MohanPublications Print Books Online store clik Here Devullu.com

అనుబంధాన్ని మళ్లీ ట్యూన్‌ చేసుకుందాం!!

ఈ పాటలకు ట్యూన్‌ కట్టుకుందాం! అనుబంధాన్ని మళ్లీ ట్యూన్‌ చేసుకుందాం!! థాలు Yoga Books,Yoga Sarvasvam Publications in Rajahmundry, Books Publisher in Rajahmundry, Popular Publisher in Rajahmundry, BhaktiPustakalu, Makarandam, Bhakthi Pustakalu, JYOTHISA,VASTU,MANTRA, TANTRA,YANTRA,RASIPALITALU, BHAKTI,LEELA,BHAKTHI SONGS, BHAKTHI,LAGNA,PURANA,NOMULU, VRATHAMULU,POOJALU, KALABHAIRAVAGURU, SAHASRANAMAMULU,KAVACHAMULU, ASHTORAPUJA,KALASAPUJALU, KUJA DOSHA,DASAMAHAVIDYA, SADHANALU,MOHAN PUBLICATIONS, RAJAHMUNDRY BOOK STORE, BOOKS,DEVOTIONAL BOOKS, KALABHAIRAVA GURU,KALABHAIRAVA, RAJAMAHENDRAVARAM,GODAVARI,GOWTHAMI, FORTGATE,KOTAGUMMAM,GODAVARI RAILWAY STATION, PRINT BOOKS,E BOOKS,PDF BOOKS, FREE PDF BOOKS,BHAKTHI MANDARAM,GRANTHANIDHI, GRANDANIDI,GRANDHANIDHI, BHAKTHI PUSTHAKALU, BHAKTI PUSTHAKALU, BHAKTHI mohanpublications granthanidhi

ఈ పాటలకు ట్యూన్‌ కట్టుకుందాం!
అనుబంధాన్ని మళ్లీ ట్యూన్‌ చేసుకుందాం!!

       పుట్టుకతోనే ఒక బంధాన్ని మోసుకొని వచ్చేస్తాడు మనిషి. అదెప్పుడూ బరువనిపించని బంధం. చెప్పాలంటే ఆ బంధం మనిషిని మరింత తేలికపరుస్తుంది. కాబట్టే జీవితంలోని ప్రతిదశలో తనను తేలికపరిచే బంధాలను మోస్తూనే ఉంటాడు. ఆ బంధాలకు పేర్లేవైనా, ఆ బంధంతో మాట్లాడటానికి మాటలు కనిపెట్టుకున్నాడు. ఇష్టాల్ని మరింత ఇష్టంగా చెప్పేందుకు పాటలు కట్టుకున్నాడు. తెలుగు సినిమా పుట్టి 90 ఏళ్లు కావొస్తోంది. ఈ తొంభై ఏళ్లలో వేలల్లో పాటలు ఈ బంధాలను చుట్టుకొని పుట్టాయి. మనచుట్టూ, మన ఇంట్లో రోజూ కనిపించే రకరకాల పేర్లతో ఉన్న ఆ బంధాలను తలచుకుంటూ, ఈ పాటలకు ట్యూన్‌ కట్టుకుందాం! అనుబంధాలను అలా ట్యూన్‌ చేసుకుందాం!! 

అమ్మ. తెలుగులో ‘అమ్మ’ పేరుతో వచ్చినన్ని పాటలు మరింకే బంధం పేరుతోనూ వచ్చి ఉండవు. అలాంటి అమ్మ పాటలు కొన్ని.. 
అమ్మ అన్నది ఒక కమ్మని మాట
చిత్రం: బుల్లెమ్మ బుల్లోడు
సంగీతం: సత్యం
రచన: దాశరథి
గానం: బాలు, బెంగళూరు లత
అమ్మ అన్నది ఒక కమ్మని మాట / అది ఎన్నెన్నో తెలియని మమతల మూట / అమ్మ అన్నది ఒక కమ్మని మాట / అది ఎన్నెన్నో తెలియని మమతల మూటా.. మమతల మూటా / దేవుడే లేడని మనిషున్నాడు / అమ్మే లేదనువాడు అసలే లేడు (2) తల్లి ప్రేమ నోచుకున్న కొడుకే కొడుకు(2) / ఆ తల్లి సేవ చేసుకునే బ్రతుకే బ్రతుకు /అమ్మ అన్నది ఒక కమ్మని మాటఅది ఎన్నెన్నో తెలియని మమతల మూటా / మమతల మూట..అమ్మంటే అంతులేని సొమ్మురా / అది ఏనాటికీ తరగని భాగ్యమ్మురా / అమ్మ మనసు అమృతమే చిందురా (2) / అమ్మ ఒడిలోన స్వర్గమే ఉందిరా ఉందిరా / అమ్మ అన్నది ఒక కమ్మని మాట / అది ఎన్నెన్నో తెలియని మమతల మూటా.. మమతల మూటఅంగడిలో దొరకనిది అమ్మ ఒక్కటే/అందరికీ ఇలవేలుపు అమ్మ ఒక్కటే(2) / అమ్మ ఉన్న ఇంటిలో లేనిది ఏది(2) / అమ్మ అనురాగం ఇక నుంచి నీది నాది / అమ్మ అన్నది ఒక కమ్మని మాట / అది ఎన్నెన్నో తెలియని మమతల మూటా... మమతల మూట

కనిపెంచినా మా అమ్మకే..
చిత్రం: మనం
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌
గానం: భరత్‌
రచన: చంద్రబోస్‌
కనిపెంచినా మా అమ్మకే, అమ్మయ్యానుగా/నడిపించినా మా నాన్నకే, నాన్నయ్యానుగాఒకరిది కన్ను, ఒకరిది చూపు, ఇరువురి కలయిక కంటి చూపు/ ఒకరిది మాటా, ఒకరిది భావం, ఇరువురి కలయిక కదిపిన కథ ఇది ప్రేమా ప్రేమా.. తిరిగొచ్చె తీయగా.../ఇది ప్రేమా ప్రేమా.. ఎదురొచ్చె హాయిగా.../ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా ఆఆఆ... హా.. అ../ అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకి గురువును అవుతున్నా / అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం అవుతున్నా / కన్నోళ్లతో నేను చిన్నోడిలా, కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమా ప్రేమా.. తిరిగొచ్చె తీయగా.../ఇది ప్రేమా ప్రేమా.. ఎదురొచ్చె హాయిగా.../ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా ఆఆఆ... కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా / కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా.. /జోలలు నాకే పాడారుగ, ఆ జాలిని మరచి పోలేనుగ / మీరూపిన ఆ ఊయల నా హృదయపు లయలలో పదిలము కద ఇది ప్రేమా ప్రేమా.. తిరిగొచ్చె తీయగా... / ఇది ప్రేమా ప్రేమా.. / ఎదురొచ్చె హాయిగా... / ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా ఆఆఆ..


అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా
చిత్రం: రఘువరన్‌ బీటెక్‌
సంగీతం: అనిరు«ద్‌ రవిచందర్‌
రచన: రామజోగయ్య శాస్త్రి
గానం: యస్‌. జానకి, దీపు
అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా నువ్వే లేక వసివాడానమ్మా / మాటే లేకుండా నువ్వే మాయం / కన్నీరవుతోంది ఎదలో గాయం / అయ్యో వెళ్లిపోయావే / నన్నొదిలేసి ఎటు పోయావే / అమ్మా ఇకపై నే వినగలనా నీ లాలిపాట / నే పాడే జోలకు నువు కన్నెత్తి చూశావో అంతే చాలంట / అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా / నువ్వే లేక వసివాడానమ్మా..చెరిగింది దీపం.. కరిగింది రూపం.. అమ్మా నాపై ఏమంత కోపం.. / కొండంత శోకం.. నేనున్న లోకం.. నన్నే చూస్తూ నవ్వింది శూన్యం.. / నాకే ఎందుకు శాపం.. జన్మల గతమే చేసిన పాపం / పగలే దిగులైన నడిరేయి ముసిరింది.. / కలవరపెడుతోంది పెను చీకటి / ఊపిరి నన్నొదిలి నీలా వెళ్లిపోయింది.. / బ్రతికి సుఖమేమిటి / ఓ అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా.. నువ్వే లేక వసివాడానమ్మా..విడలేక నిన్ను.. విడిపోయి వున్నా.. కలిసే లేనా నీ శ్వాసలోన / మరణాన్ని మరచి.. జీవించి వున్నా.. ఏ చోట వున్నా నీ ధ్యాసలోన / నిజమై నే లేకున్నా.. కన్నా నిన్నే కలగంటున్నా / కాలం కలకాలం ఒకలాగే నడిచేనా.. కలతను రానీకు కన్నంచున / కసిరే శిశిరాన్ని వెలి వేసి త్వరలోన.. చిగురై నిను చేరనా అమ్మా అమ్మా నే పసివాణ్ణమ్మా.. నువ్వే లేక వసివాడానమ్మా.. / అడుగై నీతోనే నడిచొస్తున్నా.. / అద్దంలో నువ్వై కనిపిస్తున్నా.. / అయ్యో వెళిపోయావే.. నీలో ప్రాణం నా చిరునవ్వే / అమ్మా ఇకపై నే వినగలనా నీ లాలిపాట / వెన్నంటి చిరుగాలై జన్మంతా జోలాలి వినిపిస్తూ ఉంటా

నీవే నీవే నీవే నేనంటా...
చిత్రం: అమ్మా నాన్న 
ఓ తమిళమ్మాయి
సంగీతం, గానం: చక్రి
రచన: పెద్దాడ మూర్తి
నీవే నీవే నీవే నేనంటా / నీవే లేక నేనే లేనంటా / వరమల్లే అందిందేమో ఈ బంధం / వెలలేని సంతోషాలే నీ సొంతం / నీవే నీవే నీవే నేనంటా / నీవేలేక నేనే లేనంటా నా కలలని కన్నది నీవే / నా మెలకువ వేకువ నీవే / ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా / నా కష్టం ఇష్టం నీవే /చిరునవ్వు దిగులు నీవే / ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా / కనిపించకపోతే బెంగై వెతికావే / కన్నీరే వస్తే కొంగై తుడిచావే / నీవే నీవే నీవే నేనంటా / నీవేలేక నేనే లేనంటా నే గెలిచిన విజయం నీదే / నే ఓడిన క్షణం ఓదార్పే / నా అలసట తీరే దారే నీవేగా / అడుగడుగున నడిపిన దీపమ / ఇరువురికే తెలిసిన స్నేహమ / మది మురిసే ఆనందాలే నీవేగా / జన్మిస్తే మళ్లీ నీవై పుడతాలే / ధన్యోస్మి అంటూ దణ్ణం పెడతాలే / నీవే నీవే నీవే నేనంటా / నీవే లేక నేనే లేనంటా / వరమల్లే అందిందేమో ఈ బంధం / వెలలేని సంతోషాలే నీ సొంతం

పెదవే పలికిన మాటల్లోనే
చిత్రం: నాని
రచన: చంద్రబోస్‌
గానం: ఉన్నికృష్ణన్, సాధన సర్గమ్‌
సంగీతం: ఏ.ఆర్‌.రెహమాన్‌
పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ.. / కదిలే దేవత అమ్మా / కంటికి వెలుగమ్మా / తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా / తన లాలిపాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ (2)
మనలోని ప్రాణం అమ్మ / మనదైన లోకం అమ్మ / ఎనలేని జాలి గుణమే అమ్మ / నడిపించే దీపం అమ్మ / కరుణించే కోపం అమ్మ / వరమిచ్చే తీపి శాపం అమ్మ / నా ఆలి అమ్మగా అవుతుండగా / జోలాలి పాడనా కమ్మగా...కమ్మగాపొత్తిళ్లలో ఎదిగే బాబు / నా ఒళ్లో ఒదిగే బాబు / ఇరువురికి నేను అమ్మవనా / నా కొంగు పట్టేవాడు / నా కడుపున పుట్టేవాడు / ఇద్దరికీ ప్రేమ అందించనా / నా చిన్ని నాన్ననీ వాడి నాన్నని / నూరేళ్లు సాకనా / చల్లగా చల్లగా ఎదిగీ ఎదగని ఓ పసికూనా ముద్దుల కన్నా జో...జో / బంగరు తండ్రీ జోజో / బజ్జో లాలీ జో / పలికే పదమే వినకా / కనులారా నిదురపో / కలలోకి నేను చేరి / తదుపరి పంచుతాను ప్రేమ మాధురి

నాన్న అంటే మనకెంత భయమో, అంతే ఇష్టం కూడా! అలాంటి నాన్నను ఇష్టంగా పిలుచుకుంటూ పాడుకునే కొన్ని పాటలు.. 
నాన్నకు ప్రేమతో.. 
చిత్రం: నాన్నకు ప్రేమతో 
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌ 
గానం: దేవిశ్రీ ప్రసాద్, సాగర్‌ 
రచన: దేవిశ్రీ ప్రసాద్‌ 
ఏ కష్టమెదురొచ్చినా.. కన్నీళ్లు ఎదిరించినా.. / ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన / నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. / నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతిక్షణం.. నేనేదారిలో వెళ్లినా / ఏ అడ్డు నన్నాపినా / నీవెంట నేనున్నానని నను నడిపించిన / నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. / నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతిక్షణం..\ ఏ తప్పు నే చేసినా / తప్పటడుగులే వేసినా / ఓ చిన్ని చిరునవ్వుతోనే.. నను మన్నించిన.. / నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. / నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం.. ఏ ఊసునే చెప్పినా.. ఏ పాటనే పాడినా.. / భలే ఉంది మళ్లీ పాడరా అని మురిసిపోయిన.. / నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. / నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతిక్షణం.. ఈ అందమైన.. రంగుల లోకాన.. / ఒకే జన్మలో వంద జన్మలకు ప్రేమనందించిన.. / నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. / నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం.. / ఈ పాటతో.. ఈ పాటతో.. / నాన్నకు ప్రేమతో వందనం / ఈ పాటతో.. ఈ పాటతో.. ఈ పాటతో.. 

పచ్చని చెట్టు ఒకటి.. 
చిత్రం: రాము
సంగీతం: ఆర్‌. గోవర్ధనమ్‌
గానం: పి. సుశీల, ఘంటసాల (హ్యాపీ వెర్షన్‌)
రచన: ఆరుద్ర 
పచ్చని చెట్టూ ఒకటి... / వెచ్చని చిలకలు రెండూ.. / పాటలు పాడి జో కొట్టాలి జో జో / చల్లని తలపుల తల్లీ.. / చక్కని నవ్వుల తండ్రీ.. / కమ్మని నోముల పంట నేనే సుమా.. / ఇద్దరి బుగ్గల మీద.. ముద్దుల మూటలు కడితే.. / ఇంపుగ నిదుర పోవాలీ జో జో జో.. పచ్చని చెట్టూ ఒకటి.. / వెచ్చని చిలకలు రెండూ.. / పాటలు పాడీ జో కొట్టాలి జో జో జో.. చిట్టీ చిలకా పలకా / చిలకా తల్లీ కులకా / చిలకా రాజు చెట్ల చాటున వెతకాలి / చల్లగ మురిసే వేళ / చాటుగ మసలే వేళ / ఎల్లరు కళకళæలాడాలి జో జో జో.. 

హ్యాపీ హ్యాపీ బర్త్‌డే..
చిత్రం: సుస్వాగతం
సంగీతం: ఎస్‌.ఎ.రాజ్‌కుమార్‌ 
గానం: నాగూర్‌బాబు, మణికిరణ్, జయచంద్రన్‌
రచన: సామవేదం షణ్ముఖశర్మ
హ్యాపీ హ్యాపీ బర్త్‌డే.. / మళ్లీ మళ్లీ చేసుకోగ శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా / ఆపలేని స్వేచ్ఛ ఉంది.. అందినంత చాన్స్‌ ఉంది.. / అందుకోరా పుత్ర రత్నమా.. నేస్తమా.. జీవితానికే అర్థం ప్రేమని మరచిపోదు మా యవ్వనమే../ ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతున్నదే మా అనుభవమే.. / చిలిపి వయసు వరుస తమకు తెలియదా.. హ్యాపీ హ్యాపీ.. / హ్యాపీ హ్యాపీ బర్త్‌డే../ మళ్లీ మళ్లీ చేసుకోగ శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా.. తెలియకడుగుతున్నాలే.. కంప్యూటరేమంటోంది / పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైందీ / బోధపడని కంప్యూటర్‌.. బదులన్నదే లేదందీ / విసుగురాని నా మనసే.. ఎదురే చూస్తోందీ.. ప్రేమకథలు ఎప్పుడైనా ఒకటే బ్రాండ్‌ / ఆచితూచి ముందుకెళ్లు ఓ మై ఫ్రెండ్‌ / అప్‌టుడేట్‌ ట్రెండు మాది టోటల్‌ ఛేంజ్‌ / పాత నీతులింక మాకు నో ఎక్స్‌ఛేంజ్‌.. ఫ్రెండులాంటి పెద్దవాడి అనుభవాల సారమే / శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే / కలను వదిలి ఇలను తెలిసి నడుచుకో / హ్యాపీ హ్యాపీ.. హ్యాపీ హ్యాపీ బర్త్‌డే.. మళ్లీ మళ్లీ చేసుకోగ శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా.. మ్యూజిక్కా మ్యాజిక్కా మజా కాదు చాలెంజి / బాపూజీ బాపూజీ బడే గులాం ఆలీజీ / నింగిలోని చుక్కలనే.. చిటికేసి రమ్మనలేమా / తలచుకుంటే ఏదైనా ఎదురే లేదనమా / నేల విడిచి సామైతే.. టైమ్‌ వేస్టురా ఈ ధీమా / ముందు వెనక గమనిస్తే.. విజయం నీది సుమా రోజా నవ్వు రమ్మంటున్న రోజు కదా / తాకకుండా ఊరుకుంటే తప్పు కదా / నవ్వు కింద పొంచి ఉన్న ముల్లు కదా / చూడకుండ చెయ్యివేస్తే ముప్పు కదా / ముల్లు చూసి ఆగిపోతే పువ్వులింక దక్కునా / లక్ష్యమందకుండ లైఫుకి అర్థమంటు ఉండునా / తెగువ తెలుపు గెలుపు మనకు దొరకగ.. 

ఆటల పాటల
చిత్రం: ఆకాశమంత
సంగీతం: విద్యాసాగర్‌
గానం: మధు బాలకృష్ణన్‌
రచన: అనంత శ్రీరామ్‌
ఆటలపాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా / ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మ రా అమ్మ రా / మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా / వెన్నెలే తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా / ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా / ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మ రా అమ్మ రా అడుగులే పడుతుంటే, ఎదనిలా తడుతుంటే / మధురమౌ భావాలేవో ఊగే లోలోన / పలుకులే పైకొస్తే, చిలిపిగా పిలిపిస్తే / పదులై, వేలై పొంగే నాలోన / లాలిపాటే నేనై, లాలపోసేవాణ్నై / లాలనే నింపనా లేత హృదయాన / మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా / వెన్నెలై తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా / ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా / ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మ రా అమ్మ రా ఎగురుతూ నీ పాదం, ఎదుగుతూ నీ రూపం / ఎదురుగా ఉంటే అంతే ఏదో ఆనందం / అడుగుతూ కాసేపు, అలుగుతూ కాసేపు / అనుక్షణం నీతో ఉంటే ఎంతో సంతోషం / క్షణములెన్నవుతున్నా వయసు ఎంతొస్తున్నా / పాపవే పాపవే నాన్న నయనాన మేఘాల పల్లకి తెప్పిస్తా, లోకాన్ని కొత్తగా చూపిస్తా / వెన్నెలై తనపై కురిపిస్తా, చల్లని హాయినందిస్తా / ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా / ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మ రా అమ్మ రా

ఓ.. నాన్నా
చిత్రం: ధర్మదాత
సంగీతం: టి.చలపతిరావు
గానం: ఘంటసాల, పి.సుశీల, జయదేవ్‌
రచన: సి.నారాయణరెడ్డి
ఓ....నాన్నా / నీ మనసే వెన్నా / అమృతం కన్నా / అది ఎంతో మిన్నా ముళ్లబాటలో నీవు నడిచావు / పూలతోటలో మమ్ము నడిపావు / ఏ పూట తిన్నావు / ఎన్ని పస్తులు ఉన్నావూ / పరమాన్నం మాకు దాచి ఉంచావు పుట్టింది అమ్మ కడుపులోనైనా / పాలు పట్టింది నీ చేతిలోనా / ఊగింది ఉయ్యాలలోనైనా / నేను దాగింది నీ చల్లని ఒడిలోనాఉన్ననాడు ఏమి దాచుకున్నావు / లేని నాడు చేయి చాచనన్నావు / నీ రాచగుణమే / మా మూలధనమూ / నీవే మా పాలి దైవమూ.. /నేను దాగింది నీ చల్లని ఒడిలోన... చల్లని ఒడిలోన... 

ఓ.. నాన్నా
చిత్రం: ధర్మదాత
సంగీతం: టి.చలపతిరావు
గానం: ఘంటసాల, పి.సుశీల, జయదేవ్‌
రచన: సి.నారాయణరెడ్డి
ఓ....నాన్నా / నీ మనసే వెన్నా / అమృతం కన్నా / అది ఎంతో మిన్నా ముళ్లబాటలో నీవు నడిచావు / పూలతోటలో మమ్ము నడిపావు / ఏ పూట తిన్నావు / ఎన్ని పస్తులు ఉన్నావూ / పరమాన్నం మాకు దాచి ఉంచావు పుట్టింది అమ్మ కడుపులోనైనా / పాలు పట్టింది నీ చేతిలోనా / ఊగింది ఉయ్యాలలోనైనా / నేను దాగింది నీ చల్లని ఒడిలోనా ఉన్ననాడు ఏమి దాచుకున్నావు / లేని నాడు చేయి చాచనన్నావు / నీ రాచగుణమే / మా మూలధనమూ / నీవే మా పాలి దైవమూ.. /నేను దాగింది నీ చల్లని ఒడిలోన... చల్లని ఒడిలోన...

జీవితంలో ప్రతి సందర్భంలో మనం ఏదో ఒక కారణం చేత ఒక తోడుంటే బాగుంటుందనుకుంటాం. 
ఆ తోడుతో కబుర్లు చెప్పుకుంటాం. ఆడతాం. పాడతాం. ఆ తోడు అన్నో, అక్కో, చెల్లో, తమ్ముడో అయి ఉంటారు, ఇంట్లో చిన్నప్పట్నుంచీ. అలాంటి తోడు కోసం కొన్ని పాటలు.. 
అందాల చిన్ని దేవత.. 
చిత్రం: శివరామరాజు
సంగీతం: ఎస్‌.ఎ.రాజ్‌కుమార్‌ 
గానం: శంకర్‌ మహదేవన్, బృందం
రచన: చిర్రావూరి విజయకుమార్‌
సంతోష పడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు.. /శివరామరాజుల అనుబంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు.. (2)/ అందాలా చిన్ని దేవత../ ఆలయమే చేసి మా ఎద../ అమృతమే మాకు పంచగా../ అంతా ఆనందమే కదా../ అనురాగం కంటి చూపులై../ అభిమానం ఇంటి దీపమై../ బతుకంతా నిండు పున్నమై../ ముడివేసే పూర్వ పుణ్యమే../ కలకాలం అన్నలకు ప్రాణమై../ మమకారం పంచవే అమ్మవై.. 
సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు../ శివరామరాజుల అనుబంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు..(2)/ పువ్వులెన్నొ పూచే.. నువ్వు నవ్వగానే / ఎండ వెన్నెలాయె.. నిన్ను చూడగానే / నీడ పడితే.. బీడు పండాలీ / అడుగుపెడితే.. సిరులు పొంగాలి / కల్మషాలు లేని.. కోవెలంటి ఇల్లు మాది / స్వచ్ఛమైన ప్రేమే.. పందిరల్లె అల్లుకుంది / స్వార్థమన్నమాటే మనసులోంచి తుడిచిపెట్టి / స్నేహబాటలోనే సాగుదాము జట్టుకట్టి / వెన్నెకన్న మెత్తనైన.. గంగకన్న స్వచ్ఛమైన ప్రేమ బంధమంటే మాదిలే.. సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు../ శివరామరాజుల అనుబంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు..(2) / అందాలా చిన్ని దేవత../ ఆలయమే చేసి మా ఎద../ అమృతమే మాకు పంచగా../ అంతా ఆనందమే కదా../ అనురాగం కంటి చూపులై.. అభిమానం ఇంటి దీపమై../ బతుకంతా నిండు పున్నమై../ ముడివేసే పూర్వ పుణ్యమే../ కలకాలం అన్నలకు ప్రాణమై../ మమకారం పంచవే అమ్మవై.. 

స్వాతిముత్యమల్లె.. పెరిగినట్టి చెల్లి / కల్పవృక్షమల్లె.. కరుణచూపు తల్లి / నలకపడితే.. కంటిలో నీకు / కలత పెరుగు.. గుండెలో మాకు / అమృతాన్ని మించె మమత మాకు తోడు ఉంది / మాటమీద నిలిచే అన్నమనసు అండ ఉంది / రాముడెరుగలేని ధర్మమీడ నిలిచి ఉంది / కర్ణుడివ్వలేని దానమీడ దొరుకుతుంది / నేలమీద ఎక్కడైన కానరాని సాటిలేని ఐకమత్యమంటే మాదిలే / సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలు / శివరామరాజులను బంధమింక వర్ధిల్లును వెయ్యేళ్లు..శ్రీలక్ష్మీ దేవిరూపము / శ్రీ గౌరీ దేవితేజము / కలిసి మా చెల్లి రూపమై / వెలిసే మా ఇంటి దేవతై / సహనంలో సీత పోలిక / సుగుణంలో స్వర్ణ మేనిక / దొరికింది సిరుల కానుక / గత జన్మల పుణ్య ఫలముగా / కలకాలం అన్నలకు ప్రాణమై / మమకారం పంచవే అమ్మవై.. 

కన్నీళ్లకే కన్నీరొచ్చే..
చిత్రం: హిట్లర్‌
సంగీతం: కోటి
గానం: బాలు, చిత్ర, అనుపమ, రేణుక
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
కన్నీళ్లకే కన్నీరొచ్చే.. కష్టాలకే కష్టం వేసే../ కన్నా ఇలా నిన్నే చూడగా../ అన్నీ నువ్వై భారం మోయగా.. ఈ బరువే.. నీ చదువై.. ఎదిగిన పసికూనా.. (2) అమ్మలోని లాలన.. నాన్నలోని పాలన.. అందిపుచ్చుకున్న ఈ అన్న నీడలో.. / కొమ్మచాటు పువ్వులై.. కంచె చాటు పైరులై../ చిన్నిపాపలందరూ ఎదుగువేళలో../ ముసిరే నిశిలో.. నడిచే దిశలో../ నెత్తురుతో నిలిపావే.. ఆరని దీపాన్ని..జాలి చూపు సూర్యుడా.. జోల పాడు చంద్రుడా.. నీవు కంట నీరు పెడితే నిలవలేమురా../ నీరు కాదే అమ్మలూ../ తీరుతున్న ఆశలు../ ఇన్నినాళ్ల భారమంతా కడుగుతున్నవే../ ఒడిలో ఒదిగి.. ఋణమై ఎదిగి../ మరుజన్మానికి నిను కనిపించే అమ్మవు కామయ్యా../ నీ నవ్వే.. వెన్నెల వెలుగమ్మా../ నా ఎదలో కాంతుల కొలువమ్మా.. ఏ దైవమో దీవించాడు.. మా అన్నగా దిగివచ్చాడు../ ఏ జన్మలో ఋణమో తీర్చగా../ మాకోసమే ప్రాణం పంచగా../ ఏ పుణ్యం.. మాకోసం.. దీవెనలిచ్చిందో../ నీ నవ్వే.. వెన్నెల వెలుగమ్మా../ నా ఎదలో కాంతుల కొలువమ్మా.. 

అన్నయ్యా అన్నావంటే 
చిత్రం: అన్నవరం
సంగీతం: రమణ గోగుల
గానం: మనో, గంగ
రచన: చంద్రబోస్‌
అన్నయ్యా అన్నావంటే ఎదురవనా / అలుపై ఉన్నావంటే నిదరవనా / కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా / కలతై ఉన్నావంటే కథనవనా / అమ్మలో ఉండే సగం అక్షరం నేనే / నాన్నలో రెండో సగం లక్షణం నేనే / అమ్మ తోడు.. నాన్న తోడు.. అన్నీ నీకు అన్నే చూడు / చెల్లిపోని బంధం నేనమ్మా / చిట్టి చెల్లెమ్మా / వెళ్లిపోని చుట్టం నేనమ్మా / అన్నలోని ప్రాణం నువ్వమ్మా / చిట్టి చెల్లెమ్మా / ప్రాణమైన చెల్లిస్తానమ్మా చూపులోన దీపావళి.. నవ్వులోన రంగోళి / పండుగలు నీతో రావాలి.. నా గుండెలోన వేడుక కావాలి / రూపులోన బంగారు తల్లి.. మాట మరుమల్లి / రాముడింట ప్రేమను పంచాలి.. ఆ సీత లాగా పేరుకు రావాలి / నీలాంటి.. అన్నగారు ఉండే ఉంటే.. తోడూనీడాఆనాటి సీతకన్ని కష్టాలన్నీ కలిగుండేవాచెల్లిపోని బంధం నేనమ్మా / చిట్టి చెల్లెమ్మా / వెళ్లిపోని చుట్టం నేనమ్మా / అన్నలోని ప్రాణం నువ్వమ్మా / చిట్టి చెల్లెమ్మా / ప్రాణమైన చెల్లిస్తానమ్మాకాలి కింది నేలను నేనే.. నీలి నింగి నేనే / కన్నులోని నీరే నేనమ్మా.. నన్ను నువ్వు జారనీకమ్మా / ఇంటి చుట్టు గాలిని నేనే.. తోరణాన్ని నేనే / తులసిచెట్టు కోటని నేనమ్మా... నీ.. కాపలాగా మారనీవమ్మా / ముక్కోటి దేవతలా అందే వరం అన్నవరం / ఇట్టాంటి అన్న తోడు... అందరికుంటే భూమే స్వర్గం / చెల్లిపోని బంధం నేనమ్మా / చిట్టి చెల్లెమ్మా / వెళ్లిపోని చుట్టం నేనమ్మా / అన్నలోని ప్రాణం నువ్వమ్మా / చిట్టి చెల్లెమ్మా / ప్రాణమైన చెల్లిస్తానమ్మా..అన్నయ్యా అన్నావంటే ఎదురవనా / అలుపై ఉన్నావంటే నిదరవనా / కలలే కన్నావంటే నిజమై ముందుకు రానా / కలతై ఉన్నావంటే కథనవనా / అమ్మలో ఉండే సగం అక్షరం నేనే / నాన్నలో రెండో సగం లక్షణం నేనే / అమ్మ తోడు.. నాన్న తోడు..అన్నీ నీకు అన్నే చూడు

అన్నా చెల్లెలి అనుబంధం
చిత్రం: గోరింటాకు
సంగీతం: యస్‌.ఎ.రాజ్‌కుమార్‌
రచన: అభినయ శ్రీనివాస్‌
గానం: ఎస్పీ బాలు, చిత్ర
అన్నా చెల్లెలి అనుబంధం / జన్మజన్మల సంబంధం / జాబిలమ్మకిది జన్మదినం / కోటి తారకల కోలాహలం / అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ అరచేతిలోన హరివిల్లై / గోరింట పండగా.. మా ఇంట పండగా.. 
అన్నాచెల్లెలి అనుబంధం / అంతులేనిది ఆనందం / జాబిలమ్మకిది జన్మదినం / కోటితారకల కోలాహలం / అన్నయ్య ప్రేమే అరచేతిలోన అందాల రేఖలు అవుతుంటే / గోరింట పండగా.. మా ఇంట పండగా..
విరిసినది వెన్నెల్లే ఇలా అచ్చు నా చెల్లి నవ్వులా / స్వర్గమే నేరుగా మా ఇంట వాలగా / కురిసినది ప్రేమ చినుకులా / అదే మా అన్న చూపులా / కన్నులే తడిసెనే నవ్వినా హాయిగా / నీ కంటికి రెప్పను నేనై తోడుగా ఉన్నాలే / నీ గుండెకు ఊపిరి నేనై / ఎప్పుడూ ఉంటాలే / అందుకే నువ్వులేక నే లేనులే / ప్రతిజన్మలోనా నీ చెల్లినై వరమివ్వు నాకు చాలంట / దేవతలా మాట నా నోటి వెంట దీర్ఘాయుష్మాన్‌ భవ / అన్నాచెల్లెలి అనుబంధం / జన్మజన్మల సంబంధం / జాబిలమ్మకిది జన్మదినం / కోటి తారకల కోలాహలం బుడిబుడి నడకలు ఎన్నో నేర్పిన కన్నతండ్రిలా / పాదమే కందనీ ఓ పూల దారిలా / చిరుచిరు గోరుముద్దలే తినిపించు కన్నతల్లిలా / తులసివై వెలసినా ఈ ఇంటి దేవత / అన్నా అన్న మాటే కాదా నాకిక ఓంకారం / చెల్లీ నువ్వు పుట్టినరోజే ప్రేమకు శ్రీకారం / మా ఇల్లు అనురాగ గుడి గోపురం / సిరులెన్ని ఉన్న సరితూగలేవు నా చెల్లి చిన్నినవ్వులకు / నీ పాద స్పర్శ శ్రీరామరక్ష మాతృదేవోభవ అన్నా చెల్లెలి అనుబంధం / జన్మజన్మల సంబంధం / జాబిలమ్మకిది జన్మదినం / కోటి తారకల కోలాహలం / అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ అరచేతిలోన హరివిల్లై / గోరింట పండగా.. మా ఇంట పండగా..

అన్నయ్య సన్నిధి
చిత్రం: బంగారు గాజులు 
రచన: సినారె 
గానం: పి.సుశీల 
సంగీతం: టి.చలపతిరావు
అన్నయ్య సన్నిధి / అదే నాకు పెన్నిధి / కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది / ఒకే తీగ పువ్వులమై / ఒకే గూటి దివ్వెలమై / చీకటిలో వేకువలో / చిరునవ్వుల రేకులలో కన్న కడుపు చల్లగా కలసి మెలసి ఉన్నాము / కలిమి మనకు కరువైనా / కాలమెంత ఎదురైనా / ఈ బంధం విడిపోదన్నా / ఎన్నెన్ని యుగాలైన / ఆపదలో ఆనందంలో నీ నీడగ ఉంటానన్నా..

అన్నా... నీ అనురాగం
చిత్రం: ఆడపడుచు
సంగీతం: టి.చలపతిరావు
రచన: దాశరథి
గానం: పి.సుశీల
అన్నా... నీ అనురాగం ఎన్నో జన్మల పుణ్యఫలం / ఓ అన్నా.. నీ అనురాగం / పుట్టిన రోజున మీ దీవెనలే.. వెన్నెల కన్నా చల్లదనం / ఓ అన్నా.. నీ అనురాగం..ఎన్నో జన్మల పుణ్యఫలం / ఓ అన్నా.. నీ అనురాగంమల్లెల వంటి మీ మనసులలో చెల్లికి చోటుంచాలి / ఎల్లకాలము ఈ తీరుగనే చెల్లిని కాపాడాలి / పుట్టిన రోజున మీ దీవెనలే.. వెన్నెల కన్నా చల్లదనం / ఓ అన్నా.. నీ అనురాగం.. ఎన్నో జన్మల పుణ్యఫలం / ఓ అన్నా..అన్నలు మీరే నా కన్నులుగా.. నన్నే నడిపించాలి / తల్లి తండ్రి సర్వము మీరై.. దయతో దీవించాలి / పుట్టిన రోజున మీ దీవెనలే.. వెన్నెల కన్నా చల్లదనం / ఓ అన్నా.. నీ అనురాగం..ఎన్నో జన్మల పుణ్యఫలం / ఓ అన్నా..ఇల్లాలై నేనెచటికేగినా.. చెల్లిని మదిలో నిలపాలి / ఆడపడుచుకు అన్నివేళలా.. తోడూనీడగా నిలవాలి / పుట్టిన రోజున మీ దీవెనలే.. వెన్నెల కన్నా చల్లదనం / ఓ అన్నా.. నీ అనురాగం..ఎన్నో జన్మల పుణ్యఫలం / ఓ అన్నా

దేవుడెలా ఉంటాడని
చిత్రం: దొరబాబు 
సంగీతం: జె.వి.రాఘవులు
గీత రచయిత: దాశరథి
నేప«థ్య గానం: ఘంటసాల, సుశీల
దేవుడెలా ఉంటాడని.. ఎవరైనా అడిగితే / మా అన్నలా ఉంటాడని అంటాను నేను / అనురాగమెలా ఉంటుందని.. ఎవరైనా అడిగితే / మా చెల్లిలా ఉంటుందని చెబుతాను నేను / చెల్లెలున్న ఈ ఇల్లే సిరిమల్లె తోట / మా అమ్మలు చిరునవ్వే ముత్యాల మూట (2) / అన్నయ్య హృదయమే అందాల మేడ / చెల్లాయికి కలకాలం అది చల్లని నీడ / కన్నతల్లి తీపి కలల రూపాలం మనము(2) / కోవెలలో వెలిగించిన దీపాలం మనము దేవుడెలా ఉంటాడని.. ఎవరైనా అడిగితే / మా అన్నలా ఉంటాడని అంటాను నేను / అల్లారు ముద్దుగా నను పెంచినావు / అమ్మనూ నాన్ననూ మరపించినావు / ఇల్లాలివై నీవు విలసిల్లవమ్మా / పిల్లాపాపలతోటి చల్లగ వుండమ్మా / పుట్టినింట ఉన్నా.. మెట్టినింట ఉన్నా..(2) / అన్నయ్య దీవెనే శ్రీరామరక్ష దేవుడెలా ఉంటాడని.. ఎవరైనా అడిగితే / మా అన్నలా ఉంటాడని అంటాను నేను / అనురాగమెలా ఉంటుందని.. ఎవరైనా అడిగితే / మా చెల్లిలా ఉంటుందని చెబుతాను నేను 

అక్కా అక్కా నువ్‌ ఎక్కడే
చిత్రం: అడవి చుక్క
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్‌
రచన: సుద్దాల అశోక్‌తేజ
గానం: కె.ఎస్‌. చిత్ర, స్వర్ణలత
అక్కా అక్కా నువ్‌ ఎక్కడే / చెల్లీ చెల్లీ నీ పక్కనే / అక్కా దాగుడుమూతలాపవే /ఎక్కాడున్నానో చెప్పవే / ఆకులోన ఆకులాగా.. పువ్వులోన తేనెలాగా దాగి ఉంటే నిన్ను నేను ఎట్ట పట్టుకుందునమ్మా / నా చిట్టితల్లి నిన్ను కల్లో కూడ వీడి ఉండనే / ఆ చిలక రెక్కల్లో్ల / ఆ పచ్చ రంగుల్ని అద్దిన రాజు ఎవ్వడే / మిన్నాగు పడగల్లో / ఆ విష్ణు పాదాలు దిద్దిన మాయ దేవుడే / ఆ దేవుడే నన్ను... ఆ దేవుడే నన్ను చెల్లెలిగ చేశాడే / నీ తోడుగా నన్ను రెప్పల్లె ఉంచాడే / మన ఆటాపాటా పగలు రేయి సూర్యచంద్రుడల్లె చూస్తాడే అక్కా అక్కా నువ్‌ ఎక్కడే / చెల్లీ చెల్లీ నీ పక్కనే / అక్కా దాగుడుమూతలాపవే / ఎక్కాడున్నానో చెప్పవే.. నా కాలికి ముల్లై్లతే.. నీ కంట్లో కన్నీరు / విడ్డూరం కాదా ఓయమ్మా / ఓ కన్ను ఏడిస్తే.. ఓ కన్ను నవ్వేనా / నువ్వు నేనంతేలేవమ్మా / మన అమ్మ పొత్తిళ్లో... మన అమ్మ పొత్తిళ్లో ఒదిగింది పది నెలలే.. / ఈ అక్క ఒడిలోన ఎదగాలి నూరేళ్లు / నిన్ను నన్ను చూసిన మిన్ను నింగి ఏడురంగుల ముగ్గులు వేసిందా / అక్కా అక్కా నువ్‌ ఎక్కడే / చెల్లీ చెల్లీ నీ పక్కనే / అక్కా దాగుడుమూతలాపవే / ఎక్కాడున్నానో చెప్పవే అక్కా.. నీ పెళ్లైతే.. నీ గూడే వేరైతే / నీ చెల్లి దిక్కులేనిదే / నువ్వేనా గుండెల్లో గువ్వల్లే బజ్జుంటే / నాకింక బిడ్డలెందుకే / నీ కంటి కాటుకై కళ్లల్లే నేనుంటా / నీ చేతి గోరింటై నేనుంటా / 
పాలు పెరుగు పట్టు తేనై కలిసి నాకు అక్కై పుట్టిందే / అక్కా అక్కా నువ్‌ ఎక్కడే / చెల్లీ చెల్లీ నీ పక్కనే / అక్కా దాగుడుమూతలాపవే / ఎక్కాడున్నానో చెప్పవే..

మేడంటే మేడా కాదు...
చిత్రం: సుఖదుఃఖాలు 
సంగీతం: కోదండపాణి
గీత రచయిత: దేవులపల్లి
నేపథ్య గానం: ఎస్పీ బాలు
మేడంటే మేడా కాదు.. గూడంటే గూడూ కాదు / పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది.. పొదరిల్లు మాది / నేనైతే ఆకు కొమ్మ.. తానైతే వెన్నెల వెల్ల (2) / పదిలంగా నేసిన పూసిన పొదరిల్లు మాది... పొదరిల్లు మాది / మేడంటే మేడా కాదు.. గూడంటే గూడూ కాదూ / పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది.. పొదరిల్లు మాది కోవెల్లో వెలిగే దీపం.. దేవి మా తల్లి / కోవెలలో తిరిగే పాటల గువ్వ.. నా చెల్లి / గువ్వంటే గువ్వా కాదు.. గొరవంక గాని / వంకంటే వంకా కాదు.. నెలవంక గాని / మేడంటే మేడా కాదు.. గూడంటే గూడూ కాదు / పదిలంగా అల్లుకున్న.. పొదరిల్లు మాది.. పొదరిల్లు మాది / గోరింక పెళ్లైపోతే.. ఏ వంకో వెళ్లిపోతే (2) / గూడంతా గుబులై పోదా? గుండెల్లో దిగులై పోదా? / మేడంటే మేడా కాదు.. గూడంటే గూడూ కాదు / పదిలంగా అల్లుకున్న.. పొదరిల్లు మాది.. పొదరిల్లు మాది (2) 

ఆనాటి హృదయాల ఆనందగీతం
చిత్రం: అన్నదమ్ముల అనుబంధం
సంగీతం: చక్రవర్తి
రచన: సి. నారాయణరెడ్డి
గానం: ఎస్‌.పి.బాలు, బృందం
ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే.. ఇదేలే / ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే / ఆ పాట అధరాలపైనా పలికేను ఏనాటికైనా.. (2) ఏటేటా మన ఇంట ఈ పండగే జరగాలి / ఈ నిలయం కలకాలం శ్రీ నిలయమై నిలవాలి (2) / వెలుతురైనా చీకటైనా విడిపోదు ఈ అనుబంధం / తారకలే దిగివచ్చి తారంగం ఆడాలి / వెన్నెలలే ముంగిటిలో వేణువులై పాడాలి (2) / ఆటలాగా పాటలాగా సాగాలి మన జీవితం ఆనాటి హృదయాల ఆనందగీతం ఇదేలే.. ఇదేలే / ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే అదేలే.. ఆ పాట అధరాలపైనా పలికేను ఏనాటికైనా..

మల్లె తీగకు పందిరివోలె
సినిమా: ఒరేయ్‌ రిక్షా
సంగీతం : వందేమాతరం శ్రీనివాస్‌
రచన: గద్దర్‌
గానం: వందేమాతరం శ్రీనివాస్‌
మల్లె తీగకు పందిరివోలె / మసక సీకటిలో యెన్నెలవోలె / నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా / తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా / తోబుట్టువు రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
పెద్ద మనిషివై పూసిన నుండే / ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో / చూసే దానిని చూడొద్దంటరు / నవ్వే చోట నవ్వొద్దంటరు / అటువంటి నే అన్నను కాను చెల్లెమ్మా / నీ చిన్ననాటి స్నేహితుడినమ్మా చెల్లెమ్మా / అడవిలోనా నెమలివోలే చెల్లెమ్మా / ఆటలాడుకో పాట పాడుకో చెల్లెమ్మా సిన్నబోయి నువ్వు కూసున్నవంటే / ఎన్నుపూస నాదిరిగేనమ్మా / ఒక్క క్షణం నువ్వు కనబడకుంటే / నా కనుపాపలు కమిలిపోతయి / ఒక్క ఘడియ నువ్వు మాట్లాడకుంటే చెల్లెమ్మా / నే దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లెమ్మా / బువ్వదినక నువ్వు అలిగినవంటే చెల్లెమ్మా / నా భుజమిరిగినంత పనైతదమ్మా చెల్లెమ్మా
చదివినంత నిన్ను చదివిస్తనమ్మా / ఎదిగినంత నిన్ను ఎదిగిస్తనమ్మా / నీకు పెళ్లీడు వచ్చేనాటికి / పువ్వో పత్రో కూడబెట్టుతా / నచ్చినోనికే ఇస్తానమ్మా చెల్లెమ్మా / నా కన్నీళ్లతో కాళ్లు కడుగుతా చెల్లెమ్మా / రిక్షా బండినే మేనా కడతా చెల్లెమ్మా / మీ అత్తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మా..

కన్నయ్యలాంటి అన్నయ్యలేని
చిత్రం: బంగారుబాబు 
రచన: ఆచార్య ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్‌
గానం: ఘంటసాల, పి.సుశీల
కన్నయ్యలాంటి అన్నయ్యలేని కన్నులెందుకు / ఆ అన్నయ్య చల్లగ నవ్వకపోతే వెన్నెలెందుకు / నా మాటకు పలికే దేవుడు / నా మనసుకు తెలిసిన చంద్రుడు / అలిగాడమ్మా ఈనాడు (2) / నా బ్రతుకే చీకటి చేశాడు (2) / నా ఆశలు తీర్చే తండ్రే తాను / తన ఆకలి ఎరిగిన తల్లిని నేను / నా కనుపాపడు పలుకని నాడు (2) / కన్నులొచ్చినా కబోదినే / నేను కన్నులొచ్చినా కబోదినే
అమ్మా.. చెల్లెమ్మా.. / అన్నయ్యా.. / కన్నమ్మ లాంటి చెల్లెమ్మ ఉంటే అన్నమెందుకు / నా చెల్లెమ్మ చల్లగ నవ్వుతూ ఉంటే వెన్నెలెందుకు / కన్నయ్యలాంటి అన్నయ్య ఉంటే æకన్నులెందుకు / ఆ అన్నయ్య చల్లగ నవ్వుతూ ఉంటే వెన్నెలెందుకు..

చిన్నారి చెల్లి..
చిత్రం: దేవుడమ్మ
సంగీతం: సత్యం
గానం: బాలు, కె.బి.కె.మోహన్‌ రాజు, 
పి. సుశీల
రచన: సినారె
చిన్నారి చెల్లి.. మా బంగారు తల్లి / నీవేనమ్మ మా ప్రాణమూ (2) / ఈ ఇంటి సిరిమల్లివే నీవు నేడు / ఏ ఇంటి జాబిల్లివవుతావో రేపు (2) / పల్లకిలో సాగి.. చల్లగ ఊరేగి (2) / పచ్చగ నూరేళ్లు బ్రతకాలి చెల్లి.. బ్రతకాలి చెల్లి..చిన్నారి చెల్లి.. మా బంగారు తల్లి / నీవేనమ్మ మా ప్రాణము / ఈపూట వెలిగే మతాబాల కన్నా / నీ పాలనవ్వుల దీపాలే మిన్న (2) / ఈ ఇంట ఉన్నా.. మరే ఇంట ఉన్నా (2) / నీవున్న ఆ ఇంటే దీపావళి / దీపావళి నిత్య దీపావళి / దీపావళి నిత్య దీపావళిచిన్నారి చెల్లి.. మా బంగారు తల్లి / నీవేనమ్మ మా ప్రాణమూ (2) ఏ పూర్వజన్మల పుణ్యాల ఫలమో / ఈ జన్మలో నేను మీ చెల్లినయ్యాను (2) / ఏ చోట ఉన్నా ఇదే మాట అన్నా (2) / మీ పేరు నా పేరు నిలిపేనన్నా.. నిలిపేనన్నా.. / చిన్నారి చెల్లి.. మా బంగారు తల్లి / నీవేనమ్మ మా ప్రాణము 

అత్త అంటే ఏదైనా చెప్పుకోవచ్చనే ధైర్యం. ఎన్నైనా చెప్పుకోనిచ్చే నమ్మకం. అందుకే మన తెలుగు సినిమాల్లో అత్త మీద పాటలు చాలానే వచ్చాయి. అందులోంచి ఓ రెండు పాటలు...

అత్త ఒడి పూవు వలె.. 
చిత్రం: తోడు నీడ
సంగీతం: కె.వి.మహదేవన్‌
గానం: పి. సుశీల
రచన: ఆత్రేయ
అత్త ఒడి పూవు వలె మెత్తనమ్మా / ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా / ఆడుకొని, పాడుకొని అలసిపోతివా / అలుపుతీర బజ్జో మా అందాల బొమ్మా.. అమ్మలు కన్నుల్లో తమ్మీ పూవుల్లు / అమ్మలు కన్నుల్లో తమ్మీ పూవుల్లు / తమ్మీ పూవులు పూయు / కలిరు వెన్నెల్లు / ఆ వెన్నెలను మూసేనే కన్నీటి జల్లు / కన్నీరుæ రానీకు / కరుగునెడదల్లు అత్తఒడి పువ్వువలె మెత్తనమ్మా / ఆదమరచి హాయిగా ఆడుకోమ్మా కనిపించే దేవుళ్లు కమ్మని పాపల్లు / కనిపెంచే తల్లికి కన్నుల జ్యోతుల్లు / వెయ్యాలి పాపాయి / తప్పటడుగుళ్లు / చేయాలీ ఆ పైనా గొప్ప చేతలూ / అత్త ఒడి పూవు వలె మెత్తనమ్మా / ఆదమరచి హాయిగా ఆడుకోమ్మా..

కలికి చిలకల కొలికి
చిత్రం: సీతారామయ్యగారి మనవరాలు 
రచన: వేటూరి 
గానం: చిత్ర 
సంగీతం: కీరవాణి
కలికి చిలకల కొలికి మాకు మేనత్త / కలవారి కోడలు కనకమాలక్ష్మి / అత్తమామల కొలుచు అందాల అతివ / పుట్టిల్లు ఎరుగని పసి పంకజాక్షి / మేనాలు తేలేని మేనకోడలిని / అడగవచ్చా మిమ్ము ఆడకూతుర్ని / వాల్మీకినే మించు వరుస తాతయ్య / మా ఇంటికంపించవయ్య మామయ్య ఆ చేయి ఈ చేయి అత్త కోడలికి / ఆ మాట ఈ మాట పెద్ద కోడలికి / నేటి అత్తమ్మ నాటి కోడలివే / తెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివి / తలలోని నాలుకై తల్లిగా చూసే / పూలల్లో దారమై పూజలే చేసే / నీ కంటిపాపల కాపురం చేసే /మా చంటి పాపను మన్నించి పంపు మసక బడితే నీకు మల్లెపూదండ / తెలవారితే నీకు తేనె నీరెండ / ఏడు మల్లెలు తూగు నీకు ఇల్లాలు / ఏడు జన్మల పంట మా అత్త కాలు / పుట్టగానే పువ్వు పరిమళిస్తుంది / పుట్టినింటికే మనసు పరుగుతీస్తుంది / తెలుసుకో తెలుసుకో తెలుసుకో / తెలుసుకో తెలుసుకో మనసున్న మామ / సయ్యోధ్యనేలేటి సాకేతరామ

బావంటే సరదా. బావతో మాట్లాడటమూ పాటలాగే ఉంటుంది, అతణ్నిష్టపడే మరదలికి. ఆ మరదలితో మాట్లాడటం ఆ బావకూ అంతే. వాళ్లిద్దరూ పాడుకునే అలాంటి పాటలెన్నో ఉన్నాయి తెలుగులో. అందులోంచి ఈ రెండు...

ఆకాశ వీధిలో.. 
చిత్రం: మల్లీశ్వరి 
రచన: కృష్ణశాస్త్రి 
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు 
గానం: ఘంటసాల–భానుమతి
ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు / దేశదేశాలన్ని తిరిగి చూసేవు / ఏడ తానున్నాడో బావ / జాడ తెలిసిన పోయి రావా / ఆ... అందాల ఓ మేఘమాల / ఆ.. చందాల ఓ మేఘమాల / గగన సీమల తేలు ఓ మేఘమాల / మా ఊరు గుడిపైన మసలి వస్తున్నావా / మల్లి మాటేదైన నాతో / మనసు చల్లగా చెప్పిపోవా / నీలాల ఓ మేఘమాల / రాగాల ఓ మేఘమాల మమతలెరిగిన మేఘమాల / నా మనసు బావకు చెప్పి రావా ఎన్నాళ్లు నా కళ్లు దిగులుతో రేపవలు ఎదురు తెన్నులు చూచెనే / బావకై చెదరి కాయలు కాచెనే / అందాల ఓ మేఘమాల / రాగాల ఓ మేఘమాల / మనసు తెలిసిన మేఘమాల / మరువలేనని చెప్పలేవా / మల్లితో.. మరవలేనని చెప్పలేవా / కళ్లు తెరిచినగాని / కళ్లు మూసినగాని (2) / మల్లి రూపే నిలిచెనే / నా చెంత.. మల్లి మాటే పిలిచెనే / జాలిగుండెల మేఘమాల / బావ లేనిది బ్రతుకజాల కురియు నా కన్నీరు / గుండెలో దాచుకొని వాన జల్లుగ కురిసిపోవా / కన్నీరు, ఆనవాలుగ బావ మ్రోల

ఏలే ఏలే మరదలా..
చిత్రం: అన్నమయ్య 
రచన: వేటూరి 
గానం: ఎస్పీ బాలు, సుజాత, అనురాధ
ఏలే ఏలే మరదలా / వాలే వాలే వరసలా / నచ్చింది నచ్చింది నాజూకు / నీకే ఇస్తా సోకులు / ఇచ్చేయ్‌ పచ్చారు సొగసులు / చాలు నీతోటి / అహ చాలు నీతోటి సరసాలు బావా... గాటపు గుబ్బలు కదలగ కులికేవు / మాటల తేటల మరదలా / వెంటరి చూపులు విసురుచు మురిసేవు / వాటపు వలపుల వరదలా / చీటికి మాటికి చెనకేవు / వట్టి బూటకాలు మానిపోయే బావ / కన్నుల గంతపు కవితలు చిలికేవు / నా ఎద చాటున మరదలా / పాడని పాటల పైటలు సదిరేవు / పల్లవి పదముల దరువులా / కంటికి వంటికి కలిపేవు / ఎన్ని కొంటె లీలలంట చాలా బావా / ఆహా పాడుకో పాట / జంట పాడుకున్న పాట జాజిపూదోట

పెద్దల మాట చద్దన్నం మూట అంటూంటారు. అమ్మమ్మ, నానమ్మ, తాతలు చెప్పే మాటలు అలాంటివే. వాళ్లతో ఉంటే సరదాగా ఆడుతూనే ఎన్నెన్నో తెలుసుకోవచ్చు. అలాంటి పెద్ద వాళ్లు చెప్పే మాటలు, 
ఆ పెద్దవాళ్ల చుట్టూ చేరి పిల్లలు పాడుకునే పాటలు.. ఇవి.. 

శ్రీ సూర్యనారాయణా మేలుకో...
చిత్రం: మంగమ్మగారి మనవడు 
సంగీతం: కె.వి.మహదేవన్‌ 
గానం: భానుమతి రామకృష్ణ, వాణీజయరామ్‌
రచన : సినారె
శ్రీ సూర్యనారాయణా మేలుకో...మేలుకో / మా చిలకమ్మా బులపాటము చూసిపో...చూసిపో / తెల్లావారక ముందే ఇళ్లంతా పరుగుల్లు / చీకట్లో ముగ్గుల్లు చెక్కిట్లో సిగ్గుల్లు / ఏమీ వయ్యారమో / ఎంతా విడ్డూరమో / శ్రీ సూర్యనారాయణా మేలుకో....మేలుకో / మా అమ్మమ్మా ఆరాటము.. చూసిపో.. చూసి పో / చిట్టీ మనవడి రాక చెవిలోన పడగానే / ముసిముసి చీకట్లో ముసలమ్మ రాగాలు / ఏమి జాగారమో / ఎంత సంబరమో / సరిగంచు పైట సవరించుకున్నా / మరీ మరీ జారుతోంది / ఓసోసి మనవరాల ఏం జరిగింది? / తాతయ్యని నువ్వు తలచిన తొలినాడు / నీకేమి జరిగిందో అమ్మమ్మా / నాకంతే జరిగింది అమ్మమ్మా అమ్మమ్మా / అమ్మదొంగా... రంగ రంగా / కోడిని కొడితే / సూర్యుణ్ని లేపితే / తెల్లారిపోతుందా? /ఓ పిల్లా పెళ్లిఘడియ వస్తుందా? దిగివచ్చే బావను / క్షణమైనా ఆపితే / దేవుణ్ని నిలదీయనా ఓయమ్మో / కాలాన్ని తిప్పేయనా / నా పిచ్చితల్లీ / ఓ బుజ్జీ మల్లీ / నీ మనసే బంగారం/ నూరేళ్లు నిలవాలి ఈ మురిపెం / అమ్మమ్మ మాట / ముత్యాల మూట / ఆ విలువ నేనెరుగనా / ఏనాడు అది నాకు తొలి దీవెన

బాబాయ్‌ అంటే నాన్న తర్వాత నాన్న. నాన్న దగ్గర పడే భయాలేవీ బాబాయ్‌ దగ్గర పడక్కర్లేదు. అది బాబాయ్‌ ఇచ్చే చనువు. అదే బాబాయ్‌ ఇవ్వగలిగే ధైర్యం కూడా! అలాంటి బాబాయ్‌ గురించి.. ఒక పాట.. 

మంచివాడు మా బాబాయి 
చిత్రం: కథానాయకుడు
సంగీతం: టి.వి.రాజు
గానం: పి. సుశీల, బెంగళూరు లత
రచన: దాశరథి
మంచివాడు మా బాబాయి / మా మాటే వింటాడోయి / కోపం మాని తాపం మాని మాతో ఉంటాడోయి / రామలక్ష్మణులు మీరయ్యా / మీలో కలతలు ఏలయ్యా? / ఏటికి నిలిచే నీ తమ్మునిపై నిందలెందుకయ్యా..మంచివాడులే మా నాన్న / మా మాటే వింటాడోయి / కోపం మాని తాపం మాని మాతో ఉంటాడోయి / అమ్మా నాన్నా వలె చూసే / అన్నా వదినా ఉన్నారూ / అన్నయ్యేదో అనగానే.. అలుక ఎందుకయ్యా.. అలుక ఎందుకయ్యా.. మంచి మనసుతో బాబాయి / మనకు కానుకలు తెచ్చాడు / మూగనోములూ విడవాలి / ముగ్గురు కలసీ నవ్వాలి / మంచివాడు మా బాబాయి / మా మాటే వింటాడోయి / కోపం మాని తాపం మాని మాతో ఉంటాడోయి..

భార్యా భర్తలంటే ఒక జీవితాన్ని పంచుకునే బంధం. ఇద్దరు ఒక్కరై చేసే ప్రయాణం. అలాంటి ప్రయాణం గురించి ఎన్ని పాటలు పాడుకోవచ్చు? కొన్నివి.. 

ఆదిదంపతులే అభిమానించే
చిత్రం: మిథునం 
సంగీతం : వీణాపాణి
గానం: కె.జె.ఏసుదాసు 
రచన: జొన్నవిత్తుల
ఆదిదంపతులే అభిమానించే అచ్చ తెలుగు మిథునం / అవని దంపతులు ఆరాధించే ముచ్చటైన మిథునం / సుధా ప్రేమికుల సదనం సదాశివుని మారేడు వనం దాంపత్య రసజ్ఞుడు ఆలికొసగు అనుబంధ సుగంధ ప్రసూనం / నవరస మాన సమర సమాన సహకార స్వరమేళనం / భారతీయతకు హారతి పట్టే కృషిమయ జీవన విధానం / భార్య సహాయముతో కొనసాగే భవసాగర తరనం... భవసాగర తరనం / అల్పసంతసపు కల్పవృక్షమున ఆత్మకోకిలల గానం / పురుషార్థముల పూలబాటలో పుణ్యదంపతుల పయనం / అరవై దాటిన ఆలుమగల అనురాగామృత మ«థనం / గృహస్థ ధర్మం సగర్వమ్ముగ తానెగరేసిన జయకేతనం... జయకేతనం

ఆడుతు పాడుతు
చిత్రం: తోడికోడళ్లు
రచన: కొసరాజు
సంగీతం: మాస్టర్‌ వేణు
గానం: ఘంటసాల, పి. సుశీల
ఆడుతు పాడుతు పనిచేస్తూంటే అలుపూ సొలుపేమున్నది / ఇద్దరమొకటై చేయి కలిపితే ఎదురేమున్నది / మనకు కొదవేమున్నది (2) / ఒంపులు తిరిగి ఒయ్యారంగా ఊపుతు విసరుతు గూడేస్తుంటే (2) / నీ గాజులు ఘల్లని మోగుతువుంటే నా మనుసు ఝల్లుమంటున్నది / నా మనుసు ఝల్లుమంటున్నది / ఆడుతు పాడుతు.. తీరని కోరికలూరింపంగా.. ఓర కంట నను చూస్తూ ఉంటే (2) / చిలిపి నవ్వులు చిందులు తొక్కి.. చిలిపి నవ్వులు చిందులు తొక్కి / సిగ్గు ముంచుకొస్తున్నది / నను సిగ్గు ముంచుకొస్తున్నది / ఆడుతు పాడుతు..చెదరి జారిన కుంకుమరేఖలు / పెదవులపైన మెరుస్తువుంటే (2) / తీయని తలపులు నాలో ఏమో.. తీయని తలపులు నాలో ఏమో తికమకజేస్తూవున్నవి / అహ తికమకజేస్తూవున్నవి / ఆడుతు పాడుతు.. / మాటల్లో మోమాటం నిలిపి.. రాగంలో అనురాగం కలిపి (2) / పాట పాడుతుంటే.. నా మది పరవశమైపోతున్నది/ పరవశమైపోతున్నది..ఆ..

మనం చెప్పుకున్న ఇన్ని బంధాలను కట్టి ఉంచిన దారమే కుటుంబం. మరి ఈ బంధాలన్నింటికీ కేంద్రమైన కుటుంబ పాటలకూ లెక్కేలేదు. అందులోంచి కొన్ని.. 
కలిసుంటే కలదు సుఖం 
చిత్రం: కలిసుందాం రా
సంగీతం: ఎస్‌.ఎ.రాజ్‌కుమార్‌
రచన: వేటూరి 
గానం: రాజేశ్‌
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం / అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం / గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే / కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనసు విరిసే / వస్తారా మా ఇంటికి ప్రతిరోజూ సంక్రాంతికీ / గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే / కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనసు విరిసేఖుషీ తోటలో గులాబీలు పూయిస్తుంటే / హలో ఆమని చలో ప్రేమనీ / వసంతాలిలా ప్రతీరోజు వస్తూ ఉంటే చలీ కేకలా చెలే కోకిలా / నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమ వనం / వెన్నెలలే వెల్లువలై పొంగిన సంతోషం / ప్రేమలన్ని ఒకసారే పెనేసాయి ఈ ఇంటా / గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే / కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనసు విరిసే / కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం / అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం ఒకే ఈడుగా ఎదే జోడుకడుతూ ఉంటే / అదే ముచ్చటా కథే ముద్దటా / తరం మారినా స్వరం మారనీ ప్రేమ / స్వరాగానికే వరం ఐనదీ / పాటలకే అందనిది పడుచుల పల్లవిలే / చాటులలో మాటులలో సాగిన అల్లరిలే / పాల పొంగు కోపాలో / పైట చెంగు తాపాలో / గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే / కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనసు విరిసే / కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం / అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం / గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మమెదురు చూసే / కుంకుమ పువ్వుల మిలమిలతో ఇంద్రధనసు విరిసే / వస్తారా మా ఇంటికి ప్రతిరోజూ సంక్రాంతికి

ఇంటి పేరు అనురాగం
చిత్రం: మగధీరుడు
సంగీతం: ఎస్‌.పి.బాలు
రచన: వేటూరి
గానం: ఎస్‌.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల, మాధవపెద్ది రమేష్, లలితా సాగరి
ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం (2) / మా ఇల్లే బృందావనం (2) / ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం / ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం / వెలుగునీడలైనా.. కలిమిలేములైనా / మా ముంగిట ఎప్పుడూ చిరునవ్వుల ముద్దులే / ఎదిరించని జానకి నిదురించని ఊర్మిళా / తోడికోడళ్లుగా ఇల్లు చక్కదిద్దగా / ప్రేమకు రూపాలుగా రామలక్ష్మణులుగా / కొండంత అన్నలూ అండగా ఉండగా / ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం / మా ఇల్లే బృందావనం(2) / ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం / ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం వయసులో చిన్నైనా.. మనసులో పెద్దగా / తమ్ముడన్న మాటకే తాను సాక్షిగా (2) / అమ్మగా నాన్నగా బిడ్డగా తాతగా / ఏ దేవకి కన్నా / ఏ యశోద పెంచినా / గోకులాన వెలిశాడు గోపాలకృష్ణుడు / మా ఇంటికి దీపమై చిన్నారి తమ్ముడు ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం (2) / మా ఇల్లే బృందావనం (2) / ముక్కోటి దేవతలు వెలసిన దేవాలయం / ఇంటి పేరు అనురాగం ముద్దు పేరు మమకారం (2)

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list