శక్తిని కోరాలి!
ఒకసారి సాయిబాబా వద్దకు మద్రాసు దంపతులు వచ్చారు. భర్త పేరు గోవిందభావ్ఞ భార్యపేరు ఆదిలక్ష్మీ అమ్మాళ్. వారు షిరిడిలో సుమారు నెలన్నర ఉన్నారు. వారికి ఎన్నో అనుభవాలు జరిగాయి. భార్యకు సాయిబాబా రామునిగా మధ్యాహ్నం పూట దర్శనమిచ్చాడు. అదంతా భ్రమ మాత్రమే అన్నాడు భర్త. ఆ భర్తకు ఆ రాత్రి స్వప్నం వచ్చింది. ఆ స్వప్నం భయంకరంగా ఉన్నది. ఒక పోలీసు తన రెక్కలను (చేతులను) వెనుకకు విరిచి తాడుతో కట్టి, బిగించి ఒక పంజరంలో ఉంచాడు. పంజరం బయట సాయిబాబా చూస్తూ నిలబడ్డాడు. ఈ విషయాన్ని భర్త అయిన గోవిందభావ్ఞ చూచాడు. అది అప్పటి పరిస్థితి. గోవిందభావ్ఞను కట్టివేసింది తాడు కాదు. దురాశ, స్వార్థం, కుతీర్యబుద్ధి, అవహేళన చేసే తత్వం మొదలైన దుర్గుణాలు అతనిని కట్టివేశాయి. సాయి సాక్షేభూతునిగా చూస్తున్న దైవం.
దైవం ఎప్పుడూ సాక్షేభూతునిగానే ఉంచాడు. అయితే ఆ దైవాన్ని స్పందింపచేయగలగాలి భక్తుడు. ఇక్కడ పంజరంలో బంధింపబడిన గోవిందభావ్ఞ సాయిబాబాను విడుపింపుమని కోరలేదు. అందుకనే సాయిబాబా మౌనంగా ఉండిపోయాడు. గోవిందభావ్ఞ బాబా! మీ కీర్తి విని, మీపాదాల వద్దకు వస్తే, మీరు ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నా కూడా మాకీ దుస్ధితి ఎందుకు కలిగింది? అని సాయి ప్రశ్నించాడు. అంపశయ్య మీద భీష్ముడిని చూడటానికి పాండవ్ఞలు, శ్రీకృష్ణుడు వెళ్లారు. వారిని చూచి భీష్ముడు కన్నీరు కార్చాడు. ‘కన్నీరు ఎందుకు కార్చుతున్నారు? అని భీష్ముని శ్రీకృష్ణుడు అడిగాడు. ఎందుకంటే భీష్ముని కన్నీటిని చూచి మరణభయంతో కన్నీరు కారుస్తున్నాడు భీష్ముడు అనుకున్నాడు అర్జునుడు.
అది సత్యమోతాతో అర్జునునకు తెలియదు అందుకనే శ్రీకృష్ణుడు అలా అడిగాడు. భీష్ముడు ‘ఓకృష్ణా! అర్జునుని ఆలోచన యదార్ధం కాదని నీకు తెలుసు. భగవంతుడులైన నీవే, వారి పక్షాన వ్ఞండగా, పాండవ్ఞలు కష్టాలుపడ్డారు నీ తీరుతెన్నులు ఏమాత్రం అర్ధం చేసుకోలేకపోయానన్న ఆలోచన నన్ను కలచివేస్తోంది. అందుకు నేను కన్నీరు కారుస్తున్నాను అన్నాడు. కర్మయోగి, జ్ఞాని అయిన భీష్ముడే ఆ దైవం లీలలను గ్రహించలేకపోతే, సగటు మనిషి అయిన గోవిందస్వామి ఎలా తెలుసుకుంటాడు. సాయి ఎందుకు చూస్తూ ఊరుకుంటాడు. ఈ సాయం చేయకుండా? జరిగిన కష్టములు అన్నీ అనర్ధాదాయకము అని అనుకోరాదు. మోయగలిగినంత బరువ్ఞనే దైవం, ఆ సాయి మన మీద వేస్తాడు. సాయి మన కష్టంలో జోక్యం చేసుకోలేదంటే ఆ కష్టం అనుభవించలేనంతటిది అనుగ్రహించాలి. ‘దైవం కష్టాన్ని అనుభవింపచేసి, గత కర్మలను క్షాళనం చేసుకుంటూ వస్తాడు. ఆ కర్మఫలాన్ని కర్మలను క్షాళనం చేసుకుంటూ వస్తాడు. ఆ కర్మఫలాన్ని అనుభవింపగలిగే శక్తిని ఇమ్మని దైవాన్నిగని, సాయినిగని కోరాలి. ఈ జన్మలో అనుభవించవలసిన కర్మ, అనుభవించకుండా తప్పించుకుంటే, మరుజన్మలో ఆ కర్మను అనుభవించాలి.
– యం.పి.సాయినాధ్
No comments:
Post a Comment
మీ అభిప్రాయాలు తెలియచేయగలరు
(OR) mohanpublications@gmail.com
(or)9032462565