కాలసర్ప యోగాలు -
నివారణోపాయాలు
జ్యోతిషంలో అతి వివాదాస్పద విషయాలలో కాల సర్ప యోగం ఒకటిగా తయారైంది. అసలు ఈ యోగాన్ని వరాహాచార్యుడే చెప్పింది. ముఖ్యంగా చెప్పబడే శ్లోకం ఆయనదే. శ్లో||అగ్రే రాహు రధో కేతు మధ్యే సర్వ గ్రహా యది కాల సర్పాఖ్య యోగోయం రాజా రాష్ట్ర వినాశనం. ప్రామాణిక గ్రంథాలలో ఎక్కడా ఇది వ్యక్తిగత జాతకాలలో పని చేస్తుందని చెప్పలేదు. దీనిని ఈ మధ్య కొందరు వక్రీకరించి నాగుల పేర్లకు దీనికి ముడిపెట్టి అనంత కాల సర్ప యోగమని, గుళిక కాలసర్పయోగమని, వాసుకి కాల సర్ప యోగమని, శంక పాల కాల సర్ప యోగమని, పద్మ కాల సర్ప యోగమని, మహాపద్మ కాల సర్ప యోగమని, తక్షక కాల సర్ప యోగమని, కర్కోటక కాల సర్ప యోగమని, శంఖచూడ కాల సర్ప యోగమని, ఘటక కాల సర్ప యోగమని, విషక్త, లేక విష దాన కాల సర్ప యోగమని, శేషనాగ కాల సర్ప యోగమని ఇలా పన్నెండు రకాల కాలసర్పయోగాలు ఉన్నాయి.
ఈ దోషాల పలితాలను గుర్తించేటప్పుడు మనం అనేక జ్యోతిశాస్త్ర నియమాలను కూడ పరిగణలోకి తీసుకోవాలి.
కాలసర్పయోగం సాదారణ మానవులపై ప్రభావం చూపించదు.కాలసర్ప దోషం ప్రపంచాన్ని , దేశాన్ని, రాష్ట్రాన్ని, సంస్ధని, అదికారం చలాయించే వారికి కాలసర్పదోష ప్రభావం ఉంటుంది. వారు పరిపాలించేచోట సరియైన సమయంలో వర్షాలు పడక పంటలు సరిగా పండక, ఆర్దికవ్యవస్ధ దెబ్బతిని, కోట్లాటలు, అనారోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడతారు.
పరిపాలాద్యక్షుకుడికి,పాలనా వ్యవస్ధపై కాలసర్పదోష ప్రభావ కనపడుతుంది. పాలకులు సరియైన నిర్ణయాలు తీసుకోలేరు.
అయితే కాలసర్పదోషం ఉన్నవ్యక్తులకు,రాహు,కేతు దశలు నడుస్తున్న వ్యక్తులకు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తాడు. కొన్ని రెమిడీస్ చేసుకుంటె రాహు, కేతు చాయగ్రహాలభాదలనుండి విముక్తి లభిస్తుంది.
జాతక చక్రంలో లగ్నంలో అనగా ఒకటవ స్థానంలో రాహువు మరియు 7వ స్థానం కేతువు ఉన్నట్లైతే ఈ జాతకులకు “ అనంత కాలసర్ప యోగం”గా భావించాలి. ఈ యోగం వలన వీరి దాంపత్య జీవితంలో విబేధాలు ఏర్పడతాయి. తప్పు నిర్ణయాలు తీసుకొని అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు.
జాతక చక్రంలో లగ్నం నుండి 2వ స్థానంలో రాహువు మరియు 8వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “కులిక కాలసర్ప యోగం”గా గుర్తించాలి. దీని వలన వీరికి సంపాదన తక్కువగా ఉంటుంది. అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదాలు మరియు అకాల మరణాలు సంభవిస్తాయి.
జాతక చక్రంలో లగ్నం నుండి 3వ స్థానంలో రాహువు మరియు 9వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “వాసుకి కాలసర్ప యోగం”గా గుర్తించాలి. ఈ జాతకులకు ఆత్మ గౌరవం తగ్గి సంఘంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటారు. ఆత్మహత్యలకు పాల్పడతారు.సోదరులతో విబేధాలు ఏర్పడతాయి. విదేశాలకు వెళ్ళుటకు ఇబ్బందులు ఎదుర్కొంటారు.
జాతక చక్రంలో లగ్నం నుండి 4వస్థానంలో రాహువు మరియు 10వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “శంఖ పాల కాలసర్ప యోగం”గా గుర్తించాలి. ఈ జాతకులు అందరినీ దుర్భాషలడతారు. జాతకుని తల్లికి అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. ఉద్యోగంలో లేదా వ్యాపారంలో నష్టాలు ఎదుర్కొంటారు. వాస్తు సరిగ్గా లేని ఇంటిలో నివసిస్తూ అధిక సమస్యలకు గురి అవుతారు.
జాతక చక్రంలో లగ్నం నుండి 5వ స్థానంలో రాహువు మరియు 11వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “పద్మ కాలసర్ప యోగం” వీరికి వ్యాపారంలో నష్టాలు ఎదురవుతాయి. స్నేహితుల వలన సమస్యలు వస్తాయి. సంతానంలో కొరత లేదా ఆలస్యం ఏర్పడుతుంది.
జాతక చక్రంలో లగ్నం నుండి 6వ స్థానంలో రాహువు మరియు 12వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “మహా పద్మ కాలసర్ప యోగం”గా గుర్తించాలి. ఈ జాతకులకు శత్రువులు ఎక్కువగా ఉంటారు. అనారోగ్యాల పాలవుతు ఉంటారు. ఏకాంతంగా మిగిలిపోవడం, జైలు పాలవడం లాంటివి జరిగే సూచనలు ఉన్నాయి.
జాతక చక్రంలో లగ్నం నుండి 7వ స్థానంలో రాహువు మరియు లగ్నంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “తక్షక కాల సర్ప యోగం”గా గుర్తించాలి. ఈ జాతకుల జీవిత భాగస్వామి చెడు ప్రవర్తన గలవారై ఉంటారు. పరిస్థితులు వీరిని వైరాగ్యానికి గురి చేస్తాయి.
జాతక చక్రంలో లగ్నం నుండి 8వ స్థానంలో రాహువు మరియు 2వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “కర్కోటక కాల సర్ప యోగం”గా గుర్తించాలి. ఈ జాతకులు నిరంతర అనారోగ్యంతో భాదపడతారు. సంపదకు మించి ఖర్చులు పెరిగిపోవడంతో అప్పుల పాలవుతారు.
జాతక చక్రంలో లగ్నం నుండి 9వ స్థానంలో రాహువు మరియు 3వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “శంఖచూడ కాల సర్ప యోగం”గా గుర్తించాలి. ఈ జాతకులు అన్నీ రకాల చెడు వ్యసనాలకు అలవాటు పది ఉంటారు. వీరికి ఉన్న ఆస్తి మరియు సంపదను కోల్పోతారు. విదేశాలకు వెళ్ళుట కష్టంగా మారుతుంది. ప్రయాణాలలో సమస్యలు వస్తాయి.
జాతక చక్రంలో లగ్నం నుండి 10వ స్థానంలో రాహువు మరియు 4వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “పాతక కాలసర్ప యోగం”గా గుర్తించాలి. ఈ జాతకంలో వారు చేసే ఉద్యోగంలో కానీ,వ్యాపారంలో కానీ సరిగ్గా రాణించలేరు. వీరి కుటుంబ సభ్యులలో ఒకరు మాంత్రికుడిగా మారి క్షుద్ర పూజలు ప్రయోగించి ఇతరులను కష్టాలకు గురి చేస్తారు.
జాతక చక్రంలో లగ్నం నుండి 11వ స్థానంలో రాహువు మరియు 5వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకి “విషధార కాల సర్ప యోగం”గా గుర్తించాలి. ఈ జాతకులు వీరి కన్నా అగ్రజులైనా సోదరి లేక సోదరులతో విబేధాలు ఏర్పడతాయి. స్నేహితుల వలన సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. సంధిగ్ధమైన మనస్సు కలిగి ఉండడం వలన వ్యాపారాలలో నష్టాలు ఏర్పడతాయి. అప్పులు చేసి ఆస్తి పోగొట్టుకొంటారు.
జాతక చక్రంలో లగ్నం నుండి 12వస్థానంలో రాహువు మరియు 6వ స్థానంలో కేతువు ఉన్నట్లైతే ఆ జాతకులకు “శేషనాగు కాల సర్ప యోగం”గా గుర్తించాలి.ఈ జాతకులు సంపాదనకు మించి ఖర్చును చేస్తారు. వీరికి వీడని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. జైలు పాలయ్యే అవకాశాలు వస్తాయి. వీరికి తెలియని శత్రువులు హాని చేయడానికి ప్రయత్నిస్తారు.
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565