----------
శ్రీమద్రామాయణం
ఏనాటి సమాజమైనా ఆనాటి సంస్కృతిని- అంటే ఆచార వ్యవహారాలను, ముఖ్యమైన విలువలను సూచిస్తుంది. రామాయణం ఆనాటి సంస్కృతిని, విలువలను, మహాభారతం ఆనాటి విలువలను, ఆచార వ్యవహారాలను మనకు తెలుపుతాయి. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే రామాయణ కాలం నాటి ఆచార వ్యవహారాలు మహాభారతం కాలం నాటికి మారిపోయాయి. అలాగే మహాభారతం కాలం నాటికి నేటికి ఆచారవ్యవహారాలు మారిపోయాయి. కాని ఈ సమాజం తనముందు ఉంచుకొన్న విలువలు రామాయణ కాలం నుంచి నేటి వరకు ఏమాత్రం చెక్కు చెదరక నిలిచి ఉన్నాయి. సత్యం వద, ధర్మం చర, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథిదేవోభవ, అహింసా పరమోధర్మః, ధర్మో రక్షతి రక్షితః. ఇలాంటి విలువలు రామాయణ కాలానికి పూర్వమే ఉన్నాయి, రామాయణ కాలంలోనూ ఉన్నాయి, మహాభారత కాలంలోను ఉన్నాయి. నేడు కూడా మహనీయులందరూ మన సమాజ శ్రేయస్సు కోసం అవే విలువలను మనకు పదేపదే బోధిస్తున్నారు. బోధ రామాయణ కాలంలోనూ, ప్రస్తుత కాలంలోనూ ఒక్కటే. కాకపోతే దాన్ని ఆచరించే విధానంలో తేడ ఉండవచ్చు. అతిథి దేవోభవ! అన్నది ఆనాడూ ఒక్కటే,
ఈనాడూ ఒక్కటే. కాని ఆచరణా విధానం మారింది. ఈ సందర్భంగా శ్రీ మద్రా మాయణములోని అయోధ్యాకాండ 91వ సర్గలోనున్న విషయాన్ని గమనిద్దాం. అరణ్యములోనున్న సీతా రామలక్ష్మణులను కలిసి, ప్రాధేయపడి వారిని మళ్ళీ అయోధ్యకు తీసుక రావలెనన్న సంకల్పం తో భరతుడు తన తల్లులతో, మంత్రులతో, పురోహితులతో, పురప్రజ లతో, సైన్యంతో బయలు దేరుతాడు. దారిలో భరధ్వాజ మహర్షి ఆశ్రమానికి వెళతారు. ‘అతిథి దేవోభవ! అని మనసా, వాచా, కర్మణా నిరూపిస్తాడు భరధ్వాజ మహర్షి. ఆనందంగా వారికి స్వాగతం పలికి, విందు ఏర్పాటు చేస్తాడు. (పుట 243-91వ సర్గ, యోధ్యాకాండము) అది ‘అతిథి దేవోభవ! అను విలువను ఆచరణలో పెట్టిన విధానము, ఆనాటి వ్యవహారము. మనకు ఒకింత ఆశ్చర్యం కల్గుతుంది. ఒక మహర్షి ఆశ్రమంలో అతిథ్యమిచ్చే విధానమిదేనా అని ప్రశ్నిస్తాడు.
ఎందుకంటే ఈనాటి మలయాళస్వామి ఆశ్రమంలో కానీ, రమణ మహర్షి ఆశ్రమంలో గానీ, శ్రీరామకృష్ణమఠంలో గానీ మధ్య, మాంసాలతో, మగువులతో ఇవ్వబడే ఆతిధ్యాన్ని మనం ఊహించని కూడా ఊహించలేం. అంత మాత్రాన భరధ్వాజ మహర్షిని గూర్చి గానీ, శ్రీ మద్రామాణాన్ని గూర్చి గానీ చిన్న చూపు ఏర్పడవలసిన అవసరం లేదు.అది ఒక విలువను, ఒక బోధను ఆనాడు ఆచరణలో పెట్టిన ఒక విధానంగానే భావించాలి. ”సత్యం వద అను విలువను ఆనాడు హరిశ్చంద్రుడు ఆచరించిన విధంగా మనం ఈనాడు ఆచరించటం లేదు. ‘పితృదేవోభవ అన్న దాన్ని ఆనాడు శ్రీరాముడు ఆచరించినట్టుగా మనం ఈనాడు ఆచరించటంలేదు. కొన్ని విషయాల్లో మన పూర్వీకులు మన కంటే ఎంతో మెరుగ్గా, మేలుగా కనపడతారు. కొన్ని విషయాల్లో వారి కంటే మనమే మేలనిపిస్తుంది.
అందుకే మహాకవి కళాదాసు ”పురాణమిత్యేవనీ సాధు సర్వం నచాపి కావ్యం నవమిత్య వద్యం అని అంటారు. (పురాలనము అని తలచి అన్ని శాYసములను అనుస రించి ఉండవలయునుని తలంచవద్దు. ఆలాగున నవీనములని తలంచి అన్నిటినీ త్యజించవలదు). నార్ల వెంకటేశ్వర రావుగారు ”ప్రాతలోనె లేదు ప్రాశస్త్యమంతయు, క్రొత్తయెల్ల హాని కూర్చబోదు అని అంటారు. రామాయణం చదివి ఆనాటి సంస్కృతి గూర్చి తెలుసుకోవాలి, విలువలను గ్రహించి ముందుకు సాగాలి. మహాభా రతంను చదివితే ఆనాటి సంస్కృతిని గూర్చి తెలుసుకోవాలి, విలువ లను గ్రహించి ముందుకు సాగాలి. అప్పుడే అభివృద్ధిని సాధించ గలిగి మన పూర్వీకులకంటే మనం మహానీయులం కాగలిగేది. మనకు ‘ఎంత పూర్వీకులైతే అంత గొప్ప మహనీయులన్న మూఢ విశ్వాసం ఉంది. మన శ్రీరామకృష్ణ పరమహంస, వివేకానందుడు, రమణ మహర్షి, మలయాళ స్వామి, జిడ్డు కృష్ణమూర్తి ఏ పురాతన, పురాణ మహర్షికన్నా ఏమాత్రం తీసిపోరు. బహుశా అంతకంటే ఎక్కువ మహనీయులేమో వీరు. అందుకే భగవాన్ సత్యసాయి ఇలా అంటారు. ” ప్రాచీన ఋషులకు పాఠముల్ నేర్పించ జాలిన వేదాంత సారమతులు, నిర్జీవ శిలలచే నృత్యమాడించగ నేర్పుగల్గిన వాడి మగలు కలరు భారత భుమిని పెక్కండ్రు నేడు. (పుట 291-శ్రీ సత్యసాయి వచనామృతము-1996- ద్వితియ భాగం). పూర్వం చాలా మంది మహర్షులందరి విషయంలో సందేహం లేదు. కాని అంతకంటే గొప్పవారు విూలో రాబోతున్నారనేది నిజం అని దాదాపు 130 సంవత్సరాల క్రితమే చెప్పాడు వివేకానంద స్వామి. పురాణ మహర్షులనుండీ, నవీన మహనీయులనుండి మచినే గ్రహించి ఆత్మవిశ్వాసంతో ముందుకు వేద్దాం. ఆధ్యాత్మికోన్నతిని సాధిద్దాం. జై శ్రీరాం! జైసాయిరాం!
– రాచమడుగు శ్రీనివాసులు
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565