MohanPublications Print Books Online store clik Here Devullu.com

తీర్ధం ఎలా తీసుకోవాలి_Tirdham


తీర్ధం ఎలా తీసుకోవాలి
తీర్ధ ప్రసాధాల్లో నాలుగు రకాలు ఉంటాయి .
1.జల తీర్ధం
2.కషయ తీర్ధం
3.పంచామృత తీర్ధం
4.పానకా తీర్ధం
జల తీర్ధం
ఈ తీర్ధం ద్వార అకాల మరణం ,సర్వ రోగాలు నివారించాభాడుతాయి .అన్ని కష్ట్టలు , ఉపసమానాన్ని ఇస్తాయి .బుద్ధి ,అధర్మం వైపు పయనించకుండా అడ్డుపడుతుంది . 
కషాయ తీర్ధం
ఈ తీర్ధం కొల్లాపురంలోని శ్రీమహాలక్ష్మిదేవాలయం ,కొల్లూరు ముకాంబిక దేవాలయం ,హిమాచలప్రదేశ్ లోని జ్వాలమాలిని దేవాలయం ,అస్సాంలోని శ్రీ కామాఖ్య దేవాలయములో ఇస్తారు .రాత్రి పూజ తరువాత తీర్థనీ కషాయం రూపంలోపంచుతారు.వీటిని సేవెంచటం ద్వారా కనిపెంచే -కనిపించని రోగాలు త్వరలో నయం అవుతాయి . 
పంచామృత అభిషేక తీర్థం
పంచామృత సేవనం ద్వార చేపట్టిన అన్ని పనులు దిగ్విజయంగా పూర్తికావటం మరియు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది . 
పానకా తీర్ధం
శ్రీ మంగళగిరి నరసింహస్వామి దేవునికి ,అహోబిలం నరసింహ దేవునికి పానకం నివేధ్యంగా పెట్టడంతో పానకాల స్వామి ,పానకాల నరసింహస్వామి దేవునిగా ఖ్యాతినర్జించారు ..కారణం స్వామికి పానకాన్ని నివేధ్యంగా పెట్టి వచ్చే భక్తులకు పానకాన్ని తీర్ధంగా పంచుతారు . 
పానకా తీర్ధాన్ని సేవిస్తే....
దేహంలో ఉత్సహం ఎక్కువ అవుతుంది .కొత్త చైతన్యం వస్తుంది .
దేహంలో వుండే వేడి సమస్తితికి వచ్చే విధంగా చేస్తుంది .
రక్తపోటు ఉన్నవారికి ,తల తిరగడం ,నోరు ఎండిపోయినట్లు ఉండడం జరగదు
రుమాటిజం ,ఎముకులుకు సంభందించిన వ్యాధులు నయం అవుతాయి .
నీరసం దరిచేరదు . 
ఆకలి బాగా వేస్తుంది
దేవుని తీర్ధమైన పానకం సేవించటం ద్వార మధుమేహ వ్యాది అదుపులో ఉంటుంది .
జేవితంలో శత్రువుల బాధ ఉండదు
బుద్ది చురుకుగా పని చేస్తుంది
జ్ఞాపకశక్తి పెరుగుతుంది . 

తీర్ధం అంటే తరింపచేసేది అని అర్ధం.ఆలయానికి వెళ్ళి, దైవదర్శనం, చేసుకున్నాక, పూజారులు "అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం... పాదోదకం పావనం శుభం" అంటూ తీర్ధం ఇస్తారు. 
భగవంతుని పవిత్రమైన పాదాలను తాకిన... ఈ తీర్ధం మిమ్మల్ని అకాల మరణం రాకుండా కాపాడుతుంది.... సర్వరోగాలను నివారిస్తుంది, సమస్త పాపాలనూ ప్రక్షాళన చేస్తుంది... అని భావం. భగవంతుని దగ్గరకు వచ్చేవరకు అది ఉత్తి నీరే. కాని ఆయనను చేరాక అందులో తులసి, కర్పూరం... వంటివి చేరి తీర్ధంగా మారుతుంది. 
పవిత్రమైన ఈ ఉదకంలో కలిపే కర్పూరం, తులసి వంటివి ఆరోగ్యకారకాలు. గొంతులో ఏదైనా అడ్డుపడ్డట్టుగా ఉంటే తులసి ఆకు నమిలితే చాలు అడ్డు తొలగి శ్వాస తీసుకోవడం తేలికవుతుంది. అలాగే కర్పూరం కూడా ! పురుషులు ఉత్తరీయాన్ని, స్త్రీలు పైటచెంగును చేతికింద పెట్టుకుని భగవత్ప్రసాదంగా భావిస్తూ ఒక్క చుక్క కూడా కిందపడనివ్వకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో తీర్ధం తీసుకోవాలి. 
శ్రీ విద్యా ఉపాసకులు నాలుగు సార్లు తీసుకుంటారు. అయితే అది అందరికీ వర్తించదు.ఉపవాసం వున్న రోజు ఒక సారే తీర్ధం తీసుకోవాలట. మొదటిసారి తీసుకునే తీర్ధం శారీరిక, మానసిక శుధ్ధి కోసం, రెండవసారి తీసుకునేది న్యాయ, ధర్మ ప్రవర్తనకు, మూడవది మోక్షానికి అనే నమ్మకంతో తీసుకోవాలి. మూడు సార్లు తీసుకుంటే భోజనం చేసినంత శక్తిని భగవంతుడిస్తాడు అంటారు. 
తీర్ధంలో పంచామృతాలు, తులసి దళాలు, సుగంధ ద్రవ్యాలు, మంత్ర శక్తి వుటాయి. అందుకే తీర్ధం తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన భావంతో, ఈ తీర్ధం నాకు మంచి చేస్తుంది, నా ఆరోగ్యాన్నీ, నా ఆధ్యాత్మికతనూ మెరుగు పరుస్తుందనే సద్భావంతో తీసుకోవాలి.

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list