MohanPublications Print Books Online store clik Here Devullu.com

సహజ శ్రీ సత్య దేవ యోగా ప్రకృతి చికిత్స ఆలయం , sahaja sree satya deva yoga chikistha layam

సహజ శ్రీ సత్య దేవ యోగా ప్రకృతి చికిత్స ఆలయం 

sahaja(Annavaram)

SATYA DEVA 
NATURU CURU HOSPITAL :

మానవుడు ప్రకృతి లో అంతర్భాగము ప్రకృతి లో విపరీత పరిణామాల మూలముగా సర్వజీవ కోటి వాటి జీవన సరళిలో అనేక మార్పులకు గురి అగుచున్నవి. నేటి అధునిక జీవన విధానంలో మానవుడు అనేక శారీరిక, మానసిక ఒత్తిళ్ళకు గురి అగుచు ప్రకృతి నియమాలను ఉల్లంఘించుట వలన అనేక వ్యాధులకు అగుచున్నారు.
Nature Cure Hospital
Nature Cure Hospital
కావున అనారోగ్యముతో బాధపడే వారిని ఆరోగ్యవంతులు గాను ఆరోగ్యవంతులను సంపూర్ణ ఆరోగ్యవంతులు గాను తీర్చీదిద్దుటకు నిరౌషద చికిత్స లో “సహజ” పేరిట యెగా – ప్రకృతి చికిత్సాలయం మన రాష్ట్ర౦ లో దేవాదాయ శాఖ ఆద్వర్వములో శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం,అన్నవరం నందు శ్రీ సత్యనారాయణ స్వామి వారి జన్మదిన్నాని పురశ్కరించుకొని తేది.14.08.15 సహజ శ్రీ సత్య దేవ యెగా – ప్రకృతి చికిత్సాలయాన్ని శ్రీ జూవ్వాడి రత్నకరరావు గారు దేవాదాయ శాఖ మంత్రి వర్యులు, శ్రీ పి సుందర కుమార్ , ఐఎ యస్ కమీషనరు , దేవాదాయ శాఖ , అనువంశింక ధర్మకర్త శ్రీ ఐవి రామ్ కుమార్ , అప్పటి కార్యనిర్వహణాధికారి శ్రీ యమ్ రఘునాధ్ గారుల చే ప్రారంభించబడినది. ఇప్పటి వరకు In House Members గా 2137 మంది అవుట్ పేషెంట్లు గా 1020 మంది ట్రీట్ మెంటు తీసుకోనియున్నారు.
సిబ్బంది :-
శిక్షణ పొందినటి వంటి ప్రకృతి వైద్య నిపుణులు , యోగా ఉపాద్యాయులు మరియు శిక్షణ పొందునటువంటి ట్రీట్ మెంటు సహాయకులు సహా మిగతా సభ్యులంతా ఒక కుటుంభం వలె ఆదరించుట ఇక్కడ ప్రత్యేకత అందుకు తార్కాణంగా ఇక్కడ చికిత్స పొ౦దే వారిని పేషేంట్లుకు బదులుగా In House Members పేర్కోంటారు.
In House Members దిన చర్య :-
ఉదయం 5.౩౦ గంటల నుండి 9.00 గంటల వరకు చక్కని ఆరోగ్యాన్ని పెంపోందించే దిశగా ఆహర వివరములతొ కూడిన ఆద్యాత్మిక పర మైన జీవన సరళిని పెంపోందించే విధముగా దిన చర్యను తయారు చేసి యోగ శిక్షకులు మరియు ప్రకృతి వైద్యుల యోక్క పర్యవేక్షణలొ అమలు చేయబడుచున్నది.
అహారము :-
శాఖాహరాన్ని మాత్రమే In House Members అందివ్వడం జరుగుచున్నది. కాపీ , టీలకు ప్రత్యామ్నాయంగా యోగా రసం (ధనియాల కాఫీ) తులసి కషాయం,అల్లం కషాయం , తేనే మొదలగు వాటితో కలిపి వేడిగా అందించుట జరుగుచున్నది. ఆకు కూరలు, కూరగాయలు, సమృద్దిగా వాడుట జరుగుచున్నది , అల్పాహరము లేదా ఫలాహరము సమయములలొ వెజిటేబుల్ సూఫ్, వెజిటేబుల్ సలాడ్ , sprouts పండ్లరసములు ఖీరా మోదలగునవి. ప్రణాళికా బద్దముగా ఇచ్చుచున్నారు.
sahaja
నొటు :
శుద్ద సాత్వకము పౌష్టికమైన ఆహార పదార్ధములను వ్యక్తి గత ఆరోగ్యాన్ని పరిగణనలొనికి తీసుకోని అవసరాన్ని బట్టి ఒక్కోక్కరికి ప్రత్యేకమైన ఆహరమును ఎప్పటికప్పుడు తయారు చేసి ఇవ్వబడుచున్నది
చికిత్సావిధానము :-
అనేక వ్యాదులకు ఇక్కడ చక్కని శిక్షణ తో కూడిన చికిత్స అందించబడుచున్నది.
నడుం నొప్పి , సయాటికా , స్పాండిలైటిస్ మొదలగు వెన్నుముక సంభంధమమైన వ్యాదులు
సోరియాసిస్ ఎగ్జిమ వంటి చర్మ వ్యాదులు మరియు మానసిక సంభంధమమైన వ్యాదులు
మదు మేహం , అజీర్ణం కడుపులో మంట , గ్యాస్ సమస్య మల బద్దకము , మూల శంఖ మొదలగు జీర్ణ కోశ వ్యాదులు
ఉబ్బసము , దీర్ఘకాలిక జలుబు , సైనసైటిస్ మొదలగు కప వ్యాదులు
పక్షపాతము , అధిక రక్త పోటు , పార్స్వి నొప్పి , నిద్రలేమి మొదలగు నాడీ సంభందమైన వ్యాదులు మరియు స్థూలకాయాన్ని తగ్గించుట
ప్రకృతి చికిత్సాలయ౦లో చేయుచున్న చికిత్సలు :
మానిప్యూలేటివ్ ధెరపి (మసాజ్)
హైడ్రో దెరపి (హిఫ్ బాత్ ) స్టీమ్ బాత్, స్పైనల్ స్పేరె, పుట్ మరియు ఆమ్ బాత్ , ఇమర్షనల్ బాత్, మొదలుగునవి రోగులు యొక్క స్థితి గతులును బట్టి ఇవ్వడం జరుగును.
మడ్ దెరిపి
ఫిజియో దెరిపి
Dait దెరిపి
యోగ ధెరఫి : యోగ నందు షట్ క్రియలు , ప్రాణాయము, , ఆసనములు, ద్యానము , త్రాటకము, మొదలుగునవి రోగులకు వారి స్థితి గతులును బట్టి యోగ టీచర్లు పర్యవేక్షణలొ చేయించబడును.
Facilities :
పేషేంట్లకు వసతితొ కూడిన చికిత్స చేయించుకొనడానికి మౌలిక సదుపాయములు
స్త్రీ , పురుషులకు వేర్వేరు చికిత్సా విభాగాలు చికిత్సకు అత్యాధునిక పరికరాలు
ప్రత్యేక ద్యాన మందిరము , గ్రంధాలయం
యోగ సాధనకు ప్రత్యేకమాన్ విశాల మైన హాలు
సమతుల పాష్టిక శాఖాహరం
ఎ.సి రూ ము సదుపాయము కలదు
నియమ నిభంధనలు :-
చికిత్సాలయం నందు జాయిన్ అయ్యే ముందు ఫొన్ ద్వారా స్వయంగా వచ్చిగాని ముందుగా సమాచారం ఇవ్వవలెను
చికిత్సాలయం నందు జాయిన్ అయ్యే ముందు ఏదయిన ప్రభుత్వ గుర్తింపు కార్డు జెరాక్సు ఇవ్వవలెను.
జాయినింగ్ సమయములొ ఆరోగ్య సమస్యలకు సంబంధించి మునిపటి రిపొర్ట్సును తీసుకోని రావలెను
ప్రకృతి వైద్య శాలలో సూచించిన ఆహరముమాత్రమే తీసుకొనవలెను. బయట నుండి ఎటువంటి తిను బండారాలు అనుమతి లేకుండా హస్పటల్ లొనికి అనుమతించబడవు
ప్రస్తుతము మీరు వాడుచున్న మందులు తీసుకొనవలెను
In House Members పడుకొనే మంచము మీదకు మాత్రమే దుప్పటి ఇవ్వబడును. మిగిలినవి అన్ని సభ్యులే తెచ్చుకొనవలెను
చికిత్సాలయంలొ చేరిన తదుపరి చికిత్సాలయం నిర్వాహుకులు పర్మిషన్ లేకుండా బయటకు వెళ్ళుటకు వీలు లేదు
పీజు వివరములు
In House Members ఒక్క రోజుకు రూ. 250/- లు మాత్రమే
అవుట్ పేషేంట్లు వచ్చి ట్రీట్ మెంటు తీసుకోని వారికి వసూలు చేయు చార్జిలు
1 Full body Massage Rs. 125/-
2 Steam Bath Rs. 125/-
3 Partial Massage Rs.75/-
4 Full Mad bath Rs.100/-
5 Partial Mud bath Rs. 50/-
6 Enema Rs.50/-
7 Tub Bath Rs.100/-
8 Spinal Bath Rs.100/-
9 Yoga Class Rs. 200/-



No comments:

Post a Comment

మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565

mohan publications price list