MohanPublications Print Books Online store clik Here Devullu.com

ఇంగువ‌ను ఆహారంలో వాడితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?_Inguva Benefits

ఇంగువ‌ను ఆహారంలో వాడితే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..? Inguva Benefits Inguva Hing Hengu Heeng Asafoetida Inguva Plant bhakthi pustakalu bhakti pustakalu bhakthipustakalu bhaktipustakalu


ఇంగువ‌ను ఆహారంలో వాడితే
 ఎలాంటి లాభాలు క‌లుగుతాయో తెలుసా..?



      ఇంగువ‌ను చాలా మంది ప‌లు వంట‌కాల్లో రుచి కోసం వేస్తుంటారు. అయితే నిజానికి ఇది ఓ మొక్క నుంచి వ‌స్తుంది. ఫెరూలా అని పిల‌వ‌బ‌డే ఓ ర‌క‌మైన వృక్ష‌జాతికి చెందిన పాల‌ను ఉప‌యోగించి ఇంగువ‌ను త‌యారు చేస్తారు. ఈ క్ర‌మంలో వంటల్లో ఇంగువ వేయ‌డం వ‌ల్ల రుచి మాత్ర‌మే కాదు, దాంతో ఇంకా అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా మ‌న‌కు క‌లుగుతాయి. ఇంగువ వ‌ల్ల మ‌న‌కు క‌లిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఇంగువ వేసిన ఆహారం తింటే గ్యాస్ స‌మ‌స్య ఉండ‌దు. తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. అజీర్ణ స‌మ‌స్య బాధించ‌దు. మ‌ల‌బ‌ద్ద‌కం, అసిడిటీ ఉండ‌దు. ఇతర జీర్ణ స‌మ‌స్య‌లున్నా పోతాయి.

2. ప‌లు ర‌కాల అల్స‌ర్ల‌ను న‌యం చేసే శ‌క్తి ఇంగువ‌కు ఉంద‌ని ప‌లు ప‌రిశోధ‌న‌లు తేల్చి చెప్పాయి. అంతేకాదు, ఆక‌లి లేకున్నా దీంతో చేసిన ప‌దార్థాల‌ను తింటే బాగా ఆక‌లి పుడుతుంది.

3. యునానీ వైద్యంలో ఇంగువ‌ను ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు ఔష‌ధంగా కూడా వాడుతున్నారు. ఫిట్స్, ఇత‌ర మాన‌సిక స‌మ‌స్య‌ల‌కు ఇంగువ చ‌క్క‌ని ఔష‌ధంగా ప‌నిచేస్తుంది.

4. మ‌హిళ‌ల్లో రుతు క్ర‌మంలో వ‌చ్చే స‌మ‌స్య‌లు స‌హజం. అయితే వాటితోపాటు రుతు క్ర‌మం స‌రిగ్గా లేని మ‌హిళ‌లు కూడా ఇంగువ‌తో చేసిన ఆహారం తింటే దాంతో వారిలో రుతుక్ర‌మం మెరుగ‌వుతుంది. ఇది సంతాన సాఫ‌ల్య‌త అవ‌కాశాల‌ను పెంచుతుంది.

5. ఆస్త‌మా, బ్రాంకైటిస్, ద‌గ్గు వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి. తీవ్ర‌మైన ప‌డిశెం (ఇన్‌ఫ్లుయెంజా) వ‌చ్చినా ఇంగువ‌తో చేసిన ఆహారం తింటే వెంట‌నే ఆ స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

6. ఇంగువ వేసిన ఆహారం తింటే ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి. ఇది డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది. ఇన్సులిన్ లాగా ప‌నిచేయ‌డం వ‌ల్ల షుగ‌ర్ అదుపులో ఉంటుంది.

7. ర‌క్త నాళాల్లో కొవ్వు గ‌డ్డ‌క‌ట్ట‌కుండా చూస్తుంది. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రా పెరిగి గుండె స‌మ‌స్య‌లు రావు.

8. త‌ల‌నొప్పి, ఒళ్లు నొప్పులు తగ్గిపోతాయి. ఆయా నొప్పులను త‌గ్గించే గుణం ఇంగువ‌కు ఉంది.

9. ఇంగువ‌ను వంట‌ల్లోనే కాక డైరెక్ట్‌గా కూడా తీసుకోవ‌చ్చు. దీంతో పైన‌ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అయితే దాన్ని గోరు వెచ్చ‌ని నీటితోనో లేదా మ‌జ్జిగ‌తోనో తీసుకోవాల్సి ఉంటుంది


.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list