MohanPublications Print Books Online store clik Here Devullu.com

కావేరీ_పుష్కరాలు_Kaveri_Puskaralu


కావేరీ పుష్కరాలు

   గంగానది తర్వాత అంతటి పవిత్రమైనదిగా భావించే నది కావేరి. అందుకే కావేరిని దక్షిణ గంగ అని పిలుస్తారు. దేవగురువైన బృహస్పతి తులారాశిలో ప్రవేశించడంతో కావేరీనదికి పుష్కరాలు ప్రారంభం అవుతాయి. బృహస్పతి ఈ సెప్టెంబర్‌ 12న కన్యారాశి నుంచి తులారాశిలో కాలు పెడుతున్నాడు. 23 వరకు అక్కడే ఉంటాడు కాబట్టి ఈ 12 రోజులూ ఆ నది పుష్కర శోభను సంతరించుకుంటుంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ప్రజలు కావేరీ పుష్కరాలలో పుణ్యస్నానాలు చేసి పునీతులవుతారు. నర్మదా నదీతీరంలో తపస్సు, కురుక్షేత్రంలో దానం, కాశీక్షేత్రంలో మరణించడం వల్ల కలిగే ఫలం కేవలం పుష్కర స్నానం వల్ల కలుగుతుందని పురాణోక్తి.

ఎక్కడ పుట్టింది?
పూర్వం బ్రహ్మగిరి పర్వత ప్రాంతంలో కావేరుడనే రాజు ఉండేవాడు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో బ్రహ్మని గురించి తపస్సు చేశాడు. బ్రహ్మ ఆయన తపస్సుకు మెచ్చి, ఓ అందాల పాపను ప్రసాదించాడు. కావేరి అని పేరు పెట్టుకుని రాజు ఆ బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. యుక్తవయసు రాగానే ఆమెను అగస్త్య మహర్షికి ఇచ్చి పెళ్లి చేశాడు. వివాహ సమయంలో తనను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టకూడదని అగస్త్యుని కోరింది కావేరి. అంగీకరించాముని.

అగస్త్యుడు ఓ రోజున తన శిష్యులకు తత్త్వశాస్త్ర రహస్యాలను బోధించడం కోసం శిష్యులను దూరంగా తీసుకెళ్లి పాఠాలు చెబుతున్నాడు. భర్త తనను విడిచి వెళ్లడంతో కావేరి కోపంతో ఒక తటాకంలో దూకింది. అయితే, ఆమె బ్రహ్మవర ప్రసాదిని కావడంతో మరణించడానికి బదులు నదిగా మారిపోయి బ్రహ్మగిరి పర్వతాల మీదుగా ప్రవహిస్తూ వెళ్లింది. ఆమే కావేరీ నదిగా ప్రసిద్ధికెక్కింది.మరో కథ ఏమిటంటే, తనని విడిచి ఉండరాదన్న భార్య కోరికను మన్నించి అగస్త్యుడు ఆమెను జలరూపంలోకి మార్చి తన కమండలంలో ఉంచుకుని ఎల్లప్పుడూ తనవద్దే ఉంచుకునేవాడు. అయితే, ఒకసారి ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైన క్షామం వచ్చింది. వర్షాలు లేక జలాశయాలన్నీ ఎండిపోయాయి. పంటలు పండక ప్రజలు అల్లాడుతూ, విఘ్నేశ్వరుని ప్రార్థించారు.

వినాయకుడు ఆవు రూపంలో అగస్త్యుని వద్దకు వచ్చి, గడ్డిమేస్తున్నట్లు నటిస్తూ, కమండలాన్ని తన ముట్టెతో కింద పడేలా చేశాడు. దాంతో కావేరి కాస్తా నదీరూపాన్ని సంతరించుకుని, అక్కడినుంచి తన పుట్టినిల్లైన బ్రహ్మగిరి వరకూ ప్రవహించింది. దాంతో ఆయా ప్రదేశాలన్నీ ససస్యశ్యామలమయ్యాయి.కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో ఉన్న కొడగు జిల్లాలోని తలాకావేరి అనే ప్రదేశంలో పుట్టిన కావేరి తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలలో ప్రవహిస్తుంది. హేమవతి, పింషా, అర్కవతి, కుంబిని, భవాని, నొయ్యల్, అమరావతి నదులు కావేరికి ఉపనదులు.

తలకావేరి, కుషల్‌ నగర్, శ్రీరంగపట్టణ, భవాని, ఈరోడ్, నమ్మక్కళ్, తిరుచిరాపల్లి, కుంభకోణం, మాయావరం, పుంపుహార్‌ నగరాల గుండా ప్రవహిస్తుంది. చందనపు అడవులకు, ప్రకృతి సౌందర్యానికీ పెట్టింది పేరైన కూర్గ్‌ కావేరీనది వరప్రసాదమే. బెంగళూరు పులి టిప్పుసుల్తాన్‌ రాజధాని శ్రీరంగపట్టణం కావేరీ నది ఒడ్డునే ఉంది. తమిళనాడులోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన శ్రీరంగం, కుంభకోణం, అందాలకు నెలవైన బృందావన్‌ గార్డెన్స్‌... కావేరీనది ఒడ్డునే ఉన్నాయి.

చెన్నకేశవ స్వామి ఆలయం: 12వ శతాబ్దంలో హొయసాల రాజుల కాలానికి చెందిన ఈ ఆలయ నిర్మాణం, శిల్పచాతుర్యం అపురూపం, అనితర సాధ్యం. మూడవ నరసింహ వర్మ నిర్మించిన ఈ ఆలయం కావేరీ పుష్కరస్నాన భక్తులకు అవశ్య సందర్శనీయం. భగందేశ్వర ఆలయం: కర్ణాటకలోని భగమండలంలోగల ఈ ఆలయం భగంద మహర్షి పేరు మీదుగా నెలకొన్నది. భగమండలంలోగల త్రివేణీ సంగమంలో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదమని భక్తుల విశ్వాసం.

విశ్వేశ్వరాలయం, కర్ణాటక: 8వ శతాబ్దంలో చాళుక్యల శిల్పకళారీతిలో నిర్మించిన ఈ ఆలయం అత్యంత పురాతనమైనది. కావేరీ పుష్కరఘాట్లలో ఇది తలమానికమైనది. శ్రీరంగపట్నంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం, సోమనాథపురలోని వేణుగోపాలస్వామి ఆలయం, గంజాంలోని నిమిషాంబాలయం కూడా తప్పక చూడదగ్గవి. 
ముందుగా పుష్కర నదికి ప్రార్థన చేసి తీరంలో ఉండి మట్టిని మూడుసార్లు నీటిలో వేసి తరువాత సంకల్ప సహితంగా పుష్కర స్నానం చేయాలి. పితృదేవతలకు తర్పణం, తీర్థోపవాసం చేయాలి. మృత్తికా స్నానం, పుష్కర స్నానం చేసి ముక్కోటి దేవతలకు, మునులకు తర్పణ విడవాలి. మళ్లీ ప్రవాహానికి అభిముఖంగా స్నానం చేయాలి. దీర్ఘాయువునిచ్చే నదీపూజలు: పుష్కర యాత్రలు చేసిన వారికి, నదీ పూజలు నిర్వహించిన వారివి వ్యాధులు, పాపాలూ తొలగి, దీర్ఘాయుష్షు లభిస్తుందని పురాణగాథలు విదితం చేస్తున్నాయి.

పుష్కరం అంటే పన్నెండేళ్ల కాలం. దేవ గురువు బృహస్పతి తులారాశిలోకి ప్రవేశించినప్పుడు కావేరికి పుష్కరాలు వస్తాయి. ఈ సమయంలో నదికి ఆధి దైవిక శక్తులు వస్తాయి. ఈ çసమయంలో స్నాన, దాన, జప, అర్చన, ధ్యాన, హోమ, తర్పణాది అనుష్ఠానాలకు, పితృపిండ ప్రదానానికి అక్షయమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రోక్తి. ఈ కర్మల వలన శారీరక, మానసిక మలినాలు తొలగి పవిత్రత, ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతాయి.

ముఖ్యమైన నదులు పన్నెండు. పన్నెండేళ్ల కాలంలో ప్రతి సంవత్సరం ఒక్కో పుణ్యనదికి పుష్కరం రావడం, ఆ పుష్కరస్నానం ఆచరించి పునీతులవడానికి దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది యాత్రికులు పుష్కరస్నానం కోసం రావడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ప్రతి పుష్కరాలలో భక్తులు వసతి, రవాణా, భోజన సంబంధిత విషయాలలో అసౌకర్యానికి గురికావడం, ఎక్కువ మోతాదులో డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సి రావడమూ చూస్తూనే ఉన్నాం. అయితే ఇలాంటి ఏ విధమైన సమస్యలు లేకుండా దేశంలో ఎక్కడ పుష్కరాలు జరిగినా మేమున్నాం అని ముందుకొస్తూ యాత్రికులకు కావలసిన రవాణా, వసతి, భోజనం, సరైన గైడింగ్‌ సదుపాయాలు కల్పిస్తూ ప్రతి ఏటా వేలాదిమంది యాత్రికులను పుష్కరాలకు పంపడంలో ముందుండేది... తెలుగువారి ఆత్మీయ యాత్రా సంస్థ ‘ఆర్‌.వి.టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌’ సంస్థ.

ఈ సంవత్సరం ఆర్‌.వి. టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏ భక్తునికి ఎటువంటి అసౌకర్యం కనపడకుండా ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలలో సేవలందిస్తోంది. ప్రతి ఒక్కరూ వెళ్లి పుష్కరస్నానం ఆచరించే విధంగా ఆర్‌.వి. టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ సంస్థ కేవలం హైదరాబాద్‌ నుండి మైసూర్‌–హైదరాబాద్‌ వరకు రవాణా, లగ్జరీ వసతి, మూడు పూటలా భోజన సదుపాయాలతో కేవలం రూ. 4699కే అద్భుత ప్యాకేజీని అందిస్తోంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోగలరని మనవి.

అంతేకాకుండా కావేరి నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న మహాపుణ్యక్షేత్రాలైన అటు తమిళనాడు రాష్ట్రంలోని శ్రీరంగం, జంబుకేశ్వరం, మధురై, రామేశ్వరం, కన్యాకుమారి, తిరుచెందూరు, చిదంబరం, కుంబకోణం వంటి పుణ్యక్షేత్రాలకు, ఇటు కర్నాటక రాష్ట్రంలో శ్రీరంగపట్నం, మైసూరు, శ్రావణబెల్గోల, ధర్మస్థలం, వర్నాడు, కొక్కిసుబ్రమణ్యం, ఉడిపి, శృంగేరి, గోకర్ణం లాంటి మహా పుణ్యక్షేత్రాలు అన్ని కలిపి ప్రత్యేక తమిళనాడు యాత్రా ప్యాకేజీ... అలాగే ప్రత్యేక కర్ణాటక యాత్రా ప్యాకేజీని ఆర్‌.వి. టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ వారు అందుబాటులోకి తెస్తున్నారు. మహాపవిత్రమైన కావేరి పుష్కరాలకు వెళ్లాలనుకునేవారు తప్పనిసరిగా ఆర్‌.వి. టూర్స్‌ అండ్‌ ట్రావెల్‌ ్స వారు దిగువ ఇచ్చిన ఫోన్‌ నెంబర్లలో సంప్రదించవచ్చు.

టాగ్లు: Kaveri river, Ample, కావేరీ నది, పుష్కరాలు

No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

MOHAN PUBLICATIONS Price List

జాతకచక్రం