MohanPublications Print Books Online store clik Here Devullu.com

అమరావతి_Amaravathi

అమరావతి Amaravathi buddhist amaravathi amaravati amaravathi mahachaitya amaravathi stupam satavahana dynasty dhanyakataka dharanikota buddhist king ashoka bhakthipustakalu bhaktipustakalu bhakthi pustakalu bhakti pustakalu


అమరావతి



తొలి తెలుగు రాజులైన శాతవాహనుల వైభవానికీ, బౌద్ధ తాత్త్వికుడు నాగార్జునుడి బోధలకూ ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన గుంటూరు జిల్లా ఇప్పుడు నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంగా కొత్త సొగసులు సంతరించుకుంటోంది. ఆధ్యాత్మిక కేంద్రాలకూ, ఆహ్లాదకరమైన సముద్రతీరాలకూ, సందర్శనీయ ప్రదేశాలకూ కొదవలేని ఈ జిల్లా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది.
 
గత వైభవ దీప్తి
అమరావతి...
అమరావతిలో కృష్ణానది ఒడ్డున భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయం మూడు ప్రాకారాలతో, పలు
 దేవతలు కొలువై ఉన్న ఉపాలయాలతో అలరారుతోంది. పంచారామ క్షేత్రాల్లో ఇది ఒకటి.
 
అలాగే అమరావతి బౌద్ధుల ఆరాధ్య క్షేత్రం కూడా. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో బౌద్ధమత వ్యాప్తికి కంకణం కట్టుకున్న మౌర్య అశోకుడు బుద్ధుని ధాతువులతో మహాచైత్యాలు నిర్మించేందుకు మహాదేవభిక్షును శ్రీలంక పంపాడు. మార్గమధ్యంలో కృష్ణానది ఒడ్డున బుద్ధుని ధాతువులతో మహాదేవుడు మహాచైత్యం నిర్మించాడు. కల్నల్‌ మెకంజీ తవ్వకాలలో మహాచైత్యంలోని అపురూప శిల్పసంపద వెలుగుచూసింది. వాటిలో ప్రధానమైన శిల్పాలను ఇతర దేశాలకు, చెన్నై మ్యూజియానికి తరలించారు. మిగిలిన శిలాఫలకాలను స్థానికంగా కేంద్ర పురావస్తు శాఖ ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేసి భద్ర పరిచింది.

ఎలా వెళ్ళాలి?: అమరావతికి చేరుకోవడానికి విజయవాడ, గుంటూరు, మంగళగిరి, సత్తెనపల్లి, క్రోసూరు పట్టణాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. రైలు మార్గం ద్వారా విజయవాడ, గుంటూరు చేరుకుని అమరావతికి ప్రత్యేక వాహనాలలో వెళ్ళవచ్చు. ఈ పట్టణాల నుంచి 35-40 కి.మీ దూరంలో అమరావతి ఉంది.

వసతి: పర్యాటకశాఖ వసతిగృహాలు, రెవెన్యూ, పంచాయితీరాజ్‌, ప్రయివేటు వసతి గృహాలు అందుబాటులో ఉన్నాయి.
 
బౌద్ధమత వృక్షమ్ము పల్లవించిన చోట...
ఆచార్య నాగార్జున కొండతెలుగు నేల మీద బౌద్ధం వర్థిల్లిన ప్రదేశాల్లో ప్రముఖమైనది నాగార్జున కొండ. సుప్రసిద్ధ బౌద్ధ గురువు ఆచార్య నాగార్జునుడు ఇక్కడ నివసించాడు. ఈ ప్రాంతంలో జరిగిన తవ్వకాల్లో అలనాటి బౌద్ధ వైభవాన్ని వెల్లడించే ఆనవాళ్లు బయటపడ్డాయి. వీటిలో శాసనమండపం, స్నానఘట్టం, బౌద్ధారామం, మహాస్థూపం, సింహళ విహార్‌, అశ్వమేథ యాగస్థలం, స్వస్తికాంకిత స్థూపం లాంటి వాటిని పునఃప్రతిష్ఠించారు. 144 ఎకరాల వైశాల్యం కలిగిన ఈ నాగార్జున కొండ పర్యాటకులు తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశాల్లో ఒకటి.
 
దేశంలోనే ఏకైక ఐల్యాండ్‌ మ్యూజియం
నాగార్జునకొండ ప్రాంతంలో ఏర్పాటైన మ్యూజియం అతి పెద్ద ఐల్యాండ్‌ మ్యూజియంగా, ప్రపంచంలోనే అత్యంత అరుదైనదిగా ఖ్యాతి పొందింది. ఇక్కడ తవ్వకాల్లో తొలి శిలాయుగం నుంచి బృహత్పలాయనయుగం వరకూ మానవ నాగరికత పరిణామ దశల పనిముట్లు దొరికాయి. క్రీ.శ. మూడు, నాలుగు శతాబ్దాలకు చెందిన శిల్ప ఫలకాలు, శాసనాలు బయటపడ్డాయి. వీటన్నింటిని ఈ నాగార్జున కొండపై ఏర్పాటు చేసిన మ్యూజియంలో భద్రపరిచారు.
 
ప్రయాణమూ ఆహ్లాదమే
నాగార్జున సాగర్‌ చేరుకున్నాక నాగార్జున కొండకు వెళ్లాలంటే లాంచీల ద్వారానే ప్రయాణం సాధ్యం. లాంచీ స్టేషన్‌ నుంచి 14 కి.మీ. మేర సుమారు ముప్పావు గంటపాటు సాగే ఈ ప్రయాణం అత్యంత ఆహ్లాదంగా ఉంటుంది. వెండి జలపాతంలో ఎగిరెగిరిపడే చేపలు, సుదూరంగా కనిపించే పచ్చని కొండలు, ప్రతిక్షణం పలుకరించే చల్లని గాలులు.. ఇలా ఎంతో మధురంగా ప్రయాణం సాగుతుంది. లాంచీలో ప్రయాణించేందుకు పెద్దలకు రూ. 120, పిల్లలకు రూ. 100 టికెట్లను లాంచీ స్టేషన్లో విక్రయిస్తారు.

ఎలా వెళ్ళాలి?: విజయవాడ, గుంటూరుల నుంచి మాచర్లకు చేరుకున్నాక నాగార్జున సాగర్‌ వెళ్లాలి. మాచర్ల నుంచి సాగర్‌కు 25 కి.మీ దూరం ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి హైదరాబాద్‌-మాచర్ల బస్సు ఎక్కి నాగార్జున సాగర్‌లో దిగాలి. హైదరాబాద్‌ సీబీఎస్‌ నుంచి సాగర్‌కు 150 కి.మీ. దూరం ఉంటుంది. రైల్లో రావాలంటే నడికుడి జంక్షన్‌కు వచ్చి అక్కడి నుంచి మాచర్ల మీదగా సాగర్‌ వెళ్లాలి.

వసతులు: ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నడిచే మోటెల్‌ హోటల్‌, ఒక క్రైస్తవ సంస్థ నిర్మించిన హోటల్‌ మాతా సరోవర్‌లలో విడిది చేయొచ్చు. తెలంగాణ రాష్ట్రం వైపు నాగార్జున రిసార్ట్స్‌, విజయవిహార్‌లు ప్రముఖ హోటళ్లుగా చెప్పుకోవచ్చు.
 ఆలయాలకు ప్రసిద్ధి. కీ.శ. 420-620 మధ్య ఈ ప్రాంతాన్ని పాలించిన విష్ణుకుండిన రాజులు ఈ కొండలను తొలిపించి, గుహలుగా మలిచారు.
 
ఉండవల్లి గుహలు
గుంటూరు సమీపంలో ప్రకాశం బ్యారేజీ వద్ద ఉన్న ఉండవల్లి గ్రామం గుహలకు,వీటిలో నాలుగు అంతస్తుల గుహ- ఆలయం ముఖ్యంగా చూసి తీరాలసిన ప్రదేశం. బౌద్ధ సన్యాసులు దీన్ని తమ విశ్రాంతి గృహంగా ఉపయోగించుకునేవారట. ఇక్కడ శయన భంగిమలో ఉన్న బుద్ధుని విగ్రహం అత్యద్భుతం. అజంతా ఎల్లోరా శిల్పాలను తలదన్నే కళా నైపుణ్యం ఉండవల్లి గుహల్లో నిక్షిప్తమై ఉంది.

ఎలా వెళ్ళాలి?: గుంటూరుకు 35 కి.మీ., విజయవాడకు పదమూడు కి.మీ. దూరంలో ఉండవల్లి గుహలు ఉన్నాయి. రోడ్డు మార్గంలో సులువుగా చేరుకోవచ్చు.

బుద్ధుడు నడయాడిన నేల
గౌతమ బుద్ధుని ధాతువులపై నిర్మితమై దక్షిణ భారత దేశంలోనే తొలి బౌద్ధ క్షేత్రంగా
భట్టిప్రోలు విరాజిల్లింది. బుద్ధుడు నడయాడిన ప్రాంతంగా ఘన చరిత్రను సంతరించుకుంది. ఈ గ్రామాన్ని కేంద్రంగా చేసుకుని గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని విస్తరింపజేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అత్యంత విశిష్టత కలిగిన బౌద్ధ స్థూపం ఇక్కడ ఉంది. దీని ఆవరణలో నెలకొల్పిన సింహగోష్టి విద్యాలయంలో 14 దేశాలకు చెందిన వారు బుద్ధుని బోధనలు అభ్యసించినట్లు చరిత్ర చెబుతోంది. తెలుగు లిపికి మూల స్థానం భట్టిప్రోలేననే ఆధారాలు ఉన్నాయి. మౌర్యలిపిలోని 23 అక్షరాలను ఇక్కడి స్థూపం వద్ద కనుగొన్నారు. భట్టిప్రోలులోని మహాస్థూపం భారతదేశలో గల అతి ప్రాచీన స్థూపాలలో ఒకటి. భట్టిప్రోలులో 40 అడుగుల ధ్యానబుద్ధ విగ్రహాన్ని ఏర్పాటు చేసి, మ్యూజియం, లైబ్రరీ, వసతి సౌకర్యాలు కల్పించేందుకు పర్యాటక శాఖ ప్రణాళికలు రూపొందించింది.
 
ఎలా వెళ్ళాలి?: తెనాలికి సుమారు 28 కి.మీ. దూరంలో భట్టిప్రోలు ఉంది. భట్టిప్రోలు రైల్వేస్టేషన్‌లో కొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళకు హాల్టింగ్‌ ఉంది.అలనాటి వైభవం
కొండవీటి కోటను క్రీ.శ 10వ శతాబ్దంలో రెడ్డి రాజులు నిర్మించారు. కొండవీడును రాజధానిగా చేసుకొని ఈ ప్రాంతాన్ని పాలించారు. నేడు ఈ కోట
శిథిలాల్లో 21 స్థూపాలు
కనిపిస్తాయి. రెడ్డిరాజుల పాలనలోని కత్తుల బావికి ఎంతో చరిత్ర ఉంది. దీంతో పాటు శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం, ఆలయం లోపల, బయట గోడల మీద అపరూప శిల్ప సంపదలు చూపరులను కట్టిపడేస్తాయి. కొండమీద చారిత్రక ఆనవాళ్లుగా నిలిచిన అనేక కట్టడాలు, 44 కోట బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, అయిదు దేవాలయాలు, గుర్రపుశాలలు, ఆయుధశాల, నేటికొట్టు, మసీదు, ఖజానా వంటి చారిత్రక సంపద ఇక్కడ ప్రత్యేకం.
ఎలా వెళ్ళాలి?: గుంటూరు -చిలకలూరిపేట, నరసరావుపేట-ఫిరంగిపురం మధ్యలో, గుంటూరుకు 25 కిలోమీటర్ల దూరంలో కొండవీడు కోట ఉంది. బస్సులు, ప్రైవేటు వాహనాల్లో అక్కడికి చేరుకోవచ్చు.
 
ఎన్నెన్నో అందాలు...
ప్రకృతి సౌందర్యానికి పేరు పొందిన గుంటూరు జిల్లాలో పర్యాటకులను ఆకట్టుకొనే విశిష్టమైన ప్రదేశాలెన్నో ఉన్నాయి.

ఆంధ్రా గోవా... సూర్యలంకఉప్పొంగే అలలూ, సువిశాలమైన ఇసుకతిన్నెలు, తెరచాప పడవలు, వర్ణరంజితమైన సూర్యోదయాలు... ఇలా ఎన్నో ప్రకృతి దృశ్యాలకు నెలవు గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని సూర్యలంక తీరం. ఆంధ్రా గోవాగా ఖ్యాతిగాంచిన ఈ తీర ప్రాంతం అర్థ చంద్రాకారంలో ఉండటంతో ప్రమాదాలు తక్కువ. పర్యాటకులకు కను విందు చేసే విశేషాల సమాహారం ఇది.
 
ఎలా వెళ్ళాలి?: హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, తెనాలి, అటు ఒంగోలు, చీరాల పరిసరప్రాంతాల నుంచి పర్యాటకులు రైలు ద్వారా బాపట్ల రైల్వేస్టేషన్‌లో దిగి ఆటోలు, బస్సుల ద్వారా సూర్యలంక చేరుకోవచ్చు. ఇది బాపట్ల నుంచి తీరం సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వసతి: ఏపీ టూరిజం ఆధ్వర్యంలో హరితా బీచ్‌ రిసార్ట్చ్‌ ఉంది. ఏపీ టూరిజం వెబ్‌సైట్‌లో ముందుగా బుక్‌ చేసుకోవాలి.
 
అనుపు సొగసులు.. ఎత్తిపోతల సవ్వళ్లు...
కృష్ణమ్మను ఆనుకొని ఉన్న అనుపు ప్రాంతంలో కాలుపెడితే ఆ వాతావరణానికీ, చల్లటి గాలులకు మైమరచి పోవాల్సిందే. క్రీ.శ 4వ శతాబ్దం కంటే ముందు నాటి వైభవాన్ని గుర్తుచేసే పునర్నిర్మిత కట్టడాలు ఇక్కడ ఉన్నాయి. యాంపి థియేటర్‌, మహాస్థూపం, హరతి దేవాలయం, అశ్వమేథ యజ్ఞశాల, శ్రీచైత్యం వీటిలో ప్రధానమైనవి. ఆచార్య నాగార్జునుడి కాలం నాటి నాగార్జున విశ్వ విద్యాలయం, ఉపన్యాసశాల నమూనాలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక, కొండ కోనల నుంచి వడివడిగా ఉరుకుతూ 70 అడుగుల ఎత్తునుంచిదూకే జలధారను చూడాలంటే ఎత్తిపోతల ప్రాంతానికి వెళ్ళాల్సిందే.

ఎలా వెళ్ళాలి?: అనుపు, ఎత్తిపోతల ప్రాంతాలను సందర్శిచాలంటే గుంటూరు నుంచి 130 కి.మీ. దూరంలో ఉన్న మాచర్ల మీదుగా వెళ్ళాలి. నేరుగా ఎత్తిపోతల, అనుపు వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేదు. ప్రత్యేక వాహనాలు, ఆటోల్లో వెళ్లాల్సి ఉంటుంది.
వసతి: టూరిజం శాఖ ఒక గెస్ట్‌హౌస్‌ను ఏర్పాటు చేసింది. ఏపీ టూరిజం వెబ్‌సైట్లోకి వెళ్లి గదులను బుక్‌ చేసుకోవచ్చు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నడిచే రెస్టారెంట్‌లో అల్పాహారం, భోజనం దొరుకుతాయి.

ఉప్పలపాడు పక్షుల కేంద్రం
ఉప్పలపాడు పక్షుల కేంద్రం ప్రాంతానికి సుమారు 40 జాతుల పక్షులు సైబీరియా నుంచి ప్రతియేటా సెప్టెంబర్‌లో వలస వస్తుంటాయి.

ఎలా వెళ్ళాలి?: గుంటూరుకు సుమారు 9 కిలోమీటర్ల దూరంలో ఉప్పలపాడు పక్షుల కేంద్రం ఉంది. రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు.

ఇవేకాదు కోటప్పకొండ, మంగళగిరి తదితర శైవ, వైష్ణవ క్షేత్రాలు, బౌద్ధారామాలు, అరుదైన చతుర్ముఖ బ్రహ్మ ఆలయం లాంటి ఎన్నో ఆధ్యాత్మిక కేంద్రాలు గుంటూరు జిల్లాలో కొలువు తీరాయి.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list