MohanPublications Print Books Online store clik Here Devullu.com

ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు_Ancient spaces - modern naming


ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు _Ancient spaces - modern naming ramayanam bharatam bhagavatam bhakthipustakalu bhaktipustakalu


ప్రాచీన ప్రదేశాలు - ఆధునిక నామధేయాలు

రామాయణం
* భగీరథుడు గంగను భువికి దింపిన స్థలం - గంగోత్రి, ఉత్తరాఖండ్
* కపిల మహర్షి ఆశ్రమం,-(శ్రీరాముని పూర్వీకులు సగర చక్రవర్తి తనయులు 60,000మంది కాలి బూడిదైన స్థలం.గంగానది వారి భస్మరాసుల మీద ప్రవహించి వారికిపుణ్యలోకాలు ప్రసాదించి
బంగాళాఖాతంలో కలుస్తుంది) -గంగాసాగర్, వెస్ట్బెంగాల్
* కాంభోజ రాజ్యం - ఇరాన్ (శ్రీరాముని ముత్తాతరఘు మహారాజు సామ్రాజ్యంఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖిస్తాన్, దాటి యింతవరకూ విస్తరించింది)
* రక్షస్థలం (రావణుడు తన పది తలలు నరికి శివున్నిపూజించి వరాలు పొందినచోటు)- లాంగకో, టిబెట్, చైనా
* గోకర్ణ,శివుని ఆత్మలింగాన్ని గణేశుడు నేలవైచిన చొటు -గోకర్ణ, కర్ణాటక
* సీతాదేవి భూమిలో లభించిన చోటు - సీతామర్హి, బీహార్
* మిథిల (సీతాదేవి పుట్టినిల్లు) - జనక్ పూర్, నేపాల్
* కోసలదేశం - రాజధాని అయిన అయోధ్య నుండి నేపాల్ లోని కొన్ని ప్రాంతాల వరకుఉన్న ప్రదేశం
* దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన స్థలం -ఫైజాబాద్,ఉత్తర్ ప్రదేశ్
* సరయూ నది (ఈ నదీ తీరంలోనే అయోధ్య నిర్మితమైనది) -ఘాఘర నది
* ఆయోధ్య / సాకేతపురం (శ్రీరాముని జన్మస్థలం,బంగారు సీతతో అశ్వమేధ యాగంచేసిన స్థలం,సరయూ నదిలో మునిగి వైకుంఠం చేరిన స్థలం) -అయోధ్య,ఉత్తర్ ప్రదేశ్
* తాటక వధ జరిగిన ప్రదేశం - బక్సర్, బీహార్
* అహల్య శాపవిమోచన స్థలం - అహిరౌలి,బీహార్
* కుశనాథపురం (విశ్వామిత్రుడు యాగం చేసిన స్థలం) -సుల్తాన్ పూర్, ఉత్తర్ ప్రదేశ్
* గుహుడుసీతారామలక్ష్మణులను కలిసిన చోటు- శృంగబేరిపురం,అలహాబాద్దగ్గర
* దండకారణ్యం - చత్తీస్ ఘడ్ లోని బస్తర్ జిల్లా, ఆంధ్ర,ఒరిస్సా, మధ్యప్రదేశ్ లోని కొన్నిప్రాంతాలు
* చిత్రకూటం (సీతారామలక్ష్మణులు వనవాసం చెసిన చోటు)
- సాత్న జిల్లా, మధ్యప్రదేశ్
* పంచవటి (శూర్పణఖ ముక్కూచెవులు కోసిన స్థలం) -నాసిక్, మహరాష్ట్ర
* కబంధాశ్రమం - కర్దిగుడ్, బెల్గావి, కర్ణాటక
* శబరి ఆశ్రమం - సర్బన్, బెల్గావి, కర్ణాటక
* హనుమంతుడు రామలక్ష్మణులను మొదటిసారి గా కలసిన ప్రదేశం -హనుమాన్హళ్ళి,కొప్పాళ,కర్ణాటక
* ఆంజనేయ పర్వతం (హనుమంతుడి జన్మస్థలం),కిష్కింద (సుగ్రీవునిరాజ్యం),ఋష్యమూక పర్వతం-తుంగభద్ర నదీతీర ప్రాంతం,హంపి దగ్గర,కర్ణాటక
* విభీషణుడు రాముని శరణు కోరిన స్థలం - ధనుష్కొటి,తమిళనాడు
* శ్రీరాముడు వానరసైన్యం తో వారధి నిర్మించినచోటు-రామేశ్వరం,తమిళనాడు
* రత్నద్వీపం / సింహళం / లంక - శ్రీలంక
* అశోకవనం (సీతాదేవి బందీగా ఉన్న ప్రదేశం) - కాండీ దారిలోని
సీత ఏళియ, శ్రీలంక
* శ్రీరాముడు రావణుని వధించిన చోటు - దునువిల్ల,శ్రీలంక
* సీతాదేవి అగ్నిప్రవేశం చేసిన ప్రాంతం - దివిరుంపోల,శ్రీలంక
* వాల్మీకి ఆశ్రమం / సీతాదేవి కుశలవులకు జన్మనిచ్చినస్థలం / భూదేవిలో ఐక్యమైనస్థలం - ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి 30మైళ్ళ దూరంలోని
బితూర్.
* కుశపురం (సీతారాముల పెద్దకుమారుడు కుశుడు కట్టించిన నగరం) - కుశార్,పాకిస్తాన్
* లవపురం (సీతారాముల చిన్నకుమారుడు లవుడు కట్టించిన నగరం) - లాహోర్,పాకిస్తాన్
* తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతునిపెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) -తక్షశిల, పాకిస్తాన్
* పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకుపుష్కరుడు నిర్మించిన నగరం) - పెషావర్, పాకిస్తాన్


భాగవతం,మహాభారతం 


* మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం - 
దేవ్ ధాం,నేపాల్
* నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం - అహోబిలం,ఆంధ్రప్రదేశ్
* జమదగ్ని మహర్షి ఆశ్రమం - జమానియా, ఉత్తర్ ప్రదేశ్
* మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప ్రదేశ్
* శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారిరక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం, దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
* పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకివిసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి * తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) -కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం
* మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) - పశ్చిమ ఒరిస్సా
* నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) - గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్
* వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
* నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) - సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
* వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మనగ్రామం, ఉత్తరాంచల్
* రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్
* సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర
* హస్తినాపురం (కౌరవుల రాజధాని) - హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్
* మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్
* వ్రేపల్లె / గోకులం - గోకుల్, మధుర దగ్గర
* కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు) - గ్వాలియర్
* మద్ర దేశం (పాండురాజు రెండో భార్య మాద్రి పుట్టినిల్లు)
- పంజాబ్ ప్రావిన్స్, పాకిస్తాన్
* ద్రోణనగరి (ద్రోణుడు నివసించిన ప్రాంతం)-డెహ్రాడూన్
* గురుగ్రామం (కురుపాండవులు విద్యాభ్యాసం చేసిన చోటు) - గురుగావ్, హర్యానా
* కర్ణుడు పరిపాలించిన అంగ రాజ్యం - కాబుల్
(ఆఫ్ఘనిస్తాన్)
* పాండవుల లాక్షగృహ దహనం- వర్నాల్, హస్తినాపూర్
* కాలయవనుడు ముచికుందుని కోపాగ్ని జ్వాలలకు భస్మమైన స్థలం -గిర్నార్,గుజరాత్
* శ్రీకృష్ణ,బలరాముల ద్వారకా నగరం - ద్వారక,గుజరాత్
* హిడింబవనం (హిడింబాసురుడిని భీముడు చంపిన చోటు)
-జలాన్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
* విదర్భ (దమయంతి, రుక్మిణిదేవి తండ్రులు యేలిన రాజ్యం) - విదర్భ, మహరాష్ట్ర
* కుండినపుర (రుక్మిణిదేవి జన్మస్థలం) - కుండినపుర, మహరాష్ట్ర
* చేది రాజ్యం (శిశుపాలుడు ఏలిన రాజ్యం) - బుందేల్ ఖండ్, మధ్యప్రదేశ్
* కారుష రాజ్యం (దంతవక్రుడు ఏలిన రాజ్యం) - దాతియ జిల్లా, మధ్యప్రదేశ్
* ఖాండవప్రస్థం / ఇంద్రప్రస్థం (పాండవుల రాజధాని) - ఇంద్రప్రస్థ, ఢిల్లీ దగ్గర
* కుచేలుడు నివసించిన చోటు - పోర్ బందర్, గుజరాత్
* పాంచాల దేశం (ద్రుపద మహారాజు రాజ్యం) - ఎటాహ్,సహజహంపూర్,ఫారుఖాబాద్ప్రాంతాలు, ఉత్తర్ ప్రదేశ్
* కంప్లి (ద్రౌపది పుట్టినిల్లు,మత్స్యయంత్ర బేధన స్థలం) - కంపిల్, ఉత్తర్
* జరాసంధుని భీముడు చంపిన చోటు - జరాసంధ్ కీ ఆఖరా / రణ్ భూమి, బీహార్
* కామ్యక వనం,దైత్య వనం (పాండవులు అరణ్య వాసం చేసిన ప్రాంతాలు) - పశ్చిమహర్యానా
* మత్స్య దేశం (విరాట మహారాజు రాజ్యం) -ఆల్వార్,గురుగావ్ నుంచి జైపూర్ వరకువున్న ప్రాంతం,రాజస్థాన్
* విరాటనగరం (పాండవులు అజ్ఞాత వాసం చేసిన స్థలం) - విరాట్ నగర్,రాజస్థాన్
* శోణపురం (బాణాసురుడి రాజధాని) - సోనిత్ పూర్, అస్సాం
* ప్రాగ్జ్యోతిష్యం (నరకాసురుని రాజధాని) - తేజ్ పూర్, అస్సాం
* నిర్యాణానికి ముందు శ్రీకృష్ణుడు బోయవాని వేటుకి గురైన స్థలం - ప్రభాస తీర్థం,సోంనాథ్, గుజరాత్
* జనమేజయుడు సర్పయాగం చేసిన స్థలం - పర్హాం,ఉత్తర్ ప్రదేశ్
* కపిలవస్తు (బుద్ధుని జన్మస్థలం)- నేపాల్ లోని తిలార్కోట్
* బుద్ధునికి జ్ఞానోదయం అయిన స్థలం- బోధ్ గయ, బీహార్
* గౌతమ బుద్ధుడు పరినిర్యాణం చెందిన చోటు- కుశీనగర్, ఉత్తర్ ప్రదేశ్

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list