MohanPublications Print Books Online store clik Here Devullu.com

సోపాన పంచకము_SopanaPanchakamu


సోపాన పంచకము

వేదోనిత్య మధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం
తేనేశస్య విధీయతా మపచితిః కామ్యేమతి స్త్యజ్యతాం
పాపౌఘః పరిధూయతాం భవసుఖే దోషో7ను సంధీయతా
మాత్మేచ్ఛావ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతాం||

సంగస్సత్సునిధీయతాం భగవోతో భక్తి ర్దృఢాధీయతాం
శాంత్యాధాఃప చీయతాం ధృఢతరంకర్మాశు సంత్యజ్యతాం
సద్విద్వాసుపర్ప్యతా మనుదినం తత్పాదుకాసేవ్యతాం
బ్రహ్మేశాక్షంమర్థ్యతాం శృతిశిరోవాక్యం సమాకర్ణ్యతాం||

వాక్యార్థశ్చ విచార్యతాం శృతిశిరఃపక్షస్ససూశ్రియతాం
దుస్తర్కాత్సునిరమ్యతాం శృతిమత స్తర్కో7నుసంధీయతాం.
బ్రహ్మాస్మీతి విభావ్యతా మహరహర్గర్వః పరిత్యజ్యతాం
దేహే7హం యతిరుర్ఘుతాం బుధజనైః వాదస్స ముత్సృజ్యతాం||

క్షుద్వ్యాధిశ్చ చికిత్స్యతా మనుదినం భిక్షాపథం భుజ్యతాం
స్వాద్వన్నం నతుయాచనతాం విధివశాత్ప్రాప్తేన సంతుష్యతాం
ఔదాసీన్య మభీప్స్యతాం జనకృపా నైష్ఠుర్య ముత్సృజ్యతాం
శీతోష్ణాది విషహ్యతాం నతువృధావాక్యం సముచ్చార్యతాం ||

ఏకాంతే సుఖమాస్యతాం పరతరే చేతస్సమాధీయతాం
పూర్ణాత్మాసు సమీక్ష్యతాంజగదిదం తాద్బాధితందృశ్యతాం
ప్రాక్కర్మాపి విలావ్యతాం చితిబలాన్నాప్యుత్తరైశ్ల్శిష్యతాం
ప్రారబ్ధం త్విహభుజ్యతా మధ పరబ్రహ్మాత్మ నాస్థీయతాం ||

       శ్రీమద్వైతోపదేశ పంచరత్నములనే సోపాన పంచకస్తోత్రములో మొదటినుండి క్రమముగా ఒకమెట్టు తరువాత మరియొకమెట్టు ఎక్కుటకు వీలుచేసినట్టి సాధన పరంపరను చెప్పిరి. అర్థజ్ఞాన సాధనమైన శాస్త్రముతోసహ వేదమును నిత్యం చదువవలయును. ఆ వేదోక్తకర్మలను ఈశ్వరార్పణ బుద్ధ్యా చేయవలయును. ఇట్టి నిష్కామకర్మవలన జ్ఞాన ప్రతిబంధకమైన పాపములను పోగొట్టుకొనవలయును, తరువాత వైరాగ్యం కొరకే విషయసుఖములను దోషదృష్టితో విడచి పెట్టవలయును. పరమాత్మను తెలుసుకుందామనే జిజ్ఞాసను బలముగా సంపాదించవలయును. విషయములయందు విరక్తుడై, తత్వజిజ్ఞాసకలవాడై యిల్లు (భార్యా పుత్రాదులను వదలి అభిమానమును వదలి) వెళ్లి తత్వ విచారము చేయు మహాత్ములతో సహవాసం చేయవలయును.
దృఢమైన భగవద్భక్తినికూడా సంపాదించవలయును. శమదమాది సంపత్తినికూడా సంపాదించవలయును. కర్మసన్యాసం చేయవలయును. అనగా సన్యసించవలయును, వెనుకటి సామాన్య సజ్జనసాంగత్యము కాక, బ్రహ్మనిష్ఠులైన విద్వాంసులైన సద్గురువులవద్దకు వెళ్లవలయును. వారికి అనుగ్రహం కలిగేటట్లు వారి పాదసేవ చేయవలయును. వారియనుగ్రహం సంపాదించి, బ్రహ్మతత్వమును చెప్పమని యడుగవలెను. వారి వలన వేదాంత వాక్యములను మహావాక్యములను అర్థముతో వినవలయును. అసంభావనా విపరీతభావనలు పొయ్యేంతవరకు మహావాక్యార్థమైన జీవబ్రహ్మైక్యవిచారం చేయవలయును. శృతులకు విరుద్ధమైన మతము లను ఆశ్రయించకుండా శృతిసమ్మతమైన అద్వైతసిద్ధాంతమునే ఆశ్రయించవలయును.

శృతులకు విరుద్ధమైన యుక్తిరూపమగు తర్కమును వదలివేయవలయును. శృతులకు సమ్మతమైన యుక్తులనే గ్రహించవలయును. మననం చేయమని యర్థము. తరువాత, నేను బ్రహ్మస్వరూపుడనని ధ్యానం చేయవలయును. నేను జ్ఞానినికదా యని అహంకారమును వదలి వేయవలయును. దేహేంద్రియములయందు నేననే భ్రమను వదలివేయవలయును. ఇతర మతస్థులైన విద్వాంసులతో వివాదమును వదలుము. నిత్యం భిక్షాటన చేత లభించిన ఆహారముతో ఆకలిని శమింపచేసుకొనుము. అనారోగ్యం కలిగినపుడు ఔషధసేవచేసి శరీరం నిలబెట్టుకొనుము. ఔషధ సేవవలెనే భిక్షాభోజనంకూడా శరీరమును రక్షించుకొనుటకేకాని, భోగప్రధానముగా రుచియైన పదార్థములను కోరకూడదు. లాభాలాభముల యందు సమానబుద్ధితో ప్రవృత్తిలేకుండా ఊరికే ఉండవలయును. తన తత్వనిష్ఠకు ప్రతిబంధకంగా ఎవరియందును దయతోగాని, క్రోధముతో గాని కలుగచేసుకొనవద్దు. శీతోష్ణములను సుఖ దుఃఖములను సహించవలయును. వ్యర్థమైన సంభాషణలేకుండా మౌనము నవలంభించవలయును.

అట్టి మోక్షమును అభ్యసించుటకు నిర్జనప్రదేశమందు (నివసించ) ఉండవలయును. మౌనంగా నుండి పరబ్రహ్మ యందు మనస్సును నిలిపి ధ్యానం చేయవలయును. బ్రహ్మసాక్షాత్కారమును పొందవలయును. బ్రహ్మానుభూతిచేత సకలద్వైత భ్రమను నశింపచేసుకొనవలయును.

 ఆత్మజ్ఞానంవలన సంచిత కర్మరాశిని దహింపచేయుము. ఆగామిని అంటకుండా వుండుము. ఒక ప్రారబ్ధము మాత్రమే వుండునుగనుక అనుభవించుము. ఆ ప్రారబ్ధం పోయిన తరువాత పరబ్రహ్మరూపముగా నుండును. అని శ్రీశంకర భగవత్పాదులవారు యేస్థితినుండి యేయే స్థితికి వెళ్ళవలయునో యెట్లు ప్రయత్నించవలయునో, యేదిచేస్తే యేస్థితి కలుగునో విశదముగా నుపదేశించిరి.

                 
 -- శ్రీ శంకరాచార్య విరచితమగు శ్రీమద్వైతోపదేశ పంచరత్నములనే 
                              మరియొక పేరుగల సోపాన పంచకమునకు 
                         -మద్దులపల్లి మాణిక్యశాస్తిచ్రే రచింపబడిన తత్వరహస్యప్రభ నుంచి.....

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list