MohanPublications Print Books Online store clik Here Devullu.com

షట్పదీ స్తోత్రం భావార్ధం_Satpadi stotram






షట్పదీ స్తోత్రం భావార్ధం

షట్పదీ స్తోత్రం లో సాధకుడు విష్ణువును ఏమి కోరుతూ ప్రార్థించాలో సూచించారు. ఈ శ్లోకంలో ఆరు ఆరు చిన్న శ్లోకాలు (ఏడో శ్లోకం ముక్తాయింపు) ఉన్నాయి.
ఆరు కాళ్ళు ఉండే తుమ్మేదను షట్పదీ అంటారు. ఆరుశ్లోకాలున్న ఈ స్తోత్రాన్ని షట్పదీ స్తోత్రం అని అంటారు.

శ్లో 1:   అవినయం అపనయ, విష్ణో దమయ మన:శమయ విషయ మృగ తృష్ణామ్,
         భూత దయం విస్తారయ తారయ సంసార సాగరత: ||
అన్న సాధకుడి ప్రార్థన ఈ స్తోత్రంలో మొట్టమొదటి ‘శ్లోకం’. ‘విష్ణుమూర్తి! అహంకారాన్ని తొలగించు. నా మనసును నియంత్రించు. విషయసుఖాల మృగతృష్ణలు శమింపజేయి. నాలో భూతదయను విస్తరింపజేయి. సంసారసాగరం నుంచి దాటించు’. మోక్షసాధనకుమొదటి శత్రువు అవినయం, అహంకారం. మరో శత్రువు మనో నిగ్రహం లేకపోవటం. ఈ రెండు శత్రువులనూ భగవత్కృప వల్ల జయింపవచ్చు అని ఆచార్యుల మతం.

శ్లో 2 :  రెండో శ్లోకంతో, సాధకుడు శ్రీహరి పాదారవిందాలకు నమస్కరిస్తాడు
          దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే
          శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే ||
భవ భయం వల్ల కలిగిన భేదాన్ని ఛేదించేందుకు, నేను శ్రీహరి పాదారవిందాలకు నమస్కరిస్తున్నాను. అవి ఆకాశగంగా మకరందానికి జన్మస్థానం. దివ్యధుని మకరందాలు. ఆ పాదారవిందాల పరిమళాన్ని అనుభవించటమే సత్-చిత్-ఆనందం.
ఆ తర్వాత సాధకుడు భగవంతుడితో ఇలా అంటాడు; ‘జగన్నాథా, జ్ఞానప్రాప్తి తరవాత మన మధ్య భేదం తొలగి పోతుంది, కానీ అప్పటివరకూ నేను నీ వాడినే గాని నువ్వు నా వాడివి కావు. తరంగం సముద్రంలో భాగం, కానీ సముద్రం తరంగంలో భాగం ఎప్పటికీ కాదు’.

శ్లో 3:  సత్యపిభేదాపగమేనాథతవాహం నమామకీనస్త్వం
          సాముద్రోహి తరంగ: క్వచన సముద్రోనతారంగ:
వేదాంత శ్లోకాలలో కూడా కావ్యశ్లోకాలను మించే శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు ప్రయోగించటం ఆచార్యుల వారికి అలవాటే. ఈ శ్లోకంలో యమకాలూ, ముక్తపద గ్రస్తాలూ చూడండి:

శ్లో 4:  ఉదృతనగ నగభిదనుజ దనుజకులామిత్ర మిత్ర శశిదృష్టే
         దృష్టేభవతిప్రభవతి నభవతికీం భవతిరస్కార:
గోవర్ధన నగాన్ని ఉద్ధరణ చేసినవాడా! నగభిత్తు ఇంద్రుడి సోదరుడా! రాక్షసుల అమిత్రా! సూర్యచంద్రులు కన్నులుగలవాడా! నిన్ను దర్శించగా, సమర్థత కలుగుతుంది. భవ దు:ఖనాశనం జరగకుండా ఉంటుందా?

శ్లో 5:   అయిదో శ్లోకం మత్స్యావతారాన్ని స్మరించి
         మత్స్యదిభిరవతారై రావతారవతావతా సదా వసుధాం
         పరమేశ్వరా! పరిపాల్యో భవతా భవథాపభీతోహమ్
ఆ అవతారంలో భూమిని రక్షించినట్టే, ఇప్పుడు భవభయంలో వణుకుతున్న నన్నూ రక్షించమణి వేడుకొంటాడు.

శ్లో 6:   ఆరో శ్లోకంలో కూర్మావతారాన్ని ప్రస్తావించి
         దామోదర! గుణమంధిర! సుందరవదనారవింద! గోవింద
         భవజలధి మధనమందర! పరమందరం మపనయత్వం మే!
భవజలధి మథనానికి నువ్వే కవ్వంగా నిలిచే మందర పర్వతానివి. అపరిమితమైన నా భయాన్ని – ‘పరమం దరం’ – నువ్వే పోగొట్టాలి అని ప్రార్థిస్తాడు.

శ్లో 7 :  నారాయణ! కరుణామయ!, శరణం కరవాణితావకౌచరణౌ
          ఇతి షట్పదీ మదీయే వాదన సరోజే సదా వసతు!
నారాయణా! కరుణానిధీ! నీ చరనద్వయమే శరణు కోరుతాను! ఈ షట్పది, నా ముఖ కమలంలో సదా వసించుగాక! అంటూ షట్పదీ (స్తోత్రం), ముఖ కమలం పదాల వల్ల సిద్ధించిన మనోహరమైన శ్లేషలో ఈ స్తోత్రం ముగుస్తుంది. అంటే కేవలం జ్ఞానమార్గం అవలబించగోరే వేదాంతికికూడా, ఆమార్గంలో సాధన చేసేందుకు కావాల్సిన శమదమాలకు స్వామికృప తప్పదని ఆచార్యులబోధ.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list