MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఆదిత్య హృదయం స్తోత్రం-Aditya Hrudayam Stotram




ఆదిత్య హృదయ స్తోత్రం
      ఆదిత్య హృదయం అనే ఈ స్తోత్రం సూర్యభగవానుడి ని ఉద్దేశించినది. రామాయణం యుద్ధకాండలో శ్రీ రాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు.ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడిని చేస్తాడు.
                    ఆదిత్య హృదయ స్తోత్రం
తతౌ యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం
రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం 1
దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణం
ఉపగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవానృషిః 2
అగస్త్య ఉవాచ:
రామరామహాబాహో శృణు గుహ్యం సనాతనం
యేన సర్వానరీన్ వత్స సమరే విజయష్యసి 3
ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రువినాశనం
జయావహం జపేన్నిత్యం అక్షయం పరమం శివం 4
సర్వమంగళమాంగళ్యం సర్వపాపప్రణాశనం
చింతాశోకప్రశమనం ఆయుర్వర్ధన ముత్తమం 5
రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం
పూజయస్వవివస్వంతం భాస్కరం భువనేశ్వరం 6
సర్వ దేవాత్మకో హ్యేశ తేజస్వీ రశ్మిభావనః
ఏశ దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః 7
ఏశ బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః
మహేంద్రో ధనదః కాలో యమస్సోమో హ్యపాంపతిః 8
పితరో వసవః సాధ్యాః అశ్వినౌ మరుతో మనుః
వాయుః వహ్నిః ప్రజాప్రాణా ఋతు కర్తా ప్రభాకరః 9
ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్
సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః 10
హరిదశ్వస్సహస్రార్చిః సప్తసప్తిర్మరీచిమాన్
తిమిరోన్మథనః శంభుస్త్వష్టా మార్తండక అంషుమాన్ 11
హిరణ్యగర్భహ్ శిశిరస్తపనో భాస్కరో రవిః
అగ్నిగర్భోఅదితేః పుత్రః శంఖః శిశిరనాశనహ్ 12
వ్యోమనాథ స్తమోభెదీ ఋగ్ యజుస్సామ పారగః
ఘన వృష్టిరపాం మిత్రో వింధ్య వీథీ ప్లవంగమః 13
ఆతపీ మండలీ మృత్యుః పింగళః సర్వతాపనః
కవిర్విశ్వో మహాతేజా రక్తః సర్వ భవోధ్భవః 14
నక్షత్ర గ్రహతారాణాం అధిపో విశ్వ భావనః
తెజసామపి తేజస్వీ ద్వాదశాత్మన్నమోస్తుతే 15
నమః పూర్వాయ గిరయే పశ్చిమాయాద్రయె నమః
జ్యోతిర్గణాణాం పతయే దినధిపతయే నమః 16
జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః
నమో నమస్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః 17
నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః
నమః పద్మ ప్రబోధాయ ప్రచండాయ నమో నమః 18
బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే
భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషె నమః 19
తమొఘ్నాయ హిమఘ్నాయ శత్రుఘ్నాయ అమితాత్మనె
కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాం పతయే నమః 20
తప్త చామీక రాభాయ హరయే విష్వకర్మణే
నమస్తమోభినిఘ్నాయ రుచయే లొకసాక్షిణే 21
నాశయత్యేష వై భూతం తదైవ సృజతి ప్రభుః
పాయత్యేష తపత్యేష వర్షత్యేష గభస్తిభిః 22
ఏష సుప్తేషు జాగర్తి భూతేషు పరినిష్ఠితః
ఏష చైవాగ్నిహోత్రంచ ఫలం చైవాగ్నిహోత్రిణాం 23
వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ
యాని కృత్యాని లోకేషు సర్వేషు రవిః ప్రభుః 24
ఏనమాపత్సు కృత్ శ్రేషు కాంతారేషు భయేషు చ
కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవః 25
పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం
ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి 26
అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి
ఏవముక్త్వా తదాగస్త్యో జగామ చ యథాగతం 27
ఏతత్ శృత్వా మహాతెజా నష్టశొకొభవత్తదా
ధారయామాస సుప్రీతొ రాఘవహ్ ప్రయతాత్మవాన్ 28
ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వా తు పరం హర్షమవాప్తవాన్
త్రిరాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయ వీర్యవాన్ 29
రావణం ప్రేక్ష్య హ్రుష్టాత్మా యుద్ధాయ సముపాగమత్
సర్వ యత్నేన మహతా వధె తస్య ధృతోభవత్ 30
అథ రవి రవదన్నిరీక్ష్య రామం
ముదితమనాః పరమం ప్రహృష్యమాణః
నిశిచరపతి సంక్షయం విదిత్వా
సురగణమధ్యగతో వచస్త్వరేతి


ఆదిత్య హృదయం- విశిష్టత

ఆదిత్య హృదయం వాల్మీకి రామాయణం లో యుద్ద కాండలో చెప్పబడింది. ఈ స్తోత్ర పారాయణం అనేక సమస్యలను తొలగిస్తుంది. ఆర్ధిక, ఋణ సమస్యలను మరియు ఆరోగ్య సమస్యలను ఈ స్తోత్ర పారాయణం తగ్గిస్తుంది. ముఖ్యంగా నేత్ర సమస్యలకు ఈ స్తోత్రం బాగా ఉపకరిస్తుంది. తీవ్ర వృత్తి సమస్యలలో ఉన్న వారు, జాతకంలో రవి గ్రహంచే బాధలు పొందేవారు మరియు 1, 10, 19,28 తేదీలలో జన్మించిన వారు ఈ స్తోత్రం ను ప్రతిరోజూ పారాయణం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఈ స్తోత్రం ను ప్రతిరోజూ 6 సార్లు పారాయణం చేస్తూ ఆదివారాలందు పగటిపూట ఉపవాసం ఉండాలి. ఈ విధంగా 60 రోజులు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ 60 రోజులు అన్ని నియమాలను పాటించాలి. అదే విధంగా తీవ్ర అనారోగ్యం తో బాధపడుతున్నవారు ఈ స్తోత్రం ను ప్రతిరోజూ పారాయణం చేస్తూ ఆదివారాలందు గోమాతకు గోధుమలను నివేదించాలి. వీలుంటే ఆదివారములందు సూర్యదేవాలయంలో 60 ప్రదక్షిణాలు చేసి 36 సార్లు ఈ స్తోత్రంను పారాయణం చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. యే కోరికను ఆశించకుండా ఈ స్తోత్రంను ప్రతిరోజూ చదివినట్లైతే అన్ని సమస్యలు తొలగి సూర్య సాయుజ్యన్ని పొందుతారు. రధసప్తమి రోజు ఈ స్తోత్రంను పారాయణం చేస్తే సమస్త భోగాలు లభిస్తాయి. .

మహామహితాన్వితమైన ఈ స్తోత్రంను ప్రతిరోజూ సూర్యభగవానునకు అభిముఖంగా నిలబడి ప్రతి రోజు పారాయణం చేస్తే అన్నీ జాడ్యాలు నశిస్తాయి. పూజా మందిరం లో లేదా గృహంలో ఎక్కడైనా కూర్చుని చదువుకోవచ్చు. మంచి ఫలితాలకు ప్రతి రోజు సూర్యోదయ మరియు సూర్యాస్తమయ సమయాలలో పారాయణం చేయాలి.. ఇంతటి మహిమ కలిగిన ఈ స్తోత్రం ఈ క్రింద ఉదహరింపబడింది. అందరూ తప్పనిసరిగా ప్రతిరోజు పారాయణం చేసి సకల రోగ,ఋణ ఆర్ధిక మరియు వృత్తిబాధల నుండి విముక్తిని పొందండి












1 comment:

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list