కి జత చేసుకుని వాడుకోవచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://thisisholo.com/


గది అలంకరణ ‘మ్యాజిక్కే’
మ్యాజిక్‌ప్లాన్‌- ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌

కల్పనే నిజమాయనే! Fiction comes true! Android IOS Apple Smartphone Fiction World E-Eenadu Eenadu E-Eenadu BhakthiPustakalu BhaktiPustakalu Bhakthi Pustakalu Bhakti Pustakalu కొత్తిల్లు కట్టుకున్నారు... లేదంటే అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌ కొన్నారు. మీ అభిరుచి మేరకు గదుల కొలతల్ని తీసుకుని ఎక్కడెక్కడ ఏమేం ఉండాలో కొలుస్తూ పక్కా ప్రణాళిక వేసుకోవాలంటే? సంబంధిత నిపుణుల్ని పిలిపించాల్సిన పని లేకుండా మ్యాజిక్‌ప్లాన్‌ ఆప్‌ని ఓపెన్‌ చేస్తే సరి. ఫోన్‌ కెమెరాకి గది నాలుగు మూలల్ని చూపితే వెంటనే మ్యూజిక్‌ చేసినట్టుగా గదికి సంబంధించిన ప్లాన్‌ సిద్ధం అవుతుంది. ఇంకేముందీ... ఫర్నీచర్‌, ఫ్లోర్‌ మ్యాట్‌లు, ఇతర ఇంటీరియర్‌ డిజైన్స్‌తో గది ఎలా ఉంటుందో 3డీలో చూడొచ్చు. ఉచిత వెర్షన్‌లో ‘బేసిక్‌ ఫ్లోర్‌ ఫ్లాన్‌’ని అందిస్తున్నారు. ఇతర సౌకర్యాల్ని యాక్సెస్‌ చేయాలంటే ప్రీమియం వెర్షన్‌ని కొనుగోలు చేయాలి.
డౌన్‌లోడ్‌ లింక్‌: http://www.magic-plan.com/

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list